ఐదేళ్లుగా ఆ పాపకు.. పాలు, నీళ్లే ఆహారం | A baby born without a large intestine | Sakshi

ఐదేళ్లుగా ఆ పాపకు.. పాలు, నీళ్లే ఆహారం

Jan 30 2025 5:44 AM | Updated on Jan 30 2025 7:36 PM

A baby born without a large intestine

10 లక్షల మందిలో ఒకరికి వచ్చే అరుదైన వ్యాధి

పెద్దపేగు లేకుండా జననం

మార్కాపురం: అన్న ప్రాసన రోజు అందరిలాగే తమ చిన్నారికి సంతోషంగా అన్నంపెట్టారు ఆ దంపతులు. వెంటనే వాంతి (Vomiting) చేసుకుంది. తల్లిదండ్రులు తేలిగ్గా తీసుకున్నారు. మరుసటిరోజూ అన్నం పెట్టారు. మళ్లీ అదే పరిస్ధితి. ఇలా ఒక నెలరోజులు జరిగే సరికి తల్లిదండ్రుల్లో ఆందోళన మొదలైంది. పలు కార్పొరేట్‌ వైద్యశాలలను సంప్రదిస్తే ప్రతి 10 లక్షల మందిలో ఒకరికి మాత్రమే వచ్చే అరుదైన వ్యాధి (Rare Disease) సోకిందని వైద్యులు చెప్పారు. 

అన్నవాహిక, పెద్దపేగు మూసుకుపోవ­డంతో ఏం తిన్నా వాంతులు అవుతున్నాయని చెప్పారు. పాలు.. నీళ్లు మాత్రమే తాగించాలని వైద్యులు చెప్పడంతో, ఆ చిన్నారి గత ఐదేళ్ల నుంచి పాలు, నీళ్లతోనే బతుకుతోంది. రెక్కాడితేకానీ డొక్కాడని కుటుంబం వారిది. ప్రకాశం జిల్లా, మార్కాపురం పట్టణంలోని జార్జిఫా­ర్మసీ కళాశాల వెనుక ఉండే మంచా భాస్క­ర్, కృష్ణవేణి దంప­తుల కన్నీటి వ్యధ ఇది. 

మార్కాపురం (Markapuram) పట్టణంలోనే ఒక ఆసుపత్రిలో భాస్కర్‌ కాంపౌండ­ర్‌గా పని­చే­స్తు­­న్నాడు. పాపకు ర­క్ష­ణ అనే పేరును పె­ట్టుకున్నా, ఆమె ప్రా­ణాలకు రక్షణ కల్పించలేని దీనస్థితిలో ఉన్న ఆ దంపతులు దాతల దయ కోసం ఎదురు చూస్తున్నారు. 

రూ.8 లక్షలు ఖర్చవుతుందన్నారు...
ప్రస్తుతం మా చిన్నారి అంగన్‌వాడీ పాఠశాలకు వెళు­తోంది. ఆపరేషన్‌ చేస్తే ఇ­బ్బంది తొలగు­తుందని వై­ద్యులు చెప్పారు. అయితే అందుకు సుమారు రూ.8 లక్షలు ఖర్చవుతుందని తెలిపారు. పాప వైద్యం నిమిత్తం ప్రతి 2 నెలలకు ఒకసారి రాజమండ్రికి వెళ్లి రూ.25 వేలు ఖర్చుపెట్టుకుని వస్తున్నాం. దాతలు స్పందించి వైద్యానికి ఆర్ధిక సాయం అందించి ఆదుకోవాలని  వేడుకుంటున్నాం. స్పందించే దాతలు 83743 89936 నంబరుకు సాయం చేయాలని కోరుతున్నాం.  
– భాస్కర్, రక్షణ తండ్రి 

చ‌ద‌వండి: పసికందుకు హెల్త్‌ ప్రాబ్లమ్‌.. పూడ్చిపెట్టడానికి తల్లిదండ్రుల యత్నం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement