సాక్షి, ప్రకాశం: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితోనే ఏపీకి భవిష్యత్తని మంత్రి ఆదిమూలపు సురేష్ పేర్కొన్నారు. గత ప్రభుత్వం ఓట్ల కోసమే వెనుకబడిన వర్గాలను వాడుకుందని విమర్శించారు. సీఎం జగన్ పాలనలోనే సామాజిక న్యాయం జరిగిందన్నారు. అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందించిన గొప్పనాయకుడు సీఎం జగన్ అని ప్రశంసించారు. నాలుగున్నరేళ్లుగా జరిగిన సంక్షేమాన్ని ప్రజలకు వివరిస్తున్నామని తెలిపారు.
ప్రకశం జిల్లా మార్కాపురంలో సోమవారం ఎమ్మెల్యే కుందూరు నాగార్జునరెడ్డి ఆధ్వర్యంలో వైఎస్సార్‌సీపీ బస్సుయాత్ర నిర్వహించారు. 3 గంటలకు కార్యకర్తలతో కలసి పార్టీ నేతల పాదయాత్ర ప్రారంభం కాగా.. పిల్లల పార్కు మీదుగా కంభం సెంటర్ వరకు కొనసాగింది, సాయంత్రం 4:30కి వైఎస్సార్ విగ్రహం వద్ద బహిరంగ సభ నిర్వహించారు. ఈ సమావేశానికి నేతలు ఎంపీ విజయసాయిరెడ్డి, మంత్రి ఆదిమూలపు సురేష్, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ తదితరులు హాజరయ్యారు.
అంతకముందు మంత్రి ఆదిమూలపు సురేష్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. సామాజిక సాధికార యాత్రకు భారీగా ప్రజా స్పందన వస్తుందన్నారు. వెనకబడిన వర్గాల నష్టాన్ని, ఇబ్బందలును గుర్తుంచి సీఎం వైఎస్ జగన్ అందుకుంటున్నారని తెలిపారు. గ్రామాలలో గొప్ప సంస్కరణలు తెచ్చిన నాయకుడు వైఎస్ జగన్ అని ప్రశంసించారు. అనారోగ్యం పేరు చెప్పి, జైలు నుంచి బయటకు వచ్చి చంద్రబాబు విజయోత్సవ ర్యాలీ చేసుకోవడం దారుణమని అన్నారు. జగనన్న పాలనలో రాష్ట్రంలో భారీగా మెడికల్ కాలేజీలు మంజూరు అయ్యాయని తెలిపారు.
‘గతంలో చంద్రబాబు 600కు పైగా హామీలిచ్చి ఏదీ నెరవేర్చలేదు. మోసం చేసేందుకు మళ్లీ వస్తున్న దొంగల ముఠాకు ప్రజలు బుద్ధి చెబుతారు. పేదలకు అండగా నిలిచిన గొప్ప నాయకుడు సీఎం జగన్.అవినీతికి తావు లేకుండా సంక్షేమ పథకాలు అందుతున్నాయి. ప్రజలను చంద్రబాబు ఏ రోజూ పట్టించుకోలేదు. అనారోగ్యం పేరుతో చంద్రబాబు బెయిల్ తెచ్చకున్నారు. తీరా బయటకొచ్చాక ఆయనకు ఆరోగ్యం బాగానే ఉంది. అనార్యోగ్యంగా ఉందని చెప్పి చంద్రబాబు ర్యాలీ చేశారు.’ అని మంత్రి ఆదిమూలపు మండిపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment