
సాక్షి, ముంబై: ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ జియో మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఉచిత ఆఫర్లు, ఉచిత డేటా ఆఫర్లతో ప్రత్యర్థి కంపెనీలకు గుబులు పుట్టించిన జియో ఇపుడు తన గేమ్‌ప్లాన్‌ను మార్చింది. ముఖ్యంగా జియో ఫీచర్‌ఫోన్‌లో ఫేస్‌బుక్, వాట్సాప్‌లాంటి సోషల్‌మీడియా సైట్ల సపోర్టు లేకపోవడంతో తాజాగా ఆండ్రాయిడ్ ఫోన్లను ఉచితంగా అందించనుందని సమాచారం. అన్ని సోషల్ మీడియా యాప్‌ల మద్దతుతో ఈ ఉచిత ఆండ్రాయిడ్ ఫోన్లను అందుబాటులోకి తీసుకురానుందట.
ముఖ్యంగా టెలికాం మార్కెట్‌లో ప్రధాన పోటీదారులైన ఎయిర్ టెల్, వొడాఫోన్‌లకు షాకిచ్చేలా జియో పావులు కదుపుతోంది. ఈ నేపథ్యంలో జియో ఫీచర్ ఫోన్ ఉత్పత్తిని నిలిపివేసి ఆండ్రాయిడ్ ఫోన్ల తయారీపై దృష్టి కేంద్రీకరించిందనీ ఒక నివేదిక వెల్లడించింది. అంతేకాదు ఫేస్‌బుక్, గూగుల్‌లాంటి సంస్థలతో ఇప్పటికే సంప్రదింపులు కూడా చేపట్టినట్టు నివేదించింది.
మరోవైపు ఆండ్రాయిడ్ ఫోన్ అంచనాలను జియో ప్రతినిధి తిరస్కరించలేదు..కానీ, త్వరలోనే జియో ఫోన్ బుకింగ్ తేదీని ప్రకటించనున్నట్లు చెప్పారు. 'ఇండియా కా స్మార్ట్‌ఫోన్ ద్వారా డిజిటల్ ఇండియాకు తాము కట్టుబడి ఉన్నామన్నారు. జియో ఫోన్ బుక్ చేసుకున్న 60లక్షల భారతీయులను స్వాగతించిన ఆయన త్వరలోనే జియోఫోన్ తదుపరి బుకింగ్ తేదీని త్వరలోనే ప్రకటించనున్నట్లు ప్రతినిధి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment