M.Tech
-
ఎంటెక్: పాత కోర్సులకు కత్తెర.. 7 కొత్త కోర్సులు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కాలేజీల్లో కొత్తగా పలు ఎంటెక్ కోర్సులు ప్రవేశపెట్టేందుకు జేఎన్టీయూ చర్యలు చేపట్టింది. గతేడాది కొత్త కోర్సుల్లో ఆరి్టఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషీన్ లెర్నిం గ్, డేటా సైన్స్ వంటి ప్రధాన సబ్జెక్టులతోనే కోర్సులకు అనుబంధ గుర్తింపు ఇవ్వగా, ఈసారి వాటి సంఖ్య పెంచి 7 రకాల కొత్తకోర్సులు చేపట్టేందుకు అవకాశం కల్పించింది. ఈ జాబితాలో.. కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ (సీఎస్ఈ)లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్, సైబర్ సె క్యూరిటీ.. సివిల్ ఇంజనీరింగ్‌లో కంప్యూటర్ ఎయిడెడ్ స్ట్రక్చరల్ ఇంజనీరింగ్.. ఈసీఈలో ఎంబెడెడ్ సిస్టమ్ అండ్ వీఎల్ఎస్ఐ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, మైక్రో ఎల్రక్టానిక్స్ అండ్ వీఎల్ఎస్ఐ డిజైన్.. మెకా నికల్లో మెకట్రానిక్స్ పీజీ కోర్సులు ఉన్నాయి. కొన్ని కాంబినేషన్లకు కత్తెర! గతేడాది బీటెక్ కంప్యూటర్ సైన్స్‌లో (సీఎస్ఈ) సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్, సైబర్ సెక్యూరిటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషీన్ లెర్నింగ్, డేటా సైన్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, సీఎస్ఈ నెట్వర్క్స్ కోర్సులకు జేఎన్టీయూ అనుబంధ గుర్తింపు జారీ చేసింది. అయితే ఈసారి (2021–22లో) బీటెక్ సీఎస్ఈలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డాటా సైన్స్, కంప్యూటర్ సైన్స్ అండ్ డిజైన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషీన్ లెరి్నంగ్, మెకానికల్‌లో ఆటోమేషన్ అండ్ రోబోటిక్స్‌కు అనుబంధ గుర్తిం పు ఇస్తామని ప్రకటించింది. ఇందులో కంప్యూటర్ సైన్స్ అండ్ డిజైన్, ఆటోమేషన్ అండ్ రోబోటిక్స్‌ను ప్రత్యేక కోర్సులుగా ఇచ్చేందుకు చర్యలు చేపట్టింది. ఈ కోర్సులకు కాలేజీల యాజమాన్యాలు దరఖాస్తు చేసుకోవచ్చని జేఎనీ్టయూ వెల్లడించింది. అయితే గతేడాది బీటెక్‌లో ఇచి్చన సీఎస్ఈ నెట్వర్క్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్, సైబర్ సెక్యూరిటీ కోర్సులకు అనుబంధ గుర్తింపు ఇస్తారా, లేదా? అన్న దానిపై స్పష్టత ఇవ్వలేదు. పాత వివరాలతోనే.. రాష్ట్రంలోని వృత్తి, సాంకేతిక విద్యా కాలేజీలకు అనుబంధ గుర్తింపు జారీ చేసేందుకు నిర్వహించే ‘ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీల (ఎఫ్ఎఫ్సీ)’తనిఖీలు ఈసారి నిర్వహించే అవకాశం కనిపించడం లేదు. గత ఏడాది కరోనా ఎఫెక్ట్‌తో తనిఖీలు చేయలేదు. ప్రస్తుతం కూడా కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో.. రెండేళ్ల కిందటి తనిఖీలు, గతేడాది కాలేజీలు అందజేసిన డాక్యుమెంట్ల పరిశీలన, తాజాగా అందజేసే అఫిడవిట్ల ఆధారంగానే అనుబంధ గుర్తింపు జారీ చేసేందుకు యూనివర్సిటీలు కసరత్తు చేస్తున్నాయి. మే మొదటి లేదా రెండో వారంలో ‘అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ)’నుంచి కాలేజీలకు, కోర్సులకు అనుమతులు లభించనున్నాయి. ఆ వెంటనే రాష్ట్ర యూనివర్సిటీలు ఆయా కాలేజీలకు అనుబంధ గుర్తింపు జారీ కోసం దరఖాస్తులు స్వీకరించనున్నాయి. మరోవైపు ఈసారి ఇంకో 12 వరకు ఇంజనీరింగ్ కాలేజీలు మూతపడే అవకాశం ఉన్నట్టు తెలిసింది. చదవండి: ఆ రెండు సబ్జెక్టులు రాకుంటే.. ఇంజనీరింగ్‌లో సాధ్యమేనా?! -
ఈ సెల్ఫీ ఫీచర్ ఫోన్ ధర తెలిస్తే..
సాక్షి,న్యూఢిల్లీ: దేశీయ మొబైల్ మేకర్ ఎం.టెక్ అతి తక్కువ ధరకు ఫీచర్ ఫోన్‌ను లాంచ్ చేసింది. జీ 24పేరుతో ఈ సెల్ఫీ ఫీచర్ ఫోన్‌ను మంగళవారం విడుదల చేసింది. బడ్జెట్ ధరలో 1.8 అంగుళాల డిస్ప్లే, 1000 ఎంఏహెచ్ బ్యాటరీ, డ్యుయల్ సిమ్, డ్యుయల్ డిజిటల్ కెమెరా లాంటి ఫీచర్లతో దీన్ని వినియో గదారులకు అందిస్తోంది. ప్రముఖ మొబైల్, టెలికాం కంపెనీలన్నీ రూ.1000-1500 మధ్య ఫీచర్ ఫోన్ తీసుకొస్తే. ఎం.టెక్మాత్రం కేవలం రూ. 899 లుగా దీని ధరను ప్రకటించడం విశేషం. 16జీబీ దాకా ఇంటర్నల్ మొమరీని విస్తరించుకోవచ్చని ఎంటెక్ ఇన్ఫర్మటిక్స్ లిమిటెడ్ డైరెక్టర్ గౌతం కుమార్ జైన్ వెల్లడించారు. తమ తాజా సెల్ఫీ ఫీచర్ ఫోన ‘జీ 24’ బ్యాటరీ 7గంటల టాక్ టైం, 300 గంటల స్టాండ్ బై అందిస్తుందని వివరించారు. -
సీట్లకు కోతే కోత..!
బీటెక్, ఎంటెక్, ఎంబీఏ, ఎంఫార్మసీ కాలేజీల్లో భారీగా సీట్ల తగ్గింపు సాక్షి, హైదరాబాద్: ఈసారి బీటెక్, బీఫార్మసీ కాలేజీల్లోనే కాదు.. ఎంటెక్, ఎంబీఏ, ఎం.ఫార్మసీ కాలేజీల్లోనూ సీట్ల సంఖ్య భారీగా తగ్గనున్నట్లు సమాచారం. ఆయా కాలేజీల్లో అనేక బ్రాంచీలకు అధికారులు కోత విధించినట్లు తెలిసింది. బీటెక్‌లో 45 వేల నుంచి 50 వేల సీట్లకు కోత పడే అవకాశం ఉండగా.. ఎంబీఏ, ఎంటెక్, ఎం.ఫార్మసీలో ఉన్న దాదాపు 70 వేల సీట్లలో 25 వేల సీట్ల వరకు కోత పడనున్నట్లు తెలిసింది. ఇంజనీరింగ్, ఫార్మసీ కాలేజీల అనుబంధ గుర్తింపు, వాటిల్లో ఫీజులపై ఉత్తర్వులు జారీ అవుతాయని శనివారం అర్ధరాత్రి వరకు కాలేజీ యాజమాన్యాలు ఉత్కంఠతో ఎదురుచూశాయి. అనుబంధ గుర్తింపు పొందిన కాలేజీల జాబితా ప్రకటన ఇదిగో అదిగో అని చెప్పినా.. అర్ధరాత్రి వరకు జారీ కాలేదు. ఫీజుల జీవోదీ అదే పరిస్థితి. అర్ధరాత్రి వరకు అధికారులు కాలేజీ వారీగా ఫీజులను పరిశీలిస్తూనే ఉన్నారు. ఇక ఆదివారం ఉదయమే ఫీజుల జీవో, అనుబంధ గుర్తింపు పొందిన కాలేజీల జాబితాను ప్రకటించే అవకాశం ఉంది. -
‘పీజీ ఉత్తీర్ణులు ఇంజినీరింగ్ పాఠాలు చెప్పొచ్చు’
విజయవాడ : ఎంటెక్, ఎమ్మెస్సీ, ఎంసీఏ విద్యార్హత కలిగినవారు ఇంజినీరింగ్ పాఠ్యాంశాలను బోధించవచ్చని జాతీయ సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) సోమవారం ప్రకటించింది. దీనిపై వివాదం నడుస్తున్న నేపథ్యంలో తాజాగా ఏఐసీటీఈ ఇచ్చిన ఉత్తర్వుల వల్ల రాష్ట్రంలోని సుమారు 20 వేల మంది అభ్యర్థులకు ఊరట కలిగింది. ఈ ఏడాది జనవరి 6వ తేదీన ఇంజినీరింగ్ చదువులకు ఎంటెక్, ఎంసీఏ, ఎమ్మెస్సీ విద్యార్హత కలిగినవారికి బోధించే సామర్థ్యం లేదని ఏఐసీటీఈ ప్రకటించింది. దీనిపై ప్రైవేటు ఇంజినీరింగ్ కళాశాల్లో ఆయా విద్యార్హత కలిగిన ఫ్యాకల్టీలు రోడ్డున పడతారని, ఇటీవల నగరానికి వచ్చిన కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి స్మృతి ఇరానీకి ఇంజినీరింగ్ కళాశాలల ఫ్యాకల్టీ అసోసియేషన్ వినతి పత్రం సమర్పించింది. సోమవారం ఢిల్లీలో జరిగిన ఏఐసీటీఈ సమావేశంలో ఎమ్మెస్సీ, ఎంసీఏ విద్యార్హత కలిగిన అభ్యర్థులు ఇంజినీరింగ్ పాఠ్యాంశాలను బోధించవచ్చని తీర్మానించింది. సంబంధిత వివరాలను ఏఐసీటీఈ వెబ్సైట్లో పొందుపరిచింది. -
ఎంత పని సేశావురా..?
ఆర్థిక భారంతో ఎంటెక్ చదవలేక గాండ్లపెంట మండలం కత్తివారిపల్లికి చెందిన ఇంజనీరింగ్ (సివిల్) పట్టభద్రుడు పాళ్యం జయచంద్రారెడ్డి(22) ఆదివారం రాత్రి పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ‘ఉద్యోగం రాకపోతే ఏదో ఒక పని సేసుకుని బతికేటోళ్లం. పెద్ద సదువు సదవ లేదని మాకు అన్యాలం సేసి పోయినావురా.. సెట్టంట ఎదిగాడని సంబరపడితే ఇట్టెందుకు సేత్తివిరా..’ అంటూ తల్లి శివమ్మ, బంధువులు గుండెలవిసేలా రోదించారు. తెలివైన విద్యార్థి ఇలా తనువు చాలించడంపై గ్రామస్తులు కంట నీరు పెట్టారు. తండ్రి పాళ్యం వెంకటరమణారెడ్డి తనకున్న మూడున్నర ఎకరాల పొలంతో బతుకు బండిని భారంగా లాగిస్తుండగా.. చేతికొచ్చిన కొడుకు ఇలా బలవన్మరణానికి పాల్పడటం అందరినీ కలచివేసింది. సోదరి రాజేశ్వరి వివాహ నిశ్చితార్థంతో సోమవారం కళకళలాడాల్సిన ఇల్లు రోదనలతో దద్దరిల్లింది. -
స్టార్టప్స్‌కు సదుపాయాలెన్నో
మై క్యాంపస్ లైఫ్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) - హైదరాబాద్.. భాగ్యనగరం కీర్తికిరీటంలో మరో కలికితురాయి. బీటెక్, ఎంటెక్, పీహెచ్డీ వంటి కోర్సులను అందిస్తూ తన విశిష్టతను చాటుకుంటోంది. ఇక్కడ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో సెకండియర్ చదువుతున్న రావుల మనీశ్చంద్రరెడ్డి తన క్యాంపస్ లైఫ్ ముచ్చట్లను మనతో పంచుకుంటున్నారిలా.. క్యాంపస్‌లో సాధారణంగా ఉదయం 8.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు తరగతులు, ప్రాక్టికల్స్ నిర్వహిస్తారు. ఈ సమయంలో ఆయా బ్రాంచ్‌లు, సబ్జెక్టులను బట్టి క్లాసులు ఉంటాయి. మధ్యాహ్నం ఒంటి గంట కల్లా తరగతులు ముగుస్తాయి. లంచ్ తర్వాత 2.30 నుంచి 5.30 గంటల వరకు ప్రాక్టికల్స్, ల్యాబ్ వర్క్ ఉంటుంది. ఫ్యాకల్టీ.. ఎంతో ఫ్రెండ్లీ ఫ్యాకల్టీలో ఎక్కువ మంది యువతే. స్టూడెంట్స్‌కు.. ఫ్యాకల్టీ మధ్య పెద్దగా వయసులో తేడా లేదు. అందువల్ల విద్యార్థులను చక్కగా అర్థం చేసుకుంటారు. ఎప్పటికప్పుడు కొత్త బోధన పద్ధతులు అమలు చేస్తారు. మేము ఫ్యాకల్టీ నుంచి ఏమి ఆశిస్తున్నామో సులువుగా గ్రహిస్తారు. స్నేహపూరిత వాతావరణంలో అన్ని విషయాలపైనా అవగాహన కల్పిస్తారు. పరిశోధనలకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. విద్యార్థులను పరిశోధనల దిశగా ప్రోత్సహిస్తారు. సబ్జెక్టుపరంగా ఏవైనా సందేహాలు ఎదురైతే మెయిల్ ద్వారా ఫ్యాకల్టీని సంప్రదించే వీలుంది లేదా స్వయంగా ఎప్పుడైనా ఫ్యాకల్టీని కలవొచ్చు. మూస పద్ధతికి స్వస్తి బోధన వినూత్నంగా ఉంటుంది. ఒక్కో పీరియడ్ గంటన్నరపాటు ఉంటుంది. విద్యార్థులతోనే పాఠాలు చెప్పిస్తారు లేదా విద్యార్థులు ప్రశ్నలు అడిగితే ప్రొఫెసర్ సమాధానాలివ్వడం.. నిజ జీవితంలో ఎదురవుతున్న వివిధ సమస్యలకు పరిష్కారాలు కనుగొనడం లేదా పాఠం చెప్పి.. ప్రాక్టికల్స్ చేయించడం ఇలా బోధనలో వివిధ పద్ధతులను పాటిస్తారు. విద్యార్థులే ఆయా అంశాలపై సొంతంగా ఆలోచించేలా, నేర్చుకునేలా ప్రోత్సహిస్తారు. వివిధ అంశాలపై అవగాహన కల్పించడానికి పవర్‌పాయింట్ ప్రజెంటేషన్స్, ప్రొజెక్టర్, ఆన్‌లైన్‌ను వినియోగిస్తారు. ఆన్లైన్లో కోర్సులు అందించే ఎన్పీటీఈఎల్, ఎడెక్స్, కోర్సెరా ద్వారా కూడా విద్యార్థులు కోర్సులు చేస్తుంటారు. ఇంజనీరింగ్ కోర్సులతోపాటే ప్రతి విద్యార్థీ లిబరల్ ఆర్ట్స్ కోర్సులను అభ్యసించాలి. నేను ఇప్పటివరకు క్రియేటివ్ ఆర్ట్స్, వెస్ట్రన్ పెయింటింగ్, మానవ సంబంధాలపై సోషల్ మీడియా ప్రభావం, షార్ట్‌స్టోరీ రైటింగ్, ఎకనామిక్స్ బేసిక్ కాన్సెప్ట్స్ వంటివాటిని అధ్యయనం చేశాను. స్టార్టప్స్‌కు ఎంతో ప్రోత్సాహం యువ పారిశ్రామికవేత్తలుగా రాణించాలనుకునేవారికి క్యాంపస్‌లో మంచి అవకాశాలున్నాయి. ఇన్స్టిట్యూట్లో ప్రత్యేకంగా ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ సెల్, ఇంక్యుబేషన్ సెంటర్ ఉన్నాయి. సొంత స్టార్టప్ ఏర్పాటు చేయాలనుకునేవారికి ఈ-సెల్ ఆధ్వర్యంలో సూచనలు, సలహాలు అందిస్తారు. అంతేకాకుండా ఐడియా కాంపిటీషన్స్, వర్క్‌షాప్స్ నిర్వహిస్తారు. ఇంక్యుబేషన్ సెంటర్ పరిధిలో ప్రస్తుతం మూడు స్టార్టప్స్ విజయవంతంగా నడుస్తున్నాయి. స్టార్టప్ ఏర్పాటు చేసేవారికి కార్యాలయం కోసం స్థలం, కంప్యూటర్స్, ఇంటర్నెట్, ప్రింటర్స్, ఫ్యాక్స్, టెలిఫోన్ వంటి సదుపాయాలు కల్పిస్తారు. క్యాంపస్.. కలర్‌ఫుల్ ప్రతి ఏటా క్యాంపస్‌లో టెక్నికల్ ఫెస్ట్, కల్చరల్ ఫెస్ట్ కూడా నిర్వహిస్తారు. కల్చరల్ ఈవెంట్స్‌లో భాగంగా డ్యాన్స్, పాటలు, డ్రామాలు, చిన్నచిన్న స్కిట్లు వంటి మొత్తం 180 ఈవెంట్లు ఉంటాయి. నేను కల్చరల్ ఫెస్ట్ ఆర్గనైజర్‌గా వ్యవహరిస్తున్నాను. ఇక టెక్నికల్ ఫెస్ట్‌లో భాగంగా టెక్నికల్ ఈవెంట్స్, రోబో వాక్, రోబో కాంపిటీషన్స్తోపాటు వివిధ పరిశోధన సంస్థల నుంచి వచ్చే శాస్త్రవేత్తల లెక్చర్స్ ఉంటాయి. సాధారణ రోజుల్లోనూ ప్రముఖ వ్యక్తులు ఉపన్యాసాలుంటాయి. సదుపాయాలెన్నో.. క్యాంపస్ సదుపాయాల విషయానికొస్తే ప్రవేశం లభించిన విద్యార్థులందరికీ హాస్టల్ వసతి కల్పిస్తారు. క్యాంపస్ అంతా మంచి స్పీడ్‌తో వై-ఫై సౌకర్యం ఉంది. క్యాంపస్‌లో రెండు భోజనశాలలున్నాయి. ఆహారం రుచికరంగా ఉంటుంది. విద్యార్థులు సేదతీరడానికి క్రీడా మైదానాలున్నాయి. ఇంజనీరింగ్ విద్యార్థులకు ప్రాక్టికల్స్ అత్యంత ముఖ్యం కాబట్టి ఆధునిక లేబొరేటరీలున్నాయి. ప్రస్తుతం వివిధ బ్రాంచ్‌లకు సంబంధించి 150 ల్యాబ్‌లు ఉన్నాయి. అయితే లైబ్రరీని మరింత మెరుగుపరచాల్సిన అవసరం ఉంది. ఆన్లైన్ లైబ్రరీ విద్యార్థులకు అందుబాటులో ఉంది. ఆన్లైన్లో చదువుకోవడానికి అందరికీ యూజర్‌నేమ్, పాస్వర్డ్ ఇస్తారు. పీహెచ్డీ చేస్తా పరిశోధనలంటే నాకు ఎంతో ఆసక్తి. ఇప్పుడు కూడా నేను ఎక్కువ సమయం ప్రాక్టికల్స్‌కే కేటాయిస్తున్నాను. బీటెక్ పూర్తయ్యాక ఎంఎస్, పీహెచ్డీ చేయాలనుకుంటున్నా. -
ఆప్షన్లు ఇచ్చింది సగం మందే
హైదరాబాద్: ఎంటెక్, ఎంఫార్మసీ కోర్సుల్లో ప్రవేశానికై నిర్వహించిన పీజీఈసెట్‌లో అర్హత పొందిన వారిలో సగం మందే వెబ్ కౌన్సెలిం గ్ లో పాల్గొన్నారు. ప్రవేశపరీక్ష లో 97,640మంది అర్హత సా ధించగా, 50,030 మందే వెబ్ ఆప్షన్లు ఇవ్వడం గమనార్హం. రెండురాష్ట్రాల్లో 58వేల సీ ట్లుండగా, వాటిలో చేరేందు కు అభ్యర్థులే కరువయ్యారు. ధ్రువపత్రాల పరిశీలన పూర్తిచేసుకున్న పీజీఈసెట్ అభ్యర్థులు.. తమ వెబ్ఆప్షన్లను మార్చుకునేందుకు మరొక అవకాశం కల్పిస్తున్నామని కన్వీనర్ వే ణుగోపాల్‌రెడ్డి శుక్రవారం తెలిపారు. వెబ్ఆప్షన్ల ప్రక్రియ రివైజ్డ్ షెడ్యూల్‌ను జ్ట్టిఞ://ఞజ్ఛఛ్ఛ్టి.్చఞటఛిజ్ఛి.్చఛి.జీ వెబ్సైట్లో ఉంచినట్టు కన్వీనర్ తెలిపారు. రివైజ్డ్ షెడ్యూల్ ఇలా.. తేదీ ర్యాంకులు 20 గేట్/జీప్యాట్(నమోదైన) ర్యాంకర్లు/ పీజీఈసెట్‌లో 1-1000 వరకు 21 1001-5000 వరకు 22 5001-1000 వరకు 23 10001 నుంచి చివరి వరకు -
ఎంటెక్, ఎంఫార్మసీ సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌లో గందరగోళం
ప్రొవిజనల్ సర్టిఫికెట్ తెస్తేనే వెరిఫికేషన్ అంటున్న అధికారులు వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోలేని దుస్థితిలో విద్యార్థులు హైదరాబాద్: ఎంటెక్, ఎంఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహిస్తున్న సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌లో గందరగోళం నెలకొంది. ప్రొవిజనల్ సర్టిఫికెట్లు తేవడం లేదనే సాకుతో అనేక మంది విద్యార్థుల సర్టిఫికెట్లను వె రిఫై చేసేందుకు హెల్ప్ లైన్ కేంద్రాల్లోని అధికారులు తిరస్కరిస్తున్నారు. దీంతో తల్లిదండ్రులు, విద్యార్థుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. రాష్ట్రంలోని 269 పీజీ ఇంజనీరింగ్, 104 ఫార్మసీ కాలేజీల్లో ప్రవేశాల కోసం ఈనెల 6వ తేదీ నుంచి ప్రక్రియ మొదలుపెట్టారు. పీజీఈసెట్ రాసిన విద్యార్థులకు 9వ తేదీ నుంచి సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ప్రారంభించారు. అయితే, రీయింబర్స్మెంట్ కింద రావాల్సిన ఫీజులను విద్యార్థులు చెల్లిస్తేనే సర్టిఫికెట్లు ఇస్తామని మొదట్లో యాజమాన్యాలు మెలిక పెట్టిన నేపథ్యంలో సర్టిఫికెట్లు లేకపోయినా, వెబ్ ఆప్షన్లకు అవకాశం కల్పించాలని అధికారులు నిర్ణయించారు. దీంతో చేసేదేమీ లేక బీటెక్ ఫైనల్ ఇయర్ విద్యార్థులకు యాజమాన్యాలు కూడా సర్టిఫికెట్లు ఇవ్వడం ప్రారంభించాయి. ఇందులో భాగంగా హెల్ప్‌లైన్ కేంద్రాలకు కౌన్సెలింగ్ నిర్వహణ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. అయితే ఇపుడు విద్యార్థులను తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఏర్పాటు చేసిన హెల్ప్‌లైన్ కేంద్రాల్లోని అధికారులే ఇబ్బందులు పెడుతున్నట్లు తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాలేజీల నుంచి తెచ్చుకున్న సర్టిఫికెట్లు కాకుండా సంబంధిత యూనివర్సిటీ జారీ చేసే ప్రొవిజనల్ సర్టిఫికెట్ తీసుకురాలేదనే సాకుతో వెరిఫికేషన్‌కు తిరస్కరిస్తుండటంతో వారు వెబ్ ఆప్షన్లు ఇచ్చుకునే పరిస్థితి లేకుండా పోయింది. గుంటూరు, హైదరాబాద్ తదితర ప్రాంతాల్లో ఈ పరిస్థితి ఎక్కువగా ఉంది. ఈ నేపథ్యంలో ప్రొవిజనల్ సర్టిఫికెట్ తరువాత అందజేసేందుకు వీలు కల్పించాలని, మొదట సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు అవకాశం కల్పించాలని విద్యార్థులు, తల్లిదండ్రులు కోరుతున్నారు. -
ఏం‘టెక్’ కాలేజీలో..!
సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్ కాలేజీల్లో బీటెక్ కోర్సుల్లోనే కాదు.. ఎంటెక్ కోర్సుల్లోనూ సదుపాయాల కొరత తీవ్రంగా ఉంది. బీటెక్ ఇంజనీరింగ్ కాలేజీల్లోనే ఎంటెక్ కోర్సులను కొనసాగిస్తుండటంతో ఈ పరిస్థితి నెలకొంది. అనేక కాలేజీల్లో కంప్యూటర్ ల్యాబ్‌లు లేవు. ఒకవేళ ఉన్నా సరిపడా కంప్యూటర్లు సమకూర్చడం లేదు. అధ్యాపకుల కొరత కూడా ఎక్కువే. కొన్ని కాలేజీల్లో బోధనే సరిగ్గా జరగడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. ఇక మరికొన్ని కాలేజీల్లో అనర్హులతో బోధన కొనసాగిస్తున్నారనే ఆరోపణలు కూడా వెల్లువెత్తుతున్నాయి. 50 శాతం వరకు కాలేజీల్లో అరకొరగా ఉన్న సిబ్బందితోనే నెట్టుకొస్తున్నట్లు అంచనా. ఈ పరిస్థితుల్లో ఈ నెల 6వ తేదీ నుంచి ఎంఈ/ఎంటెక్‌లో ప్రవేశాల కోసం ఉన్నత విద్యా మండలి తాజాగా నోటిఫికేషన్ జారీ చేసింది. అయితే అనేక కాలేజీలకు ఇప్పటివరకు అఫిలియేషన్లే లభించలేదు. దీంతో ఏం చేయాలో అర్థం కాని గందరగోళం యాజమాన్యాల్లో నెలకొంది. అలాగే బీటెక్ ఇంజనీరింగ్ సీట్లలో కోతపడినట్లే పీజీ సీట్లు కూడా చాలా మేరకు కోత పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. నిజానికి ఎంటెక్కు బోధించాలంటే పీహెచ్డీ విద్యార్హత అవసరం. కానీ చాలా కాలేజీల్లో పీహెచ్డీ లేని వారితోనే బోధన కొనసాగిస్తున్నట్లు తెలిసింది. ఎంఫార్మసీలోనూ ఇదే పరిస్థితి నెలకొందని ఉన్నత విద్యా మండలి వర్గాలు పేర్కొంటున్నాయి. చాలా ఫార్మసీ కాలేజీల్లో ప్రయోగశాలలు సరిగా లేవని చెబుతున్నారు. ప్రయోగాలు చేసేందుకు అవసరమైన పరికరాలను సమకూర్చుకోవడం లేదని ఆరోపిస్తున్నాయి. బీటెక్ కోసం ఏర్పాటు చేసిన కొద్దిపాటి సదుపాయాలతోనే ఎంటెక్, ఎంఫార్మసీ కోర్సులను కొనసాగిస్తున్నట్లు విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికే బీటెక్ కాలేజీల్లో సదుపాయాలపై సీరియస్‌గా ఉన్న ప్రభుత్వం.. ఈ పీజీ కోర్సుల నిర్వహణ తీరుపైనా దృష్టి సారిస్తే మరిన్ని లోపాలు బయటపడే అవకాశం ఉందని అధికారవర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ప్రస్తుతం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో 349 ఎంటెక్, 188 ఫార్మసీ కాలేజీలు ఉన్నాయి. వీటిలో దాదాపు సగం కాలేజీలు తెలంగాణ జిల్లాల్లోనే ఉన్నాయి. ఈ కాలేజీల్లో ఫస్ట్, సెకండ్ షిఫ్ట్ కలిపి ఎంటెక్‌లో 41,178 సీట్లు ఉండగా, ఎం.ఫార్మసీలో 15,452 సీట్లు ఉన్నాయి. ఎక్కువ కాలేజీల్లో విద్యార్థుల హాజరు అసలే ఉండదని, అవి ఫీజులు వసూలు చేసుకుని సర్టిఫికెట్లు ఇప్పించే కేంద్రాలుగా మారిపోయాయని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో సదరు కాలేజీల అఫిలియేషన్ల విషయం ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. ఎంటెక్‌లో ప్రవేశాలకు షెడ్యూల్ జారీ సాక్షి, హైదరాబాద్: ఎంఈ/ఎంటెక్/ఎంఆర్క్/ఎం.ఫార్మసీ/ఫార్మ్-డి కోర్సుల్లో ప్రవేశాల కోసం నోటిఫికేషన్ జారీ అయింది. ఉస్మానియా విశ్వవిద్యాలయం నేతృత్వంలో కౌన్సెలింగ్ నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు ఉమ్మడిగా ఈ ప్రవేశాలను చేపడతారు. ఈ నెల 6వ తేదీ నుంచి 19 వరకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ జరుగుతుంది. 10 నుంచి 23వ తేదీ వరకు వెబ్ ఆప్షన్లకు అవకాశం కల్పిస్తారు. 2013, 2104 సంవత్సరాల్లో గేట్, జీప్యాట్ లేదా ఓయూ నిర్వహించిన పీజీఈసెట్‌లో అర్హత సాధించిన వారు ఈ కోర్సుల్లో చేరేందుకు అర్హులు. పూర్తి వివరాలను వెబ్ సైట్ (http://pgecet.apsche.ac.in, http://appgecet.org)లో ఉన్నాయి. -
ప్రవేశాలు
నిట్, రూర్కెలా రూర్కెలాలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(నిట్) పీహెచ్డీ, ఎంటెక్ ప్రోగ్రాముల్లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది. పీహెచ్డీ ప్రోగ్రామ్ ఎంటెక్(రీసెర్చ్) ప్రోగ్రామ్ విభాగం: ఆర్థోపెడిక్ టిష్యూ ఇంజనీరింగ్ అండ్ రిహాబిలిటేషన్ అర్హతలు తదితర వివరాల కోసం వెబ్సైట్ చూడొచ్చు. చివరి తేది: సెప్టెంబరు 7 వెబ్సైట్: http://eapplication.nitrkl.ac.in -
‘గేట్’ దాటితే.. గెటప్ మారినట్టే..!
మార్కాపురం : ఇంజినీరింగ్ విద్యార్థుల కల గేట్ (గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజినీరింగ్). ఈ పరీక్షకు దాదాపు ఆరు నెలల పాటు నిరంతర శిక్షణ తీసుకుంటే మంచి ర్యాంక్ సాధించడం సులభమంటున్నారు అధ్యాపకులు. గేట్లో విజయం సాధిస్తే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు ఎంటెక్‌లో చేరేందుకు అవకాశాలు ఎదురు చూస్తుంటాయి. 100 మార్కులకు ఉండే ఈ పరీక్ష ఆన్లైన్లో జరుగుతుంది. ఈ ఏడాది సెప్టెంబర్ 1 నుంచి దరఖాస్తులు స్వీకరిస్తారు. జనవరిలో పరీక్ష ఉంటుంది. మార్చి రెండవ వారంలో ఫలితాలు ప్రకటిస్తారు. బీటెక్ చదివిన ప్రతి విద్యార్థి గేట్లో ర్యాంక్ సాధించడానికి ఉత్సాహపడుతుంటాడు. 2014లో జరిగిన పరీక్షల్లో సుమారు 15 లక్షల మంది విద్యార్థులు దేశ వ్యాప్తంగా పోటీ పడ్డారు. ఇందులో 2.10 లక్షల మంది మాత్రమే ఉత్తీర్ణులయ్యారు. గేట్ పరీక్ష రాయడానికి ప్రస్తుతం ఇంజినీరింగ్ చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులతో పాటు బీటెక్ పూర్తి చేసిన విద్యార్థులు కూడా అర్హులే. ఈసీఈ, ఈఈఈ, మెకానికల్, సివిల్, సీఎస్ఈ, ఇన్స్ట్రుమెంటల్ బ్రాంచ్ విద్యార్థులతో పాటు బీటెక్‌లో ఇతర కోర్సులు చేసిన వారు పరీక్ష రాయవచ్చు. గేట్లో ఉత్తీర్ణులైతే ఐఐటీ, నిట్, ఐఐఎస్ఈలో సీటు పొందవచ్చు. అర్హత పరీక్ష రాయకుండా బీఎస్ఎన్ఎల్, పీఆర్ డీఓ, ఇస్రో, బీహెచ్ఈఎల్, బీఈఎల్ఎల్, ఎన్టీపీసీ లాంటి కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో ఉద్యోగాలకు నేరుగా ఇంటర్వ్యూకు హాజరు కావచ్చు. -
ఈ వంద రోజుల్లో.. గేట్ ప్రిపరేషన్ ప్లాన్..
బీటెక్/బీఈ పూర్తయ్యాక ఎంటెక్, పీహెచ్డీ వంటి కోర్సులు చదవాలంటే రాయాల్సిన పరీక్ష గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్ (గేట్). ఇందులో వచ్చిన ర్యాంకుతో ఐఐటీలు, ఎన్ఐటీలు వంటి ప్రతిష్టాత్మక సంస్థల్లో ఎంటెక్, పీహెచ్డీ కోర్సుల్లో ప్రవేశం పొందొచ్చు. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వ రంగ కంపెనీలు ఎంట్రీ లెవల్ (ట్రైనీ ఇంజనీర్) పోస్టుల భర్తీలో గేట్ స్కోర్‌ను ప్రామాణికంగా తీసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో పరీక్షకు దాదాపు వంద రోజుల సమయం ఉన్న నేపథ్యంలో ప్రిపరేషన్ వ్యూహాలు.. పి.శ్రీనివాసులు రెడ్డి, మేనేజింగ్ డెరైక్టర్, వాణి ఇన్స్టిట్యూట్, హైదరాబాద్ కోర్ అంశాలపై దృష్టి సారించాలి.. ఈ వంద రోజుల్లో విద్యార్థులు ఎక్కువగా ప్రాథమిక భావనలు, నిర్వచనాలు, సూత్రాలను క్షుణ్నంగా రివిజన్ చేయాలి. గత 20 ఏళ్లలో నిర్వహించిన గేట్, ఐఈఎస్, డీఆర్డీవో, బార్క్, ఇతర పీఎస్‌యూ నియామక పరీక్షల ప్రశ్నపత్రాలను సేకరించి వాటిల్లోని ఆబ్జెక్టివ్ ప్రశ్నలను సాధన చేయాలి. ఇలా చేస్తే ఏయే అంశాలపై మరింత దృష్టి సారించాలో తెలుస్తుంది. తర్వాత పాఠ్యపుస్తకాల్లో అధ్యాయాలవారీగా ఉన్న ముఖ్య అంశాలను బాగా చదవాలి. ఈసీఈ విద్యార్థులు ముఖ్యంగా ఈడీసీ, అనలాగ్ ఎలక్ట్రానిక్స్, సిగ్నల్ సిస్టమ్స్, ఈఎంటీఎల్, కమ్యూనికేషన్లపై ఎక్కువ సమయం కేటాయించాలి. ముఖ్యాంశాలను పదేపదే చదవడంతోపాటు ప్రతిరోజూ పునశ్చరణ చేస్తుండాలి. ‘ఎలక్ట్రికల్’ విద్యార్థులు ఎలక్ట్రికల్ మిషన్‌స, పవర్ సిస్టమ్స్, నెట్వర్క్స, కంట్రోల్స్, మెజర్మెంట్స్లపై ఎక్కువ దృష్టి సారించాలి. మెకానికల్ విద్యార్థులు థర్మల్ ఇంజనీరింగ్, ఫ్లూయిడ్ మెకానిక్స్, స్ట్రెంథ్ ఆఫ్ మెటీరియల్, థియరీ ఆఫ్ మిషనరీ, ప్రొడక్షన్ టెక్నాలజీలను బాగా చదవాలి. చదివిన అంశాలపై ఎప్పటికప్పుడు సొంతంగా ప్రాక్టీస్ టెస్టులు రాయాలి. ఆ రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏ అంశాలనైతే చదువుతారో వాటిపైనే టెస్టులు ఉండాలి. ప్రిపరేషన్ ఒకే విధానంలో ఉండాలి.. అందుబాటులో ఉన్న ఈ వంద రోజుల్లో ప్రతిరోజూ ఆరు గంటలపాటు సంబంధిత బ్రాంచ్‌ల సబ్జెక్టులను అధ్యయనం చేయాలి. సంబంధిత టాపిక్లపై రెండు గంటలు తప్పనిసరిగా పునశ్చరణ అవసరం. కళాశాలల్లో పరీక్షలు ఒక్కొక్క సబ్జెక్ట్‌పైనే నిర్వహించేవారు. గేట్లో మాత్రం బీఈ/బీటెక్‌లో ఉండే అన్ని సబ్జెక్టులతోపాటు జనరల్ ఆప్టిట్యూడ్, ఇంగ్లిష్‌లు ఉంటాయి. వీటన్నింటిని ఒకే పేపర్‌గా రూపొందించి ఇస్తారు. అందువల్ల డిసెంబర్ చివరి నాటికి సిలబస్ మొత్తాన్ని అధ్యయనం చేయడం పూర్తి చేయాలి. జనవరి నెలంతా పునశ్చరణకు కేటాయించాలి. ఈ సమయంలోనే వీలైనన్ని ఎక్కువసార్లు మాక్ టెస్టులు, గ్రాండ్ టెస్టులు ఆన్‌లైన్‌పై సాధన చేయాలి. కోర్ బ్రాంచ్‌ల్లో విజయానికి.. కోర్ బ్రాంచ్‌ల్లో విజయానికి ఫ్యాకల్టీ చెప్పిన నోట్స్‌ను ఒక పుస్తకంలో ముందు రాసుకోవాలి. ఆ తర్వాత వాటిని బాగా చదవాలి. నోట్స్‌తోపాటు ప్రామాణిక పుస్తకాల అధ్యయనం తప్పనిసరి. పాఠ్యపుస్తకాల్లో ప్రతి పాఠ్యాంశం చివరనున్న ఆబ్జెక్టివ్, న్యూమరికల్ టైప్ ప్రశ్నలను ప్రతిరోజూ మాక్ టెస్టుల రూపంలో ప్రాక్టీస్ చేయాలి. మొదటిసారి ఏ ప్రశ్నలకైతే సమాధానం గుర్తించలేకపోయారో ఆ ప్రశ్నలను మరోసారి రివిజన్ చేసుకోవాలి. ఆ తర్వాత మరోసారి మాక్టెస్టుకు సిద్ధం కావాలి. ఏమైనా సందేహాలు ఉంటే ఈ-మెయిల్/ఫోన్ ద్వారా సీనియర్ ఫ్యాకల్టీలను సంప్రదించాలి. న్యూమరికల్ ప్రశ్నలు.. సాధారణంగా న్యూమరికల్ ప్రశ్నలు ఆబ్జెక్టివ్ ప్రశ్నల కంటే ఎక్కువ సమయం తీసుకుంటాయి. వర్చువల్ కీప్యాడ్‌ను ఉపయోగించి వీటికి సమాధానాలు గుర్తించాలి. దీంతోపాటు సమయపరిమితిని కూడా దృష్టిలో ఉంచుకోవాలి. అందువల్ల ముందు ఆబ్జెక్టివ్ టైపు ప్రశ్నలకు సమాధానాలు గుర్తించి తర్వాత న్యూమరికల్ ప్రశ్నలను ఆన్సర్ చేయాలి. ఇవి ఫార్ములా ఆధారితంగా ఉంటాయి. కాబట్టి ఇచ్చిన ప్రశ్నను క్షుణ్నంగా చదివి అర్థం చేసుకుని, తగిన ఫార్ములాను ఉపయోగించి సమాధానాలు గుర్తించాలి. జనరల్ ఆప్టిట్యూడ్‌లో ప్రశ్నల సరళి.. ముఖ్యంగా రీజనింగ్‌లో 3 నుంచి 4 మార్కులు, క్యాంటిటేటివ్ ఆప్టిట్యూడ్‌లో 4 నుంచి 5 మార్కులు, సింప్లికేషన్స 2 నుంచి 3 మార్కులు, ఇంగ్లిష్‌లో ఐదు మార్కుల వరకు ప్రశ్నల సరళి ఉండొచ్చు. అయితే అత్యధిక మార్కులు పొందడానికి విద్యార్థులు ఆర్ఎస్ అగర్వాల్, అభిజిత్ గుహ, గులాటి, జీఎస్ఆర్ పుస్తకాలను ఎక్కువగా అధ్యయనం చేయాలి. అదేవిధంగా ఏవైనా ఇంగ్లిష్ దినపత్రికలను ప్రతిరోజూ క్రమం తప్పకుండా చదవాలి. నెగెటివ్ మార్కులను అధిగమించండిలా.. సంబంధిత సబ్జెక్టులను బాగా చదవడంతోపాటు వీలైనన్ని ఎక్కువసార్లు రివిజన్ చేసుకోవాలి. దీంతోపాటు ఎక్కువ ప్రశ్నలను ఎంచుకుని సొంతంగా మాక్‌టెస్టులను రాయాలి. ఇలా చేస్తే పరీక్షలో చాలావరకు నెగెటివ్ మార్కులను అధిగమించవచ్చు. పరీక్షలో కూడా ముందు సులువుగా అనిపించిన ప్రశ్నలకు సమాధానాలు గుర్తించాలి. ఆ తర్వాత కొం చెం సులువు.. కష్టం.. బాగా కష్టం.. ఇలా ప్రశ్నలకు సమాధానాలు ఇస్తూ పోవాలి. ఇలా చేస్తే చాలా వరకు తప్పులు లేకుండా సమాధానాలు ఇవ్వొచ్చు. అలా కాకుండా ముందుగానే కష్టమైన ప్రశ్నలకు ఉన్న సమయాన్ని వెచ్చిస్తే చివరలో ఒత్తిడి పెరిగిపోతుంది. దీంతో అటు సులువైన ప్రశ్నలకు కూడా సరైన సమాధానాలు గుర్తించలేకపోయే ప్రమాదముంది. పరీక్ష హాల్లో ఉన్న సమయాన్ని దృష్టిలో ఉంచుకుని అన్ని ప్రశ్నలకు సమాధానాలు గుర్తించాలి. ఆన్లైన్ పరీక్ష.. జాగ్రత్తలు.. గేట్-2014లో ప్రశ్నలు, మార్కుల సంఖ్యలో ఎలాంటి మార్పులు లేవు. కానీ అన్ని పేపర్లను ఆన్లైన్ (కంప్యూటర్ బేస్డ్ టెస్ట్)లో నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో అభ్యర్థులు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే బీటెక్ వరకు విద్యార్థులంతా రాత పరీక్షకు అలవాటు పడి ఉంటారు. అందువల్ల కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అంటే ఆందోళనల సహజం. ముఖ్యంగా కంప్యూటర్‌పై అంతగా పట్టులేని గ్రామీణ విద్యార్థులు.. ఆన్లైన్ పరీక్షకు సిద్ధం కావడానికి చాలా ముందు నుంచి కంప్యూటర్‌పై వీలైనన్ని మాక్‌టెస్టులు, గ్రాండ్‌టెస్టులు ప్రాక్టీస్ చేయాలి. వివిధ వెబ్‌పోర్టల్స్‌లో ఈ మాక్‌టెస్టులు అందుబాటులో ఉన్నాయి. ఇలా చేస్తే పరీక్ష నాటికి కంప్యూటర్‌పై ఎదురయ్యే సాంకేతిక సమస్యలను అధిగమించడంతోపాటు వేగంగా సమాధానాలను గుర్తించగల నైపుణ్యం అలవడుతుంది. అందుబాటులో ఉన్న ఈ మూడు నెలల్లో వీలైనన్ని మాక్ ఆన్లైన్ టెస్టులు రాయాలి. ఐఐటీలు, ఎన్ఐటీల్లో కటాఫ్ మార్కులు.. గేట్లో 800 కంటే ఎక్కువ స్కోర్ సాధిస్తే ప్రభుత్వ రంగ కంపెనీల్లో ఉద్యోగం సంపాదించే అవకాశాలు మెరుగ్గా ఉంటాయి. అదేవిధంగా 600 కంటే ఎక్కువ స్కోర్ పొందితే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)ల్లో సీటు ఆశించొచ్చు. ఇక నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్ఐటీ)ల్లో సీటు పొందాలంటే గేట్లో 450 కంటే ఎక్కువ స్కోర్ సాధించాల్సి ఉంటుంది. ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీసెస్‌కు ఇలా.. సాధారణంగా గేట్ పరీక్షలో బీటెక్ విద్యార్థులను దృష్టిలో ఉంచుకుని మాత్రమే సంబంధిత సబ్జెక్టుల బేసిక్స్, ఫండమెంటల్ కాన్సెప్ట్స్, ఎవల్యూషన్లపై ప్రశ్నలుంటాయి. కానీ ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీసెస్ (ఐఈఎస్)లో మాత్రం ఎంటెక్ విద్యార్థులను దృష్టిలో ఉంచుకొని ప్రశ్నలు అడుగుతారు. గేట్‌కు పూర్తి భిన్నంగా లోతైన విశ్లేషణ (ఇన్‌డెప్త్ అనాలసిస్), సింథసిస్, ఎవల్యూషన్, క్రియేటివిటీ, డిజైన్ మొదలైన వాటిపై ప్రశ్నలు ఉంటాయి. కాబట్టి ఐఈఎస్‌కు సిద్ధమయ్యేవారు సంబంధిత సబ్జెక్టుల కాన్సెప్ట్స్, బేసిక్స్‌తోపాటు ప్రతి అంశాన్ని విశ్లేషిస్తూ చదువుకోవాలి. విద్యార్థులు మొదట ఫిబ్రవరి వరకు గేట్‌పై దృష్టి పెట్టాలి. ఆ తర్వాత నుంచి ఐఈఎస్‌కు సిద్ధమవ్వాలి. పరీక్ష రోజు డూస్ అండ్ డోన్ట్స్.. డూస్: ఎలాంటి ఆందోళన లేకుండా ప్రశాంతంగా ఉండండి. పరీక్షకు ముందు అన్ని అంశాలు చదవకుండా సారాంశాన్ని (సమ్మరీ) మాత్రమే చదవాలి. పరీక్ష కేంద్రం, ప్రదేశాన్ని ఒకరోజు ముందుగానే వెళ్లి తెలుసుకోవాలి. ఇలా చేస్తే పరీక్ష రోజు వెతుకులాట తప్పుతుంది. పరీక్షకు కావలసిన సరంజామా (హాల్‌టికెట్, పెన్ను, గుర్తింపు కార్డు మొదలైనవి) అన్నీ ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలి. ఎల్లప్పుడూ సానుకూల దృక్పథంతో ఉండాలి. డోన్ట్స్: ఎలాంటి ఆందోళన చెందొద్దు. చివరి నిమిషంలో పాఠ్యపుస్తకాలు చదివి గందరగోళానికి గురి కావద్దు. స్నేహితులతో ఎలాంటి చర్చలు చేయొద్దు. అతి విశ్వాసం వద్దు. అత్యుత్తమ స్కోర్‌కు టాప్‌టెన్ టిప్స్ ప్రాథమిక భావనలపై పట్టు. ఏకాగ్రత, సాధించాలనే తపన. యూనిఫాం.. కంటిన్యూస్ స్టడీ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్. ప్రామాణిక పుస్తకాల అధ్యయనం. తెల్లవారుజామున (ఎర్లీమార్నింగ్) స్టడీ అవర్స్ ఉండాలి. ఎక్కువసార్లు పునశ్చరణ (రివిజన్). వీలైనన్ని ఆన్లైన్, మాక్ టెస్టుల సాధన. ప్రీవియస్ ప్రశ్నపత్రాలను సాధన చేయాలి. ఫ్యాకల్టీతో సందేహాలను నివృత్తి చేసుకోవాలి. తేలికపాటి వ్యాయామాలు, యోగా. 2011 నుంచి గేట్‌కు హాజరవుతున్నా.. పూర్తి సమయం కేటాయించి, సీరియస్ ప్రిపరేషన్ సాగించింది గతేడాది ఆగస్టు నుంచే. ప్రతిరోజు 8 గంటలు కేటాయించాను. అంతకుముందు రాసినప్పుడు ర్యాంకు రాకపోవడానికి గల లోపాలను గుర్తిస్తూ.. గేట్ ప్రశ్నల తీరును విశ్లేషిస్తూ చదివాను. అంతేకాకుండా ప్రతి చాప్టర్ వెనుక ఇచ్చే ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేయడం కూడా ఎంతో కలిసొచ్చింది. ఒక సమస్యను అప్లికేషన్ ఓరియెంటేషన్‌తో సాధించే విధంగా ప్రాక్టీస్ చేయడం గేట్‌కు ఎంతో ప్రధానం. ఇలాంటి ప్రశ్నలే పరీక్షలో అడుగుతారు. ముందుగా అభ్యర్థులు గేట్ అంటే కఠినమైన పరీక్ష అనే ఆందోళన వీడాలి. గేట్ సిలబస్ బీటెక్లోదే. బీటెక్ సబ్జెక్ట్‌లలోని థియరీని, ప్రాబ్లమ్‌సాల్వింగ్ అప్రోచ్‌ను ఆకళింపు చేసుకుని.. ఆ తీరులో చదివితే సులభంగానే అర్హత పొందొచ్చు. - బి. సుజిత్‌కుమార్, (ఎంఎస్, ఐఐటీ మద్రాస్), ఫస్ట్ ర్యాంకర్, ఈసీఈ, గేట్- 2013 మిగిలిన బ్రాంచ్‌లతో పోలిస్తే ఈఈఈలో ఎక్కువ సిలబస్ ఉంటుంది. కాబట్టి పరీక్షకు ఆరేడు నెలల ముందుగానే ప్రణాళిక ప్రకారం సిద్ధమవ్వాలి. ప్రతిరోజూ కనీసం ఆరు గంటలపాటు చదవాలి. చాలామంది క్లాస్‌రూం నోట్స్, రిఫరెన్స బుక్స్ చదివి వదిలేస్తారు. ఇది సరికాదు. రోజూ మీరు ఏ అంశమైతే చదివారో ఆ అంశంపై ప్రతిరోజూ మాక్ టెస్టులు రాయాలి. గేట్ ఆన్లైన్లో జరగనున్న నేపథ్యంలో రోజువారీ ప్రాక్టీస్, మాక్టెస్టుల సాధన తప్పకుండా చేయాలి. రోజూ చదివిన అంశాలపై కనీసం గంటసేపైనా సాధన చేయాలి. పరీక్షకు రెండు నెలలు ముందు మొత్తం సిలబస్‌పై వీలైనన్ని ఆన్లైన్ టెస్టులు రాయాలి. ప్రాక్టీస్ వల్లే నేను విజయం సాధించగలిగాను. వంద మార్కులగానూ 92 మార్కులకు పరీక్ష రాస్తే 88 మార్కులు సాధించానంటే అది ప్రాక్టీస్ వల్లే. - ఎం. రామకృష్ణ, (ఆఫీసర్ ట్రైనీ, హెచ్‌పీసీఎల్, విశాఖపట్నం) ఫోర్త ర్యాంకర్, ఈఈఈ, గేట్- 2013 రిఫరెన్స్ బుక్స్ ఎలక్ట్రానిక్స్: Edc: Milliman, Halkias, Sedra Smith, Schaum series. Digital: Marrismano, R.P. Jain, Gaonkar. Emtl: William Hayt, Schaum series, Krauss, k.d. prasad. Comm. Signals: Simon haykin, Schaum series. c.s: Nagrath & Gopal, Schaum series. Adc: Jacob Milliman, Schaum series. W/W: William hayt, Schaum series. ఎలక్ట్రికల్: Electrical Machines: p.s. Bhimbra; J.B. Gupta; Nagrath & Kothari; M.G. Say. Power Systems: C.L. Wadhwa; J.B. Guptha; Soni Guptha Bhatnagar. Networks: Hyatt; Sadiku Measurements:A.K.Sawhney; H.S.Kalsi Control systems: Nagrath & Gopal; ogata; kuo Power electronics: Khanchandani మెకానికల్: Thermal: Cengel, P.K. Nag FM: DS Kumar Subramanyam Som: Sadhu Singh R/Ac: Arora/Manohar Prasad H.T.: Dr. Ramakrishna