Jio 4G
-
రూ.11తో 10 జీబీ డేటా!
రిలయన్స్ జియో వినియోగదారులకు కొత్తగా బూస్టర్ ప్లాన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఎక్కువగా డేటా వాడుకునే కస్టమర్లకు ఈ ప్లాన్ ఎంతో ఉపయోగమని కంపెనీ తెలిపింది. ఈమేరకు ప్లాన్ వివరాలు వెల్లడించింది.కేవలం రూ.11తో 10 జీబీ 4జీ డేటా వాడుకోవచ్చు.ఈ ఆఫర్ వ్యాలిడిటీ కేవలం ఒక గంట మాత్రమే ఉంటుంది.రీఛార్జ్ చేసుకున్న గంట తర్వాత డేటా స్పీడ్ 64 కేబీపీఎస్‌కు తగ్గిపోతుంది.ఈ ఆఫర్ కేవలం ఇంటర్నెట్ సర్వీసుకే పరిమతం. వాయిస్ కాల్స్, ఎస్ఎంఎస్ సర్వీసులను ఇది అందించదు.నిర్ణీత సమయంపాటు హైస్పీడ్ డేటా అవసరమయ్యేవారికి ఈ ఆఫర్ ఎంతో ఉపయోగమని కంపెనీ తెలిపింది.లార్జ్ ఫైల్స్ లేదా సాఫ్ట్వేర్ అప్డేట్లు, డౌన్లోడ్ చేయాలనుకొనేవారికి ఈ ప్లాన్ ప్రయోజనకరంగా ఉంటుందని చెప్పింది.ఇదీ చదవండి: సీపీఐ నుంచి ఆహార ద్రవ్యోల్బణం మినహాయింపు? -
పెద్ద ఎత్తున మార్పులు రాబోతున్నాయ్: సీఎం జగన్
సాక్షి, తాడేపల్లి: రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాలకు 4జీ సేవలు, ఒకేసారి 100 జియో టవర్లను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రారంభించారు. క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్‌గా ప్రారంభించారు. దీని ద్వారా 209 మారుమూల గ్రామాలకు సేవలు అందనున్నాయి. అల్లూరి సీతారామరాజు జిల్లాలో 85 టవర్లు, పార్వతీపురం మన్యం జిల్లాలో 10 టవర్లు, అన్నమయ్య జిల్లాలో 3 టవర్లు, వైయస్సార్ జిల్లాలో 2 టవర్లను సీఎం ప్రారంభించారు. టవర్లను ఏర్పాటు చేసిన రిలయన్స్ జియో సంస్థ.. భవిష్యత్తులో 5జీ సేవలను అప్‌గ్రేడ్ చేయనుంది. కొత్తగా ప్రారంభించిన సెల్టవర్ల వల్ల మారుమూల ప్రాంతాలనుంచి ఆయా జిల్లాలకు చెందిన ప్రజాప్రతినిధులు, కలెక్టర్లు, ప్రజలు నేరుగా ముఖ్యమంత్రితో వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. ఆయా ప్రాంతాల్లోని గిరిజనులతో సీఎం జగన్ ఇంటరాక్ట్ అయ్యారు. ఈ ప్రాజెక్టు కింద కొత్తగా 2,704 ప్రాంతాల్లో టవర్ల ఏర్పాటు చేయనున్నారు. దీనికోసం ఇప్పటికే 2,363 చోట్ల స్థలాలు ప్రభుత్వం అప్పగించింది. టవర్లతో మరింత మెరుగ్గా సేవలు టవర్ల ఏర్పాటు కారణంగా ఏపీలో మారుమూల ప్రాంతాల్లో మరింతగా మెరుగుపడనున్నాయి ప్రభుత్వ సేవలు. ఆయా గ్రామాల్లోని గ్రామ సచివాలయాలు, ఆర్బీకేలు, విలేజ్ క్లినిక్స్, ప్రభుత్వ పాఠశాలలు అన్నింటికీ మరింత కనెక్టివిటీ, మెరుగైన నాణ్యతతో సేవలు అందుతాయి. అలాగే విద్యార్థులకు ఇ– లెర్నింగ్ అందనుంది. మరింత మెరుగ్గా అందనున్నాయి ఆరోగ్య సేవలు. ఆర్థికంగానూ ఆయా ప్రాంతాలకు మరింత లబ్ధి చేకూరనుంది. మారుమూల ప్రాంతాలకు.. రాష్ట్రంలో సెల్ సర్వీసులు లేని 5,459 ఆవాసాలకు సేవలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోంది. మొబైల్, ఇంటర్నెట్ సర్వీసులు ద్వారా మారుమూల ప్రాంతాల్లో ఉన్న ప్రజలకూ వారి ముంగిటకే సేవలు అందించడానికి చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా యూనివర్సిల్ సర్వీస్ ఆబ్లిగేషన్ ఫండ్ (యూఎస్ఓఎఫ్) ద్వారా సెల్టవర్ల ఏర్పాటు కార్యక్రమాన్ని చేపట్టిన ప్రభుత్వం. ప్రస్తుతం ఏర్పాటు చేసిన సెల్ టవర్ల పరిధిలో 150 ఎంబీపీఎస్ డౌన్లోడ్, 50 ఎంబీపీఎస్ అప్లోడ్ చేసుకునేందుకు ఇప్పుడు అవకాశం ఏర్పడుతుంది. కేంద్ర ప్రభుత్వంలోని సంబంధిత శాఖలతో మాట్లాడుకుని.. మార్గదర్శకాలను సులభతరం చేసుకుని.. సెల్టవర్ల ఏర్పాటు కార్యక్రమాన్ని వేగవంతం చేసుకుంది ఏపీ ప్రభుత్వం. ► ఇక అవరసమైన మౌలిక సదుపాయాలను యుద్ధప్రాతిపదికన ఏర్పాటు చేసింది ప్రభుత్వం. డిసెంబర్ నాటికి అన్ని ప్రాంతాల్లో టవర్లు ఏర్పాటునకు ప్రభుత్వం కార్యాచరణ రూపొందించింది. పెద్ద ఎత్తున మార్పులు రాబోతున్నాయ్: సీఎం జగన్ టవర్లను ప్రారంభించిన అనంతరం సీఎం జగన్ మాట్లాడుతూ.. ‘‘అందరికీ అభినందనలు. కేంద్ర ప్రభుత్వ టెలీకమ్యూనికేషన్స్ విభాగానికి, జియోకు, ఎయిర్టెల్, బీఎస్ఎన్ఎల్ అందిరికీ ధన్యవాదాలు. డిసెంబరు నాటికి రాష్ట్రంలో సెల్ సర్వీసులు లేని ఆవాసాలకు ఇంటర్నెట్ కనెక్టివిటీతో పాటు పెద్ద ఎత్తున మార్పులు రానున్నాయి. దీంతో అన్ని సచివాలయాలు, ఆర్బీకేలు, విలేజ్ క్లినిక్స్, స్కూళ్లకూ ఇంటర్నెట్ కనెక్షన్ లభిస్తుంది. రేషన్ పంపిణీ, ఇ–క్రాప్ బుకింగ్ కూడా సులభమవుతుంది. మనం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలును అత్యంత పారదర్శకంగా, లంచాలకు, వివక్షకు తావులేకుండా అక్కచెల్లెమ్మలకు అందించగలుగుతాం. అదే విధంగా వీడియోకాన్ఫరెన్స్ ద్వారా హాజరైన ప్రజాప్రతినిధులకు, అక్కచెల్లెమ్మలకు, అన్నదమ్ములు అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈ టవర్స్ ఏర్పాటు వల్ల మీ అందరికీ ఇంకా మంచి జరగాలని కోరుకుంటున్నాను. ఇంకా మంచి చేసే పరిస్థితులు రావాలని మనసారా కోరుకుంటున్నా అని తెలిపారు సీఎం జగన్. చదవండి: పోలవరం అడవిలో అరుదైన జాతికి చెందిన బంగారు బల్లి -
ఆన్లైన్లో చక్కర్లు కొడుతున్న జియోబుక్ ల్యాప్‌టాప్ ఫీచర్స్ ఇవే!
భారత్ టెలికాం రంగంలో తక్కువ ధరకే ఇంటర్నెట్ అందించి రిలయన్స్ జియో రికార్డు సృష్టించిన సంగతి మనకు తెలిసిందే. అలాగే, కొద్దిరోజుల క్రితం దీపావళి పండుగా సందర్భంగా 4జీ మొబైల్ మార్కెట్లోకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజాగా మరో కొత్త ప్రోడక్ట్ ను ఎలక్ట్రానిక్ మార్కెట్లోకి తీసుకొనిరాబోతుంది. జియో త్వరలో తక్కువ ధరకే ‘జియోబుక్’ పేరుతో ల్యాప్‌టాప్‌లు కూడా తీసుకొస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం దానికి సంబందించిన పనులు కీలక దశకు చేరుకున్నాయని తెలుస్తుంది. మీడియాటెక్ ఎమ్టీ8788 ప్రాసెసర్ ద్వారా నడిచే "జియోబుక్" ల్యాప్‌టాప్ ఈ మధ్య గీక్ బెంచ్‌లో కనిపించింది. ఈ ల్యాప్ టాప్ 2జీబీ ర్యామ్, ఆండ్రాయిడ్ 11 మీద పనిచేయనున్నట్లు చెబుతున్నారు. ఇంతకు ముందు ల్యాప్‌టాప్ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్(బీఐఎస్) సర్టిఫికేషన్ పోర్టల్‌లో కనిపించింది. రిలయన్స్ జియో మరో ల్యాప్‌టాప్ క్వాల్కామ్ స్నాప్ డ్రాగన్ 665 ప్రాసెసర్, స్నాప్ డ్రాగన్ ఎక్స్12 4జీ మోడెం చేత పని చేయనున్నట్లు తెలుస్తుంది. గీక్ బెంచ్‌లో జియోబుక్ సింగిల్ కోర్ స్కోరు 1,178, మల్టీ కోర్ స్కోరు 4,246 సాధించింది. ఈ ల్యాప్‌టాప్ స్పెసిఫికేషన్స్ చూస్తే ప్రధానంగా పాఠశాల విధ్యార్ధులను దృష్టిలో పెట్టుకొని తీసుకొస్తున్నట్లు కనిపిస్తుంది. జియోబుక్ స్పెసిఫికేషన్స్ స్పెసిఫికేషన్ల పరంగా.. జియోబుక్ 1,366x768 పిక్సెల్స్ రిజల్యూషన్ స్నాప్‌డ్రాగన్ ఎక్స్12 4జీ ఎల్టీఈ మోడెమ్ డిస్ప్లేని కలిగి ఉంది. ల్యాప్‌టాప్ తయారీ ఖర్చు తగ్గించడం కోసం ఇందులో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 665 ప్రాసెసర్ తీసుకొనిరానున్నారు. ఇది 11 నానో మీటర్ టెక్నాలజీతో పని చేస్తుంది. ఒక మోడల్లో 2జీబీ ఎల్పిడిడిఆర్ 4ఎక్స్ ర్యామ్ తో పాటు 32జీబీ ఇఎంఎంసి స్టోరేజ్ ఉంది. మరో మోడల్లో 4జీబీ ఎల్పిడిడిఆర్ 4ఎక్స్ ర్యామ్, 64జీబీ ఇఎంఎంసి 5.1 స్టోరేజ్ ఉన్నాయి. ఇందులో వీడియోల కోసం మినీ హెచ్డీఎంఐ, 5గిగా హెడ్జ్ వైఫై సపోర్ట్, బ్లూటూత్, 3 యాక్సిస్ యాక్సెలెరోమీటర్, క్వాల్‌కోమ్ ఆడియో చిప్‌లను వినియోగించనున్నారు. జియో ల్యాప్‌టాప్‌లను కూడా తక్కువ ధరలోనే తీసుకొస్తుందని టెక్ నిపుణులు పేర్కొంటున్నారు. -
మూడు రూపాయలకే వన్ జీబీ డేటా.. ఎక్కడో తెలుసా?
Cheapest Mobile Data Countries:దేశవ్యాప్తంగా ఇంటర్నెట్ యూసేజ్ బాగా పెరిగిపోయింది. అందరి చేతుల్లో స్మార్ట్ఫోన్లు ప్రత్యక్షమవుతున్నాయి. గంటల తరబడి వాటికే అతుక్కుపోతున్నారు. అయితే ఒక గిగాబైట్ (జీబీ) డేటా ఉపయోగించినందుకు ఇండియన్లు చేస్తున్న ఖర్చు ఎంత ? అతి తక్కువ ధరకే డేటాను అందిస్తున్న దేశాలు ఏవీ ? అనే అంశాలపై 221 రీజియన్లలో 6,148 మొబైల్ డేటా ప్లాన్లు పరిశీలించి తేల్చిన వివరాలు ఇలా ఉన్నాయి. డేటా విప్లవం మార్కెట్లోకి జియో నెట్వర్క్ రాకముందు దేశంలో నెట్ వినియోగం ఖరీదైన వ్యవహరంగానే ఉండేంది. దాదాపు సర్వీస్ ప్రొవైడర్లు అందరూ 1 జీబీ డేటాకు రూ. 200లకు పైగానే ఛార్జ్ చేశారు. అయితే 2016లో జియో వచ్చాక పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. అతి తక్కువ ధరకే అపరిమితమైన డేటా అందుబాటులోకి వచ్చింది. దీంతో దేశంలో ఒక్కసారిగా సోషల్ మీడియా విస్త్రృతమైంది. వీడియో కంటెంట్ వాడకం పెరిగి పోయింది. జియో ఎఫెక్ట్‌తో దాదాపు అన్ని నెట్‌వర్క్‌లు డేటా ప్లాన్స్‌ని తగ్గించాయి. మరోవైపు జియో క్రమంగా తన ప్లాన్ల రేట్లు పెంచుతూ పోయింది. ఇండియాలో రూ.50 ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న వివిద నెట్‌వర్క్‌లు అందిస్తున్న ప్లాన్లను పరిగణలోకి తీసుకుంటే సగటున ఒక జీబీ డేటాను వినియోగించేందుకు రూ. 50 ఖర్చు పెడుతున్నారు భారతీయులు, ఇదే సమయంలో పొరుగున్న ఉన్న శ్రీలంక రూ. 28, బంగ్లాదేశ్ రూ.25వరకు ఖర్చు వస్తోంది. ఇండియాలో పోల్చితే శ్రీలంక, బంగ్లాదేశలలోనే డేటా ప్లాన్లు తక్కువ ధరకు అందుబాటులో ఉన్నాయి. ఇజ్రాయిల్ నెంబర్ వన్ మరో ఆసియా దేశమైన ఇజ్రాయిల్‌లో ఇంటర్నెట్ డేటా రేట్లు అతి తక్కువ ధరకే లభిస్తున్నాయి,. ఇజ్రాయిల్ ప్రజలు వన్ జీబీ డేటా కోసం రీఛార్జ్‌పై చేస్తున్న ఖర్చు కేవలం రూ.3 మాత్రమే.ప్రపంచంలో అతి తక్కువ ధరకే డేటా సర్వీసులు అందిస్తున్న దేశంతా ఇజ్రాయిల్ రికార్డ్ సృష్టించింది. ఆ తర్వాత కిర్కిజిస్తాన్ రూ. 13, ఫిజీ రూ. 18, ఇటలీ రూ, 20. సుడాన్ రూ, 20, రష్యా రూ. 21, మోల్డోవా దీవీ రూ. 23, చీలీలో రూ. 29 వంతున ఒక జీబీ డేటాపై ఛార్జ్ చేస్తున్నారు. తక్కువ ఛార్జీలు వసులూ చేస్తున్న ఇంటర్నెట్ డేటా అందిస్తోన్న టాప్ టెన్ దేశాల్లో అత్యధిక జనాభా ఉన్న చైనా, భారత్‌లతో పాటు టెక్నాలజీలో ఎప్పుడూ ముందుండే అమెరికాలకు స్థానం దక్కలేదు. అత్యంత పేద దేశమైన సుడాన్ అగ్ర రాజ్యాలకంటే తక్కువ ధరకే నెట్ అందిస్తోంది. సుడాన్లో టెలికాం కంపెనీలు 1 జీబీ డేటాకు సగటున రూ.20 వసూలు చేస్తున్నాయి. -
ప్రపంచంలో 'అత్యంత చౌకైన స్మార్ట్ ఫోన్' లాంచ్ చేసిన జియో
ప్రముఖ టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో మరో సంచలనం సృష్టించింది. ప్రపంచంలో 'అత్యంత చవకైన స్మార్ట్ ఫోన్' జియోఫోన్ నెక్ట్స్ ను ముఖేష్ అంబానీ ఆవిష్కరించారు. గూగుల్ భాగస్వామ్యంతో ఈ కొత్త ఫోన్ ను అభివృద్ధి చేసినట్లు రిలయన్స్ 44వ వార్షిక సమావేశంలో ముఖేష్ అంబానీ తెలిపారు. గత ఏడాది గూగుల్ జియోలో రూ.33,737 కోట్ల పెట్టుబడి పెట్టిన సంగతి తెలిసిందే. దీంతో ప్రపంచ టెక్ దిగ్గజానికి జియోలో 7.7 శాతం వాటా లభించినట్లు రిలయన్స్ జియో ప్రకటించింది. ప్రపంచ అత్యంత చవకైన స్మార్ట్ ఫోన్ జియోఫోన్ నెక్ట్స్ ను సెప్టెంబర్ 10 గణేష్ చతుర్థి రోజున మార్కెట్లోకి తీసుకొనిరానున్నట్లు సంస్థ పేర్కొంది. జియోఫోన్ నెక్ట్స్ ఫోన్ గూగుల్ ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సహాయంతో పనిచేస్తుంది. దీనిలో వాయిస్ అసిస్టెంట్, ఆగ్యుమెంటెడ్ రియాలిటీ పనిచేయనున్న కెమెరా, లాంగ్వేజ్ ట్రాన్స్ లేషన్ వంటి మరెన్నో ఫీచర్స్ తో వచ్చింది. దీనిని మొదట భారతదేశంలో ప్రారంభించనున్నారు. తర్వాత ప్రపంచ మార్కెట్లోకి విడుదల చేయనున్నారు. దీని ధర ఎంత అనేది సంస్థ ఇంకా బయటికి ప్రకటించలేదు. చాలా మంది మార్కెట్ నిపుణులు ఈ మొబైల్ రూ.5,000 లోపు తీసుకువచ్చే అవకాశం ఉన్నట్లు భావిస్తున్నారు. రిలయన్స్ జియోకు దేశంలో 425 మిలియన్లకు పైగా చందాదారులు ఉన్నారు. భారతదేశంలో డేటా వినియోగంలో కంపెనీ 45% వృద్ధిని నమోదు చేసింది. త్వరలో 200 మిలియన్ల కొత్త వినియోగదారులు చెరనున్నట్లు రిలయన్స్ జియో భావిస్తుంది. దేశంలో ఇప్పటికీ 30 కోట్ల మంది 2జీ ఫోన్ నే వాడుతున్నారు. వారిని ప్రధానంగా దృష్టిలో పెట్టుకొని ఈ ఫోన్ తీసుకొచ్చినట్లు జియో తెలిపింది. చదవండి: ఎలక్ట్రిక్ వాహన విప్లవం రాబోతుంది: భవిష్ అగర్వాల్ -
త్వరలో జియో బడ్జెట్ 4జీ స్మార్ట్ ఫోన్స్
జియో ఈ నెలలో చవకైన 4జీ స్మార్ట్ ఫోన్ లాంచ్ చేయనుందని వార్తలు వస్తున్నాయి. తన 4జీ ఫీచర్ ఫోన్ వినియోగదారులను స్మార్ట్ఫోన్లకు తరలించే ప్రయత్నంలో భాగంగా రిలయన్స్ జియో చైనా ఫోన్ తయారీ సంస్థ వివోతో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు తెలుస్తుంది. ఈ ఫోన్ వివో వై-సిరీస్‌లో రానుందని ధర రూ.8 వేల రేంజ్లో ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. డిస్కౌంట్లు, ఒటిటి సబ్ స్క్రిప్షన్, వన్-టైమ్ స్క్రీన్ రీప్లేస్ మెంట్ వంటి ఆఫర్లతో జియో త్వరలో 'ఎక్స్‌క్లూజివ్' స్మార్ట్ఫోన్లను విడుదల చేయడానికి జియో యోచిస్తుంది. దీనికి సంబందించిన అధికారిక సమాచారం లేనప్పటికీ, ఒక నివేదిక ప్రకారం జియో వీటిని తీసుకురావడానికి రెడీ అవుతున్నట్లు సమాచారం. ఈ ఫోన్ లో కేవలం రిలయన్స్ జియో సిమ్ కార్డు మాత్రమే పనిచేసే విధంగా రూపకల్పన చేస్తుంది.(చదవండి: గెలాక్సీ నోట్ ఫోన్లకు శాంసంగ్ స్వస్తి) రిలయన్స్ జియో వివోతో పాటు కార్బన్, లావా మరియు ఇతర చైనా బ్రాండ్లతో చర్చలు జరుపుతున్నట్లు తెలిసింది. వివో ఈ మధ్యే వివో వై1ఎస్ స్మార్ట్ ఫోన్ లాంచ్ చేసింది. ఈ ఫోన్ ధరను మనదేశంలో రూ.7,990గా నిర్ణయించారు. అలాగే జియో టెక్ దిగ్గజం గూగుల్‌తో పొత్తు పెట్టుకుని తక్కువ ధర గల 4జీ ఫోన్లను వచ్చే ఏడాది తీసుకురావాలని జియో యోచిస్తోంది. రిలయన్స్ జియో 3000 నుంచి 4000 మధ్య తక్కువ ధర గల స్మార్ట్ఫోన్లను తయారు చేయడానికి ఇంతక ముందు ఐటెల్ కంపెనీతో కలిసి పనిచేసింది. జియో ప్రధాన ప్రత్యర్థి అయిన భారతి ఎయిర్టెల్ కూడా స్మార్ట్ ఫోన్లను లాంచ్ చేసే ప్రయత్నాల్లో భాగంగా లావా, కార్బన్‌తో సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. ఎయిర్ టెల్ ఈ విషయాన్ని అధికారికంగానే ప్రకటించింది. -
జైల్లో జియో సిగ్నల్స్ నిరోధించలేకపోతున్నాం..
న్యూఢిల్లీ : తమ వద్ద ఉన్న సాంకేతికతో తీహార్ జైలు లోపల మొబైల్ సిగ్నల్స్‌ను నిరోధించలేకపోతున్నామని అధికారులు ఢిల్లీ హైకోర్టుకు తెలిపారు. ముఖ్యంగా జియో 4జీ సిగ్నల్స్‌ను నిరోధించడం సాధ్యం కావడం లేదని.. ఇందుకోసం ఇందుకోసం ప్రత్యేకంగా ప్రోటోటైప్ జామర్‌ను అభివృద్ధి చేయాల్సిందిగా సీ-డాట్‌ను కోరినట్టు కోర్టుకు వివరించారు. వివరాల్లోకి వెళితే.. తీహార్ జైల్లో అక్రమాలు జరుగుతున్నాయంటూ ఆరోపిస్తూ జీవిత ఖైదు అనుభవిస్తున్న ఓ దోషి 2018లో ఢిల్లీ హైకోర్టుకు లేఖ రాశారు. ‘జైలు అధికారులు డబ్బులు తీసుకుని అక్రమాలకు పాల్పడుతున్నారు. ఖైదీలకు డ్రగ్స్ సరఫరా చేయడమే కాకుండా మొబైల్ ఫోన్స్, ఇతర నిషేధిత వస్తువులు అందజేస్తున్నారు. జైల్లో ఖైదీలను జంతువుల మాదిరిగా చూస్తున్నారు’ అని ఆ వ్యక్తి ఆరోపించారు. దీనిపై స్పందించిన ఢిల్లీ హైకోర్టు అందులో నిజానిజాలు తేల్చాల్సిందిగా ఓ జడ్జిని నియమించింది. జైల్లో పరిస్థితుల మీద విచారణ జరిపి నివేదిక సమర్పించాల్సిందిగా కోరింది. దీంతో విచారణ జరిపిన జడ్జి.. 2019 ఏప్రిల్‌లో తన రిపోర్ట్‌ను కోర్టుకు అందజేశారు. లేఖలో ఆరోపించిన విధంగానే జైలు లోపల నిషేధిత వస్తువులు ఉన్నాయని తెలిపారు. జైలు అధికారులు డబ్బులు తీసుకుని ఖైదీలకు పలు సౌకర్యాలు కల్పిస్తున్నారని పేర్కొన్నారు. తాజాగా ఈ కేసుకు సంబంధించి మంగళవారం ఢిల్లీ హైకోర్టు విచారణ జరిగింది. ఈ సందర్భంగా ఢిలీ ప్రభుత్వం తరఫున వాదనలు రాహుల్ మెహ్రా వాదనలు వినిపించారు. జైల్లో అక్రమాలకు పాల్పడిన అధికారులను సస్పెండ్ చేశామని.. అలాగే శాఖ పరమైన విచారణకు కూడా ఆదేశించామని రాహుల్ కోర్టుకు తెలిపారు. అలాగే జైలు లోపల 5 వేల సీసీటీవీ కెమెరాలు, 50 బాడీ కెమెరాలు ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు. జైలులోకి ప్రవేశించేవారిని పూర్తి స్థాయిలో పరీక్షించడానికి బాడీ స్కానర్లను కూడా ఏర్పాటు చేయబోతున్నామని కోర్టు దృష్టికి తీసుకోచ్చారు. అయితే ఈ చర్యలపై స్పందించిన న్యాయస్థానం.. కేవలం ఖైదీలను పర్యవేక్షించడానికే మాత్రమే కాకుండా అధికారుల రూమ్‌ల్లో కూడా ఈ రకమైన చర్యలు చేపట్టాలని సూచించింది. దీనిపై రాహుల్ స్పందింస్తూ కోర్టు సూచనల మేరకు నడుచుకుంటామని చెప్పారు. అలాగే ఈసీఐఎల్ అందజేసిన జామర్ల ద్వారా మొబైల్ సిగ్నల్స్‌ను నిరోధించడానికి ప్రయత్నించినట్టు రాహుల్ కోర్టుకు తెలిపారు. అయితే వాటి ద్వారా ముఖ్యంగా జియో 4జీ సిగ్నల్‌ను బ్లాక్ చేయలేకపోయామని అన్నారు. జైలు లోపల మొబైల్ ఫోన్ల అక్రమ వినియోగాన్ని అరికట్టడానికి అవసరమైన సాంకేతిక పరిజ్ఞానం కోసం అన్వేషిస్తున్నట్టు చెప్పారు. జైలు పరిసరాల్లో మొబైల్ సిగ్నల్స్‌ను నిరోధించేలా ప్రత్యేక ప్రోటోటైప్ జామర్‌ను తయారు చేయాలని సీడాట్‌ను కోరినట్టు కోర్టుకు వివరించారు. అనంతరం కోర్టు ఈ కేసు విచారణను ఏప్రిల్ 28కి వాయిదా వేసింది. -
జియో ఫోన్లు బంద్..జియో కొత్తఎత్తుగడ
సాక్షి, ముంబై: ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ జియో మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఉచిత ఆఫర్లు, ఉచిత డేటా ఆఫర్లతో ప్రత్యర్థి కంపెనీలకు గుబులు పుట్టించిన జియో ఇపుడు తన గేమ్‌ప్లాన్‌ను మార్చింది. ముఖ్యంగా జియో ఫీచర్‌ఫోన్‌లో ఫేస్బుక్, వాట్సాప్‌లాంటి సోషల్‌మీడియా సైట్ల సపోర్టు లేకపోవడంతో తాజాగా ఆండ్రాయిడ్ ఫోన్లను ఉచితంగా అందించనుందని సమాచారం. అన్ని సోషల్ మీడియా యాప్‌ల మద్దతుతో ఈ ఉచిత ఆండ్రాయిడ్ ఫోన్లను అందుబాటులోకి తీసుకురానుందట. ముఖ్యంగా టెలికాం మార్కెట్లో ప్రధాన పోటీదారులైన ఎయిర్ టెల్, వొడాఫోన్లకు షాకిచ్చేలా జియో పావులు కదుపుతోంది. ఈ నేపథ్యంలో జియో ఫీచర్ ఫోన్ ఉత్పత్తిని నిలిపివేసి ఆండ్రాయిడ్ ఫోన్ల తయారీపై దృష్టి కేంద్రీకరించిందనీ ఒక నివేదిక వెల్లడించింది. అంతేకాదు ఫేస్బుక్, గూగుల్‌లాంటి సంస్థలతో ఇప్పటికే సంప్రదింపులు కూడా చేపట్టినట్టు నివేదించింది. మరోవైపు ఆండ్రాయిడ్ ఫోన్ అంచనాలను జియో ప్రతినిధి తిరస్కరించలేదు..కానీ, త్వరలోనే జియో ఫోన్ బుకింగ్ తేదీని ప్రకటించనున్నట్లు చెప్పారు. 'ఇండియా కా స్మార్ట్‌ఫోన్ ద్వారా డిజిటల్ ఇండియాకు తాము కట్టుబడి ఉన్నామన్నారు. జియో ఫోన్ బుక్ చేసుకున్న 60లక్షల భారతీయులను స్వాగతించిన ఆయన త్వరలోనే జియోఫోన్ తదుపరి బుకింగ్ తేదీని త్వరలోనే ప్రకటించనున్నట్లు ప్రతినిధి తెలిపారు. -
జియో షాక్: పెరగనున్న మొబైల్ టారిఫ్‌లు
సాక్షి,కోల్‌కతా: రిలయన్స్ జియో రాకతో కారు చౌకగా మారిన మొబైల్ టారిఫ్‌లు మళ్లీ అదే జియో దెబ్బకు భారీగా పెరగనున్నాయి. ఈ నెల 19 నుంచి 4జీ టారిఫ్ ప్లాన్లను 15 నుంచి 20 శాతం మేర జియో పెంచడంతో ఇదే అదనుగా ఎయిర్టెల్, వొడాఫోన్, ఐడియా సెల్యులార్లూ ఇదే బాట పట్టనున్నాయి. గత కొద్ది నెలలుగా జియో టారిఫ్‌లకు అనుగుణంగా తమ మొబైల్ చార్జీలను తగ్గించిన మొబైల్ ఆపరేటర్లు ఇప్పుడు కస్టమర్లపై పెనుభారం మోపేలా టారిఫ్‌లను సవరిస్తారని భావిస్తున్నారు. టెలికాం రంగం టారిఫ్ సంక్షోభం నుంచి బయటపడేందుకు ధరల పెంపు సానుకూల అంశమని, ప్రస్తుతం ఆపరేటర్లందరూ టారిఫ్‌ల పెంపుపై దృష్టిసారిస్తాయని స్విస్ బ్రోకరేజ్ సంస్థ యూబీఎస్ అంచనా వేసింది. మొబైల్ టారిఫ్‌లను తిరగరాస్తూ రిలయన్స్ జియో ఆరంభంలో కస్టమర్లకు ఉచిత డేటా, వాయిస్ కాల్స్‌ను ఆఫర్ చేయడంతో పోటీని తట్టుకునేందుకు ఇతర మొబైల్ ఆపరేటర్లూ టారిఫ్‌లను గణనీయంగా తగ్గించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు జియో క్రమంగా మొబైల్ టారిఫ్‌లను పెంచుతుండటంతో ఎయిర్టెల్, వొడాఫోన్ వంటి ఇతర ఆపరేటర్లూ తిరిగి కాల్ చార్జీలను పెంచేపనిలో పడ్డారు. ఇవి మొబైల్ కంపెనీలకు ఊరట కలిగించే పరిణామాలే అయినా సగటు కస్టమర్‌కు మాత్రం మొబైల్ టారిఫ్‌లు గుదిబండ కానున్నాయి. మరోవైపు జియో తన రూ 149 4 జీబీ ప్యాక్‌కు అందించే డేటాను రెట్టింపు చేయడం వ్యూహాత్మక నిర్ణయమని స్విస్ బ్రోకరేజ్ సంస్థ యూబీఎస్ పేర్కొంది. లోయర్ ఎండ్ కస్టమర్లను కాపాడుకుంటూనే హైఎండ్పై టారిఫ్‌ల పెంపుతో లాభాలు దండుకోవాలని జియో భావిస్తోంది. జియో మరికొన్ని ప్లాన్లపైనా నొప్పి తెలియకుండా కస్టమర్లకు వాతలు పెట్టింది. రూ 399 ప్లాన్‌లో వాలిడిటీని 84 రోజుల నుంచి 70 రోజులకు తగ్గించింది. 84 రోజుల బెనిఫిట్స్‌ను పొందాలంటే రూ 459 ప్లాన్‌ను ఎంచుకోవాలని నూతన ప్లాన్‌ను ముందుకు తెచ్చింది. -
జియో కస్టమర్లకు మరో గుడ్ న్యూస్!
రిలయన్స్ జియో ఉచిత సేవలనుభవిస్తున్న కస్టమర్లకు శుభవార్త. డిసెంబర్ 3తో ముగియనుందనే ఉచిత 4జీ డేటా, వాయిస్ కాల్స్ ఆఫర్, మరో మూడు నెలలు పాటు పొడిగించే అవకాశాలున్నట్టు రిపోర్టులు వెల్లడిస్తున్నాయి. పరిస్థితుల డిమాండ్ బట్టి ఉచిత సేవలను విస్తరించే అవకాశముందని పేర్కొంటున్నాయి. తాజా రిపోర్టు ప్రకారం ఉచిత డేటా, వాయిస్ కాల్స్ సర్వీసులను మార్చి 2017 వరకు విస్తరించనున్నామని విశ్లేషకులకు రిలయన్స్ జియో తెలియజేసినట్టు సమాచారం. ట్రాయ్ నిబంధనల మేరకు, ఏ టెలికాం ఆపరేటర్ కూడా వెల్కమ్ ఆఫర్ కింద ఉచిత సేవలను 90 రోజుల కంటే ఎక్కువ రోజులు అందించడానికి వీలులేదు. దీంతో ట్రాయ్ నిబంధనల మేరకు ఈ సేవల కటాఫ్ తేదీని డిసెంబర్ 3గా కంపెనీ నిర్ణయించింది. కానీ వినియోగదారులకు ఇచ్చిన వాగ్దానం మేరకు సేవలందించలేని పక్షంలో, కస్టమర్ల నుంచి చార్జీలను వసూలు చేయడం కూడా న్యాయవిరుద్ధమని కంపెనీ ఓ మేరకు ఉచిత సేవలు కటాఫ్ తేదీని పెంచే ఆలోచనలు ఉన్నట్టు సిగ్నల్స్ ఇచ్చింది. ఇంటర్కనెక్షన్ సమస్యలతో కస్టమర్లు నాణ్యమైన సేవలు అందుకోలేకపోతున్నారని, తాము అందింద్దామనుకున్న సేవలను కస్టమర్లు సరిగా వినియోగించుకోలేకపోతున్నారని రిలయన్స్ జియో స్ట్రాటజీ అండ్ ప్లానింగ్ అధినేత అన్షుమాన్ థాకూర్ తెలిపారు. డిసెంబర్ తర్వాత ఉచిత సేవలు కొనసాగించడానికి ట్రాయ్ నుంచి తమకు అనుమతి అవసరం లేదని కూడా థాకూర్ వ్యాఖ్యానించారు. జియో సేవలు లాంచ్ చేసినప్పటి నుంచి ఎలాంటి ఆంక్షలు లేకుండా వివిధ రకాల ప్రమోషనల్ ఆఫర్లను రిలయన్స్ ఇండస్ట్రీస్ మేనేజ్మెంట్ అందిస్తుందని సిటీ రీసెర్చ్ రిపోర్టుచేసింది. సబ్స్క్రైబర్లను ఆకట్టుకోవడానికి ఉచిత వెల్కమ్ ఆఫర్‌ను మార్చి 2017వరకు కొనసాగిస్తారని మోతీలాల్ ఓస్వాల్ విశ్లేషకులు చెప్పారు. ఇంటర్కనెక్షన్ పాయింట్లో మెరుగుదల కనిపించని పక్షంలో, నాణ్యత మెరుగుపరిచే వరకు కస్టమర్లు ఎలాంటి చార్జీలను చెల్లించాల్సినవసరం ఉండదు. ఇది ట్రాయ్ నిబంధనలకు, రిలయన్స్ జియోలకు మధ్య కొంత సంఘర్షణకు దారితీసే అవకాశాలున్నట్టు తెలుస్తోంది. వెల్కమ్ ఆఫర్ పేరును మార్చి, ఉచిత డేటా, కాల్స్‌ను కస్టమర్లకు కొనసాగించడానికి జియో సన్నాహాలు చేస్తున్నట్టు రిపోర్టులు వెల్లడిస్తున్నాయి.