![Highest Temparatures In Andhra Pradesh - Sakshi](/styles/webp/s3/article_images/2019/06/15/summer-222.jpg.webp?itok=MoYHXODA)
ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, అమరావతి : భానుడు భగభగలకు రాష్ట్ర వ్యాప్తంగా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ముఖ్యంగా కోస్తా ప్రాంతంలో ఎండలు మరింత మండిపోతున్నాయి. వాతావరణంలో తేమ శాతం గణనీయంగా తగ్గిపోవడంతో ఎండ తీవ్రత ఈ నెల 18 వరకు ఇలాగే కొనసాగనున్నట్లు వాతావరణ నిపుణులు తెలిపారు. రాష్ట్రంలో వడగాల్పుల తీవ్రత అధికంగా ఉందని.. కావున ప్రజలు ఇంట్లో నుంచి బయటకు వచ్చేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అంతేకాక సాధ్యమైనంత వరకు ఎండలో తిరగకుండా ఉండాలని, ఇక వృద్ధులు, చిన్నపిల్లలతై బయటకు రాకపోవడమే మేలని పేర్కొన్నారు.
ఈ రోజు మధ్యాహ్నం వరకు నమోదైన ఉష్ణోగ్రతల వివరాలు :
► ప్రకాశం జిల్లా టంగుటూరులో అత్యధికంగా 45.27 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత నమోదు
► విశాఖపట్నం జిల్లా బోయిల కింటాడలో 45.25 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత
► విజయగనరం పట్టణంలో 45.19 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత
► తూర్పు గోదావరి జిల్లా చామవరం, తునిలో 45.18 సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత నమోదు
► శ్రీకాకుళం జిల్లా మెలియాపుట్టిలో 44.90 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత సహా మొత్తం 31 ప్రాంతాల్లో 44 నుండి 46 డిగ్రీల సెంటిగ్రేడ్ మధ్య ఉష్ణోగ్రతలు, 172 ప్రాతాల్లో 42 నుండి 44 డిగ్రీల సెంటిగ్రేడ్ మధ్య ఉష్ణోగ్రతలు నమోదైనట్లు రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ (ఆర్టీజీఎస్- ఏపీ) తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment