రూ.11తో 10 జీబీ డేటా! | Jio offers Rs 11 data booster provides 10GB of high speed 4G data | Sakshi
Sakshi News home page

Jio: రూ.11తో 10 జీబీ డేటా!

Published Thu, Nov 14 2024 2:27 PM | Last Updated on Thu, Nov 14 2024 2:40 PM

Jio offers Rs 11 data booster provides 10GB of high speed 4G data

రిలయన్స్‌ జియో వినియోగదారులకు కొత్తగా బూస్టర్‌ ప్లాన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఎక్కువగా డేటా వాడుకునే కస్టమర్లకు ఈ ప్లాన్‌ ఎంతో ఉపయోగమని కంపెనీ తెలిపింది. ఈమేరకు ప్లాన్‌ వివరాలు వెల్లడించింది.

  • కేవలం రూ.11తో 10 జీబీ 4జీ డేటా వాడుకోవచ్చు.

  • ఈ ఆఫర్‌ వ్యాలిడిటీ కేవలం ఒక గంట మాత్రమే ఉంటుంది.

  • రీఛార్జ్‌ చేసుకున్న గంట తర్వాత డేటా స్పీడ్‌ 64 కేబీపీఎస్‌కు తగ్గిపోతుంది.

  • ఈ ఆఫర్‌ కేవలం ఇంటర్‌నెట్‌ సర్వీసుకే పరిమతం. వాయిస్‌ కాల్స్‌, ఎస్‌ఎంఎస్‌ సర్వీసులను ఇది అందించదు.

  • నిర్ణీత సమయంపాటు హైస్పీడ్‌ డేటా అవసరమయ్యేవారికి ఈ ఆఫర్‌ ఎంతో ఉపయోగమని కంపెనీ తెలిపింది.

  • లార్జ్‌ ఫైల్స్‌ లేదా సాఫ్ట్‌వేర్‌ అప్‌డేట్లు, డౌన్‌లోడ్‌ చేయాలనుకొనేవారికి ఈ ప్లాన్‌ ప్రయోజనకరంగా ఉంటుందని చెప్పింది.

ఇదీ చదవండి: సీపీఐ నుంచి ఆహార ద్రవ్యోల్బణం మినహాయింపు?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement