గెలుపోటములు సమానంగా స్వీకరించాలి | to receive loss and victories equally | Sakshi
Sakshi News home page

గెలుపోటములు సమానంగా స్వీకరించాలి

Published Sun, Dec 29 2013 4:57 AM | Last Updated on Sat, Sep 2 2017 2:04 AM

క్రీడాకారులు గెలుపోటములను సమానంగా స్వీకరించాలని యర్రగొండపాలెం ఎమ్మెల్యే ఆదిమూలపు సురేశ్ సూచించారు.

మార్కాపురం, న్యూస్‌లైన్ : క్రీడాకారులు గెలుపోటములను సమానంగా స్వీకరించాలని యర్రగొండపాలెం ఎమ్మెల్యే ఆదిమూలపు సురేశ్ సూచిం చారు. స్థానిక ఆఫీసర్స్ క్లబ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి షటిల్  బ్యాడ్మింటన్‌పోటీలను శనివారం రాత్రి 8 గంట లకు ఆర్డీఓ సత్యనారాయణ, డీఎస్పీ రామాంజనేయులు, మాజీ ఎమ్మెల్యేలు జంకె వెంకటరెడ్డి, కేపీ కొండారెడ్డితో కలిసి ఆయన ప్రారంభించారు.  ఎమ్మెల్యే మాట్లాడుతూ విద్యార్థులు క్రీడలకు ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు. మానసిక, శారీరక వృద్ధికి క్రీడలు ఉపయోగపడతాయని మాజీ ఎమ్మెల్యే, వైఎస్‌ఆర్ సీపీ సమన్వయకర్త జంకె వెంకటరెడ్డి అన్నారు.

జిల్లా స్థాయి పోటీలను మార్కాపురంలో నిర్వహించటం అభినందనీయమని మాజీ ఎమ్మెల్యే కేపీ కొండారెడ్డి అన్నారు. అనంతరం రిటైర్డు పశువైద్యాధికారి ఎల్‌వీ నారాయణరెడ్డిని సన్మానించారు. ఈ సందర్భంగా రెడ్డి మహిళా కళాశాల ప్రిన్సిపాల్ రంగారెడ్డి, బ్యాడ్మిం టన్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి రవికిరణ్, డాక్టర్ మోహన్‌రావు, జంకె లక్ష్మీరెడ్డి, తహసీల్దార్ సత్యనారాయణ మాట్లాడారు. జిల్లా నుంచి 100 టీమ్‌లు పాల్గొన్నాయి. ప్రథమ బహుమతిగా * 10,116, ద్వితీయ బహుమతి * 5,116, తృతీయ బహుమతి 3,116, చతుర్థ బహుమతి *2,116 అందిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement