Highest temperatures
-
52.9 డిగ్రీలు.. నిజమేనా!?
సాక్షి, న్యూఢిల్లీ: ఉత్తరాదిలో ఎండల తీవ్రత నానాటికీ పెరుగుతోంది. బుధవారం రాజస్తాన్‌లో పలుచోట్ల ఉష్ణోగ్రత 50 డిగ్రీలు దాటేసింది. పాకిస్తాన్ మీదుగా అక్కడి నుంచి వీస్తున్న తీవ్రమైన వేడి గాలులతో దేశ రాజధాని అల్లాడుతోంది. దాంతో వరుసగా రెండో రోజు అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఆ క్రమంలో ఢిల్లీ సమీపంలోని ముంగేశ్‌పూర్‌లో దేశ చరిత్రలోనే అత్యధిక ఉష్ణోగ్రత నమోదైందంటూ వచి్చన వార్తలు కలకలం రేపాయి. మధ్యాహ్నం 2.30 సమయంలో అక్కడ 52.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్టు భారత వాతావరణ శాఖ ప్రాంతీయ డైరెక్టర్ కుల్దీప్ శ్రీవాస్తవ పేర్కొన్నారు. మన దేశంలో రాజస్తాన్ సహా ఏ రాష్ట్రంలోనూ ఇప్పటిదాకా ఇంతటి ఉష్ణోగ్రతలు నమోదవలేదు. అయితే 52.9 డిగ్రీలన్నది అధికారికంగా నిర్ధారణ కాలేదని కేంద్ర మంత్రి కిరణ్ రిజజు స్పష్టం చేశారు. ‘‘ఢిల్లీలో అంత ఉష్ణోగ్రత నమోదైందంటే నమ్మశక్యంగా లేదు. వాస్తవమేమిటో తెలుసుకోవాలని ఐఎండీ అధికారులకు సూచించాం. దీనిపై త్వరలో స్పష్టత వస్తుంది’’ అంటూ ‘ఎక్స్’లో పోస్టు చేశారు. దాంతో నిజానిజాలను పరిశీలిస్తున్నట్టు ఐఎండీ డైరెక్టర్ జనరల్ ఎం.మహాపాత్ర తెలిపారు. ‘‘డేటాలో తప్పులు దొర్లి ఉండొచ్చు. అంతటి ఉష్ణోగ్రత నిజమే అయితే స్థానిక పరిస్థితులేవైనా కారణమై ఉండొచ్చు. ముంగేశ్‌పూర్ వాతావరణ కేంద్ర సెన్సర్లను స్పెషలిస్టుల బృందం నిశితంగా అధ్యయనం చేస్తోంది’’ అని వివరించారు. బుధవారం రాజస్తాన్‌లోని ఫలోదీలో 51 డిగ్రీలు, పరిసర ప్రాంతాల్లో 50.8 డిగ్రీలు, హరియాణాలోని సిర్సాలో 50.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఢిల్లీలోని నజఫ్గఢ్లో 49.1 డిగ్రీలు, పుసాలో 49, నరేలాలో 48.4 డిగ్రీలు నమోదైంది. ఢిల్లీలోని సఫ్దర్జంగ్లో ప్రాంతంలో 46.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అక్కడ గత 79 ఏళ్లలో ఇదే అత్యధికం. హరియాణా, పంజాబ్, రాజస్తాన్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ కూడా ఎండ దెబ్బకు అల్లాడుతున్నాయి. హీట్ వేవ్ నేపథ్యంలో ఢిల్లీతో పాటు ఉత్తరాది రాష్ట్రాలకు రెడ్ అలెర్ట్ జారీ అయింది. ఎండలకు తోడు తీవ్రస్థాయిలో వడగాలులు వీస్తున్నాయి. దాంతో జనం బయటకు రావాలంటే వణికిపోతున్నారు. నిత్యం లక్షలాది వాహనాలతో రద్దీగా ఉండే ఢిల్లీ రోడ్లు ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం దాకా నిర్మానుష్యంగా దర్శనమిస్తున్నాయి. రికార్డు విద్యుత్ డిమాండ్ ఎండల ధాటికి ఢిల్లీలో విద్యుత్ డిమాండ్ చుక్కలనంటుతోంది. బుధవారం మధ్యాహ్నం 3.36 గంటలకు 8,302 మెగావాట్ల పవర్ డిమాండ్ నమోదైంది. ఇది ఢిల్లీ చరిత్రలోనే రికార్డని డిస్కం అధికారులు చెప్పారు.సాయంత్రం భారీ వర్షం ఢిల్లీలో బుధవారం సాయంత్రం వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. నగరవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. 52.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైన రెండు గంటల తర్వాత వర్షం ప్రారంభమైంది. దీంతో ప్రజలు కొంత ఉపశమనం పొందారు. రెండు, మూడు రోజుల్లో వర్షాలు అరేబియా సముద్రంలో ఏర్పడిన వాయుగుండం నేపథ్యంలో వాయువ్యం నుండి తూర్పు దిశగా వీచే గాలుల కారణంగా గరిష్ట ఉష్ణోగ్రతలు తగ్గుతాయని ఐఎండీ తెలిపింది. వచ్చే రెండు, మూడు రోజుల్లో ఉత్తరప్రదేశ్, రాజస్తాన్, ఢిల్లీ, హరియాణా రాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వివరించింది. -
మార్కాపురం @ 48 డిగ్రీలు
సాక్షి, విశాఖపట్నం/మార్కాపురం: సూర్యప్రతాపం రోజురోజుకు విజృంభిస్తోంది. ప్రకాశం జిల్లా మార్కాపురంలో గురువారం 48 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. రానున్న కొద్దిరోజులు రాష్ట్రంలో పరిస్థితి నిప్పులు చెరిగే పగళ్లు.. వేడిని వెదజల్లే రాత్రుళ్లు ఉండనుంది. కొన్ని ప్రాంతాల్లో పగటివేళ సాధారణంకంటే 4–7 డిగ్రీలు, రాత్రిపూట 3–6 డిగ్రీలు అధికంగా నమోదయ్యే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. -
5 జిల్లాల్లో 43 డిగ్రీల పైనే..
సాక్షి ప్రతినిధి, నల్లగొండ/ సాక్షి నెట్వర్క్: రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. శుక్రవారం నల్లగొండ జిల్లాలో రాష్ట్రంలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నల్లగొండ జిల్లాలో 43.5 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదు కాగా, జోగుళాంబ గద్వాల, కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాల్లో 43.3 డిగ్రీల సెల్సియస్, సంగారెడ్డిలో 43.2 డిగ్రీలు, ఆదిలాబాద్‌లో 43 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నల్లగొండ జిల్లాలోని 18 మండలాలకు చెందిన 20 గ్రామాల్లో 43 డిగ్రీలు దాటిపోయింది. ఈ జిల్లాలోని మాడుగులపల్లి మండల కేంద్రంతోపాటు మునుగోడు మండలం గూడాపూర్‌లో 43.5 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దామరచర్ల మండల కేంద్రం, అనుముల మండలం ఇబ్రహీంపేట, కనగల్ మండల కేంద్రం, మిర్యాలగూడ మండలం తడకమళ్ల గ్రామాల్లో 43.4 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మరోవైపు ఎండలు తీవ్రం కావడంతో వడదెబ్బ కారణంగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో నలుగురు మృతిచెందారు. జనగామ జిల్లా చిల్పూరు మండలం వెంకటాద్రిపేట గ్రామానికి చెందిన గాదె జయపాల్‌రెడ్డి (55) గురువారం వడదెబ్బకు గురికాగా హనుమకొండలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శుక్రవారం సాయంత్రం మృతిచెందాడు. మహబూబాబాద్ జిల్లాలో సికింద్రాబాద్ తండా గ్రామానికి చెందిన ధరావత్ మంచ్యా (55) వడదెబ్బకు గురై శుక్రవారం మృతిచెందాడు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని జీఎన్ఆర్ కాలనీకి చెందిన స్వర్ణలత (45) రెండ్రోజుల క్రితం నిజామాబాద్‌లో పెళ్లికి హాజరైంది. ఎండల తీవ్రతతో అస్వస్థతకు గురైంది. నిర్మల్‌కు వచి్చన తర్వాత గురువారం రాత్రి ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతిచెందింది. అలాగే నాగర్‌కర్నూల్ జిల్లా లింగాల మండలం శ్రీరంగాపూర్ గ్రామానికి చెందిన రైతు మర్రిపల్లి ఈరయ్య (70) పొలం పనులకు వెళ్లి ఎండ దెబ్బతగలడంతో గురువారం మృతి చెందాడు. -
ఢిల్లీలో తీవ్ర ఉక్కబోత!
సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ అత్యధిక ఉష్ణోగ్రతలతో అల్లాడుతోంది. చాలా ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 40 డిగ్రీ సెల్సియస్‌కుపైగా నమోదవుతుండటంతో జనం ఉక్కపోతతో ఉడికిపోతున్నారు. పొరుగున ఉన్న పంజాబ్, హరియాణా, ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రాల్లో నమోదవుతున్న అధిక ఉష్ణోగ్రతల ప్రభావంతో తీవ్రమైన వడగాలుల కారణంగా ఢిల్లీలో వేడి భయంకరంగా ఎక్కువైంది. బుధవారం ఢిల్లీలో 42 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదుకాగా, అవి ఈ ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశాలున్నాయని వాతావరణ విభాగం చెబుతోంది. ప్రస్తుతం కొనసాగుతున్న అధిక ఉష్ణోగ్రత కారణంగా ఢిల్లీలో విద్యుత్ డిమాండ్ పెరుగుతోంది. జూన్ ఒకటో తేదీన 4,390 మెగావాట్లుగా నమోదైన విద్యుత్ డిమాండ్ బుధవారానికి 7,190 మెగావాట్లకు ఎగసింది. -
మార్చిలో 122 ఏళ్లలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు
న్యూఢిల్లీ: దేశంలో ఈ ఏడాది మార్చిలో 122 ఏళ్ల తర్వాత అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని భారత వాతావరణ శాఖ శనివారం తెలిపింది. గత నెలలో దేశంలోని చాలా భాగంలో తీవ్ర వేడిగాలులు వీచాయని పేర్కొంది. ఉత్తర, దక్షిణ భారతదేశంలో చురుకైన పశ్చిమ పవనాలు లేకపోవడం, అల్ప వర్షపాతమే ఇందుకు కారణమని విశ్లేషించింది. దీర్ఘకాలం సరాసరి వర్షపాతం 30.4 మిల్లీమీటర్లు కాగా, ఈసారి 71% తక్కువగా 8.9మి.మీ. మాత్రమే నమోదైందని వివరించింది. 1908 తర్వాత ఇదే అత్యల్ప వర్షపాతమని తెలిపింది. ‘దేశం మొత్తమ్మీద చూస్తే, 33.10 డిగ్రీల సరాసరి గరిష్ట ఉష్ణోగ్రత మార్చి 2022లో నమోదైంది. గత 122 ఏళ్లలో ఇదే అత్యధికం’ అని ఐఎండీ పేర్కొంది. దేశంలో 2010 మార్చిలో 33.09 డిగ్రీల సెల్సియస్ గరిష్ట ఉష్ణోగ్రతగా నమోదైంది. -
వడదెబ్బ.. తస్మాత్ జాగ్రత్త
మంచిర్యాలటౌన్: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మార్చి మాసంలోనే ఎండలు తీవ్రంగా మండుతుండడంతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. ఉదయం 10 గంటలకే ఎండ తీవ్రత పెరిగి పోతుండడంతో బయటకు వెళితే ముచ్చెమటలు పడుతున్నాయి. ఇక వచ్చేది ఏప్రిల్, మే నెలల్లో మరింతగా ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉండడంతో, ఎండలపై ఏ మాత్రం నిర్లక్ష్యం వహించినా వడదెబ్బ తగిలే ప్రమాదం ఉంది. రోజురోజుకూ పెరుగుతున్న ఎండ తీవ్రత నేపథ్యంలో ఆరోగ్యం విషయంలో తగిన జాగ్రత్తలను తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. పెరగనున్న ఉష్ణోగ్రతలతో వడదెబ్బ బారినపడి చిన్నా,పెద్దా అల్లాడిపోయే అవకాశాలు ఉన్న నేపథ్యంలో అసలు వడదెబ్బ అంటే ఏమిటి? దాని లక్షణాలు... నివారణ మార్గాలు మీ కోసం. వడదెబ్బ అంటే.. ఎక్కువ ఉష్ణోగ్రతల తాకిడికి గురైతే శరీరంలోని వేడిని నియంత్రించే విధానం విఫలమై ప్రాణాపా య పరిస్థితి ఏర్పడడాన్ని వడదెబ్బ అంటారు. వేడి వాతావరణం లేదా చురుకైన పనులతో కలిగే అధిక వేడిని శరీరం తట్టుకోలేనప్పుడు ఇది సంభవిస్తుంది. అధిక ఉష్ణోగ్రతలతో శరీర ప్రాథమిక అవయవాలు విఫలమయ్యేలా చేస్తుంది. లక్షణాలివీ... కాళ్ల వాపులు రావడం, కళ్లు తిరగడం, శరీర కండరాలు పట్టుకోవడం, తీవ్ర జ్వ రం వంటి లక్షణాలు కనిపిస్తాయి. అధిక చెమట పట్ట డం, తల తిరిగి పడిపోవడం వంటి వి జరిగితే వెంటనే స్థానిక ఆసుపత్రికి త రలించి వైద్యం అందించాలి. ప్రాథమిక చికిత్స ►వడదెబ్బ తగిలిన వ్యక్తిని వెంటనే నీడకు తీసుకెళ్లాలి. చల్లని నీరు, ఐస్‌తో ఒళ్లంతా తుడవాలి. వదులుగా ఉన్న నూలు దుస్తులు వేయాలి. ►ఫ్యాను గాలి/ చల్లని గాలి తగిలేలా ఉంచాలి. ►ఉప్పు కలిపిన మజ్జిగ, కొబ్బరిబోండాం లేదా చిటికెడు ఉప్పు, చక్కర కలిపిన నిమ్మరసం, గ్లూకోజు ద్రావణం లేదా ఓరల్ రీ హైడ్రేషన్ ద్రావణము (ఓ.ఆర్.ఎస్) తాగించవచ్చు. ►వడదెబ్బ తగిలి అపస్మారక స్థితిలో ఉన్న రోగిని దగ్గరలోని ఆసుపత్రికి తరలించాలి. బారిన పడకుండా ►వేసవి కాలంలో డీహైడ్రేషన్ అధికంగా ఉంటుంది. రోజుకు కనీసం 15 గ్లాసుల నీళ్లు తాగాలి. భోజనం మితంగా చేయాలి. ►ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు నీడన/చల్లని ప్రదేశంలో ఉండేందుకు ప్రయత్నించండి. ►గుండె/ఊపిరితిత్తులు/మూత్రపిండ సమస్యలు కలిగి ఉన్నవారి శరీరాలకు అధిక సూర్యరశ్మి ప్రభావించే వారి శరీరం త్వరగా డీ హైడ్రేషన్‌కు గురై వ్యాధి తీవ్రతలు అధికంగా ఉంటాయి. ►ఆల్కాహాల్/సిగరేట్/కార్పొనేటెడ్ వంటి ద్రావణాలకు దూరంగా ఉండండి. ►ఎండలో వెళ్లేటప్పుడు కళ్లకు సన్ గ్లాసెస్, తలకు టోపీ వంటివి ధరించండి. ►వేసవిలో ఉదయం/సాయంత్రం సమయాల్లో బయటికి వెళ్లేలా ప్లాన్ చేసుకోవాలి. ►వేడి వాతావరణంలో శారీరక శ్రమ కార్యక్రమాలు చేయడం మంచిది కాదు. ఒకవేళ చేస్తే ప్రతి 20 నిమిషాలకు ఒకసారి ఒక 5 నిమిషాలు నీడలో ఉండేలా చూసుకోవాలి. ►ఆహారంలో ఎక్కువగా ద్రవపదార్థాలు ఉండేలా చూసూకోవాలి. ►ప్రయాణాల్లో సోడియం, ఎలక్ట్రోలైట్ వంటి ద్రావణాలను తాగడం మంచిది. చేయకూడని పనులు ►మండు వేసవిలో తీవ్ర ఉష్ణోగ్రత సమయంలో ఎక్కువగా తిరగరాదు. ►రోడ్లపై చల్లని రంగు పానీయాలు తాగవద్దు. ►రోడ్లపై విక్రయించే కలుషిత ఆహారం తినకుండా, ఇంట్లో వండుకున్నవే తినాలి. ►మాంసాహారం తగ్గించి, తాజా కూరగాయల్ని ఎక్కువగా ఆహారం తీసుకోవాలి. ఈ ఆహారం మేలు ►నీటి శాతం ఎక్కువగా ఉండే పండ్లు, కూరగాయలను ఆహారంగా తీసుకోవాలి. పుచ్చ, కీర, కర్బూజ, తాటి ముంజలు, బీర, పొట్ల వంటి వాటిలో నీటి శాతం పుష్కలంగా ఉంటుంది. వీటి ద్వారా శరీరానికి అవసరమైన పోషకాలు అందుతాయి. దీంతో కడుపు నిండినట్లుగా ఉండి, డైట్ కంట్రోల్ అవుతుంది. ►శీతల పానీయాలు, అధికంగా షుగర్ వేసిన జ్యూస్‌లు, మ్యాంగో, సపోటా వంటివి తీసుకుంటే బరువు తగ్గకపోగా, కొత్త సమస్యలు ఉత్పన్నమవుతాయి. ►వేసవిలో ఆకలి తక్కువగాను, దాహం ఎక్కువగాను ఉంటుంది. డైట్ పాటించాలి. నీరు, మజ్జిగ, కొబ్బరి నీరు తీసుకోవాలి. అత్యవసరమైతేనే బయటకు.. ఎండ వేడి నుంచి ఉపశమనం పొందడం ఒక్కటే వడదెబ్బ నివారణకు ఏకైక మార్గం. ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్న సమయంలో బయటకు వెళ్లకుండా ఉండేందుకు ప్రయత్నించాలి. అత్యవసరం అయితే మాత్రమే తలకు టోపి ధరించి వెళ్లాలి. చెమట రూపంలో శరీరంలోని లవణాలు బయటకు పోతాయి. అందుకే లవణాలతో కూడిన ద్రవాన్ని తీసుకోవాలి. కొబ్బరి నీరు, ఉప్పు, చెక్కర, నిమ్మరసంతో కలిపిన నీటిని తాగాలి. – డాక్టర్ కొమ్మెర వినయ్, జనరల్ ఫిజిషీయన్, జిల్లా ఆసుపత్రి వైద్యుడు పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలి పిల్లలను ఎండ వేడికి బయటకు పంపించవద్దు. 3 లీటర్లకు పైగా నీటిని తాగాలి. నవజాత శిశువులను పూర్తిగా కప్పి ఉంచకుండా, పల్చటి గుడ్డతో సగం వరకు కప్పి ఉంచాలి. పుట్టిన బిడ్డకు 6నెలల వరకు తల్లిపాలనే ఇవ్వాలి. ఇంట్లోనే ఉండే పిల్లలకు వేడి తగలకుండా, చల్లగా ఉండేలా జాగ్రత్తలను తీసుకోవాలి. వదులుగా ఉండే కాటన్ దుస్తులను వేయాలి. కాచి చల్లార్చిన నీరు, ఫిల్టర్ నీటినే పిల్లలకు ఇవ్వాలి. – డాక్టర్ బొలిశెట్టి కళ్యాణ్‌కుమార్, పిల్లల వైద్యుడు, జిల్లా ఆసుపత్రి -
ఒకవైపు ఎండ.. మరోవైపు వాన
సాక్షి, విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్‌లో భిన్న వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. కొన్ని జిల్లాల్లో వర్షాలు పడుతుండగా మరికొన్ని జిల్లాల్లో ఎండలు తీవ్రంగా ఉంటున్నాయి. మంగళవారం దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో పలు చోట్ల వర్షాలు కురవగా, ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు మిగిలిన ప్రాంతాల్లో ఎండలు తీవ్రంగా ఉన్నాయి. విశాఖ జిల్లా అనకాపల్లిలో 38.6 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదుకావడంతో మంగళవారం దక్షిణ భారతదేశంలో అత్యధిక ఉష్ణోగ్రత నమోదైన జిల్లాగా విశాఖ రికార్డుకెక్కింది. మిగిలిన ప్రాంతాల్లోనూ సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మరోవైపు... ఈ నెల 13న ఆంధ్రప్రదేశ్ తీరంలో అల్పపీడనం ఏర్పడి కాకినాడ, మచిలీపట్నం మధ్య తీరం దాటే అవకాశాలున్నాయని వాతావరణశాఖ అధికారులు చెబుతున్నారు. అయితే ఈ అల్పపీడనం దిశను మార్చుకుని ఒడిశా వైపు పయనించే సూచనలు కూడా కనిపిస్తున్నాయని విశాఖ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ అల్పపీడనం ఏర్పడిన తర్వాత నుంచి కోస్తా, రాయలసీమల్లో వర్షాలు జోరందుకొంటాయని అధికారులు చెబుతున్నారు. మంగళవారం ఉదయం నుంచి రాత్రి వరకు కిర్లంపూడిలో 75.25 మి.మీ, రావులపాలెంలో 72.25 మి.మీ, అయినవిల్లిలో 64.5, ఐ.పోలవరంలో 62.25, రాజమండ్రిలో 55.5, దగదర్తిలో 44.5, ఒంగోలులో 42.5 మి.మీల వర్షపాతం నమోదైంది. -
బాబోయ్ ఉక్కపోత! మరోవారం ఇంతేనట!!
సాక్షి, సిటీబ్యూరో: రుతుపవనాలకు బ్రేక్ పడడంతో నగరంలో మళ్లీ పగటి ఉష్ణోగ్రతలు పెరిగాయి. ఎండ వేడిమితో ఒక్కసారిగా ఉక్కపోత పెరిగింది. రుతుపవనాలు వెస్ట్ బెంగాల్ వైపు మళ్లాయని..శీతల గాలులు సైతం ఉత్తరదిశ వైపు వీస్తున్నందున నగరంలో పగటి ఉష్ణోగ్రతలు పలు ప్రాంతాల్లో 33 నుంచి 35 డిగ్రీల వరకు పెరిగాయని..గాలిలో తేమ శాతం 50 శాతానికంటే తక్కువగా నమోదైనట్లు బేగంపేట్‌లోని వాతావరణ కేంద్రం డైరెక్టర్ నాగరత్న ‘సాక్షి’కి తెలిపారు. మరో వారం రోజులపాటు నగర వాతావరణ పరిస్థితిలో పెద్దగా తేడాలుండవని..ఆ తర్వాత రుతుపవనాల దిశ మారే అవకాశం ఉందని, గాలిలో తేమ శాతం పెరగడం, ఆకాశం మేఘావృతమై అక్కడక్కడా తేలిక పాటి వర్షాలుకురిసే అవకాశాలున్నట్లు వివరించారు. కాగా నగరంలో పగటి ఉష్ణోగ్రతలు పెరగడం, ఉక్కపోత పెరగడంతో విద్యుత్ వినియోగం సైతం పెరిగింది. ఏసీలు, కూలర్లు, ఫ్యాన్లతో సిటీజనులు సేదదీరారు. మధ్యాహ్నం ఇంటి నుంచి బయటకు వెళ్లినవారు ఎండవేడిమితో సతమతమయ్యారు. ఈ సీజన్లో జూన్ ఒకటి నుంచి జూలై 31 వరుస నగరంలో పలు మండలాల్లో సాధారణం కంటే 40 నుంచి 50 శాతం అధిక వర్షపాతం నమోదైన విషయం విదితమే. -
అగ్నిగుండం
-
భానుడి భగభగ; అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు
సాక్షి, అమరావతి : భానుడు భగభగలకు రాష్ట్ర వ్యాప్తంగా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ముఖ్యంగా కోస్తా ప్రాంతంలో ఎండలు మరింత మండిపోతున్నాయి. వాతావరణంలో తేమ శాతం గణనీయంగా తగ్గిపోవడంతో ఎండ తీవ్రత ఈ నెల 18 వరకు ఇలాగే కొనసాగనున్నట్లు వాతావరణ నిపుణులు తెలిపారు. రాష్ట్రంలో వడగాల్పుల తీవ్రత అధికంగా ఉందని.. కావున ప్రజలు ఇంట్లో నుంచి బయటకు వచ్చేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అంతేకాక సాధ్యమైనంత వరకు ఎండలో తిరగకుండా ఉండాలని, ఇక వృద్ధులు, చిన్నపిల్లలతై బయటకు రాకపోవడమే మేలని పేర్కొన్నారు. ఈ రోజు మధ్యాహ్నం వరకు నమోదైన ఉష్ణోగ్రతల వివరాలు : ► ప్రకాశం జిల్లా టంగుటూరులో అత్యధికంగా 45.27 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత నమోదు ► విశాఖపట్నం జిల్లా బోయిల కింటాడలో 45.25 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత ► విజయగనరం పట్టణంలో 45.19 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత ► తూర్పు గోదావరి జిల్లా చామవరం, తునిలో 45.18 సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత నమోదు ► శ్రీకాకుళం జిల్లా మెలియాపుట్టిలో 44.90 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత సహా మొత్తం 31 ప్రాంతాల్లో 44 నుండి 46 డిగ్రీల సెంటిగ్రేడ్ మధ్య ఉష్ణోగ్రతలు, 172 ప్రాతాల్లో 42 నుండి 44 డిగ్రీల సెంటిగ్రేడ్ మధ్య ఉష్ణోగ్రతలు నమోదైనట్లు రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ (ఆర్టీజీఎస్- ఏపీ) తెలిపింది. -
దేవుడా...
సాక్షి, ఒంగోలు: జిల్లాలో పగటి ఉష్ణోగ్రతలు అత్యధికంగా నమోదవుతున్నాయి. ఉదయం నాలుగున్నర గంటల నుంచే తెల్లవారి వెలుగు కన్పిస్తోంది. ఒక్క సారిగా వడగాడ్పులు మొదలవుతున్నాయి. రోహిణి కార్తె ముగిసినా ఉష్ణ తీవ్రత తగ్గడం లేదు. ఈ ఏడాది రుతుపవనాలు కచ్చిత సమయానికే వచ్చాయని బావించినా వాటి జాడే లేకుండా పోయింది. చినుకు రాలలేదు. జిల్లాలో మార్కాపురం, కందుకూరు డివిజన్లలోని పలు ప్రాంతాల్లో వడగండ్ల వానలు కురిశాయి. అక్కడక్కడ చినుకులు రాలాయి. పిడుగులు పడి కొందరు మృత్యువాతపడ్డారు. పశు నష్టం వాటిల్లింది. జిల్లాలో 40 డిగ్రిల ఉష్ణోగ్రతలు తగ్గడంలేదు. గురువారం టంగుటూరు, ముండ్లమూరు, దొనకొండ, ఇంకొల్లు, వేటపాలెంలోని దేశాయిపేటలో 45 డిగ్రిల ఉష్ణోగ్రత నమోదైంది. త్రిపురాంతకం, దొనకొండ,తర్లుపాడు, ముండ్లమూరు, మార్టూరు, వేటపాలెం, జె.పంగులూరు, కొరిశపాడు, మద్దిపాడులో 50–70 కి.మీ వేగంతో వడగాడ్పులు నమోదయ్యాయి. ఉదయాన్నే ఎండ తీవ్రంగా వస్తుంది. ఆరు,ఏడు గంటలలోపే ప్రచండ వెలుగు కన్పిస్తోంది. వడగాడ్పులు మొదలవుతున్నాయి. వేడి గాలులకు ఇల్లు విడిచి రావాలంటే భయపడ్తున్నారు. ఒక మధ్యాహ్నం 12–1 గంట మధ్యలో జన సంచారం ఉండటం లేదు. వీధులన్నీ నిర్మానుష్యంగా ఉంటున్నాయి. ఈ ఏడాది తీవ్రమైన ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఎన్నడు లేని విధంగా వేడి తాపాన్ని ఎదుర్కొన్నారు. మే,జూన్ నెలల్లో 46 డిగ్రీల ఉష్ణోగ్రతలు ఎక్కువ పర్యాయాలు నమోదయ్యాయి. గురువారం 37 మండలాల్లో 40–42.3 డిగ్రీల మధ్యలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఏసీలు పని చేయడం లేదు. వడగాడ్పులను పోలిన బెట్ట వాతావరణమే గదుల్లోనూ నెలకుంటోంది. ఉష్ణోగ్రతలు, వడగాడ్పులకు బయటకు తిరిగే పరిస్థితి లేదు. ఇళ్లల్లో ఉందామన్నా వాతావరణం సహకరించడం లేదు. పగటి పూట ఉష్ణోగ్రతలు, ఉక్క దెబ్బకి జనం బెంబేలెత్తిపోతున్నారు. రైళ్లు, బస్సుల్లో ఏసీలు పని చేయడం లేదు. కనిగిరి ప్రాంతంలో ఇటీవల ఏసీ బస్సులో ఏసీ అంతరాయం వచ్చి నిలిచిపోయింది. అర్ధరాత్రి ప్రయాణికులు నిరసన వ్యక్తం చేశారు. ఆర్టీసీ అధికారుల దృష్టికి రాత్రి 12 గంటల ప్రాంతంలో సమస్యను తీసుకెళ్లినా ప్రత్యమ్నాయం చేయలేకపోయారు. రైళ్లల్లోని ఏసీ కంపార్టుమెంట్లలో ఏసీలు సరిగ్గా పని చేయక అధికారులకు తరుచూ ఫిర్యాదులు వస్తున్నాయి. మరో 48 గంటలు వడగాడ్పుల తీవ్రత ఉంటుందని వాతావరణ అధికారులు చెబుతున్నారు. మృగశిర కార్తె వచ్చినా ఇంత వరకు వ్యవసాయ పనులు మొదలు కాలేదు.. నీళ్లు లేవు. సాగుకు ఈ ఏడాది నీళ్లు వస్తాయో లేదో తెలియదు. అధికారులు తాగునీటి గండం ఎలా గట్టెక్కాలని చూస్తున్నారు. వ్యవసాయ విస్తీర్ణం లక్ష్యాలను నిర్ణయించినా ఇంత వరకు అడుగు ముందుకు పడలేదు. -
రికార్డు స్థాయిలో అత్యధిక ఉష్ణోగ్రతలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో గురువారం రికార్డు స్థాయిలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైనట్లు హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. ఆదిలాబాద్‌లో గరిష్టంగా 44 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు పేర్కొంది. రాబోయే మూడు రోజులు పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని వెల్లడించింది. హిందూ మహాసముద్రం దానిని ఆనుకుని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతం ప్రాంతాలలో గురువారం అల్పపీడనం ఏర్పడి తీవ్ర అల్పపీడనంగా మారిందని తెలిపింది. దీనికి అనుబంధంగా 5.8 కి.మీ ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని వెల్లడించింది. ఇది తర్వాతి 24 గంటలలో తీవ్రంగా మారి హిందూ మహాసముద్రం, దక్షిణ బంగాళాఖాతం మధ్య ప్రాంతాల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉందని పేర్కొంది. మరఠ్వాడా నుంచి దక్షిణ ఇంటీరియర్ కర్ణాటక వరకు ఉత్తర ఇంటీరియర్ కర్ణాటక మీదుగా 0.9 కి.మీ ఎత్తు వద్ద ఉపరితల ద్రోణి కొనసాగుతోందని పేర్కొంది. -
అగ్ని గుండం
రాజమండ్రి : జిల్లా అగ్నిగుండంగా మారింది. నా లుగు రోజులుగా పెరుగుతూ వచ్చిన ఉష్ణోగ్రత శుక్రవారం మరింత భీకరరూపం దా ల్చింది. వడవెబ్బ రూపంలో 14 మందిని బలి తీసుకుంది. రాజమండ్రిలో అత్యధికం గా 45 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. కాకినాడలో 42.2, అమలాపురంలో 42 డిగ్రీల ఉ ష్ణోగ్రతలు నమోదయ్యాయి. అత్యధిక ఉష్ణోగ్రతలే కాకుండా అత్పల్ప ఉష్ణోగ్రతలు కూ డా పెరగడం వల్ల ఉదయం, సాయంత్రం కూడా వడగాడ్పులు వీస్తూ యువతను సై తం భయపెడుతున్నాయి. ఫ్యాను కింద కూ ర్చున్నా వేడిగాలి తగులుతుండడంతో జనం మగ్గిపోతున్నారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం నాలుగు గంటల వరకు నగరాలు, పట్టణాల్లో అప్రకటిత కర్ఫ్యూవాతావరణం కనిపిస్తోంది. రోడ్లు నిర్మానుష్యంగా మారుతున్నాయి. ఎండ మండిపడే వేళ.. నగరాలు, పట్టణాలలోనే కాక పల్లెల్లో అనేకులు ఇళ్లకు పరిమితమవుతున్నారు. పలుచోట్ల విద్యుత్ రఫరా లేక వేగిపోతున్నారు. శీతలపానీయాలు, ముంజలు, జ్యూస్‌ల అమ్మకాలు ముమ్మరమయ్యూరుు. రోహిణీ కార్తె మరో మూడు రోజుల్లో ప్రారంభం కానుంది. ఇప్పుడే ఇంతలా రగులుతున్న వాతావరణం.. ఇక ఆ సమయంలో ఇంకెంత విజృంభిస్తుందోనని జనం బెంబేలెత్తుతున్నారు. కార్పొరేట్ విద్యాసంస్థలు అతీతమా? వేసవి సెలవులైనా, ఎండలు గండం స్థారుులో మండిపోతున్నా నగర, పట్టణాల్లో చాలా కార్పొరేట్ స్కూల్స్, కళాశాలలు, ఇంజనీరింగ్ కాలేజీలు యథావిధిగా నడిచిపోతున్నాయి. స్కూళ్లతో తొమ్మిది, పదవ తరగతుల విద్యార్థులు, కళాశాలల్లో ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరాల విద్యార్థులు, ఇంజనీరింగ్ విద్యార్థులు సెలవులకు నోచుకోలేదు. వడగాడ్పులకు జనం పిట్టల్లా రాలిపోతున్నా సెలవులు ఇవ్వాలని ఇటు యాజమాన్యాలకూ, పాఠాలు చెపుతున్నా పిల్లల ప్రాణాలతో చెలగాటమాడుతూ పంపకూడదని ఇటు తల్లిదండ్రులకూ లేకపోవడం గమనార్హం.