రిలయన్స్ ఇండస్ట్రీస్ ఆధ్వర్యంలోని నెట్‌వర్క్ సేవలందించే జియో ‘జియో భారత్ జే1’ పేరుతో 4జీ మొబైల్ ఫోన్‌ను ఆవిష్కరించింది. ఈ ఫీచర్ ఫోన్‌లో జియో టీవీ, జియో సినిమా, జియో పే వంటి యాప్స్ ఇన్‌స్టాల్ చేసి వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు కంపెనీ తెలిపింది.
2.8 అంగుళాల డిస్‌ప్లే కలిగిన ఈ ఫోన్ ధర రూ.1799గా నిర్ణయించినట్లు సంస్థ పేర్కొంది. దీన్ని కొనుగోలు చేసినవారికి జియో ప్రత్యేకంగా రిఛార్జ్ ప్లాన్‌ను కూడా అందిస్తుంది. రూ.123 జియో భారత్ ప్లాన్‌తో 14 జీబీ 4జీ డేటా ఇస్తుంది. ప్రస్తుతం ఇతర వినియోగదారులకు ఇదే ప్లాన్ ధర రూ.189గా ఉంది. ఈ ఫోన్ 128జీబీ వరకు ఎస్‌డీ కార్డు సపోర్ట్ చేస్తుంది. 2,500 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది.
ఇదీ చదవండి: అమెరికా చట్టంతో భారత్‌కు లాభం..!
ఫీచర్ ఫోన్ వాడే వినియోగదారులను 4జీ నెట్‌వర్క్‌తో కనెక్ట్ చేయడానికి ఈ మొబైల్ విడుదల చేసినట్లు కంపెనీ ప్రతినిధులు తెలిపారు. జియో..నెట్‌వర్క్ సేవలందిస్తున్నా మొబైళ్లను తయారు చేసి మార్కెట్‌లో విక్రయిస్తోంది. జియో రీఛార్జ్ ప్లాన్‌ను కూడా కస్లమర్లకు ఇవ్వొచ్చనే ఆలోచనతో ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నట్లు తెలిసింది. దీనివల్ల కంపెనీ రెవెన్యూ కూడా వృద్ధి చెందుతుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment