మార్కాపురం : ఇంజినీరింగ్ విద్యార్థుల కల గేట్ (గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజినీరింగ్). ఈ పరీక్షకు దాదాపు ఆరు నెలల పాటు నిరంతర శిక్షణ తీసుకుంటే మంచి ర్యాంక్ సాధించడం సులభమంటున్నారు అధ్యాపకులు. గేట్‌లో విజయం సాధిస్తే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు ఎంటెక్‌లో చేరేందుకు అవకాశాలు ఎదురు చూస్తుంటాయి. 100 మార్కులకు ఉండే ఈ పరీక్ష ఆన్‌లైన్‌లో జరుగుతుంది. ఈ ఏడాది సెప్టెంబర్ 1 నుంచి దరఖాస్తులు స్వీకరిస్తారు. జనవరిలో పరీక్ష ఉంటుంది.
మార్చి రెండవ వారంలో ఫలితాలు ప్రకటిస్తారు. బీటెక్ చదివిన ప్రతి విద్యార్థి గేట్‌లో ర్యాంక్ సాధించడానికి ఉత్సాహపడుతుంటాడు. 2014లో జరిగిన పరీక్షల్లో సుమారు 15 లక్షల మంది విద్యార్థులు దేశ వ్యాప్తంగా పోటీ పడ్డారు. ఇందులో 2.10 లక్షల మంది మాత్రమే ఉత్తీర్ణులయ్యారు. గేట్ పరీక్ష రాయడానికి ప్రస్తుతం ఇంజినీరింగ్ చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులతో పాటు బీటెక్ పూర్తి చేసిన విద్యార్థులు కూడా అర్హులే.
ఈసీఈ, ఈఈఈ, మెకానికల్, సివిల్, సీఎస్‌ఈ, ఇన్‌స్ట్రుమెంటల్ బ్రాంచ్ విద్యార్థులతో పాటు బీటెక్‌లో ఇతర కోర్సులు చేసిన వారు పరీక్ష రాయవచ్చు. గేట్‌లో ఉత్తీర్ణులైతే ఐఐటీ, నిట్, ఐఐఎస్‌ఈలో సీటు పొందవచ్చు. అర్హత పరీక్ష రాయకుండా బీఎస్‌ఎన్‌ఎల్, పీఆర్ డీఓ, ఇస్రో, బీహెచ్‌ఈఎల్, బీఈఎల్‌ఎల్, ఎన్‌టీపీసీ లాంటి కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో ఉద్యోగాలకు నేరుగా ఇంటర్వ్యూకు హాజరు కావచ్చు.
‘గేట్’ దాటితే.. గెటప్ మారినట్టే..!
Published Mon, Aug 25 2014 3:20 AM | Last Updated on Sat, Sep 2 2017 12:23 PM
Advertisement