కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ యువకుడు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన మండలంలోని దరిమడుగులో బుధవారం వెలుగు చూసింది.
కుటుంబ కలహాలే కారణం
మార్కాపురం రూరల్ : కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ యువకుడు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన మండలంలోని దరిమడుగులో బుధవారం వెలుగు చూసింది. పోలీసుల కథన ప్రకారం.. మద్దిపాడు మండలం మల్లవరానికి చెందిన ఏకాంబరం వెంకట్రావ్ (32) వృత్తిరీత్యా మెకానిక్. మార్కాపురం పట్టణంలోని ట్రాక్టర్ షోరూంలో మెకానిక్‌గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు.
రెండేళ్ల నుంచి దరిమడుగులో ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్నాడు. భార్య కవిత, కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఆమె పుట్టిల్లు కూడా మల్లవరమే. ఈ నేపథ్యంలో దంపతుల మధ్య చిన్నపాటు గొడవ జరిగింది. భార్య అలిగి పిల్లలతో కలిసి పుట్టింటికి వెళ్లింది. తీవ్ర మనస్తాపం చెందిన వెంకట్రావ్ మంగళవారం రాత్రి ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
ఇంటి తలుపులు తెరిచి ఉండటంతో స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. ఏఎస్‌ఐ డేవిడ్‌రాజు సంఘటన స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తునట్లు ఆయన తెలిపారు. సంఘటన స్థలానికి స్థానికులు పెద్ద ఎత్తున చేరుకున్నారు.