feature phone
-
‘స్మార్ట్’ ఉన్నా ఫీచర్ ఫోన్లు ఎందుకు?
టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ స్మార్ట్ ఫోన్లకు భారీగా డిమాండ్ ఏర్పడుతుంది. చాలా కంపెనీలు మొబైల్ ఫీచర్లలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను పరిచయం చేస్తున్నాయి. దాంతో మొబైల్ ఫోన్లను మరింత స్మార్ట్‌గా మార్చాలని విభిన్న ప్రయోగాలు చేపడుతున్నాయి. మరోపక్క ప్రపంచవ్యాప్తంగా ఫీచర్ ఫోన్లకు ఆదరణ మాత్రం తగ్గడంలేదు. అయితే వివిధ కారణాలతో చాలామంది ఇంకా ఫీచర్ ఫోన్లవైపే మొగ్గు చూపుతున్నారు. అందుకుగల కారణాలను నిపుణులు విశ్లేషిస్తున్నారు.ప్రాథమిక కమ్యునికేషన్ కోసం ఈ ఫీచర్ ఫోన్లను ఎక్కువగా వాడుతున్నారు.స్మార్ట్ఫోన్లతో పోలిస్తే బ్యాటరీ లైఫ్ అధికంగా ఉంటుంది.కేవలం కాల్స్, టెక్ట్స్ మెసేజ్‌లు చేయడానికి వీలుగా దీన్ని అధికంగా వాడుతున్నారు.కొన్ని ఆఫీసుల్లో వివిధ కారణాల వల్ల స్మార్ట్ఫోన్లను అనుమతించడం లేదు. దాంతో చాలామంది ఉద్యోగులు తప్పక ఈ ఫీచర్ ఫోన్‌ను కొనుగోలు చేస్తున్నారు.స్మార్ట్‌ఫోన్ ఉన్నా కూడా నిత్యం దూర ప్రయాణాలు చేసేవారు బ్యాకప్ కోసం దీన్ని వినియోగిస్తున్నారు.ఫోన్లకు సంబంధించి సింప్లిసిటీని ఇష్టపడేవారు వీటిని కొనుగోలు చేస్తున్నారు.ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నవారు తక్కువ ఖర్చుతో కూడిన ఈ ఫీచర్ ఫోన్లను తీసుకుంటున్నారు. ఒకవేళ పిల్లలు ఫోన్ కావాలని మారాం చేసి తీసుకుని కిందపడేసినా పెద్దగా నష్టం ఉండదు.వృద్ధులు, కంటి చూపు సరిగా లేనివారు ఈ ఫీచర్ ఫోన్లను సులువుగా వినియోగించవచ్చు.ఆర్థిక స్థోమత సరిగాలేని వారు ఈ ఫీచర్ ఫోన్లను ఎంచుకుంటున్నారు.ప్రపంచవ్యాప్తంగా ఈ ఫీచర్ ఫోన్ మార్కెట్ 2018-2030 మధ్య కాలంలో ఏటా 3.5 శాతం చొప్పున వృద్ధి చెందుతుందని పలు నివేదికలు చెబుతున్నాయి. భారత్‌లో 2023 రెండో త్రైమాసికం లెక్కల ప్రకారం అంతకుముందు ఏడాది అదే త్రైమాసికంతో పోలిస్తే తొమ్మిది శాతం ఈ ఫోన్ల అమ్మకాలు పెరిగాయి.ఇదీ చదవండి: ఐదు కంపెనీల ప్రాపర్టీలు వేలంఇటీవల రిలయన్స్ జియో కంపెనీ 4జీ నెట్వర్క్ సదుపాయం కలిగిన ఫీచర్ ఫోన్లను విడుదల చేసింది. ఇటీవల ఢిల్లీలో ప్రారంభమైన ఇండియన్ మొబైల్ కాంగ్రెస్(ఐఎంసీ) 2024 సమావేశంలో భాగంగా ఈ ఫోన్లను లాంచ్ చేస్తున్నట్లు ప్రకటించింది. వీటి ధర రూ.1,099గా నిర్ణయించారు. అయితే రిటైలరనుబట్టి ఈ ధరలో మార్పులుంటాయని గమనించాలి. -
అభిమానులకు గుడ్‌న్యూస్: రూ. 999లకే జియోభారత్ ఫోన్ 4జీ సేల్
JioBharat 4G ప్రముఖ టెలికాం కంపెనీ రిలయన్స్ జియో ఇటీవల లాంచ్ చేసిన JioBharat 4G ఫోన్ అమెజాన్‌లో కొనుగోలుకు అందు బాటులో ఉంది. రూ.999 వద్ద కొనుగోలు చేయవచ్చు. ముఖ్యంగా ఇప్పటికీ 2G ఫోన్లను ఉపయోగిస్తున్న వారికి సరసమైన ధరలో, ఇంటర్నెట్ సేవలు అందించే లక్ష్యంతో జియోభారత్ 4G ఫోన్‌ను పరిచయం చేసిన సంగతి తెలిసిందే. మొత్తం 23 భాషలకు మద్దతు ఇస్తుందని విడుదల సందర్బంగా జియో ప్రకటించింది. కార్బన్‌తో కలిసి తీసుకొచ్చిన ఈ ఫోన్లో 1000mAh బ్యాటరీ , మైక్రో SD కార్డ్ వంటి ఫీచర్లతోపాటు స్విఫ్ట్ 4G ఇంటర్నెట్ కనెక్ట్ సామర్థ్యంతో వచ్చింది. JioBharat 4G ఫీచర్లు 1.77-అంగుళాల TFT డిస్ప్లే 3.5mm హెడ్‌ఫోన్ జాక్ 0.3MP కెమెరా విత్ LED ఫ్లాష్ 1000mAh బ్యాటరీ ఎక్స్టర్నల్ మైక్రో SD కార్డ్ సపోర్ట్ ద్వారా వినియోగదారులు 128GB వరకు స్టోరేజీని విస్తరించుకోవచ్చు. "భారత్" , వెనుక కార్బన్ లోగోను డ్యూయల్ బ్రాండింగ్‌తో వస్తుంది. (టాలీవుడ్ మన్మధుడి కళ్లు చెదిరే నెట్‌వర్త్, కార్లు, ఇల్లు ఈ విషయాలు తెలుసా?) రూ. 123 ప్లాన్ అంతేకాదు ఈఫోన్ లాంచింగ్ సందర్బంగా స్పెషల్‌గా రూ. 123 ప్లాన్లను ప్రవేశపెట్టింది. ఈ ప్లాన్ 28 రోజుల వాలిడిటీ. అపరిమిత వాయిస్ కాల్లు, 14 GB డేటా అందిస్తుంది. డియో స్ట్రీమింగ్‌ను ప్రారంభించే Jio యాప్‌లకు యాక్సెస్‌ని అందిస్తుంది. అయితే, భవిష్యత్తులో ఇతర రిటైల్ అవుట్లెట్లలో ఈ ఫోన్ అందుబాటులో ఉంటుందా లేదా అనే విషయాన్ని కంపెనీ ఇంకా వెల్లడించలేదు. (ప్రజ్ఞానంద తల్లిదండ్రులకు ఆనంద్ మహీంద్ర అదిరిపోయే గిఫ్ట్) -
దూసుకెళ్తున్న ఫీచర్ ఫోన్ యూజర్లు.. 37 వేల ఫీచర్ ఫోన్లలో యూపీఐ సేవలు!
న్యూఢిల్లీ: ఇంటర్నెట్ లేనప్పటికీ యూపీఐ123పే సర్వీస్ ద్వారా ఫీచర్ ఫోన్ వాడకందార్లు డిజిటల్ చెల్లింపులు చేయవచ్చు. భారత్‌లో 2022 మార్చి 8 నుంచి ఈ సేవలు అందుబాటులోకి వచ్చాయి. యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) సేవలను వినియోగించేందుకు 37 వేలకుపైగా ఫీచర్ ఫోన్ యూజర్లు తమ పేర్లను నమోదు చేసుకున్నారు. సేవలు ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటి వరకు 21,833 డిజిటల్ చెల్లింపులు పూర్తి అయ్యాయని ఆర్థిక శాఖ సహాయ మంత్రి భగవత్ కె కరద్ పార్లమెంటుకు తెలిపారు. ‘యూపీఐ సేవలను విదేశాల్లోనూ విస్తరించేందుకు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఇంటర్నేషనల్ పేమెంట్స్(ఎన్ఐపీఎల్) కృషి చేస్తోంది. భారత్ ఇంటర్ఫేస్ ఫర్ మనీ(బీహెచ్ఐఎం) యూపీఐ క్యూఆర్ కోడ్ వినియోగించి సింగపూర్, భూటాన్, యూఏఈ, నేపాల్‌లోని వర్తకులకు చెల్లింపులు చేయవచ్చు’ అని వెల్లడించారు. (చదవండి: రాబోయేదీ యథాతథ విధానమే: భట్టాచార్య) -
2.83 లక్షల కోట్ల వ్యయం..16.90 కోట్ల ఫోన్ల కొనుగోలు
న్యూఢిల్లీ: భారత స్మార్ట్‌ఫోన్ షిప్మెంట్ (కంపెనీల నుంచి మార్కెట్‌కు సరఫరా/ఎగుమతులు) 2021లో 11 శాతం పెరిగి 169 మిలియన్ యూనిట్లుగా ఉన్నాయి. మార్కెట్ ఆదాయం 38 బిలియన్ డాలర్లుగా ఉన్నట్టు కౌంటర్ పాయింట్ రీసెర్చ్ తెలిపింది. వార్షికంగా చూసుకుంటే ఇది 27 శాతం వృద్ధిగా పేర్కొంది. 2021 డిసెంబర్ త్రైమాసికంలో అంతక్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 8 శాతం షిప్మెంట్ తగ్గినా కానీ, పూర్తి ఏడాదికి 11 శాతం వృద్ధి చెందినట్టు కౌంటర్ పాయింట్ రీసెర్చ్ వివరించింది. డిసెంబర్ త్రైమాసికంలో సరఫరా సమస్యలు తయారీపై ప్రభావం చూపించినట్టు తెలిపింది. ‘‘భారత స్మార్ట్‌ఫోన్ మార్కెట్ 2021లో మంచి వినియోగ డిమాండ్‌ను చూసింది. సరఫరా సమస్యలు, సెకండ్ వేవ్ తీవ్రత, అంతర్జాతీయంగా విడిభాగాల కొరత, ధరల పెంపు ఉన్నా కానీ, స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో మెరుగైన పనితీరు నమోదైంది’’ అని కౌంటర్ పాయింట్ సీనియర్ రీసెర్చ్ అనలిస్ట్ ప్రాచిర్ సింగ్ తెలిపారు. 2021 షిప్మెంట్ గణాంకాలు - మధ్య, అధిక ధరల విభాగంలో ప్రమోషన్లు, డిస్కౌంట్లతో ధరలు అందుబాటులో ఉన్నందున రీప్లేస్మెంట్ (పాత ఫోన్ తీసేసి కొత్తది కొనుగోలు చేయడం) డిమాండ్ జోరందుకుంది. - దీనికితోడు రుణాలకు సంబంధించి మంచి ఆప్షన్లు ఉండడం 11 శాతం వృద్ధికి మద్దతుగా నిలిచింది. - 2021 చివరి రెండు నెలల్లో డిమాండ్ సరఫరాను మించింది. - 2021 అక్టోబర్–డిసెంబర్ కాలంలో వార్షికంగా స్మార్ట్‌ఫోన్ షిప్మెంట్లు 8 శాతం క్షీణించాయి. 2022 మొదటి మూడు నెలల్లో సరఫరా మెరుగుపడొచ్చు. - దేశీయంగా షావోమీ 24 శాతం స్మార్ట్‌ఫోన్ షిప్‌మెంట్‌తో మొదటి స్థానంలో నిలిచింది. ప్రీమియం ఫోన్ల (రూ.30వేలకు పైన) విభాగంలో వార్షికంగా 2021లో 258 శాతం వృద్ధి నమోదు చేసింది. - శామ్సంగ్ 18 శాతం షిప్‌మెంట్‌తో రెండో స్థానంలో ఉంది. రూ.20,000–45,000 ధరల విభాగంలో 28 శాతం మార్కెట్ వాటాను కలిగి ఉంది. - వివో 15 శాతం, రియల్మీ 14 శాతం, ఒప్పో 10 శాతం వాటాతో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. - రియల్మీ వేగంగా వృద్ధిని నమోదు చేస్తున్న బ్రాండ్‌గా ఉంది. డిసెంబర్ త్రైమాసికంలో రెండో స్థానాన్ని దక్కించుకుంది. - వన్‌ప్లస్ భారత్ మార్కెట్లోనే అత్యధిక షిప్‌మెంట్‌ను 2021లో నమోదు చేసింది. ప్రీమియం ఫోన్ల విభాగంలో 19 శాతంతో రెండో స్థానంలో ఉండగా, అందుబాటు ధరల్లోని ప్రీమియం విభాగంలో మార్కెట్ లీడర్‌గా ఉంది. - 2021లో యాపిల్ సైతం వార్షికంగా 108 శాతం వృద్ధిని చూపించింది. ప్రీమియం విభాగంలో 44 శాతం మార్కెట్ వాటా కలిగి ఉంది. - 5జీ ఫోన్ల షిప్మెంట్ 2021లో 555 శాతం పెరిగింది. వివో 19 శాతంతో మార్కెట్ లీడర్‌గా ఉంది. - ఫ్యూచర్ ఫోన్ల విభాగలో 86 మిలియన్ యూనిట్ల సరఫరా నమోదైంది. అంతక్రితం ఏడాదితో పోలిస్తే వృద్ధి లేకుండా ఫ్లాట్‌గా ఉంది. - ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకం (పీఎల్ఐ) భారత మొబైల్ తయారీకి ఎంతో మద్దతునిచ్చి నట్టు, యాపిల్, శామ్సంగ్ కంపెనీలు భారత్‌లో తయారీని పెంచేందుకు దోహదపడినట్టు కౌంటర్‌పాయింట్ తెలిపింది. చదవండి:మొబైల్ యూజర్లకు గుడ్ న్యూస్.. టెలికాం సంస్థలకు షాక్! -
ఫీచర్ ఫోన్ యూజర్లకు గుడ్‌న్యూస్..!
కోట్లాదిమంది ఫీచర్ ఫోన్ హోల్డర్లు కూడా ఇకపై యూపీఐ (యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్) పేమెంట్లు జరిపేలా చర్యలకు కూడా శ్రీకారం చుడుతున్నట్లు గవర్నర్ శక్తికాంతదాస్ సూచించారు. ట్రాయ్ సమాచారం ప్రకారం, అక్టోబర్ 2021 నాటికి భారతదేశంలో దాదాపు 118 కోట్ల మంది మొబైల్ ఫోన్ వినియోగదారులు ఉన్నారు. ఇందులో గణనీయమైన సంఖ్యలో వినియోగదారులు ఇప్పటికీ ఫీచర్ ఫోన్లలోనే ఉన్నారు. జూలై 2021 నాటికి దాదాపు 74 కోట్ల మంది వినియోగదారులు స్మార్ట్ ఫోన్లను కలిగి ఉన్నట్లు అంచనా. స్మార్ట్ఫోన్లలో యూపీఐ పేమెంట్లు ఇప్పటికే భారీగా పెరిగిన సంగతి తెలిసిందే. డిజిటల్ పేమెంట్లు మరింత భారీగా పెరగాలని ఆర్బీఐ భావిస్తోంది. ఈ దిశలో డిజిటల్ పేమెంట్లకు సంబంధించి కస్టమర్లపై విధిస్తున్న చార్జీలను సమీక్షించాలని నిర్ణయించింది. తగిన చౌకగా ఈ చెల్లింపుల లావాదేవీలు ఉండేలా తీసుకునే చర్యల్లో భాగంగా దీనిపై ఒక చర్చాపత్రం విడుదల చేయనున్నట్లు వెల్లడించింది. ఐపీఓకు ప్రధాన పేమెంట్ ఆప్షన్‌గా యూపీఐ మారిందని తెలిపింది. యూపీఐ వ్యవస్థ ద్వారా లావాదేవీ పరిమాణం 2020 మార్చి నుంచి రూ.లక్ష నుంచిరూ.2 లక్షలకు పెరిగింది. -
‘నాన్న నంబర్‌తో అభ్యంతరకర స్టేటస్లు.. ఇబ్బందిగా ఉంది’
సాక్షి, సిటీబ్యూరో: ‘మా నాన్న బేసిక్ మోడల్ ఫోన్ వాడుతున్నారు. ఆయన వినియోగిస్తున్న నంబర్‌తో గుర్తుతెలియని వ్యక్తులు వాట్సాప్ యాక్టివేట్ చేసుకున్నారు. అందులో అభ్యంతరకర స్టేటస్లు పెడుతున్నారు. ఇది మా నాన్నతో పాటు మొత్తం కుటుంబానికే ఇబ్బందికరంగా మారింది’ కాచిగూడకు చెందిన ఓ వ్యక్తి శుక్రవారం సిటీ సైబర్ క్రైమ్ పోలీసులకు ఇచి్చన ఫిర్యాదు ఇది. ఇటీవల కాలంలో సైబర్ నేరగాళ్లు వాట్సాప్‌ను తమకు నచి్చనట్లు వాడేస్తుండటంతో ఈ తరహా ఫిర్యాదులు పెరిగినట్లు అధికారులు చెబుతున్నారు. వారికి అదే కలిసి వస్తోంది... వాట్సాప్ మాత్రమే కాదు.. ఈ తరహా యాప్స్ వినియోగించడంలో ఉన్న ఓ చిన్న లోపం సైబర్ నేరగాళ్లకు కలిసి వస్తోంది. వాట్సాప్‌ను స్మార్ట్‌ఫోన్‌లో ఇన్స్టాల్ చేసుకున్నాక కేవలం యాక్టివేట్ చేసుకోవడానికి మాత్రమే ఫోన్ నంబర్ అవసరం. ఆ సందర్భంలో వచ్చే వన్ టైమ్ పాస్వర్డ్ లేదా వెరిఫికేషన్ కోడ్/కాల్‌ను అందుకోవడానికి ఫోన్ నంబర్ కచ్చితం. ఆ తర్వాత నంబర్, సిగ్నల్‌తో సంబంధం లేకుండా వైఫైలో వాట్సాప్‌ను వినియోగించుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే అనేకసార్లు ఫోన్ సిగ్నల్ లేకపోయినా వాట్సాప్ వినియోగదారులు వైఫై ద్వారా వాయిస్, వీడియో కాల్స్ చేసుకోగలుగుతారు. ఫోన్ నంబర్‌తో అవసరం లేని ఈ విధానమే సైబర్ మోసగాళ్లకు కలిసి వస్తోంది. ఆయా యాప్స్‌లో సెర్చ్ చేస్తూ... వేధింపులు, బెదిరింపుల సహా ఇతర సైబర్ నేరాలకు పాల్పడే నేరగాళ్లను ఎట్టి పరిస్థితుల్లోనూ తమ పేర్లతో లేదా సంబంధీకుల పేర్లతో తీసుకున్న ఫోన్ నంబర్లు వినియోగించరు. అలా చేస్తే పోలీసుల దర్యాప్తులో చిక్కుతామనే ఉద్దేశంతో వాటికి దూరంగా ఉంటారు. తమ స్మార్ట్ఫోన్లలో వాట్సాప్‌ను యాక్టివేట్ చేసుకుని, వైఫై వినియోగిస్తే మాత్రం వీళ్ల పని తేలికవుతుంది. ఈ యాప్‌ను యాక్టివేట్ చేసుకోవడానికి వాళ్లుకు ఓ ఫోన్ నంబర్ కావాలి. దీనికోసం సైబర్ నేరగాళ్లు కొన్ని సీరీస్‌ల్లో నంబర్లను ఎంపిక చేసుకుంటున్నారు. వాటి యజమానులు అప్పటికే వాట్సాప్ వాడుతుంటే మళ్లీ వీళ్లు యాక్టివేట్ చేసుకోవడం సాధ్యం కాదు. ఆయా నంబర్లతో వాట్సాప్ యాక్టివేషన్లో ఉందా.. లేదా? అనేది తెలుసుకోవడానికి సైబర్ నేరగాళ్లు కొన్ని యాప్స్ వాడుతున్నారు. ఐకాన్ సçహా ఇతర వాటిలో ఫోన్ నంబర్ ఎంటర్ చేసి సెర్చ్ చేస్తే వాట్సాప్ యాక్టివేట్ అయి ఉందా అనేది తెలుసుకోవడం సాధ్యం. మాయ మాటలతో ఓటీపీ తీసుకుంటూ... సాధారణంగా తమ సిమ్‌కార్డును బేసిక్ ఫోన్లలో వాడుతున్న వినియోగదారులు వాట్సాప్‌ను యా క్టివేట్ చేసుకోరు. అలాంటి వారినే సైబర్ నేరగాళ్లు టార్గెట్ చేసుకుంటున్నారు. తమ స్మార్ట్‌ఫోన్‌లో వాట్సాప్‌ను ఇన్‌స్టల్ చేసిన తర్వాత వెరిఫికేషన్ కోడ్ కోసం ఆ ఫోన్ నంబర్ ఇస్తున్నారు. ఇలా ఆ వినియోగదారుడికి ఈ కోడ్ చేరుతుంది. వారిని సంప్రదిస్తున్న సైబర్ నేరగాళ్లు ఓ లావాదేవీలో పొరపాటున మీ ఫోన్ నంబర్ ఎంటర్ చేశామని, దీంతో ఓటీపీ మీకు వచ్చిందని చెప్పి దాన్ని తీసుకుంటున్నారు. కొన్ని సందర్భాల్లో బ్యాంకులతో పాటు ఇతర కాల్ సెంటర్ల పేర్లు వాడుతున్నారు. ఇలా ఓటీపీ ని చేజిక్కించుకుని తమ ఫోన్లలో ఎదుటి వారి నెంబర్‌తో వాట్సాప్ యాక్టివేట్ చేసుకుంటున్నా రు. ఆ వెంటనే వాట్సాప్ సెక్యూరిటీ సెట్టింగ్స్‌ను మార్చేస్తూ టూ స్టెప్ వెరిఫికేషన్ పెట్టుకుంటున్నా రు. దీని వల్ల ఎప్పుడైనా సదరు సిమ్‌కార్డు విని యోగదారులు తన ఫోన్లో వాట్సాప్ యాక్టివేట్ చేసుకోవాలని భావించినా... అది సాధ్యం కాదు. వైఫైలో వాడుతూ వ్యవహారాలు... ఇలా వేరే వారి ఫోన్ నంబర్‌తో తమ స్మార్ట్‌ఫోన్‌లో వాట్సాప్‌ను యాక్టివేట్ చేస్తున్న సైబర్ నేరగాళ్లు దీన్ని వైఫైలో వాడుతున్నారు. ఫలితంగా ఆ ఫోన్ నంబర్‌తో పని లేకుండా వాళ్ల పనులు జరిగిపోతున్నాయి. ఇలాంటి వాట్సాప్‌లను వాడుతూ సైబర్ నేరగాళ్లు వేధింపులు, బెదిరింపులతో పాటు ఇతర సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు. కొన్ని సందర్భాల్లో అమాయకులు పోలీసుల విచారణ ఎదుర్కోవాల్సి వస్తోంది. ఈ తరహా కేసుల్లో ఫిర్యాదులు వచ్చినా.. బాధ్యుల్ని పట్టుకోవడం అత్యంత కష్టసాధ్యమని అధికారులు చెప్తున్నారు. అత్యంత అరుదైన కేసుల్లో మాత్రమే వాట్సాప్ సంస్థకు లేఖలు రాసి, డీయాక్టివేషన్ చేయించే ఆస్కారం ఉంటోందని స్పష్టం చేస్తున్నారు. వాట్సాప్ యాక్టివేట్ చేసుకోని నంబర్లతో పాటు కొన్నిసార్లు అప్పటికే వాట్సాప్ వాడుతున్న వాళ్లకీ సైబర్ నేరగాళ్ల ఇలా బురిడీ కొట్టిస్తున్నారని చెప్తున్నారు. ఎవరైనా కాల్ చేసి ఓటీపీలు వంటివి అడిగితే పలుమార్లు సరిచూసుకున్నాకే చెప్పాలని, లేదంటే ఇలాంటి సైబర్ నేరగాళ్ల చేతికి చిక్కే ప్రమాదం ఉందని స్పష్టం చేస్తున్నారు. -
రూ.1049 లకే ఐటెల్ ఫోన్ : అధ్బుత ఫీచర్లు
సాక్షి, న్యూఢిల్లీ: ఐటెల్ సంస్థ అద్భుత ఫీచర్లు, అతి తక్కువ ధరలో కొత్త ఫీచర్ ఫోన్‌ను లాంచ్ చేసింది. ప్రధానంగా కరోనా సంక్షోభ సమయంలో బాడీ టెంపరేచర్‌ను గుర్తించాల్సిన అవసరాన్ని గుర్తించిన తాము ఈ ఫోన్‌ను తీసుకొచ్చామని కంపెనీ వెల్లడించింది. ఐటీ2192టీ థర్మో ఎడిషన్ పేరుతో ఐటెల్ దీన్ని ఆవిష్కరించింది. దీని ధరను కేవలం . రూ .1,049గా నిర్ణయించింది. ఇన్‌బిల్ట్ టెంపరేచర్ సెన్సర్ ద్వారా శరీర ఉష్ణోగ్రతను మానిటర్ చేస్తుందని కంపెనీ వెల్లడించింది. కోవిడ్ -19 నుండి సురక్షితంగా ఉండటానికి ముందస్తు చర్యగా యూజర్ల శరీర ఉష్ణోగ్రతను ట్రాక్ చేసేలా ఎంట్రీ లెవల్ విభాగంలో దేశంలోనే తొలి ఫీచర్ ఫోన్‌గా ఇది నిలిచింది. అలాగే టెక్స్ట్-టు-స్పీచ్ ఫీచర్ ఇందులోని మరో విశేషం. తెలుగుతోపాటు ఎనిమిది భాషలకు ఇది సపోర్ట్ చేస్తుంది. యూజర్లు టెంపరేచర్‌ను గుర్తించేలా ఫోన్లో థర్మో సెన్సార్ ను పొందుపర్చింది. థర్మో బటన్‌ను ఎక్కువసేపు నొక్కి ఉంచితే టెంపరేచర్‌ను రీడ్ చేస్తుంది. సెన్సార్‌ను అరచేతిలో ఉంచుకోవడం లేదా సెన్సార్‌పై టచ్ ఫింగర్‌ను ఉంచితే సెల్సియస్‌లో టెంపరేచర్‌ను చూపిస్తుంది. దీన్ని ఫారెన్‌హీట్‌గా కూడా మార్చుకోవచ్చు. అంతేకాదు టెక్స్ట్-టు-స్పీచ్ ఫీచర్ ద్వారా ఇన్కమింగ్ కాల్లు, సందేశాలు, మెనూ వివరాలు మాత్రమే కాకుండా బాడీ టెంపరేచర్ వివరాలను కూడా వినిపిస్తుంది. ఇంగ్లీష్, హిందీ, పంజాబీ, బెంగాలీ, తమిళం, తెలుగు, కన్నడ, గుజరాతీ భాషల్లో దీన్ని వినవచ్చు. ఇతర ఫీచర్లను పరిశీలిస్తే 4.5 సెం.మీ డిస్ప్లే, 1,000 ఎంఏహెచ్ బ్యాటరీని అమర్చింది. ఇది సూపర్ బ్యాటరీ మోడ్‌తో 4 రోజుల బ్యాటరీ బ్యాకప్‌ను ఇస్తుంది. ఈ కీప్యాడ్ ఫీచర్ ఫోన్లో వెనుక కెమెరా, రికార్డింగ్ ఆప్షన్‌తో వైర్లెస్ ఎఫ్ఎం, ఆటో కాల్ రికార్డర్, ఎల్ఈడీ టార్చ్, వన్-టచ్ మ్యూట్ , ప్రీ-లోడెడ్ గేమ్స్ఉన్నాయి. వినియోగదారుల ఆరోగ్యం, వినోదం అనే రెండు లక్ష్యాలతో సమాజానికి ఎక్కువ బాధ్యత వహించేలా ఎంట్రీ లెవల్లో అతి తక్కువ ధరలో ఫీచర్ ఫోన్‌ను లాంచ్ చేశామని ఐటెల్ సీఈఓ తలపాత్రా చెప్పారు -
నోకియా ఫీచర్ ఫోన్ : సరికొత్తగా నేడే
సాక్షి, ముంబై: ప్రముఖమొబైల్ తయారీ దారు నోకియా మరోసారి తన క్లాసిక్ ఫీచర్ ఫోన్‌తో వినియోగదారును ఆకర్షించనుంది. నోకియా 5310 (2020) ఫోన్ ను హెచ్ఎండీ గ్లోబల్ ద్వారా సరికొత్తగా నేడు (మంగళవారం) లాంచ్ చేయనుంది. భారత మార్కెట్లో ఆవిష్కరించనున్న కొత్త నోకియా 5310 ధర తెలియాలంటే లాంచింగ్ వరకు వెయిట్ చేయాల్సిందే. ఫీచర్లపై అంచనాలు: కొత్త నోకియా 5310 ఫీచర్ ఫోన్ 2007 వెర్షన్ కంటే కొద్దిగా భిన్నంగా ఉండనుంది. 2.4అంగుళాల స్క్రీన్ , డ్యూయల్ ఫ్రంట్ ఫేసింగ్ స్పీకర్లు, ఎఫ్ఎం రేడియో, ఇన్ బిల్ట్ ఎంపీ 3 ప్లేయర్, 3.5 ఎంఎం హెడ్‌ఫోన్ జాక్, 1200 ఎంఏహెచ్ బ్యాటరీ, 8 ఎంబీ ర్యామ్, 32 జీబీ దాకా ఎక్స్ పాండబుల్ మెమరీ, వీజీఏ కెమెరా ప్రధాన ఫీచర్లుగా ఉండనున్నాయి. -
దసరా టు దీపావళి జియో బంపర్ ఆఫర్
సాక్షి, ముంబై: భారతీయ టెలికాం రంగంలో 4జీ టెక్నాలజీతో సంచలనాలకు మారు పేరుగా మారిన రిలయన్స్ జియో ఇప్పుడు 2జీ మార్కెట్‌పై కన్నేసింది. 2జీ వినియోగదారులకు స్మార్ట్ఫోన్లను విరివిగా అందుబాటులోకి తేవాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగా `జియో ఫోన్ దీపావళి 2019 ఆఫర్` పేరుతో కొత్త ఆఫర్‌ను జియో నేడు ప్రకటించింది. జియో ఫోన్‌పై రూ. 800 తగ్గింపు, రూ.700 విలువైన డాటా, మొత్తం కలిపి రూ.1500 భారీ ప్రయోజనం ప్రతి జియో ఫోన్ వినియోగదారుడికి సొంతం అవుతుంది. ఈ దసరా టూ దివాలీ ఆఫర్ రేపు (అక్టోబర్ 8) ఈ నెల 27వరకు మాత్రమే అందుబాటులో వుంటుందని జియో ప్రకటించింది. దసరా, దీపావళి పండుగ సమయంలో, జియో ఫోన్ ప్రస్తుత ధర రూ.1500 కాకుండా ప్రత్యేక ధర కింద కేవలం రూ. 699కే జియో ఫోన్ అందుబాటులో ఉంచుతున్న సంగతి తెలిసిందే. మరో ప్రత్యేకత ఏంటంటే ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న 2జీ ఫీచర్ ఫోన్ల కంటే కూడా ఈ ధర ఎంతో తక్కువ కావడం విశేషం. అంతేకాదు పాత ఫోన్ ఎక్సేంజ్ చేసుకోవడం వంటి ప్రత్యేకమైన షరతులు ఏవీ కూడా విధించకపోవడం దీనియొక్క మరో ప్రత్యేకత. తద్వారా, ఫీచర్ ఫోన్ వినియోగదారులు శక్తివంతమైన 4జీ సేవలను అందించనుంది. రూ.700కు సంబంధించి, జియో ఫోన్ వినియోగదారులు ఆ మొత్తంతో జియో ఫోన్ కొనుగోలు చేసి 2జీ నుంచి 4జీ డాటా ప్రపంచంలోకి మారిపోవచ్చు. రూ.700 విలువైన డాటా ప్రయోజనాలను అందిస్తోంది. వినియోగదారుడు చేసుకున్న మొదటి ఏడు రీచార్జ్‌లకు రూ.99 విలువైన డాటాను జియో అధనంగా జతచేయనుంది. జియోఫోన్ వినియోగదారులకు అధనంగా అందే ఈ రూ.700 డాటాతో జియో వినియోగదారులు ఎంటర్టైన్మెంట్, పేమెంట్స్, ఈకామర్స్, విద్య, శిక్షణ, రైలు, బస్ బుకింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యాప్‌లు మరెన్నో అంశాలకు సంబంధించిన మునుపెన్నడూ లేని అనుభూతులను సొంతం చేసుకోవచ్చని జియో తెలిపింది. డిజిటల్ ఇండియా కల సాకారం చేసుకోవడంలో భాగంగా జియో అందిస్తున్న దీపావళి కానుక. ఈ పండుగ మాసంలో జియో ద్వారా అందించే ఒక్కసారి మాత్రమే లభ్యమయ్యే ఈ ఆఫర్ సద్వినియోగం చేసుకోవాలని, భారతదేశంలో 2జీ సేవలను వినియోగిస్తున్న వారు దాని నుంచి అప్‌గ్రేడ్ అయి జియో ఫోన్ ప్లాట్‌ఫాంకు చేరువ కావాలని జియో ప్రకటించింది. -
జియోకి షాక్ : నోకియా ఫీచర్ ఫోన్
హెచ్ఎండీ గ్లోబల్ తన నోకియా మరో ఫీచర్ ఫోన్‌ను మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ (ఎండబ్ల్యూసీ) 2019లో విడుదల చేసింది. నోకియా 210 పేరుతో తీసుకొచ్చిన ఈ ఫీచర్ ఫోన్‌ను బడ్జెట్‌ధరలో అందుబాటులో ఉంచింది. 2జీ సపోర్టు, డ్యుయల్ సిమ్ సదుపాయం ప్రధాన ఫీచర్లుగా ఉన్నాయి. ఫేస్బుక్ తోపాటు రెగ్యులర్ స్నేక్ గేమ్‌ను కూడా ఇందులో పొందుపర్చింది. చార్కోల్, రెడ్, గ్రే కలర్ ఆప్షన్లలో లభిస్తున్న ఈ మొబైల్ ధర సుమారు రూ.2,500. వచ్చే వారం ఈ ఫోన్ వినియోగదారులకు అందుబాటులోకి రానుంది. నోకియా 210 ఫీచర్లు 2.4 ఇంచుల డిస్ ప్లే 2జీబీ ర్యామ్,16 ఎంబీ ఇంటర్నల్ స్టోరేజ్ వీజీఏ రియర్ కెమెరా విత్ ఫ్లాష్ ఎఫ్ఎం రేడియో, ఎంపీ3 ప్లేయర్ 1020 ఎంఏహెచ్ బ్యాటరీ 20 రోజుల స్టాండ్ బై టైం, మైక్రో యూఎస్బీ పోర్టు తదితర ఫీచర్లు నోకియా 210 సొంతం. అయితే భారత్ మార్కెట్లలో ఎపుడు అందుబాటులోకి వచ్చేదీ కంపెనీ ఇంకా వెల్లడించలేదు. -
నోకియా 106 మళ్లీ మార్కెట్లో
హెచ్ఎండీ గ్లోబల్ బ్రాండ్ నోకియా తనపాపులర్ మోడల్ మొబైల్‌ను మళ్లీ లాంచ్ చేయనుంది. సెకండ్ ఇన్నింగ్స్‌లో స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో క్రమంగా తనస్థానాన్ని పదిల పర్చుకుంటున్న నోకియా అతి తక్కువ ధరలో ఫీచర్ ఫోన్‌ను మళ్ళీ మార్కెట్లో లాంచ చేస్తోంది. తాజాగా నోకియా 106(2018)ను రష్యాలో విడుదల చేసింది. 2013లో విడుదలై బహుళ ఆదరణ పొందిన ఈ ఫోన్‌కు మరిన్ని హంగులు చేర్చి తాజాగా విడుదల చేసింది. తాజానోకియా ఫీచర్ ఫోన్ లాంగ్ బ్యాటరీ లైఫ్ ఇస్తుందని కంపెనీ చెబుతోంది. 15గంటల టాక్ టైం 21 స్టాండ్ బై తమ ఫీచర్ ఫోన్ సొంతమని పేర్కొంది. నోకియా 106(2018) ఫీచర్లు 1.8ఇంచెస్‌డిస్‌ప్లే మీడియా టెక్ ఎంటీ 6261 డీ ప్రాసెసర్ 4 ఎంబీ ర్యామ్, 4 ఎంబీ స్టోరేజ్ ఎఫ్ఎం రేడియో, ఎల్ఈడీ ఫ్లాష్ లైట్ 800ఎంఏహెచ్ బ్యాటరీ నోకియా 106(2018) ధర సుమారు 1750 రూపాయలుగా ఉండనుంది. 2013లో దీని ధర 1399రూపాయలుగా ఉంది. అయితే భారతదేశంతో సహా ప్రపంచ మార్కెట్లో ఈ ఫీచర్ ఫోన్ ఎప్పటికి అందుబాటులోకి వచ్చేది స్పష్టత లేదు. -
కొత్తకొత్తగా... నోకియా మరో రెండు ఫోన్లు
న్యూఢిల్లీ : హెచ్ఎండీ గ్లోబల్ మరో కొత్త నోకియా ఫోన్లను భారత్‌లో లాంచ్ చేసింది. ఒకటి స్మార్ట్‌ఫోన్ కాగా, మరొకటి ఫీచర్ ఫోన్. ఈ రెండింటిన్నీ ఫిబ్రవరిలో జరిగిన 2018 ఎండబ్ల్యూసీలోనే హెచ్ఎండీ గ్లోబల్ ప్రకటించింది. నోకియా 3.1 ప్లస్, నోకియా 8110 4జీ ‘బనానా ఫోన్’ పేర్లతో వీటిని మార్కెట్లోకి తీసుకొచ్చింది. నోకియా 3.1 ప్లస్ 3జీబీ ర్యామ్+32జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.11,499. ఈ స్మార్ట్‌ఫోన్ అక్టోబర్ 19న ఆఫ్‌లైన్, ఆన్లైన్ స్టోర్లలో అందుబాటులో ఉండనుంది. ఎయిర్టెల్ కస్టమర్లు నోకియా 3.1 ప్లస్ స్మార్ట్‌ఫోన్ కొంటే 1టీబీ డేటా లభ్యం కానుంది. ఇక నోకియా 8110 4జీ ఫీచర్ ఫోన్‌ను రూ.5,999కు లాంచ్ చేసింది. ఈ బనానా ఫోన్ అక్టోబర్ 24 నుంచి అందుబాటులోకి రానుంది. నోకియా 3.1 ప్లస్ స్మార్ట్‌ఫోన్ బ్లూ, బాల్టిక్, వైట్ రంగుల్లో అలరించనుంది. నోకియా 3.1 ప్లస్ స్పెషిఫికేషన్లు... 6 అంగుళాల ఫుల్ స్క్రీన్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే పైన, కింద సిమెంట్రికల్ బెజెల్స్ వెనుక ప్యానల్‌కు మెటల్ మాదిరి ఫినిస్, ఇది హెచ్ఎండీ తన ఖరీదైన ప్లస్ ఫోన్లకు అందిస్తోంది మీడియాటెక్ హిలియో పీ22 చిప్సెట్ 3జీబీ ర్యామ్, 32జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ 400జీబీ వరకు విస్తరణ మెమరీ ఆండ్రాయిడ్ 8.1 ఓరియో 13ఎంపీ + 5ఎంపీ ప్రైమరీ సెన్సార్ 8ఎంపీ ఫ్రంట్ కెమెరా 3500 ఎంఏహెచ్ బ్యాటరీ నోకియా 8110 4జీ స్పెషిఫికేషన్లు... ట్రెడిషినల్ బ్లాక్, బనానా యెల్లో రంగుల్లో అందుబాటు కైఓఎస్ ఆధారిత స్మార్ట్ ఫీచర్ ఓఎస్‌తో రన్ అవుతుంది 2.4 అంగుళాల క్యూవీజీఏ డిస్ప్లే వెనుక వైపు 2 మెగాపిక్సెల్ కెమెరా క్వాల్కామ్ 205 గూగుల్ మ్యాప్స్, గూగుల్ అసిస్టెంట్, ఫేస్బుక్ వంటి ముఖ్యమైన యాప్స్ యాక్సస్ వైఫై హాట్‌స్పాట్ ను కూడా ఇస్తోంది -
అతి చవకైన ఫోన్ ఇదే!
సాక్షి, న్యూఢిల్లీ: దేశీయ మొబైల్స్ తయారీదారు డీటెల్ కొత్తఫీచర్ ఫోన్ లాంచ్ చేసింది. 'డి 1 స్లిమ్' పేరుతో అతి తక్కువ ధరలో ఒక ఫీచర్‌ఫోన్‌ను సోమవారం విడుదల చేసింది. డీ1కు సక్సెసర్‌గా తీసుకొచ్చిన ఈ ఫీచర్ ఫోన్లో డిజిటల్ కెమెరా విత్‌ఎల్‌ఈడీ ఫ్లాష్ ప్రత్యేకతగా కంపెనీ చెబుతోంది. అడ్వాన్స్డ్ ఫీచర్లు, డిజైన్‌తో డీ1స్లిమ్ ఫీచర్ ఫోన్ మార్కెట్లో కొత్త ఒరవడిని సృష్టించనుందని డీటెల్ ఎండీ యోగేష్ భాటియా తెలిపారు. బీటుబీ అడ్డా వెబ్సైట్లో ఈఫోన్ లభించనుంది. గతంలో రూ. 299లకే డీ1 ఫీచర్‌ఫోన్ తీసుకొచ్చిన కంపెనీ భారతదేశంలో అతి తక్కువ విలువైన మొబైల్ ఫోన్ తమదే అని కంపెనీ పేర్కొంది. బ్లూ, గోల్డ్, పింక్ - మూడు కలర్ వేరియంట్లలో లభించనుంది. 2.8 అంగుళాల ఎల్సీడీ డిస్ప్లే, మైక్రోఎస్డీ కార్డు ద్వారా 16 జీబికి స్టోరేజ్ విస్తరణ, 1500 ఎమ్ఏహెచ్ బ్యాటరీవిస్తరించగల సామర్ధ్యం ఈ ఫోన్లో జోడించింది. ఈ ఫీచర్ ఫోన్ ధర 1199 రూపాయలు. -
ఈ ఫోన్ ధర రూ. 4వేలు : స్పెషల్ ఏంటి?
సాక్షి, న్యూఢిల్లీ: సీనియర్ సిటిజన్లకోసం ఒక సులభతరమైన ఒక మొబైల్‌ను విడుదల చేసిందో కంపెనీ. సీనియర్ వరల్డ్ అనే కంపనీ ‘ఈజీ ఫోన్ గ్రాండ్’ పేరుతో ఒక ఫీచర్ ఫోన్‌ను లాంచ్ చేసింది. అదీ బడ్జెట్ ధరలోనే. తద్వారా ఫీచర్ ఫోన్లన్నీ కేవలం యూత్‌కోసమే కాదు...సీనియర్ సిటిజన్లకోసం కూడా అన్న సందేశాన్నిస్తోంది. వారు సౌలభ్యంగా వినియోగించుకునేందుకు వీలుగా చాలా ‘ఈజీ’గా రూపొందించామని కంపెనీ చెప్పింది. భారత దేశంలో ఈ తరహా ఫోన్ లాంచ్ చేయడం ఇదే మొదటిసారని కంపెనీ చెబుతోంది. వినికిడి సమస్య ఉన్న వారు, హియరింగ్ సాధనాలు పెట్టుకోవడానికి ఇష్టపడని వారికి తమ ఫోన్ మంచి పరిష్కారమంటోంది. స్పెషల్ టెక్నాలజీ, స్పెషల్ ఇయర్‌ఫోన్స్ ఈ డివైస్ ప్రత్యేకత అని కంపెనీ పేర్కొంది. సరసమైన దరలో కేవలం రూ. 3,990కే ఈ ఈజీఫోన్‌ను కంపెనీ మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. సీనియర్లకు అవసరమయ్యే అన్ని రకాల ఫీచర్లతో ఈ ఫోన్ రూపొందించామని చెప్పింది. పెద్ద స్క్రీన్ , పెద్ద ఫాంట్ సైజ్, డయలింగ్ కీలు కూడా పెద్దవిగా, ఫోటో డయిల్, క్రాడిల్ చార్జర్ వంటి ఫీచర్లు ఈ ఫోన్లో ఉన్నాయని కంపెనీ తెలిపింది. సీనియర్ వరల్డ్.కామ్, అమెజాన్ ఇండియా, ఫ్లిప్ కార్ట్, ఈబే ఇండియా లలో ఈ ఫోన్ అందుబాటులో ఉంటుంది. నాలుగు ఆటోమేటెడ్ పనులను నిర్వహించేలా ఎస్ఓఎస్ బటన్‌తో పాటు ఇంకా ఐదు ఎమర్జెన్సీ కాంటాక్టులు, వాటికి కాల్స్, ఎస్ఎంఎస్ చేసుకునే సౌలభ్యం, ఇన్ కామింగ్ కాల్స్ లిస్ట్, కస్టమైసెబుల్ మెనూ ఫీచర్లను ఆటోమేటెడ్‌గా ఈ ఫోన్లో పొందుపరిచామని పేర్కొంది. సీనియర్ సిటిజనుల ప్రత్యేక అవసరాలకు, కచ్చితంగా ఈ ఫోను ఉపయోగపడుతుందనే విశ్వాసాన్ని కంపెనీ సీఈవో రాహుల్ గుప్తా వ్యక్తం చేశారు. -
గ్లోబల్‌గా కూడా జియోదే రాజ్యం..!
రిలయన్స్ జియో సంచలనాలు సృష్టిస్తూ తీసుకొచ్చిన జియోఫోన్ ఇటు భారత్‌లోనే కాక, అటు ప్రపంచవ్యాప్తంగా తన పేరును మారుమ్రోగించుకుంటోంది. 2018 తొలి త్రైమాసికంలో గ్లోబల్ ఫీచర్ ఫోన్ మార్కెట్లో రిలయన్స్ జియోఫోనే అగ్రస్థానంలో నిలిచింది. 15 శాతం షేరుతో రిలయన్స్ జియోఫోన్ ఈ స్థానాన్ని దక్కించుకుంది. జియోఫోన్ అనంతరం నోకియా హెచ్ఎండీ, ఇంటెల్, శాంసంగ్, టెక్నో కంపెనీలు నిలిచినట్టు తాజా రిపోర్టు వెల్లడించింది. రిలయన్స్ జియోఫోన్ బలమైన షిప్మెంట్లతో ఈ ఏడాది తొలి త్రైమాసికంలో గ్లోబల్ ఫీచర్ ఫోన్ మార్కెట్లో వార్షికంగా 38 శాతం వృద్ధి సాధించినట్టు కౌంటర్‌పాయింట్ రీసెర్చ్ తెలిపింది. గ్లోబల్ ఫీచర్ ఫోన్ మార్కెట్లో నోకియా హెచ్ఎండీ 14 శాతం మార్కెట్ షేరును సంపాదించుకోగా, ఇంటెల్ 13 శాతం, శాంసంగ్ 6 శాతం, టెక్నో 6 శాతం మార్కెట్ షేరును పొందినట్టు కౌంటర్‌పాయింట్ రీసెర్చ్ పేర్కొంది. ప్రతేడాది 50 కోట్ల ఫీచర్ ఫోన్లు విక్రయమవుతున్నాయని, ప్రపంచవ్యాప్తంగా 200 కోట్ల ఫీచర్ ఫోన్లు అవసరం ఉందని ఈ మార్కెట్ రీసెర్చ్ సంస్థ తెలిపింది. ఓ వైపు మొబైల్ మార్కెట్లో స్మార్ట్ఫోన్లు రాజ్యమేలుతున్నప్పటికీ, ఫీచర్ ఫోన్లు మాత్రం తన సత్తా చాటుతూనే ఉన్నాయి. ఇప్పటికీ చాలా మంది స్మార్ట్ఫోన్ల కంటే ఫీచర్ ఫోన్లనే ఎక్కువగా వాడుతున్నారు. 2018 తొలి త్రైమాసికంలో భారత్ ఒక్క దేశమే మొత్తం ఫీచర్ ఫోన్ షిప్మెంట్లలో సుమారు 43 శాతం స్థానాన్ని సంపాదించుకుంది. కొంతమంది ఫీచర్ ఫోన్ కొనుగోలుదారులు డిజిటల్, ఎకనామిక్, అక్షరాస్యత వంటి విషయాల్లో వెనుకబడి ఉండటం, ఖరీదైన స్మార్ట్ఫోన్లను, వాటి డేటా ప్లాన్లను అందిపుచ్చుకునే స్థాయి లేకపోవడమే ఫీచర్ ఫోన్ వృద్ధికి సహకరిస్తుందని రీసెర్చ్ సంస్థ తెలిపింది. మొబైల్ ఇండస్ట్రీలో ప్రస్తుతం ఫీచర్ ఫోన్ సెగ్మెంట్‌కు భారీ అవకాశాలున్నట్టు కౌంటర్ పాయింట్ రీసెర్చ్ సంస్థ తెలిపింది. -
జియో ఫోన్లు ఎన్ని అమ్ముడుపోయాయో తెలుసా?
న్యూఢిల్లీ : రిలయన్స్ జియోఫోన్.. ఫీచర్ ఫోన్ మార్కెట్లో ఓ సంచలనం. కంపెనీ వృద్ధిలో కూడా ఈ ఫోన్ కీలక పాత్ర పోషిస్తోంది. ఈ ఫోన్ మార్కెట్లోకి వచ్చినప్పటి నుంచి దాదాపు 4 కోట్ల ఫోన్లు అమ్ముడుపోయినట్టు రిపోర్టులు ప్రకటించాయి. క్రెడిట్ స్యూజ్ చేపట్టిన అధ్యయనంలో 2018 జనవరి-మార్చి క్వార్టర్లో ఫీచర్ ఫోన్ మార్కెట్ షేరులో జియోఫోన్ 36 శాతం షేరును తన సొంతం చేసుకుందని తెలిసింది. తన మార్కెట్‌బేస్‌ను విస్తరించుకోవడానికి ఇది ఎంతో దోహదం చేసిందని పేర్కొంది. ఈ క్వార్టర్లో 2.1 కోట్ల జియోఫోన్ విక్రయాలు జరిగాయని అంటే నెలకు 70 లక్షల జియోఫోన్లు అమ్ముడుపోయినట్టు సర్వే పేర్కొంది. రిపోర్టు ప్రకారం జనవరిలో కంపెనీ అత్యంత చౌకగా రూ.49తో సరికొత్త ప్లాన్‌ను తీసుకొచ్చింది. ఈ ప్లాన్‌తో భారీ ఎత్తున్న జియోఫోన్ విక్రయాలు కూడా నమోదుతున్నాయని రిపోర్టు తెలిపింది. మొత్తంగా జియో వృద్ధికి అత్యంత కీలకమైన పాత్రను జియోఫోన్ పోషిస్తున్నట్టు రిపోర్టు పేర్కొంది. లాంచింగ్ నుంచి మొత్తంగా ఇప్పటి వరకు 4 కోట్ల ఫోన్లు అమ్ముడుపోయినట్టు రిపోర్టు వెల్లడించింది. అయితే జియో ఫోన్ ఇతర ఫోన్ల మార్కెట్ షేరును తినేస్తోందా? లేదా జియో ఫోన్‌ను కస్టమర్లు రెండో డివైజ్‌లాగా కొనుగోలు చేస్తున్నారా? అని తెలుసుకోవడం మాత్రం కష్టతరంగా మారినట్టు సర్వే పేర్కొంది. ఇంక్యూబెంట్ల సబ్‌స్క్రైబర్ బేస్‌ను ఇది తన వైపుకు లాగేసుకోవడం ప్రారంభించిందని నివేదించింది. -
రూ.500కే స్మార్ట్ఫోన్లు, అసలు భారమెంత?
న్యూఢిల్లీ : దేశీయ టెలికాం ఆపరేటర్లు రూ.500 కన్నా తక్కువ ధరలో 4జీ స్మార్ట్ఫోన్లను మార్కెట్లోకి తీసుకురావడానికి కసరత్తు చేస్తున్నాయి. రిలయన్స్ జియో లాంచ్‌చేసిన జియోఫోన్‌కు గట్టి పోటీ ఇచ్చేందుకు ఎయిర్టెల్, వొడాఫోన్, ఐడియా సెల్యులార్‌లు ఈ కసరత్తు చేస్తున్నాయని తెలిసింది. కానీ 500 రూపాయలకే స్మార్ట్ఫోన్లను తీసుకొస్తున్న ఈ కంపెనీలకు, అసలెంత భారం పడుతుందో వివరిస్తూ.. టెలికాం ఇండస్ట్రీ అంచనాలు విడుదల చేసింది. ఈ అంచనాల్లో కంపెనీ భరించబోయే భారం చాలా పెద్ద మొత్తంలోనే ఉన్నట్టు తేలింది. ఎంట్రీ-లెవల్ 4జీ ఎనాబుల్డ్ స్మార్ట్‌ఫోన్‌ను తయారు చేయడానికి సగటును 3వేల రూపాయల మేర ఖర్చు అవుతుంది. ఈ డివైజ్‌లకు కనుక ఎక్కువ మొత్తంలో ఆర్డర్ చేస్తే.. దీని ఖర్చు 2700 రూపాయలకు తగ్గవచ్చు. కానీ దీని కంటే ఐదింతల తక్కువ రేటుకు అంటే 500 రూపాయలకే 4జీ స్మార్ట్‌ఫోన్‌ను ఆఫర్ చేస్తామని కంపెనీలు చెబుతున్నాయి. ఇలా 500 రూపాయలకే స్మార్ట్ఫోన్లను అందించడం వల్ల టెలికాం కంపెనీలు దాదాపు 26వేల కోట్ల భారాన్ని భరించాల్సి వస్తుందని తెలుస్తోంది. ఇప్పటికే ఆర్థికంగా చితికి పోయిన టెలికాం పరిశ్రమకు, ఈ సబ్సిడీ అదనపు భారమని, కాస్త జాగ్రత్తగా వ్యవహరించాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అంతేకాక రుణాలు కూడా మరో రూ.5 లక్షల కోట్లకు పెరుగుతాయని పేర్కొంటున్నారు. నెలకు 60 రూపాయల రీఛార్జ్ ప్లాన్‌తో ఈ డివైజ్‌లను టెలికాం కంపెనీలు ప్రవేశపెట్టబోతున్నాయి. అంటే ఏడాదికి 117 మిలియన్ యూజర్ల నుంచి రూ.8,424 కోట్లను టెలికాం కంపెనీలు రికవరీ చేసుకోవచ్చు. దీని ప్రకారం కంపెనీలు ఆఫర్ చేసిన మొత్తం సబ్సిడీని రికవరీ చేసుకోవాలంటే దాదాపు మూడేళ్లకు పైగానే సమయం పట్టే అవకాశం కనిపిస్తోంది. అదీ కూడా కస్టమర్ ఒకే ఆపరేటర్‌ను వాడితే తప్ప, ఆ రికవరీ సాధ్యం కాదు. మరోవైపు భారీగా పెరుగుతున్న పోటీతర వాతావరణ నేపథ్యంలో, రికవరీ కాలం మరింత పెరిగినా ఆశ్చర్యం పోక్కర్లేదని తెలుస్తోంది. మొత్తం 1.2 బిలియన్ మంది వైర్లెస్ సబ్‌స్క్రైబర్లుండగా.. 780 మిలియన్ల మంది ఫీచర్ ఫోన్ వాడుతున్నారు. దేశీయ మార్కెట్లో స్మార్ట్‌ఫోన్ వాడకం తక్కువగా ఉందని, ఇంటర్నెట్ ఎనాబుల్డ్ ఫోన్లను ఎక్కువగా ప్రజలకు ఆఫర్ చేయాల్సినవసరం ఉందని ఐడీసీ ఇండియా సీనియర్ మార్కెట్ అనాలిస్ట్ జైపాల్ సింగ్ తెలిపారు. -
శాంసంగ్‌ను బీట్ చేసి మరీ జియో సంచలనం
సాక్షి, న్యూఢిల్లీ: రిలయన్స్ జియో ఎంట్రీతో టెలికాం మార్కెట్లో సునామీ సృష్టించిన రిలయన్స్ ..ఫీచర్ ఫోన్ సెగ్మెంట్లోకూడా దూసుకుపోతోంది. తాజా నివేదికల ప్రకారం జియో లాంచ్ చేసిన ఇండియా కా స్మార్ట్‌ఫోన్ టాప్ ప్లేస్ కొట్టేసింది. స్మార్ట్‌ఫోన్ దిగ్గజం శాంసంగ్‌ను బీట్ చేసి మరీ ఫీచర్‌ఫోన్ మార్కెట్లో అదరగొట్టింది. 27శాతం మార్కెట్ వాటాతో రిలయన్స్ ‘జియోఫోన్’ బ్రాండ్ అగ్రస్థానాన్ని సాధించినట్లు కౌంటర్‌పాయింట్ రీసెర్చ్ సంస్థ తెలిపింది. 2017 నాలుగో త్రైమాసికంలో తయారీ సంస్థల నుంచి సరఫరా (షిప్మెంట్)లను పరిగణనలోకి తీసుకుని, ఈ నివేదికను సంస్థ రూపొందించింది. దీంతో రిలయన్స్ రీటైల్ మార్కెట్ లీడర్‌గా నిలిచిందని పేర్కొంది. అంతేకాదు సౌత్ కొరియన్ బ్రాండ్ శాంసంగ్‌ను వెనక్కి నెట్టేసింది. శాంసంగ్ మార్కెట్వాటా 17శాతంతో రెండవ స్థానంతో సరిపెట్టుకుంది. 9శాతంతో మైక్రోమాక్స్ మూడవ స్థానంలో నిలిచింది. అక్టోబరు-డిసెంబరు త్రైమాసికం చివర్లో రూ.1,500 విలువైన జియో 4జీ ఫీచర్ ఫోన్ల విక్రయాలు అధికంగా జరిగాయని, గిరాకీ-సరఫరాల మధ్య అంతరాయాన్ని నివారించగలిగిందని కౌంటర్‌పాయింట్ రీసెర్చ్ పేర్కొంది. ఈ ఫోన్‌కు 60 లక్షల ముందస్తు బుకింగ్‌లు లభించాయని నివేదించింది. ముఖ్యంగా సాధారణ ఫీచర్‌ఫోన్ వాడే వినియోగదారులు, ఈ జియో 4జీ ఫీచర్ ఫోన్ ద్వారా 4జీ నెట్‌వర్క్‌కు అప్‌గ్రేడ్ కావాలని భావించడమే జియోఫోన్ గ్రోతఖ్‌కు కారణాలని కౌంటర్‌పాయింట్ అసోసియేట్ డైరెక్టర్ తరుణ్ పాఠక్ తెలిపారు. నగదు వాపసు పొందడం ద్వారా, జియోఫోన్‌ను ఉచితంగా వినియోగించుకునే వీలు దక్కడం కూడా కలిసి వచ్చిందని పేర్కొన్నారు. అలాగే జియో 4జీ ఫీచర్ ఫోన్లో 153 రూపాయల రీచార్జ్ ప్లాన్‌లో 1 జీబీ డేటాను ఆఫర్ చేయడం కూడా కస్టమర్లను బాగా ఆకట్టుకుందని తెలిపారు. -
టాప్ బ్రాండుగా జియో ఫోన్
50 కోట్ల మంది ఫీచర్‌ఫోన్ వినియోగదారులను దృష్టిలో ఉంచుకుని, రిలయన్స్ జియో తీసుకొచ్చిన జియోఫోన్ మార్కెట్లో దూసుకుపోతోంది. భారత్‌లో టాప్ ఫీచర్ ఫోన్ బ్రాండుగా పేరు తెచ్చేసుకుంది. 27 శాతం మార్కెట్ షేరుతో గతేడాది అక్టోబర్-డిసెంబర్ క్వార్టర్లో రిలయన్స్ జియోఫోన్ దిగ్గజ టాప్ ఫీచర్ ఫోన్ బ్రాండుగా నిలిచినట్టు కౌంటర్‌పాయింట్ రీసెర్చ్‌లో తెలిసింది. క్వార్టర్ చివరిలో ఈ ఫోన్ సరఫరా అత్యధికంగా నమోదైనట్టు తెలిపింది. డిమాండ్, సప్లై గ్యాప్‌ను ఇది సమర్థవంతంగా నిర్వహించిందని కౌంటర్‌పాయింట్ పేర్కొంది. ఇంత భారీ మొత్తంలో ఈ ఫోన్ అమ్ముడుపోవడానికి ప్రధాన కారణం రికార్డు స్థాయిలో ప్రీ-ఆర్డర్లు, విలువైన నవీకరణగా చాలా మంది ఫీచర్ ఫోన్ యూజర్లు గుర్తించడమేనని కౌంటర్‌పాయింట్ అసోసియేట్ డైరెక్టర్ తరుణ్ పథక్ తెలిపారు. స్మార్ట్‌ఫోన్ స్థాయిలో జియోఫోన్ ఉండటం, ఉచితంగా అందించడం కంపెనీకి బాగా కలిసి వచ్చిందన్నారు. అదనంగా కొన్నేళ్ల తర్వాత ఈ ఫోన్‌పై క్యాష్‌బ్యాక్ ప్రకటించిన వ్యూహం కూడా ఫలించిందని చెప్పారు. కాగ, గతేడాది జూలై 21న లాంచ్ చేసిన ఈ ఫీచర్ ఫోన్ 4జీ, వాయిస్ఓవర్ ఎల్టీఈ టెక్నాలజీతో మార్కెట్లోకి వచ్చింది. తొలుత రూ.1500 చెల్లించినప్పటికీ, ఇది ఉచితమే. మూడేళ్ల తర్వాత ఈ మొత్తాన్ని కంపెనీ రీఫండ్ చేయనుంది. 2.4 అంగుళాల డిస్ప్లే, 2000ఎంఏహెచ్ బ్యాటరీ, సింగిల్ నానో-సిమ్ స్లాట్, మైక్రో ఎస్డీ కార్డు స్లాట్ దీనిలో ఫీచర్లు. జియోఫోన్‌ను మరింత ఆకర్షణీయంగా చేయడానికి, నెలవారీ రూ.153 ప్యాక్‌పై ఎక్కువ డేటాను కూడా కంపెనీ ఆఫర్ చేస్తోంది. దీనిలోనే ఏడాది పాటు రూ.99 ప్రైమ్ సబ్స్క్రిప్షన్ కూడా ఉంది. జనవరి 26 నుంచి రోజుకు 1జీబీ బదులు జియోఫోన్‌పై 1.5జీబీ డేటా లభించనుంది. -
రూ.249కే ఫీచర్ ఫోన్!
ప్రపంచంలో అతిపెద్ద స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో భారత్ ఒకటిగా ఉంది. స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌తో పాటు ఫీచర్ ఫోన్ మార్కెట్లోనూ భారత్ దూసుకుపోతుంది. ఇటీవల కాలంలో కస్టమర్లు ఎక్కువగా చౌకైన ఫోన్లపై మొగ్గుచూపుతుండటం దీనికి కారణంగా నిలుస్తోంది. అంతేకాక రిలయన్స్, జియో ఫోన్‌ను ప్రవేశపెట్టి, ఫీచర్ ఫోన్ మార్కెట్‌కు మరింత పాపులారిటీ తీసుకొచ్చింది. దీంతో ఫీచర్ ఫోన్ మార్కెట్లో కొత్త కొత్త బ్రాండులకు డిమాండ్ పెరుగుతోంది. ఈ బ్రాండులు కూడా అత్యంత సరసమైన ధరల్లో మార్కెట్లోకి వస్తున్నాయి. వాటిలో ఐకాల్, పీస్, వివా హ్యాండ్సెట్లు చౌకైన ధరలతో కస్టమర్లను ఎక్కువగా ఆకట్టుకుంటున్నాయి. ఆశ్చర్యకంగా ఐకాల్ బ్రాండు తన ఫీచర్‌ఫోన్ ఐకాల్ కే71ను అత్యంత తక్కువగా 249 రూపాయలకే ఆఫర్ చేస్తుంది. ఎక్స్‌క్లూజివ్ ఈ ఫీచర్ ఫోన్ షాప్ క్లూస్‌లో మాత్రమే అందుబాటులో ఉంచింది. ఈ డివైజ్ 800 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉంది. అంటే టాక్‌టైమ్ పరంగా నాలుగు గంటల వరకు, స్టాండ్‌బై టైమ్ 24 గంటల వరకు ఉండనుంది. 1.4 అంగుళాల మోనోక్రోమ్ డిస్ప్లే, టార్చ్, ఎఫ్ఎం ప్లేయర్, ఏడాది పాటు వారెంటీని ఈ ఫీచర్ ఫోన్ అందిస్తోంది. రెడ్, బ్లూ, డార్క్ బ్లూ, ఎల్లో రంగుల్లో ఈ ఫీచర్ ఫోన్ అందుబాటులో ఉంది. పీస్ పీ3310, వివా వీ1 హ్యాండ్సెట్లు కూడా చౌకగా 349 రూపాయలకే లభ్యమవుతున్నాయి. -
రూ. 346కే ఫీచర్ ఫోన్
సాక్షి, న్యూఢిల్లీ: అతి తక్కువ ధరకే ఫీచర్ ఫోన్. ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ సంచలన ప్రకటన చేసింది. కేవలం రూ. 499 రూపాయలకే అతి తక్కువ ధరకే ఫీచర్ ఫోన్‌ను తీసుకొచ్చింది. బీఎస్ఎన్ల్ మనోజ్ శర్మ జైపూర్‌లో దీన్ని లాంచ్ చేశారు ‘డీ టెల్ డీ 1’ పేరుతో దీని అసలు ధర రూ. 346. అయితే ఈ ఫీచర్ ఫోన్‌తో అందిస్తున్న తారిఫ్ ప్లాన్‌తో(రూ.153) కలిపి ఈ ఫోన్ ధరను రూ. 499గా బీఎస్ఎన్ఎల్ ప్రకటించింది. బీఎస్ఎన్ఎల్ అఫీషియల్ లింక్‌లో దీన్ని ఆర్డర్ చేసుకోవచ్చు. అలాగే మరో ఆఫర్ కూడా ఉంది. డీ టెల్ డీ 1 కొనుగోలుతో రూ.153 టాక్ టైం. ఒక సంవత్సరం వాలిడిటీ. అయితే దీంట్లో ఎలాంటా డేటా సేవలుఅందుబాటులో లేవు. రిటైల్ గ్రామీణ ప్రాంత ప్రజలకు మొబైల్ ఫోన్, మొబైల్ సర్వీసులు , ముఖ్యంగా వాయిస్ కాలింగ్ సేవలు అందించేందుకు డీటె ల్ డి 1 చాలా ఉపయోపడుతుందని బిఎస్ఎన్ఎల్ ఒక పత్రికా ప్రకటనలో పేర్కొంది. ప్రధానమంత్రి నరేంద్రమోడీ 'సబ్ కా సాత్ సబ్కా వికాస్' పథకంలో భాగంగా దీన్ని తీసుకొస్తున్నట్టు తెలిపింది. ఫోన్ బుక్, లౌడ్ స్పీకర్, టార్చ్ లైట్ తదితర ఫీచర్లు ఇందులో పొందుపర్చినట్టు పేర్కొంది. 1.44 అంగుళాల మోనో క్రోమ్ డిస్ప్లే 2 జీ సింగిల్ సిమ్, 650 ఎంఏహెచ్ బ్యాటరీ -
చౌకైన జియో స్మార్ట్‌ఫోన్ కూడా వస్తోంది...
న్యూఢిల్లీ : జీరో జియోఫోన్ అంటూ ఫీచర్ ఫోన్ మార్కెట్లో సంచలన ఆవిష్కరణ సృష్టించిన రిలయన్స్ జియో ఇన్ఫోకామ్, ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌పై దృష్టిపెట్టింది. ఫీచర్ ఫోన్ మాదిరి చౌకైన 4జీ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేయాలని జియో చూస్తున్నట్టు చైనీస్ చిప్ తయారీదారి స్ప్రెడ్ట్రమ్ కమ్యూనికేషన్ చైర్మన్ లియో లి చెప్పారు. ఆ హ్యాండ్‌సెట్‌కు పరికరాలను సరఫరాల చేయడం కోసం జియో స్ప్రెడ్‌ట్రమ్‌తో చర్చలు జరిపినట్టు తెలిసింది. ఇప్పటికే జియో ఫీచర్‌ఫోన్‌కు పరికరాలను ఇది అందిస్తోంది. ఈ ఏడాది ముగింపు వరకు షాంఘైకి చెందిన తమ కంపెనీ జియోకు చెందిన 10 మిలియన్ 4జీ ఫీచర్ ఫోన్లకు చిప్స్‌ను సరఫరా చేయనుందని లియో లి తెలిపారు. అతి తక్కువ ధరలో జియో తీసుకొస్తున్న స్మార్ట్‌ఫోన్ 4 అంగుళాల స్క్రీన్‌ను కలిగి ఉంటుందని లి తెలిపారు. అయితే ఈ విషయాన్ని ఇంకా జియో ధృవీకరించలేదు. ప్రపంచవ్యాప్తంగా భారత్ అత్యంత ముఖ్యమైన మార్కెట్ అని లి తెలిపారు. తాము జియోతో కలిసి చాలా సన్నిహితంగా పనిచేస్తున్నామని, తాము 4జీ ఫీచర్ఫోన్లను అత్యంత తక్కువ ధరకు అందిస్తున్నామని, ఈ ఏడాది ముగింపు వరకు 10 మిలియన్ డివైజ్‌లను విక్రయించనున్నట్టు పేర్కొన్నారు. 4జీ ఫీచర్‌ఫోన్ల లాంచింగ్‌తో ముఖేష్ అంబానీకి చెందిన జియో మొబైల్ ఫోన్ మార్కెట్లో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. గ్రూప్ కంపెనీ అయిన రిలయన్స్ రిటైల్‌లో మూడేళ్ల డిపాజిట్ కింద రూ.1500 కట్టి ఈ డివైజ్‌ను వినియోగదారులు కొనుగోలు చేయవచ్చు. తాజాగా జియో అత్యంత చౌకగా స్మార్ట్‌ఫోన్‌ను కూడా అందించబోతున్నట్టు స్ప్రెడ్ట్రమ్ పేర్కొంది. మరోవైపు స్థానిక హ్యాండ్సెట్ తయారీదారులతో కూడా భాగస్వామ్యం ఏర్పరచుకోవాలని స్ప్రెడ్ట్రమ్ చూస్తోంది. కానీ మార్కెట్ వాటాను చైనీస్ ప్లేయర్లకు ఇచ్చేందుకు దేశీయ కంపెనీలు సుముఖంగా లేనట్టు తెలుస్తోంది. -
ఈ సెల్ఫీ ఫీచర్ ఫోన్ ధర తెలిస్తే..
సాక్షి,న్యూఢిల్లీ: దేశీయ మొబైల్ మేకర్ ఎం.టెక్ అతి తక్కువ ధరకు ఫీచర్ ఫోన్‌ను లాంచ్ చేసింది. జీ 24పేరుతో ఈ సెల్ఫీ ఫీచర్ ఫోన్‌ను మంగళవారం విడుదల చేసింది. బడ్జెట్ ధరలో 1.8 అంగుళాల డిస్ప్లే, 1000 ఎంఏహెచ్ బ్యాటరీ, డ్యుయల్ సిమ్, డ్యుయల్ డిజిటల్ కెమెరా లాంటి ఫీచర్లతో దీన్ని వినియో గదారులకు అందిస్తోంది. ప్రముఖ మొబైల్, టెలికాం కంపెనీలన్నీ రూ.1000-1500 మధ్య ఫీచర్ ఫోన్ తీసుకొస్తే. ఎం.టెక్మాత్రం కేవలం రూ. 899 లుగా దీని ధరను ప్రకటించడం విశేషం. 16జీబీ దాకా ఇంటర్నల్ మొమరీని విస్తరించుకోవచ్చని ఎంటెక్ ఇన్ఫర్మటిక్స్ లిమిటెడ్ డైరెక్టర్ గౌతం కుమార్ జైన్ వెల్లడించారు. తమ తాజా సెల్ఫీ ఫీచర్ ఫోన ‘జీ 24’ బ్యాటరీ 7గంటల టాక్ టైం, 300 గంటల స్టాండ్ బై అందిస్తుందని వివరించారు. -
జియో ఫోన్లు బంద్..జియో కొత్తఎత్తుగడ
సాక్షి, ముంబై: ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ జియో మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఉచిత ఆఫర్లు, ఉచిత డేటా ఆఫర్లతో ప్రత్యర్థి కంపెనీలకు గుబులు పుట్టించిన జియో ఇపుడు తన గేమ్‌ప్లాన్‌ను మార్చింది. ముఖ్యంగా జియో ఫీచర్‌ఫోన్‌లో ఫేస్బుక్, వాట్సాప్‌లాంటి సోషల్‌మీడియా సైట్ల సపోర్టు లేకపోవడంతో తాజాగా ఆండ్రాయిడ్ ఫోన్లను ఉచితంగా అందించనుందని సమాచారం. అన్ని సోషల్ మీడియా యాప్‌ల మద్దతుతో ఈ ఉచిత ఆండ్రాయిడ్ ఫోన్లను అందుబాటులోకి తీసుకురానుందట. ముఖ్యంగా టెలికాం మార్కెట్లో ప్రధాన పోటీదారులైన ఎయిర్ టెల్, వొడాఫోన్లకు షాకిచ్చేలా జియో పావులు కదుపుతోంది. ఈ నేపథ్యంలో జియో ఫీచర్ ఫోన్ ఉత్పత్తిని నిలిపివేసి ఆండ్రాయిడ్ ఫోన్ల తయారీపై దృష్టి కేంద్రీకరించిందనీ ఒక నివేదిక వెల్లడించింది. అంతేకాదు ఫేస్బుక్, గూగుల్‌లాంటి సంస్థలతో ఇప్పటికే సంప్రదింపులు కూడా చేపట్టినట్టు నివేదించింది. మరోవైపు ఆండ్రాయిడ్ ఫోన్ అంచనాలను జియో ప్రతినిధి తిరస్కరించలేదు..కానీ, త్వరలోనే జియో ఫోన్ బుకింగ్ తేదీని ప్రకటించనున్నట్లు చెప్పారు. 'ఇండియా కా స్మార్ట్‌ఫోన్ ద్వారా డిజిటల్ ఇండియాకు తాము కట్టుబడి ఉన్నామన్నారు. జియో ఫోన్ బుక్ చేసుకున్న 60లక్షల భారతీయులను స్వాగతించిన ఆయన త్వరలోనే జియోఫోన్ తదుపరి బుకింగ్ తేదీని త్వరలోనే ప్రకటించనున్నట్లు ప్రతినిధి తెలిపారు. -
మోస్ట్ ఎవైటెడ్ జియో ఫోన్..అద్భుత ఫీచర్లతో
ముంబై: ఎప్పటినుంచో ఊరిస్తున్న జియో ఫీచర్ ఫోన్‌ను రిలయన్స్ లాంచ్ చేసింది. 40వ రిలయన్స్ ఏజీఎం సమావేశంలో ఇండియాస్ ఇంటిలిజెంట్ ఫోన్ అంటూ ముకేష్ అంబానీ ఈ ఫోన్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ముకేశ్ వారసులు ఈశా, ఆకాశ్ యూనిక్ రెవల్యూషనరీ జియో ఫీచర్ ఫోన్‌ను పరిచయం చేశారు. వాయిస్ కమాండ్‌తో ఈ ఫోన్ పని చేస్తుంది. ఫోన్ చేయాలన్నా, ఎస్ఎంఎస్ సెండ్ చేయాలన్సా వాయిండ్ కమాండ్‌తో సులువుగా చేసుకోవచ్చు. అన్ని రకాల పేమెంట్ సర్వీసులను ఈ ఏడాది చివరినాటికి ప్రారంభించనున్నామని తెలిపారు. 'భాషా అనేక్ భారత్ ఏక్' అంటూ 22 భాషల్లో మొబైల్ యాక్సెస్ ఉంటుందన్నారు. జియో ఫీచర్ ఫోన్ వినియోగదారులకు రూ.153/- ప్లాన్ ద్వారా నెల రోజుల వ్యాలిడిటీతో అన్ లిమిడెట్ డేటాను ఉచితంగా అందిస్తామని ముకేష్ ప్రకటించారు. అంబానీ కొడుకు ఆకాశ్, కూతురు ఈషా, కిరణ్ థామస్‌లు ఫోన్ ఫీచర్స్‌ను వివరించారు. చిన్న సైజులో కనిపిస్తున్న ఫోన్లో వందల కొద్దీ స్మార్ట్ ఫీచర్లు ఉన్నట్లు ఈషా చెప్పారు. 1. వాయిస్ కమాండ్ ఫోన్ కిరణ్, ఆకాశ్‌లు జియో ఫోన్లతో వార్షిక సర్వసభ్య సమావేశంలో ప్రాక్టికల్‌గా కాల్ చేసి చూపించారు. కిరణ్, ఆకాశ్‌కు కాల్ చేయమని చెప్పగానే ఆటోమేటిక్‌గా కాల్ ఆకాశ్‌ను రీచ్ అయింది. అంతేకాదు మెసేజ్‌లు కూడా వాయిస్ కమాండ్‌తో పంపించింది జియో ఫోన్. 2. ప్రీలోడెడ్ అప్లికేషన్స్ జియో అందించే అన్ని రకాల ప్రీ లోడెడ్ అప్లికేషన్స్ జియో ఫోన్లో ఉచితంగా వినియోగదారులు అందుకోనున్నారు. 3. ఎమర్జెన్సీ కాంటాక్ట్ ఫోన్లోని నెంబర్ 5ను నొక్కిపట్టుకోవడం ద్వారా ఎమర్జెన్సీ కాంటాక్ట్‌కు ప్రమాదంలో ఉన్నప్పుడు మెసేజ్ పంపుకోవచ్చు. దీన్ని కూడా ప్రాక్టికల్‌గా ఆకాశ్, కిరణ్‌లు వార్షిక సమావేశంలో చేసి చూపించారు. ఎమర్జెన్సీ మెసేజ్‌లో లొకేషన్‌తో పాటు లాంగిట్యూడ్, లాటిట్యూడ్ వివరాలు మెసేజ్‌లో వెళ్లాయి. రెహమాన్ వందేమాతరం, బాహుబలి -2 ట్రైలర్ , ప్రధానమంత్రి నరేంద్రమోదీ మన్ కీ బాత్ ప్రోగ్రాంలను జియో ఫోన్లో ప్లే చేసి వినిపించారు కూడా.