
సాక్షి, విశాఖపట్నం/మార్కాపురం: సూర్యప్రతాపం రోజురోజుకు విజృంభిస్తోంది. ప్రకాశం జిల్లా మార్కాపురంలో గురువారం 48 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది.
రానున్న కొద్దిరోజులు రాష్ట్రంలో పరిస్థితి నిప్పులు చెరిగే పగళ్లు.. వేడిని వెదజల్లే రాత్రుళ్లు ఉండనుంది. కొన్ని ప్రాంతాల్లో పగటివేళ సాధారణంకంటే 4–7 డిగ్రీలు, రాత్రిపూట 3–6 డిగ్రీలు అధికంగా నమోదయ్యే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.