markapuram
-
శీతల దేశాల నేస్తం.. మార్కాపురం పలక
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: ప్రకాశం జిల్లా మార్కాపురం అంటే.. అందరికీ ఠక్కున గుర్తుకు వచ్చేది ‘పలక’. ఆ పలక మీద ఓనమాలు నేర్చుకున్న ఎన్నో చిట్టి చేతులు.. ఉన్నతస్థానాలకు చేరాయి. అలాగే ఎన్నో శీతల దేశాలు కూడా మార్కాపురం పలక(Markapuram Matti Palaka)లను అక్కున చేర్చుకున్నాయి. మన దేశంలో వీటిని అక్షరాలు దిద్దేందుకు వినియోగిస్తే.. శీతల దేశాల్లో గృహ నిర్మాణాల్లో ఉపయోగిస్తున్నారు. వీటి వల్ల బయట గడ్డ కట్టే చలి ఉన్నా.. గదిలో మాత్రం వెచ్చగా ఉంటుంది. అందుకే వీటికి శీతల దేశాల్లో మంచి డిమాండ్ ఉంది. రాసుకునే పలకల నుంచి డిజైన్ స్లేట్స్ వైపు అడుగులు.. పలకల గనులు మార్కాపురంతో పాటు తర్లుపాడు, కొనకనమిట్ల, దొనకొండ మండలాల్లో ఎక్కువగా ఉన్నాయి. మన దేశంలో హరియాణా, రాజస్థాన్ ప్రాంతాల్లో పలకల గనులు ఉన్నప్పటికీ.. ఎక్కువగా మార్కాపురం నుంచే పలకలు ఎగుమతి అవుతుంటాయి. 80, 90 దశకాల్లో వ్యాపారం జోరుగా సాగింది. ఆ రోజుల్లో ఏ చిన్నారి చేతిలో చూసినా మార్కాపురం పలకే ఉండేది.ఈ ప్రాంతంలో 100కి పైగా గనుల్లో కార్యకలాపాలు సాగేవి. వేలాది మంది గడ్డపారలు, సుత్తులతో పలకలు దెబ్బ తినకుండా జాగ్రత్తగా తీసేవారు. అయితే కాలక్రమేణా రాసుకునే పలకల వినియోగం తగ్గడంతో వ్యాపారులు, తయారీదారులు ప్రత్యామ్నాయ మార్గాల వైపు అడుగులు వేశారు. గృహ నిర్మాణాల్లో ఉపయోగించేలా పలకల తయారీ మొదలుపెట్టారు. వీటిని వివిధ ప్రాంతాలకు ఎగుమతి చేస్తున్నారు. చైనాతో పోటీ.. కరోనాతో డీలా అమెరికా, ఆస్ట్రేలియా, రష్యా, వియత్నాం, మలేసియా, సింగపూర్, ఇంగ్లండ్ తదితర దేశాలకు మార్కాపురం నుంచి పలకలను ఎగుమతి చేస్తుంటారు. క్రిస్మస్ వస్తుందంటే చాలు అమెరికా, ఇంగ్లండ్, రష్యా తదితరæ దేశాల్లో పాత డిజైన్ స్లేట్లను తొలగించి కొత్త వాటిని అమర్చుకుంటూ ఉంటారు. దీంతో అంతర్జాతీయంగా మంచి డిమాండ్ ఉండేది. అదే సమయంలో చైనా కూడా భారీగా ఎగుమతులు మొదలుపెట్టారు. ఈ పోటీని తట్టుకుంటున్న సమయంలో అంతర్జాతీయంగా పలు దేశాల్లో ఆర్థిక మాంద్యం తలెత్తడంతో ఎగుమతులకు ఆటంకాలు ఎదురయ్యాయి.కరోనా తర్వాత ఈ పరిశ్రమ కోలుకోలేని విధంగా దెబ్బతింది. చాలా పరిశ్రమలు ఆర్థిక ఇబ్బందులతో మూతపడ్డాయి. కొందరు మాత్రమే ఎగుమతులు ప్రారంభించారు. మళ్లీ పుంజుకుంటున్న సమయంలో రష్యా, ఉక్రెయిన్ యుద్ధ ప్రభావం ఎగుమతులపై పడింది. పలకల కంటైనర్లను సముద్రం ద్వారా పంపే ఖర్చు రెట్టింపు అయ్యింది. దీంతో ఎగుమతులు భారమయ్యాయని పలువురు వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేశారు. అమెరికా, చైనా వాణిజ్య యుద్ధం కలిసొచ్చేనా.. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత.. చైనాకు, ఆ దేశానికి మధ్య వాణిజ్య యుద్ధం ప్రారంభమైంది. పోటాపోటీగా దిగుమతి సుంకాలను పెంచుకుంటున్నాయి. దీంతో అమెరికాలో చైనా పలకల రేట్లు భారీగా పెరిగే అవకాశం ఉందని స్థానిక వ్యాపారులు అభిప్రాయపడుతున్నారు. దీనివల్ల మళ్లీ మార్కాపురం పలకలకు మంచి రోజులు వచ్చే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఆదుకోవాలి ప్రభుత్వ భవనాలకు మార్కాపురం డిజైన్ స్లేట్స్‌ను ఉపయోగించాలి. అలాగే ప్రభుత్వ స్కూళ్ల పిల్లలకు ఉచితంగా పలకలు ఇవ్వాలి. దీని వల్ల వేలాది మంది కార్మి కులకు పని దొరకడంతో పాటు పరిశ్రమ పుంజుకుంటుంది. అలాగే పలకల ఫ్యాక్టరీల యజమానులకు సబ్సిడీపై రుణాలు అందించాలి. కరెంటు చార్జీలతో పాటు క్వారీ చార్జీలను తగ్గించి.. ప్రభుత్వం ఆదుకోవాలి. – బట్టగిరి తిరుపతిరెడ్డి, డిజైన్ స్లేట్ వ్యాపారి -
ఐదేళ్లుగా ఆ పాపకు.. పాలు, నీళ్లే ఆహారం
మార్కాపురం: అన్న ప్రాసన రోజు అందరిలాగే తమ చిన్నారికి సంతోషంగా అన్నంపెట్టారు ఆ దంపతులు. వెంటనే వాంతి (Vomiting) చేసుకుంది. తల్లిదండ్రులు తేలిగ్గా తీసుకున్నారు. మరుసటిరోజూ అన్నం పెట్టారు. మళ్లీ అదే పరిస్ధితి. ఇలా ఒక నెలరోజులు జరిగే సరికి తల్లిదండ్రుల్లో ఆందోళన మొదలైంది. పలు కార్పొరేట్ వైద్యశాలలను సంప్రదిస్తే ప్రతి 10 లక్షల మందిలో ఒకరికి మాత్రమే వచ్చే అరుదైన వ్యాధి (Rare Disease) సోకిందని వైద్యులు చెప్పారు. అన్నవాహిక, పెద్దపేగు మూసుకుపోవడంతో ఏం తిన్నా వాంతులు అవుతున్నాయని చెప్పారు. పాలు.. నీళ్లు మాత్రమే తాగించాలని వైద్యులు చెప్పడంతో, ఆ చిన్నారి గత ఐదేళ్ల నుంచి పాలు, నీళ్లతోనే బతుకుతోంది. రెక్కాడితేకానీ డొక్కాడని కుటుంబం వారిది. ప్రకాశం జిల్లా, మార్కాపురం పట్టణంలోని జార్జిఫార్మసీ కళాశాల వెనుక ఉండే మంచా భాస్కర్, కృష్ణవేణి దంపతుల కన్నీటి వ్యధ ఇది. మార్కాపురం (Markapuram) పట్టణంలోనే ఒక ఆసుపత్రిలో భాస్కర్ కాంపౌండర్‌గా పనిచేస్తున్నాడు. పాపకు రక్షణ అనే పేరును పెట్టుకున్నా, ఆమె ప్రాణాలకు రక్షణ కల్పించలేని దీనస్థితిలో ఉన్న ఆ దంపతులు దాతల దయ కోసం ఎదురు చూస్తున్నారు. రూ.8 లక్షలు ఖర్చవుతుందన్నారు...ప్రస్తుతం మా చిన్నారి అంగన్వాడీ పాఠశాలకు వెళుతోంది. ఆపరేషన్ చేస్తే ఇబ్బంది తొలగుతుందని వైద్యులు చెప్పారు. అయితే అందుకు సుమారు రూ.8 లక్షలు ఖర్చవుతుందని తెలిపారు. పాప వైద్యం నిమిత్తం ప్రతి 2 నెలలకు ఒకసారి రాజమండ్రికి వెళ్లి రూ.25 వేలు ఖర్చుపెట్టుకుని వస్తున్నాం. దాతలు స్పందించి వైద్యానికి ఆర్ధిక సాయం అందించి ఆదుకోవాలని వేడుకుంటున్నాం. స్పందించే దాతలు 83743 89936 నంబరుకు సాయం చేయాలని కోరుతున్నాం. – భాస్కర్, రక్షణ తండ్రి చదవండి: పసికందుకు హెల్త్ ప్రాబ్లమ్.. పూడ్చిపెట్టడానికి తల్లిదండ్రుల యత్నం -
మార్కాపురంలో ఘనంగా వైఎస్ జగన్ జన్మదిన వేడుకలు
-
స్వాప్నికళ
ఆస్ట్రేలియాకు చెందిన ప్రసిద్ధ క్రోచెట్ ఆర్టిస్ట్ జెన్నీ కింగ్ నోటి నుంచి వినిపించే మాట... ‘అల్లికల కళకు మాంత్రిక శక్తి ఉంది. అది మన మనసును ఎప్పుడూ ఆహ్లాదభరితం చేస్తుంది. మంత్రముగ్ధుల్ని చేసే మనోహర కళ ఇది’.మార్కాపురానికి చెందిన స్వాప్నిక రాజ్ఞీ చిన్నప్పుడే ఆ మంత్రముగ్ధకళలలో ఓనమాలు నేర్చుకుంది. ఆ కళ ఇచ్చిన ఉత్తేజం ఊరకేపోలేదు. అల్లికల కళలో చేయి తిరిగిన స్వాప్నిక పేరు గిన్నిస్‌బుక్‌లోకి ఎక్కింది.ప్రకాశం జిల్లా మార్కాపురానికి చెందిన స్వాప్నిక అమ్మమ్మ తోటకూర క్రిస్టియనమ్మ పట్టణంలోని బాలికోన్నత పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తూ తీరిక వేళల్లో ఇంట్లో అల్లికలు (క్రోచెట్స్) చేసేది. అమ్మమ్మ అల్లికల పనిలో ఉన్నప్పుడు స్వాప్నిక ఆసక్తిగా గమనించేది. అలా ‘అమ్మమ్మ అల్లికల స్కూల్’ లో స్టూడెంట్‌గా చేరింది. గురువుగారి ప్రియ శిష్యురాలు అయింది. అల్లికలకు సంబంధించి ఎన్నో మెళకువలు అవలీలగా నేర్చుకుంది.కొత్త అల్లికల గురించి ఆలోచించడమే కాదు, క్రోచెట్స్కు సంబంధించి కొత్త రికార్డ్ల గురించి తెలుసుకోవడం అంటే స్వాప్నికకు ఇష్టం. మదర్ ఇండియాస్ క్రోచెట్ క్వీన్స్ (ఎంఐక్యూ)లో ఆరు వేలమందికి పైగా సభ్యులు ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది క్రోచెట్ ఆర్టిస్ట్‌లకు స్ఫూర్తినిచ్చే సంస్థ ఇది. ‘క్రోచెట్ క్వీన్స్’కు చెందిన మహిళలు అతి పెద్ద క్రోచెటెడ్ దుప్పటి, అతి పెద్ద క్రోచెటెడ్ స్కార్ఫ్, అతి పెద్ద క్రోచెటెడ్ క్రిస్మస్ డెకరేషన్... మొదలైన వాటితో రికార్డ్ సృష్టించారు.‘ఎంఐక్యూ’లాంటి సంస్థల రికార్డుల గురించి తెలుసుకునే క్రమంలో స్వాప్నికకు రికార్డ్‌లపై ఆసక్తి మొదలైంది.‘గిన్నిస్ బుక్ రికార్డ్’ అంటే ప్రపంచ దృష్టిని ఆకర్షించే సవాలు. అలాంటి అరుదైన సవాలును స్వీకరించే అవకాశం స్వాప్నికకు విశాఖపట్టణంలో వచ్చింది.విశాఖపట్టణానికి చెందిన ‘మహిళా మనోవికాస్ క్రాఫ్ట్స్ అండ్ క్రియేషన్’ సంస్ధ క్రోచెట్స్కు సంబంధించి నిర్ణీత వ్యవధిలో అత్యధిక కళాకృతులు తయారు చేయాలని సవాలు ఇచ్చింది. ఈ సవాలుకు ‘సై’ అంటూ స్వాప్నిక బృందంలోని మహిళలు అతి తక్కువ సమయంలో 58,112 క్రోచెట్ స్క్వేర్లను తయారుచేసి ‘లార్జెస్ట్ డిస్ప్లే ఆఫ్ క్రోచెట్స్ స్వే్కర్’ అనే టైటìఃల్ సొంతం చేసుకున్నారు. గిన్నిస్ బుక్ రికార్డ్ నెలకొల్పారు. గిన్నిస్ రికార్డు కోసం 20వేల క్రోచెట్స్ స్క్వేర్స్ తయారు చేయాల్సి ఉండగా స్వాప్నిక బృందం 58,112 తయారుచేసి వరల్డ్ రికార్డు సాధించింది.‘గిన్నిస్ రికార్డ్ ఇచ్చిన ఉత్సాహంతో భవిష్యత్‌లో మరిన్ని రికార్డ్‌లు నెలకొల్పుతాం’ అంటుంది ఆత్మవిశ్వాసం నిండిన గొంతుతో స్వాప్నిక రాజ్ఞీ. కూచిపూడి నుంచి కరాటే వరకు‘నేర్చుకుంటే పోయేదేమీ లేదు... వచ్చేదే తప్ప’ అన్నట్లుగా ఉంటుంది స్వాప్నిక ఉత్సాహం. అల్లికల కళలో చేయి తిరిగిన స్వాప్నిక అక్కడితో ఆగిపోలేదు. తల్లిదండ్రులు నాగెళ్ల లీనా కెఫీరాల, డాక్టర్ కొండేపోగు డేవిడ్ లివింగ్ స్టన్ ్రపోత్సాహంతో కూచిపూడి నేర్చుకుంది. రాష్ట్ర స్థాయిలో ఎన్నో బహుమతులు గెలుచుకుంది. కరాటేలో కూడా ప్రావీణ్యం సంపాదించింది. బిఫార్మసీ చదివే రోజుల్లో స్వాప్నిక తన చేతులపై జీపును నడిపించుకుని సాహసవంతమైన ఫీట్ చేసింది. వృత్తిరీత్యా ఫార్మసిస్టు అయిన స్వాప్నిక ప్రవృత్తిరీత్యా ఆర్టిస్ట్. ఎప్పటికప్పుడు కొత్త కళలపై ఆసక్తి చూపుతుంటుంది.– గోపాలుని లక్ష్మీ నరసింహారావు, ‘సాక్షి’, మార్కాపురం, ప్రకాశం జిల్లా -
మార్కాపురంలో అరుదైన జాతి పక్షుల సందడి
ప్రకాశం జిల్లా మార్కాపురంలో తొలిసారిగా ఆసియా ఖండంలోని శ్రీలంక, చైనా, తైవాన్, సుమత్రా దీవుల వద్ద కనిపించే పలు రకాల పక్షులు సందడి చేస్తున్నాయి. పట్టణంలోని విశ్వబ్రాహ్మణ కాలనీలో ఇవి కనిపిస్తున్నాయి. మూడు రోజుల క్రితం త్రివర్ణ మునియాను (మూడు రంగుల పక్షి) కనిపించగా వైట్ మునియా, బయా వీవర్, ఇండియన్ సిల్వర్ బిల్ పక్షులను స్నేక్ క్యాచర్ నిరంజన్ తన కెమెరాతో క్లిక్‌మనిపించాడు. ఆ వివరాలను మీడియాకు తెలిపారు. వైట్ మునియా పక్షి అరుదైన జాతికి చెందింది. తెల్లటి, బూడిద రంగులతో కలిపి పొడవాటి నల్లటి తోకతో 10 నుంచి 11 సెం.మీ పొడవు ఉంటుంది. ఇది దట్టమైన పొదల్లో నివసిస్తుంది. ఈ పక్షిని జపాన్‌లోని పలు ప్రాంతాల్లో పెంపుడు పక్షిగా పెంచుకుంటారు. – మార్కాపురంగిజిగాడి పక్షి20 ఏళ్ల క్రితం కనిపించిన ఈ పక్షి మళ్లీ ఇప్పుడు మార్కాపురం ప్రాంతంలో కనిపిస్తోంది. ఇంగ్లిష్‌లో బయావీవర్ అని పిలుస్తారు. పల్లెల్లో అయితే గిజిగాడి పక్షి అంటారు. ఈ పిచ్చుక శ్రీలంక, పాకిస్థాన్, నేపాల్, భారత్‌లోని పలు ప్రాంతాల్లో కనిపిస్తుంది. గిజిగాడు నిర్మించుకునే గూడు విచిత్రంగా ఉంటుంది. కొమ్మలకు వేలాడుతూ ఉంటాయి. పాములు, కాకులు, గద్దలు ఇతరత్రా పక్షులు, జంతువులు రాకుండా అద్భుతమైన ఇంజినీరింగ్ వ్యవస్థతో గూడు కట్టుకుంటుంది. తలమీద పసుపురంగుతో చేసిన బంగారు కిరీటంలా ఉంటుంది. ముక్కు నుంచి గడ్డం వరకు నలుపు రంగుతో ఉంటుంది. పొట్టకింద పసుపు తెలుపు, గోధుమ రంగులతో ఆకర్షణీయంగా ఉంటుంది.ఇండియన్ సిల్వర్‌బిల్ పక్షి ఈ పక్షి మార్కాపురంలోని విశ్వబ్రాహ్మణ రోడ్డులోని చెట్లపై కనిపిస్తోంది. తల, తోక, శరీర మధ్యభాగం ముక్కు ముదురు బ్రౌన్ రంగును కలిగి ఉంటుంది. పొట్టభాగం సిల్వర్ రంగులో ఉండటంతో దీన్ని ఇండియన్ సిల్వర్ బిల్ పక్షి అంటారు. ఇది గడ్డి విత్తనాలను తింటుంది. ఇది ఒక అరుదైన జాతి పక్షి. అంతరించిపోతున్న పక్షుల్లో ఇది కూడా ఒకటి. -
ఇడ్లీ తిన్నాడు.. బిల్లు అడిగితే తన్నాడు!
మార్కాపురం: హోటల్‌కు వెళ్లి సర్వర్‌తో ఇడ్లీ తెప్పించుకుని పుష్టిగా ఆరగించిన ఓ యువకుడు బిల్లు చెల్లించాలని అడిగిన సిబ్బందిపై ఒక్కసారిగా దాడికి దిగాడు. ఈ సంఘటన సోమవారం మార్కాపురం ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని ఒక హోటల్లో చోటుచేసుకుంది. వివరాలు.. ఆర్టీసీ డిపో ఎదురుగా ఉన్న ఓ హోటల్లో కె.మహేష్‌రెడ్డి ఇడ్లీ తిన్నాడు. హోటల్ బాయ్ అంజి బిల్లు కట్టాలని కోరగా మహేష్ దాడికి దిగాడు. అడ్డుకోబోయిన హోటల్ సిబ్బంది పరమేశ్వరరెడ్డి, సుబ్బారెడ్డిపైనా మహేష్ దాడికి పాల్పడ్డాడు. బాధితుల ఫిర్యాదు మేరకు నిందితుడిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై అబ్దుల్ రెహమాన్ తెలిపారు. -
మార్కాపురం @ 48 డిగ్రీలు
సాక్షి, విశాఖపట్నం/మార్కాపురం: సూర్యప్రతాపం రోజురోజుకు విజృంభిస్తోంది. ప్రకాశం జిల్లా మార్కాపురంలో గురువారం 48 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. రానున్న కొద్దిరోజులు రాష్ట్రంలో పరిస్థితి నిప్పులు చెరిగే పగళ్లు.. వేడిని వెదజల్లే రాత్రుళ్లు ఉండనుంది. కొన్ని ప్రాంతాల్లో పగటివేళ సాధారణంకంటే 4–7 డిగ్రీలు, రాత్రిపూట 3–6 డిగ్రీలు అధికంగా నమోదయ్యే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. -
వచ్చే నెలలో 50 డిగ్రీలకు మించి ఉష్ణోగ్రతలు!
సాక్షి, విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్‌లో అసాధారణ ఉష్ణోగ్రతలు అరుదుగా నమోదవుతున్నాయి. వేసవిలో రికార్డయ్యే ఈ ఉష్ణోగ్రతలు ఒకింత ఆశ్చర్యం గొలుపుతున్నాయి. ఇటీవల కాలంలో ఎన్నడూ లేనివిధంగా ఈ ఏడాది ఏప్రిల్ ఆరంభంలోనే మే నెలను తలపించే వడగాడ్పులు, తీవ్ర వడగాడ్పులు వీస్తున్నాయి. మే నెలలో ఉష్ణోగ్రతలు 50 డిగ్రీలకు మించి నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో గడచిన 132 ఏళ్లలో భారత వాతావరణ విభాగం (ఐఎండీ) గణాంకాలను పరిశీలిస్తే.. మన రాష్ట్రంలో నమోదైన గరిష్ట (పగటి) ఉష్ణోగ్రతలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. 1875లో ఐఎండీ ఏర్పాటైనప్పటి నుంచి ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్‌లో రికార్డయిన ఉష్ణోగ్రతలను గమనిస్తే.. 2003 మే 28న రెంటచింతలలో (ప్రస్తుత పల్నాడు జిల్లా) అత్యధికంగా 49.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఇప్పటివరకు రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రతల్లో ఇదే రికార్డు. ఆ తర్వాత స్థానంలో ప్రస్తుత తూర్పు గోదావరి జిల్లా నిడదవోలు నిలిచింది. అక్కడ 1962 మే 26న 48.9 డిగ్రీలు నమోదైంది. గన్నవరంలో 2002 మే 11న 48.8, నంద్యాలలో 1994 మే 11న 48.2, మచిలీపట్నంలో 1906 మే 25న 47.8, తునిలో 1998 మే 30న 47.5, విజయవాడలో 1980 మే 26న 47.5, ఒంగోలులో 2003 మే 31న 47.4, నరసారావుపేటలో 1983 మే 2,3 తేదీల్లో 47, నెల్లూరులో 1892 మే 15న, 1894 జూన్ 1న 46.7 డిగ్రీల ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. ఏప్రిల్ ఉష్ణోగ్రతలు ఇలా.. ఏప్రిల్ నెలలోనూ అసాధారణ ఉష్ణోగ్రతలు నమోదైన పరిస్థితులున్నాయి. గడచిన పదేళ్లలో (ఏప్రిల్‌లో) 2016 ఏప్రిల్ 25న తిరుపతిలో నమోదైన 45.7 డిగ్రీల ఉష్ణోగ్రతే అత్యధికం. ఈ రికార్డును ఆదివారం ప్రకాశం జిల్లా మార్కాపురంలో నమోదైన 46 డిగ్రీల ఉష్ణోగ్రత చెరిపేసింది. ఇంకా ఆదివారం నంద్యాల జిల్లా చాగలమర్రి, నెల్లూరు జిల్లా కలిగిరిలో 45.9 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఏప్రిల్‌లో ఎల్‌నినో వంటి ప్రత్యేక పరిస్థితుల్లో అసాధారణ ఉష్ణోగ్రతలు రికార్డవుతాయని అమరావతి వాతావరణ కేంద్రం డైరెక్టర్ ఎస్.స్టెల్లా ‘సాక్షి’కి చెప్పారు. -
‘టికెట్ ఇస్తే నాకు లేదా నా భార్యకైనా ఇవ్వండి .. తమ్ముడికి వద్దు’
మార్కాపురం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే టికెట్ వ్యవహారం కందుల సోదరుల మధ్య చిచ్చు పెట్టింది. తనకు లేదా తన భార్యకు టికెట్ ఇవ్వాలని ప్రస్తుత పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ కందుల నారాయణరెడ్డి పట్టుపడుతుంటే.. గతంలో రెండుసార్లు ఓడిపోయారు కనుక ఈసారికి తనపేరు పరిశీలించాలని ఆయన సోదరుడు రామిరెడ్డి.. చంద్రబాబును కోరారు. ఈ వ్యవహారంతో పార్టీ శ్రేణుల్లో గందరగోళం నెలకొంది. మరోవైపు జనసేన నుంచి తనకు టికెట్ ఇస్తే పోటీ చేసి గెలుస్తానంటూ ఇమ్మడి కాశీనాథ్ పవన్‌కళ్యాణ్‌ను కోరినట్లు తెలుస్తోంది. ఒంగోలు సాక్షి ప్రతినిధి: పశ్చిమ ప్రకాశంలోని మార్కాపురం టీడీపీలో ముసలం మొదలైంది. కందుల సోదరుల మధ్య కుర్చీ కోసం అంతర్గత పోరు తీవ్రమైంది. ప్రస్తుత టీడీపీ ఇన్చార్జి కందుల నారాయణరెడ్డి 2009లో మార్కాపురం నుంచి పోటీచేసి మొదటిసారి గెలుపొందారు. 2014లో వైఎస్సార్ సీపీ అభ్యర్థి జంకె వెంకటరెడ్డి, 2019లో వైఎస్సార్ సీపీ అభ్యర్థి ప్రస్తుత ఎమ్మెల్యే కుందురు నాగార్జునరెడ్డిపై భారీ తేడాతో ఓటమి పాలయ్యారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మరో దఫా పోటీ చేసేందుకు సిద్ధమయ్యాడు. ఇదే సమయంలో ఆయన సోదరుడు మాజీ జెడ్పీటీసీ కందుల రామిరెడ్డి కూడా టికెట్ రేసులో ఉండటంతో కందుల సోదరుల మధ్య అంతర్గత విభేదాలు బయటపడ్డాయి. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు కందుల నారాయణరెడ్డికి టికెట్ ఇచ్చే విషయంలో విముఖత చూపడంతో నారాయణరెడ్డి తన భార్య పేరుతో వారంరోజుల క్రితం దరఖాస్తు పంపుకున్నట్లు తెలిసింది. ప్రస్తుతం ఇది హాట్‌టాపిక్‌గా మారింది. దీంతో రామిరెడ్డి కూడా టికెట్టు కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికి మూడు సార్లు పోటీచేసి ఒక్కసారి మాత్రమే నారాయణరెడ్డి గెలుపొందడంతో తనకు అవకాశం ఇవ్వాలని కుటుంబ సభ్యులతో రామిరెడ్డి చెప్పినట్లు తెలిసింది. ఈ ఒక్కసారి తాను పోటీ చేస్తానని నారాయణరెడ్డి గట్టిగా పట్టుబట్టాడు. అయితే అధినేత చంద్రబాబు దృష్టిలో గుడ్‌విల్ లేకపోవడంతో పాటు ఇటీవల రోడ్డు యాక్సిడెంట్‌కు గురై సరిగా నడవలేకపోవడం, ప్రజల్లో అనుకున్నంత సానుభూతి లేనట్లుగా చంద్రబాబు చేయించిన సర్వేలో బయటపడటంతో ఆయన ఈసారికి నువ్వొద్దులే.. అని చెప్పడంతో తనకు కాకపోయినా తన భార్యకై నా టికెట్ ఇవ్వాలని బాబును నారాయణరెడ్డి కోరినట్లు తెలిసింది. ఈ ప్రతిపాదనపై చంద్రబాబు నుంచి ఎటువంటి సానుకూల స్పందన రాకపోవడంతో కుటుంబంలో ఆందోళన మొదలైంది. గందరగోళంలో టీడీపీ శ్రేణులు: కాగా గెలుస్తామనే ధీమా లేకున్నప్పటికీ టికెట్ విషయంలో అన్నదమ్ముల మధ్య జరుగుతున్న విభేదాలతో మార్కాపురం నియోజకవర్గ టీడీపీ కార్యకర్తల్లో గందరగోళం నెలకొంది. టికెట్ విషయంలోనే విభేదాలుంటే రేపు అన్నదమ్ముల్లో ఒకరికి టికెట్ వస్తే మరొకరు సహకరిస్తారా అన్న ప్రశ్న కూడా కార్యకర్తల్లో తలెత్తింది. ఈ విభేదాలు పార్టీకి నష్టం చేకూర్చేలా ఉన్నాయని కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సందట్లో సడేమియా లాగా జనసేన నుంచి ఒత్తిడి: టీడీపీలో టికెట్ విషయమై అన్నదమ్ముల మధ్య విభేదాలు బహిర్గతం కాగా సందట్లో సడేమియా లాగా మరో వైపు జనసేన ఇన్చార్జి ఇమ్మడి కాశీనాథ్ పొత్తులో భాగంగా మార్కాపురం సీటు జనసేనకు ఇవ్వాలని, తాను పోటీచేసి గెలిచి పవన్‌కల్యాణ్‌కు గిఫ్ట్‌గా ఇస్తానని సోమవారం ప్రకటించడంతో టీడీపీ నేతల్లో ఆందోళన మొదలైంది. టికెట్ విషయంలో తమకు ఎదురులేరని భావిస్తున్న కందుల సోదరులకు కాశీనాథ్ వైపు నుంచి టికెట్ ఇవ్వాలనే ప్రతిపాదన రావడం ఎటువంటి పరిణామాలకు దారితీస్తుందన్న చర్చ జరుగుతోంది. కాశీనాథ్ 2019లో జరిగిన ఎన్నికల్లో జనసేన అభ్యర్థిగా మార్కాపురం నుంచి పోటీచేసి ఓటమి పాలయ్యారు. కాశీనాథ్ అభ్యర్థిత్వాన్ని ఒకవేళ పార్టీ పొత్తులో భాగంగా జనసేనకు మార్కాపురాన్ని కేటాయిస్తే ఎలా అన్న చర్చ విస్తృతంగా జరుగుతోంది. ఇప్పటి వరకూ జనసేన వైపు నుంచి ఎటువంటి ప్రతిపాదన రాకపోవడంతో కందుల నారాయణరెడ్డి టికెట్ తనకేనన్న ధీమాతో ఉన్నాడు. కాశీనాథ్ కూడా ఇటీవల పవన్‌కల్యాణ్‌ను కలిసి మార్కాపురం అసెంబ్లీ స్థానాన్ని జనసేనకు కేటాయిస్తే తాను పోటీ చేస్తానని స్పష్టం చేశారు. మొత్తం మీద టికెట్ రగడ టీడీపీ, జనసేనలో విభేదాలు సృష్టిస్తోంది. -
మార్కాపురం కిడ్నీ బాధితులకు ప్రభుత్వం భరోసా
-
మార్కాపురం కిడ్నీ బాధితులకు ప్రభుత్వం భరోసా
సాక్షి, అమరావతి: శ్రీకాకుళం జిల్లా ఉద్దానం కిడ్నీ బాధితుల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ప్రకాశం జిల్లా మార్కాపురం పరిసర ప్రాంతాల్లో కిడ్నీ సమస్య బాధితులపై ప్రత్యేక దృష్టి సారించింది. వీరికి ప్రభుత్వ రంగంలో కార్పొరేట్ సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలను చేరువ చేయనుంది. ఇందులో భాగంగా మార్కాపురంలో నూతనంగా ప్రారంభించబోతున్న ప్రభుత్వ వైద్య కళాశాలకు చెందిన బోధనాస్పత్రిలో నెఫ్రాలజీ, యూరాలజీ విభాగాలను ఏర్పాటు చేస్తోంది. ఇప్పటికే నెఫ్రాలజీ విభాగం ఏర్పాటు కోసం 21 పోస్టులను కొత్తగా మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. యూరాలజీ విభాగం ఏర్పాటుకు పోస్టులు మంజూరు చేస్తూ శుక్రవారం రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. 2024–25 విద్యా సంవత్సరంలో మార్కాపురం వైద్య కళాశాల ప్రారంభం కానుంది. నేషనల్ మెడికల్ కమిషన్(ఎన్ఎంసీ) నిబంధనల ప్రకారం.. ఎంబీబీఎస్‌లో ప్రవేశాలు ప్రారంభించడానికి నెఫ్రాలజీ, యూరాలజీ విభాగాల ఏర్పాటు తప్పనిసరి కాదు. అయినప్పటికీ మార్కాపురం ప్రాంత కిడ్నీ సమస్యల బాధితులకు వైద్య సేవలను చేరువ చేయడం కోసం ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపుతోంది. ఇందులో భాగంగానే ఆ రెండు విభాగాలను ఏర్పాటు చేస్తోంది. ఇప్పటికే గత నాలుగు దశాబ్దాల ఉద్దానం కిడ్నీ సమస్యకు ప్రభుత్వం శాశ్వత పరిష్కారం చూపిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా రూ.700 కోట్లతో వైఎస్సార్ సుజలధార ప్రాజెక్ట్‌ను చేపట్టి కిడ్నీ సమస్యల ప్రభావిత గ్రామాలకు మంచినీటి సరఫరాను చేపట్టింది. అదే విధంగా రూ.85 కోట్లతో శ్రీకాకుళం జిల్లా పలాసలో డాక్టర్ వైఎస్సార్ కిడ్నీ పరిశోధన కేంద్రాన్ని, 200 పడకలతో ఆస్పత్రిని ఏర్పాటు చేసింది. వీటిని కొద్ది రోజుల క్రితం సీఎం వైఎస్ జగన్ ప్రారంభించిన విషయం తెలిసిందే. -
టీడీపీకి షాక్ .. వైఎస్సార్సీపీలో చేరిన మైనార్టీ లీడర్లు
-
‘అనారోగ్యం పేరుతో బయటకొచ్చి బాబు ర్యాలీ చేయడం దారుణం’
సాక్షి, ప్రకాశం: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డితోనే ఏపీకి భవిష్యత్తని మంత్రి ఆదిమూలపు సురేష్ పేర్కొన్నారు. గత ప్రభుత్వం ఓట్ల కోసమే వెనుకబడిన వర్గాలను వాడుకుందని విమర్శించారు. సీఎం జగన్ పాలనలోనే సామాజిక న్యాయం జరిగిందన్నారు. అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందించిన గొప్పనాయకుడు సీఎం జగన్ అని ప్రశంసించారు. నాలుగున్నరేళ్లుగా జరిగిన సంక్షేమాన్ని ప్రజలకు వివరిస్తున్నామని తెలిపారు. ప్రకశం జిల్లా మార్కాపురంలో సోమవారం ఎమ్మెల్యే కుందూరు నాగార్జునరెడ్డి ఆధ్వర్యంలో వైఎస్సార్సీపీ బస్సుయాత్ర నిర్వహించారు. 3 గంటలకు కార్యకర్తలతో కలసి పార్టీ నేతల పాదయాత్ర ప్రారంభం కాగా.. పిల్లల పార్కు మీదుగా కంభం సెంటర్ వరకు కొనసాగింది, సాయంత్రం 4:30కి వైఎస్సార్ విగ్రహం వద్ద బహిరంగ సభ నిర్వహించారు. ఈ సమావేశానికి నేతలు ఎంపీ విజయసాయిరెడ్డి, మంత్రి ఆదిమూలపు సురేష్, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ తదితరులు హాజరయ్యారు. అంతకముందు మంత్రి ఆదిమూలపు సురేష్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. సామాజిక సాధికార యాత్రకు భారీగా ప్రజా స్పందన వస్తుందన్నారు. వెనకబడిన వర్గాల నష్టాన్ని, ఇబ్బందలును గుర్తుంచి సీఎం వైఎస్ జగన్ అందుకుంటున్నారని తెలిపారు. గ్రామాలలో గొప్ప సంస్కరణలు తెచ్చిన నాయకుడు వైఎస్ జగన్ అని ప్రశంసించారు. అనారోగ్యం పేరు చెప్పి, జైలు నుంచి బయటకు వచ్చి చంద్రబాబు విజయోత్సవ ర్యాలీ చేసుకోవడం దారుణమని అన్నారు. జగనన్న పాలనలో రాష్ట్రంలో భారీగా మెడికల్ కాలేజీలు మంజూరు అయ్యాయని తెలిపారు. ‘గతంలో చంద్రబాబు 600కు పైగా హామీలిచ్చి ఏదీ నెరవేర్చలేదు. మోసం చేసేందుకు మళ్లీ వస్తున్న దొంగల ముఠాకు ప్రజలు బుద్ధి చెబుతారు. పేదలకు అండగా నిలిచిన గొప్ప నాయకుడు సీఎం జగన్.అవినీతికి తావు లేకుండా సంక్షేమ పథకాలు అందుతున్నాయి. ప్రజలను చంద్రబాబు ఏ రోజూ పట్టించుకోలేదు. అనారోగ్యం పేరుతో చంద్రబాబు బెయిల్ తెచ్చకున్నారు. తీరా బయటకొచ్చాక ఆయనకు ఆరోగ్యం బాగానే ఉంది. అనార్యోగ్యంగా ఉందని చెప్పి చంద్రబాబు ర్యాలీ చేశారు.’ అని మంత్రి ఆదిమూలపు మండిపడ్డారు. -
ప్రతి గడపకు సంక్షేమం
-
మార్కాపురం, గాజువాకలో వైఎస్ఆర్ సీపీ బస్సు యాత్ర
-
మహాయజ్ఞంలా గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం
-
మరోసారి వాత్సల్యం చూపిన సీఎం జగన్ మోహన్ రెడ్డి
-
ప్రకాశం జిల్లా మార్కాపురంలో వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం నిధులు విడుదల
-
CM Jagan: సాయం కోరితే.. సత్వర స్పందన
సాక్షి, ప్రకాశం: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మరోసారి గొప్ప మనస్సు చాటుకున్నారు. ఆపదలో సాయం అడిగిన వారికి నేనున్నానంటూ ఆపన్న హస్తం అందించారు. సీఎం జగన్ బుధవారం మార్కాపురంలో వైఎస్సార్ ఈబీసీ నేస్తం కింద ఆర్థిక సాయం అందజేశారు. కార్యక్రమం అనంతరం, తమకు సాయం అందించాలని కొందరు బాధితులు సీఎం జగన్‌ను కలిశారు. దీంతో, గొప్ప మనస్సుతో వారికి సాయం అందిస్తానని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. అధైర్యపడవద్దు.. అండగా ఉంటా.. తూర్పుగోదావరి జిల్లా మిరియంపల్లి శ్రీనివాసులు(49) వెలగపూడి రామకృష్ణ డిగ్రీ కాలేజీలో రికార్డు అసిస్టెంట్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు ఇద్దరు బిడ్డలు. కుమార్తె చంద్రగౌరి(24) అంగవైక్యలంతో జన్మించింది. చిన్నప్పటి నుంచి మాటలు కూడా రావు. కుమారుడు కూడా అంగవైకల్యంతో జన్మించాడు. తన కుటుంబ పరిస్థితి దృష్టిలో ఉంచుకుని తన బిడ్డలకు తగిన వైద్య సాయం అందించాలని సీఎం జగన్‌ను కోరారు. ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం ఇప్పించమని విజ్ఞప్తి చేశారు. ఈ క్రమంలో తగు చర్యలు తీసుకోవాలని సీఎం జగన్.. కలెక్టర్‌ను ఆదేశించారు. ప్రభుత్వం సహకారం అందిస్తామని సీఎం హమీ ఇచ్చారు. ఆపరేషన్ చేపిస్తా.. ఉద్యోగం ఇప్పిస్తా.. నాగిరెడ్డిపల్లికి చెందిన వి. మార్తమ్మకు ఇద్దరు కుమారులు. భర్త చనిపోయాడు. కూలీ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటోంది. పెద్ద కుమారుడు కిడ్నీ సమస్యతో బాధపడుతున్నాడు. ఒక కిడ్నీ పాడైపోయింది. ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయించుకోవాలని వైద్యులు సూచించారు. ఈ విషయాన్ని సీఎం జగన్ దృష్టికి తీసుకువెళ్లడంతో ముఖ్యమంత్రి.. బాధితులకు భరోసా ఇచ్చారు. అన్ని విధాల అండగా ఉంటామని హామీ ఇచ్చారు సీఎం జగన్. ప్రభుత్వం తరఫున పూర్తి వైద్య సాయం అందిస్తామని, అర్హతను బట్టి ఉద్యోగం కూడా ఇప్పిస్తామని సీఎం జగన్ తెలిపారు. తక్షణమే లక్ష రూపాయల ఆర్థిక అందించాలని కలెక్టర్‌ను ఆదేశించారు. న్యాయం చేస్తాం సాంకేతిక సమస్యల వల్ల తనకు వస్తున్న సంక్షేమ పథకాలు, పెన్షన్ నిలిచిపోయాయని ఓ వృద్ధుడు ఇచ్చిన అర్జీపై సీఎం జగన్ సానుకూలంగా స్పందించి.. న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. బొప్పరాజు నరసయ్య(60) అనే వ్యక్తి ప్రత్యేక అర్జీకి సీఎం జగన్ సానుకూలంగా స్పందించారు. తర్లుపాడు మండలం గోరుగుంతలపాడు గ్రామానికి చెందిన తనకు వికలాంగుల పెన్షన్ వస్తున్నట్లు చెప్పాడు. అయితే.. కిందటి ఏడాది ఆగష్టు నుంచి పెన్షన్‌తో పాటు ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఏవీ అందడం లేదని మార్కాపురం పర్యటన ముగించుకుని వెళ్తున్న సీఎం జగన్ దృష్టికి తన సమస్యను తీసుకెళ్లారు. సచివాలయానికి వెళ్లి అధికారులను అడిగితే.. హౌజ్హోల్డింగ్ మ్యాపింగ్‌లో తన కోడలు సచివాలయ ఉద్యోగిగా పని చేస్తోందని, రూ.12 వేల కన్నా ఎక్కువ వేతనం ఆమెకు వస్తుండడమే అందుకు కారణమని అధికారులు చెప్పారని సీఎం జగన్‌కు నరసయ్య వివరించాడు. గతంలో తాను, తన భార్య, కొడుకు-కోడలు ఒకే మ్యాపింగ్‌లో ఉన్నప్పటికీ.. రెండు నెలల కిందటి నుంచి రెండు కుటుంబాలుగా ఏపీ సేవా పోర్టల్‌లో స్ప్లిట్ చేయించుకున్నామని, సచివాలయంలో ఇందుకు సంబంధించి సర్టిఫికెట్ తీసుకున్నామని సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లారాయన. కానీ, పైస్థాయి నుంచి అనుమతి రానందున.. ఆన్లైన్లో డేటా మార్చడం కుదరదని సిబ్బంది చెప్పినట్లు సీఎం జగన్‌కు వివరించారు. తమకు సహాయం చేయాలని నరసయ్య కోరగా.. న్యాయం చేస్తామని సీఎం వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. బిడ్డను కోల్పోయా.. సహాయం చేయండి కుటుంబానికి అండగా ఉంటున్న కుమారుడిని కోల్పోయిన తమకు ప్రభుత్వం అండగా ఉండి.. ఆర్థిక సహాయం చేయాలని అర్థవీడు మండలం యాచవరం గ్రామానికి చెందిన బి.సాల్మన్, సీఎం జగన్‌ను కోరారు. ఈ మేరకు ప్రత్యేక వినతిపత్రం ఇచ్చారు. చేతికి ఎదిగి వచ్చిన కొడుకు రమేష్(24) ప్రమాదంలో చనిపోవడంతో తన కుటుంబం ఆర్థికంగా చాలా ఇబ్బంది పడుతున్నట్లు ముఖ్యమంత్రికి వివరించారు. సీఎంఆర్ఎఫ్ నుంచి సహాయం అందించాలని సాల్మన్, సీఎం జగన్‌ను కోరగా.. సంబంధిత వివరాలు తీసుకోవాలని అధికారులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశించారు. -
లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేసిన సీఎం జగన్
-
దేశంలో ఈబీసీ నేస్తం లాంటి పథకం ఎక్కడా లేదు : సీఎం జగన్
-
వైఎస్సార్ ఈబీసీ నేస్తం: సీఎం జగన్ మార్కాపురం పర్యటన (ఫొటోలు)
-
అక్క చెల్లెమ్మలను అన్ని విధాలా ఆదుకుంటున్నాం: సీఎం జగన్
-
దేశానికి ఆదర్శం సీఎం వైఎస్ జగన్
-
ఇదీ చాలెంజ్ : సీఎం జగన్
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: ‘అయ్యా.. చంద్రబాబూ.. సెల్ఫీ ఛాలెంజ్ అంటే నాలుగు ఫేక్ ఫొటోలు కాదు.. ఈ రాష్ట్రంలో ప్రతి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఇతరత్రా ప్రతి పేద ఇంటి ముందు నిలబడి.. ఈ ఇంటికి మా ప్రభుత్వం వల్ల జరిగిన మంచి ఇదీ అని చెప్పగలగాలి. అది మన ప్రభుత్వం వల్లే జరిగిందని ఆ అక్కచెల్లెమ్మలు చిరునవ్వుతో ఆశీర్వదిస్తున్నప్పుడు తీసుకునే ఫొటోను సెల్ఫీ అంటారు’ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. గత ప్రభుత్వ ఐదేళ్ల పాలనలో, నాలుగేళ్ల తమ ప్రభుత్వ పాలనలో ప్రతి ప్రాంతానికి, గ్రామానికి, ప్రతి సామాజిక వర్గానికి జరిగిన మేలు గురించి బేరీజు వేసుకునే సత్తా మీకు ఉందా.. ఇదీ ఛాలెంజ్ అని చంద్రబాబుకు సవాలు విసురుతూ నిప్పులు చెరిగారు. ప్రకాశం జిల్లా మార్కాపురంలో బుధవారం ఆయన వైఎస్సార్ ఈబీసీ నేస్తం పథకం కింద రెండో విడత నగదు పంపిణీని కంప్యూటర్లో బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘చంద్రబాబు టిడ్కో ఇళ్లు కట్టకుండా వదిలేశాడు. అలా వదిలేసిన ఇళ్లను మీ బిడ్డ హయాంలో పూర్తిగా కట్టిన చోటుకు, వేగంగా పనులు జరుగుతున్న ఇళ్ల వద్దకు వెళ్లి ఈ 75 ఏళ్ల ముసలాయన నాలుగు ఫేక్ ఫొటోలు దిగి సెల్ఫీ ఛాలెంజ్ అంటున్నాడు’ అని ఎద్దేవా చేశారు. సెల్ఫీ ఛాలెంజ్ అంటే ఫేక్ ఫొటోలు కాదన్నారు. బాబు బృందాన్ని ఇలా నిలదీయండి ► ఈ నిజాలు ప్రజలందరికీ తెలుసు. అయినా చంద్రబాబు, ఎల్లోమీడియా నిందలు, అబద్ధాలతో దుష్ప్రచారం చేస్తున్నారు. నిజంగా ఈరోజు ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ–5లు ఒక అబద్ధాన్ని నిజమని నమ్మించేందుకు దిక్కుమాలిన ఆలోచనలతో ముందుకు వెళ్తున్నాయి. ఇలాంటి అబద్ధాల బ్యాచ్‌ని నమ్మకండి. వారిని నిలదీయండి. ► గత ఐదేళ్లలో ఒక్క ఇంటి స్థలం ఇవ్వని మీరు.. ఈ ప్రభుత్వంలో ఏకంగా 30 లక్షల ఇళ్ల స్థలాలు ఇచ్చి.. అందులో కట్టిస్తున్న ఇళ్ల వద్ద సెల్ఫీ దిగే ధైర్యం, స్టిక్కర్ అంటించే దమ్ము ఉందా అని నిలబెట్టి అడగండి. ► మనందరి ప్రభుత్వంలో అమ్మ ఒడి ద్వారా 45 లక్షల మంది తల్లులకు.. 84 లక్షల మంది పిల్లలకు మంచి జరిగిందని చెబుతూ.. మీరేం చేశారని ప్రశ్నించండి. ► 53 లక్షల మంది రైతు కుటుంబాలకు వరుసగా నాలుగేళ్లుగా ప్రతి ఏటా రూ.13,500 రైతు భరోసాగా అందిందని చెప్పండి. గతంలో బేషరతుగా రుణమాఫీ చేస్తామని ఎందుకు మోసం చేశావని చంద్రబాబును అడగండి. ► అయ్యా.. చంద్రబాబూ.. రుణమాఫీ చేస్తానని మోసం చేశావు.. బ్యాంకుల్లో పెట్టిన బంగారం విడిపించి ఇంటికి ఇప్పిస్తానని చెప్పి మోసం చేశావు. చివరకు సున్నా వడ్డీ పథకాన్ని కూడా ఎగురగొట్టావ్.. మమ్మల్ని రోడ్ల మీద నిలబెట్టావ్.. అలాంటి మనిషివి నువ్వు మా ఇంటి ముందు నిలబడి సెల్ఫీ దిగే నైతికత, స్టిక్కర్ అంటించే అర్హత ఉందా.. అని పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మలు అందరూ గట్టిగా నిలబెట్టి అడగండి. ► వైఎస్సార్ చేయూత, వైఎస్సార్ కాపు నేస్తం, ఈబీసీ నేస్తం.. ఇంకా అనేక పథకాలు మా జగనన్న ఇచ్చాడు.. ఈ పథకాలకు సంబంధించిన డబ్బులు నీ పాలనలో ఎక్కడికి పోయాయి.. ఎవరు తిన్నారు.. అని 45–60 ఏళ్ల వయస్సులో ఉన్న నా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, కాపు, ఈబీసీ అక్కచెల్లెమ్మలు చంద్రబాబును అడగండి. ► ప్రభుత్వ బడి గురించి, మధ్యాహ్న భోజనం, 8వ తరగతి పిల్లలకు ట్యాబ్స్, 6వ తరగతి నుంచి ప్రతి క్లాస్‌లో డిజిటల్æ బోర్డ్, ఇంగ్లిష్ మీడియం.. సీబీఎస్సీ సిలబస్, బైలింగ్వల్ టెక్ట్స్‌బుక్స్, పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌తో విద్యా దీవెన, వసతి దీవెన, విద్యా కానుక.. ఇలాంటి ఆలోచనలు మీకు ఎప్పుడైనా తట్టాయా అని చంద్రబాబును గట్టిగా నిలదీస్తూ అడగండి. ► మీ పాలనలో ఎన్నికలకు రెండు నెలల ముందు వరకు ముష్టి ఇచ్చినట్లు రూ.వెయ్యి పింఛన్ ఎందుకిచ్చావని ఇప్పుడు రూ.2,750 పెన్షన్ తీసుకుంటున్న నా అవ్వాతాతలు, వితంతు అక్కచెల్లెమ్మలు, దివ్యాంగ అక్కచెల్లెమ్మలు నిలదీయండి. పింఛన్ మూడు వేలు కాబోతోందని చెప్పండి. ఇంత మేలు చేసిన మా బిడ్డతో కాకుండా మీతో సెల్ఫీ ఎలా దిగుతాము అని ప్రశ్నించండి. ► ఇంటింటికీ మంచి చేయడం అభివృద్ధా.. లేక రామోజీ ఇంటికి, రాధాకృష్ణ ఇంటికి, టీవీ–5 ఇంటికి.. చంద్రబాబు ఇంటికి దత్తపుత్రుడు ఇళ్లకు.. మూటలు పంపడం అభివృద్ధా.. అని గట్టిగా అడగండి. సామాజిక న్యాయం అంటే అన్ని కులాలకు మంచి చేయడమా...లేక చంద్రబాబు బృందం భోజనం చేయడమా అని ప్రశ్నించండి. ► భక్తి ఉంటే విజయవాడలో 45 గుళ్లను కూల్చేయడమా... మైనార్టీల మీద దేశ ద్రోహం కేసులు పెట్టడమా.. అని కూడా గట్టిగా అడగండి. జన్మభూమి కమిటీలు మంచివా.. లేక ప్రతి గ్రామంలో గ్రామ సచివాలయ వ్యవస్థ, వలంటీర్ల వ్యవస్థ మంచిదా అని చంద్రబాబు బృందాన్ని అడగండి. ► చంద్రబాబుకు సీఎం పదవి అంటే.. అరడజన్ దొంగలు.. గజదొంగలుగా దోచుకోవడం.. పంచుకోవడం... తినడం. అదే మీ బిడ్డ జగన్‌కు సీఎం పదవి ఇవ్వడమంటే.. ఇంటింటా అభివృద్ధి అని చెప్పండి. అన్నీ గుర్తు పెట్టుకోండి.. ► గతంలో 600 పేజీలతో ఒక మేనిఫెస్టో తీసుకొచ్చాడు. ఎన్నికలు అయిపోగానే దానిని చెత్తబుట్టలో పడేశాడు. అక్కచెల్లెమ్మలు, రైతులు, విద్యార్థులకు ఇచ్చిన మాటలు గాలికి ఎగిరిపోయాయి. ఆ మేనిఫెస్టో వాళ్ల వెబ్సైట్లో కూడా కనబడని పరిస్థితి. అదే మీ బిడ్డ ప్రభుత్వంలో మేనిఫెస్టో అంటే ఒక బైబిల్.. ఒక ఖురాన్.. ఒక భగవద్గీత. ప్రతిరోజూ, ప్రతిక్షణం ఆ మేనిఫెస్టో కోసం తపించిన మీ బిడ్డ పాలన ఎలాంటిదో ఆలోచించమని కోరుతున్నా. ► రాబోయే రోజుల్లో ఇంకా చాలా డ్రామాలు చూస్తాం. చాలా చాలా అబద్ధాలు వింటాం. వాళ్లకు ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ 5 ఉంది. తోడుగా వాళ్ల దత్తపుత్రుడు కూడా ఉన్నాడు. కానీ మీ బిడ్డకు ఇవేమీ లేవు. మీ బిడ్డ వీళ్ల మాదిరి గజ దొంగల ముఠాను నమ్ముకోలేదు. మీ బిడ్డ నమ్ముకుంది ఆ దేవుడి దయను, మిమ్ముల్ని. మీ ఇంట్లో మంచి జరిగి ఉంటే మీ బిడ్డకు మీరే సైనికులుగా మద్దతుగా నిలవండి. తేడా మీరే చెప్పండి.. ► ఈ నాలుగేళ్ల మనందరి ప్రభుత్వంలో ఎక్కడా లంచాలు, వివక్షకు చోటు లేకుండా డీబీటీ ద్వారా మీ బిడ్డ బటన్ నొక్కుతున్నాడు. నేరుగా అక్కచెల్లెమ్మల ఖాతాల్లోకి డబ్బులు వెళ్తున్నాయి. ఇంటింటికీ ఎంత మంచి చేశామో మీ అందరికీ తెలుసు. అదే గత ప్రభుత్వంలో 2014–2019 మధ్య ఒక ముసలాయన సీఎంగా ఉండేవాడు. అప్పట్లో ఈ పథకాలు ఉండేవా? ఈ బటన్ నొక్కే డీబీటీ పద్ధతి ఉండేదా? ఆ రోజు దోచుకో.. పంచుకో.. తినుకో.. (డీపీటీ). ► 2 లక్షల 7 వేల కోట్ల రూపాయలు మనందరి ప్రభుత్వంలో మన అక్కచెల్లెమ్మల ఖాతాల్లో నేరుగా జమ అయింది. గత చంద్రబాబు పాలనలో ఈ డబ్బును ఎవరు దోచుకున్నారు? ► గత చంద్రబాబు పాలనలో అక్కచెల్లెమ్మల ఖాతాల్లో ఒక్క రూపాయి అయినా వేశారా? (లేదు లేదు అని మహిళలు చేతులు పైకెత్తి చెప్పారు). ఇవాళ ఏ పథకం తీసుకున్నా నేరుగా అక్కచెల్లెమ్మల ఖాతాల్లో సొమ్ము జమ అవుతోంది. గతంలో జరగనిది.. మీ బిడ్డ జగన్ ఎలా ఇవ్వగలుగుతున్నాడో రాష్ట్రంలోని ప్రతి అన్నను, తమ్ముడ్ని.. ప్రతి అక్కను, చెల్లెమ్మను.. మొత్తంగా 1.56 కోట్ల కుటుంబాలను ఆలోచించాలని కోరుతున్నా. మా అమ్మాయి మీకు థ్యాంక్స్ చెప్పమంది అన్నా.. నా భర్త చిన్న ఉద్యోగస్తుడు. ఓసీల్లోని పేదలను గుర్తించి ఈబీసీ నేస్తం ద్వారా ఏటా రూ.15 వేలు నేరుగా మా అకౌంట్లో వేస్తున్నారు. ఈ డబ్బుకు మరికొంత కలుపుకుని కిరాణా షాపు పెట్టుకోవాలనుకుంటున్నాను. నాకు ఇద్దరు పిల్లలు. అమ్మఒడి సాయం అందింది. గతంలో ఎన్నడూ లేని విధంగా నాడు–నేడు ద్వారా మా పిల్లలు చదువుకునే పాఠశాలను బాగు చేశారు. 8వ తరగతి చదువుతున్న మా పాపకు ట్యాబ్ ఇచ్చారు. మా అమ్మాయి మీకు థ్యాంక్స్ చెప్పమంది. సొంతింటి కలను కూడా నిజం చేస్తున్నారు. ప్రజల దగ్గరకు వచ్చి పాలన అందిస్తున్న మీరు కలకాలం చల్లగా ఉండాలి. – కాసుల వెంకట అరుణ, పదో వార్డు, మార్కాపురం చదవండి: అడ్డంగా దొరికినా అడ్డదారిలోనే! మీ మేలు ఎవరూ మరచిపోరు మహిళలంతా ఆర్థికంగా వారి కాళ్లపై వారు నిలబడేలా ఎన్నో పథకాలు తీసుకొచ్చిన మీ మేలును అక్కచెల్లెమ్మలు ఎవరూ మరచి పోరు. జగనన్న పాలనలో ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉన్నారు. నారీ లోకమంతా మిమ్మల్ని దీవిస్తోంది. నాలుగేళ్లుగా సకాలంలో వర్షాలు పడి ప్రాజెక్టులు నిండాయి. పంటలు బాగా పండాయి. దిగుబడులు బాగా వచ్చాయి. పేదరికం అనే పెద్ద రోగాన్ని తరిమేయాలని మీరు తపస్సు చేస్తున్నారు. ముందు తరాలకు కూడా భరోసా ఇచ్చేలా పాలన అందిస్తున్న మీకు అన్ని వర్గాల వారు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నారు. – చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ, బీసీ సంక్షేమం, సమాచార శాఖ మంత్రి -
ప్రకాశం జిల్లా మార్కాపురానికి సీఎం జగన్
-
ఈబీసీ నేస్తం పథకం ద్వారా మహిళలకు ఆర్థిక సాయం
-
YSR EBC Nestham: లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేసిన సీఎం జగన్
లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేసిన సీఎం జగన్ రాష్ట్రవ్యాప్తంగా రెడ్డి, కమ్మ, ఆర్యవైశ్య, బ్రాహ్మణ, క్షత్రియ, వెలమలతో పాటు ఇతర ఓసీ సామాజిక వర్గాలకు చెందిన 4,39,068 మంది పేద అక్కచెల్లెమ్మలకు వైఎస్సార్ ఈబీసీ నేస్తం కింద ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రూ.658.60 కోట్ల ఆర్థిక సాయాన్ని విడుదల చేశారు. ప్రకాశం జిల్లా మార్కాపురంలో జరిగే బహిరంగ సభలో ఆయన బటన్‌నొక్కి నేరుగా వారి ఖాతాల్లో జమ చేశారు. సీఎం జగన్ ప్రసంగం: ►ఈ రోజు మరో మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం: సీఎం జగన్ ►అక్కచెల్లెమ్మలను అన్ని విధాల ఆదుకుంటున్నాం ►చిరునవ్వుతో కుటుంబాన్ని నడిపిస్తున్న గొప్ప వ్యక్తులు మహిళలు ►అక్కచెల్లెమ్మలకు సెల్యూట్ చేస్తున్నా ►అక్కచెల్లెమ్మలకు భరోసా ఇచ్చే కార్యక్రమం ►అక్కచెల్లెమ్మలకు మంచి చేయాలనే తాపత్రయంతో అడుగులు ముందుకు వేస్తున్నాం ►ఓసీ వర్గాలోని అక్కచెల్లెమ్మలకు మంచి చేయాలన్నదే లక్ష్యం ►పేదరికానికి కులం, మతం ఉండదు ►మాది మహిళ పక్షపాతి ప్రభుత్వం ►దేశంలో ఈబీసీ నేస్తం లాంటి పథకం ఎక్కడా లేదు ►రెండేళ్లలో రూ.1,258 కోట్లు ఈబీసీ నేస్తం ద్వారా మహిళల ఖాతాల్లో జమ ►ఈబీసీ నేస్తం లాంటి పథకాలు మేనిఫెస్టోలో లేకపోయినా అమలు చేస్తున్నాం ►46 నెలల్లో 2.07 లక్షల కోట్లు డీబీటీ ద్వారా లబ్ధిదారులకు అందించాం ►మహిళల సాధికారిత కోసం అనేక పథకాలు ప్రవేశపెట్టాం ►మహిళలకు 30 లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చాం ►ఒక్కో ఇంటి విలువ సుమారు రూ.10 లక్షలు ►ఈబీసీ నేస్తం, కాపు నేస్తం ఎన్నికల ముందు చెప్పిన పథకాలు కావు ►ప్రతీ మహిళను సమయానికి ఆదుకుంటున్నాం ►అక్కచెల్లెమ్మలను ఆదుకునేందుకు దిశ యాప్ ►ఏ ఆపద వచ్చినా నిమిషాల్లో పోలీసులు ఉంటారు ►ఇలాంటి యాప్ దేశంలో ఎక్కడైనా ఉందా? ►మహిళలకు 50 శాతం రిజర్వేషన్‌పై చట్టం చేశాం ►మహిళలు ఆర్థికంగా, రాజకీయంగా ఎదగాలి ►గత ప్రభుత్వంలో ఇలాంటి సంక్షేమ పథకాలు ఉన్నాయా? ►గతంలో డీపీటీ పథకం ఉండేది ►గతంలో దోచుకో, పంచుకో, తినుకో ►మా ప్రభుత్వం డీబీటీ ద్వారా డబ్బులు జమ చేసింది ►చంద్రబాబు హయాంలో ఇన్ని పథకాలున్నాయా? ►ముసలాయన పాలనలో ఒక్క రూపాయి అయినా మీ ఖాతాల్లో జమ అయ్యిందా? ►ముసలాయన పాలనలో ఎవరు పంచుకున్నారు? ►ఎవరు దోచుకున్నారు,ఎవరు తిన్నారు ఆలోచన చేయండి ►టిడ్కో ఇళ్లపై సెల్ఫీ ఛాలెంజ్ అంటా? ►సెల్ఫీ ఛాలెంజ్ అంటే నాలుగు ఫేక్ ఫోటోలు కాదు బాబు.. ►సెల్ఫీ ఛాలెంజ్ అంటే ప్రతీ ఇంటికి వెళ్లి ఏం చేశారో చెప్పండి ►ప్రజలు మంచి చేశారు అని చెబితే అప్పుడు సెల్ఫీ తీసుకోవాలి.. దాన్ని గొప్ప సెల్ఫీ అంటారు ►సీఎం జగన్ పాలనలో మహిళలంతా పండగ చేసుకుంటున్నారని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ అన్నారు. సీఎం జగన్ ఎల్లప్పుడూ రాష్ట్రాభివృద్ధి కోసమే ఆలోచిస్తారన్నారు. ►ఈబీసీ నేస్తం ద్వారా ఓసీ వర్గాల్లోని పేదలకు సీఎం అండగా ఉంటున్నారని ఎమ్మెల్యే నాగార్జునరెడ్డి అన్నారు. 40 ఏళ్ల కల పొదిలి పెద్దచెరువుకు రూ.50 కోట్లు సీఎం కేటాయించారు. 14 ఏళ్ల నుంచి పెండింగ్‌లో ఉన్న తాగునీటి సరఫరా రెండో ఫేజ్ అభివృద్ధి పనులకు సీఎం నిధులు సమకూర్చారని ఎమ్మెల్యే అన్నారు. వైఎస్సార్ మొదలుపెట్టిన వెలికొండ ప్రాజెక్ట్‌ను సీఎం జగన్ పూర్తిచేస్తారని నాగార్జునరెడ్డి పేర్కొన్నారు. ►వైఎస్ రాజశేఖర్‌రెడ్డి విగ్రహానికి నివాళులర్పించిన సీఎం జగన్ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు ►ఎస్వీకేపీ డిగ్రీ కాలేజ్ మైదానంలో బహిరంగ సభా వేదిక వద్దకు చేరుకున్న సీఎం జగన్.. వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. కాసేపట్లో బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. ఆ తర్వాత ఈబీసీ నేస్తం లబ్ధిదారులకు నగదు జమ చేయనున్నారు. మార్కాపురం చేరుకున్న సీఎం జగన్ ►ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మార్కాపురం చేరుకున్నారు. కాసేపట్లో వైఎస్సార్ ఈబీసీ నేస్తం పథకం కింద నిధులు విడుదల చేయనున్నారు. మొత్తం 4,39,068 మంది అగ్రవర్ణ పేదలకు రూ.658.60 కోట్లు అందించనున్నారు. ►ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నేడు ప్రకాశం జిల్లా మార్కాపురంలో పర్యటించనున్నారు. అక్కడ వైఎస్సార్ ఈబీసీ నేస్తం లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమచేయనున్నారు. ఉ.9 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయల్దేరి 9.55 గంటలకు మార్కాపురం చేరుకుంటారు. ►10.15 గంటల నుంచి మ.12.05 వరకు ఎస్వీకేపీ డిగ్రీ కాలేజ్ మైదానంలో బహిరంగ సభా వేదిక వద్ద వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేస్తారు. అనంతరం జరిగే బహిరంగ సభలో ప్రసంగిస్తారు. ఆ తర్వాత ఈబీసీ నేస్తం లబి్ధదారులకు నగదు జమచేస్తారు. కార్యక్రమం అనంతరం మ.12.40కు అక్కడి నుంచి తాడేపల్లికి బయల్దేరుతారు. ►రాష్ట్రవ్యాప్తంగా రెడ్డి, కమ్మ, ఆర్యవైశ్య, బ్రాహ్మణ, క్షత్రియ, వెలమలతో పాటు ఇతర ఓసీ సామాజిక వర్గాలకు చెందిన 4,39,068 మంది పేద అక్కచెల్లెమ్మలకు వైఎస్సార్ ఈబీసీ నేస్తం కింద ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం రూ.658.60 కోట్ల ఆర్థిక సాయాన్ని అందజేయననున్నారు. ►ప్రకాశం జిల్లా మార్కాపురంలో జరిగే బహిరంగ సభలో ఆయన బటన్‌నొక్కి నేరుగా వారి ఖాతాల్లో జమచేయనున్నారు. ఇప్పటికే మేనిఫెస్టోలో చెప్పిన 98.44 శాతం హామీలు నెరవేర్చడంతో పాటు, మేనిఫెస్టోలో చెప్పకపోయినా ప్రతి పేద అక్కచెల్లెమ్మకు మంచి జరగాలని, వారి కుటుంబాలు బాగుండాలని, వారికి తోడుగా ఉండాలని వైఎస్ జగన్ ప్రభుత్వం అందిస్తున్న కానుకే వైఎస్సార్ ఈబీసీ నేస్తం. మూడేళ్లలో మొత్తం రూ.45వేలు.. ►వైఎస్సార్ ఈబీసీ నేస్తం ద్వారా 45 నుండి 60 ఏళ్లలోపు ఉన్న రెడ్డి, కమ్మ, ఆర్యవైశ్య, బ్రాహ్మణ, క్షత్రియ, వెలమలతో పాటు ఇతర ఓసీ వర్గాలకు చెందిన పేద అక్కచెల్లెమ్మలకు (ఈబీసీ) ఏటా రూ.15,000 చొప్పున మూడేళ్లలో మొత్తం రూ.45,000 ఆర్థిక సాయంచేస్తూ వారు సొంత వ్యాపారాలు చేసుకుని వారి కాళ్ల మీద వారు నిలబడేటట్లు వైఎస్ జగన్ ప్రభుత్వం తోడ్పాటు అందిస్తోంది. ►ఇక నేడు అందిస్తున్న రూ.658.60 కోట్లతో కలిపి జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి ఇప్పటివరకు వైఎస్సార్ ఈబీసీ నేస్తం ద్వారా అందించిన మొత్తం సాయం రూ.1,257.04 కోట్లు. ఒక్కో అక్కచెల్లెమ్మకు ఇప్పటివరకు అందించిన సాయం రూ.30,000. అలాగే, వివిధ పథకాల ద్వారా అక్కచెల్లెమ్మలకు గత 46 నెలల్లో వైఎస్ జగన్ ప్రభుత్వం అందించిన లబ్ధి రూ.2,25,991.94 కోట్లు (డీబీటీ మరియు నాన్ డీబీటీ కలిపి) -
వైఎస్సార్ ఈబీసీ నేస్తం: సీఎం జగన్ మార్కాపురం పర్యటన షెడ్యూల్ ఇదే
సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా రెడ్డి, కమ్మ, ఆర్యవైశ్య, బ్రాహ్మణ, క్షత్రియ, వెలమలతో పాటు ఇతర ఓసీ సామాజిక వర్గాలకు చెందిన 4,39,068 మంది పేద అక్కచెల్లెమ్మలకు రూ. 658.60 కోట్ల ఆర్ధిక సాయాన్ని రేపు(బుధవారం)ప్రకాశం జిల్లా మార్కాపురంలో బటన్ నొక్కి నేరుగా వారి ఖాతాల్లో జమ చేయనున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి. దీనిలో భాగంగా ఉదయం 9 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి 9.55 గంటలకు మార్కాపురం చేరుకుంటారు సీఎం జగన్. 10.15- 12.05 గంటలకు ఎస్వీకేపీ డిగ్రీ కాలేజ్ గ్రౌండ్స్‌లో బహిరంగ సభా వేదిక వద్ద వివిధ అభివృద్ది పనులకు శంకుస్ధాపనలు, బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. అనంతరం ఈబీసీ నేస్తం లబ్ధిదారులకు నగదు జమచేయనున్నారు. కార్యక్రమం అనంతరం 12.40 గంటలకు అక్కడినుంచి బయలుదేరి 1.35 గంటలకు తాడేపల్లిలోని నివాసానికి చేరుకుంటారు. ►వైఎస్సార్ ఈబీసీ నేస్తం ద్వారా 45 నుండి 60 ఏళ్ళలోపు ఉన్న రెడ్డి, కమ్మ, ఆర్యవైశ్య, బ్రాహ్మణ, క్షత్రియ, వెలమలతో పాటు ఇతర ఓసీ వర్గాలకు చెందిన పేద అక్కచెల్లెమ్మలకు (ఈబీసీ) ఏటా రూ. 15,000 చొప్పున అదే అక్కచెల్లెమ్మలకు 3 ఏళ్ళలో మొత్తం రూ. 45,000 ఆర్ధిక సాయం చేస్తూ వారు సొంత వ్యాపారాలు చేసుకుని వారి కాళ్ళ మీద వారు నిలబడేట్టుగా తోడ్పాటు అందిస్తున్న వైఎస్ జగన్ ప్రభుత్వం. ►ఇప్పటికే మేనిఫెస్టోలో చెప్పిన 98.44 శాతం హామీలు నెరవేర్చడంతో పాటు, మేనిఫెస్టోలో చెప్పకపోయినా ప్రతి పేద అక్కచెల్లెమ్మకు మంచి జరగాలని, వారి కుటుంబాలు బాగుండాలని, వారికి తోడుగా ఉండాలని వైఎస్ జగన్ ప్రభుత్వం అందిస్తున్న కానుక – వైఎస్సార్ ఈబీసీ నేస్తం ►నేడు అందిస్తున్న రూ. 658.60 కోట్లతో కలిపి వైఎస్ జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి ఇప్పటివరకు వైఎస్సార్ ఈబీసీ నేస్తం ద్వారా అందించిన మొత్తం సాయం రూ. 1,257.04 కోట్లు. ఒక్కో అక్కచెల్లెమ్మకు ఇప్పటివరకు అందించిన సాయం రూ. 30,000. ►వివిధ పథకాల ద్వారా అక్కచెల్లెమ్మలకు గత 46 నెలల్లో శ్రీ వైఎస్ జగన్ ప్రభుత్వం అందించిన లబ్ధి రూ. 2,25,991.94 కోట్లు (డీబీటీ మరియు నాన్ డీబీటీ) అక్కచెల్లెమ్మలకు ఉద్యోగ, రాజకీయ సాధికారత ►వలంటీర్ ఉద్యోగాలు 2.65 లక్షల మందికి ఇస్తే వీరిలో 1.33 లక్షల మంది మహిళలే, 1.34 లక్షల గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాల్లో సైతం 51 శాతం మహిళలకే ►రాష్ట్రంలో నామినేటెడ్ పోస్టులు, కాంట్రాక్టుల్లో ఏకంగా చట్టం చేసి మరీ 50 శాతం మహిళలకే కేటాయింపు, నామినేటెడ్ కార్పొరేషన్ చైర్పర్సన్లుగా 51 శాతం మహిళలకే, డైరెక్టర్, మార్కెట్ యార్డ్ కమిటీ చైర్పర్సన్, రాజకీయ నియామకాల్లో 50 శాతంపైగా పదవులు అక్కచెల్లెమ్మలకే ►శాసనమండలిలో తొలిసారిగా డిప్యూటీ చైర్‌పర్సన్‌గా మహిళకు అవకాశం, కేబినెట్లో ఉప ముఖ్యమంత్రిగా, హోంమంత్రిగా, ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాలకు చెందిన మహిళలకు అవకాశం ►జిల్లా పరిషత్ చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్, మున్సిపల్ కార్పొరేషన్ మేయర్, డిప్యూటీ మేయర్, వార్డు మెంబర్, మున్సిపల్ చైర్పర్సన్, సర్పంచ్, ఎంపీటీసీ, ఎంపీపీ, జెడ్పీటీసీ పదవుల్లో 50–60 శాతం పైగా మహిళలకే ►అమ్మ కడుపులోని బిడ్డ నుండి అవ్వల వరకు, అక్కచెల్లెమ్మలకు అన్ని దశల్లోనూ అండగా నిలిచి ఆదుకుంటున్న శ్రీ వైఎస్ జగన్ ప్రభుత్వం ►గర్భవతులు, బాలింతలు, చిన్నారుల ఆరోగ్య పరిరక్షణ కొరకు వైఎస్సార్ సంపూర్ణ పోషణ ద్వారా సంపూర్ణ పోషక విలువలతో కూడిన పౌష్టికాహారం పంపిణీ ►మన బడి నాడు నేడు ద్వారా కౌమార బాలికల ఆత్మగౌరవం నిలబెట్టేలా పాఠశాలల్లో ప్రత్యేక మరుగుదొడ్ల నిర్మాణంతో పాటు రూపురేఖలు మార్చిన ప్రభుత్వ బడులు ►స్వేచ్ఛ పథకం ద్వారా కిశోర బాలికలకు ఉచితంగా శానిటరీ నాప్ కిన్స్ పంపిణీ ►మహిళల భద్రత కోసం దిశ యాప్, దిశ పోలీస్ స్టేషన్లు, గ్రామ, వార్డు సచివాలయాల్లో మహిళా పోలీసులు ►వైఎస్సార్ కళ్యాణమస్తు, వైఎస్సార్ షాదీతోఫా ద్వారా ఆర్ధిక సాయం ►అక్కచెల్లెమ్మల పేరు మీదే ఇళ్ళపట్టాలు, ఇళ్ళ రిజిస్ట్రేషన్లు ►జగనన్న అమ్మ ఒడి ద్వారా ఆర్ధిక సాయం ►వైఎస్సార్ ఆసరా, వైఎస్సార్ సున్నావడ్డీ, వైఎస్సార్ చేయూత, వైఎస్సార్ కాపు నేస్తం, వైఎస్సార్ ఈబీసీ నేస్తం, వైఎస్సార్ పెన్షన్ కానుక, జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన ద్వారా అక్కచెల్లెమ్మలకు, మహిళలకు అండగా నిలుస్తున్న వైఎస్ జగన్ ప్రభుత్వం. చదవండి: ముస్లింలపై ‘ఈనాడు’ ద్వంద్వ నీతి!.. అప్పుడు అలా.. ఇప్పుడు ఇలా -
Nallamala Forest: వన్యప్రాణుల సంరక్షణకు ప్రత్యేక చర్యలు
నల్లమల అటవీ ప్రాంతంలో వేటగాళ్ల ఉచ్చుకు వన్యప్రాణులు బలవుతున్నాయి. వేటగాళ్ల ఆటకట్టించేందుకు, అటవీ సంపదను కాపాడేందుకు అటవీశాఖ అధికారులు కఠిన చర్యలు చేపడుతున్నారు. వేటగాళ్లపై నిరంతర నిఘా పెట్టి వారి కదలికను నియంత్రిస్తున్నారు. అభయారణ్యంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంతోపాటు గూడేలలో గార్డుల నిఘాతోపాటు కొరియర్ వ్యవస్థను పటిష్టం చేస్తున్నారు. ఇటీవల కాలంలో 15 కేసులు నమోదు చేసి 35 మంది వేటగాళ్లను జైలుకు పంపారు. మార్కాపురం: ప్రకాశం జిల్లాలో 3568 చదరపు కిలోమీటర్లు విస్తీర్ణంలో నల్లమల అటవీ ప్రాంతం విస్తరించింది. మార్కాపురం, పెద్దదోర్నాల, పెద్దారవీడు, అర్థవీడు, కంభం, గిద్దలూరు, కొనకనమిట్ల, తర్లుపాడు, పొదిలి, యర్రగొండపాలెం, పుల్లలచెరువు పరిధిలో ఉన్న అటవీ సమీప గ్రామాల్లో వన్యప్రాణులను వేటాడడం, అటవీ సంపదను వేటగాళ్లు దోచుకుంటున్నారు. మార్కాపురం అటవీ శాఖ డిప్యూటీ డైరెక్టర్ పరిధిలో మార్కాపురం, దోర్నాల, కొర్రపోలు, నెక్కంటి, గంజీవారిపల్లి, యర్రగొండపాలెం, విజయపురి సౌత్‌లో అటవీ శాఖ అధికార కార్యాలయాలు ఉన్నాయి. వీరి పరిధిలో ఏడుగురు రేంజ్ ఆఫీసర్లు, పది మంది డిప్యూటీ రేంజ్ ఆఫీసర్లు, 14 మంది సెక్షన్ ఆఫీసర్లు, 60 మంది బీట్ అధికారులు ఉన్నారు. వేటగాళ్ల ఆగడాలను అరికట్టేందుకు అభయారణ్యంలో సీసీ కెమెరాలతో నిరంతర నిఘా ఏర్పాటు చేశారు. ఏమాత్రం కదలికలు కనిపించినా వారిని అదుపులోకి తీసుకుంటున్నారు. దీంతో వేటగాళ్లు గిరిజన గూడేలు, సమీప గ్రామాలను ఎంపిక చేసుకుని నిరంతరం వన్యప్రాణులను సంహరిస్తున్నారు. జింకలు, దుప్పులు, కణుతులు, కుందేళ్లను రాత్రిపూట వేటకు వెళ్లి ఉచ్చులేసి చంపి విక్రయిస్తున్నారు. దీంతో రేంజ్ ఆఫీసర్లు, బీట్ ఆఫీసర్లు గార్డులు, నిఘా పెట్టారు. కొరియర్ వ్యవస్థను మరింత పటిష్టం చేశారు. ఐదు నెలల కాలంలో 35 మందిని అరెస్టు చేసి జైలుకు పంపారు. ఈ కేసులకు సంబంధించి మార్కాపురం డిప్యూటీ డైరెక్టర్ కార్యాలయ పరిధిలో 35 మంది వేటగాళ్లను అరెస్టు చేశారు. దాదాపు 2.25 లక్షల అపరాధ రుసుము విధించారు. మార్కాపురం పరిధిలో 9 కేసుల్లో 19 మందిని, పెద్దదోర్నాల పరిధిలో 3 కేసుల్లో 10, యర్రగొండపాలెం పరిధిలో 1 కేసులో 3, విజయపురి సౌత్ పరిధిలో 2 కేసుల్లో ముగ్గురిని అరెస్టు చేశారు. రాత్రిపూట అటవీశాఖ సిబ్బంది గస్తీని పెంచారు. అటవీ ప్రాంతంలోకి ఎవరూ వెళ్లకుండా చెక్‌పోస్టులు ఏర్పాటు చేస్తున్నారు. వేటాడితే కఠిన చర్యలు వన్యప్రాణులను వేటాడితే కఠిన చర్యలు తీసుకుంటాం. వన్యప్రాణులను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉంది. అటవీ జంతువులు కనిపిస్తే ఎవరూ చంపవద్దు. జీవ వైవిధ్యాన్ని కాపాడాలి. 1972 వన్యప్రాణి చట్టం ప్రకారం శిక్షలు అమలవుతాయి. – విఘ్నేష్ అప్పావ్, డీడీ, మార్కాపురం ముఖ్య సంఘటనలు ► సెప్టెంబర్ 24న కలుజువ్వలపాడు దగ్గర కుందేళ్లను వేటాడుతున్న ఇద్దరు వేటగాళ్లను అరెస్టు చేశారు. ► సెప్టెంబర్ 1న కొనకనమిట్ల మండలం మునగపాడు వద్ద ముగ్గురు వేటగాళ్లను అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. ► నవంబర్ 7న పట్టణంలోని బాపూజీ కాలనీకి చెందిన ముగ్గురు వేటగాళ్లను అరెస్టు చేశారు. వీరితో పాటు దోర్నాల మండలం కొత్తూరు వద్ద అడవిపందిని పట్టుకుని చంపి మాంసం విక్రయిస్తున్న వేటగాళ్లను అరెస్టు చేశారు. మార్కాపురం మండలం చింతగుంట్ల పరిధిలో ఇద్దరు వేటగాళ్లను, బోడపాడు వద్ద అక్టోబర్‌లో ఇద్దరు వేటగాళ్లను అరెస్టు చేశారు. గత నెలలో గిద్దలూరులో కూడా పలువురు వేటగాళ్లను అరెస్టు చేశారు. -
పొలం గట్టున పొంచిన గండం.. రక్తపింజర, కొండచిలువలు కోకొల్లలు
మార్కాపురం డివిజన్లోని నల్లమల సమీప గ్రామాల్లో పాముల బెడదతో రైతులు వణికిపోతున్నారు. అటవీ ప్రాంతాల నుంచి జనావాసాల్లోకి వస్తున్న సర్పాలు రైతులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. పాములను చంపకుండా వాటిని జాగ్రత్తగా పట్టుకుని అడవిలో వదిలేసేందుకు అటవీశాఖ స్నేక్ వాచర్లను నియమించి.. వందల సంఖ్యలో పాముల్ని రక్షించి వాటి ఆవాసాలకు చేరుస్తోంది. మార్కాపురం(ప్రకాశం జిల్లా): పాము అంటే ప్రతి ఒక్కరికీ భయం. దేశంలో ఉన్న పాముల్లో అత్యంత విషపూరితమైన వాటిలో మొదటిది రక్తపింజర, తరువాత తాచుపాము, కట్లపాము. రక్తపింజర ఇటీవల కాలంలో మార్కాపురం ప్రాంతంలో ఎక్కువగా సంచరించటంతో ప్రజలు, పొలాలకు వెళ్లే రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. మిర్చి, పత్తి పొలాల్లో ఎక్కువగా సంచరిస్తున్నాయి. అత్యధికంగా నవంబర్ నెలలో మార్కాపురం ప్రాంతంలో అధికారికంగా స్నేక్ రెస్క్యూ టీం 103 పాములు పట్టుకోగా అందులో ఎక్కువగా ప్రమాదకరమైన రక్తపింజరలు ఉన్నాయి. మార్కాపురం ప్రాంతంలో ఇటీవల కాలంలో స్నేక్ వాచర్ నిరంజన్ 10 రోజుల వ్యవధిలో 8 రక్తపింజర పాములను పొలాల్లో పట్టుకున్నాడు. వేములకోటలో 4, కొండేపల్లి బ్రిడ్జి కింద 1, శివరాంపురం పొలాల్లో 1, ఎస్కొత్తపల్లిలో 1, పట్టణంలోని పీఎస్ కాలనీలో ఒక రక్తపింజర పామును పట్టుకున్నాడు. 5 అడుగుల పొడవుండే రక్తపింజర పాముల్లోకెల్లా అత్యంత ప్రమాదకరమైంది. కాటేసిన 40 నిమిషాల్లోపు వైద్య చికిత్స అందకపోతే చనిపోతారు. శ్వాస వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపి ఒళ్లంతా చమటలు పట్టి రక్తాన్ని పలుచన చేస్తుంది. దీంతో గుండె బలహీన పడుతుంది. ప్రాణాపాయం జరిగే ప్రమాదం ఉంది. ఎక్కువగా గడ్డి, పొదలు, పత్తి, మిరప, పొగాకు, కంది చేలల్లో రక్తపింజరలు కనిపిస్తున్నాయి. దీంతో పాటు కొండచిలువలు కూడా మార్కాపురం ప్రాంతంలో జనావాసాల్లోకి వస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. 18 అడుగుల పొడవు, 90 నుంచి 100 కిలోల బరువు ఉండే కొండచిలువలు 10 రోజుల వ్యవధిలో 3 ప్రాంతాల్లో పట్టుకుని అడవుల్లో వదిలేశారు. బుడ్డపల్లిలో 2, పొదిలి దగ్గర ఒక కొండచిలువను పట్టుకున్నారు. నల్లమల అడవుల్లో నుంచి సమీప గ్రామాల్లోకి కొండ చిలువలు వస్తున్నాయి. కోళ్లు, మేకలు, కుందేళ్లు, జింకలను తింటున్నాయి. మనిషిని చుట్టేస్తే కొండచిలువ నుంచి బయటపడటం చాలా కష్టం. పాముల పట్టివేత ఇలా: నవంబర్ నెలలో నల్లమల పరిధిలోని శ్రీశైలంలో 15, సున్నిపెంటలో 27, మార్కాపురంలో 103, వైపాలెంలో 55, దోర్నాలలో 14, విజయపురి సౌత్‌లో 23 కలిపి మొత్తం 237 పాములను పట్టుకున్నారు. డిసెంబర్ నెలలో 163 పాములను పట్టుకున్నారు. పాముకాటు సంఘటనలు అక్టోబర్ 23న కొనకనమిట్ల మండలం గనివెనపాడులో యద్దనపూడి మరియమ్మ పాటుకాటుతో మృతిచెందింది. సిద్దవరంలో ఆగస్టులో ఒకేసారి 8 మంది పాముకాటుకు గురై చికిత్స పొందారు. విషపూరితమైనవే కాదు..మేలు చేసేవీ ఉన్నాయి నల్లమల అటవీ ప్రాంతంలో అరుదైన పాములు సంచరిస్తున్నాయి. ఇందులో అత్యంత విషపూరితమైన నాగుపాము, రక్తపింజర, కట్లపాము, చిన్నపింజర, కొండ చిలువలతో పాటు రైతులకు మేలు చేసే పాములు కూడా ఉన్నాయి. జర్రిపోతు, నీరుకట్టు పాము, చెక్డ్కిల్ బ్యాక్, బ్రౌన్జి, పసిరిక పాములు ఉన్నాయి. ఇవి పొలాల్లో పంటలను నాశనం చేసే ఎలుకలు, పందికొక్కులు, తొండలు, బల్లులను తిని జీవిస్తుంటాయి. కొండ చిలువ మాత్రం కుందేళ్లు, పక్షులు, కోళ్లు, చిన్న మేకలను తింటుంది. పసిరికపాము చెట్లపైనే ఉండి తొండలను, పిట్టలను తింటుంది. అత్యంత ప్రమాదకరమైన రక్తపింజర, నాగుపాము, కట్లపాము పట్ల రైతులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. -
మార్కాపురం కుర్రాడు.. సాఫ్ట్వేర్ ఉద్యోగి, మిస్టర్ ఇండియా విజేత.. ఇప్పుడేమో ఏకంగా
Bali Mr Universe Tourism 2023- Sai Bharadwaja Reddy: తనుబుద్ధి సాయి భరద్వాజ రెడ్డి... 21 ఏళ్ల కుర్రాడు. బెంగళూరులో సాఫ్ట్వేర్ ఉద్యోగి. ఈ నెల ఒకటవ తేదీన ఒడిశా రాష్ట్రం, పూరి పట్టణంలో జరిగిన మిస్టర్ ఇండియా పోటీల్లో విజేత. వచ్చే ఏడాది మార్చి 12 నుంచి 21 వరకు ఇండోనేషియా, ‘బాలి’ దీవిలో జరిగే ‘మిస్టర్ యూనివర్స్ టూరిజమ్ –2023’ పోటీల్లో మనదేశానికి ప్రాతినిధ్యం వహించనున్నాడు. ఈ సందర్భంగా భరద్వాజ తన విజయరహస్యాన్ని సాక్షితో పంచుకున్నాడు. ‘‘మాది ప్రకాశం జిల్లా మార్కాపురం. నాన్న వ్యాపార రీత్యా విజయవాడలో పెరిగాను. నాకు ఫ్యాషన్ ప్రపంచం మీద చిన్నప్పటి నుంచి ప్యాషన్ ఉంది. ఫొటోజెనిక్‌గా కనిపించాలనే కోరిక ఉండేది. మంచి దుస్తులు ధరించడం, ఫొటోలు తీసుకోవడం ఇష్టం. బిడియపడకుండా కెమెరాను ఫేస్ చేయడం నన్ను విజేతగా నిలవడానికి కలిసి వచ్చిన ఒక అంశం. ఈ విజయం వెనుక ఐదేళ్ల కఠోరశ్రమ ఉంది. బీటెక్‌లో తొలి ప్రయత్నం మిస్ ఇండియా పోటీలలాగానే మిస్టర్ ఇండియా పోటీలు కూడా ఉంటాయని ఇంటర్లో ఉండగా తెలిసింది. బీటెక్‌లో యూనివర్సిటీ వేడుకల సందర్భంగా ఫ్యాషన్ కాంపిటీషన్ పాల్గొనడం, గెలవకపోవడం జరిగిపోయాయి. అప్పటి వరకు పోటీలను లైట్‌గా తీసుకున్నాను. పోటీని తేలిగ్గా తీసుకోరాదని అవగాహన వచ్చిన సందర్భం అది. డిప్రెషన్‌కి లోనయ్యాను కూడా. ఓటమిని జీర్ణించుకోలేని మానసిక స్థితిలో ఉన్నాననే సంగతిని నేను గ్రహించిన సందర్భం కూడా అదే. ఆ ఓటమి నాకు చాలా మంచి చేసిందనే చెప్పాలి. అప్పటి నుంచి బాడీ లాంగ్వేజ్‌ని కూడా ఈ పోటీలకు అనుగుణంగా మార్చుకున్నాను. నడవడం, నిలబడడం అన్నింటికీ ఓ లాంగ్వేజ్ ఉంటుంది. ప్రాక్టీస్ చేసేకొద్దీ నాలో ఆత్మవిశ్వాసం మెరుగవడం కూడా నాకే స్పష్టంగా తెలిసింది. ఈ పోటీలకు బాడీ బిల్డింగ్ అవసరం లేదు, ఫిట్‌గా ఉండడమే ప్రధానం. బాడీ, మైండ్, స్కిన్ ఆరోగ్యంగా ఉండాలి. ప్రకటన లేని రెండో ప్రయత్నం సెకండ్ అటెంప్ట్‌కి చాలా పక్కాగా సిద్ధమయ్యాను. గెలిచాను కూడా. అయితే కోవిడ్ కారణంగా అకస్మాత్తుగా ఫలితాల ప్రకటన లేకుండా ఆ పోటీలు అర్ధంతరంగా ముగిసిపోయాయి. ఇక మూడవ ప్రయత్నంలో ’మిస్టర్ క్లూ’గా ఎంపికయ్యాను. అయితే అది ఆన్లైన్ పోటీ. నాలుగవ ప్రయత్నంలో ఫైనల్స్‌కి ఎంపికయ్యాను, కానీ ఆర్థికపరమైన అడ్డంకి కారణంగా ఫైనల్స్‌లో పాల్గొనలేకపోయాను. నా ఫ్యాషన్ పోటీల్లో ఐదవ ప్రయత్నం ఈ ‘మిస్టర్ ఇండియా’ పోటీలు’’ అని వివరించాడు భరద్వాజ. విజేత బాధ్యత ఇది ఈ పోటీలను గ్లోబల్ మోడల్ ఇండియా ఆర్గనైజేషన్ నిర్వహించింది. ఇప్పటి వరకు మిస్టర్ ఇండియా టైటిల్ గెలుచుకున్న విజేతల్లో చిన్నవాడు భరద్వాజ. వచ్చే ఏడాది బాలిలో మిస్టర్ యూనివర్స్ టైటిల్ కోసం పోటీ పడుతున్న అనేక దేశాల ‘మిస్టర్’లలో కూడా చిన్నవాడు. మిస్టర్ ఇండియా టూరిజమ్ టైటిల్ విజేతగా... అనేక ప్రాంతాల్లో పర్యటిస్తూ భారతీయ సంస్కృతి, పర్యాటకం పట్ల అవగాహన కల్పించడం అతడి బాధ్యత. ఈ సందర్భంగా దక్షిణాది పట్ల ఉత్తరాది వారికి ఉన్న చిన్నచూపును రూపుమాపడానికి కృషి చేయాలనే ఆకాంక్షను వ్యక్తం చేశాడు. నాకు నేనే అన్నీ! పోటీదారులు ఎప్పుడూ మరొకరిలాగా కనిపించాలని అనుకరించకూడదు. నేను నాలాగే ఉన్నాను కాబట్టి విజేతనయ్యాను. మరో విషయం... నిపుణులైన కోచ్ శిక్షణ, డైటీషియన్ సలహాలు ఏవీ లేవు. ఉద్యోగం చేసుకుంటూనే ప్రాక్టీస్ చేశాను. ఉదయం ఐదింటికి లేచి జిమ్ చేసేవాడిని. ఓట్స్, ఎగ్స్ ప్రధానంగా సొంతవంట. డ్యూటీ నుంచి వచ్చిన తర్వాత మళ్లీ ఎక్సర్సైజ్. మొత్తానికి నేను అనుకున్నది సాధించాను. ‘మిస్టర్ ఇంటర్నేషనల్’ టైటిల్‌ని మనదేశానికి తీసుకురావాలనేది ప్రస్తుత లక్ష్యం. – టి. సాయిభరద్వాజ రెడ్డి, మిస్టర్ ఇండియా 2022. – వాకా మంజులారెడ్డి చదవండి: Woolen Art: ఊలుతో అల్లిన చిత్రాలు.. మానస చేతిలో దిద్దుకున్న అమ్మ మనసు రూపాలు రేణు ది గ్రేట్ -
తల్లి చెప్పిన మాటలు నచ్చక.. యువతి షాకింగ్ నిర్ణయం
మార్కాపురం(ప్రకాశం జిల్లా): ఉన్నత చదువులు చదువుకోవాలని తల్లి చెప్పిన మాటలు నచ్చక ఓ యవతి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన గురువారం మార్కాపురం పట్టణ పరిధిలోని తర్లుపాడు రోడ్డులో సబ్‌స్టేషన్ వద్ద చోటుచేసుకుంది. పట్టణానికి చెందిన నాగలక్ష్మీ కూతురు సాయిసింధు డిగ్రీ పూర్తి చేసింది. పీజీ చదవాలని తల్లి సూచించగా ఇష్టం లేదని చెప్పింది. ఉన్నత చదువులు చదివితే ఉద్యోగం వస్తుందని, పీజీలో చేరేందుకు కళశాలకు వెళ్లాలని తల్లి గురువారం మరోసారి నచ్చజెప్పింది. చదవడం ఇష్టం లేని సింధు తల్లి బయటకు వెళ్లగానే లోపల తలుపు గడియ వేసుకుని ఫ్యాన్‌కు చున్నీతో ఉరేసుకుంది. కాసేపటి తర్వాత ఇంటికి వచ్చిన తల్లి తలుపులు మూసి ఉండటంతో ఆందోళన చెంది పగులగొట్టింది. విగత జీవిగా మారిన కుమార్తెను చూసి బోరున విలపించింది. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పట్టణ ఎస్సై శశికుమార్ తెలిపారు. చదవండి: గ్యాస్ట్రబుల్ అని వెళ్తే.. షాక్ ఇచ్చిన డాక్టర్.. ఎంత పనిచేశాడంటే? -
అటవీశాఖ.. సరికొత్తగా
జిల్లాల పునర్విభజన తరువాత పరిపాలనా సౌలభ్యం కోసం అటవీ శాఖను కూడా రాష్ట్ర ప్రభుత్వం పునర్ వ్యవస్థీకరించింది. వివిధ ఫారెస్టు రేంజ్‌ల మార్పులతో పాటు సెక్షన్లు, బీట్ల విభజన కూడా చేశారు. మార్కాపురం, గిద్దలూరు వన్యప్రాణి సంరక్షణ ప్రాంతాలను పులుల అభయారణ్యం కిందకు మార్చారు. ఇప్పటి వరకు డీఎఫ్‌వో కేడర్ పోస్టులు ఉండగా.. వారి స్థానంలో డిప్యూటీ డైరెక్టర్లను కేటాయించారు. ఆ మేరకు అధికారులు బాధ్యతలు స్వీకరించారు. ఒంగోలు సబర్బన్: రాష్ట్ర ప్రభుత్వం అటవీ శాఖను పునర్ వ్యవస్థీకరించింది. అందులో భాగంగా రెగ్యులర్ ఫారెస్ట్ (రిజర్వు), వన్యప్రాణి సంరక్షణ విభాగాలుగా ఉన్న వాటిలో మార్పులు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రెగ్యులర్ ఫారెస్ట్ విభాగాన్ని మొత్తం జిల్లాలోని 28 మండలాలతో కూడిన పరిధిని ఏర్పాటు చేస్తూ కూడా ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది. రెగ్యులర్ ఫారెస్ట్ డీఎఫ్ఓ కార్యాలయాన్ని గిద్దలూరు నుంచి జిల్లా కేంద్రం ఒంగోలుకు మార్చారు. ఒంగోలు డీఎఫ్ఓగా కే.మోహనరావును ప్రభుత్వం నియమించింది. పునర్ వ్యవస్థీకరణలో భాగంగానే రెగ్యులర్ అటవీ శాఖ విభాగాన్ని మూడు రేంజ్‌లుగా, వాటి పరిధిలో 13 సెక్షన్లు, 31 బీట్లు ఉండేలా విభజించారు. రెగ్యులర్ ఫారెస్ట్ డీఎఫ్ఓ కార్యాలయం పరిధిలో మొత్తం 28 మండలాల పరిధిలో 1,11,834.140 హెక్టార్ల రిజర్వు ఫారెస్ట్ భూములు ఉన్నాయి. డీఎఫ్ఓ కార్యాలయాన్ని ఒంగోలు దక్షిణ బైపాస్ రోడ్డులోని గతంలో ఒంగోలు రేంజ్ కార్యాలయం ప్రాంగణంలో ఏర్పాటు చేశారు. సామాజిక అటవీ విభాగానికి (సోషల్ ఫారెస్ట్) ఎలాంటి మార్పులు చేయలేదు. డీఎఫ్ఓ కార్యాలయం యధావిధిగా ఒంగోలులోనే ఉంటుంది. సామాజిక వన విభాగం డీఎఫ్‌వోగా ఉన్న మహబూబ్ బాషాను బదిలీ చేసి ఆయన స్థానంలో సునీతను నియమించారు. గిద్దలూరు, గిద్దలూరు డీడీలు శ్రీశైలం పులుల అభయారణ్యం పరిధిలోకి... అటవీ విభాగాల పునర్ వ్యవస్థీకరణలో భాగంగా మార్కాపురం, గిద్దలూరు డిప్యూటీ డైరెక్టర్ పులుల అభయారణ్యం కార్యాలయాలు శ్రీశైలంలోని డైరెక్టర్ పులుల అభయారణ్యం కార్యాలయం పరిధిలోకి వెళ్లిపోయాయి. గతంలో వన్యప్రాణి సంరక్షణ డివిజన్‌గా ఉన్న మార్కాపురాన్ని శ్రీశైలం పులుల అభయారణ్యంలోకి విలీనం చేశారు. ఇప్పటి వరకు మార్కాపురం డీఎఫ్‌వో కేడర్‌లో ఉండేది. దానికి డిప్యూటీ డైరెక్టర్ హోదా కల్పించారు. దాంతో పాటు గిద్దలూరులో రెగ్యులర్ ఫారెస్ట్ (అటవీ డివిజన్)ను డీఎఫ్ఓ కార్యాలయాన్ని ఒంగోలుకు తరలించటంతో గిద్దలూరు ప్రాంతాన్ని పులుల అభయారణ్యం పరిధిలో చేర్చారు. గిద్దలూరు కార్యాలయాన్ని కూడా డిప్యూటీ డైరెక్టర్ హోదా కల్పించి శ్రీశైలం టైగర్ ప్రాజెక్టు పరిధిలోకి మార్చారు. గిద్దలూరు టైగర్ ప్రాజెక్టు పరిధిలో కొన్ని మండలాలతో పాటు, నల్లమల అభయారణ్యం ఉంటుంది. ఒంగోలు కార్యాలయంలో సేవలు అందుబాటులో ఒంగోలు నగరంలోని డీఎఫ్ఓ కార్యాలయంలో ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవలు అందిస్తాం. గతంలో ఏ పని కావాలన్నా జిల్లాలోని నలుమూలల నుంచి గిద్దలూరు డీఎఫ్ఓ కార్యాలయానికి రావాల్సి వచ్చేది. ప్రజలకు ఎలాంటి అనుమతులు కావాలన్నా ఒంగోలు డీఎఫ్ఓ కార్యాలయాన్ని సంప్రదించవచ్చు. – కే.మోహన రావు, డీఎఫ్ఓ, రెగ్యులర్ ఫారెస్ట్ -
రిటైర్డ్ హెచ్ఎం రాంభూపాల్‌రెడ్డి ఔదార్యం
ఒంగోలు అర్బన్(ప్రకాశం జిల్లా): రాచర్ల మండలం యడవల్లి గ్రామానికి చెందిన రిటైర్డ్ హెచ్ఎం మార్కాపురం రాంభూపాల్‌రెడ్డి తన పెన్షన్ సొమ్ముతో వెయ్యి మంది కార్మికులకు బీమా ప్రీమియం చెల్లించేందుకు ముందుకు వచ్చి ఔదార్యం చాటుకున్నారు. ఈ మేరకు సోమవారం స్పందన భవనంలో అంగీకార పత్రాన్ని కలెక్టర్ దినేష్‌కుమార్‌కు అందజేశారు. యడవల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని కార్మికులకు బీమా చెల్లిస్తానని అంగీకారం తెలిపారు. గతంలో రిటైర్మెంట్ బెన్ఫిట్స్ మొత్తం రూ.26 లక్షలు స్థానిక పోస్టాఫీస్‌లో డిపాజిట్ చేసి దానిపై వచ్చే వడ్డీతో సుకన్య సమృద్ధి యోజన ఖాతాల ద్వారా సుమారు 100 మందికి పైగా పేద బాలికలకు జమ చేస్తున్ననాని తెలిపారు. దీనిపై దేశ ప్రధాని కూడా అభినందించిన విషయం గుర్తుచేశారు. సేవా భావంతో రిటైర్డ్ ఉద్యోగి పనిచేయడం అభినందనీయమని కలెక్టర్ పేర్కొన్నారు. (క్లిక్: 100 మందికి సుకన్య సమృద్ధి యోజన) -
100 మందికి సుకన్య సమృద్ధి యోజన
సాక్షి, న్యూఢిల్లీ: ఉద్యోగ విరమణతో వచ్చిన సంపాదనతో 100 మందికి సుకన్య సమృద్ధి యోజన ఖాతాలు ప్రారంభించిన ఆంధ్రప్రదేశ్‌లోని మార్కాపురం వాసి రాంభూ పాల్‌రెడ్డిని ప్రధాని నరేంద్ర మోదీ అభినందించారు. ఈ అంశాన్ని ఆదివారం మన్‌కీ బాత్‌లో ప్రధాని ప్రస్తావించారు. ‘‘సమాజానికి సేవ చేయాలనే మంత్రం మన విలువలు, సంస్కారంలో ఒక భాగం. దేశంలో లెక్కలే నంత మంది ఈ మంత్రాన్ని తమ జీవిత లక్ష్యంగా చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని మార్కాపురంలో ఉంటున్న మిత్రుడు రాంభూ పాల్ రెడ్డి గురించి తెలుసుకున్నా. తన రిటైర్మెం ట్ తర్వాత వచ్చిన సంపాదనంతా చదువుకొనే కుమార్తెలకు విరాళంగా ఇచ్చారని తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోతారు. సుకన్య సమృద్ధి యోజన కింద 100 ఖాతాలు తెరవడంతో పాటు వారికి రూ.25 లక్షలు డిపాజిట్ చేశారు’’ అని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ప్రకాశం జిల్లా రాచర్ల మండలం యడవల్లికి చెందిన మార్కాపురం రాంభూపాల్‌రెడ్డి 35 ఏళ్లపాటు ఉపాధ్యాయుడిగా, ప్రధానోపాధ్యాయుడిగా సేవలందించి గతేడాది పదవీ విరమణ చేశారు. రిటైర్మెంట్ ద్వారా వచ్చిన రూ.25,71,676 యడవల్లి పోస్టాఫీసులో డిపాజిట్ చేశారు. (క్లిక్: ఇందుకూరు పేట.. కూరగాయల తోట) -
3 Burnt Alive: ఆ స్నేహాన్ని మృత్యువు కూడా విడదీయలేకపోయింది
ఆశలు సజీవ దహనమయ్యాయి. కంటి దీపాలు కొడిగట్టాయి.. ఎదిగి వచ్చిన పిల్లలు ఇక లేరనే నిజాన్ని ఆ తల్లిదండ్రులు ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు.. ఆసుపత్రి ఆవరణ కన్నీటి సంద్రమైంది.. ఆనవాళ్లు తప్ప కడచూపునకూ నోచుకోని దయనీయ ప్రమాదం మూడు కుటుంబాల్లో విషాదం నింపింది.. జీవితంలో బాగా స్థిరపడాలనే లక్ష్యాన్ని విధి కాలరాసినా.. ఆ స్నేహాన్ని మృత్యువు కూడా విడదీయలేకపోయింది. – మార్కాపురం/భాకరాపేట చిత్తూరు జిల్లా భాకరపేట సమీపంలోని చిన్నగొట్టిగల్లు గ్రామానికి చెందిన రావూరి తేజ(29), సాకిరి బాలాజీ(21), పటాన్ ఇమ్రాన్ ఖాన్(23) ముగ్గురు స్నేహితులు. ఈ నెల 16న తమ స్నేహితుడైన నరేంద్ర కారును తీసుకుని తేజ గుంటూరు జిల్లా దాచేపల్లిలో టెలికం శాఖలో డ్రైవర్‌గా పనిచేస్తున్న ఇమ్రాన్‌ఖాన్ దగ్గరకు వచ్చాడు. అతడిని కారులో ఎక్కించుకుని కడపకు వెళ్లాడు. అక్కడికి మరో స్నేహితుడు తిరుపతికి చెందిన బాలాజీ చేరుకున్నాడు. ముగ్గురూ కలిసి 17వ తేదీ ఉదయం కడప నుంచి శ్రీశైలానికి బయలుదేరారు. అదేరోజు సాయంత్రం మార్కాపురం మండలం జంగంగుంట్ల–తిప్పాయపాలెం గ్రామాల మధ్య కారు టైరు పంక్చర్ కావడంతో ఎదురుగా వస్తున్న కంటైనర్ లారీని ఢీకొంది. కారు పెట్రోల్ ట్యాంక్‌కు నిప్పు అంటుకోవడంతో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. డోర్లు తెరుచుకోకపోవడం, మంటలు ఎక్కువ కావడంతో కారులోనే ముగ్గురూ సజీవ దహనమయ్యారు. మృతదేహాల గుర్తింపు ఇలా.. కారులో ఉన్న ముగ్గురు సజీవ దహనం కావడం, సమాచారం లేకపోవడంతో కారు నంబర్ ఆధారంగా పోలీసులు కారు యజమానికి ఫోన్ చేశారు. ముందుగా డ్రైవింగ్ సీట్లో ఉన్న తేజ వివరాలు సేకరించారు. తిరుపతి జిల్లా బాకరాపేట వాసిగా గుర్తించి వారి కుటుంబ సభ్యుల సాయంతో మిగిలిన ఇద్దరి వివరాలు తెలుసుకున్నారు. తల్లిదండ్రులు వచ్చి డ్రైవింగ్ సీటులో ఉన్న వ్యక్తిని తేజగా, పక్కనే చేతికి ఉన్న ఉంగరం ఆధారంగా ఇమ్రాన్‌ఖాన్, వెనుక సీటులో ఉన్న వ్యక్తిని బాలాజీగా గుర్తించారు. మృతదేహాలకు డీఎన్ఏ టెస్టు చేయనున్నట్లు రూరల్ ఎస్ఐ సుమన్ తెలిపారు. ప్రమాద ఘటనపై సమగ్ర దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ ఆంజనేయరెడ్డి పేర్కొన్నారు. కాగా మృతుల తల్లిదండ్రులు, బంధువుల ఆర్తనాదాలతో మార్కాపురం జిల్లా వైద్యశాల మార్మోగింది. చదవండి: (Hyderabad: స్టేజీపై నుంచి పడి ఇంటెలిజెన్స్ ఏడీ దుర్మరణం) భాకరాపేటలో విషాద ఛాయలు ముగ్గరు స్నేహితులు కారు ప్రమాదంలో సజీవ దహనమైన ఘటనతో భాకరాపేటలో విషాదం అలుముకుంది. మంగళవారం రాత్రికే మృతుల కుటుంబ సభ్యులు, స్నేహితులు భారీగా మార్కాపురం చేరుకున్నారు. బుధవారం ఉదయం మృతదేహాలను గుర్తించే విషయంలో ప్రతి ఒక్కరి హృదయం బరువెక్కింది. ఆసుపత్రి ఆవరణ కన్నీటి సంద్రమైంది. మధ్యాహ్నం పైన పోస్టుమార్టం పూర్తి కాగా.. అర్ధరాత్రికి మృతదేహాలను భాకరపేటకు తరలించారు. రెండు వారాల్లో కువైట్ వెళ్లేవాడు ‘నా కుమారుడు తేజ కువైట్‌కు వెళ్లేందుకు పాస్‌పోర్టు, వీసా సిద్ధం చేసుకున్నాడు. ప్రస్తుతం ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో టీం లీడర్‌గా పనిచేస్తున్నాడు. శ్రీశైలంతోపాటు కనకదుర్గమ్మను దర్శించుకుని కువైట్ వెళ్దామని భావించి స్నేహితులతో కలిసి కారులో బయలుదేరాడు. సాయంత్రం 5.30–6 గంటల మధ్య ఫోన్ ద్వారా సమాచారం అందడంతో నమ్మలేకపోయా. తనకు కుమార్తె హాసిని అంటే చాలా ప్రేమ, నిన్న కూడా మాట్లాడాడు. డాడీ లేడు అన్న విషయాన్ని ఎలా చెప్పాలో అర్థంకావడం లేదు’ అంటూ తల్లిదండ్రులు వసంత, భాస్కర్ బోరున విలపించారు. భాకరాపేటలోని బీసీ కాలనీలో తేజ కుటుంబం నివాసం ఉంటోంది. భాస్కర్ పెయింటర్‌గా పనిచేస్తూ కుమారుడిని బెంగళూరులో ఇంజినీరింగ్ చదివించారు. టూర్ అంటే పంపించేదాన్ని కాదు ‘నా కొడుకు బాలాజీ బెంగళూరులో హోటల్ మేనేజ్మెంట్ పూర్తి చేశాడు. వచ్చే నెలలో ఉద్యోగంలో జాయిన్ కావాల్సి ఉంది. ఫ్రెండ్స్‌తో బయటకు వెళ్తున్నానని చెప్పాడే కానీ టూర్ అని చెప్పలేదు. అలా అయితే పంపెదాన్నే కాదు’ అంటూ తల్లి ఇందిర, తండ్రి సత్యనారాయణ కన్నీటి పర్యంతమయ్యారు. టీటీడీ ఉద్యోగస్తులైన ఈ దంపతులకు ఇద్దరు సంతానం. పెద్ద కుమారుడు బాలాజీ కాగా రెండో కుమారుడి పేరు కూడా బాలాజీనే. కుమారుడి మరణ వార్తను తట్టుకోలేకపోతున్నారు. ఉద్యోగ రీత్యా తిరుపతిలో ఉంటున్నారు. ఇలా జరుగుతుందనుకోలేదు.. ‘నా కుమారుడు ఇమ్రాన్‌ఖాన్ డిప్లొమో చదివి గుంటూరు జిల్లా దాచేపల్లి టెలికం శాఖలో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ముగ్గురూ మంచి స్నేహితులు. అర్ధంతరంగా చనిపోయారంటే నమ్మలేకపోతున్నాన’ని తండ్రి మస్తాన్‌ఖాన్ విలపిస్తూ చెప్పారు. ఒక్కడే కుమారుడు కావడంతో మరణ వార్తను తల్లి నజీరా, ఇద్దరు అక్కలు తట్టుకోలేకపోతున్నారు. భాకరాపేటలోని తలకోన రోడ్డులో ఇమ్రాన్ కుటుంబం నివాసం ఉంటోంది. -
కారులో ముగ్గురు సజీవ దహనం
మార్కాపురం/భాకరాపేట: ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలో మంగళవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తిరుపతి జిల్లా చిన్నగొట్టిగల్లు మండలం భాకరాపేటకు చెందిన ముగ్గురు యువకులు సజీవదహనం అయ్యారు. టైరు పేలి అదుపు తప్పిన కారు.. కంటైనర్ లారీని ఢీకొనడంతో స్నేహితులు సాకిరి బాలాజీ (21), పటాన్ ఇమ్రాన్‌ఖాన్ (21), రావూరి తేజ (29) నిలువునా కాలిపోయారు. తేజ పాస్‌పోర్ట్ పనిమీద ముగ్గురు విజయవాడ వెళ్లారని, తిరుగు ప్రయాణంలో ఈ ఘోరం జరిగిందని భావిస్తున్నారు. కంభం వైపు నుంచి మార్కాపురం వైపు వస్తున్న ఏపీ39 డీఈ 6450 నంబరు కారు తిప్పాయపాలెం–జంగంగుంట్ల మధ్య మిట్టమీదిపల్లి అడ్డరోడ్డు వద్దకు రాగానే టైరు పేలిపోయింది. దీంతో కుడివైపు మార్కాపురం నుంచి కంభం వైపు వెళుతున్న కేఏ14 సీ 2949 నంబరు కంటైనర్ లారీని ఢీకొంది. కారులో ఉన్న పెట్రోల్ ట్యాంక్‌కు మంటలు అంటుకోవడంతో అందులోని ముగ్గురు సజీవ దహనమయ్యారు. మంటలు ఎగిసిపడుతుండటంతో కారు వద్దకు వెళ్లేందుకు ఎవరూ సాహసించలేదు. డీఎస్పీ డాక్టర్ కిశోర్‌కుమార్, సీఐ ఆంజనేయరెడ్డి సమాచారం ఇవ్వడంతో వచ్చిన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. కారు నంబరు ఆధారంగా యజమాని చిత్తూరు జిల్లా రొంపిచెర్ల మండలం మోటుమల్లెలపాలెం పోస్టు, ఆదినారాయణవారిపల్లికి చెందిన ఈటెలమర్రి నరేంద్రగా గుర్తించి పోలీసులు అతడికి సమాచారమిచ్చారు. తాను కారును బాడుగకు ఇచ్చానని నరేంద్ర పోలీసులకు తెలిపారు. దీంతో డ్రైవర్ రావూరు తేజ అయి ఉండవచ్చని అనుమానించిన పోలీసులు వివరాలు సేకరించారు. మూడు కుటుంబాల్లో విషాదం భాకరాపేటకు చెందిన సాకిరి బాలాజీ, పటాన్ ఇమ్రాన్‌ఖాన్, రావూరి తేజ స్నేహితులు. వీరు ముగ్గురు ఎక్కడికెళ్లారో తమకు తెలియదని తల్లిదండ్రులు చెబుతున్నారు. స్నేహితులు మాత్రం త్వరలో గల్ఫ్‌కు వెళ్లాలనుకుంటున్న రావూరి తేజ పాస్‌పోర్ట్ పనిమీద విజయవాడ వెళ్లారని చెబుతున్నారు. బాలాజీ తండ్రి సత్యనారాయణ, తల్లి ఇంద్ర టీటీడీలో పనిచేసి రిటైరయ్యారు. వీరికి ఇద్దరు కుమారులు కాగా.. మృతుడు పెద్ద కుమారుడు. పటాన్ ఇమ్రాన్‌ఖాన్ తండ్రి మస్తాన్ పంక్చర్ షాపు నిర్వహిస్తున్నారు. ఆయనకు ముగ్గురు సంతానం కాగా.. ఇద్దరు ఆడపిల్లలు, ఒక కుమారుడు. రావూరి తేజ తండ్రి భాస్కర్ పెయింటర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. ఆయన ఒక్కగానొక్క కుమారుడు తేజ తండ్రికి సాయంగా ఉండేందుకు గల్ఫ్ వెళ్లాలని ప్రయత్నిస్తున్నాడు. ఇంతలోనే జరిగిన ఈ ప్రమాదం మూడు కుటుంబాల్లో విషాదం నింపింది. -
మార్కాపురం: ఆ భయంతోనే యువతి ఆత్మహత్యాయత్నం
ప్రకాశం: మార్కాపురం లాడ్జిలో యువతి ఆత్మాహత్యయత్నం కేసులో విస్మయానికి గురి చేసే విషయం వెలుగు చూసింది. చదువుల తల్లి అయిన ఆ విద్యార్థిని.. పిచ్చిగా మూఢనమ్మకంతోనే ఆత్మహత్య చేసుకోవాలని అనుకుందట. ఈ కేసులో పూర్తి వివరాలు తెలిశాక తల్లిదండ్రులతో పాటు పోలీసులు సైతం షాక్ తిన్నారు. ప్రకాశం జిల్లాలోని సీఎస్ పురంలో అగ్రికల్చరల్ బీఎస్సీ చదువుతోంది సదరు యువతి. పరీక్షలు అయిపోవడంతో కాలేజీకి సెలవులు ఇచ్చారు. అయితే ఇంటికని చెప్పి బయలుదేరిన ఆమె.. మార్కాపురంలోని ఒక ప్రైవేట్ లాడ్జిలో ఏప్రిల్ 27వ తేదీన బసచేసింది. అక్కడి నుంచి ఆమె తన తండ్రికి సూసైడ్ నోట్ వాట్సాప్ చేసి.. ఆత్మహత్యకు ప్రయత్నించింది. ఆయన సకాలంలో స్పందించి పోలీసులను అప్రమత్తం చేయడంతో.. విద్యార్థిని ప్రాణాపాయం నుంచి బయటపడింది. ఈ కేసులో విచారణ చేపట్టిన పోలీసులకు ఆమె అసాధారణమైన విషయాలు వెల్లడించింది. తన ఆత్మహత్యాయత్నం వెనుక ఒక బాబా ప్రమేయం ఉందని తెలిపింది. ఇంతకీ ఆ బాబా ఏం చెప్పాడంటే.. ఆమె కుటుంబానికి పాము పగ పట్టిందని, దాని వెనుక ఉంది ఆమెనే అని. గతంలో ఆమె నీడ పడి రెండు పాములు రక్తం కక్కుకుని చచ్చిపోయాయట. వాటి పగతో శాపం తగిలిందని, ఆమె కుటుంబం సర్వనాశనం అవుతుందని ఆ బాబా చెప్పాడట. ఈ విషయాన్ని ఆమె బలంగా నమ్మింది. ఇదంతా తన వల్లే అనుకుంది. అందుకే నాలుగు పేజీల లేఖ రాసి స్వగ్రామం మాచర్లలో నివసిస్తున్న తన తండ్రికి వాట్సప్ ద్వారా ఫోటో తీసి పంపించింది. అనంతరం బ్లేడు తో చేయి కోసుకుంది. ప్రాణాపాయ స్ధితిలో ఉన్న విద్యార్ధినిని వెంటనే మార్కాపురం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. సకాలంలో వైద్యం అందడంతో ఆమె బతికింది. ఇంత చదువు చదివి.. ఇలాంటి మూఢనమ్మకాలకు లొంగిపోవడమేంటంటూ ఆమెకు కౌన్సెలింగ్ ఇప్పించే ప్రయత్నం చేస్తున్నారు. మనిషికి ఉండేది ఒక్కటే జీవితం. ఆత్మహత్య అన్ని సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com -
పలక కళకళ
ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన మార్కాపురం పలకల పరిశ్రమ మళ్లీ జీవం పోసుకుంటోంది. కరోనాతో ఎగుమతి ఆర్డర్లు లేక మూతపడిన ఫ్యాక్టరీలు కరోనా తగ్గడంతో మళ్లీ తెరుచుకుంటున్నాయి. ఇప్పుడిప్పుడే వివిధ దేశాలు ఆంక్షలు ఎత్తివేస్తుండటంతో ప్రస్తుతం దాదాపు 15 ఫ్యాక్టరీల్లో పనులు జరుగుతున్నాయి. సుమారు 3 వేల మంది కూలీలు ఉపాధి పొందుతున్నారు. మార్కాపురం: కరోనా పూర్తిగా తగ్గుముఖం పట్టడంతో అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన ప్రకాశం జిల్లా మార్కాపురం పలకల పరిశ్రమకు మంచి రోజులు రానున్నాయని పారిశ్రామికవేత్తలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. రెండేళ్లుగా కరోనా కారణంగా ఆంక్షలతో ఫ్యాక్టరీలు మూతపడ్డాయి. నాలుగైదు నెలల నుంచి ఆంక్షలు ఎత్తి వేయటంతో యజమానులు ఫ్యాక్టరీలను తెరవటంతో మళ్లీ ఇండస్ట్రియల్ ఎస్టేట్ కళకళలాడుతోంది. ఫ్యాక్టరీలు మూతపడటంతో 6 వేల మందికి పైగా కార్మికులు పనులు లేక భవన నిర్మాణ కార్మికులుగా, ఇతరత్రా కూలీలుగా మారారు. మరికొందరు వలసలు పోయారు. 2010లో ఈ ప్రాంతంలో సుమారు 100 ఫ్యాక్టరీలు ఉండేవి. టీడీపీ హయాంలో అనుసరించిన పారిశ్రామిక విధానాలు, రాయితీల ప్రోత్సాహం లేకపోవటం, విద్యుత్ చార్జీలు పెంచటం, కూలీల చార్జీలు పెరగటం, ఎగుమతుల ఆర్డర్లు లేకపోవటంతో సంక్షోభం ఏర్పడింది. దీంతో 2015 నాటికి ఫ్యాక్టరీల సంఖ్య 30కి చేరింది. మళ్లీ కరోనా రావటంతో అమెరికా, సింగపూర్, మలేషియా, శ్రీలంక వంటి దేశాలకు విమానాలు లేక పూర్తిగా ఎగుమతులు నిలిచిపోయాయి. ఇప్పుడిప్పుడే వివిధ దేశాలు ఆంక్షలు ఎత్తివేయటంతో ప్రస్తుతం ఇండస్ట్రీలో దాదాపు 15 ఫ్యాక్టరీలలో పనులు జరుగుతున్నాయి. ప్రస్తుతం అమెరికాకు మాత్రమే షిప్‌లలో కొంత మేర ఎగుమతులు పంపుతున్నారు. దేశీయంగా కేరళ, తెలంగాణ, మహారాష్ట్ర, ఢిల్లీ, చెన్నై ప్రాంతాలకు లారీల ద్వారా డిజైన్ స్లేట్స్ పంపుతున్నారు. సుమారు 3 వేల మంది కూలీలు గని కార్మికులుగా, ఫ్యాక్టరీ వర్కర్లుగా, అనుబంధంగా ఉండే బలపాల పరిశ్రమలో కూడా పని చేస్తున్నారు. పలకల గనులు మార్కాపురం, తర్లుపాడు, కొనకనమిట్ల, దొనకొండ మండలాల్లోని తుమ్మలచెరువు, రాయవరం, కలుజువ్వలపాడు, గానుగపెంట, పోతలపాడు, గజ్జలకొండ, మల్లంపేట, పెద్దయాచవరం, నాయుడుపల్లె తదితర గ్రామాల్లో సుమారు 15 కి.మీ మేర విస్తరించి ఉన్నాయి. కార్మికులు వివిధ రంగాల్లో పని చేస్తున్నారు. అయితే అంతర్జాతీయంగా వచ్చిన మార్పులు, గత 8 ఏళ్లుగా ప్రభుత్వాలు పలకల పరిశ్రమల అభివృద్ధికి సహకరించకపోవటంతో ఒక్కొక్కటిగా మూతపడుతూ ప్రస్తుతం 30కి చేరాయి. జీఎస్టీ అదనపు భారం కావటం, విద్యుత్ చార్జీలు పెరగటం, ఎగుమతుల ఆర్డర్లు తగ్గటంతో పలకల పరిశ్రమ ప్రాభవం తగ్గింది. ఇదే సమయంలో చైనాలో కూడా మార్కాపురం పలకల పరిశ్రమలో లభించే రాయి దొరకటం, వారు తక్కువ రేటుకు ఇస్తుండటంతో అమెరికా, శ్రీలంక, సింగపూర్ లాంటి దేశాల వారు చైనా నుంచి తెప్పించుకుంటున్నారు. సుమారు 15 ఏళ్ల కిందట పలకల వాడకం ఎక్కువగా ఉండేది. కంప్యూటర్లు రావటం, విద్యా వ్యవస్థలో మార్పుల వలన పలకల వాడకం తగ్గిపోయింది. దీంతో మార్కాపురం పలకల వ్యాపారులు పలకల రాయిని డిజైన్ స్లేట్‌గా మార్పు చేశారు. మొజాయిక్, పింక్, ఆటమ్, మల్టీకలర్ తదితర రంగుల్లో మార్కాపురం పలకల రాయి లభిస్తుంది. దీనిని వివిధ సైజుల్లో కట్ చేసి గృహాలకు అందంగా అలంకరించేందుకు చెన్నై, ముంబయ్, కోల్కత్తా, ఢిల్లీ, బెంగళూరు, పంజాబ్, కేరళ రాష్ట్రాలకు ఎగుమతి చేస్తుంటారు. ఇతర దేశాలైన శ్రీలంక, సింగపూర్, అమెరికా, జపాన్ దేశాలకు పంపుతున్నారు. రాయితీలు ఇవ్వాలి మార్కాపురం పలకల పరిశ్రమ అభివృద్ధి చెందాలంటే ప్రభుత్వం సహకరించాలి. చీమకుర్తి గ్రానైట్ పరిశ్రమకు జీఎస్టీ మినహాయింపు ఇచ్చినట్లుగా మార్కాపురం పలకలకు మినహాయింపు ఇవ్వాలి. పారిశ్రామికవేత్తలకు సబ్సిడీ రుణాలు ఇవ్వాలి. విద్యుత్ చార్జీలు తగ్గించాలి. ఎగుమతులను ప్రోత్సహించాలి. – బట్టగిరి తిరుపతిరెడ్డి, పలకల ఫ్యాక్టరీ యజమాని రాయల్టీ తగ్గించాలి ప్రభుత్వం పలకల గనులపై ఉన్న రాయల్టీని తగ్గించాలి. చిన్న క్వారీలకు నిబంధనల్లో మినహాయింపు ఇవ్వాలి. ఎక్స్పోర్టులో కూడా ఆంక్షలు సడలించాలి. పలకల పరిశ్రమ బాగుంటే ఈప్రాంతంలో వలసలు ఉండవు, కూలీలందరికీ పని ఉంటుంది. – వెన్నా పోలిరెడ్డి, డిజైన్ స్లేట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ -
కుటుంబంతో కలిసి మార్కాపురం ఎమ్మెల్యే నాగార్జున రెడ్డి భోగి సంబరాలు
-
పసికందును ఎత్తుకెళ్లిన గుర్తుతెలియని మహిళ
సాక్షి, ప్రకాశం: జిల్లాలోని మార్కాపురం ఏరియా వైద్యశాలలో దారుణం జరిగింది. నాలుగు రోజుల పసికందును గుర్తు తెలియని మహిళ ఎత్తుకెళ్లింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. వివరాలు.. గుంటూరు జిల్లా కారంపూడి సమీపంలోని బట్టువారిపల్లి కి చెందిన శ్రీ రాములు నాలుగు రోజుల క్రితం తన భార్యను కాన్పు కోసం ఆసుపత్రిలో చేర్పించారు. ఆమె ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ క్రమంలో శనివారం డిశ్చార్జి కావలసి ఉండగా అబ్జర్వేషన్ లో ఉంచాలంటూ పాపను ఆస్పత్రి సిబ్బంది ఓ గదిలోకి తీసుకు వెళ్లారు. అనంతరం శ్రీ రాములును భోజనం తెమ్మని చెప్పారు. అయితే, అతడు తిరిగి రాగా పాప కనిపించడం లేదంటూ వైద్య సిబ్బంది తెలపడంతో నిర్ఘాంతపోయాడు. వెంటనే సమాచారాన్ని పోలీసులకు అందించారు. సీసీ కెమెరాల్లో రికార్డయిన దృశ్యాలు ఆధారంగా పోలీసులు, పాపను ఎత్తుకెళ్లిన మహిళ కోసం గాలిస్తున్నారు. చదవండి: సారు పేరులోనే ‘లక్ష్మీ’ కళ.. వసూళ్లలో డిఫరెంట్ స్టైల్ -
లైంగిక దాడి, హత్య కేసులో జీవిత ఖైదు
ఒంగోలు: ఆస్తి వివాదం నేపథ్యంలో ఆరేళ్ల క్రితం ఓ మహిళపై లైంగిక దాడి జరిపి హతమార్చిన కేసులో నలుగురికి జీవిత ఖైదు విధిస్తూ ప్రకాశం జిల్లా మార్కాపురం అదనపు జిల్లా జడ్జి జి.రామకృష్ణ శుక్రవారం తీర్పు వెలువరించారు. ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం.. భూచేపల్లి నాగరత్నమ్మ, రావూరి మంగమ్మ అక్కాచెల్లెళ్లు. భూచేపల్లి నాగరత్నమ్మ చీమకుర్తి మండలం దేవరపల్లిలో ఉంటోంది. వారి మధ్య ఆస్తి వివాదాలు నెలకొనగా.. మంగమ్మ భర్త రోడ్డు ప్రమాదంలో మరణించాడు. దీనికి నాగరత్నమ్మే కారణమని భావించిన మంగమ్మ సోదరిని హతమార్చేందుకు ప్లాన్ చేసింది. భర్త చనిపోయినందున ఆలయంలో నిద్ర చేయడానికి తోడు రావాలని సోదరి నాగరత్నమ్మను కోరింది. ఆమె వెంట వెళ్లిన నాగరత్నమ్మపై పొదిలి మండలం మాదిరెడ్డిపాలెం వద్ద నాగదాసరి వెంకటయ్య లైంగిక దాడికి పాల్పడ్డాడు. అనంతరం ఏడుగురు కలిసి ఆమెను హత్య చేశారు. ఈ కేసులో నాగరత్నమ్మ సోదరి రావూరి మంగమ్మ, మీసాల నాగేంద్రం అలియాస్ నాగిరెడ్డి, మందగలం బాబు, నాగదాసరి వెంకటయ్యలతోపాటు మరో ముగ్గురిని నిందితులుగా పేర్కొన్నారు. వీరిలో నలుగురు కడప జిల్లాకు చెందిన వారు. కేసులో సాక్ష్యాధారాలను పరిశీలించిన మార్కాపురం అదనపు జిల్లా కోర్టు న్యాయమూర్తి జి.రామకృష్ణ శుక్రవారం తీర్పును వెలువరిస్తూ.. నాగరత్నమ్మపై అత్యాచారం చేసిన నాగదాసరి వెంకటయ్యకు పదేళ్ల జైలు శిక్షతోపాటు ఆమెను హతమార్చినందుకు జీవిత ఖైదు విధించారు. హత్యకు ప్రధాన సూత్రధారి అయిన మంగమ్మ, మీసాల నాగేంద్రం , మందగలం బాబుకు జీవిత ఖైదు విధించారు. మిగిలిన ముగ్గురినీ నిర్దోషులుగా విడుదల చేశారు. -
ఇంటి దొంగను ‘ఈశ్వరుడే’ పట్టుకున్నాడు!
ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టుకోలేడనేది సామెత. అయితే.. ఇంటివారే దొంగలను ఉపయోగించి దేవుని పటం వెనుక ఉంచిన సొత్తును అపహరించారు. కానీ చివరకు పోలీసులు దొంగలను పట్టుకోవడంతో అసలు బండారం బయటపడింది. సాక్షి, మార్కాపురం: పట్టణంలోని పేరంబజార్‌లో ఈ ఏడాది అక్టోబర్ 25న గుర్తు తెలియని వ్యక్తులు గృహంలోకి ప్రవేశించి 21 తులాల బంగారం దొంగతనం చేసిన కేసులో ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ నాగేశ్వరరెడ్డి తెలిపారు. బుధవారం రూరల్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. అక్టోబర్ 25న ఉదయం 3.30 నుంచి 5 గంటల మధ్యలో గుర్తు తెలియని వ్యక్తులు ఇంట్లోకి ప్రవేశించి దేవుడి గదిలో అయ్యప్ప స్వామి పటం వెనుక ఉన్న బంగారు బ్రాస్లెట్లు 3, చైన్ 1, గాజులు 4, చెవి కమ్మలు 1జత, నల్లపూసల దండలు 2, బంగారు ఉంగరాలు 2 కలిపి మొత్తం 21 తులాల బంగారాన్ని దొంగిలించినట్లు గొట్టెముక్కల శ్రీదేవి అనే మహిళ ఫిర్యాదు చేసింది. దీంతో సీఐ కేవీ రాఘవేంద్ర, పట్టణ ఎస్సై కిశోర్‌బాబులు తమ సిబ్బందితో దర్యాప్తు ప్రారంభించారు. క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్ ద్వారా దొంగతనం జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. ఫిర్యాది కుటుంబ సభ్యులను, చుట్టు పక్కల వారిని విచారణ చేసి కీలక సమాచారాన్ని రాబట్టారు. ఇందులో భాగంగా నిందితులైన విజయవాడకు చెందిన ఓగిరాల సాయి రాజే‹Ù, గుంటూరు జిల్లా వెల్లటూరుకు చెందిన కూరాళ్ల శశాంక్లను అరెస్ట్ చేశారు. బుధవారం ఉదయం 11గంటల సమయంలో సీఐ రాఘవేంద్ర, ఎస్సై కిశోర్‌బాబులు సిబ్బందితో కలిసి మార్కెట్ యార్డు వద్ద సంచరిస్తుండటంతో అదుపులోకి తీసుకున్నారు. డామిట్.. కథ అడ్డం తిరిగింది.. నిందితులను విచారించగా అక్టోబర్ 25న అర్ధరాత్రి మార్కాపురం వచ్చామని, ఫిర్యాది కుటుంబ సభ్యుల్లో ఒకరు బంగారు ఆభరణాలను దొంగిలించి వారికి ఇచ్చి దాచి ఉంచాలని చెప్పినట్లు తెలిపారు. బంగారు ఆభరణాలను అమ్ముకుందామని తిరుగుతున్నట్లు వారు తెలిపారన్నారు. దొంగతనం కేసులో ఫిర్యాది కుటుంబ సభ్యులు ఉండటంతో పాటు పరిసర ప్రాంతాల వారిని విచారణ చేయటంతో దొంగతనం కేసు పలు మలుపులకు దారితీసిందని డీఎస్పీ తెలిపారు. నిందితులను అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరచనున్నట్లు తెలిపారు. కేసును త్వరితగతిన ఛేదించిన సీఐ రాఘవేంద్ర, ఎస్సై కిశోర్‌బాబు, సిబ్బందిని ఆయన అభినందించారు. కచ్చితమైన సమాచారం ఇవ్వాలి మార్కాపురం డివిజన్లో ఎలాంటి దొంగతనాలు జరిగినా కచ్చితమైన సమాచారాన్ని పోలీసులకు ఫిర్యాదులో ఇవ్వాలని డీఎస్పీ తెలిపారు. దొంగతనం సమయంలో పోయిన వస్తువులతో పాటు మరి కొన్ని వస్తువులను జత చేసి ఫిర్యాదు ఇవ్వటం సరికాదన్నారు. పిల్లల ప్రవర్తనపై తల్లిదండ్రులు గమనిస్తుండాలన్నారు. తప్పుడు కేసులను పోలీసుల దృష్టికి తెచ్చి విలువైన సమయాన్ని వృథా చేయవద్దని పేర్కొన్నారు. -
అటు పర్యావరణ పరిరక్షణ.. ఇటు జంతు సంరక్షణ
సాక్షి, మార్కాపురం: ప్రకాశం, గుంటూరు, కర్నూలు, మహబూబ్‌నగర్ జిల్లాల్లో సుమారు 2.5లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో తెలంగాణ రాష్ట్రంతో సరిహద్దుగా ఉన్న నల్లమల అటవీ ప్రాంతంలో ఈ నెల 1నుంచి 7వ తేదీ వరకు వన్యప్రాణి సంరక్షణ వారోత్సవాలు జరుగుతున్నాయి. ప్రజల్లో అవగాహన కల్పించేందుకు మార్కాపురం డీఎఫ్ఓ ఖాదర్‌బాష ఆధ్వర్యంలో వారం రోజుల పాటు ప్రత్యేక కార్యక్రమాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం నల్లమల అటవీ ప్రాంతంలో 48 పెద్ద పులులు, 60కి పైగా చిరుతలు, వేల సంఖ్యలో దుప్పులు, జింకలు, ఎలుగుబంట్లు, నెమళ్లు, అరుదైన పంగోలిన్, రాబంధువులు నివసిస్తున్నాయి. వేటగాళ్ల ఉచ్చు నుంచి కాపాడేందుకు అటవీ శాఖాధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా నల్లమల అటవీ ప్రాంతాన్ని రాజీవ్ అభయారణ్యంగా ప్రకటించారు. మొత్తం 24 బేస్ క్యాంప్‌లు ఏర్పాటు చేసి 120 మంది టైగర్ ట్రాకర్లను నియమించారు. వివిధ ప్రాంతాల్లో చెక్‌పోస్టులను ఏర్పాటు చేశారు. గుంటూరు జిల్లా విజయపురిసౌత్, కర్నూలు జిల్లా రోళ్లపెంట, శ్రీశైలం, గిద్దలూరు సరిహద్దులుగా నల్లమల అటవీ ప్రాంతం విస్తరించి ఉంది. దేశంలో పెద్ద పులులు ఎక్కువగా ఉన్న నల్లమల అటవీ ప్రాంతంలో వాటి రక్షణ కోసం రివాల్వర్లను కూడ సిబ్బందికి అందిస్తున్నారు. 1 నుంచి ప్లాస్టిక్ నిషేధం పర్యావరణ పరిరక్షణలో భాగంగా నల్లమలలో ఈ నెల 1 నుంచి ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా నిషేధిస్తున్నట్లు డీఎఫ్ఓ ఖాదర్‌బాష తెలిపారు. ఇందు కోసం దోర్నాల –శ్రీశైలం, దోర్నాల– ఆత్మకూరు మధ్య ప్రత్యేక స్ట్రైకింగ్ ఫోర్స్ ఏర్పాటు చేయటంతో పాటు దోర్నాల, కొర్రపోలు, శ్రీశైలం గణపతి ఆలయం వద్ద చెక్‌పోస్టులను ఏర్పాటు చేసి ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్, ప్లాస్టిక్ కవర్లను వాహనాలను తనిఖీ చేసి ఉన్నట్లయితే తొలగిస్తున్నట్లు తెలిపారు. ప్రజలు కూడ సహకరించాలన్నారు. నల్లమల అటవీ ప్రాంతంలో ఎర్రచందనం, గంధం, ఇనుమద్ది, టేకు లాంటి వక్షాలతో పాటు అరుదైన ఔషధ మొక్కలు కూడా ఉన్నాయి. వాటి సంరక్షణకు కూడ ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. అవగాహన కార్యక్రమాలు వన్యప్రాణి సంరక్షణ వారోత్సవాల్లో భాగంగా మార్కాపురం అటవీశాఖ పరిధిలో అక్టోబర్ 1నుంచి7వ తేదీ వరకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని డీఎఫ్ఓ ఖాదర్‌బాష తెలిపారు. తుమ్మలబయలు ఏకో టూరిజం పార్కుకు విద్యార్థులను తీసుకెళ్లి అవగాహన కల్పించామన్నారు. వ్యాసరచన, వక్తృత్వ పోటీలను ఈ నెల 3న మార్కాపురం జెడ్పీ హైస్కూల్లో విద్యార్థులకు నిర్వహించామన్నారు. 4న యర్రగొండపాలెంలోని కొమరోలుకు దగ్గరలో ఉన్న అటవీ ప్రాంతాన్ని బీఈడీ, డీఈడీ విద్యార్థులతో కలిసి సందర్శిస్తామని తెలిపారు. - ఖాదర్‌బాష, డీఎఫ్ఓ -
న్యాయం చేస్తారా? ఆత్మహత్య చేసుకోమంటారా?
సాక్షి, మార్కాపురం (ప్రకాశం): నగదు లావాదేవీల విషయంలో మహిళ బెదిరింపునకు దిగడంతో పట్టణంలోని విజయలక్ష్మి వీధిలో ఉత్కంఠ రేగింది. నగదు విషయం తేలే వరకు బయటకు వచ్చేది లేదని ఇంట్లో వారిని బయటకు పంపేది లేదని హంగామా చేయడంతో స్థానికుల సమాచారంతో సమస్య పోలీసుల దృష్టికి వెళ్లింది. ఆమె ఏదైనా అఘాయిత్యం చేసుకుంటుందోననే భయంతో పోలీసులు.. అగ్నిమాపక సిబ్బంది, అంబులెన్స్‌ను ఆ నివాసం బయట సిద్ధంగా ఉంచారు. వివరాలు.. వినుకొండ పట్టణానికి చెందిన చీదెళ్ల లక్ష్మి భర్త శ్రీరామమూర్తి మార్కాపురం పట్టణానికి చెందిన గ్రంథె వెంకటరత్నం వద్ద సుమారు 20 ఏళ్ల క్రితం మూడు లక్షల రూపాయలను వడ్డీకి తీసుకున్నాడు. ఒక ఏడాది వడ్డీ చెల్లించిన శ్రీరామమూర్తి మరుసటి ఏడాది నుంచి వడ్డీతో పాటు అసలు కూడా ఇవ్వక పోవడంతో పలు మార్లు మధ్యవర్తి సహకారంతో ఇరువురి మధ్య చర్చలు జరిగాయి. అయినా నగదు చెల్లించకపోవడంతో వినుకొండ పట్టణంలోని మార్కాపురం రోడ్డులోని శ్రీరామమూర్తికి చెందిన భూమిని వెంకటరత్నంకు రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చారు. ఇలా జరుగుతుండగా సదరు భూమికి ఇటీవల మంచి ధర రావడంతో వినుకొండలోని రిజిస్ట్రేషన్ ఆఫీసుకు సెప్టెంబర్ 30న వెంకటరత్నం వెళ్లి మరొకరికి రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చారు. ఈ విక్రయంలో వెంకటరత్నంకు సుమారు 25లక్షల రూపాయలు రావడంతో చీదెళ్ల లక్ష్మి దంపతులు అక్కడకు చేరుకుని అడ్డం తిరిగారు. తాము అప్పుగా పొందిన నగదుకు, వడ్డీతో సహా చెల్లింపు చేసుకుని మిగిలిన డబ్బు ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీనికి వెంకటరత్నం ససేమిరా అనడంతో మంగళవారం వినుకొండ నుంచి వచ్చిన చీదెళ్ల లక్ష్మి మార్కాపురంలోని వెంకటరత్నం నివాసంలోకి వెళ్లి తాను తెచ్చుకున్న రెండు తాళాల్లో ఒకదానిని బయట గేటుకు వేసింది. వెంకటరత్నం భార్యను లోపల పెట్టి మరో తాళం వేసింది. విషయం తెలుసుకుని అక్కడికి చేరుకున్న పోలీసులతో తనకు న్యాయం జరిగే వరకు తాళాలు తీసేది లేదని చెప్పడంతో పాటు తాళాలు పగలగొడితే గ్యాస్ సిలిండర్ వెలిగించి ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించింది. మధ్యాహ్నానికి భర్త శ్రీరామమూర్తి మార్కాపురం రావడంతో తాళం తీసిన.. లక్ష్మితో పాటు ఇరువర్గాలను పోలీసు స్టేషన్‌కు తీసుకు వెళ్లి సమస్య పరిశీలించారు. ఇదే విషయంలో లక్ష్మి గతంలో ఆత్మహత్యకు ప్రయత్నించినట్లు తెలిసింది. సంఘటనపై సీఐ కేవీ రాఘవేంద్రను వివరణ కోరగా చీదెళ్ల లక్ష్మిపై చీటింగ్ కేసు నమోదు చేసినట్లు తెలిపారు. -
అధికారం పోయినా.. ఆగడాలు ఆగట్లేదు
సమయం.. శనివారం రాత్రి 7 గంటలు.. ప్రదేశం.. మార్కాపురంలోని మున్సిపల్ కార్యాలయం. అక్కడ విధి నిర్వహణలో ఉన్న ఓ ఉద్యోగి కొత్తగా నియమితులైన వలంటీర్లకు బాధ్యతలు అప్పగిస్తున్నారు. ఇంతలో ఒక్కసారిగా కార్యాలయంలోకి దూసుకొచ్చిన టీడీపీ నేత ఆ ఉద్యోగిపై గూండాగిరి ప్రదర్శించాడు. ఎక్కడి నుంచి వచ్చావురా నువ్వు.. అంటూ ఆ ఉద్యోగి గొంతు పట్టుకున్నాడు. చంపుతా.. నా.. అంటూ అసభ్య పదజాలంతో దూషిస్తూ.. చెంప చెళ్లుమనేలా కొట్టాడు. అక్కడే ఉన్న సిబ్బంది అడ్డుకోవడంతో పెద్దగా కేకలు వేస్తూ వేలు చూపి, హెచ్చరికలు జారీ చేస్తూ దర్జాగా బయటకు వెళ్లాడు. హఠాత్తుగా జరిగిన పరిణామానికి బాధితుడితో పాటు అక్కడున్నవారంతా నిశ్ఛేష్టులయ్యారు. అధికారం కోల్పోయినా టీడీపీ నేతల ఆగడాలు మాత్రం ఆగలేదనడానికి మార్కాపురం పట్టణంలోని చోటుచేసుకున్న ఈ ఘటనే ఉదాహరణ సాక్షి, మార్కాపురం(ప్రకాశం): అధికారంలో కోల్పోయినా ఇంకా ఉన్నామన్న భ్రమతో టీడీపీ నేతలు వ్యవహరిస్తున్నారు. ఐదేళ్ల పాటు మున్సిపాలిటీపై పెత్తనం చేసిన వారు ఇంకా చేయాలని ప్రయత్నిస్తున్నారు. తమ మాట వినటం లేదనే అక్కసుతో ఉద్యోగులపై దాడులు తెగపడుతున్నారు. టీడీపీ నేతల దాడులతో ఉద్యోగులు భయాందోళన చెందుతున్నారు. వివరాల్లోకి వెళితే... మార్కాపురం మున్సిపల్ కార్యాలయంలోషేక్ జహంగీర్ సీనియర్ అసిస్టెంట్‌గా పని చేస్తున్నాడు. శనివారం రాత్రి 7.15 గంటల సమయంలో కార్యాలయంలోని తన గదిలో కూర్చుని విధులు నిర్వర్తిస్తున్నాడు. ఆ సమయంలో మార్కాపురం పట్టణానికి చెందిన మాజీ ఎమ్మెల్యే సోదరుడు వచ్చి జహంగీర్‌పై దాడికి బడ్డాడు. తీవ్ర దుర్భాషలాడాడు. కార్యాలయంలో ఉన్న ఇతర సిబ్బంది అడ్డుకోవడంతో తీవ్రంగా దూషిస్తూ వెళ్లిపోయాడు. జరిగిన ఘటనపై బాధితుడు రాత్రి 9.15 గంటల సమయంలో పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. టీడీపీ మాజీ ఎమ్మెల్యే సోదరుడు కార్యాలయంలో ఉన్న తన దగ్గరకు వచ్చి దుర్భాషలాడుతూ అకారణంగా దాడి చేశాడని ఫిర్యాదులో పేర్కొన్నాడు. వలంటీర్లకు వారి బాధ్యతలు చెబుతుండగా దూకుడుగా వచ్చి తనపై దాడి చేసి కొట్టాడని పేర్కొన్నారు. అనంతరం తీవ్ర ఒత్తిళ్లు రావటంతో భయాందోళనకు గురైన బాధితుడు ఆ తర్వాత కొద్ది సేపటికి తాను ముందు ఇచ్చిన ఫిర్యాదును వెనక్కి తీసుకొని గుర్తు తెలియని వ్యక్తి తనపై దాడి చేసినట్లుగా మార్చి మరో ఫిర్యాదు కాపీ పోలీసులకు అందజేశాడు. ఈ దాడిని తీవ్రంగా ఖండించిన మున్సిపల్ ఉద్యోగులంతా రాత్రి 9 గంటలకు ఐక్యంగా పోలీస్‌స్టేషన్‌కు వెళ్లారు. పట్టణ ఎస్సైతో పాటు సీఐ, డీఎస్పీలకు ఫిర్యాదులు పంపారు. టీడీపీ నేతలు తాము ఇంకా అధికారంలో ఉన్నామనే భ్రమలో ఉన్నారని, తామేం చేసినా చెల్లుతుందనే భావనలో ఉండి మున్సిపల్ ఉద్యోగిపై దాడికి పాల్పడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఘటనను ఖండించిన వైఎస్సార్ సీపీ నాయకులు, ఉద్యోగులపై దాడులకు పాల్పడటం మానుకోవాలని హితవు పలికారు. పెత్తనం చెలాయించటం మంచిది కాదన్నారు. -
బెట్టింగ్‌రాయుళ్ల ఒత్తిళ్లతో వ్యక్తి ఆత్మహత్య
సాక్షి, గుంటూరు రూరల్ : బెట్టింగ్ రాయుళ్ల ఒత్తిళ్లతో ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన మండలంలోని అంకిరెడ్డిపాలెంలో గురువారం వెలుగులోకి వచ్చింది. నల్లపాడు సీఐ కె.వీరాస్వామి తెలిపిన వివరాల ప్రకారం.. ప్రకాశం జిల్లా మార్కాపురానికి చెందిన వాకా వెంకటేశ్వరరెడ్డి (40) అలియాస్ పిల్లారెడ్డి మిర్చియార్డులో కమీషన్ కొట్టు ద్వారా తన అన్నతో కలిసి వ్యాపారం చేస్తుండేవాడు. పదేళ్ల కిందట నగరంలోని హౌసింగ్ బోర్డుకు నివాసాన్ని మార్చుకున్నాడు. ఈ క్రమంలో బెట్టింగ్‌లకు అలవాటుపడ్డాడు. ఏడాది క్రితం బెట్టింగ్‌లో మధ్యవర్తిత్వం చేస్తూ పల్నాడు, మిర్చియార్డు తదితర ప్రాంతాలకు చెందిన వ్యక్తుల నుంచి నగదును బెట్టింగ్ కోసం వసూలు చేశాడు. ఆ నగదును మార్కాపురానికి చెందిన సానికొమ్ము సుబ్బారెడ్డి అనే వ్యక్తితో బెట్టింగ్ పెట్టి సుమారు రూ.1.75 కోట్లు ముట్టజెప్పాడు. ఈ క్రమంలో బెట్టింగ్‌లలో ఓడిపోయాడు. అనంతరం వెంకటేశ్వరరెడ్డి వద్ద బెట్టింగ్ పెట్టిన వ్యక్తులు బెట్టింగ్‌లో తాము గెలిచినందున నగదు ఇవ్వాలని వెంకటేశ్వర్‌రెడ్డిని ఒత్తిడి చేశారు. వెంకటేశ్వర్‌రెడ్డి సుబ్బారెడ్డిని ఒత్తిడి చేశాడు. సుబ్బారెడ్డి ఎంతకూ తిరిగి నగదు ఇవ్వక పోవడంతో మార్కాపురంలో సుబ్బారెడ్డిపై వెంకటేశ్వర్‌రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు ఆతడిని పిలిపించి సుబ్బారెడ్డి నుంచి సుమారు కోటి రూపాయల వరకూ తిరిగి ఇప్పించారు. మిగిలిన రూ.75 లక్షల్లో వెంకటేశ్వర్‌రెడ్డి సుమారు రూ.20 లక్షలకుపైగా తన ఆస్తులను అమ్ముకుని బెట్టింగ్ రాయుళ్లకు ముట్ట జెప్పాడు. మిగిలిన వ్యక్తులు నగదు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్న తరుణంలో నగదుకు వడ్డీ కలిపి మరింత పెరిగింది. ఈ క్రమంలో మిగిలిన నగదు ఇవ్వాలని వెంకటేశ్వర్‌రెడ్డి సుబ్బారెడ్డిని కోరగా ఆయన తప్పించుకుని తిరుగుతున్నాడు. వెంకటేశ్వర్‌రెడ్డి వద్ద బెట్టింగ్ పెట్టిన వ్యక్తులు తమకు రావాల్సిన నగదుకు వడ్డీతో కలిపి వెంటనే ఇవ్వాలని ఒత్తిడి చేయటం ప్రారంభించారు. దీంతో మనస్తాపానికి గురైన వెంకటేశ్వర్‌రెడ్డి గురువారం ఉదయం స్థానిక బార్లో మద్యం తీసుకుని అంకిరెడ్డిపాలెం సమీపంలోని పొలాల్లోకి వెళ్లి మద్యంలో పురుగుమందు కలుపుకుని తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తన ఆత్మహత్యకు కారణం బెట్టింగ్ పెట్టిన వ్యక్తులు, సుబ్బారెడ్డి కారణమని సూసైడ్ లెటర్ సైతం రాసి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం జీజీహెచ్‌కు తరలించారు. మృతుడి భార్య కొండమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. -
సారా బట్టీలపై ఎక్సైజ్ అధికారుల దాడులు
సాక్షి, మార్కాపురం(ఫ్రకాశం) : మార్కాపురం ఎక్సైజ్ పరిధిలోని వివిధ ప్రాంతాల్లో సోమవారం తమ సిబ్బంది దాడులు నిర్వహించి నాటుసారా బట్టీలు, బెల్లం ఊటను ధ్వంసం చేసి పలువురిని అరెస్టు చేసినట్లు ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఎ.ఆవులయ్య తెలిపారు. ‘సాక్షి’ దినపత్రికలో ‘పశ్చిమాన సారా’ శీర్షికతో సోమవారం ఓ కథనం ప్రచురితమైంది. ఎక్సైజ్ అధికారులు స్పందించి వివిధ ప్రాంతాల్లో దాడులు నిర్వహించారు. ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఆవులయ్య తన కార్యాలయంలో సోమవారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. మార్కాపురం ఎక్సైజ్ సీఐ రాధాకృష్ణమూర్తి తన సిబ్బందితో కలిసి దాడులు నిర్వహించి పెద్దదోర్నాల మండలం ఎగువ చెర్లోపల్లె గ్రామంలో 10 లీటర్ల నాటుసారా స్వాధీనం చేసుకుని వెంకటేశ్వర్లు అనే వ్యక్తిని అరెస్టు చేసినట్లు తెలిపారు. ఇదే మండలంలోని దోర్నాల శివార్లలో 200 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేసినట్లు తెలిపారు. గిద్దలూరు సీఐ సోమయ్య ఆధ్వర్యంలో అధికారుల బృందం అర్ధవీడు మండలం యాచవరం చెంచుకాలనీలో దాడులు నిర్వహించి 100 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేసినట్లు సూపరింటెండెంట్ ఆవులయ్య తెలిపారు. ఇదే మండలం వెంకటాపురంలో కూడా 200 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేసినట్లు తెలిపారు. యర్రగొండపాలెం సీఐ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో మండలంలోని బిళ్లగొంది చెంచుగూడెంలో 100లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేసినట్లు చెప్పారు. కనిగిరి సీఐ ఆధ్వర్యంలో హజీజ్పురంలో బెల్ట్‌షాపు నిర్వహిస్తున్న మహిళను అరెస్టు చేసి 10 క్వార్టర్ బాటిళ్లు స్వాధీనం చేసుకున్నట్లు ఆవులయ్య వివరించారు. మార్కాపురం ఎక్సైజ్ పరిధిలో తొమ్మిది పోలీసుస్టేషన్లు ఉన్నాయని, బెల్ట్‌షాపులు నిర్వహించినా, ఎమ్మార్పీ కంటే అధికంగా అమ్మినా, నాటుసారా తయారు చేసినా, విక్రయించినా అలాంటి వారిపై కేసులు నమోదు చేసి జైలుకు పంపుతామని హెచ్చరించారు. ప్రజలు కూడా ఇలాంటి వ్యక్తుల సమాచారాన్ని తమకు తెలియజేయాలని, వారి పేర్లను రహస్యంగా ఉంచుతామని భరోసా ఇచ్చారు. మార్కాపురం ప్రాంత దాడుల్లో ఎక్సైజ్ సిబ్బంది జి.వెంకటేశ్వర్లు, నగేష్, రమేష్, కాశయ్య, పాల్గొన్నారు. -
పునరావాసంపై కదలిక
సాక్షి, మార్కాపురం (ప్రకాశం): వెలిగొండ ప్రాజెక్టు రైతుల్లో మళ్లీ ఆశలు చిగురిస్తున్నాయి. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ఇచ్చిన నష్టపరిహారం తప్ప... గత పదేళ్ల నుంచి ఇప్పటి వరకు ఎలాంటి పునరావాస పనులు... ప్యాకేజి ... పరిహారం... వెలిగొండ ముంపు గ్రామాల రైతులకు అందలేదు. ముఖ్యమంత్రిగా నెల రోజుల కిందట బాధ్యతలు స్వీకరించిన వైఎస్ జగన్మోహన్రెడ్డి వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణంపై ప్రత్యేక దృష్టి సారించారు. ఇందులో భాగంగా వచ్చే ఏడాది జూన్ 30 నాటికి మొదటి దశ నీరు అందించటంతో పాటు, పునరావాస కాలనీ పనులు కూడా త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా అధికారులను ఆదేశించటంతో 10 రోజుల నుంచి పనుల్లో కదలిక వచ్చింది. కలెక్టర్ పోలా భాస్కర్ 10 రోజుల్లో 2 సార్లు మార్కాపురం వచ్చి వెలిగొండ ప్రాజెక్టు పనులను పరిశీలించటంతో పాటు పునరావాస కాలనీల నిర్మాణంపై కూడా దృష్టి సారించారు. దీంతో ముంపు గ్రామాల ప్రజలు, రైతుల్లో పునరావాస కాలనీలపై ఆశలు చిగురించాయి. వచ్చే ఏడాది జూన్ 30 నాటికి పునరావాస కాలనీలు ఏర్పాటు చేయాలని కలెక్టర్, వెలిగొండ ప్రాజెక్టు అధికారులు, రెవెన్యూ అధికారులను ఆదేశించారు. గోగులదిన్నె, తోకపల్లె, ఇడుపూరు, వేములకోట, ఒందుట్ల వద్ద నిర్మిస్తున్న పునరావాస కాలనీల పనులపై జాయింట్ కలెక్టర్ షన్మోహన్, స్పెషల్ కలెక్టర్ చంద్రమౌళితో ప్రాజెక్టు ఎస్ఈ వీర్రాజు కలిసి శనివారం పరిశీలించారు. పునరావాస కేంద్రాల్లో రోడ్లు, సిమెంట్ కాలువలు, విద్యుత్ సౌకర్యం, పాఠశాలలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను, దేవాలయాలను నిర్మించడానికి చర్యలు తీసుకోవాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. గతంలో ఇలా.. పూలసుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా ముంపునకు గురవుతున్న గ్రామాల్లో రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఇటు ప్రభుత్వం పునరావాస కాలనీలు ప్రారంభించక, అటు ఉన్న గ్రామాల్లో శిథిలమైన గృహాలు, ప్రభుత్వ నిర్లక్ష్యంతో నివసించలేని పరిస్థితి ఏర్పడింది. తాత, ముత్తాతల నుంచి పుట్టి పెరిగిన కన్నతల్లి లాంటి ఊరును, చెరగని జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ స్వగ్రామం నుంచి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. కొండల మధ్య పచ్చని చెట్ల మధ్య పర్యావరణానికి ప్రతీకగా నిలుస్తున్న ఆ గ్రామస్తులు లక్షల మంది ప్రజల కోసం, రైతుల కోసం ఊరిని వదిలేందుకు సిద్ధమయ్యారు. బంగారం పండించే పొలాలను కూడ వదులుకుంటున్నారు. ప్రభుత్వం మాత్రం ఇంతకాలం వారి పునరావాసం పట్ల నిర్లక్ష్యం వహించింది. పదేళ్లుగా నష్టపరిహారం కోసం వెలిగొండ ముంపు గ్రామాలైన గొట్టిపడియ, అక్కచెరువు తండా, సుంకేసుల, కలనూతల, గుండంచర్ల, చింతలముడిపి, కాటంరాజుతండా, కాకర్ల, మాగుటూరు తండా, సాయినగర్, కృష్ణనగర్, తదితర గ్రామాల ప్రజలు ఎదురు చూశారు. ప్రభుత్వం పరిహారం చెల్లింపు, ఆర్ఆర్ ప్యాకేజి అమలులో చేస్తున్న జాప్యం వారిని ఆందోళనకు గురిచేసింది. వర్షాకాలంలో మబ్బులు పడితే వారి గుండెల్లో భయం. డ్యామ్‌లోకి నీళ్లు వస్తే మునిగిపోతామన్న ఆందోళన. పూలసుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా గొట్టిపడియ, సుంకేసుల, కాకర్ల గ్యాప్‌లను నిర్మించారు. ఈ ముంపు గ్రామాల్లో నిర్వాసితులకు ఆర్ఆర్ ప్యాకేజి అమలు చేయటంలో అధికారులు నిర్లక్ష్యాన్ని వహించారు. సుమారు పదేళ్ల నుంచి నిర్వాసితులకు ఇళ్ల్ల స్థలాల సేకరణ పూర్తి కాలేదు. గొట్టిపడియ గ్రామ పంచాయతీలో గొట్టిపడియ, అక్కచెరువు తండా ఉన్నాయి. ఈ రెండింటిలో సుమారు 18 ఏళ్లు నిండిన వారి కుటుంబాలు సుమారు 1800 వరకు ఉన్నాయి. పెద్దారవీడు మండలంలోని చింతలముడిపిలో 80 కుటుంబాలు, సుంకేసులలో 2,760 కుటుంబాలు, కలనూతలలో 1,040 కుటుంబాలు, గుండంచర్లలో 1,150 కుటుంబాలు, కాటంరాజుతండాలో 40 కుటుంబాలు ఉన్నాయి. గొట్టిపడియ డ్యామ్ పరిధిలో గొట్టిపడియ, అక్కచెరువు తండాలు, సుంకేశుల డ్యామ్ పరిధిలో చింతలముడిపి, సుంకేశుల, కలనూతల, గుండంచర్ల గ్రామాలు మునిగిపోనున్నాయి. గొట్టిపడియ, అక్కచెరువు గ్రామాల్లోని కొంత మందికి మార్కాపురం మండలం వేములకోట వద్ద, ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. సుంకేసుల గ్రామస్తులకు మార్కాపురం మండలం గోగులదిన్నె వద్ద, కలనూతల గ్రామస్తులకు ఇడుపూరు వద్ద, గుండంచర్ల గ్రామస్తులకు దరిమడుగు వద్ద పునరావాస కాలనీలు ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించారు. స్థల సేకరణ మాత్రమే ఇప్పటికీ జరిగింది. ఇప్పటి వరకు గృహ నిర్మాణాలు ప్రారంభం కాలేదు. దీంతో వర్షాకాలంలో ముంపు గ్రామాల ప్రజలు కొద్దిగా నీరు వచ్చినా క్షణ క్షణం భయంగా కాలం గడపాల్సి వస్తోంది. గొట్టిపడియ ప్రధాన కాలువ పూర్తయి తొమ్మిదేళ్లు కావొస్తుంది. పూలసుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు యూనిట్ 1, 2, 3 పరిధిలోకి వచ్చే గ్రామ ప్రజలకు ఆర్ఆర్ ప్యాకేజిని పూర్తి స్థాయిలో అధికారులు అమలు చేయటం లేదు. మంత్రి సురేష్, ఎమ్మెల్యే నాగార్జునరెడ్డి ప్రత్యేక దృష్టి: వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణంపై రాష్ట్ర విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్, ఎమ్మెల్యేలు కుందురు నాగార్జునరెడ్డి, గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబులు ప్రత్యేక దృష్టి సారించారు. ప్రాజెక్టు ప్రాధాన్యతను ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. వచ్చే ఏడాది జూన్ 30 నాటికి నీరు ఇవ్వాలనే లక్ష్యంతో అధికారులతో మాట్లాడుతూ ఎప్పటికప్పుడు సూచనలు ఇస్తున్నారు. ఇదే సమయంలో ఆర్ఆర్ ప్యాకేజి అమలుపై దృష్టి సారించారు. చాలా ఆనందంగా ఉంది జగనన్న సీఎం కాగానే వెలిగొండ ప్రాజెక్టుపై దృష్టి పెట్టడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఇప్పటి వరకు పునరావాస పనులను ప్రభుత్వం, అధికారులు పట్టించుకోకపోవటంతో నత్తనడకన సాగాయి. 10 రోజుల నుంచి ప్రాజెక్టు పనుల్లో పురోగతి ఉండటంతో పాటు పునరావాస పనులు కూడా వేగంగా జరుగుతున్నాయి. – పుప్పాల మార్తమ్మ, ఎంపీటీసీ, గొట్టిపడియ జగనన్న సీఎం కాగానే మాకు నమ్మకం పెరిగింది పదేళ్లుగా మేమందరం నిర్లక్ష్యానికి గురయ్యాం. ముఖ్యమంత్రిగా జగనన్న ఎన్నిక కావటంతో వెలిగొండ ప్రాజెక్టుపై మాలో ఆశలు చిగురించాయి. కలెక్టర్ 10 రోజుల్లో 2 సార్లు మార్కాపురం వచ్చి వెలిగొండ ప్రాజెక్టుపై రివ్యూ చేయటం సంతోషాన్నిచ్చింది. పునరావాస కాలనీలు త్వరగా పూర్తి చేయాలి. మొదటి దశ ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేసి నీరు ఇవ్వాలి. – తుమ్మా వెంకటరెడ్డి, వైఎస్ఆర్ సీపీ నేత, గొట్టిపడియ గ్రామం -
గుండె చెరువు
నీరు–చెట్టు పనుల్లో అధికారులు, టీడీపీ నాయకుల చిత్తశుద్ధి మరోసారి బయటపడింది. రూ.లక్షలు వెచ్చించి చేపట్టిన పనుల్లో డొల్ల వెలుగుచూసింది. దీర్ఘకాలం పనులు పూర్తి చేయని కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతో ప్రభుత్వానికి, ప్రజలకు మరోసారి రూ. లక్షల్లో నష్టం వాటిల్లింది. కరువుతో నీటి కోసం ప్రజలు, రైతులు అల్లాడుతున్న తరుణంలో అనుకోని అతిథిగా వచ్చిన వర్షం నీరు చెరువుకు చేరినా ఫలితం లేకపోయింది. చెరువు కట్ట మరమ్మతులకు గత ఏడాది మంజూరైన నిధులతో చేపట్టిన పనులు పూర్తికాకపోవడంతో వర్షంనీటి ఉధృతికి రింగ్‌బండ్ తెగి పంటపొలాలపై నీరు ప్రవహించడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. సాక్షి, మార్కాపురం : వర్షాకాల మొచ్చినా చెరువుల అభివృద్ధి, వాటి పనులను పట్టించుకోని అధికారుల తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మండలంలోని బొందలపాడు చెరువు కింద 80 ఎకరాలు ఆయకట్టు ఉంది. ఈ చెరువుకు నీరు వచ్చిన ప్రతిసారీ కట్ట తెగిపోవటం సర్వసాధారణమైంది. ఇరిగేషన్ అధికారులు ఏటా నీరు చెట్టు కింది కట్ట మరమ్మతుల పేరిట రూ. లక్షల్లో ఖర్చు చేస్తున్నా కూడా చెరువుకు వచ్చిన నీరు వృథాగా పోతోంది. నీరు చెట్టు కింద 2017–18 సంవత్సరంలో నూతన తూము ఏర్పాటు చేయటానికి రూ. 8 లక్షలు నిధులు ఖర్చు చేశారు. ఇదే చెరువుకు గత ఏడాది కూడా మళ్లీ రూ. 8 లక్షలు మంజూరయ్యాయి. కానీ ఆ నిధులతో తూము ఏర్పాటు చేయటంలో అధికారులు, కాంట్రాక్టర్ తీవ్ర నిర్లక్ష్యం వహించారు. ఎట్టకేలకు ఇటీవల నెల కిందట నూతన తూమును ఏర్పాటు చేయటానికి పాత తూమును తొలగించారు. ఆ తూము ముందు రింగ్ బండ్ ఏర్పాటు చేశారు. కానీ ఆ రింగ్ బండ్లో నాణ్యతో లోపించటంతో శనివారం రాత్రి కురిసిన వర్షానికి చెరువుకు నీరు రావటంతో రింగ్ బండ్ తెగిపోయింది. అలాగే దీంతో పాటు చెరువు కట్టకు రంధ్రం పడి నీరంతా పంట పొలాలపై ప్రవహించింది. దీంతో ఐదెకరాల పత్తి పంట దెబ్బతింది. తనకు దాదాపు రూ. 1.5 లక్షలు నష్టం వాటిల్లిందని బాధిత రైతు లబోదిబో అంటున్నారు. ప్రతి ఏటా నీరు చెట్టు కింద టీడీపీ నాయకులు పనులు చేపట్టడం. అవి నాణ్యత లేకపోవడంతో చిన్నపాటి వర్షానికే దెబ్బతింటున్నాయని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. వర్షానికి తెగిన బొందలపాడు చెరువుకట్ట ఎగువ ప్రాంతంలో శనివారం రాత్రి కురిసిన వర్షానికి మండలంలోని బొందలపాడు చెరువుకు నీరు చేరింది. అయితే ఆ చెరువుకు కొంతమేర నీరు రావటం రింగ్ బండ్ తెగిపోయి అదంతా బయటకు వెళ్లిపోయింది. చెరువు కట్ట నాసిరకంగా నిర్మాణం చేయడం వల్లే రింగు బండ్ కొట్టుకు పోయిందని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. చెరువు నుంచి దిగువ ప్రాంతానికి నీరు వృథాగా పోవటంతో దిగువన ఉన్న ఐదెకరాలు పత్తి పంట నష్టం వాటిల్లింది. దీంతో ఆ రైతు లబోదిబో మంటూ రూరల్ పోలీస్ స్టేషన్లో కారకులపై ఫిర్యాదు చేయటం జరిగింది. రాకరాక వచ్చిన నీరు పోవడంతో పాటు, చెరువుకట్టకు రంధ్రం పడటం, రింగ్‌బండ్ తెగిపోవడం మళ్లీ నిర్మాణం చేపట్టాల్సి రావడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నాణ్యత లోపించే చెరువు రింగ్‌బండ్ తెగింది అధికారులు, కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతో రింగ్ బండ్ నిర్మాణంలో నాణ్యతో లోపించటం వల్లనే తెగింది. ప్రతి ఏటా నీరు చెట్టు కింద రూ. లక్షోల్లో నిధులు మంజూరు చేస్తున్నారు. అయితే నాణ్యత లేకుండా జరిగే పనులు వల్ల ఆతర్వాత వచ్చే వర్షానికి చెరువు కట్ట తెగిపోవటం పరిపాటి అయింది. అధికారులు పచ్చచొక్కాదారులకు కొమ్ముకాయడం వల్లే రైతులు నష్టపోతున్నారు. ఈ చెరువు నిండుతే నాలుగు గ్రామాలకు నీరు వస్తుంది. ఉన్నతాధికారులతో దర్యాప్తు చేయించి సదరు కాంట్రాక్టర్ నుంచి రికవరీ చేయింలి. తుమ్మా వెకంటేశ్వర రెడ్డి, బొందలపాడు నీరు ఉధృతంగా రావటంతో రింగ్‌బండ్ తెగింది ఎగువ ప్రాంతంలో భారీ వర్షం పడి చెరువుకు ఉధృతంగా నీరు రావటం వల్లే ఆ రింగ్ బండ్ తెగింది. నాణ్యతాప్రమాణాలను తప్పక పాటించి పనులు సదరు కాంట్రాక్టర్‌తో చేయించటం జరుగుతుంది. మరళా వర్షాలు పడేలోపే చెరువు రంధ్రానికి, తూము ఏర్పాటు చేసి ఇలా మరలా అలా జరకుండా చర్యలు తీసుకుంటాం. ఇరిగేషన్ ఏఈ రమణి -
మార్కాపురంలో పేలిన బాంబు
ప్రకాశం, మార్కాపురం టౌన్: పట్టణంలోని తర్లుపాడు రోడ్డు మాగుంట సుబ్బరామిరెడ్డి మెమోరియల్ పార్కు సమీప మెయిన్ రోడ్డులో ఆదివారం రాత్రి బాంబు పేలడంతో ప్రజలు ఉలిక్కి పడ్డారు. దుండగులు నలుగురు ఆటోలో ప్రయాణిస్తూ పార్కు సమీపంలో ఆగారు. అదే సమయంలో వారి నుంచి బాంబు జారి నేలపై పడింది. ఆ సమయంలో అటుగా మోటార్ సైకిల్‌పై వెళ్తున్న ఎం.ఖాశింపీరా తన కుమార్తెతో షాపింగ్ కోసం పట్టణంలోకి వస్తున్నాడు. ఈయన పంచాయతీరాజ్ ఈఈ వాహనానికి డ్రైవర్‌గా పని చేస్తున్నారు. బాంబు పేలడంతో డ్రైవర్ ఎడమ కాలికు బాంబులోని గాజు ముక్కలు గుచ్చుకోవడంతో గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని చికిత్స కోసం స్థానిక ఓ ప్రైవేటు వైద్యశాలకు తరలించారు. స్వల్ప గాయాలైనట్లు వైద్యులు తెలిపారు. సంఘటన స్థలాన్ని ఎస్ఐ ఆంజనేయులు తన సిబ్బందితో కలిసి పరిశీలించి వివరాలు సేకరించారు. బాంబు పేలిన సమయంలో ఆటోలో ఉన్న దుండగులు చెల్లాచెదురుగా పరారైనట్లు తెలుస్తోంది. బాంబు కలకలం 2019 సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ఈ నెల 11న ముగియడం.. పాతకక్షల నేపథ్యంలో పట్టణంలో బాంబు వేసేందుకా లేక ఇతర ప్రాంతాలకు తరలించేందుకా అనేది పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది. ఇటీవల మార్కాపురం మండలంలోని పలు గ్రామాల్లో çఘర్షణలు చోటు చేసుకోవడంతో వీటిని వినియోగించుకునేందుకు ఇతర ప్రాంతాల నుంచి తెప్పించుకుని తీసుకెళ్తుండగా మార్గంమధ్యలో పేలాయా అనే సందేహం నాయకులు, ప్రజల్లో వ్యక్తమవుతోంది. బాంబు పేలిన సమీపంలో వివిధ పార్టీల ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులు స్వగృహాలకు వెళ్లే మార్గంలో సంఘటన చోటుచేసుకుంది. నాయకులు అలర్ట్‌గా ఉండి భద్రత చర్యలు తీసుకుంటున్నారు. సదరు సంఘటనపై సీఐ శ్రీధర్‌రెడ్డితో మాట్లాడగా బాంబా, లేక గాజు సీసాలో ద్రావణంతో కిందపడి పేలి ఉంటుందని భావిస్తున్నాం. పేలిన సమయంలో శబ్ధంతో పాటు లైటింగ్ వచ్చినట్లు ఆ ప్రాంత ప్రజలు తమ దృష్టికి తెచ్చారు. సదరు సంఘటనపై దర్యాప్తు చేస్తున్నాం. -
మార్కాపురంలో నాటు బాంబు పేలడం కలకలం
-
మార్కాపురంలో పేలిన నాటు బాంబు
సాక్షి, ప్రకాశం: జిల్లాలోని మార్కాపురం ఎస్సీబీసీ కాలనీలో నాటు బాంబు పేలడం కలకలం రేపింది. ఆటోలో నుంచి నాటు బాంబు జారిపడి పేలుడు జరిగినట్టు స్థానికులు చెబుతున్నారు. ఈ ఘటనలో ఒకరికి గాయాలయ్యాయి. వెంటనే సదురు వ్యక్తిని ఆస్పత్రికి తరలించారు. ఘటన స్థలానికి కొద్ది దూరంలోనే మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కేపీ కొండారెడ్డి నివాసం ఉంది. అయితే అక్కడికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
నవరత్నాలతో కష్టాలు తీరతాయి
సాక్షి, పొదిలి: వైఎస్ జగన్మోహనరెడ్డి అమలు చేయాలని నిర్ణయించిన నవరత్నాల పథకాలతో పేదల, రైతుల, మహిళలతో పాటు అన్ని వర్గాల ప్రజల కష్టాలు తీరతాయని మార్కాపురం నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కుందురు నాగార్జునరెడ్డి అన్నారు. మంగళవారం మండలంలోని అన్నవరం, చింతగుంపల్లి, ఆముదాలపల్లి, రాములవీడు, నిమ్మవరం, బుచ్చనపాలెం, కొత్తపాలెం, మల్లవరం, కొష్టాలపల్లి, అక్కచెరువు, జువ్వలేరు గ్రామాల్లో రోడ్ షో ద్వారా ప్రచారం నిర్వహించారు. ఆయా గ్రామాల కూడళ్లలో జరిగిన సభల్లో నాగార్జునరెడ్డి మాట్లాడుతూ పొదిలి మండలానికి వెలుగొండ ప్రాజెక్ట్ పరిధి పెంచేలా జగన్మోహనరెడ్డి సీఎం అయినే వెంటనే ప్రతిపాదనలు చేస్తామని హామీ ఇచ్చారు. ఫ్యాన్ గుర్తుకు ఓట్లు వేసి, వేయించి ఎంపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసులరెడ్డి, ఎమ్మెల్యే అభ్యర్థి అయిన తనను గెలిపించాలని కోరారు. మాజీ ఎమ్మె ల్యే ఉడుముల శ్రీనివాసులరెడ్డి, ఎంపీపీ కె.నరసింహారావు, జెడ్పీటీసీ సభ్యుడు సాయి రాజేశ్వరరావు, పార్టీ మండల కన్వీనర్ గుజ్జుల సంజీవరెడ్డి, మాజీ మండల శాఖ అధ్యక్షుడు జి.శ్రీనివాసులు, కల్లం సుబ్బారెడ్డి, మహాబూబ్బాష, పార్టీ జిల్లా జనరల్ సెక్రటరీ వాకా వెంకటరెడ్డి, పార్లమెంటరీ పార్టీ కార్యదర్శి కొత్తపులి బ్రహ్మారెడ్డి, పులి చంద్రశేఖరరెడ్డి, పులి అంజిరెడ్డి, మాజీ సర్పంచ్‌లు పొన్నపాటి శ్రీనివాసులరెడ్డి, చాగంరెడ్డి మాలకొండారెడ్డి, యేబు, యేటి నారాయణ, డి.శ్రీనివాసరెడ్డి, మాజీ ఎంపీపీ వై.వెంకటేశ్వర్లు, మండల ఉపాధ్యక్షుడు అంజిరెడ్డి, ఎంపీటీసీ కె.వెంకటేశ్వరరెడ్డి, మాజీ ఎంపీటీసీ సభ్యులు సీహెచ్.వెంకటేశ్వరరెడ్డి, గొంటు సుబ్బారెడ్డి పాల్గొన్నారు. నారాయణమ్మ ఆధ్వర్యంలో ప్రచారం పట్టణంలోని 1,2,3 వార్డులలో మాజీ ఎంపీపీ ఉడుముల నారాయణమ్మ ఆధ్వర్యంలో ప్రచారం నిర్వహించారు. ఫ్యాన్ గుర్తుపై ఓట్లు వేసి గెలిపించాలని కోరారు. ఎంపీటీసీ సభ్యుడు గౌసియా, నాయబ, దోర్నాల వరలక్ష్మమ్మ, గొలమారి నాగమణి, శ్రావణి, చిమట ఖాశీం, రాములేటి ఖాదరున్నీసా, రాములేటి మస్తాన్‌వలి పాల్గొన్నారు. వివిధ ప్రాంతాల్లో ప్రచారం.. మార్కాపురం: వైఎస్సార్ సీపీ పట్టణ కన్వీనర్ చిర్లం చర్ల కృష్ణ ఆధ్వర్యంలో ఆర్యవైశ్య సంఘం నాయకులు పట్టణంలోని వివేకానంద స్కూల్, సత్యనారాయణస్వామి గుడి, రెడ్డి కళాశాల, 10వ వార్డు, శ్రావణి హాస్పిటల్ ఏరియా, తదితర ప్రాంతాల్లో ప్రచారం నిర్వహించారు. ఆర్యవైశ్య సంఘం నాయకులు బొగ్గరపు శేషయ్య, ఊటుకూరి రామకృష్ణ, కె.కృష్ణ, ఆర్.తిరునారాయణ, ఆర్.రమేష్, సీహెచ్ నాగరాజు, కాళ్ల ఆది, సీహెచ్ రమేష్, ఇమ్మడిశెట్టి వీరారావు పాల్గొన్నారు. కేపీ కుటుంబ సభ్యుల ప్రచారం పట్టణ శివార్లలోని పూలసుబ్బయ్య కాలనీ, ఎస్సీ, బీసీ కాలనీల్లో కుందురు నాగార్జునరెడ్డిని గెలిపించాలని, ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని కోరు తూ కౌన్సిలర్ బుశ్శెట్టి నాగేశ్వరరావు, రావి శివారెడ్డిల ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం జరిగింది. కేపీ కుటుంబ సభ్యులైన అరుణ, కల్పన, పద్మావతి, బూత్ కన్వీనర్ ఎస్.రవి కుమార్, మాజీ కౌన్సిలర్ డి.కాశింపీరా, డి.మార్క్, కాశయ్య, నాగరాజు, నారాయణ పాల్గొన్నారు. తర్లుపాడులో.. తర్లుపాడు: రానున్న ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నాగార్జునరెడ్డి, ఎంపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసులరెడ్డిలను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కేపీ కొండారెడ్డి కుమార్తె అరుణ కోరారు. మండలంలోని మీర్జాపేట పంచాయతీ పరిధిలోని కారుమానుపల్లె గ్రామంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. వైఎస్సార్ సీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శి మురారి వెంకటేశ్వర్లు, రాష్ట్ర మహిళా సహాయ కార్యదర్శి కంది ప్రమీలారెడ్డి, చిన్న కొండారెడ్డి, సరస్వతి, లక్ష్మి, డి.భాస్కరరెడ్డి, ఎర్రారెడ్డి, గాదె శ్రీనివాసరెడ్డి, వెన్నా శివారెడ్డి, తాతిరెడ్డి మల్లారెడ్డి, గాలిరెడ్డి, దొండపాటి వెంకటరెడ్డి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కొనకనమిట్ల: మండల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మండల పార్టీ కన్వీనర్ రాచమళ్ల వెంకటరామిరెడ్డి, జెడ్పీటీసీ సభ్యుడు మెట్టు వెంకటరెడ్డి, ఎంపీపీ ఉడుముల రామనారాయణరెడ్డి, మాజీ ఎంపీపీ ఉడుముల నారాయణమ్మ, మాజీ సర్పంచ్ ఉడుముల గురవారెడ్డి, మోరా శంకరరెడ్డి ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం చేపట్టారు. గొట్లగట్టు, నాయుడుపేట, తువ్వపాడు, చౌటపల్లి గ్రామాల్లో నాగార్జునరెడ్డి, మాగుంట శ్రీనివాసులరెడ్డి విజయం కోసం, జగనన్న ముఖ్యమంత్రిగా రావాలంటే ఫ్యాన్ గుర్తుకు ఓటేసి గెలిపంచాలని ఆయా గ్రామాల్లో నాయకులు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఎన్నికల ప్రచారంలో మాజీ మండల పార్టి ఉపాధ్యక్షుడు సానికొమ్ము వెంకటేశ్వరరెడ్డి, పార్టీ జిల్లా కార్యదర్శి మోరా శంకరరెడ్డి, నాయకులు ఎం.రంగస్వామి, కల్లం సుబ్బారెడ్డి పాల్గొన్నారు. -
మార్కాపురం బహిరంగ సభలో వైఎస్ విజయమ్మ
-
అభివృద్ధి జరగాలంటే వైఎస్సార్సీపీ గెలవాలి : విజయమ్మ
-
‘జగన్ అనుకుంటే సాధిస్తాడు’
సాక్షి, ప్రకాశం : జగన్ అనుకుంటే సాధిస్తాడు.. ఇచ్చిన మాట తప్పడని వైయస్ఆర్సీపీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మ స్పష్టం చేశారు. శుక్రవారం మార్కాపురం ప్రచార సభలో పాల్గొన్న విజయమ్మ ప్రసంగిస్తూ.. జగన్ అధికారంలోకి వస్తేనే అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం జరుగుతుందని తెలిపారు. రాష్ట్రంలో అరాచక పాలన జరుగుతోంది.. కుట్రలు, కుతంత్రాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్సార్ ప్రవేశ పెట్టిన సంక్షేమ కార్యక్రమాలను.. చంద్రబాబు మూలకు పడేశారని ఆరోపించారు. వెలిగొండ ప్రాజెక్ట్‌ను వైఎస్సార్ 70 శాతం పూర్తి చేస్తే.. మిగిలిన 30 శాతం నిర్మాణాన్ని పూర్తి చేయడానికి చంద్రబాబుకు మనసు రాలేదని మండి పడ్డారు. పసుపు - కుంకుమ పేరుతో చంద్రబాబు జనాలను మాయ చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు 40 ఏళ్ల అనుభవం దేనికి ఉపయోగపడింది.. రాజధాని నిర్మాణానికా.. ప్రాజెక్ట్‌లు పూర్తి చేయడానికా అంటూ ప్రశ్నించారు. చంద్రబాబు ఏసీ రూముల్లో కూర్చొని జగన్ నవవరత్నాలను కాపీ కొడుతున్నారంటూ ధ్వజమెత్తారు. జగన్ అధికారంలోకి వస్తే చంద్రబాబు నిర్విర్యం చేసిన ఆరోగ్యశ్రీని పునరుద్ధరిస్తాడని.. ఎంత ఖర్చయిన భరిస్తాడని తెలిపారు. అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదే మార్కాపురం పలకల పరిశ్రమకు చేయూతనిస్తాడని పేర్కొన్నారు. చంద్రబాబు అన్ని పార్టీలతో కలస్తూ.. జగన్ మీద నిందలు వేస్తున్నాడంటూ మండిపడ్డారు. జగన్ ఎవరితోనూ కలవడు.. 25 ఎంపీలను గెలిపించుకుని ప్రత్యేక హోదా తెచ్చుకుందామని తెలిపారు. మార్కాపురం అభ్యర్థిగా కేపీ నాగార్జున రెడ్డిని, ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థిగా మాగుంట శ్రీనివాసులు రెడ్డిని గెలిపించడని విజయమ్మ ప్రజలను కోరారు. -
ప్రతి పంచాయతీలో 10 మందికి ఉద్యోగాలు
సాక్షి, పర్చూరు: ఐదేళ్ల టీడీపీ పాలనలో తీవ్ర వర్షాభావం.. గ్రామాల్లో పంటల్లేవు.. పనులూ కరువు.. ఉన్న ఊళ్లో ఉపాధి లేక నిరుద్యోగం పెరిగిపోయింది. ఎన్నో కుటుంబాలకు పూట గడవడమే గగనమైంది. వ్యవసాయం చేయలేక రైతులు, ఉద్యోగాలు భర్తీ లేక నిరుద్యోగ యువత దిక్కుతోచని అయోమయ పరిస్థితిలో ఉన్నారు. ఇదంతా గమనించిన వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఉద్యోగ విప్లవానికి ప్రణాళిక రచించారు. వైఎస్సార్ సీపీ అధికారంలోకి రాగానే ప్రతి పంచాయతీలో 10 మంది నిరుద్యోగ యువతకు ఉద్యోగావకాశాలు కల్పించేందుకు శ్రీకారం చుట్టారు. ప్రతి పంచాయతీలో గ్రామ సచివాలయం ఏర్పాటు చేసి అదే గ్రామానికి చెందిన 10 మంది నిరుద్యోగ యువతకు ఉద్యోగాలిస్తామని హామీ ఇచ్చారు. తద్వారా ప్రజా సమస్యలను కూడా సత్వరమే పరిష్కరించేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు. జిల్లాలోని 1,030 పంచాయతీల్లో 10,300 ఉద్యోగాలు... జిల్లాలో 1,030 పంచాయతీలు ఉన్నాయి. ప్రతి పంచాయతీలో 10 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తే మొత్తం 10,300 మంది నిరుద్యోగ యువతకు మేలు జరుగుతుంది. వీరంతా గ్రామ సచివాలయంలో పనిచేయడం ద్వారా ప్రతి చిన్న పనికీ పట్టణాలు, నగరాల్లోని కార్యాలయాలకు స్థానికులు వెళ్లే అవసరం ఉండదు. ప్రతి 50 ఇళ్లకు ఒక వలంటీర్... ప్రజా సమస్యలను తక్షణమే పరిష్కరించేందుకు ప్రతి 50 ఇళ్లకు ఒక గ్రామ వలంటీర్‌ను నియమించి వారికి రూ.5 వేలు జీతం ఇస్తామని జగన్ హామీ ఇచ్చారు. ఆ 50 ఇళ్లకు ఆ వలంటీర్ జవాబుదారీగా ఉంటూ గ్రామ సచివాలయంతో అనుసంధానమై పనిచేస్తారు. రేషన్‌కార్డు, సామాజిక భద్రత పింఛన్లు, ఆరోగ్యశ్రీ కార్డు, తదితర పథకాల కోసం దరఖాస్తు చేసుకున్న వారికి 3 రోజుల్లోనే వాటిని మంజూరు చేస్తారని జగన్ భరోసా ఇచ్చారు. ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్ కేలండర్‌ను కూడా ప్రకటించి ఏటా ఆయా తేదీల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటు చేసే కంపెనీల్లో 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇచ్చేలా మొదటి అసెంబ్లీ సమావేశంలోనే చట్టం తెస్తామని జగన్ ఇచ్చిన హామీపై నిరుద్యోగుల నుంచి హర్షం వ్యక్తమవుతోంది. జిల్లాలోని నియోజకవర్గాల వారీగా ఉన్న పంచాయతీలు, లభించే ఉద్యోగాలు ఇలా... నియోజకవర్గం గ్రామ పంచాయతీలు ఉద్యోగ అవకాశాలు యర్రగొండపాలెం 84 840 దర్శి 94 940 పర్చూరు 95 950 అద్దంకి 103 1,030 చీరాల 24 240 సంతనూతలపాడు 85 850 ఒంగోలు 28 280 కందుకూరు 93 930 కొండపి 112 1,120 మార్కాపురం 83 830 గిద్దలూరు 94 940 కనిగిరి 135 1,350 జగన్ వస్తే నిరుద్యోగ సమస్య తీరుతుంది చదువుకుని కూడా ఎలాంటి ఉపాధి లేకుండా ఉండాల్సి వస్తోంది. టీడీపీ ప్రభుత్వం నిరుద్యోగులకు చేసిందేమీలేదు. వైఎస్సార్ సీపీ అధినేత జగన్మోహన్రెడ్డి సీఎం అయితే నిరుద్యోగ సమస్య తీరుతుంది. 10 మంది స్థానికులకు సొంత ఊళ్లోనే ఉద్యోగ అవకాశాలు కల్పిస్తే బాగుంటుంది. ప్రత్తిపాటి మురళి, చినగంజాం జగన్ ముఖ్యమంత్రి కావాలి ప్రస్తుత పరిస్థితులలో రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించాలన్నా, పరిశ్రమలు రావాలన్నా, నిరుద్యోగ సమస్య తీరాలన్నా జగన్‌తోనే సాధ్యం. వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయితేనే నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు లభిస్తాయి. గౌరవంగా బతకవచ్చు. వలివేటి కిషోర్, చినగంజాం నిరుద్యోగుల కల నెరవేరనుంది జగన్ ముఖ్యమంత్రి అయితే నిరుద్యోగుల కల నెరవేరుతుంది. రాష్ట్రంలోని రైతులు, మహిళలు, కూలీలు, చేనేతలు, విద్యార్థులు ఇలా అన్ని వర్గాల ప్రజల పట్ల ఆయనకు పూర్తి అవగాహన ఉంది. నిరుద్యోగులు పడుతున్న కష్టాలు పూర్తిగా ఆయనకు తెలుసు. అందుకే ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాడు. ఆట్ల వంశీ, గ్రాడ్యుయేట్ జగనన్న భరోసాపై నమ్మకం ఉంది నిరుద్యోగులకు జగన్మోహన్రెడ్డి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానని భరోసా ఇవ్వడంతో ఉద్యోగం వస్తుందనే నమ్మకం నిరుద్యోగుల్లో కలుగుతోంది. నిరుద్యోగులకు టీడీపీ హయాంలో చేసిందేమీ లేదు. కూర్మాల పవన్, బీటెక్ -
అసలిచ్చి.. కొసరు మరిచి!
రైతులు దేశానికి వెన్నెముక వంటి వారు.. అలాంటి వారికి ఉపయోగపడే ప్రాజెక్టులను కూడా రాజకీయ లబ్ధి కోసం శంకుస్థాపన చేయడం బాధాకరమని పశ్చిమ ప్రాంత వాసులు అభిప్రాయపడుతున్నారు. అభివృద్ధి పనులకు అట్టహాసంగా శంకుస్థాపనలు చేసి నిధులు మంజూరు చేయకపోవడాన్ని అన్నదాతలు తప్పుబడుతున్నారు. అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని..అన్న చందంగా ఉంది మార్కాపురం గుండ్లకమ్మ నది ఒడ్డున ఏర్పాటు చేసిన చెక్‌డ్యామ్ పరిస్థితి. చెక్‌డ్యామ్ ఎట్టకేలకు పూర్తయినా నీళ్లు నిల్వ ఉండేందుకు గేట్లు నిర్మించకపోవడంతో నీరంతా వృథాగా పోతోంది. వేలాది ఎకరాలు బీళ్లుగా మారుతున్నాయి. రైతుల ఆశలు ఆవిరవుతున్నాయి. సాక్షి, మార్కాపురం రూరల్ (ప్రకాశం): మార్కాపురం పట్టణ సమీపంలోని పెద్ద నాగులవరం గ్రామ ఇలాకాలో గుండ్లకమ్మపై నాలుగేళ్ల క్రితం రూ.9 కోట్లతో భారీ చెక్‌డ్యామ్ నిర్మించారు. మెకానికల్ గేట్లు అమర్చలేదు. చెక్‌డ్యామ్ నిర్మించినా ఉపయోగం లేకుండా కేవలం అలంకార ప్రాయంగా ఉంది. ఇటీవల ఎగువ ప్రాంతంలో భారీ వర్షాలు కురవడంతో ఒక్కసారిగా గుండ్లకమ్మకు నీరు చేరింది. చెక్‌డ్యామ్ నిండి కూడా గుండ్లకమ్మ నీరు దిగువ ప్రాంతానికి వెళ్లిపోయింది. ఆ చెక్ డ్యామ్‌కు గేట్లు నిర్మించకకోవడంతో నీరంతా దిగువ ప్రాంతానికి వృథాగా పోయింది. ప్రజలు ఆశలు ఒక్కసారిగా ఆవిరయ్యాయి. సాగు చేసి నాలుగు గింజలు పండిద్దామన్న రైతుల కల నెరవేరలేదు. చెక్‌డ్యామ్ కెపాసిటీ దాదాపు 80 మిలియన్ క్యూబిక్ పీట్స్ అంటే 0.08 టీఎంసీల వరకు నీరు నిల్వ చేసుకోవచ్చు. అంటే దాదాపు 800 ఎకరాలకు సాగునీరు అందించవచ్చు. అంతేకాకుండా చుట్టుపక్కల గ్రామాలతో పాటు పట్టణంలోని బోర్లకు నీరు అందించవచ్చు. చెక్‌డ్యామ్‌తో పట్టణంలోని బోర్లకు భూగర్భ జలాలు పెరిగి ప్రజలకు నీటి సమస్య ఉండదు. ప్రభుత్వ నిర్లక్ష్యంతో చెక్‌డ్యామ్ చుక్క నీరు నిల్వ ఉండని పరిస్థితి దాపురించింది. అరకొరగా చేపట్టిన చెక్‌డ్యామ్ నిర్మాణ పనులపై అప్పట్లో ప్రజలు ఇరిగేషన్ అధికారుల తీరును తప్పుపట్టారు. ఇటు ఎమ్మెల్యే జంకె వెంకటరెడ్డి చెక్‌డ్యామ్‌ను సందర్శించి వెంటనే రింగ్ బండ ఏర్పాటు చేయాలని ఇరిగేషన్ అధికారులకు సూచించారు. చెక్‌డ్యామ్ ఇరువైపులా ఉన్న మట్టి ఇప్పటికే జారిపోతోందని, పైన మట్టి నెర్రెలు బారిందని, ఇరువైపులా రివింట్మెంట్ ఏర్పాటు చేయాలని సూచించారు. ఏం..ఉపయోగం? ఎట్టకేలకు రింగ్ బండను ఏర్పాటు చేసినా ఉపయోగం లేకుండాపోయింది. అది కాస్తా కొద్దిపాటి వర్షానికే కొట్టుకుపోయింది. కేవలం ప్రజాప్రతినిధులు ఏదో అడిగారు.. చేశామని చందంగా ఆ రింగ్ బండ్‌ను ఏర్పాటు చేశారు. రింగ్ బండ ఏర్పాటు చేసేటప్పుడు మట్టిపోసి దానిపై నీళ్లు చల్లి రోలింగ్ తిప్పాలి. కానీ అదేమీ చేయకుండా చెక్‌డ్యామ్‌లోని మట్టిని ట్రాక్టర్‌తో తెచ్చి గ్యాప్ పూడ్చారు. రూ.66 లక్షలు అవసరం పెద్దనాగులవరం చెక్‌డ్యామ్‌లో నీరు నిల్వ ఉండేందుకు సుమారు మూడు మెకానికల్ గేట్లు ఏర్పాటు చేయాల్సి ఉంది. అందుకు రూ.66 లక్షలు అవసరం కానున్నాయి. టీడీపీ ప్రభుత్వం ఉదాసీనతతో నిధులు కూడా మంజూరు కాలేదు. ఇటీవల మార్కాపురం వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కుమారుడు మంత్రి లోక్ష్ దరిమడుగు సమీపంలో కొత్త చెక్‌డ్యామ్ నిర్మాణానికి రూ.28.09 కోట్లతో శంకుస్థాపన చేశారు. చెక్ డ్యామ్‌ల నిర్మాణ ముఖ్య ఉద్దేశం పట్టణంలోని బోర్లకు నీరు సంవృద్ధిగా అందించడం. సమీపంలోని పొలాలకు నీరు అందించాలనే లక్ష్యంతో ఏర్పాటు చేశారు. చెక్‌డ్యామ్‌ల నిర్మాణాలకు శంకుస్థాపనలు చేయడం తప్పు కాదుగానీ తప్పుడు హామీలతో ప్రజలను మభ్యపెట్టడం ఎంతవరకు సమంజసమని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఐదు నెలలవుతున్నా ప్రారంభించని పనులు నిర్మాణానికి రూ.28.09 కోట్లు మంజూరు చేశామని చినబాబు చెప్పారు. చెప్పి కూడా దాదాపు ఐదు నెలలు కావస్తున్నా ఇంత వరకు అతీగతీ లేదు. పనులు చేపట్టలేదు కదా అసలు టెండర్లే జరగలేదు. పట్టణ ప్రజలు, దరిమడుగు గ్రామ ప్రజలకు ఎన్నో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎన్నికల కోసం హడావుడి కోసం శంకుస్థాపన చేసి ఎవరిని మోసం చేస్తారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఉన్నదానికి ఉపయోగం లేకుండా కొత్త వాటి నిర్మాణానికి కోట్లు మంజూరు చేస్తారా..అంటూ ప్రజలు ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. ప్రజలను మోసం చేసేందుకే శంకుస్థాపనలు ఎన్నికల ముందు 600 హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసి అధికారంలోకి చంద్రబాబునాయుడు వచ్చారు. ఇక చినబాబు మార్కాపురం ప్రాంతంలో పలు రకాల పనులకు శంకుస్థాపనలు చేశారు. ఇందులో పెద్ద నాగులవరం చెక్‌డ్యామ్ పూర్తి అయినా దానికి మెకానికల్ గేట్లు ఏర్పాటుకు రూ.66 లక్షలు మంజూరు చేయాలి. ఇప్పటికీ దిక్కు లేదుగానీ కొత్తగా రూ.28 కోట్లతో మరొకదానికి దరిమడుగ గ్రామ సమీపంలో శంకుస్థాపన చినబాబు చేశారు. ఇది కేవలం ప్రజలను మోసం చేసేందుకే. - జవ్వాజి వెంకట రంగారెడ్డి, జెడ్పీటీసీ సభ్యుడు రైతులతో రాజకీయం చేయడం సిగ్గుచేటు గుండ్లకమ్మ నది ఒడ్డున పెద్ద నాగులవరం చెక్ డ్యామ్ పూర్తి చేసి కూడా రైతులకు ఎటువంటి ఉపయోగం లేకుండా పోయింది. దానికి గేట్లు నిర్మిస్తే చుట్టుపక్కల రైతుల బోర్లకు నీరు పూర్తిగా వస్తుంది. మంత్రి లోకేష్ శంకుస్థాపనలు చేసిన విధానం చూస్తుంటే రాజకీయ లబ్ధి కోసమే శంకుస్థాపన చేసినట్లు ఉంది. - సీహెచ్ తిరుపతిరెడ్డి, దరిమడుగు, రైతు గేట్లు నిర్మించాలి పెద్ద నాగులవరం చెక్ డ్యామ్ పూర్తయి దాదాపు 15 నెలలు కావస్తున్నా ఇంత వరకు గేట్లు నిర్మించకపోవడం సిగ్గుచేటు. గేట్లు పెట్టి ఉంటే ఆరు నెలల క్రితం గుండ్లకమ్మ నది ఎగువన కురిసిన వర్షానికి నీరు నిల్వ ఉండి ఉపయోగపడేవి. కానీ దిగువకు పోయి కేవలం ఆ చెక్‌డ్యామ్ అలంకార ప్రాయంగా మిగిలిపోయింది. చెక్‌డ్యామ్ విషయంలో రాజకీయం చేయకుండా త్వరగా గేట్లు నిర్మించాలి. - తురకా ఏడుకొండలు, సీపీఎం నాయకుడు, పెద్ద నాగులవరం -
17 మంది క్రికెట్ బుకీల అరెస్టు
మార్కాపురం: డివిజన్ కేంద్రం మార్కాపురంలో 17 మంది క్రికెట్ బుకీలను అరెస్టు చేసి వారి నుంచి రూ.81 వేల నగదు, 10 సెల్ఫోన్లు, కంప్యూటర్ను స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ రామాంజనేయులు వెల్లడించారు. మంగళవారం సాయంత్రం స్థానిక సీఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన నిందితుల వివరాలు చెప్పారు. డీఎస్పీ కథనం ప్రకారం.. ఈ నెల 7వ తేదీ రాత్రి హైదరాబాద్ వర్సెస్ రాయల్ చాలెంజెస్ బెంగళూరు జట్ల మధ్య ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ జరిగింది. పట్టణంలోని దోర్నాల బస్టాండ్ సెంటర్ కేథార్ ఇంటర్నెట్ షాప్, ఓ ఫర్నిచర్ షాప్‌పైన ఉన్న ఇంటర్నెట్ షాప్‌లో కొంత మంది క్రికెట్ బెట్టింగ్‌లు పెడుతున్నట్లు పట్టణ ఎస్ఐ కోటయ్యకు సమాచారం అందింది. ఆయన తన సిబ్బందితో వెళ్లి క్రికెట్ బుకీలను అదుపులోకి తీసుకున్నారు. ఇదే సమయంలో మార్కాపురం మండలం రాయవరం వద్ద కొంతమంది క్రికెట్ బెట్టింగ్ పెడుతున్నట్లు డీఎస్పీకి సమాచారం అందటంతో ఆయన రూరల్ ఎస్ఐ మల్లికార్జున్‌ను అక్కడికి పంపిం చారు. క్రికెట్ బెట్టింగ్ పెడుతున్న వారిని అదుపులోకి తీసుకున్నారు. మొత్తం మీద 17 మంది క్రికెట్ బెట్టింగ్ పెడుతున్నట్లు గుర్తించి వారి నుంచి నగదు, సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. వీరిని విచారణ చేయగా మరికొందరి పేర్లు తెలిపారు. వీరిలో ముగ్గురు ఆర్గనైజర్లు, మరో నలుగురు క్రికెట్ బుకీలు ఉన్నారు. వారు పరార్ అయ్యారు. త్వరలోనే వారిని కూడా అరెస్టు చేస్తామని డీఎస్పీ విశ్వాసం వ్యక్తం చేశారు. పట్టుకున్న 17 మంది ప్రొద్దుటూరు, బెంగళూరుల్లో కూడా క్రికెట్ బెట్టింగ్‌లు పెడుతుంటారని డీఎస్పీ తెలిపారు. క్రికెట్ బెట్టింగ్‌లకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. పట్టణ, రూరల్ ఎస్ఐలు కోటయ్య, మల్లికార్జునరావు, సిబ్బందిని ఆయన అభినందించారు. -
చిన్ని తల్లిదండ్రుల డీఎన్ఏ నమూనా సేకరణ
మార్కాపురం : గుజరాత్‌లోని పాండిచేరా పోలీసుస్టేషన్ సమీపంలో అనుమానాస్పదంగా మృతి చెందిన చిన్నారి డీఎన్ఏ (రక్త నమూనాలు), గతేడాది అక్టోబర్‌లో తప్పిపోయిన పెద్దారవీడు మండలం గొబ్బూరుకు చెందిన మాకం చిన్ని తండ్రి అబ్రహం రక్తనమూనాలను సూరత్ పోలీసులు సేకరించి ఫలితం కోసం ల్యాబ్‌కు పంపారు. దీంతో సర్వత్రా, అటు గుజరాత్ పోలీసులు, ఇటు మార్కాపురం పోలీసులు, ప్రజలు, తల్లిదండ్రుల్లో ఉత్కంఠ నెలకొంది. మూడు, నాలుగు రోజుల్లో ఫలితాలు వచ్చేలా గుజరాత్ పోలీసులు ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఈ కేసును ఇటు ప్రకాశం పోలీసులు, అటు సూరత్ కమిషనర్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. గతేడాది అక్టోబర్ 10న మార్కాపురం ఎస్సీ హాస్టల్లో చదుకుంటూ అదృశ్యమైన మాకం చిన్ని కేసు మిస్టరీగా మారింది. సూరత్ సమీపంలో దొరికిన చిన్నారి మృతదేహం పోలికలు, మాకం చిన్ని పోలికలు ఒకే విధంగా ఉండటంతో ఈ కేసు దేశవ్యాప్తంగా సంచలనానికి కారణమైంది. మృతదేహం ఒంటిపై అక్కడక్కడా గాయాలు ఉండటంతో హత్య చేసి ఉంటారన్న అనుమానాలు పోలీసులు వ్యక్తం చేస్తున్నారు. మాకం చిన్ని తల్లిదండ్రులను మార్కాపురం పోలీసులు సూరత్ తీసుకెళ్లారు. కుమార్తె పోలికలు సంఘటన స్థలంలో ఉన్న మృతదేహం పోలికలు దగ్గరగా ఉన్నా ఎడమ మోచేతి కింద పుట్టుమచ్చ లేదని, తన కుమార్తె కాకపోవచ్చని అబ్రహం అనుమానం వ్యక్తం చేశారు. ఇదే సమయంలో ఫింగర్ ప్రింట్స్ కూడా ఆధార్ సాఫ్ట్‌వేర్‌లో మ్యాచ్ కాకపోవడంతో డీఎన్ఏ పరీక్షలకు సిద్ధమయ్యారు. బుధవారం చిన్ని తండ్రి అబ్రహం రక్తనమూనా సేకరించగా గురువారం రాత్రి తల్లి విశ్రాంతమ్మ కూడా సంఘటన స్థలానికి చేరుకున్నట్లు తెలిసింది. ఆమె రక్తనమూనాలు సేకరించి ల్యాబ్‌కు పంపనున్నారు. డీఎన్ఏ పరీక్షలో మృతురాలిది, తల్లిదండ్రుల రక్తనమూనాలు మ్యాచ్ అయితే మాకం చిన్నిగా పోలీసులు భావిస్తారు. అలా కాకుంటే చిన్ని ఎక్కడుందనేది పోలీసులకు సవాల్‌గా మారనుంది. డీఎన్ఏ పరీక్షల ఫలితాల కోసం అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. -
ఉరేసుకుని యువకుడి ఆత్మహత్య
కుటుంబ కలహాలే కారణం మార్కాపురం రూరల్ : కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ యువకుడు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన మండలంలోని దరిమడుగులో బుధవారం వెలుగు చూసింది. పోలీసుల కథన ప్రకారం.. మద్దిపాడు మండలం మల్లవరానికి చెందిన ఏకాంబరం వెంకట్రావ్ (32) వృత్తిరీత్యా మెకానిక్. మార్కాపురం పట్టణంలోని ట్రాక్టర్ షోరూంలో మెకానిక్‌గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. రెండేళ్ల నుంచి దరిమడుగులో ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్నాడు. భార్య కవిత, కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఆమె పుట్టిల్లు కూడా మల్లవరమే. ఈ నేపథ్యంలో దంపతుల మధ్య చిన్నపాటు గొడవ జరిగింది. భార్య అలిగి పిల్లలతో కలిసి పుట్టింటికి వెళ్లింది. తీవ్ర మనస్తాపం చెందిన వెంకట్రావ్ మంగళవారం రాత్రి ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇంటి తలుపులు తెరిచి ఉండటంతో స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. ఏఎస్ఐ డేవిడ్‌రాజు సంఘటన స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తునట్లు ఆయన తెలిపారు. సంఘటన స్థలానికి స్థానికులు పెద్ద ఎత్తున చేరుకున్నారు. -
దళితుల భూములు స్వాహా
♦ కోటిన్నర భూమిపై టీడీపీ నేత కన్ను ♦ చర్చి ఆస్తులకు చెందిన భూమికి పాస్‌బుక్ ♦ బినామీ పేర్లతో రిజిస్ట్రేషన్.. దళితుల ఆందోళన మార్కాపురం: Üుమారు కోటిన్నర రూపాయల విలువ చేసే చర్చి భూములపై పశ్చిమ ప్రకాశానికి చెందిన టీడీపీ ముఖ్య నేత కన్నుపడింది. పకడ్బందీగా ప్రణాళిక వేసి రెవెన్యూ అధికారులపై ఒత్తిడి తెచ్చి తన అనుచరులకు పాస్ పుస్తకాలు ఇప్పించుకుని అప్పనంగా 11.30 ఎకరాలు సొంతం చేసుకునేందుకు రంగం సిద్ధం చేశారు. నేరుగా తన పేరు ఉంటే విమర్శలు వస్తాయని ముగ్గురు, నలుగురు వ్యక్తులు చేతులు మారిన తరువాత తన పేరున రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని చూస్తున్నారని ఈ విషయం తెలిసిన దళితులు ఆందోళన చేసేందుకు సిద్ధమయ్యారు. పాస్ పుస్తకాలు ఇచ్చిన రెవెన్యూ అధికారులపై దళితులు ముఖ్యమంత్రికి, రెవెన్యూ మంత్రికి, ఏసీబీ డైరెక్టర్ జనరల్‌కు, కలెక్టర్‌కు, ఆర్డీఓకు ఫిర్యాదు చేశారు. వివరాలు... మార్కాపురం మండలంలోని నికరంపల్లె ఎస్సీలకు సుమారు వంద ఏళ్ల కిందట బ్రిటిష్ ప్రభుత్వం సర్వే నంబర్ 242–7లో 11.30 ఎకరాలను (ప్రస్తుత మార్కెట్ విలువ కోటిన్నర) బాప్టిస్ట్ మిషన్‌కు గానూ మూర్సి దొర వారి పేరుతో కేటాయించారు. ఆర్‌ఎస్‌ఆర్‌లో నమోదు చేశారు. ఈ పొలాన్ని అమ్మేందుకు వీలు లేకుండా కేవలం నికరంపల్లె గ్రామ దళితులు సాగు చేసుకుని దానిపై వచ్చే ఆదాయంలో సగం చర్చి అభివృద్ధికి కేటాయించుకోవాలని అప్పట్లో తమ పెద్దలు తమకు చెప్పినట్లు గ్రామ దళితులు తెలిపారు. అయితే, ఈ ఏడాది మార్చిలో రెవెన్యూ రికార్డులు తారుమారు చేసి పాస్ పుస్తకం నంబర్ 19346, పట్టా నంబర్ 146తో మండలంలోని నాగులవరం గ్రామానికి చెందిన కొండేటి దివాకర్ పేరుతో జారీ అయింది. ఈ పొలాన్ని దివాకర్ మార్చి 27న 11.30 ఎకరాలను రూ.16.95 లక్షలకు మండల కేంద్రమైన పెద్దారవీడుకు చెందిన అల్లు వెంకటేశ్వరరెడ్డికి రిజిస్టర్ చేయటం గమనార్హం. కొండేటి దివాకర్, అల్లు వెంకటేశ్వరరెడ్డి ఇద్దరూ నియోజకవర్గ టీడీపీ ముఖ్యనేతకు అనుచరులు కావడం గమనార్హం. కొండేటి దివాకర్ ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న సమయంలో వ్యవహారశైలి సరిగా లేకపోవటంతో అధికారులు తొలగించారు. ఆర్‌ఎస్‌ఆర్‌లో మూర్సి దొర పేరుతో ఉన్న పట్టా ఆకస్మికంగా కొండేటి దివాకర్ పేరుతో ఎలా వచ్చిందో రెవెన్యూ అధికారులకే తెలియాలి. అనువంశికంగా, పూర్వీకుల నుంచి వచ్చినట్లుగా పట్టాదారు అడంగల్‌లో నమోదు చేయటం రెవెన్యూ అధికారులకే చెల్లింది. తెర వెనుక నియోజకవర్గానికి చెందిన టీడీపీ ముఖ్య నేత రెవెన్యూ అధికారులపై ఒత్తిడి తెచ్చి భారీ స్థాయిలో ముడుపులు అందించి కథ నడిపినట్లుగా దళితులు ఆరోపిస్తున్నారు. నికరంపల్లె గ్రామానికి సంబం«ధం లేని కొండేటి దివాకర్‌కు పాస్ పుస్తకం రావటం ఒక వింత అయితే, ఎటువంటి రికార్డులు పరిశీలించకుండా రెవెన్యూ అధికారులు యాజమాన్యపు హక్కుల రికార్డులో నమోదు చేయటం విశేషం. ఇందులో గ్రామస్థాయి నుంచి మండల స్థాయి వరకు పనిచేస్తున్న రెవెన్యూ అధికారుల వ్యవహారశైలిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. స్పష్టంగా నకిలీ పాస్ పుస్తకంగా గ్రామ దళితులు పేర్కొంటున్నారు. ఆన్లైన్లో నమోదు చేసేటప్పుడు రెవెన్యూ అధికారులు అన్ని రికార్డులను పరిశీలించాల్సి ఉండగా, ఈ సంఘటనలో అవేమీ లేకుండానే అధికార పార్టీ నేత చెప్పినట్లు కథ నడిపించారు. మిషనరీ ఆస్తులు అమ్మటం, కొనటం నేరమని రెవెన్యూ అధికారులకు తెలుసు. వారే చట్ట ఉల్లంఘన చేశారు. అన్యాక్రాంతమైన చర్చి భూములు 11 ఎకరాల్లో ఎకరా రూ.15 లక్షల ప్రకారం వేసుకున్నా, ప్రస్తుత మార్కెట్ విలువ సుమారు కోటిన్నర ఉంటుంది. అసెంబ్లీలో ప్రస్తావిస్తా నికరంపల్లి చర్చి పొలాలను మార్కాపురం రెవెన్యూ అధికారులు తమ ఇష్టమొచ్చినట్లుగా మార్పు చేసి సంబంధం లేని వ్యక్తికి పాస్ పుస్తకంలో నమోదు చేసి ఇవ్వటం దారుణం. రికార్డులను పరిశీలించాలన్న ఆలోచన కూడా వారికి లేదు. దీనిపై వచ్చే అసెంబ్లీ సమావేశంలో స్పీకర్, ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తా. ఆర్డీఓకు ఫిర్యాదు చేశాను. కలెక్టర్, జేసీ, రెవెన్యూ శాఖ కార్యదర్శి దృష్టికి తీసుకెళ్తున్నాం. ఇచ్చిన పాస్ పుస్తకాలు రద్దు చేసి చర్చి ఆస్తిగానే ఉంచాలి. – జంకె వెంకటరెడ్డి, ఎమ్మెల్యే -
ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు
మార్కాపురం:డాక్టర్ శామ్యూల్ జార్జి ఇంజినీరింగ్ కళాశాల స్థాపించి 20 ఏళ్లు అయిన సందర్భంగా ఆదివారం రాత్రి కళాశాలలో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు విద్యార్థులను అలరించాయి. ప్రముఖ గాయకులు సమీరా భరద్వాజ్, సత్యాయామిని, మనీషా, దినకర్ బృందం పాడిన పాటలు అలరించాయి. జబర్దస్త్ టీమ్‌లో రాకెట్ రాఘవ బృందం చేసిన హాస్య సన్నివేశాలు అందరిని ఆకట్టుకున్నాయి. కళాశాలలో వివిధ విభాగాల్లో ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు సాధించిన విద్యార్థులకు ఐఆర్ఎస్ అధికారి కిశోర్‌బాబు, కళాశాల సాంకేతిక సలహాదారులు ఎస్‌ఎన్‌పాడు ఎమ్మెల్యే సురేష్, కళాశాల కార్యదర్శి డాక్టర్ సతీష్, డైరెక్టర్ విశాల్‌లు బహుమతులు అందించారు. కార్యక్రమంలో ఇన్‌కమ్‌టాక్స్ కమిషనర్ విజయలక్ష్మి సురేష్, వీహెచ్‌ఆర్ విద్యా సంస్థల అధినేత వెన్నా హనుమారెడ్డి, ఏ–వన్ గ్లోబల్ కళాశాల చైర్మన్ షంషీర్ అలీబేగ్, సిబ్బంది పాల్గొన్నారు. -
ఇద్దరి ఉసురు తీసిన విద్యుదాఘాతం
మార్కాపురం : ఫ్యాక్టరీలో పలకల పని చేస్తున్న సమయంలో విద్యుదాఘాతానికి గురై ఇద్దరు కార్మికులు మృతి చెందారు. ఈ సంఘటన పట్టణంలోని సాయిబాలాజీ థియేటర్ సమీపంలో సోమవారం జరి గింది. వివరాలు.. మండలంలోని వేములకోటకు చెందిన ఎలకపాటి కోటమ్మ (40), పట్టణంలోని కంభం రోడ్డులో నివాసం ఉంటున్న గూడెం శివారెడ్డి(35)లు ఎం.రమణ పలకల ఫ్యాక్టరీలో కార్మికులుగా పని చేస్తున్నారు. ఫ్యాక్టరీకి వచ్చి కార్మికులు యథావిధిగా పనిచేస్తు న్న సమయంలో విద్యుదాఘాతానికి గురై సంఘటన స్థలంలోనే కోటమ్మ, శివారెడ్డిలు తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందారు. ఆ రెండు కుటుంబాల్లో విషాదం నెలకొంది. విష యం తెలిసిన వెంటనే మార్కాపురం సీఐ బత్తుల శ్రీనివాస్, రూరల్ ఎస్ఐ వెంకటేశ్వర్లు సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు కోటమ్మకు భర్త ఇమ్మానియేల్‌తో పాటు కుమారుడు, కుమార్తె ఉన్నారు. శివారెడ్డికి భార్య సావిత్రితో పాటు కుమా ర్తె గాయత్రి, కుమారుడు నరసింహారెడ్డి ఉన్నారు. విషయం తెలిసిన వెంటనే కుటుంబ సభ్యులు పలకల ఫ్యాక్టరీకి చేరుకుని మృతదేహాలను చూసి షాక్‌కు గురయ్యారు. కుటుంబాన్ని పోషించే వ్యక్తులే చనిపోవడంతో తమకు దిక్కెవరంటూ విలపించారు. చనిపోయిన కుటుంబాలకు న్యాయం చేయాలంటూ బంధువులు ఆందోళన చేయడంతో ఫ్యాక్టరీ యజమాని తన వంతు సాయం అందిస్తానని చెప్పడంతో మృతదేహాలను పోస్టుమార్టానికి స్థానిక ఏరియా వైద్యశాలకు తరలించారు. విషయం తెలిసిన వెంటనే సమీపంలో ఉన్న పలకల ఫ్యాక్టరీల్లో పనిచేస్తున్న కార్మికులందరూ సంఘటన స్థలానికి చేరుకున్నారు. మృతుడి కుటుంబాలకు న్యాయం చేయాలంటూ సంఘీభావం ప్రకటించారు. -
కురిస్తే కష్టమే..!
మార్కాపురం : సాధారణంగా వర్షం కోసం రైతులు పూజలు చేస్తుంటారు. కానీ, ప్రస్తుతం వర్షం పడితే తమకు నష్టం వస్తుందని ఆందోళన చెందుతున్నారు. మార్కాపురం, తర్లుపాడు, పెద్దారవీడు, పెద్దదోర్నాల, కంభం, అర్ధవీడు, బేస్తవారిపేట, యర్రగొండపాలెం, పుల్లలచెరువు తదితర మండలాల్లో సుమారు 18 వేల ఎకరాల్లో రైతులు మిర్చి సాగుచేశారు. గ్రేడింగ్ కోసం పొలాల్లోనే మిర్చిని ఆరబోశారు. కూలీలు దొరక్క కొంత మంది రైతులు పత్తిని కూడా పొలంలోనే వదిలేశారు. మరి కొంత మంది మిరపకాయలు కోసి అమ్మేందుకు సిద్ధంగా పొలాల్లోనే ఉంచారు. ఈ నేపథ్యంలో రెండు రోజుల నుంచి ఆకాశం మేఘావృతమై చిరుజల్లులు పడుతుండటంతో మిర్చి రైతులు ఆందోళన చెందుతున్నారు. మంగళవారం సాయంత్రం మార్కాపురం ప్రాంతంలో వర్షం కురిసింది. రెండు రోజుల నుంచి సాయంత్రం వేళల్లో ఆకాశమంతా మేఘావృతమై ఉంటోంది. దీంతో వర్షం కురుస్తుందనే ఆందోళన రైతుల్లో ఏర్పడింది. మండలంలోని వేములకోట, కొట్టాలపల్లె, నికరంపల్లె, చింతగుంట్ల, తిప్పాయపాలెం, మిట్టమీదపల్లె, కొండేపల్లి, గజ్జలకొండ, రాయవరం, మొద్దులపల్లి, యాచవరం, తర్లుపాడు మండలంలోని సీతానాగులవరం, మీర్జపేట, తాడివారిపల్లె, నాగెళ్లముడుపు, కలుజువ్వలపాడు, పెద్దారవీడు మండలంలోని పెద్దారవీడు, దేవరాజుగట్టు, తోకపల్లె, బద్వీడు చెర్లోపల్లె, పుచ్చకాయలపల్లె, తదితర గ్రామాల్లో పొలాల్లోనే మిర్చి పంట ఉంది. క్వింటా ధర మార్కెట్లో రూ.5,500 నుంచి రూ.6,500 మధ్య ఉంది. కూలీలు దొరక్క కొంత మంది రైతులు పొలాల్లోనే మిర్చి పంట ఉంచా రు. వర్షం పడితే కల్లాల్లో ఆరబోసిన మిర్చికి తీవ్ర నష్టం కలుగుతుంది. బాగా ఎండిన తరువాత గిట్టుబాటు ధర ఉంటే అమ్మాలని కొంత మంది రైతులు భావిస్తున్నారు. పత్తి కూడా సుమారు వెయ్యి హెక్టార్లలో సాగుచేశారు. వర్షం పడితే పత్తి పంట తడిసి నాణ్యత తగ్గే ప్రమాదం ఉంటుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తరఫున మిర్చి కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని, కోల్డ్‌స్టోరేజీ సౌకర్యాన్ని కల్పించాలని రైతులు కోరుతున్నారు. మొక్కజొన్న పంటను కూడా సుమారు 500 హెక్టార్లలో సాగు చేశారు. క్వింటాను సుమారు 10 వేల రూపాయల వరకు కొనుగోలు చేస్తున్నారు. మండలంలోని కొట్టాలపల్లె, వేములపేట, వేములకోట గ్రామాల్లో రైతులు అధికంగా మొక్కజొన్న సాగుచేసి అమ్మకానికి సిద్ధంగా ఉంచారు. ఈ నేపథ్యంలో మేఘాలు కమ్ముకుంటుండటంతో వారంతా ఆందోళన చెందుతున్నారు. ఎప్పుడూ వర్షాలు కురవాలని కోరుకునే రైతులు.. ఇప్పుడు మాత్రం కురిస్తే కష్టమే అనుకుంటూ బిక్కుబిక్కుమంటున్నారు. -
అమృతం..విషం
► అంగన్వాడీ కేంద్రాలకు విషతుల్యమైన పాలు ► అవి తాగి అస్వస్థతకు గురవుతున్న గర్భిణులు మార్కాపురం: అన్న అమృతహస్తం పథకంలో భాగంగా గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారం పంపిణీలో అందిస్తున్న పాలు పాడైపోవటంతో తల్లులు ఆందోళన చెందుతున్నారు. మార్కాపురం రూరల్, యర్రగొండపాలెం, తర్లుపాడు, బేస్తవారిపేట, గిద్దలూరు ప్రాజెక్టుల పరిధిలో అన్న అమృతహస్తం పథకం అమలవుతోంది. ప్రతి రోజు 200 మిల్లీలీటర్ల పాలను అందజేస్తారు. 25 రోజులకు సరిపడేలా గర్భిణులు, బాలింతలకు మూడు కిలోల బియ్యం, అర కిలో కందిపప్పు, 450 గ్రాముల నూనె, 4 కోడిగుడ్లు ప్రతి రోజు 200 మిల్లీలీటర్ల పాలను అంగన్వాడీ కార్యకర్తలు అందజేస్తారు. వీటిలో పాలను టెట్రా ప్యాకెట్లలో నింపి కేంద్రాలకు సరఫరా చేస్తారు. ఈ పాలను వివిధ డెయిరీలు సరఫరా చేస్తున్నాయి. అయితే, ఇటీవల సరఫరా చేసిన పాల ప్యాకెట్లలో కొన్ని పాడైపోవటంతో తల్లులు వాటిని ఉపయోగించుకోలేకపోతున్నారు. కొన్ని ప్యాకెట్ల నుంచి దుర్వాసన వస్తోంది. మార్కాపురం రూరల్ ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలో మార్కాపురం మండలంలో 71 కేంద్రాలు, దోర్నాలలో 77, పెద్దారవీడులో 77, తర్లుపాడు ప్రాజెక్టు పరిధిలోని కురిచేడులో 46, తర్లుపాడులో 51, దొనకొండలో 63, బేస్తవారిపేట ప్రాజెక్టు పరిధిలోని అర్ధవీడులో 60, బేస్తవారిపేటలో 82, కంభంలో 57 కేంద్రాలు, గిద్దలూరు ప్రాజెక్టు పరిధిలోని రాచర్లలో 48, గిద్దలూరులో 110, కొమరోలు 77, యర్రగొండపాలెం ప్రాజెక్టు పరిధిలోని పుల్లలచెరువులో 81, త్రిపురాంతకంలో 77, యర్రగొండపాలెంలో 90 కేంద్రాలు ఉన్నాయి. వీటిలో మార్కాపురం రూరల్ పరిధిలో సుమారు 2,600 మంది, తర్లుపాడు పరిధిలో 2,200, గిద్దలూరు పరిధిలో 2,700, బేస్తవారిపేట పరిధిలో 2 వేల మంది గర్భిణులు, బాలింతలు అన్న అమృతహస్తం పథకంలో ఉన్నారు. ఇటీవల పంపిణీ చేసిన పాలలో మార్కాపురం రూరల్ ప్రాజెక్టు పరిధిలో 120, తర్లుపాడు పరిధిలో 317, గిద్దలూరు పరిధిలో 612, బేస్తవారిపేట పరిధిలో 200, యర్రగొండపాలెం ప్రాజెక్టు పరిధిలో 423ప్యాకెట్లు పాడైపోయినట్లు శనివారం సాయంత్రానికి అధికారులు గుర్తించి తమ ఉన్నతాధికారులకు నివేదిక పం పారు. టెట్రా ప్యాకెట్లు తయారై వచ్చేటప్పుడు వాటిపై ఒత్తిడి ఉన్నా, చిన్న రంధ్రం పడినా బ్యాక్టీరియా చేరి దుర్వాసన వస్తాయని ఐసీడీఎస్ అధికారులు అంటున్నా రు. కేంద్రాలకు సరఫరా చేసిన ప్యాకెట్లు సక్రమంగా నిల్వ చేయకపోయినా పాడైపోయే అవకాశం ఉంది. ఇలాంటి పాల ప్యాకెట్లు చూడకుండా తాగితే వాంతులు, విరేచనాలవుతాయి. ప్రధానంగా గర్భిణులు తీవ్ర అనారోగ్యానికి గుర య్యే అవకాశం ఉంది. తర్లుపాడు మండలం తాడివారిపల్లె అంగన్వాడీ కేంద్రానికి వచ్చిన ప్యాకెట్లలో పాలు చెడిపోయాయి. వాటిని చూసుకోకుండా సిబ్బంది గర్భిణులకు ఇవ్వడంతో శుక్రవారం వారు వాంతులు చేసుకుని అస్వస్థతకు గురయ్యారు. ఈ పాలను మూడు నెలలుగా వివిధ డెయిరీల నుంచి అధికారులు సేకరించి అం గన్వాడీ కేంద్రాలకు పంపుతున్నారు. సరఫరా చేసే పాల ప్యాకెట్లను అధికారులు పరిశీలించకపోవటంతో నాణ్యత ప్రమాణాలపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. పాడైపోయిన పాలు వాడవద్దని చెప్పాం – విశాలాక్షి, ప్రాజెక్టు డైరెక్టర్, ఐసీడీఎస్, ఒంగోలు పాడైపోయిన పాలప్యాకెట్లు వాడవద్దని అంగన్వాడీ కార్యకర్తలకు, అధికారులకు ఆదేశాలు ఇచ్చాం. సుమారు 1600 పాలప్యాకెట్లు పాడైపోయినట్లు గుర్తించాం. పాలప్యాకెట్లపై తీవ్రమైన ఒత్తిడి పడటంతో పాడైపోయినట్లు గుర్తించాం. శనివారం గిద్దలూరులో ఈ అంశంపై సమీక్ష సమావేశం నిర్వహించాం. డెయిరీ అధికారులు హాజరై కార్యకర్తల సందేహాలు తీర్చారు. గత నెల రూ.1.16 లక్షల పాల ప్యాకెట్లను కేంద్రాలకు పంపిణీ చేశాం. అవి బాగానే ఉన్నాయి. భవిష్యత్‌లో ఇలాంటివి జరగకుండా చూస్తాం. ప్రతి రోజు పాల ప్యాకెట్ల పంపిణీపై నిశితంగా పరిశీలించాలని ఆదేశించాం. -
నగదు రహిత లావాదేవీలు నిర్వహించాలి
మార్కాపురం: పీఓఎస్ యంత్రాలు ఏర్పాటు చేసుకుని ప్రతి ఒక్కరూ నగదు రహిత లావాదేవీలు నిర్వహించాలని మున్సిపల్ కమిషనర్ ఫజులుల్లా సూచించారు. పురపాలక సంఘం కార్యాలయంలో శనివారం హోల్‌సేల్, రిటైల్ వ్యాపారులు, ట్రేడ్ లైసెన్స్‌దారులు, వర్తక సంఘాల సమాఖ్య, మెప్మా సిబ్బందికి నగదు రహిత లావాదేవీలపై అవగాహన కల్పించారు. ఆయన మాట్లాడుతూ పాయింట్ ఆఫ్ సేల్ యంత్రాలను ఏర్పాటు చేసుకోవటం వలన కలిగే ఉపయోగాలు వివరించారు. పేటీఎం సిబ్బందిచే యంత్రాలు ఉపయోగించే విధానంపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఆర్ఐ డానియేల్ జోసఫ్, ఇన్చార్జ్ శానిటరీ ఇన్స్పెక్టర్ నాయబ్ రసూల్, పాల్గొన్నారు. నగదు రహిత లావాదేవీలపై అవగాహన మండలంలోని చింతగుంట్ల గ్రామంలో శనివారం నాబార్డు ఆర్ధిక అక్షరాస్యత కేంద్రం కౌన్సిలర్ పూర్ణచంద్రరావు ఆధ్వర్యంలో నగదు రహిత లావాదేవీలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రజలు బ్యాంక్‌లు, ఏటీఎంల చుట్టూ తిరగకుండా మొబైల్ ఫోన్‌తో లావాదేవీలు నిర్వహించుకోవచ్చన్నారు. మొబైల్ వ్యాలెట్ గురించి ప్రొజెక్టర్ ద్వారా వివరించారు. కార్యక్రమంలో పీడీసీసీ బ్యాంక్ సిబ్బంది కాశయ్య ఉన్నారు. -
ఆటల పోటీల్లో విద్యార్థుల ప్రతిభ
కలుజువ్వలపాడు (తర్లుపాడు): ఈ నెల 1న మార్కాపురం బాలుర ఉన్నత పాఠశాలలో జరిగిన ఖేల్ ఇండియా పోటీల్లో మండలంలోని కలుజువ్వలపాడు జెడ్పీ పాఠశాలకు చెందిన విద్యార్థులు ప్రతిభ చూపి జిల్లా స్థారుుకి ఎంపికయ్యారు. అండర్- 17 వంద మీటర్ల విభాగంలో ఎస్కే బాజి ప్రథమ స్థానం, ద్వితీయ స్థానం మంగమ్మ, 400 మీటర్లు విభాగంలో ఎం.శాంతి ప్రథమస్థానం, లాంగ్ జంప్‌లో డి.హిమబిందు ప్రథమ స్థానం, అండర్ 14లో టి.వెలుగొండరెడ్డి లాంగ్ జంప్‌లో ద్వితీయ స్థానం గెలుపొందారు. జిల్లా స్థారుు కబడ్డీ జట్టుకు యు.వెంకటేశ్వర్లు, ఎ.శివారెడ్డి, టి.వెలుగొండారెడ్డి, టి.మంగమ్మ, ఎం.శాంతిలు ఎంపికై నట్లు ఎంఈఓ సీఎస్ మల్లికార్జున్ తెలిపారు. గెలుపొందిన విద్యార్థులను పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, గ్రామస్తులు అభినందించారు. ఏపీ మోడల్ స్కూల్ విద్యార్థులు జిల్లా స్థారుుకి ఎంపిక మార్కాపురం రూరల్: మండలంలోని మిట్టమీదిపల్లి ఏపీ మోడల్ స్కూల్ విద్యార్థులు వివిధ ఆటల పోటీల్లో జిల్లా స్థారుుకి ఎంపికై నట్లు ప్రిన్సిపాల్ సరళ శుక్రవారం తెలిపారు. మార్కాపురంలోని జిల్లా పరిషత్ బాలుర పాఠశాలలో జరుగుతున్న డివిజన్ స్థారుులో ఖేలో ఆటల పోటీల్లో అండర్-14 లో కబడ్డీలో ఎం.మోనిక, 100 మీటర్స్ రన్నింగ్సలో మల్లేశ్వరి, 400 మీటర్స్ రన్నింగ్సలో స్వప్న, లాంగ్ జంప్‌లో సౌమ్య, ఖోఖోలో పాలీశ్వరరెడ్డి ఎంపికై నట్లు వారు తెలిపారు. అండర్ - 17 వాలీబాల్, షాట్‌పుట్‌లో శ్రీను జిల్లా స్థారుులో ఎంపికై ందన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తమ విద్యార్థులు అన్నీ పోటీల్లో ఉత్సాహంగా పాల్గొని గెలుపొందటం ఆనందంగా ఉందన్నారు. బహుమతులు గెలుపొందిన విద్యార్థులకు అభినందనలు తెలిపారు. -
ప్రభుత్వ ఆఫీసు నుంచి ఎగిరొచ్చిన నోట్ల కట్టలు
మార్కాపురం (ప్రకాశం జిల్లా) : మార్కాపురం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం నుంచి సోమవారం సాయంత్రం నోట్ల కట్టలు బయటకు ఎగిరిపడ్డాయి. తనిఖీలకు వచ్చిన ఏసీబీ బృందాన్ని చూసి కార్యాలయం లోపల ఉన్న సిబ్బంది నోట్ల కట్టలను కిటికీల్లోనుంచి బయటకు విసిరేశారు. అయితే గమనించిన ఏసీబీ అధికారులు వాటిని స్వాధీనం చేసుకున్నారు. కార్యాలయాన్ని, దస్తావేజు లేఖరుల కార్యాలయాలను తమ స్వాధీనంలోకి తీసుకుని సోదాలు చేపట్టారు. కిటికీల్లోనుంచి బయటకు వచ్చిన నగదు లక్ష వరకు ఉన్నట్టు అధికారులు గుర్తించారు. -
కందకాలపై అవగాహన సదస్సులు
మార్కాపురం: ‘సాక్షి’ దినపత్రిక, ‘సాక్షి’ టీవీ, ఏపీ-తెలంగాణ ఇంజినీర్ల సంఘం ఆధ్వర్యంలో కందకాలతో నీటి సంరక్షణపై రైతు అవగాహన సదస్సులు మంగళవారం నిర్వహించనున్నారు. గిద్దలూరు నియోజకవర్గంలోని రాచర్ల మండలంలో అనుములవీడు గ్రామంలోని కల్యాణ మండపంలో ఉదయం 9 గంటలకు, మార్కాపురం ప్రెస్‌క్లబ్‌లో సాయంత్రం 4 గంటలకు అవగాహన సదస్సులు జరుగుతాయి. ఈ సదస్సుల్లో ‘సాక్షి’ సాగుబడి డెస్క్ ఇన్చార్జి పి.రాంబాబు, ఇంజినీర్ల సంఘం కార్యదర్శులు, విశ్రాంత చీఫ్ ఇంజినీర్లు, డ్వామా, వ్యవసాయశాఖ అధికారులు పాల్గొని రైతులకు నీటి సంరక్షణ చర్యలపై అవగాహన కల్పిస్తారు. ఈ సదస్సులకు రైతులందరూ ఆహ్వానితులేనని నిర్వాహకులు తెలిపారు. -
యువకుడి ఆత్మహత్య
మార్కాపురం: రైలు కిందపడి ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన ప్రకాశం జిల్లా మార్కాపురం మండల కేంద్రంలో సోమవారం చోటు చేసుకుంది. స్థానిక పీఎస్ కాలనీకి చెందిన కె. పవన్(18) స్థానిక జ్యూస్ సెంటర్లో పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ ఈ రోజు మార్కాపురం రైల్వే స్టేషన్ సమీపంలో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
ఆటో ఢీకొని మహిళ మృతి
మార్కాపురం: రోడ్డు పక్కన నడిచి వెళ్తున్న మహిళను ఆటో ఢీకొట్టటంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలొదిలింది. ప్రకాశం జిల్లా మార్కాపురంలో శనివారం మధ్యాహ్నం ఈ ఘటన చోటు చేసుకుంది. పట్టణంలోని ఎస్బీసీ కాలనీకి చెందిన దర్శనం విశ్రాంతమ్మ(45) రోడ్డు పక్కన నడిచి వెళ్తుండగా ఎదురుగా వచ్చిన ఆటో ఢీకొట్టింది. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. పోలీసులు మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించి, కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
తల్లి మందలించిందని విద్యార్థిని ఆత్మహత్య
మార్కాపురం: చదువుకోమంటూ తల్లి మందలించటంతో మనస్తాపానికి గురైన ఓ విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడింది. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలో శుక్రవారం ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానిక పదో వార్డుకు చెందిన ఉత్తరాది సౌభాగ్యవతి ఇంజినీరింగ్ ఫస్టియర్ చదువుతోంది. టైం వేస్ట్ చేయవద్దని, చదువుకోవాలని గురువారం రాత్రి ఆమెను తల్లి మందలించింది. దీంతో మనస్తాపానికి గురైన సౌభాగ్యవతి ఇంట్లో అందరూ నిద్రపోతున్న సమయంలో అర్థరాత్రి ఇంటి పైనుంచి కిందికి దూకింది. తీవ్ర గాయాలపాలైన ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం కన్నుమూసింది. -
భార్యను చంపిన భర్తకు జీవిత ఖైదు
మార్కాపురం (ప్రకాశం) : మద్యం మత్తులో భార్యను గొంతు నులిమి హత్య చేసిన భర్తకు యావజ్జీవ ఖైదు విధిస్తూ న్యాయస్థానం తీర్పునిచ్చింది. ప్రకాశం జిల్లా పుల్లల చెరువు మండలం ముమ్మడివరం గ్రామానికి చెందిన ఇజ్రాయిల్, సువార్త(24) దంపతులు కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తుండేవారు. ఈ క్రమంలో మద్యానికి బానిసైన ఇజ్రాయిల్ 2011 నవంబర్ 16న పూటుగా తాగి ఇంటికి వచ్చి భార్యతో గొడవపడి విపరీతంగా కొట్టాడు. అతని నుంచి విడిపించుకోవడానికి ఆమె ప్రయత్నించడంతో.. గొంతు నులిమి చంపేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని న్యాయస్థానంలో హాజరుపరచగా పూర్తి విచారణ అనంతరం నేరం నిరూపించబడటంతో సోమవారం జిల్లా ఆరో అదనపు న్యాయమూర్తి జీవిత ఖైదు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. -
రిటైర్డ్ ఎస్సై ఇంట్లో చోరీ
మార్కాపురం: రిటైర్డ్ ఇంట్లో దొంగలు పడి విలువైన ఆభరణాలను ఎత్తుకెళ్లారు. ఈ సంఘటన ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలో శుక్రవారం రాత్రి వెలుగులోకి వచ్చింది. స్థానిక పవర్ ఆఫీస్ వెనుక భాగంలో నివాసముంటున్న రిటైర్డ్ ఎస్సై షేక్ అజ్మల్ భార్యకు అనారోగ్యంగా ఉండటంతో ఇంటికి తాళం వేసి చికిత్స నిమిత్తం హైదరాబాద్ కు వెళ్లారు. ఇది గుర్తించిన దొంగలు తాళం పగలగొట్టి ఇంట్లో ఉన్న రూ. 3 లక్షలు విలువచేసే బంగారు ఆభరణాలతో పాటు రూ. 15 వేల నగదును ఎత్తుకెళ్లారు. శనివారం రాత్రి ఇంటికి వచ్చిన బంధువులు ఇది గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
రూ.80 లక్షల విలువైన బర్రెలతో పరార్
ఒంగోలు: పెద్ద వ్యాపారినని పోజు కొట్టాడు. రైతులను నమ్మించి బర్రెలను కొనుగోలు చేశాడు. నాలుగు రోజుల్లో డబ్బులు ఇచ్చేస్తానని చెప్పి.. రూ. 80 లక్షలు విలువ చేసే 80 బర్రెలతో పరారయ్యాడు. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలో చోటుచేసుకున్న ఈ సంఘటన వివరాల్లోకి వెళితే.. పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరుకు చెందిన సోమశేఖర్ గత నెల రోజుల నుంచి మార్కాపురం పట్టణంలోని విద్యా నగర్ లో ఓ ఇంట్లో అద్దెకుంటున్నాడు. పశువుల వ్యాపారం చేస్తుంటానని స్థానిక రైతులతో నమ్మబలికాడు. ఈ క్రమంలోనే 20 మంది రైతులకు చెందిన 80 బర్రెలను కొనుగోలు చేసేందుకు సంప్రదింపులు జరిపాడు. సెప్టెంబర్ 10న డబ్బులు ఇస్తానని చెప్పి పశువులను స్వాధీనం చేసుకున్నాడు. ఉన్నట్టుండి గత గురువారం బర్రెలతో సహా కనిపించకుండా పోయాడు. విషయుం తెలుసుకున్నబాధితులు శనివారంపోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. రా్యదు చేశారు. దీనిపైపోలీసులు కేసు నవెూదు చేసిదరా్యపు్త్రపారంభించారు. 80 బర్రెలవిలువ సుమారు రూ. 80 లక్షలు ఉంటుందని అంచనా. -
నాలుగు కాళ్లతో శిశువు జననం
మార్కాపురం టౌన్: ప్రకాశం జిల్లా మార్కాపురంలో నాలుగు కాళ్ల మగశిశువు జన్మించాడు. పట్టణానికి చెందిన శిరీషకు శనివారం స్థానిక చైత్ర నర్సింగ్ హోంలో కాన్పు చేశారు. ఆమెకు నాలుగు కాళ్లతో మలద్వారం మూసుకుపోయిన శిశువు జన్మించాడు. ఇది అరుదైనదని, 35 వేలమందిలో ఒకరికి ఇలా జరుగుతుందని చిన్నపిల్లల వైద్యుడు డాక్టర్ రవీంద్రారెడ్డి తెలిపారు. దీన్ని సాక్రోకాక్సిజియల్ కెరటోమ్ అంటారన్నారు. శస్త్రచికిత్స ద్వారా మలద్వారాన్ని పునరుద్ధరించవచ్చని చెప్పారు. మెరుగైన వైద్యం కోసం శిశువును గుంటూరు వైద్యశాలకు తీసుకెళ్లారు. -
పారేసిన సిగరెట్.. ఇంటిని కాల్చేసింది...
మార్కాపురం : సిగరెట్ తాగిన ఓ వ్యక్తి దానిని ఆర్పేయకుండా నిర్లక్ష్యంగా పక్కన పడేయటంతో మంటలు వ్యాపించి ఇంటికి అంటుకున్నాయి. వివరాల్లోకి వెళ్తే... ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం రాయవరం గ్రామానికి చెందిన పెదచెంచయ్య ఇంట్లో కూర్చుని సిగరెట్ తాగాడు. అనంతరం దానిని ఆర్పి పడేయకుండా నిర్లక్ష్యంగా పక్కనే ఉన్న చెత్తలో పడేశాడు. అది రాజుకుని ఇంటికి అంటుకుంది. కుటుంబ సభ్యులు గమనించి అప్రమత్తమయ్యేలోగా మంటలు వ్యాపించాయి. ఇంటితోపాటు సామాను కూడా తగలబడింది. కాగా ఆస్తినష్టం వివరాలు తెలియాల్సి ఉంది. -
కారు బోల్తా: ఇద్దరి మృతి
ఒంగోలు : ప్రకాశం జిల్లా మార్కాపురంలో ఓ కారు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో ఇద్దరు మృతిచెందగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వివరాలు...సోమవారం వేకువ జామున మార్కాపురం తిట్టాయిగూడెం గ్రామంలో వేగంగా వెళుతున్న కారు అదుపు తప్పి బోల్తా కొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్ర గాయలపాలయ్యారు. క్షతగాత్రుల గుంటూరులోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. స్థానికుల సమాచారం మేరకు సంఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. మృతదేహాలను పోస్టు మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. (మార్కాపురం) -
‘వెలిగొండ’కు రూ.2 వేల కోట్లు కేటాయించాలి
మార్కాపురం :త్వరలో అసెంబ్లీలో ప్రవేశపెట్టబోయే బడ్జెట్లో వెలిగొండ ప్రాజెక్టుకు 2 వేల కోట్ల రూపాయలు కేటాయించి తన రాజకీయ, పరిపాలన చిత్తశుద్ధిని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నిరూపించుకోవాలని సీపీఎం కేంద్ర కార్యదర్శివర్గ సభ్యుడు వి.శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. స్థానిక ప్రెస్‌క్లబ్‌లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. శాసనసభ గత సమావేశాల్లో వెలిగొండ మొదటిదశను వచ్చే ఏప్రిల్ నాటికి పూర్తిచేసి నీరందిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారన్నారు. కానీ, శనివారం తాము ప్రాజెక్టును సందర్శించగా, ఒక టన్నెల్ 7 కి.మీ, మరో టన్నెల్ 12 కి.మీ మాత్రమే పూర్తయిందని చెప్పారు. రెండు టన్నెల్స్ పూర్తి కావాలంటే మరో రెండేళ్లు పడుతుందని అక్కడి సిబ్బంది తెలిపారన్నారు. టన్నెల్ కాంట్రాక్టర్లే రాష్ట్ర క్యాబినెట్లో మంత్రులుగా ఉన్నారని, వారి ప్రయోజనాల కోసం టెండర్లు పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నారని శ్రీనివాసరావు ఆరోపించారు. రాష్ట్ర విభజన సమయంలో ఏపీకి ప్రత్యేక హోదా కల్పించే బిల్లుకు మద్దతు తెలిపిన చంద్రబాబు, నరేంద్రమోదీ, వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ఈ అంశంపై మాట్లాడకపోవడం శోచనీయమన్నారు. విభజనతో రాష్ట్రం తీవ్రంగా నష్టపోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఫిబ్రవరిలో ఉద్యమం... వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణంలో ప్రభుత్వం అనుసరిస్తున్న నిర్లక్ష్య ధోరణికి నిరసనగా 15 మండలాల రైతులతో ఫిబ్రవరిలో జిల్లా వ్యాప్తంగా సీపీఎం ఆధ్వర్యంలో ఉద్యమం చేపట్టనున్నట్లు జిల్లా కార్యదర్శి పూనాటి ఆంజనేయులు తెలిపారు. విలేకరుల సమావేశంలో సీపీఎం మార్కాపురం డివిజన్ కార్యదర్శి సోమయ్య, జిల్లా నాయకులు జాలా అంజయ్య, కనిగిరి కార్యదర్శి అనిల్, సీపీఎం పట్టణ, మండల కార్యదర్శులు బాలనాగయ్య, రఫి, రైతు సంఘ డివిజన్ కార్యదర్శి గాలి వెంకట్రామిరెడ్డి, డిజైన్ స్లేట్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు రూబెన్ పాల్గొన్నారు. -
ఎస్సీ వర్గీకరణకు మరో ఉద్యమం
మార్కాపురం: ఏబీసీడీ వర్గీకరణ కోసం మరో ఉద్యమానికి సిద్ధంగా ఉండాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందా కృష్ణమాదిగ పిలుపునిచ్చారు. స్థానిక పాత ప్రభుత్వ వైద్యశాల ఆవరణలో గురువారం రాత్రి నిర్వహించిన మార్కాపురం డివిజన్ ఎమ్మార్పీఎస్ కార్యకర్తల సమావేశానికి వీ జాని అధ్యక్షత వహించగా..ముఖ్య అతిథిగా కృష్ణమాదిగ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో తాము గెలిస్తే ఏబీసీడీ వర్గీకరణ కోసం కృషి చేస్తామని హామీలు ఇచ్చిన తెలంగాణలో టీఆర్ఎస్, ఆంధ్రాలో టీడీపీ, కేంద్రంలో బీజేపీలకు తాము ఆర్నెల్ల గడువు ఇచ్చామని.. వచ్చే నెల 8వ తేదీతో గడువు ముగుస్తుందన్నారు. అప్పట్లోపు రెండు రాష్ర్ట ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం స్పందించకపోతే డిసెంబరు 14, 15 తేదీల్లో పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో జరిగే ఎమ్మార్పీస్ రాష్ట్ర సదస్సులో ఉద్యమ కార్యాచరణ ప్రకటించి రెండు రాష్ట్రాల్లో ఏక కాలంలో ఉద్యమాన్ని చేపడతామని కృష్ణ మాదిగ ప్రకటించారు. తనపై కొందరు ఉద్యమ సోదరులు చేస్తున్న ప్రచారాన్ని ఆయన ఖండించారు. తన జీవిత లక్ష్యం ఏబీసీడీ వర్గీకరణే అన్నారు. అతిథులుగా హాజరైన యర్రగొండపాలెం, సంతనూతలపాడు ఎమ్మెల్యేలు డేవిడ్‌రాజు, ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ కృష్ణ మాదిగ చేపట్టబోయే ఉద్యమానికి తాము సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నామని అన్నారు. ఉద్యమాలు చీల్చేందుకు పలువురు కుట్రలు పన్నుతున్నారని వారు విమర్శించారు. మాదిగల ఆత్మ గౌరవానికి గుర్తింపు తెచ్చిన ఘనత కృష్ణ మాదిగకే దక్కుతుందని చెప్పారు. గతంలో వర్గీకరణకు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి కృషి చేశారని వారు గుర్తు చేశారు. సమావేశంలో రాష్ట్ర కార్యదర్శులు ఉసురుపాటి బ్రహ్మయ్య, పందిటి కాశీరావు, బలుసుపాటి గాలెయ్య, షాలెం, నర్శింహ, నగేశ్, విజయకుమార్, ఫ్రాంక్లీన్, దోర్నాల, పుల్లలచెరువు ఎంపీపీలు ప్రభాకర్, సుందరరావు, బీజేపీ నేత కృష్ణారావు పాల్గొని మాట్లాడారు. -
పత్తి కొనుగోలులో జాప్యంపై రైతుల ఆగ్రహం
మార్కాపురం : స్థానిక మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రంలో పత్తి కొనకుండా జాప్యం చేయడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తేమ సాకు చూపి పత్తిని ఇష్టమొచ్చిన ధరకు అడగడాన్ని రైతులు తప్పుబట్టారు. మార్కాపురం డివిజన్లోని 12 మండలాలకు చెందిన రైతులు తాము పండించిన పత్తిని మార్కెట్ యార్డులోని సీసీఐ కొనుగోలు కేంద్రానికి తెస్తున్నారు. మూడు రోజులుగా వ్యాపారులకు, రైతులకు మధ్య గిట్టుబాటు ధర, పత్తిలో నాణ్యత తేల్చే విషయంపై అవగాహన కుదరకపోవడంతో కొనుగోళ్లు మంద కొడిగా సాగుతున్నాయి. మార్కెట్ యార్డులో సుమారు 10 లారీల పత్తి నిల్వ ఉంది. మార్కాపురం మండలం గొట్టిపడియ, అక్కచెరువు తండా, రాచర్ల, కొమరోలు, పుల్లలచెరువు మండలాలకు చెందిన పలువురు రైతులు తెచ్చిన పత్తిని వ్యాపారులు కొనుగోలు చేయకపోవడంతో మూడు రోజులుగా మార్కెట్ యార్డులోనే ఉంటున్నారు. వ్యాపారులు కావాలనే.. పత్తి నాణ్యత తగ్గిందని, తాము తెచ్చిన బొరెలపై ఇంటు(ఁ) మార్కు వేస్తున్నారని, దీనిని కొనుగోలు చేయాలంటే బొరేనికి(బోరెలో 90 నుంచి 100 కిలోల పత్తి ఉంటుంది) 5 నుంచి 7 కిలోలు తరుగు తీసేస్తున్నారని రైతులు ఆవేదన చెందుతున్నారు. పత్తి సాగు చేసేందుకు ఎకరాకు రూ.60 వేలు పెట్టుబడి పెట్టాం. కూలీలతోపాటు రవాణా ఖర్చులు అదనంగా ఉన్నాయి. వ్యాపారులేమో నాణ్యత తక్కువ అంటూ ప్రభుత్వం నిర్ణయించిన ధర ఇవ్వకుండా మోసం చేస్తున్నారని గొట్టిపడియ గ్రామానికి చెందిన రైతు మారెళ్ల వెంకటేశ్వర్లు చెప్పారు. ప్రస్తుతం వ్యాపారులు క్వింటా పత్తిని రూ.3,800-రూ.3,900 మధ్య కొంటున్నారు. ప్రభుత్వం మాత్రం రూ.4,050 మద్ధతు ధర ప్రకటించింది. -
‘సాక్షి’ స్పెల్‌బీకి విశేష స్పందన
మార్కాపురం : ‘సాక్షి’ స్పెల్‌బీ కార్యక్రమానికి మార్కాపురం డివిజన్లో విశేష స్పందన లభిస్తోంది. నిత్య జీవితంలో తరచూ వాడే పదాలు, ఇంగ్లిషు స్పెల్లింగ్, అర్థాలు, అవగాహన, వీలైనన్ని ఎక్కువ పదాలు నేర్చుకోవడం, భాషపై పట్టు సాధించాలనే లక్ష్యంతో సాక్షి స్పెల్‌బీ చేపట్టిన కార్యక్రమానికి డివిజన్ కేంద్రమైన మార్కాపురం పట్టణంలో వివిధ పాఠశాలల నుంచి విశేష స్పందన కనిపిస్తోంది. ఇంగ్లిషు భాషపై ఒకటో తరగతి నుంచే పట్టుసాధించేందుకు స్పెల్‌బీ ఉపయోగపడుతుందని పలువురు విద్యార్థులు, వివిధ పాఠశాలల కరస్పాండెంట్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇంగ్లిషుపై పట్టుసాధిస్తే ప్రపంచంలో ఏ దేశంలోనైనా రాణించవచ్చనే నమ్మకం ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో చదువుతున్న విద్యార్థులకు ఇంగ్లిషు భాషపై, నిత్యం వాడుతున్న పదాలపై పట్టుసాధించేందుకు సాక్షి స్పెల్‌బీ పుస్తకం ఉపయోగపడుతుంది. దీనికి సంబంధించి 5 విభాగాలుగా విభజించి అక్టోబర్ 15న మొదటి దశ పరీక్ష, నవంబర్ 9న రెండో దశ, నవంబర్ 23న మూడో దశ, డిసెంబర్ 5న చివరి దశ పరీక్ష నిర్వహిస్తారు. మొదటి విభాగంలో 1, 2 తరగతులు, రెండో విభాగంలో 3, 4 తరగతులు, మూడో విభాగంలో 5, 6, 7 తరగతులు, నాలుగో విభాగంలో 8, 9, 10 తరగతులు చదువుతున్న విద్యార్థులు స్పెల్‌బీ పరీక్షకు సిద్ధం కావాల్సి ఉంటుంది. పట్టణంలోని ఓం సాయివికాస్ విద్యానికేతన్, విశ్వశాంతి పబ్లిక్ స్కూల్, కమలా కాన్సెప్ట్ స్కూల్, సాయిచైతన్య స్కూల్, తదితర పాఠశాలల విద్యార్థులు స్పెల్ బీ కార్యక్రమానికి సిద్ధమవుతున్నారు. -
స్మార్ట్, మెగాసిటీల నిర్మాణంలో ఇంజినీర్లదే కీలక బాధ్యత
మార్కాపురం: నవ్యాంధ్రప్రదేశ్‌లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాటు చేయబోయే 14 స్మార్ట్, 3 మెగా సిటీల నిర్మాణంలో ఇంజినీర్లదే కీలకబాధ్యత అని, భవిష్యత్‌లో బీటెక్, ఎంటెక్ విద్యార్థులకు మంచి ఉద్యోగ అవకాశాలు ఉంటాయని సంతనూతలపాడు ఎమ్మెల్యే డాక్టర్ ఆదిమూలపు సురేష్ అన్నారు. భారతరత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతిని పురస్కరించుకుని జార్జి ఇంజినీరింగ్ కళాశాలలో సోమవారం ఇంజినీర్స్ డే నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాలలో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం కార్యక్రమంలో మాట్లాడుతూ రాష్ట్ర విభజన నేపథ్యంలో నష్టాలు మన రాష్ట్రానికే ఎక్కువ జరిగాయన్నారు. ఇంజినీర్‌గా రాణించాలంటే ఏకాగ్రత, పట్టుదల, లక్ష్యం ఉండాలన్నారు. ఇంజినీరింగ్ విద్యలో వస్తున్న అధునాతన మార్పుల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవాలని సూచించారు. వెలిగొండ ప్రాజెక్టు ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ రాఘవరెడ్డి మాట్లాడుతూ బీటెక్, ఎంటెక్ చదివిన విద్యార్థులు వీఆర్వో, వీఆర్ఏ, పంచాయతీ కార్యదర్శుల పోస్టులకు ఎందుకు వెళ్తున్నారో ఆలోచించాలని, స్థాయికి తగిన ఉద్యోగాన్ని ఎంచుకోవాలని సూచించారు. బీఎస్ఎన్ఎల్ డివిజనల్ ఇంజినీర్ శ్రీనివాసమూర్తి మాట్లాడుతూ కష్టపడేతత్వం, పరిశోధన, తపన ఉంటే ఇంజినీరింగ్ విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్ ఉంటుందన్నారు. ప్రిన్సిపల్ డాక్టర్ ఈశ్వరరావు, ప్రొఫెసర్లు మస్తానయ్య, మురళీకృష్ణ, సుబ్బారెడ్డి, సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు. ఈఈ రాఘవరెడ్డిని, డీఈ శ్రీనివాసమూర్తిని ఎమ్మెల్యే సురేష్ ఘనంగా సన్మానించారు. -
హైదరాబాద్‌ను పోగొట్టుకున్నాం
మార్కాపురం: స్వార్థ రాజకీయాలతో పాటు తన కుమారుడిని ప్రధానిగా చేయాలనుకున్న సోనియా గాంధీ దుర్బుద్ధివల్ల రాష్ట్రం విడిపోయిందని.. దీనివల్ల అంతా కలిసి అభివృద్ధి చేసుకున్నా హైదరాబాద్‌ను తెలంగాణకు ఇవ్వాల్సి వచ్చిందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి శిద్దా రాఘవరావు వ్యాఖ్యానించారు. మార్కాపురం జెడ్పీ బాలుర పాఠశాలలో 2014 జిల్లా స్థాయి ఇన్స్పైర్ అవార్డు ప్రాజెక్టుల ప్రదర్శన కార్యక్రమాన్ని ఆదివారం ప్రారంభించారు. జిల్లా విద్యాశాఖాధికారి విజయభాస్కర్ అధ్యక్షత వహించిన సభలో మంత్రి శిద్దా మాట్లాడుతూ విద్యార్థుల్లోని సృజనాత్మక శక్తిని వెలికితీస్తూ, సైన్స్ పట్ల ఆసక్తిని పెంపొందిస్తూ.. వారిని శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దేందుకు కేంద్ర ప్రభుత్వం 2010-11లో ఇన్స్పైర్ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టిందన్నారు. బడి పిలుస్తోంది..రారూ. కార్యక్రమం వల్ల బడి బయట ఉన్న వేలాది మంది పాఠశాలల్లో చే రారని తెలిపారు. యర్రగొండపాలెం, దోర్నాల బస్టాండ్ల నిర్మాణాన్ని పరిశీలిస్తున్నామని, మార్కాపురం-పొదిలి రోడ్డు డబుల్ రోడ్డుగా మార్చేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నామని తెలిపారు. జిల్లా పరిషత్ చైర్మన్ డాక్టర్ నూకసాని బాలాజీ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో బోధిస్తున్న ఉపాధ్యాయులు నాణ్యమైన విద్యను అందించాలని, తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రైవేటు పాఠశాలలకు ఎందుకు పంపిస్తున్నారో ప్రశ్నించుకోవాలని కోరారు. సెప్టెంబర్ 2న ఒంగోలులో జిల్లా పరిషత్ హెచ్ఎంలతో సమావేశం నిర్వహించనున్నామని.. జెడ్పీ పాఠశాలల్లో వంద శాతం మరుగుదొడ్ల నిర్మాణానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. దొనకొండ కేంద్రంగా రాజధాని ఏర్పాటు చేయాలి: ఎమ్మెల్యే జంకె పశ్చిమ ప్రకాశం భాగంలో ఉన్న దొనకొండ కేంద్రంగా రాజధాని ఏర్పాటు చేసేందుకు మంత్రి శిద్దా ప్రభుత్వంపై వత్తిడి తేవాలని దీనికి తాము సహకరిస్తామని మార్కాపురం ఎమ్మెల్యే జంకె వెంకటరెడ్డి కోరారు. ప్రభుత్వ కార్యాలయాల్లో ఖాళీ పోస్టులు, టీచర్ పోస్టులను భర్తీ చేయాలన్నారు. ఈ బడ్జెట్లో వెలిగొండకు రూ. 76.80 కోట్లు మాత్రమే కేటాయించారని, 2015 నాటికి వెయ్యి కోట్ల రూపాయలతో పనులు పూర్తి చేయాలని విజ్ఞప్తి చేశారు. జిల్లా అభివృద్ధిపై చిన్న చూపు: ఎమ్మెల్యే డేవిడ్‌రాజు ప్రకాశం జిల్లాకు ఒక్క జాతీయ స్థాయి సంస్థను కేటాయించకపోవటం దురదృష్టకరమని యర్రగొండపాలెం ఎమ్మెల్యే డేవిడ్‌రాజు ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రి శిద్దా ఈ విషయాన్ని కే బినెట్ సమావేశంలో ప్రస్తావించాలని కోరారు. రోడ్ల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. డీఈఓ విజయభాస్కర్ మాట్లాడుతూ జిల్లాకు 606 ఉపాధ్యాయ పోస్టులు మంజూరయ్యాయని చెప్పారు. సైన్స్ పట్ల ఆసక్తిని కనబరిచే విద్యార్థులకు ఇన్స్పైర్ ప్రాజెక్టు వరమన్నారు. ప్రతి విద్యార్థికి ప్రభుత్వం 5వేల రూపాయలను విడుదల చేసినట్లు చెప్పారు. కార్యక్రమంలో పీడీసీసీ బ్యాంక్ చైర్మన్ ఈదర మోహన్, మాజీ ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి, రాజీవ్ విద్యామిషన్ పీఓ పి.శ్రీనివాసరావు, మార్కాపురం, ఒంగోలు డిప్యూటీ డీఈఓలు కాశీశ్వరరావు, సాల్మన్, మున్సిపల్ చైర్మన్ వక్కలగడ్డ రాధిక, ఆర్డీఓ కొండయ్య, కమిషనర్ ఎ.శ్రీనివాసరావు, ఎంపీపీ ఎల్.మాలకొండయ్య, ఎంఈఓ సీహెచ్‌పీ వెంకటరెడ్డి, జిల్లా పరిషత్ విద్యాశాఖాధికారి వెంకట్రావు, జెడ్పీటీసీ సభ్యుడు రంగారెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ జక్కా ప్రకాశ్, బాలుర, బాలికోన్నత పాఠశాలల హెచ్ఎంలు వై.సత్యనారాయణరెడ్డి, శార్వాణి, ప్రధానోపాధ్యాయుల సంఘం డివిజన్ అధ్యక్షుడు సీఎస్ మల్లికార్జున్, వైఎస్ఆర్ సీపీ పట్టణ అధ్యక్షుడు బట్టగిరి తిరుపతిరెడ్డి, యూత్ అధ్యక్షుడు మందటి మహేశ్వరరెడ్డి, పంబి వెంకటరెడ్డి, గొట్టం వెంకటరెడ్డి, కౌన్సిలర్లు వక్కలగడ్డ మల్లికార్జున్, చక్కా మధు, కనిగిరి బాల వెంకట రమణ, జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు పెరుమాళ్ల కాశీరావు, ఆర్యవైశ్య సంఘం పట్టణ అధ్యక్షుడు తాళ్లపల్లి సత్యనారాయణ, పండిత పరిషత్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు రవిచంద్ర, జీఎల్ రమేష్‌బాబు, ఎన్సీసీ అధికారి వెంగళరెడ్డి, సుధాకర్, జాతీయ సైన్స్ అవార్డు గ్రహీత టీ.జగన్నాథ్ పాల్గొన్నారు. -
‘గేట్’ దాటితే.. గెటప్ మారినట్టే..!
మార్కాపురం : ఇంజినీరింగ్ విద్యార్థుల కల గేట్ (గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజినీరింగ్). ఈ పరీక్షకు దాదాపు ఆరు నెలల పాటు నిరంతర శిక్షణ తీసుకుంటే మంచి ర్యాంక్ సాధించడం సులభమంటున్నారు అధ్యాపకులు. గేట్లో విజయం సాధిస్తే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు ఎంటెక్‌లో చేరేందుకు అవకాశాలు ఎదురు చూస్తుంటాయి. 100 మార్కులకు ఉండే ఈ పరీక్ష ఆన్లైన్లో జరుగుతుంది. ఈ ఏడాది సెప్టెంబర్ 1 నుంచి దరఖాస్తులు స్వీకరిస్తారు. జనవరిలో పరీక్ష ఉంటుంది. మార్చి రెండవ వారంలో ఫలితాలు ప్రకటిస్తారు. బీటెక్ చదివిన ప్రతి విద్యార్థి గేట్లో ర్యాంక్ సాధించడానికి ఉత్సాహపడుతుంటాడు. 2014లో జరిగిన పరీక్షల్లో సుమారు 15 లక్షల మంది విద్యార్థులు దేశ వ్యాప్తంగా పోటీ పడ్డారు. ఇందులో 2.10 లక్షల మంది మాత్రమే ఉత్తీర్ణులయ్యారు. గేట్ పరీక్ష రాయడానికి ప్రస్తుతం ఇంజినీరింగ్ చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులతో పాటు బీటెక్ పూర్తి చేసిన విద్యార్థులు కూడా అర్హులే. ఈసీఈ, ఈఈఈ, మెకానికల్, సివిల్, సీఎస్ఈ, ఇన్స్ట్రుమెంటల్ బ్రాంచ్ విద్యార్థులతో పాటు బీటెక్‌లో ఇతర కోర్సులు చేసిన వారు పరీక్ష రాయవచ్చు. గేట్లో ఉత్తీర్ణులైతే ఐఐటీ, నిట్, ఐఐఎస్ఈలో సీటు పొందవచ్చు. అర్హత పరీక్ష రాయకుండా బీఎస్ఎన్ఎల్, పీఆర్ డీఓ, ఇస్రో, బీహెచ్ఈఎల్, బీఈఎల్ఎల్, ఎన్టీపీసీ లాంటి కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో ఉద్యోగాలకు నేరుగా ఇంటర్వ్యూకు హాజరు కావచ్చు. -
కలుషితాహారంతో అస్వస్థత
మార్కాపురం: సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థుల ఆరోగ్యం గాలిలో దీపంలా మారుతోంది. నిత్యం ఎక్కడో ఒక చోట నాసిరకపు భోజనం తిని విద్యార్థినీ విద్యార్థులు అస్వస్థతకు గురవుతున్నారు. కలుషితాహారం తిని మార్కాపురంలోని ఎస్టీ బాలికల హాస్టల్లో 11 మంది విద్యార్థినులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. విద్యార్థినుల కథనం మేరకు..హాస్టల్లో ఆదివారం రాత్రి అన్నం తిన్న తరువాత 8వ తరగతి విద్యార్థిని మేఘావత్ మహేశ్వరిబాయి(కాటంరాజు తండా), 5వ తరగతి చదువుతున్న పీ విజయలక్ష్మి, ఆర్.నాగమణి, పుష్పలత (దొనకొండ మండలం బూనపల్లి), నాలుగో తరగతి చదువుతున్న ఎం.శివాని (వైపాలెం మండలం వాదంపల్లి), చరితకు స్వల్పంగా కడుపునొప్పి వచ్చింది. అయినా అలాగే సోమవారం పాఠశాలకు వెళ్లారు. మధ్యాహ్నానికి కడుపునొప్పికి తోడు వాంతులు కావడంతో హాస్టల్ వార్డెన్ ఎం.సుబ్బలక్ష్మి రాత్రి పట్టణంలోని ప్రైవేటు వైద్యశాలలో చేర్చారు. మంగళవారం ఉదయానికి కానీ విషయం బయటకు తెలియలేదు. సాయంత్రం మరో ఐదుగురు విద్యార్థినులు కూడా అస్వస్థతకు గురయ్యారు. 6వ తరగతి చదువుతున్న నాగలక్ష్మీబాయి, 7వ తరగతి చదువుతున్న వీ.నాగలక్ష్మీబాయి (మల్లాపాలెం), 4వ తరగతి చదువుతున్న డి.నాగలక్ష్మీబాయి, డి.ప్రియాంకబాయి (పీఆర్సీ తండా), పదో తరగతి చదువుతున్న సీహెచ్ సావిత్రి (పుచ్చకాయలపల్లి) తలనొప్పి, వాంతులు, విరేచనాలతో బాధపడుతుండటంతో మార్కాపురం ఏరియా వైద్యశాలలో చేర్చారు. సమాచారం తెలుసుకున్న ఎమ్మెల్యే జంకె వెంకటరెడ్డి, ఆర్డీవో పీ కొండయ్య, డిప్యూటీ డీఈవో కాశీశ్వరరావులు వైద్యశాలకు వచ్చి విద్యార్థినులను పరామర్శించారు. విద్యార్థినుల పరిస్థితి వైద్యులను అడిగి తెలుసుకుని మెరుగైన వైద్యం అందించాలని కోరారు. తహశీల్దార్ నాగభూషణం, ఆర్ఐ ఖలీల్, ఎంఈవో సీహెచ్‌పీ వెంకటరెడ్డిలు ఘటనపై విచారణ చేపట్టారు. మీ పిల్లలను ఇలాగే చూస్తారా: వార్డెన్‌పై ఎమ్మెల్యే ఆగ్రహం వైద్యశాల నుంచి ఎస్టీ బాలికల హాస్టల్‌కు వెళ్లిన ఎమ్మెల్యే జంకె వెంకటరెడ్డి వార్డెన్ లక్ష్మిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. స్టోర్ రూమ్‌కు వెళ్లగా అక్కడ కుళ్లిపోయిన టమోటాలు, బూజుపట్టిన ఉల్లిగడ్డలు, మగ్గిపోయిన వంకాయలను చూసి ఇలాంటి వాటితో వండి అన్నంలో పెడితే విద్యార్థినుల ఆరోగ్యం ఎలా ఉంటుందని ప్రశ్నించారు. మరుగుదొడ్లు అధ్వానంగా ఉండటంతో ‘మీ ఇంటిని ఇలాగే ఉంచుకుంటారా, మీ పిల్లలను ఇలాగే చూస్తారా’ అంటూ వార్డెన్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిసరాల పరిశుభ్రత పాటించాలని, ఎంతో నమ్మకంతో తల్లిదండ్రులు హాస్టల్‌కు చిన్నారులను పంపుతున్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. ప్రాణాపాయం లేదు: చికిత్స అందిస్తున్న వైద్యులు విలేకరులతో మాట్లాడుతూ సోమవారం రాత్రి వార్డెన్ విద్యార్థినులను హడావుడిగా వైద్యశాలకు తీసుకుని రాగా, అవసరాన్ని బట్టి ఒక విద్యార్థినికి 8 నుంచి 12 సెలైన్ బాటిల్స్ పెట్టినట్లు తెలిపారు. కలుషితాహారం వల్లే విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారని చెప్పారు. ఈ ఘటనపై హాస్టల్ వార్డెన్ సుబ్బలక్ష్మి మాట్లాడుతూ విద్యార్థినులు కడుపునొప్పితో బాధపడుతున్నామని చెప్పిన వెంటనే ప్రైవేటు వైద్యశాలకు తీసుకెళ్లి చికిత్స చేయించానన్నారు. ఎమ్మెల్యే వెంట మండల యూత్ అధ్యక్షుడు మందటి మహేశ్వరరెడ్డి, సొసైటీ డెరైక్టర్ నల్లబోతుల కొండయ్య ఉన్నారు. మార్కాపురం ఏటీడబ్ల్యూఓ ఎస్.దస్తగిరి విద్యార్థినులను పరామర్శించారు. -
ప్రకాశం జిల్లాలో యువతి కిడ్నాప్
ఒంగోలు: ప్రకాశం జిల్లాలో ఓ యువతిని దుండగులు కిడ్నాప్ చేశారు. త్రిపురాంతకం చెందిన శార్వాణి అనే యువతి తల్లితో కలసి మార్కాపురం వచ్చింది. దుండగులు మార్కాపురంలో ఆమెను కిడ్నాప్ చేసి కారులో తీసుకెళ్లారు. ఈ సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సివుంది. -
చదివేదెలా?
మార్కాపురం: సంక్షేమ హాస్టళ్లలో ఉంటున్న విద్యార్థుల గురించి ప్రభుత్వం పట్టించుకోవడం మానేసింది. విద్యా సంవత్సరం ప్రారంభమై దాదాపు రెండు నెలలు కావస్తున్నా..నేటికీ వారికి అవసరమైన నోట్‌పుస్తకాలు, యూనిఫాంలు, ట్రంకుపెట్టెలు పంపిణీ చేయలేదు. జిల్లాలోని మార్కాపురం, కందుకూరు, ఒంగోలు డివిజన్లలో 77 బీసీ హాస్టళ్లు, 117 ఎస్సీ హాస్టళ్లు ఉన్నాయి. మొత్తం మీద 16 వేల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ఎస్సీ, బీసీ హాస్టల్ విద్యార్థులందరికీ ఇంత వరకు నోట్ పుస్తకాలు పంపిణీ చేయలేదు. దీంతో బయట పుస్తకాలు కొనుగోలు చేసి విద్యార్థులు చదువుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. బీసీ హాస్టల్ విద్యార్థులకు కాస్మొటిక్ చార్జీలు కూడా ఆగిపోయాయి. రాష్ట్ర విభజన నేపథ్యంలో బీసీ సంక్షేమ శాఖ నోట్ పుస్తకాలను జిల్లాకు పంపలేదు. మూడు నుంచి 5వ తరగతి వరకు చదివే విద్యార్థులకు మూడు పెద్ద నోట్ పుస్తకాలు, మూడు చిన్న నోట్ పుస్తకాలు, 6 నుంచి 10వ తరగతి వరకు చదివే విద్యార్థులకు 12 నోట్ పుస్తకాలు అందిస్తారు. ఈ ఏడాది పాఠ్య పుస్తకాల సిలబస్ మారడంతో నోట్సు రాసుకోవడం విద్యార్థులకు తప్పనిసరైంది. సైన్స్, మ్యాథ్స్, సోషల్, తెలుగు ఉపాధ్యాయులు ప్రతి పాఠ్యాంశానికి నోట్సు ఇస్తుంటారు. ప్రభుత్వం నుంచి నోట్ పుస్తకాలు అందక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. విద్యార్థులకు యూనిఫాంలు, ఇంటి నుంచి తెచ్చుకున్న సామగ్రిని పెట్టుకునే ట్రంకుపెట్టెలు సైతం హాస్టల్ విద్యార్థులకు అందించలేదు. వారం రోజుల్లో రావచ్చు బి.నరసింహారావు,బీసీ సహాయ సంక్షేమ అధికారి, మార్కాపురం రాష్ట్ర విభజన నేపథ్యంలో ఇంత వరకు జిల్లాలోని విద్యార్థులకు పంపిణీ చేయాల్సిన నోట్ పుస్తకాలు, యూనిఫాం రాలేదు. వారం రోజుల్లో విద్యార్థులకు ఇవ్వాల్సిన సామగ్రి వచ్చే అవకాశం ఉంది. రాగానే పంపిణీ చేస్తాం. -
అనంత త్యాగాల ‘సీమ’పై శీతకన్ను
అటు ఉత్తరాంధ్ర, ఇటు రాయలసీమ ప్రాంతాలకు అందుబాటులో ఉండేలా... అదే సమయంలో కృష్ణా, గుంటూరు జిల్లాల ప్రజలు నొచ్చుకోని రీతిలో ఆ జిల్లాలకు సమీపంలోనే ఉన్న మార్కాపురం, వినుకొండ ప్రాంతాల్లో రాజధాని ఏర్పాటుచేస్తే బాగుంటుంది. రాజధాని నగరాన్ని కృష్ణా-గుంటూరు జిల్లాల మధ్య ఏర్పాటు చేయబోతున్నట్టు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన మంత్రివర్గ సహచరులు సూచి స్తున్న తీరును గమనిస్తే వారెవరూ గతం నుంచి గుణపాఠాలు నేర్చుకోలేదనిపి స్తోంది. రాజధాని ఏర్పాటుపై కేంద్ర ప్రభుత్వం నియమించిన శివరామకృష్ణ కమిటీ తన నివేదికను సమర్పించాల్సి ఉండగా ఈలోగానే లేనిపోని ఊహాగానాలకు తావివ్వడం లోని సహేతుకత ఏమిటో అర్థంకావడంలేదు. 1953లో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినప్పుడు, కృష్ణా, గుం టూరు జిల్లాల ప్రాబల్యాన్ని అంగీకరించబోమని రాయల సీమ ప్రజలు నాడు వ్యక్తంచేసిన అభిప్రాయాలు నేటికీ కొనసాగుతున్నాయి. కనుక, అటు ఉత్తరాంధ్ర, ఇటు రాయలసీమ ప్రాంతాలకు అందుబాటులో ఉండేలా... అదే సమయంలో కృష్ణా, గుంటూరు జిల్లాల ప్రజలు నొచ్చుకోని రీతిలో ఆ జిల్లాలకు సమీపంలోనే ఉన్న మార్కాపురం, వినుకొండ ప్రాంతాల్లో రాజధాని ఏర్పాటుచేస్తే బాగుంటుంది. రాజధాని పేరిట అభివృద్ధినంతటినీ ఒకేచోట కేంద్రీక రించాలనుకోవడమే పొరపాటు. దీనివల్లనే... తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు అంత వ్యతిరేకత వచ్చింది. కనుక మార్కాపురం, వినుకొండ ప్రాంతాల్లో రాజధాని నిర్మాణా నికి పూనుకున్నా అక్కడ అసెంబ్లీ, సచివాలయం, మంత్రుల క్వార్టర్స్, ఇతర ప్రభుత్వ కార్యాలయాలు వంటివి మాత్రమే ఉండేలా చర్యలు తీసుకోవాలి. అన్ని ప్రాంతాల్లో ఉన్నత విద్యా సంస్థలను నెలకొల్పి, కోస్తా ప్రాంతాల్లోని ఇతర జిల్లాల్లో, రాయలసీమలో పరిశ్రమలను నిర్మించాలి. ఇప్పటికీ వెనుకబడిన ప్రాంతమే శ్రీకృష్ణ కమిటీ నివేదిక ప్రకారం చూస్తే ఈనాటికీ విశాలాం ధ్రలో అత్యంత వెనుకబడిన ప్రాంతం రాయలసీమ. 1956 తర్వాత ఇది మరింతగా వెనుకబడింది. విశాలాంధ్ర కోసం కర్నూలు వాసులు రాజధానిని త్యాగం చేశారు. ఆ తర్వాత సాగిన అభివృద్ధిలో సైతం అన్నివిధాలా నష్టపోయారు. ప్రజాభిప్రాయాన్ని విస్మరించి, వారి మనోభావాలను గాయ పరిచి యూపీఏ ప్రభుత్వం ఏకపక్షంగా రాష్ట్రాన్ని చీల్చిన తర్వాతనైనా మన నాయకులకు జ్ఞానోదయమైనట్టు లేదు. నీటి పంపకంలో సీమకు అన్యాయం సాగునీటి విషయంలో సీమకు తీవ్ర అన్యాయం జరిగింది. ఇక్కడ వర్షపాతం చాలా తక్కువ. భూగర్భ జలాలూ తక్కు వ. ఉన్న చెరువులన్నీ నాశనం అయ్యాయి. కృష్ణా, పెన్నా నదులపై ఆశలు పెట్టుకున్నా, అవి రెండూ వారికి దక్కలేదు. పెన్నా నదిపై సోమశిల ప్రాజెక్టు కట్టి నెల్లూరు జిల్లా అవసరాలకు పెద్ద పీట వేయడంవల్ల ఆ నది కూడా సీమకు దక్కకుండాపోయింది. సీమ పేరుమీద కట్టిన తెలుగు గంగ ప్రాజెక్టు నీళ్లు సీమకంటే నెల్లూరు జిల్లాకే ఎక్కువ పోతాయి. సీమలో మొత్తం సాగు భూమి విస్తీర్ణంలో నీటి పారు దల లభించేది అనంతపురంలో 12.5 శాతం, కర్నూలులో 21.5 శాతం మాత్రమే. జిల్లాలవారీగా చూస్తే వైఎ స్సార్ జిల్లాలో 32.9 శాతం, చిత్తూరు జిల్లాలో 37 శాతం, కోస్తాలో దాదాపు 70 శాతం భూములకు నీటిపారు దల ఉంది. 1960ల నాటికి సీమలో 50 శాతం సాగు చెరువుల కింద ఉంది. అది నేటికి 8 శాతం కూడా లేదు. 2008లో కోస్తాలో కాలువల కింద సాగు 78 శాతం ఉండగా రాయలసీ మలో 8 శాతం మాత్రమే ఉంది. మానవ వనరుల్లోనూ అట్టడుగునే ఏపీ అభివృద్ధి నివేదిక ప్రకారం కడప, కర్నూలు, అనంత పురం జిల్లాలు మానవ వనరుల అభివృద్ధిలో బాగా వెనకబ డ్డాయి. ఇక్కడ ఆదాయం తక్కువ. జీవనం సాగించడమే కష్టం. చదువు శాతం తక్కువ. రాగిముద్ద, వంకాయపచ్చడి, సాదా బట్టలు... ఇవే ఇక్కడి జీవన సంస్కృతి. వీటిని పట్టిం చుకోకుండా మళ్లీ కోస్తా ప్రాంతంవైపే అభివృద్ధిని కేంద్రీ కరిస్తే రాయలసీమ ప్రజల్లో అసంతృప్తి వెల్లువెత్తుతుంది. సామాజిక ఆధిపత్య పోరు నూతన రాజధాని నిర్మాణంలో సామాజిక ఆధిపత్య పోరు ప్రాబల్యమే కనిపిస్తున్నది. చరిత్రను పరిశీలించి, ప్రాంతాల అమరికను గమనించి, ఏ ప్రాంతాలకు ఏవిధంగా అన్యా యం జరిగిందో అధ్యయనం చేసి రాజధాని నిర్మాణానికి పూనుకోవాలి తప్ప స్వప్రయోజనాలే ప్రాతిపదికగా వ్యవహ రించకూడదు. అలా చేయడంవల్ల తమకు మరోసారి అన్యా యం జరిగిందన్న భావన రాయలసీమవాసుల్లో బలపడు తుంది. కనుక అందరికీ ఆమోదయోగ్యంగా ఉండేలా, సాధ్యాసాధ్యాలను పరిశీలించి తగిన నిర్ణయం తీసుకోవాలి. (వ్యాసకర్త విశ్రాంత ప్రధానాచార్యులు, తిరుపతి) ఎనుగొండ నాగరాజు నాయుడు -
తెలుగు తమ్ముళ్లకు హరి ఝులక్!
ఒంగోలు: స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆధిపత్యం కోసం అడ్డదారులు తొక్కుతున్న టీడీపీకి ఆ పార్టీకే చెందిన తిరుగుబాబు అభ్యర్థి ఈదర హరిబాబు ఝులక్ ఇచ్చారు. దౌర్జన్యంగా జిల్లా పరిషత్ చైర్మన్ పదవిని సొంతం చేసుకునేందుకు పచ్చబాబులు పన్నిన కుయుక్తులను పటాపంచలు చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండతో ప్రకాశం జిల్లా పరిషత్ చైర్మన్ పదవిని దక్కించుకున్నారు. మెజారిటీ లేకపోయినా జెడ్పీ పీఠంపై కన్నేసిన తెలుగు తమ్ముళ్లకు హరిబాబు తగిన గుణపాఠం చెప్పారు. అధికార మదంతో అడ్డదారిలో పదవి దక్కించుకుందామన్న టీడీపీ కుతంత్రానికి అడ్డుకట్ట వేశారు. అరాచకాండతో ప్రజల తీర్పును అపహాస్యం చేయాలని చూసిన సైకిల్ పార్టీకి చెక్ పెట్టారు. తాము తీసిన గోతిలో తామే పడి తెలుగు తమ్ముళ్లు గిల గిల తన్నుకుంటున్నారు. తప్పుడు కేసులో మార్కాపురం జెడ్పీటీసీని అరెస్టు చేయించి తన కుట్రకు తెరలేపింది. ఇక్కడ నుంచి పరిణమాలు వేగంగా మారిపోయాయి. గెలుపు తమదే ఉన్న దీమాతో ఉన్న టీడీపీకి వైఎస్ఆర్ సీపీ ఊహించని విధంగా షాక్ ఇచ్చింది. స్వతంత్ర అభ్యర్థి హరిబాబుకు మద్దతు ప్రకటించి జెడ్పీ పీఠం కట్టబెట్టింది. సమయస్ఫూర్తితో వ్యవహరించిన వైఎస్ఆర్ సీపీకి వైస్ చైర్మన్ పదవి దక్కింది. రెండు పదవులు కోల్పోయి తెలుగు తమ్ముళ్లు ఖిన్నులయ్యారు. పలు జిల్లాల్లో దౌర్జన్యంగా జెడ్పీటీసీ పదవులు దక్కించుకున్న టీడీపీ నాయకులు సీన్ రివర్స్ అయ్యే సరికి ఆగమాగం అవుతున్నారు. (ఇంగ్లీషు కథనం ఇక్కడ చదవండి) -
‘వెలిగొండ’కు మోక్షం
మార్కాపురం, న్యూస్‌లైన్: పశ్చిమ ప్రాంత రూపురేఖలు మార్చే వెలిగొండ ప్రాజెక్టుకు అటవీ అనుమతులు లభించడంతో ప్రాజెక్టు పనులు వేగవంతమయ్యేందుకు మార్గం సుగమమైంది. నిలిచిపోయిన టన్నెల్, కాలువల పనులు ప్రారంభం కానున్నాయి. నెల రోజులుగా ‘వెలిగొండ’కు మోక్షం దోర్నాల సమీపంలోని టన్నెల్ పనులు ఆగిపోయాయి. రాజీవ్ టైగర్ ప్రాజెక్టు కావడంతో అనుమతి లేకుండా పనులు ప్రారంభిస్తే కేసులు నమోదు చేస్తామని అటవీ శాఖాధికారులు వెలిగొండ ప్రాజెక్టు అధికారులు, కాంట్రాక్టర్లకు నోటీసులు జారీ చేయడంతో పనులు నిలిపేశారు. గత శనివారం ఈ ప్రాజెక్టుకు సంబంధించి అటవీ అనుమతులు వచ్చాయి. దోర్నాల మండలం కొత్తూరు వద్ద రెండు టన్నెల్స్ నిర్మిస్తున్నారు. మొదటి టన్నెల్ వ్యాసార్థం 8 మీటర్లు కాగా..18.82 కి.మీల పొడవున కాలువలు తవ్వాల్సి ఉంది. ఇప్పటి వరకు 11.52 కి.మీ మేర కాలువ తవ్వారు. రెండో టన్నెల్ వ్యాసార్థం 10 మీటర్లు కాగా, 18.82 కి.మీ పొడవున కాలువలు తవ్వాల్సి ఉంది. 8.45 కి.మీ మేర కాలువలు తవ్వారు. రెండు టన్నెల్స్‌కు సంబంధించి సుమారు 900 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. నెలకు 400 మీటర్ల పొడవున పనిచేయాల్సి ఉండగా, గట్టిరాయి, సుద్ధ, బురదమట్టి, నీళ్లు వస్తుండటంతో 300 మీటర్లకు మించి పనులు సాగడం లేదు. మొత్తం 7 ప్యాకేజీలుగా విభజించి పనులు ప్రారంభించారు. అటవీ శాఖ మొత్తం 3069.91 హెక్టార్లకు అనుమతి ఇచ్చింది. దీంతో దోర్నాల, పెద్దారవీడు, అర్ధవీడు, కాకర్ల, గిద్దలూరు, రాచర్ల, కొమరోలు, తదితర అటవీ ప్రాంతాల్లోని ఈస్ట్రన్ కెనాల్, తీగలేరు, ఫీడర్ కెనాల్ పనులు ప్రారంభించే అవకాశం ఉంది. దోర్నాల ప్రాంతంలో ఫీడర్ కాలువ పొడవు 21.6 కి.మీ కాగా, 10.2 కి.మీ మాత్రమే అటవీ శాఖ అనుమతులు లభించడంతో అంత వరకు తవ్వి నిలిపేశారు. తీగలేరు కాలువ మొత్తం పొడవు 48 కి.మీ కాగా, 5 కి.మీ పొడవున కాలువ తవ్వారు. అలాగే, ఈస్ట్రన్ కాలువకు కూడా అటవీ శాఖ అనుమతి లభించకపోవడంతో నిలిచిపోయింది. అటవీశాఖ అనుమతి ఇచ్చిన ప్రాంతాల్లో మార్కాపురం పరిధిలో 1691 హెక్టార్లు, గిద్దలూరు పరిధిలో 1169 హెక్టార్లు, నెల్లూరు జిల్లా పరిధిలో 108 హెక్టార్లు, కడప జిల్లాలోని పోరుమామిళ్ల అటవీ ప్రాంతానికి అనుమతులు మంజూరు చేసింది. 2014కు పూర్తి చేయాలన్న లక్ష్యం ఎప్పటికి పూర్తవుతుందో తెలియని పరిస్థితి ఏర్పడింది. వైఎస్ రాజశేఖరరెడ్డి తరువాత అధికారంలోకి వచ్చిన రోశయ్య, కిరణ్ కుమార్‌రెడ్డిలు వెలిగొండ ప్రాజెక్టు ప్రాధాన్యతను గుర్తించకపోవడంతో టన్నెల్ పనులు నత్తనడకతో పోటీ పడుతున్నాయి. కృష్ణానది మిగులు జలాల ఆధారంగా శ్రీశైలం ప్రాజెక్టుకు వచ్చే వరద నీటిని 45 రోజుల పాటు కొల్లంవాగు ద్వారా వెలిగొండ ప్రాజెక్టుకు కేటాయిస్తే 43.50 టీఎంసీల నీటితో ప్రాజెక్టు నిండుతుంది. టన్నెల్స్ ద్వారా సుంకేసుల, గొట్టిపడియ, కాకర్ల గ్యాపుల్లో నీటిని నింపుతారు. {పాజెక్టు పూర్తయితే అర్ధవీడులో 3 వేల ఎకరాలు, కంభంలో 17,300, బేస్తవారిపేటలో 11,200, మార్కాపురంలో 27,700 ఎకరాలు, కొనకనమిట్లలో 30 వేలు, తర్లుపాడులో 20 వేలు, హెచ్‌ఎంపాడులో 39,400, కనిగిరిలో 9,900, పొదిలిలో 5,200, కురిచేడులో 6 వేలు, దొనకొండలో 17 వేలు, పుల్లలచెరువులో 11,500, మర్రిపూడిలో 4,400, పెద్దారవీడులో 21,900, యర్రగొండపాలెంలో 19,800, దోర్నాలలో 6,100, త్రిపురాంతకంలో 32,300, గిద్దలూరులో 10,600, రాచర్లలో 11,500, కొమరోలులో 5,500, పామూరులో 2,300, సీఎస్‌పురంలో 24,500, వెలిగండ్లలో 17,600 ఎకరాలకు వెలిగొండ జలాలు అందుతాయి. -
పట్టపగలు దారుణం
మార్కాపురం, న్యూస్‌లైన్: స్నేహితుని ఇంటికి వెళ్లిన ఓ ఆటో యజమానిని పట్టపగలు పిస్టల్‌తో నుదుటిపై కాల్చి హత్య చేసిన సంఘటన మార్కాపురంలో మంగళవారం సంచలనం రేపింది. పోలీసులు, కుటుంబ సభ్యుల కథనం ప్రకారం మృతుడు నాగూర్‌వలికి రెండు ఆటోలున్నాయి. వాటిని బాడుగకు తిప్పుతుంటాడు. మంగళవారం ఉదయం ఇంటి నుంచి బయటకు వచ్చిన నాగూర్వలి పట్టణంలోని విద్యానగర్ నాలుగో లైనులో నివాసం ఉంటున్న తన మిత్రుడు షేక్ మహబూబ్‌బాషా ఇంటికి వెళ్లాడు. మహబూబ్‌బాషా ఆటోడ్రైవర్‌గా జీవనం సాగిస్తున్నాడు. 11.30 నుంచి 12 గంటల మధ్య బాషా ఇంట్లో నుంచి పిస్టల్ పేల్చిన శబ్దం రావడంతో చుట్టుపక్కల వారు వచ్చి చూడగా..నాగూర్వలి రక్తపు మడుగు మధ్య మృతిచెంది ఉండటంతో వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృతుని నుదుటిపై బుల్లెట్ గాయం ఉంది. చెవులు, ముక్కు, తలలో నుంచి రక్తం కారింది. డీఎస్పీ జీ రామాంజనేయులు, సీఐ ఎ.శివరామకృష్ణారెడ్డి, రూరల్ ఎస్సై దేవకుమార్‌లు ఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించి దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మృతుడు నాగూర్‌వలికి సన్నిహితంగా ఉన్నవారే ఈ ఘాతుకానికి పాల్పడి ఉండవచ్చునని, ఆర్ధికపరమైన, అక్రమ సంబంధమైన కారణాలే హత్యకు కారణమై ఉండవచ్చునని భావించి ఆ దిశగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. హత్య జరిగిన ఇంటి యజమాని మహబూబ్‌బాషా పరారీలో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. హంతకునికి పిస్టల్ ఎలా వచ్చిందనే అంశం చర్చనీయాంశమైంది. మృతుడు నాగూర్‌వలికి భార్య, ఇద్దరు పిల్లలున్నారు. మృతుడు నాగూర్వలి తల్లి రోకాబి కుమారుడి మృతదేహాన్ని చూసి కన్నీరు మున్నీరైంది. రోకాబికి ఇద్దరు కుమారులు కాగా..నాగూర్వలి పెద్ద కుమారుడు. పోలీసులు ఇచ్చిన సమాచారంతో నాగూర్వలి తమ్ముడు నాగూర్బాషాతో పాటు అతని తల్లి, కుటుంబ సభ్యులు అంతా ఘటనా స్థలానికి చేరుకున్నారు. ‘అన్యాయంగా నా కొడుకును మీ పొట్టన పెట్టుకున్నారు. మీకేం ద్రోహం చేశాడని కాల్చి చంపారయ్యా..’ అంటూ రోకాబి విలపించిన తీరు చూపరులను కలచివేసింది. -
ఈఎస్ఐ ద్వారా సూపర్ స్పెషాలిటీ సేవలు
మార్కాపురం, న్యూస్‌లైన్ : రాష్ట్రంలోని ఈఎస్ఐ (ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ డిస్పెన్సరీ) ఆస్పత్రుల పరిధిలో ఉండే కార్మికులు, ఉద్యోగుల కుటుంబాలకు సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందించేందుకు వివిధ ప్రైవేటు వైద్యశాలలతో అనుసంధానం చేసినట్లు ఆ సంస్థ జాయింట్ డెరైక్టర్ డాక్టర్ జి.రవికుమార్ తెలిపారు. మంగళవారం మార్కాపురంలోని ఈఎస్ఐ వైద్యశాలను ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ విజయవాడ రీజనల్ పరిధిలో 49 ఈఎస్ఐ ఆస్పత్రులు, 24 ప్యానల్ క్లినిక్‌లు (ఈఎస్ఐ కార్డుదారులకు సేవలందించే ప్రైవేటు ఆస్పత్రులు) ఉన్నాయని చెప్పారు. కంపెనీల యజమానులు తమ వాటాగా ఒక్కో కార్మికుడు, ఉద్యోగికి 4.75 శాతం, ఉద్యోగి 1.75 శాతం చెల్లిస్తే ఈఎస్ఐ వైద్యశాలల్లో సేవలు పొందవచ్చని చెప్పారు. అవసరమైనచోట రోగి ఆరోగ్య పరిస్థితిని బట్టి కార్పొరేట్ వైద్యశాలలకు పంపుతామని తెలిపారు. ఈఎస్ఐ కార్డు కలిగిన కార్మికులు, ఉద్యోగులు ఒంగోలులో 5 వేల మంది వరకు ఉన్నారన్నారు. అక్కడ తమ డిస్పెన్సరీ లేకపోవడంతో ప్యానల్ క్లినిక్ ద్వారా సేవలను అందిస్తున్నామని పేర్కొన్నారు. మార్కాపురంలో పలకల పరిశ్రమ ఉండటంతో ఈఎస్ఐ డిస్పెన్సరీని నిర్వహిస్తున్నట్లు వివరించారు. ఈఎస్ఐ వైద్యశాలల్లో మందుల కొరత లేదని, అవసరమైతే ఎటువంటి మందులనైనా అందిస్తామని తెలిపారు. రూ.15 వేలలోపు జీతం పొందుతున్న ఉద్యోగి, కార్మికుడు ఈఎస్ఐ పరిధిలోకి వస్తారని చెప్పారు. అనంతరం జాయింట్ డెరైక్టర్ స్థానిక ఆస్పత్రిలోని రికార్డులను తనిఖీ చేశారు. రోగులను విచారణ చేసి సేవలపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఆయన వెంట డిస్పెన్సరీ వైద్యాధికారి బి.శరత్ ఉన్నారు. ఒంగోలులో.. ఒంగోలు సెంట్రల్ : సింగరాయకొండలో త్వరలో ఈఎస్ఐ ప్యానల్ క్లినిక్‌ను ఏర్పాటు చేస్తామని జేడీ రవికుమార్ తెలిపారు. మంగళవారం జిల్లాలోని వివిధ ఈఎస్ఐ వైద్యశాలలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఒంగోలులో ‘న్యూస్‌లైన్’తో మాట్లాడారు. జిల్లాలో అమృతా హార్ట్ హాస్పిటల్, సంఘమిత్ర సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రి ఈఎస్ఐ రిఫరల్ వైద్యశాలలుగా ఉన్నాయన్నారు. ఒంగోలులోని సుందరయ్య భవన్ రోడ్డులో ఉన్న శాంతి నర్సింగ్ హోంలో ప్యానల్ క్లినిక్‌ను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మార్టూరులో ఏర్పాటు చేసిన ఈఎస్ఐ వైద్యశాలకు ఎన్నికల తర్వాత సిబ్బందిని నియమిస్తామని వివరించారు. ప్రస్తుతానికి గుంటూరు నుంచి వైద్య సిబ్బంది వచ్చి సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. చీమకుర్తి ఈఎస్ఐ ప్యానల్ క్లినిక్‌లో రికార్డుల నిర్వహణ సరిగాలేదని గుర్తించినట్లు చెప్పారు. -
మంచినీళ్లో రామచంద్ర..!
మార్కాపురం, న్యూస్‌లైన్ : మార్కాపురం మున్సిపాలిటీలో ఏ బ్లాక్‌లో చూసినా నీటి సమస్య తాండవిస్తోంది. మిగిలిన రోజుల్లో పరిస్థితి ఎలాగున్నా..వేసవి కాలంలో మాత్రం పట్టణ ప్రజల గొంతెండక తప్పడం లేదు. బిందె నీటి కోసం నానాతంటాలు పడాల్సి వస్తోంది. స్థానికులకు సక్రమంగా మంచినీరు సరఫరా చేసేందుకు ఏర్పాటు చేసిన దూపాడు సమ్మర్ స్టోరేజీ ట్యాంకులోని సాగర్‌నీరు గతేడాది పూర్తిగా అడుగంటింది. దీంతో గతంలో మూడు రోజులకోసారి సరఫరా చేసే సాగర్‌నీటిని ప్రస్తుతం ఐదు రోజులకోసారి సరఫరా చేస్తున్నారు. శివారు కాలనీలకు పైపులైన్లు సక్రమంగా లేకపోవడంతో సాగర్‌నీటి సరఫరా కలగానే మిగిలింది. ఆయా కాలనీలకు ట్యాంకర్ల ద్వారా వచ్చే నీరే దిక్కయింది. ఆ ట్యాంకర్లు కూడా ఎప్పుడు వస్తాయో తెలియని పరిస్థితి. వాటి వద్ద నీరు పట్టుకునేందుకు మహిళలు పోటీపడే నేపథ్యంలో నిత్యం ఘర్షణలు సర్వసాధారణమయ్యాయి. ప్రధాన కాలనీలకు సైతం అరకొరగానే సాగర్ నీరు అందుతోంది. మున్సిపాలిటీలో 32 వార్డులుండగా, అధికారికంగా 17,464 నివాస గృహాలు, 71,092 మంది ప్రజలు నివాసం ఉంటున్నారు. 29 మురికివాడల్లో 29,173 మంది నివసిస్తున్నారు. ఒక్కొక్కరికి రోజుకు సుమారు 70 లీటర్ల నీరు అవసరం. కానీ, ప్రస్తుతం 40 నుంచి 50 లీటర్లు మాత్రమే సరఫరా చేస్తున్నారు. 24 వార్డుల్లో నీటి ఎద్దడి తీవ్రంగా ఉంది. వేసవి ప్రారంభానికి ముందే నీటివెతలు మొదలవడంతో వేసవిలో ఇంకెలా ఉంటుందోనని పట్టణ ప్రజలు ఆందోళన చెందుతున్నారు. నాలుగు నెలల నుంచి వర్షాలు లేకపోవడంతో ఇప్పటికే శివారు ప్రాంతాల్లోని డీప్‌బోర్లు సైతం పనిచేయడం లేదు. మున్సిపాలిటీలో సుమారు 165 డీప్బోర్లుండగా, వాటిలో 80 నుంచి 85 మాత్రమే పనిచేస్తున్నాయి. 25 మినీ వాటర్ ట్యాంకులుండగా 10 నుంచి 12 మాత్రమే వాడుకలో ఉన్నాయి. పూలసుబ్బయ్యకాలనీ, ఎస్సీబీసీకాలనీ, బాపూజీకాలనీ, భగత్‌సింగ్‌కాలనీ, చెన్నరాయునిపల్లె, విద్యానగర్, కరెంట్ ఆఫీస్కాలనీ, నాగులవరం రోడ్డు, ఒంటెద్దుబండ్లకాలనీ, నానాజాతుల పేట, ఏకలవ్యకాలనీ, రాజ్యలక్ష్మీనగర్, సుందరయ్య కాలనీల్లో తీవ్ర నీటి కొరత నెలకొంది. 28, 29 బ్లాకుల్లో దాహంతో ప్రజలు అల్లాడుతున్నారు. పొలాల్లో నుంచి తోపుడు బండ్లు, సైకిళ్లపై నీరు తెచ్చుకుంటూ అవస్థపడుతున్నారు. సుమారు 350 నుంచి 400 అడుగుల లోతులో వేసిన బోర్లలో సైతం నీరు రాకపోవడంతో ప్రజలతో పాటు సమస్యను పరిష్కరించాల్సిన అధికారులు కూడా ఆందోళన చెందుతున్నారు. కనిగిరిలో కన్నీటి గాథ కనిగిరి, న్యూస్‌లైన్ : కనిగిరి అనగానే ప్రధానంగా నీటి సమస్య గుర్తొస్తుంది. కనిగిరి మేజర్ పంచాయతీని నగర పంచాయతీగా మార్చేందుకు చుట్టుపక్కలున్న కాశీపురం, మాచవరం, శంఖవరం పంచాయతీలను విలీనం చేశారు. ప్రస్తుతం కనిగిరి నగర పంచాయతీలో 20 వార్డులు, 44,755 మంది జనాభా ఉన్నారు. అధికారికంగా 10,465 గృహాలు, 307 బోర్లు, 51 డీప్‌బోర్లు, 1,839 కుళాయిలు ఉన్నాయి. కనిగిరి నగర పంచాయతీ పరిధిలోని సగం ప్రాంతాల్లో బోర్లలో నీరు పడవు. ఒకవేళ నీరు పడినా ఫ్లోరైడ్ శాతం అధికంగా ఉంటుంది. అత్యధికంగా 5.1 పీపీఎం ఫ్లోరైడ్ శాతం ఇక్కడి నీటిలో ఉంటుంది. దీంతో ఇక్కడి ప్రజలకు సాగర్ నీటి సరఫరా తప్పనిసరి. 1992లో కనిగిరి పరిసరాల్లోని 18 గ్రామాల కోసం రక్షిత మంచినీటి పథకాన్ని ఏర్పాటు చేశారు. ఆ తర్వాత దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఈ ప్రాంత ప్రజలకు ఫ్లోరైడ్ నీటి నుంచి విముక్తి కలిగించేందుకు 175 కోట్ల రూపాయలతో రక్షిత మంచినీటి పథకాన్ని మంజూరు చేశారు. కానీ, ఆయన మరణం తర్వాత సక్రమంగా నిధులు విడుదలగాక ఆ పథకం నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. దీంతో నగర పంచాయతీలో ఇంటికో సాగర్‌నీటి కుళాయి కలగానే మిగిలింది. ట్యాంకర్లపై ఆధారపడి నీటి సమస్యతో ప్రజలు అల్లాడుతూనే ఉన్నారు. -
మార్కాపురంలో వలసల జోరు
మార్కాపురం, న్యూస్‌లైన్: పేదల అభ్యున్నతికి పాటుపడుతున్న వైఎస్సార్ సీపీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు స్థానిక బ్రహ్మం గారి మఠం ప్రాంతానికి చెందిన 300 మంది తెలిపారు. వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్తలు జంకె వెంకటరెడ్డి, వెన్నా హనుమారెడ్డి, మాజీ ఎమ్మెల్యే కేపీ కొండారెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్ అభ్యర్థి డాక్టర్ చెప్పల్లి కనకదుర్గ, పట్టణ కన్వీనర్ బట్టగిరి తిరుపతిరెడ్డి సమక్షంలో వారంతా గురువారం వైఎస్సార్ సీపీలో చేరారు. కాలనీకి చెందిన వేశపోగురాజు మాట్లాడుతూ తమ ప్రాంతం లో సీసీరోడ్లు, కాలువలు, వాటర్ లైన్స్, మరుగుదొడ్లు, శ్మశానాలు, విద్యుత్ స్తంభాలు, వీధి దీపాలు, ఉన్నత తరగతులు ఏర్పాటు చేయాలని గతంలో వార్డుల నాయకులకు చెప్పినా పట్టించు కోలేదన్నారు. కాలనీల్లోని సమస్యలు పరిష్కరించగల సత్తా ఉన్న వైఎస్సార్ సీపీలో చేరుతున్నట్లు ఆయన ప్రకటించారు. కటికెల గురవయ్య, కొండేటి ఆవులయ్య, ఎన్.డేవిడ్, గుంటి దేవరాజు, వి.శేఖర్, బి.నారాయణ, జి.రంగయ్య, డి.పేతురు, పి.రాముడు తదితరులు పార్టీలో చేరారు. ఏకలవ్య కాలనీలో.. టీడీపీకి చెందిన మాజీ కౌన్సిలర్ కొమ్ము యోగమ్మ నేతృత్వంలో ఏకలవ్యకాలనీలో సుమారు 200 మంది టీడీపీ కార్యకర్తలు నియోజకవర్గ సమన్వయకర్తలు జంకె వెంకటరెడ్డి, వెన్నా హనుమారెడ్డి, మాజీ ఎమ్మెల్యే కేపీ కొండారెడ్డిల నేతృత్వంలో పార్టీలో చేరారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆధ్వర్యంలోనే నూతన రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని నమ్ముతున్నట్లు వారు తెలిపారు. డేవిడ్, పౌల్‌రాజు, తదితర నాయకులు పాల్గొన్నారు. 31వ వార్డులో.. స్థానిక కాలేజీ రోడ్డులోని 31వ వార్డులో సుమారు 100 మంది టీడీపీ కార్యకర్తలు వంగూరి రూతమ్మ నేతృత్వంలో గురువారం సాయంత్రం వైఎస్సార్ సీపీలో చేరారు. నందిగం డేవిడ్, ఆదిమూలపు క్రిష్టయ్య, వంగూరి జానీ, ఏసోబు, అఖిల్, ప్రశాంత్ తదితరులు పార్టీలో చేరిన వారిలో ఉన్నారు. కార్యక్రమాల్లో పార్టీ నాయకులు ఆర్.తిరునారాయణ, ఎం.మహేశ్వరరెడ్డి, పంబి వెంకటరెడ్డి, పాపిరెడ్డి సుబ్బారెడ్డి, గొలమారి శివారెడ్డి, ఇంజినీర్ వెంకటరెడ్డి, కురాటి చెన్నకేశవులు, మార్కెట్ యార్డు చైర్మన్ గుంటక సుబ్బారెడ్డి, గుంటక వెంకటరెడ్డి, కంది ప్రమీలారెడ్డి, ఆవులమంద పద్మ, ఒంటెద్దు రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు. 31వ అభ్యర్థి జి.రోజ్లిడియాతో కలిసి డాక్టర్ కనకదుర్గ ప్రచారం నిర్వహించగా ర్యాలీలో కేపీ, జంకె, వెన్నా హనుమారెడ్డి, బట్టగిరి తిరుపతిరెడ్డి పాల్గొన్నారు. వైఎస్సార్ సీపీ కార్యాలయం ప్రారంభం 17వ బ్లాక్‌లో వైఎస్సార్ సీపీ కార్యాలయాన్ని మాజీ ఎమ్మెల్యే కేపీ కొండారెడ్డి సతీమణి కె.సుబ్బమ్మ గురువారం రాత్రి ప్రారంభించారు. అభ్యర్థి బుశ్శెట్టి నాగేశ్వరరావుతో పాటు పార్టీ నాయకులు ఎంవీ రమణ, ఇస్మాయిల్, బొందిలి కాశిరాంసింగ్, కనిగిరి వెంకటేశ్వర్లు, పెండ్యాల వెలుగొండయ్య, వెంకటేశ్వర్లు, రిటైర్డ్ తహసీల్దార్ హుస్సేన్‌పీరా, షేక్ మన్సూర్, రాధాకృష్ణ పాల్గొన్నారు. -
మార్కాపురంలో నాగుర్ అనే వ్యక్తి హత్య
ప్రకాశం జిల్లా మార్కాపురంలో నాగుర్ అనే వ్యక్తి హత్యకు గురైయ్యాడు. శనివారం అర్థరాత్రి ఒంటరిగా ఉన్న నాగుర్పై కొందరు దుండగులు దాడి చేసి, అతడి కళ్లలో కారం చల్లి కత్తులలో పొడిచారు. దాంతో నాగుర్ అక్కడికక్కడే మరణించాడు. అనంతరం దుండగులు అక్కడి నుంచి పరారైయ్యారు. స్థానికులు వెంటనే స్పందించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని నాగుర్ మృతదేహన్ని స్వాధీనం చేసుకున్నారు. నాగుర్ మృతిపై అతడి కుటుంబసభ్యుల సమాచారం అందించారు. అయితే నాగుర్ మృతిపై హత్యకు కారణాలు తెలియరాలేదు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
పసికందుని నేలకేసి కొట్టి..
కోమాలోకి వెళ్లి 11 నెలల చిన్నారి మృత్యువాత మద్యం మత్తులో కన్నతండ్రి కిరాతకం మార్కాపురం, న్యూస్‌లైన్: మద్యం మత్తులో ఓ తండ్రి కన్న కూతుర్నే హతమార్చాడు. ఈ సంఘటన ప్రకాశం జిల్లా మార్కాపురంలో ఆదివారం చోటుచేసుకుంది. కొమరోలు మండలం ములకపల్లి గ్రామానికి చెందిన ఆర్ . కిరణ్‌కుమార్, మరియమ్మ దంపతులు గిద్దలూరులో నివాసం ఉంటున్నారు. కూలి పనులు చేసుకుని జీవనం సాగిస్తున్న వీరికి 11 నెలల కుమార్తె సంజన ఉంది. భార్యాభర్తలిద్దరూ తరచూ గొడవలు పడుతుండేవారు. వీరు నెల రోజుల క్రితం మార్కాపురం సమీపంలో ఉంటున్న మరియమ్మ తల్లిదండ్రుల వద్దకు వచ్చారు. ఆదివారం మధ్యాహ్నం కూడా కిరణ్ భార్యతో గొడవపడ్డాడు. సాయంత్రం కుమార్తె సంజనను ఇంటినుంచి బయటకు తీసుకొచ్చి నేలకేసికొట్టి పారిపోయాడు. చిన్నారిని ఏరియా వైద్యశాలకు తీసుకెళ్లగా అప్పటికే కోమాలోకి వెళ్లడంతో అక్కడ నుంచి ప్రైవేట్ ఆసుపత్రికి పట్టుకెళ్లారు. అప్పటికే చిన్నారి మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. -
మార్కాపురానికి రాజధాని అర్హతలు
మార్కాపురం, న్యూస్‌లైన్: రాయలసీమ, కోస్తాంధ్రకు మధ్య వివాదరహిత ప్రాంతమైన మార్కాపురం కేంద్రంగా సీమాంధ్ర రాజధాని నిర్మించడం సముచితమని రాష్ట్ర రాజధాని సాధన సమన్వయ కమిటీ డిమాండ్ చేసింది. కమిటీ అడహాక్ కన్వీనర్ డాక్టర్ బి.సీతారామ శాస్త్రి ఆధ్వర్యంలో ఆయన వైద్యశాలలో నేతలు గాయం వెంకట నారాయణరెడ్డి, డాక్టర్ బీవీ శ్రీనివాసశాస్త్రి, చాబోలు బాల చెన్నయ్య శనివారం విలేకరులతో మాట్లాడారు. భూకంపాలు, వరదలు, సునామీలు వంటి ప్రకృతి వైపరీత్యాలు మార్కాపురంలో సంభవించవని.. వేల ఎకరాల ప్రభుత్వ అసైన్డ్ భూములు అందుబాటులో ఉండడం రాజధాని నిర్మాణానికి అనుకూలమన్నారు. గుండ్లకమ్మ నది.. వెలిగొండ ప్రాజెక్టు.. నాగార్జున సాగర్ జలాలు అందుబాటులో ఉన్నాయని.. అన్ని ప్రాంతాలను కలుపుతూ రాష్ట్ర రహదారులు, రైల్వే లైన్, రోడ్డు రవాణా సౌకర్యం ఉందన్నారు. పురాతనమైన, విస్తరణకు అవకాశం ఉన్న దొనకొండ విమానాశ్రయం అందుబాటులో ఉందని.. మానవ వనరులకు కూడా కొదువ ఉండదని తెలిపారు. నల్లమల అభయారణ్యంతో కూడిన వాతావరణం ఉందని, ప్రసిద్ధి గాంచిన శ్రీశైల పుణ్యక్షేత్రం, త్రిపురాంతక దేవాలయాలు కూడా ఈ ప్రాంతం కిందకే వస్తాయన్నారు. కడప జిల్లాలో సెయిల్ ఆధ్వర్యంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు, విజయవాడ, గుంటూరు, తెనాలి పట్టణాలను కలుపుతూ మెట్రో రైలు ప్రాజెక్టుకు హామీ, విశాఖపట్నం నుంచి చెన్నై వరకు పారిశ్రామిక కారిడార్, వివిధ జిల్లాల్లో ట్రిపుల్ ఐటీ, ఎన్ఐటీ, కేంద్ర ప్రభుత్వ పరిశ్రమలు, యూనివర్శిటీలు ప్రకటించిన నేపథ్యంలో సీమాంధ్ర జిల్లాలకు మధ్యగా ఉండే మార్కాపురం కేంద్రంగా రాజధాని ఏర్పాటు చేస్తే బాగుంటుందని చెప్పారు. ఈ మేరకు రాష్ట్రపతి, ప్రధాని,యూపీఏ చైర్పర్సన్, జీఓఎం, గవర్నర్, కలెక్టర్‌కు వినతి పత్రాలు పంపుతున్నట్లు తెలిపారు. 26న సమావేశం పశ్చిమ ప్రకాశంలోని అన్ని పార్టీల ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక సంఘాల ప్రతినిధులు, విద్యార్థి సంఘాల నాయకులతో 26న సాయంత్రం స్థానిక ఎన్జీఓ హోంలో సమావేశం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. జెండాలు, అజెండాలు పక్కన పెట్టి రాజధాని సాధన కోసం ర్యాలీలు, సదస్సులు నిర్వహించేందుకు అంద రూ సహకరించాలని కోరారు. సీమాంధ్ర రాష్ట్ర రాజధాని కోసం అటవీ భూములను పరిశీలిస్తున్నామని, కేంద్ర ప్రభుత్వ పెద్దలు ప్రస్తావించిన విషయాన్ని గుర్తు చేశారు. -
ఓనమాలు దిద్దేదెలా?
మార్కాపురం, న్యూస్‌లైన్: అక్షరాభ్యాసాన చిన్నారులు ఓనమాలు దిద్దే మార్కాపురం పలకకు కష్టకాలం వచ్చింది. కంప్యూటర్ల రాక, నోటు పుస్తకాల వాడకం పెరగడంతో పదేళ్ల నుంచి క్రమంగా రాతి పలకల వాడకం తగ్గిపోతోంది. దీంతో ఆ పరిశ్రమలూ మూతపడుతున్నాయి. కొంతమంది వ్యాపారులు వాటిని డిజైన్ స్లేట్లుగా మార్చి విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు. అయితే ఈమధ్య కాలంలో విదేశాల నుంచి కూడా ఎగుమతి ఆర్డర్లు నిలిచిపోవడంతో పనులు దొరక్క పలకల ఫ్యాక్టరీల నిర్వహణ యజమానులకు భారంగా మారింది. సవాలక్ష సమస్యలు క్వారీల నిర్వహణలో కోర్టు కేసులు, పెరిగిన విద్యుత్ చార్జీలు, కూలీల వేతనాలు వెరసి ఫ్యాక్టరీల నిర్వహణ యజమానులకు భారంగా మారింది. 150 ఫ్యాక్టరీలకు గాను కేవలం 20 నుంచి 25 ఫ్యాక్టరీల్లో మాత్రమే ప్రస్తుతం పనులు జరుగుతున్నాయి. పలకల పరిశ్రమపై సుమారు 30 గ్రామాల్లోని 3 వేల మంది కూలీలు ఆధారపడి జీవిస్తున్నారు. ఫ్యాక్టరీలు మూతపడటంతో నెల రోజుల నుంచి కుటుంబ పోషణ భారంగా మారింది. విస్తృత నిక్షేపాలు తర్లుపాడు, మార్కాపురం, దొనకొండ మండలాల్లో సుమారు 15 కిలోమీటర్లు మేర పలకల గనులు విస్తరించి ఉన్నాయి. తర్లుపాడు మండలంలోని కలుజువ్వలపాడు, మేకలవారిపల్లె, చెన్నారెడ్డిపల్లె, తుమ్మలచెరువు, మార్కాపురం మండలంలోని నాయుడుపల్లె, రాయవరం, కందివారిపల్లె, గజ్జలకొండ, దొనకొండ మండలంలోని మంగినిపూడి తదితర గ్రామాల్లో పలకల గనులు ఎక్కువగా ఉన్నాయి. రోజూ సుమారు 3 వేల మంది కార్మికులు గనుల్లో పనిచేస్తుంటారు. మార్కాపురం పలకలకు గతంలో విదేశాల్లో మంచి డిమాండ్ ఉండేది. ప్రస్తుతం ఆదరణ తగ్గుతోంది. పలకల గనుల్లో విజయాగోల్డ్, మల్టీ కలర్, బ్లాక్, ఆటమ్ తదితర రకాల డిజైన్ స్లేట్లు వస్తుంటాయి. ఒక్కో గనిలో నెలకు 10 నుంచి 15 టన్నుల వరకు ముడిరాయిని బయటకు తీస్తారు. వీటిని ఫ్యాక్టరీలకు చేర్చి వివిధ సైజుల్లో కోత కోసి ప్యాక్‌చేసి విక్రయిస్తారు. ఈ డిజైన్ స్లేట్లను ఇంటి గోడలకు అందంగా అమర్చుకుంటారు. మార్కెట్లో విజయగోల్డ్ రకం టన్ను 20 వేలు, మల్టీకలర్ 10 వేలు, బ్లాక్ 40 వేలు, ఆటమ్ 20 వేల నుంచి *25 వేల వరకు విక్రయిస్తుంటారు. గనుల్లో పనిచేసే కార్మికులకు రోజుకు 200 కూలీ ఇస్తుంటారు. ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పలకల గనుల్లో కార్మికులు రాయిని యంత్రాల ద్వారా బయటకు పంపిస్తారు. సుమారు 70 నుంచి 100 అడుగుల లోతులోకి దిగి రాయిని బయటకు తెస్తుంటారు. ఫ్యాక్టరీలు పనిచేస్తే కటింగ్ ఆపరేటర్లకు 165, క్యాలిబ్రేషన్ కార్మికులకు 100 ఇస్తారు. నిలిచిన ఆర్డర్లు ఢిల్లీ, చెన్నై, ముంబయి తదితర నగరాలతో పాటు శ్రీలంక, సింగపూర్, చైనా నుంచి డిజైన్ స్లేట్ల కోసం వస్తున్న ఆర్డర్లు నిలిచిపోయాయి. నవంబర్‌లో కురిసిన భారీ వర్షాలకు నెల రోజుల పాటు గనుల్లో నీరు చేరి పనులు నిలిచిపోయాయి. దీంతో ఇటు పలకల ఫ్యాక్టరీల్లో, అటు పలకల గనుల్లో పనులు లేక కార్మికులు కుటుంబాలను పోషించుకోలేక విలవిల్లాడిపోతున్నారు. ప్రభుత్వం చొరవ చూపాలి నెల రోజులుగా స్థానిక పారిశ్రామికవాడలో పనులు నిలిచిపోయాయి. సుమారు 3 వేల మంది కార్మికులు పనులు లేక ఇబ్బందులు పడుతున్నారు. కొంతమంది కార్మికులు కుటుంబాలతో సహా వలసలు పోతున్నారు. ప్రభుత్వం నూతన పారిశ్రామిక విధానంలో భాగంగా ఫ్యాక్టరీల యజమానులకు రాయితీలు ఇవ్వాలి. విద్యుత్ చార్జీలు తగ్గించాలి. ఆర్డర్లు వచ్చే విధంగా చూడాలి. - రూబెన్, వర్కర్స్ యూనియన్ కార్యదర్శి -
ముగ్గురు టెక్నికల్ అసిస్టెంట్ల సస్పెన్షన్
మార్కాపురం, న్యూస్‌లైన్: సక్రమంగా విధులు నిర్వర్తించని సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఉపాధి హామీ పథకం అసిస్టెంట్ ప్రాజెక్టు డెరైక్టర్ సుందరరావు హెచ్చరించారు. ‘నిధులున్నా... నీరసమే’ అన్న శీర్షికన సాక్షిలో సోమవారం ప్రచురించిన కథనంపై ఆయన స్పందించి స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో సిబ్బందితో సమావేశం నిర్వహించారు. మరుగుదొడ్లు నిర్మించుకున్నా బిల్లులు చెల్లించని ముగ్గురు టెక్నికల్ అసిస్టెంట్లను సస్పెండ్ చేసి ఇద్దరికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. గోగులదిన్నె, కె.కొత్తపల్లె, పి.యాచవరం, భూపతిపల్లె గ్రామాల్లో 84 మరుగుదొడ్లు నిర్మించుకున్నా వారికి డబ్బులు చెల్లించకుండా నిర్లక్ష్యం వహించిన టెక్నికల్ అసిస్టెంట్ నాగరాజును సస్పెండ్ చేస్తున్నట్లు తెలిపారు. 839 మరుగుదొడ్లు పూర్తి చేయాల్సి ఉండగా 289 మాత్రమే పూర్తి చేశారన్నారు. బొందలపాడు, గజ్జలకొండ, పెద్దనాగులవరం, ఇడుపూరు గ్రామాలకు సంబంధించి 862 మరుగుదొడ్ల నిర్మాణం లక్ష్యం కాగా 308మాత్రమే పూర్తి చేసి బిల్లులు చెల్లించకుండా నిర్లక్ష్యం చేసిన జయపాల్‌కు షోకాజ్ నోటీసు జారీ చేసినట్లు చెప్పారు. కోలభీమునిపాడు, మాల్యవంతునిపాడు, నికరంపల్లి, వేములకోట గ్రామాలకు సంబంధించి 498 మరుగుదొడ్ల నిర్మాణానికి గానూ 120 మాత్రమే పూర్తి చేసి లబ్ధిదారులకు బిల్లులు చెల్లించకుండా నిర్లక్ష్యం వహించిన టెక్నికల్ అసిస్టెంట్ రహమాన్‌ను సస్పెండ్ చేసినట్లు తెలిపారు. చింతగుంట్ల, కొండేపల్లి, నాయుడుపల్లి గ్రామాల్లో 736మరుగుదొడ్ల నిర్మాణం లక్ష్యం కాగా 350 మాత్రమే పూర్తి చేసి 55 మరుగుదొడ్లకు బిల్లులు చెల్లించని టెక్నికల్ అసిస్టెంట్ సురేష్‌ను సస్పెండ్ చేసినట్లు తెలిపారు. బొందలపాడు, జమ్మనపల్లి, తిప్పాయపాలెం గ్రామాల్లో 605 మరుగుదొడ్ల నిర్మాణం లక్ష్యం కాగా 144 మాత్రమే పూర్తి చేసి నిర్లక్ష్యంగా విధులు నిర్వహిస్తున్న బలరాంకు షోకాజ్ నోటీసులు ఇచ్చినట్లు తెలిపారు. మరుగుదొడ్లు నిర్మించుకున్న లబ్ధిదారులకు వెంటనే బిల్లులు చెల్లించాలని ఆదేశించారు. సమావేశంలో ఏపీఓ రమణి, మండల జేఈ శేఖర్లు పాల్గొన్నారు. -
నిధులున్నా..నీరసమే
మార్కాపురం, న్యూస్‌లైన్: ప్రతి ఇంటికీ మరుగుదొడ్డి ఉండాలన్న ప్రభుత్వ సంకల్పం అధికారుల నిర్లక్ష్యంతో నీరుగారుతోంది. మరుగుదొడ్ల నిర్మాణంపై కలెక్టర్ విజయకుమార్ ప్రత్యేక దృష్టి పెట్టినా..ఆశించిన స్థాయిలో ఫలితాలు రావడం లేదు. నిధులున్నా లబ్ధిదారులకు చెల్లింపుల్లో తీవ్ర జాప్యంతో కొత్తగా మరుగుదొడ్లు నిర్మించుకునేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. వివిధ మండలాల్లో మరుగుదొడ్ల నిర్మాణాన్ని పరిశీలిస్తే అధికారుల నిర్లక్ష్యం స్పష్టమవుతోంది. ఉపాధి హామీ పథకం కింద నిర్మించుకునే మరుగుదొడ్డికి రూ 10,200 ఖర్చవుతుందని అంచనా. కేంద్రం రూ 4,800, రాష్ట్ర ప్రభుత్వం రూ 4,500, లబ్ధిదారుని వాటా రూ 900గా నిర్ణయించారు. తెల్లరేషన్ కార్డు కలిగి ఉండి ఉపాధి హామీ పథకంలో జాబ్‌కార్డు ఉంటే నగదును ప్రభుత్వం దశల వారీగా లబ్ధిదారునికి అందజేస్తుంది. వీటి బాధ్యతను ఉపాధి హామీ సిబ్బందికి కేటాయించారు. జిల్లా వ్యాప్తంగా ఈ ఏడాది మార్చి 31 నాటికి 56 మండలాల్లో 2,01,982 వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం పూర్తికావాల్సి ఉండగా ఇప్పటి వరకు సుమారు 75 వేల వ్యక్తిగత మరుగుదొడ్లు మాత్రమే పూర్తయ్యాయి. మార్కాపురం మండలంలో 3,540కి గానూ 1153 పూర్తయ్యాయి. తర్లుపాడు మండలంలో 3317కు గానూ 1139, కొనకనమిట్ల మండలంలో 5306కు గానూ 1085, కురిచేడులో 4082కు గానూ 1104, దొనకొండలో 4334కు గాను 1019 మాత్రమే పూర్తయ్యాయి. దోర్నాల మండలంలో 4885కు గానూ 1705, కొనకనమిట్ల 5306కు గాను 1082, పెద్దారవీడు 4483కు గాను 1622, పుల్లలచెరువు 3576కు గాను 1244, తర్లుపాడు 3317కు గాను1135, త్రిపురాంతకం 4721కు గాను 1280, యర్రగొండపాలెం 4729కు గాను 1603 వ్యక్తిగత మరుగుదొడ్లు పూర్తయ్యాయి. ఈ నిర్మాణాలను చూస్తే పథకం అమలు ఎలా జరుగుతుందో అర్థం చేసుకోవచ్చు. ఇక నిర్మాణం పూర్తయి బిల్లులు రాని వ్యక్తిగత మరుగుదొడ్లు ఈ ఐదు మండలాల్లో సుమారు 1400 వరకు ఉన్నాయి. ఏడాది క్రితం మరుగుదొడ్లు నిర్మించుకున్నప్పటికీ బిల్లులు చెల్లించకపోవటంతో కొత్తగా నిర్మించుకునేందుకు ఆసక్తి చూపడం లేదు. ఒక్కో మరుగుదొడ్డి నిర్మాణానికి సుమారు రూ 13 వేలు ఖర్చవుతుండగా, ప్రభుత్వం రూ 10,200 మాత్రమే అందజేస్తుంది. అయినా కట్టుకున్న వెంటనే బిల్లులు చెల్లించడం లేదు. దీంతో లబ్ధిదారుల్లో నిరాసక్తత ఏర్పడింది. పది రోజుల్లో ఇస్తాం.. సుందరరావు, అసిస్టెంట్ ప్రాజెక్టు డెరైక్టర్ ఉపాధి హామీ పథకం కింద వ్యక్తిగత మరుగుదొడ్లు కట్టుకున్న వారికి 15వ తేదీలోపు బిల్లులు చెల్లిస్తాం. జాప్యం జరిగిన మాట వాస్తవమే. లక్ష్యాలను పూర్తి చేసేందుకు కృషి చేస్తున్నాం. ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఫీల్డ్ అసిస్టెంట్లు, టెక్నికల్ అసిస్టెంట్లు గ్రామాల్లో తిరుగుతున్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న సిబ్బందికి మెమోలు ఇస్తున్నాం. ఏడాదైనా బిల్లు రాలేదు జానపాటి సుబ్బమ్మ, వేములకోట ఏడాది కిందట మరుగుదొడ్డి నిర్మించుకున్నా బిల్లులు రాలేదు. ఎప్పుడు అడిగినా అదిగో ఇదిగో అంటూకాలం గడుపుతున్నారు. దీంతో కొత్తగా మరుగుదొడ్లు నిర్మించుకునేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. ప్రభుత్వం ఇచ్చే దాని కంటే రూ 2వేలు అదనంగా ఖర్చు చేస్తున్నా, ఇస్తామన్న డబ్బులు కూడా ఇవ్వకుండా తిప్పుతున్నారు. -
ఉన్నా..ఉపయోగమేదీ..
మార్కాపురం, న్యూస్‌లైన్: రైతులకు గిట్టుబాటు ధర కల్పించి పత్తి కొనుగోలు చేసేందుకు మార్కాపురంలో ఏర్పాటు చేసిన సీసీఐ కేంద్రం వారికి అక్కరకు రావడం లేదు. ప్రభుత్వం నిర్దేశించిన ధర క్వింటాకు రూ. 4 వేలు కాగా..బయటి మార్కెట్లో దళారులు రూ. 4,300కు కొనుగోలు చేస్తుండటంతో మార్కాపురంలోని సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రం రైతులు లేక వెలవెల బోతోంది. గత నెల 12న మార్కాపురంలో సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. ఇప్పటి వరకు 9 వేల క్వింటాళ్ల పత్తిని మాత్రమే రైతులు యార్డుకు తీసుకొచ్చి విక్రయించారు. ప్రభుత్వం క్వింటా పత్తిని రూ.4 వేలకు కొనుగోలు చేయాలని నిర్ణయించింది. 8 శాతం తేమ కలిగి, 29.5 మి.మీ నుంచి 30.5 మి.మీ పత్తిని పై ధరకు కొనుగోలు చేస్తారు. ఆ తరువాత తేమ శాతం పెరిగితే పాయింట్‌కు రూ. 40 చొప్పున తగ్గిస్తారు. 9 శాతం తేమ ఉంటే రూ. 3,960, పది శాతం ఉంటే రూ. 3,920 ప్రకారం కొనుగోలు చేస్తున్నారు. నెల రోజుల నుంచి వర్షాలు లేకపోవడం, తేమ కచ్చితంగా 8 శాతం ఉండటంతో నాణ్యమైన పత్తి వస్తోంది. దీంతో వ్యాపారులు క్వింటా రూ. 4,200 నుంచి రూ. 4,300 వరకు రైతుల నుంచి కొనుగోలు చేస్తున్నారు. విధానాల్లో లోపం... రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తే మార్కెట్లో వ్యాపారులు ప్రభుత్వ ధరకు సమానంగా కొనుగోలు చేస్తారు. ఈ దఫా ఇందుకు వ్యతిరేకంగా జరుగుతోంది. గిద్దలూరు నుంచి మార్కాపురానికి రైతులు లారీ పత్తి తీసుకురావాలంటే అదనంగా రూ. 6 వేలు ఖర్చు పెట్టుకోవాల్సి వస్తోంది. ఒక్కో బోరంలో పత్తిని ఎత్తి, దించడానికి కూలీలు రూ. 30 తీసుకుంటున్నారు. ఇందులో 70 నుంచి 90 కిలోల పత్తి ఉంటుంది. ఒక్కో లారీకి 14 నుంచి 15 బోరెల పత్తి ఎత్తుతారు. దీంతో పాటు బాడుగ సుమారు రూ. 5 వేలు ఉంటుంది. తీరా ఇంత కష్టపడి యార్డుకు తీసుకొస్తే రూ. 4 వేలకు మించి కొనుగోలు చేయబోమని వ్యాపారులు చెబుతున్నారు. ఒక వేళ అమ్మినా కొనుగోలు కేంద్రంలో వ్యాపారులు చెక్కు మాత్రమే ఇస్తారు. బ్యాంకుకు వెళ్లి నగదుగా మారేసరికి పది రోజుల సమయం పడుతుంది. దళారులు కొనుగోలు చేసిన వెంటనే రైతులకు నగదు అందజేస్తున్నారు. దీంతో యార్డుకు వచ్చి విక్రయించేందుకు రైతులు ఆసక్తి చూపడం లేదు. మూడు రోజుల నుంచి యార్డులో విక్రయాలు నిలిచిపోయాయి. గత ఏడాది జనవరిలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రంలో సుమారు లక్ష క్వింటాళ్ల పత్తిని వ్యాపారుల నుంచి కొనుగోలు చేయగా, ఈ ఏడాది 20 రోజులు గడిచినా 9 వేల క్వింటాళ్లు మాత్రమే కొనుగోలు చేశారు. ప్రభుత్వమే క్వింటా మద్దతు ధర రూ. 4,500 ప్రకటించాలని రైతులు కోరుతున్నారు. కావాలనే ఆలస్యం చేశారు: పశ్చిమ ప్రకాశంలో పత్తి దిగుబడులు అక్టోబర్ మొదటి వారం నుంచి ప్రారంభమవుతున్నాయి. ఈ సంగతి సీసీఐ అధికారులకు కూడా తెలుసు. అప్పట్లో క్వింటా మద్దతు ధర రూ. 3,100 మాత్రమే ఉంది. రైతులు ఇళ్లలో దిగుబడులు ఉంచుకోలేక దళారులు చెప్పిన ధరకు విక్రయించారు. ఈ విధంగా సుమారు 60 శాతం పత్తిని విక్రయించారు. ఎకరాకు 12 నుంచి 14 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తోంది. ఇప్పుడు కేవలం తక్కువ మంది రైతుల దగ్గర మాత్రమే పత్తి ఉంది. ఈ కేంద్రాన్ని నవంబర్‌లో ఏర్పాటుచేసి ఉంటే రైతులకు ఉపయోగంగా ఉండేది. ప్రస్తుతం మార్కాపురం, యర్రగొండపాలెం, గిద్దలూరు సబ్ డివిజన్ల పరిధిలోని 12 మండలాల్లో 37 వేల హెక్టార్లలో పత్తి సాగుచేశారు. మిగిలిన 3 వేల హెక్టార్లను దర్శి, పొదిలి, కొనకనమిట్ల, మర్రిపూడి తదితర మండలాల్లో సాగు చేశారు. ఎకరా పత్తి సాగుకు రూ. 18 నుంచి రూ. 20 వేల వరకు రైతులు ఖర్చు చేశారు. -
గెలుపోటములు సమానంగా స్వీకరించాలి
మార్కాపురం, న్యూస్‌లైన్ : క్రీడాకారులు గెలుపోటములను సమానంగా స్వీకరించాలని యర్రగొండపాలెం ఎమ్మెల్యే ఆదిమూలపు సురేశ్ సూచిం చారు. స్థానిక ఆఫీసర్స్ క్లబ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి షటిల్ బ్యాడ్మింటన్పోటీలను శనివారం రాత్రి 8 గంట లకు ఆర్డీఓ సత్యనారాయణ, డీఎస్పీ రామాంజనేయులు, మాజీ ఎమ్మెల్యేలు జంకె వెంకటరెడ్డి, కేపీ కొండారెడ్డితో కలిసి ఆయన ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ విద్యార్థులు క్రీడలకు ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు. మానసిక, శారీరక వృద్ధికి క్రీడలు ఉపయోగపడతాయని మాజీ ఎమ్మెల్యే, వైఎస్ఆర్ సీపీ సమన్వయకర్త జంకె వెంకటరెడ్డి అన్నారు. జిల్లా స్థాయి పోటీలను మార్కాపురంలో నిర్వహించటం అభినందనీయమని మాజీ ఎమ్మెల్యే కేపీ కొండారెడ్డి అన్నారు. అనంతరం రిటైర్డు పశువైద్యాధికారి ఎల్వీ నారాయణరెడ్డిని సన్మానించారు. ఈ సందర్భంగా రెడ్డి మహిళా కళాశాల ప్రిన్సిపాల్ రంగారెడ్డి, బ్యాడ్మిం టన్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి రవికిరణ్, డాక్టర్ మోహన్‌రావు, జంకె లక్ష్మీరెడ్డి, తహసీల్దార్ సత్యనారాయణ మాట్లాడారు. జిల్లా నుంచి 100 టీమ్‌లు పాల్గొన్నాయి. ప్రథమ బహుమతిగా * 10,116, ద్వితీయ బహుమతి * 5,116, తృతీయ బహుమతి 3,116, చతుర్థ బహుమతి *2,116 అందిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. -
అదనపు బాధ్యతలతో బోధనకు దూరం
మార్కాపురం, న్యూస్‌లైన్: ఇన్‌చార్జ్‌ల పాలనతో జిల్లాలో విద్యాశాఖ గాడితప్పుతోంది. 56 మండలాల్లో కేవలం 9 మంది మాత్రమే రెగ్యులర్ ఎంఈఓలు ఉన్నారు. మిగిలిన మండలాల్లో లేకపోవడంతో పాలన కుంటుపడుతోంది. జిల్లావ్యాప్తంగా 424 ఉన్నత పాఠశాలలు, 2,942 ప్రాథమిక, 419 ప్రాథమికోన్నత పాఠశాలలున్నాయి. ఇదే సమయంలో ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు అదనపు బాధ్యతలు అప్పగించడంతో పిల్లలకు పాఠాలు చెప్పలేకపోతున్నారు. రాజీవ్ విద్యామిషన్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం విద్యాభివృద్ధికి వివిధ పథకాలను అమలు చేస్తోంది. మధ్యాహ్న భోజన పథకం, స్కాలర్‌షిప్‌ల పంపిణీ, ఏకరూప దుస్తులు, పరీక్షల నిర్వహణ తదితర కార్యక్రమాలు పర్యవేక్షించాల్సిన బాధ్యత ఎంఈఓలదే. ప్రస్తుతం జిల్లాలో కొమరోలు, దోర్నాల, సంతనూతలపాడు, అద్దంకి, మర్రిపూడి, కొరిశపాడు, కారంచేడు, ఉలవపాడు తదితర మండలాలకు మాత్రమే రెగ్యులర్ ఎంఈఓలుండగా మిగిలిన మండలాల్లో వివిధ పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు పూర్తిస్థాయి అదనపు బాధ్యతలు అప్పగించారు. పదేళ్ల నుంచి ఎంఈఓల నియామకంపై హైకోర్టు, సుప్రీం కోర్టుల్లో కేసులు విచారణలో ఉన్నాయి. జిల్లా పరిషత్ టీచర్లు, ప్రభుత్వ టీచర్ల మధ్య ఎంఈఓల పదోన్నతులు, నియామకాలపై సందిగ్ధత నెలకొంది. అప్పటి నుంచి జిల్లాలోని వివిధ మండలాల్లో ఇన్‌చార్జ్‌ల పాలనలో విద్యాశాఖ నడుస్తోంది. ప్రధానోపాధ్యాయులు పాఠశాలల తనిఖీలు, విద్యార్థుల ప్రగతి, పాఠశాల నిధుల వినియోగం, ఎస్ఎంసీ సమావేశాలు తదితర కీలక బాధ్యతలు నిర్వహించాల్సి ఉంది. వారిని ఎఫ్ఏసీ ఎంఈఓలుగా నియమించడంతో ఓ వైపు పాఠశాల నిర్వహణ, మరోవైపు ఎంఈఓల బాధ్యతలు భారంగా మారాయి. ఇరువైపులా పర్యవేక్షణ కష్టమవుతోంది. ఇబ్బంది లేకుండా చూస్తున్నాం -రాజేశ్వరరావు, డీఈఓ రాష్ట్ర వ్యాప్తంగా ఎంఈఓల సమస్య ఉంది. జిల్లాలో పదేళ్ల నుంచి రెగ్యులర్ ప్రతిపాదికపై ఎంఈఓల నియామకం లేకపోవడంతో సమీపంలో ఉన్న హెచ్ఎంలను ఎఫ్ఏసీ ఎంఈఓలుగా నియమించి ఉపాధ్యాయులకు, విద్యార్థులకు ఇబ్బంది లేకుండా చూస్తున్నాం. -
రిజిస్ట్రేషన్ శాఖకు ఉద్యమ సెగ
మార్కాపురం, న్యూస్‌లైన్: మార్కాపురం జిల్లా రిజిస్ట్రార్ పరిధిలో రిజిస్ట్రేషన్లు గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది భారీగా తగ్గిపోయాయి. దీని పరిధిలో మార్కాపురం, కంభం, గిద్దలూరు, యర్రగొండపాలెం, పొదిలి, దర్శి, కందుకూరు, అద్దంకి, కనిగిరి సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాలున్నాయి. గతేడాది నవంబర్ 30వ తేదీ నాటికి 27,053 రిజిస్ట్రేషన్లు జరిగి రూ. 28.42 కోట్ల ఆదాయం వచ్చింది. ఈ ఏడాది నవంబర్ నాటికి కేవలం 11,412 రిజిస్ట్రేషన్లు జరిగి రూ.12.55 కోట్ల ఆదాయం మాత్రమే సమకూరింది. సమైక్యాంధ్ర సమ్మె కారణంగా సెప్టెంబర్‌లో రిజిస్ట్రేషన్లు జరగలేదు. జరిగిన వాటిలో పొలం అమ్మకాలు, దాన దస్తావీజులు, బహుమతులు, పవర్ఆఫ్ అటార్నీ దస్తావీజులు ఎక్కువగా ఉన్నాయి. ఇవీ కారణాలు.. ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో సమైక్యాంధ్ర సమ్మెతో ఉద్యోగులందరూ కార్యాలయాలకు హాజరు కాకపోవడంతో రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి. ఇదే సమయంలో అకాల వర్షాల వల్ల పంట నష్టం జరగడంతో భూముల అమ్మకాలు, కొనుగోళ్లు ఆశించిన స్థాయిలో లేవు. ఇంకోవైపు రాష్ట్ర విభజన జరుగుతుందని, ఒంగోలు రాజధాని అయ్యే అవకాశాలున్నాయని వార్తలు వెలువడడంతో అమ్మకందారులు వెనక్కి తగ్గారు. తమ భూములను ఇంకా ఎక్కువ ధరకు అమ్మవచ్చనే ఉద్దేశం ఉండడంతో రియల్ ఎస్టేట్ రంగం ఆగిపోయింది. మార్కాపురం ప్రాంతంలో గతేడాది వివిధ సంస్థలు ప్రజల నుంచి అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేసి ఇవ్వకపోవడంతో రియల్ వ్యాపారం మందగించి స్తబ్ధత ఏర్పడింది. కొత్త రాజధాని నిర్ణయం, పంటలకు గిట్టుబాటు ధర వంటివి అమలైతే తప్ప రిజిస్ట్రేషన్ శాఖ మళ్లీ పుంజుకోదు. ఒంగోలు రాష్ట్ర రాజధాని అయ్యే అవకాశం ఉందన్న వార్తలు రావడంతో ఇటీవల కాలంలో పొదిలి, మార్కాపురం, కనిగిరి, దొనకొండ, దర్శి ప్రాంతాల్లో పలువురు ప్రముఖులు భూములు కొన్నప్పటికీ రిజిస్ట్రేషన్ చేయించుకోలేదు. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి నవంబర్ 30 వరకు 9 సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల్లో జరిగిన రిజిస్ట్రేషన్ల వివరాలిలా ఉన్నాయి.. నెల జరిగిన ఆదాయం రిజిస్ట్రేషన్లు ఏప్రిల్ - 1921- 2,14,28,890 మే - 2208 - 2,63,27,085 జూన్ - 2590 - 2,85,75,019 జూలై - 2123 - 2,13,74,880 ఆగస్టు - 701 - 8,89,95,607 సెప్టెంబర్ నిల్ అక్టోబర్ - 1869 - 1,88,29,558 నవంబర్ - 3455 - 4,46,56,843 -
14 నెలలుగా జీతాల్లేవ్..
మార్కాపురం, పెద్దారవీడు, న్యూస్‌లైన్: తహశీల్దార్ కార్యాలయాల్లో కీలక విధులు నిర్వర్తించే కంప్యూటర్ ఆపరేటర్లకు వేతనాలు అందక తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఇలా ఒక నెలో.. రెండు నెలలో కాదు. ఏకంగా 14 నెలల నుంచి ఇదే పరిస్థితి నెలకొనడంతో కుటుంబ పోషణ జరగక అప్పుల పాలవుతున్నారు. మార్కాపురం, కందుకూరు, ఒంగోలు రెవెన్యూ డివిజన్లలో 50 మండలాల్లోని తహశీల్దార్ కార్యాలయాల్లో ఈ దుస్థితి నెలకొంది. ప్రభుత్వం వీరిని అవుట్ సోర్సింగ్ విధానం ద్వారా నియమించింది. మండల పరిధిలోని నివాస, ఆదాయ, జనన, మరణ తదితర సర్టిఫికెట్లను కంప్యూటరీకరించి జారీ చేయాల్సిన పని వీరిదే. ఒక్కో కంప్యూటర్ ఆపరేటర్‌కు రూ 11,013 వేతనం నిర్ణయించారు. అయితే వివిధ పథకాల కింద వేతనంలో కొంత భాగం పోను రూ 8,400 చెల్లించాలి. వీరంతా తహశీల్దార్లతో సమానంగా విధులు నిర్వర్తిస్తున్నప్పటికీ అవుట్ సోర్సింగ్ విభాగం కావడంతోనే చిన్నచూపునకు గురవుతున్నారు. సుదీర్ఘ కాలంగా జీతాలు రాకపోయినప్పటికీ విధుల పట్ల ఏమాత్రం అశ్రద్ధ చూపకుండా కార్యాలయానికి ప్రతి రోజూ హాజరవుతున్నారు. అప్పులు తెచ్చుకొని పొట్ట నింపుకుంటున్నారు. ఇలా మొత్తం 50 మంది కంప్యూటర్ ఆపరేటర్లకు రూ 58.80 లక్షల బకాయిలు విడుదల కావాల్సి ఉంది. నిధులు విడుదల చేయాలి: శ్రీనివాస్: అవుట్ సోర్సింగ్ ఏజెన్సీ నిర్వాహకుడు తహశీల్దార్ కార్యాలయాల్లో పనిచేస్తున్న కంప్యూటర్ ఆపరేటర్లకు చాలా కాలంగా వేతనాలు విడుదల కాలేదు. ఒక నెలకు మాత్రమే జీతాలు విడుదల చేయడంతో జిల్లా రెవెన్యూ అధికారికి సమాచారం ఇచ్చాం. కొంత మంది ఆపరేటర్లు డ్యూటీ సర్టిఫికెట్లు ఇవ్వాలి. కొన్ని చోట్ల తహశీల్దార్లు బదిలీ కావడంతో సర్టిఫికెట్లు అందడంలేదు. నిధులు విడుదల అయితే అందరికీ బకాయిలతో కూడిన వేతనాలు అందిస్తాం. -
పడమటి పోరు
సాక్షి ప్రతినిధి, ఒంగోలు : జిల్లా టీడీపీలో ‘పడమటి పోరు’ పొడిచింది. మార్కాపురం, యర్రగొండపాలెం నేతల మధ్య విభేదాల మంట పుట్టింది. యర్రగొండపాలెం టికెట్టు ఆశిస్తున్న అజిత రావుకు మార్కాపురం ఎమ్మెల్యే కందుల ‘షరతులు’ విధించడం విభేదాల కుంపటి రగిల్చింది. దీనిపై భగ్గుమన్న అజిత రావు వర్గం పార్టీ అధినేత చంద్రబాబు వద్దకు విషయాన్ని తీసుకెళ్లింది. లోపాయికారీగా వ్యవహారాన్ని చక్కబెట్టకోవాలన్న పన్నాగం బెడిసికొట్టడంతో కందుల కస్సుమంటున్నారు. వ్యవహారం కాస్తా ‘వర్గ’పోరుగా రూపాంతరం చెందుతుండడం టీడీపీని కలవరపరుస్తోంది. తూర్పుప్రాంత నేతల విభేదాలతో ఇప్పటికే సతమతమవుతున్న టీడీపీకి తాజా ‘పశ్చిమ పోరు’ పుండుమీద కారంలా మారింది. షరతులకు అంగీకరిస్తేనే సహకారమన్న కందుల జిల్లాలో టీడీపీ ఏకైక ఎమ్మెల్యేగా ఉన్న కందుల నారాయణరెడ్డి రానున్న ఎన్నికల దృష్ట్యా ఇల్లు చక్కదిద్దుకునే పనిలో పడ్డారు. ఎన్నికల వనరుల సమీకరణకు సమాయత్తమయ్యారు. అందుకోసం పశ్చిమ ప్రాంతంలోని నియోజకవర్గాలపై కన్నేశారు. మొదటగా యర్రగొండపాలెం టికెట్టు ఆశిస్తున్న అజితరావు వర్గానికి వర్తమానం పంపారు. రానున్న ఎన్నికల్లో తన సహకారం ఉండాలంటే కొన్ని ‘షరతులు’ వర్తిస్తాయని అసలు విషయాన్ని చల్లగా చెప్పారు. ప్రధానంగా యర్రగొండపాలెం నియోజకవర్గంలో అధికంగా ఉన్న తమ వర్గం మద్దతు కావాలంటే షరతులకు అంగీకరించాల్సిందేనని తేల్చి చెప్పారు. పశ్చిమ ప్రాంతంలో పార్టీ తర ఫున పెద్దరికం తనదేనని, తన వర్గాన్ని అజిత అభ్యర్థిత్వానికి అనుకూలంగా కూడగట్టేందుకు ఆ మాత్రం ఖర్చవుతుందని అజిత రావు కుటుంబ సభ్యులకు కందుల స్పష్టం చేశారు. ససేమిరా అంటున్న అజిత వర్గం కందుల ఎంత సూటిగా ‘అసలు’ విషయాన్ని చెప్పారో... అజిత రావు వర్గం అంతే దీటుగా స్పందించింది. ఇదేమన్నా రాచరికమా... జమీందారీతనమా అన్నింటికీ కప్పం కట్టడానికంటూ కస్సుమంది. ఇటీవలే పంచాయతీ ఎన్నికల్లో కూడా ఇదే రీతిలో ‘షరతులకు’ లోబడి తాము ఆర్థికంగా ఇబ్బందులు పడ్డామని వాపోయింది. ఇక ఉపేక్షిస్తే ఎన్నికల నాటికి అసలు కంటే వడ్డీయే ఎక్కువయ్యేలా ఉందని గ్రహించింది. దీంతో విషయాన్ని పార్టీ అధినేత దృష్టికి తీసుకెళ్లింది. తమకు ఉన్న పరపతిని మొత్తం ఉపయోగించి అధికారికంగా ఉన్నత హోదాలో ఉన్న పెద్దల ద్వారా చంద్రబాబు వద్దే పంచాయితీ పెట్టింది. విషయం తీవ్రత గ్రహించిన చంద్రబాబు ఎమ్మెల్యే కందులను సున్నితంగానే మందలించినట్లు తెలుస్తోంది. త్వరలో తాను జిల్లాలో పర్యటించనున్న తరుణంలో ఇలాంటి ఇబ్బందులు ఎందుకు సృష్టిస్తారని అసహనం వ్యక్తం చేశారు. దీంతో కందుల వర్గం ప్రస్తుతానికి కాస్త వెనక్కి తగ్గింది. ఎత్తులు...పై ఎత్తులు ఏమాత్రం రాజకీయ ప్రాబల్యం లేని అజిత రావు అధినేత వద్ద తనను అవమానపరచడాన్ని ఎమ్మెల్యే కందుల జీర్ణించుకోలేకపోతున్నట్లు సమాచారం. ప్రస్తుతానికి తగ్గినట్లు కనిపిస్తున్నా యర్రగొండపాలెం నియోజకవర్గంలో అజిత రావుకు తన తడాఖా చూపించాలని కృతనిశ్చయంతో ఉన్నారు. ఈ మేరకు అప్పుడే కొందరితో మంతనాలు జరిపారు. వచ్చే ఎన్నికల్లో తమ వర్గం అజిత రావుకు సహాయనిరాకరణ చేసేలా పావులు కదుపుతున్నారు. కందుల వర్గం వ్యూహాత్మకంగా ఎదురుదాడికి దిగుతుండటంతో అజిత రావు వర్గం బిత్తరపోయింది. అధినేత వద్ద అయితే పెచైయ్యి సాధించింది కానీ నియోజకవర్గంలో కందుల వర్గాన్ని ఎదుర్కోలేక సతమతమవుతోంది. దీంతో కందులకు మార్కాపురంలో పొగ పెట్టాలని భావించింది. మార్కాపురంలో తమ వర్గానికి చెందినవారితో మంతనాలు సాగిస్తూ ఎమ్మెల్యే కందులకు వ్యతిరేకంగా అసమ్మతిని కూడగడుతోంది. ఎమ్మెల్యే కందుల వర్గం యర్రగొండపాలెంలో.. అజిత రావు వర్గం మార్కాపురంలో అసమ్మతి ప్రోత్సహిస్తున్నాయి. వీరి ఆధిపత్య పోరు వర్గపోరుగా రూపాంతరం చెందుతూ... విభేదాల పీటముడి బిగుసుకుంటోంది. రానున్న రోజుల్లో పశ్చిమాన టీడీపీలో ఇంటిపోరు మరింతగా రాజుకోనుందని స్పష్టమవుతోంది. -
మో‘డల్’ పాఠశాలలు
మార్కాపురం టౌన్, న్యూస్‌లైన్: విద్యార్థులకు మెరుగైన విద్యను అందించేందుకు ప్రభుత్వం కోట్లాది రూపాయలు వెచ్చించి ఆదర్శ పాఠశాలల(మోడల్ స్కూళ్లు)ను గతేడాది ప్రవేశపెట్టింది. విద్యా సంవత్సరం ఆరంభం నాటికి పాఠశాలల భవనాల నిర్మాణం అసంపూర్తిగానే ఉంది. అయినా ఈ భవనాల్లోనే తరగతులు ప్రారంభించారు. పాఠశాలకు ప్రిన్సిపాల్, పోస్టు గ్రాడ్యుయేట్, ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ల నియమించాలి. కాని పూర్తిస్థాయిలో సిబ్బందిని ఏర్పాటు చేయలేదు. దీంతో ఉన్న కొద్ది మంది టీచర్లే మిగలిన సబ్జెక్టులు బోధిస్తున్నారు. మరి కొన్ని సబ్జెక్టులకు విద్యార్థుల తల్లిదండ్రులే టీచర్లను నియమించి జీతాలు చెల్లిస్తున్నారు. అయినా విద్యాశాఖాధికారులు మాత్రం సౌకర్యాల కల్పనకు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. చాలీచాలని తరగతి గదులు మార్కాపురం మండలంలోని మిట్టమీదపల్లెలో ఈ ఏడాది మోడల్ స్కూల్‌ను ప్రారంభించారు. పాఠశాల్లో 6, 7, 8, ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థులు చేరారు. ఒక్కొక్క తరగతికి 80 మంది విద్యార్థులను తీసుకుని రెండు సెక్షన్లుగా విభజించాలి. 6, 7, 8 తరగతుల్లో 240 మందికిగానూ 225 మంది, ఇంటర్ మొదటి సంవత్సరంలో 80 మందికిగానూ 53 మంది చేరారు. ఒక్కో సెక్షన్‌కు 40 మంది విద్యార్థులను కేటాయించాల్సి ఉంది. కానీ టీచర్ల కొరతతో 75 మంది విద్యార్థులను ఒకే తరగతి గదిలో కూర్చోబెట్టి విద్యనందిస్తున్నారు. విద్యార్థులకు సరిపడా ఫర్నీచర్ లేకపోవడంతో కొందరు కిందే కూర్చొంటున్నారు. సిబ్బంది కొరత మోడల్ పాఠశాలకు ప్రిన్సిపాల్, 14 మంది పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్లు, ఆరుగురు ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్లను నియమించాలి. కానీ ఇప్పటి వరకు ప్రిన్సిపాల్, ఆరుగురు పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్లను మాత్రమే తీసుకున్నారు. దీంతో పాఠశాల్లోని పీడీ, ఇతర టీచర్లే మిగిలిన సబ్జెక్టులు బోధిస్తున్నారు. తల్లిదండ్రుల ఆర్థికసాయంతో టీచర్లకు జీతాలు ఇంటర్ మొదటి సంవత్సరం మ్యాథ్స్, జువాలజీ, సివిక్స్ సబ్జెక్టులకు టీచర్లు లేరు. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు ప్రైవేటు టీచర్లతో తమ పిల్లలకు పాఠాలు చెప్పించుకుంటున్నారు. ఈ టీచర్లకు తల్లిదండ్రులే జీతాలు అందిస్తున్నారు. దీంతోపాటు ప్రిన్సిపాల్ కూడా బోధన చేస్తున్నారు. సౌకర్యాలు నిల్ విద్యార్థులకు హాస్టల్ వసతి కల్పించాల్సి ఉంది. కానీ భవన నిర్మాణం పూర్తి కాకపోవడంతో విద్యార్థులు పట్టణంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ హాస్టల్స్‌లో ఉండి చదువు కొనసాగిస్తున్నారు. కొందరు ఇంటి వద్ద నుంచే పాఠశాలకు హాజరవుతున్నారు. పాఠశాలలో మంచినీటి వసతి లేదు. దీంతో విద్యార్థులు ఫ్లోరైడ్ నీటినే తాగుతున్నారు. మరి కొందరు ఇంటి వద్ద నుంచి బాటిళ్లలో నీళ్లు తెచ్చుకుంటున్నారు. ఇప్పటి వరకు పాఠశాలకు ల్యాబ్ సామగ్రి రాలేదు. దీంతో ప్రయోగశాలలు నిరుపయోగంగా మారాయి. త్వరలోనే భర్తీ చేస్తాం: వెంకటేశ్వరరెడ్డి, మోడల్ స్కూల్స్ ఇన్ చార్జి మోడల్ స్కూల్లో టీచర్ల కొరత రాష్ట్ర వ్యాప్తంగా ఉంది. మిట్టమీదపల్లెలో ఏర్పాటు చేసిన మోడల్ స్కూల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. విద్యాశాఖా మంత్రి నుంచి ఆదేశాలు వచ్చిన వెంటనే పీజీటీ, టీజీటీ పోస్టులను భర్తీ చేస్తాం. -
‘స్త్రీ శక్తి’పై చిన్న చూపు
మార్కాపురం, న్యూస్‌లైన్: స్త్రీ శక్తి భవనాలు నిర్లక్ష్యపు నీడలో మగ్గిపోతున్నాయి. నిధులు మంజూరైనా అధికారుల నిర్లక్ష్యంతో శంకుస్థాపనలకే పరిమితమయ్యాయి. మార్కాపురం నియోజకవర్గంలోని మార్కాపురం, కొనకనమిట్ల, తర్లుపాడు, పొదిలి, యర్రగొండపాలెం నియోజకవర్గంలోని యర్రగొండపాలెం, పెద్దారవీడు, పెద్దదోర్నాల, త్రిపురాంతకం, పుల్లలచెరువు, గిద్దలూరు నియోజకవర్గంలోని గిద్దలూరు, రాచర్ల, కొమరోలు, బేస్తవారిపేట, కంభం, అర్ధవీడు మండల కేంద్రాలకు స్త్రీ శక్తి భవనాలను నిర్మించాలని ప్రభుత్వం 2011లో ఉత్తర్వులు జారీ చేయగా ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు హడావుడిగా శంకుస్థాపన చేశారు. మార్కాపురం, గిద్దలూరు నియోజకవర్గాల్లో ఒక్క స్త్రీ శక్తి భవనం కూడా నిర్మాణ దశలో లేదు. యర్రగొండపాలెం నియోజకవర్గంలోని పెద్దారవీడు, పెద్దదోర్నాల, పుల్లలచెరువు మండలాల్లో మాత్రమే భవన నిర్మాణ పనులు జరుగుతున్నాయి. మిగిలిన 12 మండలాల్లో భవన నిర్మాణాలు శంకుస్థాపనకే పరిమితమయ్యాయి. ఐకేపీ, డీఆర్డీఏ శాఖల్లోని మహిళలు, పొదుపు గ్రూపు సభ్యులు, మండల సమాఖ్య కోసం స్త్రీ శక్తి భవనాలను ప్రభుత్వం కేటాయించింది. ప్రస్తుతం 15 మండలాల్లో అద్దె భవనాల్లో సమాఖ్య కార్యకలాపాలు సాగుతున్నాయి. మహిళలు తాము చేపట్టబోయే కార్యక్రమాలపై చర్చించేందుకు, రికార్డులను భద్రపరుచుకునేందుకు, మహిళా సమాఖ్య కార్యాలయం కోసం స్త్రీ శక్తి భవనాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్దేశించింది. ఆచరణలో విఫలం కావడంతో ప్రభుత్వ లక్ష్యం నెరవేరడం లేదు. అధికారులు దగ్గరుండి ఈ నిర్మాణాలను చేపట్టాలి. మహాత్మగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా భవన నిర్మాణాలు చేపట్టాల్సి రావడంతో అధికారులు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. గతంలో పాలకవర్గాలు లేక భవన నిర్మాణాలపై ప్రజాప్రతినిధులు సైతం దృష్టి పెట్టలేదు. ప్రభుత్వం నిర్దేశించిన సమయం మించి పోవడంతో భవన నిర్మాణాలు ప్రశ్నార్థకంగా మారాయి. 15 మండలాల్లో ప్రస్తుతం స్త్రీ శక్తి కార్యాలయాలు అద్దె భవనాల్లో సాగుతున్నాయి. ఒక్కొక్క భవనానికి సుమారు రూ 2 నుంచి రూ 3 వేల వరకు అధికారులు అద్దెలు చెల్లిస్తున్నారు. గడువు ముగిసింది: వెంకటేశ్వర్లు, పంచాయతీరాజ్ ఈఈ, మార్కాపురం మార్కాపురం, కందుకూరు డివిజన్లలోని 15 మండలాల్లో స్త్రీ శక్తి భవనాలు మంజూరయ్యాయి. వీటిని గత ఏడాది మే 4వ తేదీ నాటికి నిర్మించాల్సి ఉంది. మహాత్మ గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా నిర్మించాలి. మూడు మండలాల్లో మాత్రమే భవన నిర్మాణ పనులు జరుగుతున్నాయి. మిగిలిన చోట్ల నిర్మాణాలు ప్రారంభం కాలేదు. -
మర్కాపురంలో రెండు భారీ అగ్నిప్రమాదాలు
మార్కాపురం : ప్రకాశం జిల్లాలోని మార్కాపురంలో రెండు భారీ అగ్నిప్రమాదాలు సంభవించాయి. దీపావళీ తారాజువ్వలు ఎగసిపడి గుడి గోపురానికే ఎసరు తెచ్చాయి. లక్ష్మీ చెన్నకేశవస్వామి ఆలయంలోని గాలిగోపురంకు మరమ్మత్తులు చేస్తున్నారు. గోపురం పై భాగాన్ని ప్లాస్టిక్ షీట్లతో కప్పి ఉంచారు. నిన్న రాత్రి రయ్యుమంటూ ఓ తారాజువ్వు దూసుకొచ్చి గోపురం పై పడింది. గోపురం పై ఉన్న ప్లాస్టిక్ కవర్‌కు మంటలు అంటుకున్నాయి. అగ్నిమాపక సిబ్బంది సకాలంలో స్పందించి మంటలను అదుపులోకి తెచ్చారు. మరోవైపు పట్టణంలోని నాయుడువీధిలోని రేణుక హోంనీడ్స్ దుకాణంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో దుకాణంలో వస్తువులు కాలి బూడిద అయ్యాయి. సుమారు రూ. 50 లక్షల విలువైన వస్తులు అగ్నికి ఆహుతి అయినట్లు సమచారం. -
‘మరుగు’న పడ్డాయి
మార్కాపురం, న్యూస్‌లైన్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా అమలు చేస్తున్న నిర్మల్ భారత్ అభియాన్(వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణ పథకం) ముందుకు సాగడం లేదు. మహిళల ఆత్మగౌరవాన్ని నిలబెడతామంటూ గొప్పలు చెప్పుకుంటున్న ప్రభుత్వం ఆచరణలో శ్రద్ధ చూపడం లేదు. నిధులున్నప్పటికీ క్షేత్రస్థాయిలో తగిన ప్రచారం లేకపోవడం, ఇచ్చే నిధుల కంటే నిర్మాణ వ్యయం ఎక్కువ కావడం, ఉపాధి హామీ పథకానికి లింక్ పెట్టి జాబ్‌కార్డు ఉంటేనే నిధులిస్తామని చెప్పడం, నిర్మించిన వాటికి నిధులు ఇవ్వకపోవడంతో పథకం అమలు అధ్వానంగా మారింది. కలెక్టర్ ప్రతిష్టాత్మకంగా తీసుకుని అధికారులను పరుగులు పెట్టిస్తున్నప్పటికీ లక్ష్య సాధన కష్టమైంది. నిధులుండి కూడా లబ్ధిదారులకు సకాలంలో ఉపాధి హామీ సిబ్బంది నిధులు చెల్లించకపోవడంతో మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టేందుకు ఆసక్తి చూపడం లేదు. ఈ పథకంలో నిర్మించుకునే మరుగుదొడ్డికి 10,200 కాగా, కేంద్రం 4,800, రాష్ట్ర ప్రభుత్వం 4,500, లబ్ధిదారుని వాటాగా 900 నిర్ణయించారు. తెల్లరేషన్ కార్డు ఉండి ఉపాధి హామీ పథకంలో జాబ్ కార్డు ఉన్నట్లయితే నగదును ప్రభుత్వం దశలవారీగా లబ్ధిదారునికి అందజేస్తుంది. వీటి బాధ్యతను ప్రత్యేకంగా ఉపాధి హామీ పథకం సిబ్బందికి కేటాయించారు. జిల్లా వ్యాప్తంగా అక్టోబర్ 30వ తేదీ నాటికి 56 మండలాల్లో 2,01,982 వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం పూర్తి చేయాల్సి ఉండగా 62,225 పూర్తయ్యాయి. 50,432 నిర్మాణాలు వివిధ దశల్లో ఉన్నాయి. అర్ధవీడులో 3602కు గానూ 1422, బేస్తవారిపేటలో 4084కు గానూ 1568, దర్శిలో 5157కు గానూ 1423, దోర్నాలలో 4065కు గానూ 1235, గిద్దలూరులో 4012కు గానూ 1563, కొనకనమిట్లలో 5306కుగానూ 1060, మార్కాపురంలో 3529కు గానూ 1127, పెద్దారవీడులో 4483కుగానూ 1417, పొదిలిలో 4255కు 1425, పుల్లలచెరువులో 3576కు 1466, రాచర్లలో 2779కు 915, తర్లుపాడులో 3317కు 1027, యర్రగొండపాలెంలో 4729కి 1521 మరుగుదొడ్ల నిర్మాణం పూర్తయ్యాయి. జిల్లా అధికారులు ఈ పథకాన్ని జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంతో కలిపి కేంద్రం అమలు చేస్తున్న నిర్మల్ భారత్ అభియాన్ కింద నిధులను అందిస్తున్నారు. నిబంధనల ప్రకారమే ఒక్కొక్క మరుగుదొడ్డి నిర్మాణానికి * 12,500 ఖర్చవుతుంది. నిర్మాణ వ్యయం ఎక్కువ కావడం, ప్రభుత్వం ఇచ్చే నిధులు తక్కువ కావడంతో మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టేందుకు లబ్ధిదారులు ఆసక్తి చూపడం లేదు. గ్రామస్థాయికి వెళ్లి నిర్మాణంలో ఉన్న సమస్యలపై అధికారులు తెలుసుకోకుండా తమకు లక్ష్యాలు కేటాయించి ఎందుకు పూర్తి చేయలేదంటూ చిర్రుబుర్రులాడటంపై కిందిస్థాయి సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రెండు నెలల నుంచి మార్కాపురం ప్రాంతంలో ఈ పథకం కింద నిర్మించుకున్న మరుగుదొడ్ల బిల్లులు చెల్లించకపోవడంతో కొత్తగా నిర్మించేందుకు లబ్ధిదారులు ముందుకు రావడం లేదు. మొదటి దశలో గుంత తీసినందుకు, రెండో దశలో రింగ్‌లు వేసినందుకు, ఆ తరువాత నిర్మాణం పూర్తి కాగానే లబ్ధిదారులకు నిధులు చెల్లిస్తారు. మొత్తం మీద వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం నిదానంగా సాగుతోంది. పూర్తయినా బిల్లులు రాలేదు కాశీరత్తమ్మ, జమ్మనపల్లి, మార్కాపురం మండలం వ్యక్తిగత మరుగుదొడ్డి నిర్మించుకుని రెండు నెలలైంది. బిల్లులు రాలేదు. అధికారులను అడిగితే ఇస్తామని చెబుతున్నారు. మా గ్రామంలో మరుగుదొడ్లు నిర్మించుకుని బిల్లులు రాని వారు సుమారు 20మంది వరకు ఉన్నారు. వెన్నా రమణారెడ్డి, బొర్రయ్యలు మరుగుదొడ్లు నిర్మించుకున్నా బిల్లులు రాలేదు. వారంలో చెల్లిస్తాం పోలప్ప, డ్వామా ప్రాజెక్టు డెరైక్టర్ వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణంలో బిల్లుల చెల్లింపులో కొద్దిగా జాప్యం జరిగింది. పోస్టాఫీసు ఖాతాల ద్వారా లబ్ధిదారులకు వారం రోజుల్లో నిధులను చెల్లిస్తాం. పోస్టల్ అధికారులతో మాట్లాడాం. ఆందోళన చెందాల్సిన పని లేదు. -
వానొస్తే వనవాసమే
మార్కాపురం, న్యూస్‌లైన్: పూలసుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు ముంపు గ్రామాల్లోని ప్రజల పునరావాసంపై అధికారులు తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నారు. వర్షం వచ్చిందంటే స్థానికులు భయంభయంగా కాలం గడుపుతున్నారు. మార్కాపురం, పెద్దారవీడు, అర్ధవీడు మండలాల్లోని గొట్టిపడియ, అక్కచెరువు, సుంకేసుల డ్యామ్ కింద చింతలముడిపి, సుంకేసుల, కాటంరాజు తండా, కలనూతల, గుండంచర్ల, కాకర్ల డ్యామ్ కింద సాయినగర్, లక్ష్మీపురం, కాకర్ల తదితర గ్రామాలన్నీ ముంపు గ్రామాలుగా ప్రభుత్వం ప్రకటించింది. ఆర్ఆర్ ప్యాకేజీ కింద వీరిలో కొందరి గృహాలకు, పొలాలకు ప్రభుత్వం నష్టపరిహారం ఇచ్చి చేతులు దులుపుకుంది. పునరావాసం కల్పించే విషయంలో ఆరేళ్లుగా అదిగో, ఇదిగో అంటూ అధికారులు కాలం గడుపుతున్నారు. పునరావాస కాలనీలు నిర్మించాల్సిన స్థలాలు కోర్టు కేసుల్లో ఉన్నాయన్న కారణంతో వాటి గురించి పట్టించుకోవడం లేదు. కనీసం ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై కూడా దృష్టి పెట్టడం లేదు. ఇటీవల కురిసిన వర్షాలకు గొట్టిపడియ, కాకర్ల డ్యామ్‌లకు నీరు చేరడంతో గ్రామాలు మునిగిపోతాయనే ఆందోళన నెలకొంది. అక్కచెరువు, గొట్టిపడియ, కాకర్ల గ్రామాల ప్రజలు నాలుగు రోజుల పాటు బిక్కుబిక్కుమంటూ కాలం గడిపారు. గొట్టిపడియ, అక్కచెరువులో 900 కుటుంబాలున్నాయి. చింతలముడిపి, కాటంరాజు తండాల్లో 56 గృహాల్లో 72 కుటుంబాలు, సుంకేసులలో 1139 గృహాల్లో 1552 కుటుంబాలు, కలనూతలలో 514 గృహాల్లో 620 కుటుంబాలు, గుండంచర్లలో 237 గృహాల్లో 700 కుటుంబాలు, కాకర్ల డ్యామ్ పరిధిలో 140 గృహాల్లో 210 కుటుంబాలు నివసిస్తున్నాయి. గొట్టిపడియలో రెండు వర్గాల ప్రజలుండగా, ఒక వర్గం వారు అల్లూరిపోలేరమ్మ దేవాలయం వద్ద, మరో వర్గం వారు కోమటికుంట వద్ద పునరావాస కాలనీలు ఏర్పాటు చేయాలని కోరారు. సుంకేసుల డ్యామ్ కింద సుంకేసులలో కొంత మంది గ్రామస్తులు గోగులదిన్నె వద్ద, తోకపల్లె వద్ద పునరావాస కాలనీలు కావాలని కోరారు. కలనూతల గ్రామస్తుల్లో కొంత మందికి మార్కాపురం మండలంలోని ఇడుపూరులో పునరావాస కాలనీ ఏర్పాటు చేసుకునేందుకు అధికారులు నిర్ణయించారు. గుండంచర్ల గ్రామస్తుల కోసం దేవరాజుగట్టు వద్ద భూములను పరిశీలించారు. ఇలా వివిధ ప్రాంతాల్లో అధికారులు పునరావాస కాలనీలకు స్థలాలు చూడగా కొన్ని ప్రాంతాల్లో రైతులు తమ పొలాలను సేకరణ కింద తీసుకోవద్దని కోర్టుకు వెళ్లటంతో పెండింగ్ లో ఉన్నాయి. గత వారం గొట్టిపడియ, కాకర్ల డ్యామ్‌లకు కొద్దిపాటి నీరు చేరడంతో మూడు రోజుల పాటు ఈ గ్రామాలకు బాహ్యప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. ఏ క్షణంలో వరద ముంచుతుందోనన్న ఆందోళన ఏర్పడింది. గొట్టిపడియ, కాకర్ల డ్యామ్‌లకు ఇప్పటికీ వరదనీరు ఉంది. ఈ గ్యాప్‌లను నల్లమల సాగర్‌గా పిలుస్తారు. భవిష్యత్‌లో భారీ వర్షాలు కురిస్తే తమ గతి ఏమిటని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. అటు స్వగ్రామాలను వదలి బయటకు రాలేక, ఇటు ప్రభుత్వం పునరావాసం కల్పించక దిక్కుతోచని స్థితిలో కొండ కోనల్లో కాలం గడుపుతున్నారు. పునరావాస ప్యాకేజి కింద తమకు త్వరగా కాలనీలు కట్టించి ఇవ్వాలని కోరుతున్నారు. -
10మంది జలసమాధి?
మార్కాపురం, పెద్దారవీడు, న్యూస్‌లైన్ : వేగంగా వస్తున్న లారీ.. ఆటోను ఢీకొని చెరువులో బోల్తాపడటంతో పది మంది అక్కడికక్కడే జల సమాధికాగా ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ఎనిమిది మంది మృతదేహాలను గుర్తించారు. ఇద్దరి ఆచూకీ అర్ధరాత్రి వరకు తెలియరాలేదు. ఈ సంఘటన పెద్దారవీడు మండలం గొబ్బూరు చెరువు వద్ద శనివారం రాత్రి 8 గంటల సమయంలో జరిగింది. రాత్రి 11గంటల సమయానికి ఏడు మృతదేహాలను పోలీసులు అత్యంత కష్టం మీద బయటకు తీశారు. అందిన సమాచారం ప్రకారం.. గుంటూరు జిల్లా దాచేపల్లి నుంచి సిమెంట్ లోడుతో లారీ కంభం వైపు వెళ్తోంది. దాచేపల్లి వద్ద మార్కాపురం మండలం చింతగుంట్ల గ్రామానికి చెందిన తొమ్మిది మంది కూలీలు తమ స్వగ్రామం వెళ్లేందుకు లారీపైకి ఎక్కారు. యర్రగొండపాలెంలో పెద్దారవీడు మండలం కలనూతలకు చెందిన ముగ్గురు మిర్చి నారుతో లారీ ఎక్కారు. లారీ గొబ్బూరు వద్దకు రాగానే ఎదురుగా రోడ్డుకు అడ్డంగా వచ్చిన ఆటోను ఢీకొని ఆ పక్కనే ఉన్న చెరువులోకి బోల్తా కొట్టింది. రోడ్డున వెళ్లే ప్రయాణికులు గొబ్బూరు గ్రామస్తులు, పెద్దారవీడు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. రాత్రి 11గంటల సమయానికి 3జేసీబీల సహాయంతో లారీని పైకి లేపి చెరువులో ఉన్న కలనూతల గ్రామానికి చెందిన శీలం శ్రీనివాసరెడ్డి(60), చింతగుంట్ల గ్రామానికి చెందిన ఎనిబెర చెన్నయ్య (45), బరిగెల రాజయ్య (4), ఎనిబెర మరియమ్మ (35), బరిగెల నడిపయ్య (45), ఎనిబెర ధర్మయ్య (6), పెద్దారవీడుకు చెందిన ఆళ్ల వెంకటేశ్వరరెడ్డి (50), పాండు రంగారెడ్డి(45)ల మృతదేహాలను బయటకు తీశారు. చింతగుంట్ల గ్రామానికి చెందిన రాయల శారమ్మ, దయామణిలు కొన ఊపిరితో ఉండగా హుటాహుటిన వైద్యశాలకు తరలించారు. మార్కాపురం డీఎస్పీ జి.రామాంజనేయులు, సీఐలు ఎ.శివరామకృష్ణారెడ్డి, పాపారావు, ఎస్సైలు దాసరి ప్రసాద్, ఎ.రాజమోహనరావు, త్రిపురాంతకం ఎస్సై శ్రీనివాసరావు, స్పెషల్ పార్టీ పోలీసులు, గ్రామస్తులు సహాయక చర్యలు చేపట్టారు. రాత్రి వేళ కావటంతో పాటు ఇటీవల కురిసిన వర్షాలకు చెరువులో నీరు అధికంగా ఉండటంతో మృతదేహాల వెలికితీతకు ఆలస్యమైంది. ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్ పరారీలో ఉన్నాడు. గాయపడిన ఆటో డ్రైవర్‌ను వైద్యశాలకు తరలించారు. -
బోల్తాపడిన సిమెంట్ లారీ: ఏడుగురి మృతి
మార్కాపురం: సిమెంట్ లోడుతో వెళుతున్న లారీ చెరువులోకి దూసుకుపోవడంతో ఏడుగురు మృతి చెందిన ఘటన ప్రకాశం జిల్లాలోని పెద్దవీరాడు మండలంలో శనివారం సంభవించింది. ఎదురుగా వస్తున్న ఓ ఆటోను తప్పించే క్రమంలో ఈ దర్ఘటన చోటు చేసుకుంది. మాచర్ల నుంచి బెంగుళూరు కు సిమెంట్ లోడుతో వెళుతున్నలారీ గోబ్బార చెరువులోకి దూసుకుపోయింది. లారీలో పది మంది ప్రయాణిస్తుండగా ఏడుగురు ప్రాణాలు కోల్పాయారు. ఇప్పటివరకూ చనిపోయిన వారి మృతదేహాలను వెలికితీసామని డీఎస్పీ తెలిపారు. కాగా, ఇంకా ఆచూకీ దొరికని వారి కోసం గాలిస్తున్నామన్నారు. ఈ ప్రమాదంలో ఇద్దరు మహిళలు గాయపడ్డారని, వారిని స్థానిక ఆస్పత్రిలో చేర్చి చికత్స అందిస్తున్నామన్నారు.