
సాక్షి,న్యూఢిల్లీ: దేశీయ మొబైల్ మేకర్ ఎం.టెక్ అతి తక్కువ ధరకు ఫీచర్ ఫోన్‌ను లాంచ్ చేసింది. జీ 24పేరుతో ఈ సెల్ఫీ ఫీచర్ ఫోన్‌ను మంగళవారం విడుదల చేసింది. బడ్జెట్ ధరలో 1.8 అంగుళాల డిస్‌ప్లే, 1000 ఎంఏహెచ్ బ్యాటరీ, డ్యుయల్ సిమ్, డ్యుయల్ డిజిటల్ కెమెరా లాంటి ఫీచర్లతో దీన్ని వినియో గదారులకు అందిస్తోంది. ప్రముఖ మొబైల్, టెలికాం కంపెనీలన్నీ రూ.1000-1500 మధ్య ఫీచర్ ఫోన్ తీసుకొస్తే. ఎం.టెక్‌మాత్రం కేవలం రూ. 899 లుగా దీని ధరను ప్రకటించడం విశేషం.
16జీబీ దాకా ఇంటర్నల్ మొమరీని విస్తరించుకోవచ్చని ఎంటెక్ ఇన్‌ఫర్మటిక్స్ లిమిటెడ్ డైరెక్టర్ గౌతం కుమార్ జైన్ వెల్లడించారు. తమ తాజా సెల్ఫీ ఫీచర్ ఫోన ‘జీ 24’ బ్యాటరీ 7గంటల టాక్ టైం, 300 గంటల స్టాండ్ బై అందిస్తుందని వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment