reliance 4G
-
రిఫైనింగ్ మార్జిన్లు పెరిగినా.. రిటైల్‌పై అనిశ్చితి
రిలయన్స్ ఇండస్ట్రీస్ పనితీరు ఇటీవల మందగించడానికి కారణమైన రిఫైనింగ్ మార్జిన్లు పుంజుకున్నా, రిటైల్ విభాగం తీరుతెన్నులను అంచనా వేయడం కష్టతరమేనని బ్రోకరేజి సంస్థ జేపీ మోర్గాన్ పేర్కొంది. రిటైల్ ఆదాయంపై అనిశ్చితి నెలకొన్నట్లు ఒక నివేదికలో వివరించింది. మార్కెట్లు బలహీనంగా ఉండడంతో జియో/రిటైల్ విభాగాల లిస్టింగ్‌కు మరింత సమయం పట్టే అవకాశం ఉన్నట్లు తెలిపింది.నివేదిక ప్రకారం జూన్ నుంచి గణనీయంగా పడిపోయిన రిఫైనింగ్ మార్జిన్లు క్రమంగా మెరుగుపడ్డాయి. అయితే, రిటైల్ రంగం మందగమనంతో పాటు కంపెనీ పునర్వ్యవస్థీకరణ ప్రభావాలు ఉండటంతో రిలయన్స్ రిటైల్‌కి సంబంధించి సమీప భవిష్యత్తు అంచనాలను వేయలేని పరిస్థితి నెలకొందని నివేదిక వివరించింది. జులై 8 నాటి గరిష్ట స్థాయి నుంచి రిలయన్స్ షేరు 22 శాతం క్షీణించిన నేపథ్యంలో ఇది ప్రాధాన్యం సంతరించుకుంది. మిగతా వాటితో పోలిస్తే రిలయన్స్ ఆకర్షణీయమైన ధరలో లభిస్తోందనే అభిప్రాయాలు నెలకొన్నాయి.ఇదీ చదవండి: ఆర్బీఐ గవర్నర్‌కు ఛాతీ నొప్పిరిలయన్స్లో ప్రధానంగా మూడు వ్యాపార విభాగాలు ఉన్నాయి. మొదటిది ఆయిల్ రిఫైనింగ్.. పెట్రోకెమికల్, రెండోది టెలికం విభాగం జియో, మూడోది రిటైల్ సెగ్మెంట్. వీటితో పాటు మీడియా, న్యూఎనర్జీ వ్యాపారాలూ ఉన్నాయి. ప్రస్తుతం రిలయన్స్ ఆదాయంలో సుమారు 50 శాతం వాటా రిటైల్, టెలికం విభాగాలదే కావడం విశేషం. -
రూ.11తో 10 జీబీ డేటా!
రిలయన్స్ జియో వినియోగదారులకు కొత్తగా బూస్టర్ ప్లాన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఎక్కువగా డేటా వాడుకునే కస్టమర్లకు ఈ ప్లాన్ ఎంతో ఉపయోగమని కంపెనీ తెలిపింది. ఈమేరకు ప్లాన్ వివరాలు వెల్లడించింది.కేవలం రూ.11తో 10 జీబీ 4జీ డేటా వాడుకోవచ్చు.ఈ ఆఫర్ వ్యాలిడిటీ కేవలం ఒక గంట మాత్రమే ఉంటుంది.రీఛార్జ్ చేసుకున్న గంట తర్వాత డేటా స్పీడ్ 64 కేబీపీఎస్‌కు తగ్గిపోతుంది.ఈ ఆఫర్ కేవలం ఇంటర్నెట్ సర్వీసుకే పరిమతం. వాయిస్ కాల్స్, ఎస్ఎంఎస్ సర్వీసులను ఇది అందించదు.నిర్ణీత సమయంపాటు హైస్పీడ్ డేటా అవసరమయ్యేవారికి ఈ ఆఫర్ ఎంతో ఉపయోగమని కంపెనీ తెలిపింది.లార్జ్ ఫైల్స్ లేదా సాఫ్ట్వేర్ అప్డేట్లు, డౌన్లోడ్ చేయాలనుకొనేవారికి ఈ ప్లాన్ ప్రయోజనకరంగా ఉంటుందని చెప్పింది.ఇదీ చదవండి: సీపీఐ నుంచి ఆహార ద్రవ్యోల్బణం మినహాయింపు? -
రూ.1,799కే 4జీ ఫోన్!
రిలయన్స్ ఇండస్ట్రీస్ ఆధ్వర్యంలోని నెట్వర్క్ సేవలందించే జియో ‘జియో భారత్ జే1’ పేరుతో 4జీ మొబైల్ ఫోన్‌ను ఆవిష్కరించింది. ఈ ఫీచర్ ఫోన్లో జియో టీవీ, జియో సినిమా, జియో పే వంటి యాప్స్ ఇన్స్టాల్ చేసి వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు కంపెనీ తెలిపింది.2.8 అంగుళాల డిస్ప్లే కలిగిన ఈ ఫోన్ ధర రూ.1799గా నిర్ణయించినట్లు సంస్థ పేర్కొంది. దీన్ని కొనుగోలు చేసినవారికి జియో ప్రత్యేకంగా రిఛార్జ్ ప్లాన్‌ను కూడా అందిస్తుంది. రూ.123 జియో భారత్ ప్లాన్‌తో 14 జీబీ 4జీ డేటా ఇస్తుంది. ప్రస్తుతం ఇతర వినియోగదారులకు ఇదే ప్లాన్ ధర రూ.189గా ఉంది. ఈ ఫోన్ 128జీబీ వరకు ఎస్డీ కార్డు సపోర్ట్ చేస్తుంది. 2,500 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది.ఇదీ చదవండి: అమెరికా చట్టంతో భారత్‌కు లాభం..!ఫీచర్ ఫోన్ వాడే వినియోగదారులను 4జీ నెట్‌వర్క్‌తో కనెక్ట్ చేయడానికి ఈ మొబైల్ విడుదల చేసినట్లు కంపెనీ ప్రతినిధులు తెలిపారు. జియో..నెట్వర్క్ సేవలందిస్తున్నా మొబైళ్లను తయారు చేసి మార్కెట్లో విక్రయిస్తోంది. జియో రీఛార్జ్ ప్లాన్‌ను కూడా కస్లమర్లకు ఇవ్వొచ్చనే ఆలోచనతో ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నట్లు తెలిసింది. దీనివల్ల కంపెనీ రెవెన్యూ కూడా వృద్ధి చెందుతుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. -
దేశవ్యాప్తంగా వేతనంతో కూడిన సెలవు.. అంబానీ కీలక ప్రకటన
అయోధ్యలో జనవరి 22వ తేదీన బాల రాముడికి ప్రాణ ప్రతిష్ఠ జరగబోతుంది. ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వం సగం రోజు సెలవు ప్రకటించిన సంగతి తెలిసిందే. మోదీ నిర్ణయానికి మద్ధతుగా ప్రతిష్టాత్మక రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ అదే బాటలో నిర్ణయం తీసుకున్నారు. జనవరి 22వ తేదీన రిలయన్స్ ఇండస్ట్రీ ఉద్యోగులకు సెలవు ప్రకటించారు. రిలయన్స్ ఆధ్వర్యంలోని అన్ని కంపెనీల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు వేతనంతో కూడిన సెలవుదినం ప్రకటించారు. జనవరి 22వ తేదీ సోమవారం మధ్యాహ్నం అభిజిత్ ముహూర్తంలో అయోధ్యలో బాలరాముడికి ప్రాణ ప్రతిష్ఠ జరగబోతుంది. ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం కావాలనే ఉద్దేశంతో దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రిలయన్స్ ఇండస్ట్రీ ఆఫీసులు, కంపెనీలు, ఫ్యాక్టరీలకు సెలవు ప్రకటించినట్లు అంబానీ వెల్లడించారు. ఇదీ చదవండి: రిలయన్స్ లాభం 17,265 కోట్లు దీంతో జనవరి 22వ తేదీన తెలంగాణ, ఏపీ వ్యాప్తంగా ఉన్న ట్రెండ్స్ షోరూంలు, ఇతర రిలయన్స్ ఇండస్ట్రీ ఆఫీసులకు వేతనంతో కూడిన సెలవుదినంగా ప్రకటించారు. ముఖేష్ అంబానీ సోమవారం అయోధ్యలో జరిగే కార్యక్రమంలో ఫ్యామిలీతోపాటు హాజరుకానున్నట్లు తెలిసింది. -
రిలయన్స్‌కు 1.67 లక్షల మంది ఉద్యోగుల రాజీనామా.. కారణం అదే
ప్రముఖ డైవర్సిఫైడ్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు చెందిన రిటైల్, టెలికం విభాగాలకు భారీ ఎత్తున ఉద్యోగాలు రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. 2022-23 ఆర్ధిక సంవత్సరంలో జియోకి 41 వేల మంది, రిలయన్స్ రీటైల్లో లక్ష కంటే ఎక్కువ మంది ఉద్యోగులు రిజైన్ చేసిట్లు సమాచారం. రిలయన్స్ వార్షిక నివేదిక ప్రకారం.. సంస్థలో అట్రిషన్ రేటు 64.8 శాతం పెరిగింది. ఇటీవల కాలంలో రిలయన్స్ కంపెనీ ఇతర రీటైల్ స్టార్టప్‌లను కొనుగోలు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఉద్యోగుల సర్ధుబాటు, అదే సమయంలో పెరిగిపోతున్న నియమకాలను అందిపుచ్చుకునేందుకు ఉద్యోగులు సంస్థను వదిలి వెళ్లినట్లు పలు నివేదికలు చెబుతున్నాయి. మొత్తంగా, ఆర్ధిక సంవత్సరం 2023లో 167,391 మంది ఉద్యోగులు రిలయన్స్ నుంచి వైదొలిగారు. ఇందులో రిటైల్, జియో విభాగాలు ఉన్నాయి. సంస్థకు రాజీనామా చేసిన వారిలో ఎక్కువ మంది జూనియర్లు, మిడ్ మేనేజ్మెంట్ స్థాయి ఉద్యోగులు ఉన్నట్లు రియలన్స్ ప్రతినిధులు తెలిపారు. అంతకు మించి.. కొత్త నియామకాలు ఉద్యోగులు సంస్థకు రాజీనామా చేస్తున్నప్పటికీ రిలయన్స్ ఆర్ధిక సంవత్సరం 2023లో 262,558 మంది ఉద్యోగులను నియమించుకుంది. కొత్త ఉద్యోగుల్నితీసుకునే పనిలో పడినట్లు వెలుగులోకి వచ్చిన నివేదికలు హైలెట్ చేస్తున్నాయి. అందరి చూపు ఆగస్ట్ 28 వైపే కాగా, ఆగస్ట్ 28న మధ్యాహ్నం 2 గంటలకు రిలయన్స్ ఇండస్ట్రీస్ తన 46వ వార్షిక సమావేశాన్ని నిర్వహించనుంది. ఈ సమావేశానికి సంబంధించి ఇప్పటికే ఎక్స్ఛేంజీలకు సమాచారం ఇచ్చింది. ఇక ఈ ఈవెంట్ సందర్భంగా, రిలయన్స్ ఛైర్మన్ ముఖేష్ అంబానీ, జియో ఫైనాన్షియల్ సర్వీసెస్, రాబోయే జియోఫోన్ 5జీ, కస్టమర్-ఫోకస్డ్ జియో 5G ప్లాన్లు, వివిధ అంశాలపై ముఖ్యమైన అప్డేట్లను ప్రకటించాలని భావిస్తున్నారు. ఇదీ చదవండి : టమాట ధరలు.. సామాన్యులకు భారీ ఊరట?! -
దేశంలో డేటా విప్లవం, 6ఏళ్లు పూర్తి చేసుకున్న జియో
న్యూఢిల్లీ: దేశంలో మొబైల్ ఇంటర్నెట్ విప్లవానికి తెరతీసిన రిలయన్స్ జియో సోమవారంతో (5వ తేదీ) ఆరేళ్లు పూర్తి చేసుకుంటోంది. జియో రాక ముందు సగటున ఒక మొబైల్ కస్టమర్ ఒక నెలలో 154 ఎంబీ డేటాను మాత్రమే ఉపయోగించగా, ఇప్పుడు అది నెలకు 15.8 జీబీ స్థాయికి చేరుకుంది. డేటా వినియోగం వంద రెట్లు పెరగడంలో జియో పాత్ర కీలకమని చెప్పుకోవాలి. అంతేకాదు, గతంలో ఒక జీబీ డేటాకు రూ.200కు పైన ఖర్చు చేయాల్సి వచ్చేంది. ఇప్పుడు రూ.7–15కే జీబీ డేటా వస్తోంది. ఇక వచ్చే దీపావళి నుంచి 5జీ సేవల ప్రారంభానికి జియో సన్నద్ధమవుతోంది. 2023 చివరికి దేశవ్యాప్తంగా 5జీ సేవలను అందుబాటులోకి తీసుకొస్తామని రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ ప్రకటించారు. 4జీతో పోలిస్తే 5జీ సేవల వేగం ఎంతో ఎక్కువ. దీంతో 5జీ తర్వాత మూడేళ్ల కాలంలో డేటా వినియోగం రెండు రెట్లు పెరుగుతుందని విశ్లేషకుల అంచనా. డేటా ఆధారిత కొత్త పరిశ్రమలు, టెక్నాలజీ రాకతో వినియోగం పెరుగుతుందని భావిస్తున్నారు. 41.30 కోట్ల కస్టమర్లతో టెలికం మార్కెట్లో జియో వాటా 36 శాతంగా ఉంది. -
రిలయన్స్‌కు 4జీ లెసైన్స్ వివాదం..
తీర్పును రిజర్వ్ చేసిన సుప్రీం న్యూఢిల్లీ: ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ లిమిటెడ్ (ఆర్జేఐఎల్)కు 4జీ లెసైన్స్ ఇవ్వడాన్ని సవాలుచేస్తూ... దాఖలైన ఒక ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం (పీఐఎల్)పై తీర్పును సుప్రీంకోర్టు రిజర్వ్ చేసుకుంది. ఇందులో ఎన్నో లొసుగులు ఉన్నాయని సీపీఐఎల్ అనే ఒక ప్రభుత్వేతర స్వచ్చంధ సంస్థ(ఎన్జీఓ) ఈ వ్యాజ్యం దాఖలు చేసింది. అయితే ఈ ఆరోపణల్లో నిజం లేదని సుప్రీంకోర్టుకు కేంద్రం వివరించింది. ఈ కేసు విచారణ సందర్భంగా మంగళవారం చీఫ్ జస్టిస్ టీఎస్ ఠాకూర్ నేతృత్వంలోని బెంచ్ అటు కేంద్రానికి, ఇటు ఎన్జీఓలకు స్పెక్ట్రమ్ వినియోగ చార్జీ, మైగ్రేషన్ విధానాలపై పలు ప్రశ్నలు సంధించింది. వాదనల తీరిది...: ఎన్జీఓ తరఫున సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ తన వాదనలు వినిపించారు. బ్రాడ్‌బ్యాండ్ వైర్లెస్ వ్యవస్థకు స్పెక్ట్రమ్... డేటాకు సంబంధించినదేతప్ప, వాయిస్ కాలింగ్‌కు కాదన్న కాగ్ ముసాయిదా నివేదిక ఆధారంగా పిల్‌ను దాఖలు చేసినట్లు ఆయన కోర్టుకు తెలిపారు. స్పెక్ట్రమ్ యూసేజ్ చార్జీగా రిలయన్స్ కేవలం 1% చెల్లిస్తే... మిగిలిన కంపెనీలు అత్యధికంగా 5% వరకూ చెల్లించిన విషయాన్ని ఆయన ఉన్నత న్యాయస్థానం దృష్టికి తీసుకువచ్చారు. 20 మెగాహెట్జ్ స్పెక్ట్రమ్‌కు బిడ్ దాఖలు చేసిన ఇన్ఫోటెల్ను ‘బినామీ’ కంపెనీగా పేర్కొన్న న్యాయవాది, బిడ్‌ను (రూ.12,000 కోట్లు) గెలుచుకున్న కొద్ది గంటల్లోనే కంపెనీని రిలయన్స్ గ్రూప్ కొనుగోలు చేసిందని గుర్తు చేశారు. అయితే రిలయన్స్ తరఫున వాదనలు వినిపించిన సీనియర్ అడ్వకేట్ హరీష్ సాల్వే, కాగ్ నివేదిక సరికాదని అన్నారు. స్పెక్ట్రమ్‌కు సంబంధించి ఒక సమగ్ర మైగ్రేషన్ విధానం ఉందని సొలిసిటర్ జనరల్ రంజిత్ కుమార్ పేర్కొన్నారు. -
27న ఆర్‌జియో 4జీ సేవల ఆవిష్కరణ
► ముందుగా రిలయన్స్ గ్రూప్ ఉద్యోగులకే సర్వీసులు ► వ్యవస్థాపకుడు ధీరూభాయ్ జయంతి సందర్భంగా కానుక న్యూఢిల్లీ: టెలికం సంస్థ రిలయన్స్ జియో (ఆర్‌జియో) ఈ నెల 27న తమ 4జీ సేవలను ఆవిష్కరించనుంది. ఆ రోజున వ్యవస్థాపకుడు ధీరుభాయ్ అంబానీ జయంతి సందర్భంగా ముందుగా గ్రూప్ ఉద్యోగుల కోసం వీటిని ప్రారంభించనున్నట్లు రిలయన్స్ ఇండస్ట్రీస్ సీఎండీ ముకేశ్ అంబానీ, ఆయన సతీమణి నీతా అంబానీ తెలిపారు. జయంతి వేడుకలకు సంబంధించి సిబ్బందికి పంపిన ఆహ్వాన పత్రంలో వారు ఈ విషయాలు పేర్కొన్నారు. డిసెంబర్ 27న జరిగే కార్యక్రమంలో బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్, సంగీత దర్శకుడు ఏఆర్ రెహ్మాన్ తదితరులు పాల్గొంటారని తెలిపారు. ‘దేశవ్యాప్తంగా వెయ్యి పైగా ప్రాంతాల్లో ఈ కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం ఉంటుంది. రిలయన్స్ కుటుంబంలోని ప్రతీ ఒక్కరు వ్యక్తిగతంగా లేదా జియో టెలికం సర్వీసుల ద్వారా వర్చువల్‌గానైనా ఇందులో పాల్గొనాలని కోరుకుంటున్నాం’ అని వారు పేర్కొన్నారు. వాస్తవానికి ఈ నెల 28న వాణిజ్యపరంగా 4జీ సర్వీసులు ప్రారంభం కాగలవన్న అంచనాలు ఉన్నాయి. ఏ తరహా టెక్నాలజీనైనా వినియోగించుకుని టెలికం సర్వీసులు అందించగలిగేంతగా ఆర్‌జియో వద్ద వివిధ బ్యాండ్‌విడ్త్‌లలో ఏకంగా 751.1 మెగాహెట్జ్ స్పెక్ట్రం ఉంది. -
కుప్పంలో నేడు రిలయన్స్ 4జీ షురూ
హైదరాబాద్: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు చిత్తూరు జిల్లా, కుప్పం ప్రజలకు రిలయన్స్ జియో 4జీ సేవల్ని అందుబాటులోకి తేనున్నారు. ఇందులో భాగంగా నేడు 4జీ నెట్వర్క్ టవర్స్‌ను కుప్పంలో మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభించనున్నారు.