summer effect
-
నిప్పుల కొలిమి!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని అనేక ప్రాంతాలు నిప్పుల కొలిమిని తలపిస్తున్నాయి. ఎండలు భగ్గుమంటున్నాయి. సాధారణం కంటే 5 డిగ్రీల మేర అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీనికితోడు తీవ్ర ఉక్కపోతతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. కూలర్లు, ఫ్యాన్లు ఏమాత్రం ఉపశమనం ఇవ్వక తిప్పలు పడుతున్నారు. శుక్రవారం నల్లగొండ జిల్లా బుగ్గబావిగూడలో 45 డిగ్రీలు, మాడుగులపల్లిలో 44.8 డిగ్రీల సెల్సియస్ చొప్పు న గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వాతావరణంలో నెలకొంటున్న మార్పులతో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే అధికంగా నమోదవుతున్నాయని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. శుక్రవారం ఖమ్మంలో సాధారణం కంటే 5.2 డిగ్రీలు అధికంగా గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. భద్రాచలం, నల్లగొండలలో 4 డిగ్రీలు, ఆదిలాబాద్, నిజామాబాద్, హైదరాబాద్‌లలో 3 డిగ్రీల మేర అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మిగతా ప్రాంతాల్లో 2 డిగ్రీల మేర అధికంగా ఉన్నాయి. మరో మూడు రోజులు ఇలానే.. రాష్ట్రంలో మరో మూడు రోజులు సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని.. ఇదే తరహా పరిస్థితి ఉంటుందని వాతావరణ శాఖ ప్రకటించింది. అత్యవసర పనులుంటే తప్ప మధ్యా హ్నం పూట బయటికి రావొద్దని అధికారులు హెచ్చరించారు. ఇక ప్రస్తుతం మరాఠ్వాడ పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని.. దాని ప్రభావంతో కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన మోస్తరు వానలు పడవచ్చని తెలిపారు. శనివారం ఉత్తర తెలంగాణ జిల్లాల్లో వడగాడ్పులు వీచే అవకాశం ఉందని హెచ్చరించారు. తీవ్ర ఎండలతో జాగ్రత్త అధిక ఉష్ణోగ్రతలు,వడగాడ్పుల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ప్రజారో గ్య విభాగం సూచించింది. ఈ మేరకు శుక్రవార ం ప్రకటన జారీ చేసింది. వాతావరణ శాఖ కూ డా హీట్ వేవ్ అలర్ట్ జారీ చేసింది. అవేమంటే.. ► దాహం వేయకపోయినా కూడా అవసరమైన మేర నీళ్లు తాగుతూ ఉండాలి. ఓఆర్ఎస్, నిమ్మరసం, లస్సీ, మజ్జిగ, పండ్ల రసాలు వంటివి తాగాలి. ► వీలైనంత వరకు ఇంట్లోనే ఉండాలి. మధ్యాహ్న సమయంలో బయటికి వెళ్లకపోవడం మంచిది. బాగా గాలి వచ్చే, చల్లని ప్రదేశాలలో ఉండాలి. ► ఎండకు వెళ్లాల్సి వస్తే.. సన్నని వదులుగా ఉండే కాటన్ వ్రస్తాలను ధరించాలి. తలపై టోపీ, గొడుగు వంటివి కప్పుకోవాలి. ► మధ్యాహ్న సమయంలో ఆరు బయట తీవ్ర శారీరక శ్రమ చేయవద్దు. ► ఎవరైనా వడదెబ్బకు లోనైట్టు గుర్తిస్తే.. వెంటనే వైద్య సహాయం అందించాలి. -
తెలంగాణలో మండుతున్న ఎండలు
-
మండే ఎండలు..సూర్యుడు బాగా బాగా
-
తెలంగాణాలో పెరగనున్న ఉష్ణోగ్రతలు...
-
నేడు ఏపీలో పెరుగనున్న ఎండ తీవ్రత
-
వేసవి ప్రభావం గురించి విశాఖ వాతావరణ శాఖ డైరెక్టర్ సునంద
-
హైదరాబాద్ లో దడ పుటిస్తున ఎండలు
-
సమ్మర్ ఎఫెక్ట్ మెట్రోకు భారీగా ప్రయాణికులు
-
మార్చిలోనే మండుతున్న సూరీడు.. భగభగ పక్కా! తీవ్రమైన వడగాడ్పులు
మార్చిలోనే సూరీడు మండిపోతున్నాడు. ఈ ఏడాది వేసవి భగభగలాడే అవకాశాలు కనిపిస్తున్నాయి. మండే ఎండలకు తోడు ఎన్నో సమస్యలు ఎదురు కానున్నాయి. వడగాడ్పులు, విద్యుత్ సంక్షోభం, నీటి ఎద్దడి బాధించనున్నాయి. 1901 తర్వాత ఈ ఏడాది ఫిబ్రవరి అత్యంత వేడి నెలగా రికార్డులకెక్కింది. సగటు ఉష్ణోగ్రతలు 30 డిగ్రీల సెల్సియస్‌కు దాటాయని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. కొంకణ్, కచ్ ప్రాంతాల్లో ఫిబ్రవరిలోనే వేడి గాడ్పులపై ప్రభుత్వం ప్రజల్ని అప్రమత్తం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. మార్చి నుంచి మే వరకు వడగాడ్పులు తీవ్రంగా ఉంటాయని అంచనాలున్నాయి. ఈ నేపథ్యంలో వేసవి గండాన్ని ఎలా ఎదుర్కొంటామన్న ఆందోళనలు వినిపిస్తున్నాయి. ఫిబ్రవరి 6న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఉన్నత స్థాయి సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేసి వేసవిని ఎదుర్కోవడానికి కావాల్సిన సన్నద్ధతలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. వైద్య నిపుణులు, స్థానిక అధికారులు, విపత్తు నిర్వహణ బృందాలతో కలిసి వేసవి కాలాన్ని ఎదుర్కోవడానికి ఏమేం చర్యలు చేపట్టాలన్న దానిపై చర్చించారు. ఏయే ప్రాంతంలో వడగాడ్పులు ఉండబోతున్నాయి మార్చి నుంచి మే వరకు దేశంలో ఉక్కబోత భరించలేనంతగా ఉంటుందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. తూర్పు, ఈశాన్య ప్రాంతాల్లో ఎండ వేడిమి ఎక్కువగా ఉంటుంది.మధ్య భారతం, వాయవ్య రాష్ట్రాల్లోనూ అత్యధిక ఉష్ణోగ్రతలు 50 డిగ్రీల సెల్సియస్‌కు చేరుకునే అవకాశాలున్నాయి. ఉత్తరాదితో పోల్చి చూస్తే దక్షిణాది రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు స్వల్పంగా నమోదవుతాయి. ఇంటర్‌గవర్నమెంటల్ ప్యానెల్ ఆన్ క్లైమేట్ ఛేంజ్ (ఐపీసీసీ) అంచనాల ప్రకారం వడగాడ్పులు తరచుగా వీస్తాయి. రానున్న సంవత్సరాల్లో ఎండవేడిమి మరింతగా పెరిగిపోతుంది. ఈ ఏడాది ఫసిఫిక్ మహాసముద్రంలో కాలానుగుణంగా వచ్చే మార్పుల కారణంగా ఎల్‌నినో పరిస్థితి ఏర్పడుతుందని అందువల్ల వేసవికాలం మరింత వేడిగా మారుతుందని అంచనాలున్నాయి. ఎల్‌నినో సంవత్సరాల్లో పంట దిగుబడి లేక కరువు కాటకాలు ఏర్పడతాయని పలు నివేదికలు చెబుతున్నాయి. ఏళ్లు గడుస్తున్న కొద్దీ వేసవి కాలం ఎదుర్కోవడం అత్యంత దుర్లభంగా మారుతోందని హెల్త్ అండ్ క్లైమేట్ రెసిలెన్స్ ఎన్ఆర్డీసీ ఇండియా చీఫ్ అభియంత్ తివారీ చెప్పారు. గత ఏడాది మార్చి 100 ఏళ్లలోనే అత్యంత వేడి మాసంగా నమోదైతే, ఈ ఏడాది ఫిబ్రవరి 122 ఏళ్ల రికార్డుల్ని బద్దలు కొట్టిందని అన్నారు. ఈ సారి వేసవిలో వడగాడ్పులు ఎక్కువగా ఉండడంతో గోధుమ పంటపై తీవ్ర ప్రభావం పడుతుందని, దీంతో ఆహార సంక్షోభం, నిత్యావసర ధరలు పెరిగిపోవడం వంటివి జరగనున్నాయని ఆయన అంచనా వేశారు. విద్యుత్ కోతలు తప్పవా..? గత ఏడాది వేసవి కాలంలో విద్యుత్ వినియోగం రికార్డు స్థాయికి చేరుకొని సంక్షోభం ఎదురైంది. ఈ ఏడాది కూడా అదే పరిస్థితి పునరావృతమయ్యే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. ఈ ఏడాది ఏప్రిల్‌లో అత్యధికంగా విద్యుత్ డిమాండ్ 229 గిగావాట్లకు చేరుకోవచ్చునని సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ అంచనా వేసింది. ఇక రాత్రి వేళల్లో కూడా 217 గిగావాట్లకు విద్యుత్ వినియోగం చేరుకునే అవకాశాలున్నాయి. గత ఏడాది ఏప్రిల్‌లో రాత్రిపూట విద్యుత్ వినియోగం కంటే ఇది చాలా ఎక్కువ. ఇలాంటి పరిస్థితుల వల్ల గ్రిడ్లపై ఒత్తిడి పెరిగిపోతుందని గ్రిడ్ కంట్రోలర్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ తెలిపింది. థర్మల్ విద్యుత్ ప్లాంట్లకి బొగ్గు కొరత, జల విద్యుత్ ప్రాజెక్టులకి నీటి కొరత కారణంగా ఈ సారి వేసవి కూడా పెను విద్యుత్ సంక్షోభానికి దారి తీసే అవకాశాలున్నాయి. ఒడిశా బాటలో... మన దేశంలో ఒడిశా వేసవికాలంలో ఎదురయ్యే సమస్యల్ని ఒక ప్రణాళికా బద్ధంగా ఎదుర్కొని విజయం సాధించింది. ఇప్పటివరకు ఒడిశా మాత్రమే వేసవికాలాన్ని కూడా ఒక ప్రకృతి విపత్తుగా అధికారికంగా ప్రకటించింది. 1998లో వేసవికాంలో వడదెబ్బకు ఏకంగా 2,042 మంది పిట్టల్లా రాలిపోయారు. ఆ తర్వాత ఏడాది వడదెబ్బ మృతుల సంఖ్య 91కి, తర్వాత ఏడాదికి 41కి తగ్గించగలిగింది. దీనికి ఒడిశా ప్రభుత్వం చేసిందల్లా ఎండ తీవ్రత ఉన్నప్పుడు బయట ఎవరూ తిరగకూడదంటూ నిబంధనలు విధించింది. మిట్ట మధ్యాహ్నం సమయంలో ప్రభుత్వ కార్యాలయాలు కూడా మూసేసింది. రాష్టంలోని వీధివీధిలోనూ చలివేంద్రాలు, పందిళ్లు ఏర్పాటు చేసింది. విద్యుత్ కోతలు లేకుండా, నీటికి ఇబ్బంది లేకుండా ముందుగా ఏర్పాట్లు చేస్తూ వచ్చింది. సూర్యుడు అస్తమించిన తర్వాత రాత్రిపూట పనులు చేసేలా చర్యలు తీసుకుంది. వడదెబ్బతో మరణించే వారి కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటోంది. దీంతో ఇతర రాష్ట్రాలు కూడా ఒడిశా బాటలో నడిస్తే మంచిదన్న అభిప్రాయాలైతే వినిపిస్తూ ఉన్నాయి. వేసవి ప్రభావం ఇలా.. ► ప్రపంచ బ్యాంకు 2022లో ఇచ్చిన నివేదిక ప్రకారం భారత్‌లో వేసవి మరణాలు ఇక అధికం కానున్నాయి. కాంక్రీట్ జంగిళ్లుగా మారిన నగరాలు వడగాడ్పులతో వేడెక్కనున్నాయి. ► ఎండవేడిమికి 2000–04 నుంచి 2017–21 మధ్య 55శాతం మరణాలు పెరిగిపోయాయి. ► 2021లో ఎండలకి 16,700 కోట్ల కార్మికుల పని గంటలు వృథా అయ్యాయి. ► ఎండాకాలంలో కార్మికులు పనుల్లోకి వెళ్లకపోవడం వల్ల దేశ జీడీపీలో గత ఏడాది 5.4% ఆదాయం తగ్గిపోయింది. ► 2022లో దేశవ్యాప్తంగా 203 రోజుల పాటు వివిధ ప్రాంతాల్లో వడగాడ్పులు వీచాయి. వందేళ్ల తర్వాత ఇదే అత్యధికం ► ఉత్తరాఖండ్‌లో అత్యధికంగా 28 రోజులు, రాజస్తాన్‌లో 26 రోజులు, పంజాబ్, హరియాణాలో 34 రోజులు చొప్పున వడగాడ్పులు వీచాయి. ► వేసవికాలం వచ్చిందంటే కార్చిచ్చుల సమస్య వేధిస్తుంది. 2017లో కొండప్రాంతంలో ఉన్న ఉత్తరాఖండ్‌లో 1,244 హెక్టార్ల అటవీ ప్రాంతాన్ని కార్చిచ్చులు దహిస్తే 2021 నాటికి మూడు రెట్లు ఎక్కువగా 3,927 హెక్టార్లు కార్చిచ్చుతో నాశనమయ్యాయి. ► ఇప్పటికే హిమానీనదాలు కరిగిపోతూ ఉండడంతో సముద్ర తీర ప్రాంతాలు ముప్పులో ఉన్నాయి. వేసవిలో ఎండ ఎక్కువగా ఉంటే మరింత మంచు కరిగి ముప్పు తీవ్రత ఎక్కువైపోతుంది ► ఢిల్లీ రాజధాని ప్రాంతంలో గత ఏడాది ఎంత తీవ్రతకి 300 పిట్టలు మృతి చెందాయి. వన్యప్రాణులు దాహార్తిని తీర్చుకోవడానికి ఊళ్లపై పడి బీభత్సం సృష్టించే ఘటనలు పెరిగిపోతాయి. ► వేసవి కాలం ఎండలు ఎక్కువ ఉండడం రబీ సీజన్ పంటలపై తీవ్రంగా ç్రప్రభావం పడుతుంది. ముఖ్యంగా ప్రపంచ గోధుమ ఎగుమతుల్లో రెండో స్థానంలో ఉన్న భారత్‌లో ఈ ఏడాది గోధుమ దిగుబడిపై ప్రభావం ఉంటుందనే ఆందోళనలున్నాయి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
Photo Feature: ‘దాహా’కారాలు
రోజురోజుకూ ఎండ తీవ్రతరం అవుతోంది. గిరిజనులకు తాగునీటి కష్టాలు మిగుల్చుతోంది. నీటికోసం కిలోమీటర్ల మేర కాలినడకన వెళ్లి చెలిమ నీటిని తెచ్చుకునే పరిస్థితి నెలకొంది. బావులు, కాలువలు ఎండిపోవడంతో ఆ నీరే దిక్కయింది. చిన్నాపెద్దా తేడా లేకుండా గంటలకొద్దీ నిరీక్షించి వచ్చే కొద్దిపాటి నీటి కోసం తంటాలు పడుతున్నారు. ఆదిలాబాద్ జిల్లా బేల మండలం టెంబ్రిగూడలో వందమంది గిరిజనులు నివసిస్తున్నారు. వీరంతా నీటికోసం అల్లాడుతున్నారు. కిలోమీటరు దూరంలోని చెలిమ వద్దకు వెళ్లి నీరు తెచ్చుకోవలసి వస్తోంది. – సాక్షి ఫొటోగ్రాఫర్, ఆదిలాబాద్ నెత్తిన బిందెలు ఎత్తుకొని నడిచి వెళ్తున్న గ్రామస్తులు -
ఆస్పత్రుల్లో దారుణ పరిస్థితులు.. ఎండలు.. వైరస్ భయంతో ముందుకు రావట్లేదు
సాక్షి, హైదరాబాద్: రక్తానికి రక్తం! ఇదేదో సినిమాలో విన్పించే డైలాగ్ కాదు. నగరంలోని ఏ ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లోని బ్లడ్‌బ్యాంక్‌కు వెళ్లినా ప్రస్తుతం ఇదే డైలాగ్ రిపీటవుతోంది. ‘మీ సంబంధీకులు ఎవరైనా ఆస్పత్రిలో ఉండి.. రక్తం ఎక్కించాల్సిన పరిస్థితి ఉంటే... మీలో ఎవరో ఒకరు రక్తదానం చేయాల్సిందే. లేకుంటే రక్తం ఇవ్వలేం’ అని ఇక్కడి సిబ్బంది చెబుతున్నారు. దీనికి కారణం తీవ్రంగా ఏర్పడిన రక్తం కొరతే. నగరంలోని అన్ని ప్రధానాస్పత్రులతో పాటు బ్లడ్ బ్యాంకులలోనూ ప్రస్తుతం రక్త నిల్వలు లేవు. అన్ని స్థాయిల విద్యార్థులకు పరీక్షలు సమీపిస్తుండడం, ఎండలు పెరగడం, వైరస్ భయాల వంటి కారణాలతో ఇప్పుడు రక్తదానం చేసే వారు కరువయ్యారు. ఫలితంగా అత్యవసర పరిస్థితుల్లో ఆయా ఆస్పత్రుల్లోని బ్లడ్ బ్యాంకులకు చేరుకున్న క్షతగాత్రులకు, సర్జరీ బాధితులకు, తలసేమియా రోగులకు ప్రాణసంకటం ఏర్పడింది. బంధువుల్లో ఎవరైనా రక్తదానం చేసేందుకు ముందుకు వస్తే కానీ...ఆయా బాధితులకు అవసరమైన గ్రూప్ రక్తం దొరకని దుస్థితి నెలకొంది. చదవండి: మళ్లీ బుసకొట్టిన సెస్.. ఈసారి డీజిల్ సెస్ వడ్డించిన ఆర్టీసీ ఆందోళనలో క్షతగాత్రులు..సర్జరీ బాధితులు ఉస్మానియా, గాంధీ మెడికల్ కాలేజీలకు అనుబంధంగా పని చేస్తున్న బోధనాసుపత్రులతో పాటు కార్పొరేట్ ప్రైవేటు ఆస్పత్రుల్లో రోజుకు సగటున వెయ్యికిపైగా చికిత్సలు జరుగుతున్నట్లు అంచనా. వీరిలో రోడ్డు, అగ్ని, ఇతర ప్రమాదాల్లో గాయపడిన క్షతగాత్రులతో పాటు, పురిటినొప్పులతో బాధపడుతున్న గర్భిణులు, కేన్సర్, గుండె పోటు, కాలేయం, మూత్ర పిండాల సంబంధిత సమస్యతో బాధపడుతున్న వారే అధికం. సాధారణంగా ఏదైనా రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారు అధిక రక్తస్త్రావంతో బాధపడుతుంటారు. కేవలం గాయాలైన సందర్భంలోనే కాదు సర్జరీ సమయంలో రక్తస్త్రావం అవుతుంది. వీరికి వెంటనే రక్తం ఎక్కించాల్సి ఉంది. ఇలా రోజుకు సగటున రెండు నుంచి మూడు వేల యూనిట్ల రక్తం అవసరమవుతుంది. కానీ ఆశించిన స్థాయిలో బ్లడ్ దొరకడం లేదు. అంతేకాదు కాలేయ, గుండె, ఊపిరితిత్తుల మార్పిడి చికిత్సలకు 20–30 యూనిట్లు అవసరం. ఆ మేరకు లభ్యత లేక పోవడంతో సర్జరీలు వాయిదా వేయాల్సి వస్తోంది. ఒ–నెగటివ్ నిల్ హైదరాబాద్ జిల్లాలో 70 రక్తనిధి కేంద్రాలు ఉండగా, రంగారెడ్డి జిల్లాలో 14, మేడ్చల్ జిల్లాలో 8 రక్తనిధి కేంద్రాలు ఉన్నాయి. వీటిలో ఉస్మానియా, నిమ్స్, నిలోఫర్, రెడ్‌క్రాస్, ఆదిత్య, ఒవైసీ, స్టార్, ఆస్పత్రుల్లో మాత్రమే కొన్ని గ్రూపుల రక్తం నిల్వలు అందుబాటులో ఉన్నాయి. వీటిలో 200 యూనిట్లకు మించి లభ్యత లేదు. అది కూడా ఎ, బి, ఏబీ పాజిటివ్ గ్రూపులకు సంబంధించిన రక్తపు నిల్వలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. కీలకమైన ఒ–నెగటివ్ గ్రూప్ రక్తం అసలే లేదు. తలసీమియా బాధితుల ప్రాణసంకటం తలసీమియా సికిల్ సొసైటీలో 3031 మంది బాధితులు తమ పేర్లను నమోదు చేసుకున్నారు. వీరిలో తెలంగాణకు చెందిన వారు 2235 మంది ఉండగా, ఏపీ కి చెందిన వారు 705 మంది ఉన్నారు. మరో 91 మంది ఇతర రాష్ట్రాలకు చెందిన వారు ఉన్నారు. వీరిలో కొంత మందికి నెలకు రెండు యూనిట్లు (500 ఎంఎల్) రక్తం అవసరం కాగా, మరికొంతమందికి ఒక యూనిట్ (250 ఎంఎల్) అవసరమవుతుంది. రక్తనిధి కేంద్రాల్లో వీరికి అవసరమైన గ్రూపు రక్తం దొరక్కపోవడంతో బాధితులే దాతలను సమకూర్చుకోవాల్సి వస్తోంది. నెలకు రెండు సార్లు రక్తాన్ని ఎక్కించుకోవాల్సిన వారు ఒకసారితో సరిపెట్టుకుంటున్నారు. ఫలితంగా రక్తంలో హిమోగ్లోబిన్ శాతం పడిపోయి..చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడాల్సిన పరిస్థితి నెలకొంది. -
వేసవి ఆరంభంలోనే మండుతున్న ఎండలు
-
సమ్మర్ ఎఫెక్ట్: కరెంట్ మోత.. బిల్లుల వాత!
సాక్షి, సిటీబ్యూరో: ఎండలు భగ్గుమంటున్నాయి. గ్రేటర్లో పగటి ఉష్ణోగ్రతలు సగటున40 డిగ్రీలు దాటుతున్నాయి. ఉక్కపోత నుంచి ఉపశమనం కోసం నగరవాసులు ఏసీలు, కూలర్లు వినియోగిస్తున్నారు. ఫలితంగా ఇంట్లో కరెంట్ మోత మోగుతోంది. సాధారణంగా ఫిబ్రవరి వరకు నెలకు 150 యూనిట్లలోపు వాడే వినియోగదారులు ప్రస్తుతం 250– 300 యూనిట్ల వరకు ఖర్చు చేస్తున్నారు. ఫలితంగా మీటరు గిర్రున తిరిగి.. స్లాబ్‌రేట్ మారి నెలసరి విద్యుత్ బిల్లులు అమాంతం పెరిగిపోయాయి. ఇటీవల వినియోగదారుల చేతికందిన మార్చి నెల బిల్లులే ఇందుకు నిదర్శనం. భారీగా పెరిగిన బిల్లులతో వినియోగదారులు బెంబేలెత్తుతున్నారు. అసలే కరోనా కాలం.. ఆపై ఉపాధి అవకాశాలు కోల్పోయి రోడ్డున పడ్డ సగటు జీవులకు ఇవి మరింత భారంగా మారుతున్నాయి. రాత్రి వేళల్లోనూ రికార్డు స్థాయిలో.. ►నగరంలో 50 లక్షలకుపైగా విద్యుత్ కనెక్షన్లున్నాయి. గత మార్చి వరకు రోజూ పగటిపూట పీక్ అవర్‌లో కరెంట్ డిమాండ్ 2500 నుంచి 2700 మెగావాట్లకు మించలేదు. తాజాగా ఇది 2900 నుంచి 3000 మెగావాట్లు నమోదవుతోంది. రాత్రి వేళల్లోనూ రికార్డు స్థాయిలో డిమాండ్ నమోదవుతుండటంతో ఆందోళన వ్యక్తమవుతోంది. ఫలితంగా విద్యుత్ సబ్స్టేషన్లు, ఫీడర్లు, డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లపై ఒత్తిడి పెరుగుతోంది. ►సామర్థ్యానికి మించి డిమాండ్ నమోదవుతుండటంతో విద్యుత్ ఫీడర్లు తరచూ ట్రిప్పవుతున్నాయి. కరెంట్ సరఫరా నిలిచిపోతోంది. ఎప్పకప్పుడు డీటీఆర్లను పెంచకపోవడం, లూజ్లైన్లను సరిచేయక పోవడమే ఇందుకు కారణం. వేసవిలో తలెత్తే సాంకేతిక సమస్యలను తక్షణమే పరిష్కరించేందుకు పీక్ అవర్‌లోనూ ఇంజినీర్లు వినియోగదారులకు అందుబాటులో ఉండాల్సిందిగా ఆదేశాలు జారీ అయ్యాయి. -
కాస్త... ఉపశమనం
సాక్షి, విశాఖపట్నం: కొన్ని రోజులుగా ఎండలు, వడగాలులతో ఉక్కిరిబిక్కిరయిన రాష్ట్రం.. శనివారం కాస్త చల్లబడింది. ఇన్నాళ్లూ 45 డిగ్రీలకు పైగా నమోదైన ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. రానున్న 3 రోజుల పాటు సముద్ర గాలులు బలంగా వీయడం వల్ల.. వడగాలుల తీవ్రత తగ్గుముఖం పడుతుందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. మరోవైపు దక్షిణ కోస్తా నుంచి మధ్యాంధ్ర, ఉత్తరాంధ్ర వైపు గాలులు విస్తరిస్తుండగా.. మధ్య భారత దేశం నుంచి గాలులు వీస్తూ.. ఉత్తరాంధ్ర కొండల ప్రాంతాల్లో కలవడం వల్ల.. అక్కడక్కడా అకాల వర్షాలు కురిశాయి. ముఖ్యంగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ఏజెన్సీ ప్రాంతాల్లో శనివారం ఉరుములతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు పడ్డాయి. రానున్న రెండు రోజుల పాటు ఈ ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు, కురుస్తాయనీ, ఉభయగోదావరి, కృష్ణా జిల్లాల్లో ఉరుములతో కూడిన తేలిక పాటి వానలు పడతాయని నిపుణులు చెబుతున్నారు. రాయలసీమలో ఒకట్రెండు చోట్ల తేలికపాటి జల్లులు కురిసే సూచనలున్నాయని పేర్కొన్నారు. మరోవైపు పశ్చిమ గాలుల కారణంగా.. రాయలసీమలో 43 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే సూచనలున్నాయని నిపుణులు తెలిపారు. మారుతున్న వాతావరణ పరిస్థితుల కారణంగా ఏప్రిల్ 14 తర్వాత ప్రీ మాన్సూన్ సీజన్ ప్రారంభమై.. రాష్ట్రంలో తేలికపాటి వానలు కురుస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఏపీ తీరంలో ఉపరితల ఆవర్తనం.. ఉత్తర అండమాన్‌లో వాయుగుండం మయన్మార్ తీరంవైపు కదులుతూ క్రమంగా తీవ్ర అల్పపీడనంగా బలహీనపడింది. మరోవైపు ఆంధ్రప్రదేశ్ తీరం, పరిసర ప్రాంతాల్లో 2.1 కిమీ ఎత్తు వద్ద ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఉపరితల ఆవర్తన ప్రభావంతో నేడు, రేపు ఉత్తర కోస్తాంధ్ర తీరం వెంబడి గంటకు 40 నుంచి 50 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. గడచిన 24 గంటల్లో.. తిరుపతిలో 42 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా కర్నూలులో 41.2, కడపలో 40.6, అనంతపురంలో 40.2 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గడచిన 24 గంటల్లో.. విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. శ్రీకాకుళం జిల్లా సరుబుజ్జిలి మండలం పాలవలసలో సూరిబాబు(45) అనే వ్యక్తి పిడుగుపాటుకు గురై మృతి చెందారు. -
ఈ సమ్మర్..సుర్రు
సాక్షి, హైదరాబాద్: గ్లోబల్ వార్మింగ్ ప్రభావంతో ఈసారి వేసవిలో హైదరాబాద్ నగరంలో పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3 నుంచి 5 డిగ్రీలు అధికంగా నమోదయ్యే అవకాశాలున్నట్లు వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. దీనికి సూచకంగా కాంక్రీట్ మహారణ్యంలా మారిన మహానగరంలో ఫిబ్రవరి ప్రారంభంలోనే అతినీలలోహిత వికిరణ తీవ్రత (యూవీ ఇండెక్స్) ‘7’పాయింట్లకు చేరుకోవడంతో ఉక్కపోత, చర్మం, కళ్ల మంటలతో సిటిజన్లు విలవిల్లాడుతున్నారు. సాధారణం గా ఈ నెలలో యూవీ సూచీ 5 పాయింట్లకు మించరాదు. ఈ ట్రెండ్ ఇలాగే కొనసాగితే ఏప్రిల్, మే నెలల్లో యూవీ సూచీ 12 పాయింట్లు చేరుకునే ప్రమా దం పొంచి ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. గ్రేటర్ విస్తీర్ణంలో హరితం 8 శాతానికే పరిమితం కావడం, ఊపిరి సలపని రీతిలో నిర్మించిన బహుళ అంతస్తుల కాంక్రీటు, గాజు మేడల నుంచి ఉష్ణం వాతావరణంలో తేలికగా కలవకుండా భూఉపరితల వాతావరణానికే పరిమితం కావడంతో ఫిబ్రవరిలోనే వికిరణ తీవ్రత పెరిగి ఒళ్లు, కళ్లు మండిపోతున్నాయని హైదరాబాదీలు గగ్గోలు పెడుతున్నారు. పెరిగే ‘యూవీ’తో ఇక్కట్లు.. యూవీ ఇండెక్స్ పెరగటంతో ఓజోన్ పొర మందం తగ్గి ప్రచండ భానుడి నుంచి వెలువడే అతినీలలోహిత కిరణాలు నేరుగా భూ వాతావరణంలోకి చేరుకుంటున్నాయి. కిరణాలు మనుషులపై పడుతుండటంతో కళ్లు, చర్మ సంబంధ వ్యాధులతో విలవిల్లాడుతున్నారు. ఎండలో ఎక్కువసేపు తిరిగితే కళ్లు, చర్మం మండటం, రెటీనా దెబ్బతినడం వంటివి తలెత్తుతున్నాయి. యూవీ సూచీ సాధారణంగా 5 పాయింట్లకు పరిమితమైతే ఎలాంటి ఇబ్బందులుండవు. 10 పాయింట్లు నమోదైతే ప్రమాదం తథ్యం. 12 పాయింట్లు దాటితే చర్మ కేన్సర్లు పెరిగే ప్రమాదం పొంచి ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇంటి నుంచి బయటికి వెళ్లే సమయంలో వికిరణ తీవ్రత నుంచి రక్షణ పొందేందుకు సన్ స్కిన్ లోషన్లు రాసుకోవాలని, చలువ కళ్లద్దాలు, క్యాప్ ధరించాలని, ఎండ తీవ్రత నుంచి రక్షణ పొందేందుకు గొడుగు తీసుకెళ్లాలని వైద్యులు సూచిస్తున్నారు. హరితహారం పనిచేయలేదు.. మహా నగరాన్ని గ్రీన్‌సిటీగా మార్చేందుకు ప్రభుత్వం ఉద్యమస్ఫూర్తితో తలపెట్టిన హరితహారం కార్యక్రమం ఉద్దేశం బాగానే ఉన్నా.. నగరంలో గ్రీన్‌బెల్ట్‌ను గణనీయంగా పెంచేందుకు దోహదం చేయలేదని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హరితహారంలో భాగంగా గతేడాది 95 శాతం ఇళ్లలో పెంచుకునే కరివేపాకు, తులసి, ఉసిరి, క్రోటన్స్, పూల మొక్కలను పంపిణీ చేశారని.. బహిరంగ ప్రదేశాలు, ప్రధాన రహదారులు, పార్కులు, ఖాళీ స్థలాలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ రంగ, ప్రైవేటు సంస్థల్లో ఏపుగా పెరిగి ఆక్సిజన్ శాతాన్ని పెంచే రావి, మద్ది, మర్రి, చింత వంటి మొక్కల్లో 5 శాతం మాత్రమే నాటినట్లు పర్యావరణ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దీంతో గ్రేటర్లో గ్రీన్‌బెల్ట్ 8 శాతానికే పరిమితమైందని.. ప్రభుత్వం చేపట్టిన హరితహారంతో గ్రీన్‌బెల్ట్ 15 శాతానికి పెరగటం అసాధ్యమని అంటున్నారు. గ్రీన్‌బెల్ట్ విషయంలో దేశంలో పలు మెట్రో నగరాల్లో మహానగరం ఏడో స్థానంలో నిలిచిందని పర్యావరణవేత్తలు పేర్కొంటున్నారు. హరితం తగ్గుముఖం.. శతాబ్దాలుగా తోటల నగరం (బాగ్) గా ప్రసిద్ధి చెందిన భాగ్యనగరంలో ఇప్పుడు హరిత వాతావరణం రోజురోజుకూ తగ్గుముఖం పడుతోంది. రహదారులు, బహుళ అంతస్తుల భవంతులు శరవేగంగా విస్తరిస్తుండటంతో కాంక్రీట్ మహారణ్యంలా మారిన నగరంలో హరిత వాతావరణం క్రమేణా కనుమరుగై పర్యావరణం వేడెక్కుతోం ది. అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం జీహెచ్ఎంసీ పరిధిలో 30 శాతం గ్రీన్‌బెల్ట్ ఉండాల్సి ఉండగా.. నగరంలో కేవలం 8 శాతమే ఉండటంతో నగరంలో ప్రాణవాయువు కనుమరుగై సిటిజన్లు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. గ్రీన్‌బెల్ట్ శాతం పలు మెట్రో నగరాల్లో ఇలా.. స్థానం నగరం హరితం శాతం 1 చండీగఢ్ 35 2 ఢిల్లీ 20.20 3 బెంగళూరు 19 4 కోల్‌కతా 15 5 ముంబై 10 6 చెన్నై 9.5 7 హైదరాబాద్ 8 -
భానుడి భగభగ; అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు
సాక్షి, అమరావతి : భానుడు భగభగలకు రాష్ట్ర వ్యాప్తంగా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ముఖ్యంగా కోస్తా ప్రాంతంలో ఎండలు మరింత మండిపోతున్నాయి. వాతావరణంలో తేమ శాతం గణనీయంగా తగ్గిపోవడంతో ఎండ తీవ్రత ఈ నెల 18 వరకు ఇలాగే కొనసాగనున్నట్లు వాతావరణ నిపుణులు తెలిపారు. రాష్ట్రంలో వడగాల్పుల తీవ్రత అధికంగా ఉందని.. కావున ప్రజలు ఇంట్లో నుంచి బయటకు వచ్చేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అంతేకాక సాధ్యమైనంత వరకు ఎండలో తిరగకుండా ఉండాలని, ఇక వృద్ధులు, చిన్నపిల్లలతై బయటకు రాకపోవడమే మేలని పేర్కొన్నారు. ఈ రోజు మధ్యాహ్నం వరకు నమోదైన ఉష్ణోగ్రతల వివరాలు : ► ప్రకాశం జిల్లా టంగుటూరులో అత్యధికంగా 45.27 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత నమోదు ► విశాఖపట్నం జిల్లా బోయిల కింటాడలో 45.25 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత ► విజయగనరం పట్టణంలో 45.19 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత ► తూర్పు గోదావరి జిల్లా చామవరం, తునిలో 45.18 సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత నమోదు ► శ్రీకాకుళం జిల్లా మెలియాపుట్టిలో 44.90 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత సహా మొత్తం 31 ప్రాంతాల్లో 44 నుండి 46 డిగ్రీల సెంటిగ్రేడ్ మధ్య ఉష్ణోగ్రతలు, 172 ప్రాతాల్లో 42 నుండి 44 డిగ్రీల సెంటిగ్రేడ్ మధ్య ఉష్ణోగ్రతలు నమోదైనట్లు రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ (ఆర్టీజీఎస్- ఏపీ) తెలిపింది. -
నిప్పుల గుండాలుగా తెలుగు రాష్ట్రాలు
-
బెదిరిపోతున్న బెజవాడ వాసులు..
సాక్షి, అమరావతి/ హైదరాబాద్ : రెండు తెలుగు రాష్ట్రాలు నిప్పుల గుండాలను తలపిస్తున్నాయి. భానుడి ప్రతాపంతో తెలుగు రాష్ట్రాల ప్రజలు అల్లాడుతున్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అగ్నిగుండాన్ని తలపిస్తోంది. రోహిణీ కార్తె ప్రవేశించిన ఒక రోజులోనే భానుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు. సాధారణం కంటే మూడు, ఆరు డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలతో దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాలు అట్టుడికిపోతున్నాయి. జనం ఉక్కపోతతో అల్లాడిపోతున్నారు. గుంటూరు, కృష్ణా, చిత్తూరు, వైఎస్ఆర్, నెల్లూరు జిల్లాల్లో వడగాల్పులు వీస్తున్నాయి. గుంటూరు జిల్లా రెంటచింతల మండలంలోని జంగమహేశ్వరంలో 46డిగ్రీలు, తిరుపతి, విజయవాడ, రాజధాని అమరావతిలో 45డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్టు భారత వాతావరణ శాఖ తెలిపింది. రానున్న మూడు రోజులు కోస్తాంధ్ర, రాయలసీమల్లో ఉష్ణోగ్రతలు మూడు, నాలుగు డిగ్రీలు అధికంగా నమోదవుతాయని అంచనా వేస్తున్నారు. మరో వారంపాటు ఉష్ణోగ్రతలు మరింతగా పెరిగే పరిస్థితులు ఉన్నాయని చెప్తున్నారు. ఏపీలో కనిష్ట ఉష్ణోగ్రతలు కూడా పెరుగుతున్నాయి. రాత్రి వేళ పలుచోట్ల 28 నుంచి 33 డిగ్రీలు నమోదవుతున్నాయి. అంటే ఇవి సాధారణం కంటే నాలుగు, ఆరు డిగ్రీలు అధికం. ఫలితంగా రాత్రి వేళ కూడా ఉష్ణతీవ్రతతో కూడిన గాలులు వీస్తున్నాయి. మరోవైపు వడగాల్పులకు విజయనగరం జిల్లాలో ఒకరు, గుంటూరు జిల్లాలో ఇద్దరు మృతిచెందినట్టు సమాచారం. బెదిరిపోతున్న బెజవాడ వాసులు భానుడు ప్రతాపానికి బెజవాడ వాసులు బెదిరిపోతున్నారు. రోళ్లు పగిలే రోహిణీ కార్తె ఎండలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఉదయం నుంచి బయటకు రావాలంటేనే జంకుతున్నారు. రోహిణీ కార్తెలో రోళ్లు పగిలే ఎండలు ప్రజలకు చుక్కలు చూపిస్తున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు అవుతుండటం, గాలిలో తేమ శాతం పెద్దఎత్తున పడిపోతుండటంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఇక తెలంగాణ రాష్ట్రంలోని 20 ప్రాంతాల్లో 47 డిగ్రీలు కన్నా ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదు కావడం, నిజామాబాద్‌లో 17, హైదరాబాద్‌లో 20 శాతానికి గాలిలో తేమ శాతం పడిపోవడం ఆందోళన కలిగిస్తోంది. తెలంగాణలోని 20 గ్రామాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో... వాతావరణ శాఖ ప్రమాద హెచ్చరికలు జారీ చేసింది. మంచిర్యాల జిల్లా వేమన్‌పల్లి మండలం నీల్వాయి గ్రామంలో రాష్ట్రంలోనే అత్యధికంగా 47.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయిందని ప్లానింగ్ డెవలప్మెంట్ సొసైటీ వెల్లడించింది. సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
ఎండలో తిరగకుండా జాగ్రత్త పడండి
సాక్షి, అమరావతి : భానుడి భగభగలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అల్లాడిపోతోంది. మధ్యాహ్నం వేళలో 44డిగ్రీల చేరుతున్న ఉష్ణోగ్రతలు ఇబ్బందిపెడుతున్నాయి. ఈ నేపథ్యంలో రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ (ఆర్టీజీఎస్) కొన్ని సూచనలు చేసింది. ప్రజలు ఎక్కువగా ఎండల్లో తిరుగకుండా ఉండాలని సూచించింది. వడగాల్పుల తీవ్రత ఎక్కువగా ఉంటుందని హెచ్చరించింది. చిత్తూరు జిల్లాలో అత్యధిక ఉష్టోగ్రతలు నమోదయ్యాయని, జిల్లాలోని విజయపురంలో 46.02, నగరిలో 46, వరదయ్యపాలెంలో 45 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని వెల్లడించింది. గుంటూరు జిల్లా ముప్పాళ్లలో 45, కృష్ణా జిల్లా మచిలీపట్నంలో 45. 49, ప్రకాశంలో 44. 67, నెల్లూరులో 44.10 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాని తెలిపింది. -
చల్లగా ఉందాం..
చిత్తూరు :ఎండలు భగభగమంటున్నాయి. సూర్యుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. ఉక్కపోతలు అధికం కావడంతో ప్రజలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. గతంలో ఎన్నడు లేని విధంగా ఈసారి 42 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ క్రమంలోనే శరీరంలోని నీటి నిల్వలు, ఖనిజ లవణాల శాతం తగ్గిపోయి వడదెబ్బకు గురయ్యే ప్రమాదముంటుందని వైద్యులు సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో వివిధ రకాల పండ్లు, కాయలు, రసాలు తీసుకుంటే వేసవి తాపం నుంచి ఉపశమనం పొందే అవకాశముంటుందని చెబుతున్నారు. కొబ్బరిబొండం కొబ్బరి నీళ్లు తాగితే తాపం తగ్గుతుంది. శరీరం డీ హైడ్రేషన్ కు గురికాకుండా నిలువరిస్తుంది. కొబ్బరిబొండంలో కాల్షియం, పాస్పరస్, విటమిన్ బీ1, బీ3, సీ మొండుగా లభిస్తాయి. ఇవీ పోషకాలు నీరు–93.08 శాతం, శక్తి–24 కిలో కేలరీలు, కాల్షియం–25 మిల్లీగ్రాములు, పాస్పరస్– 10 మిల్లిగ్రాములు, విటమిన్ బీ1–0.01 మిల్లీగ్రాములు, విటమిన్ బీ3– 0.1మిల్లీ గ్రాము, విటమిన్ సీ–2 మిల్లీగ్రాములు ఉంటాయి. దోసకాయ వేసవిలో దోసకాయ తింటే ఎంతో మేలు కలుగుతుంది. ఇందులో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. దోసకాయ తింటే 13 కిలోకేలరీల శక్తి ఉత్పన్నమై శరీరం ఆరోగ్యవంతంగా ఉంటుంది. కాల్షియం, పాస్పరస్, ఫోలిక్‌యాసిడ్, విటమిన్ సీ, బీ, డీ అలసట దూరమవుతుంది. ఇవీ పోషకాలు నీరు–96.9శాతం, శక్తి–13 కిలో కేలరీలు, కాల్షియం–10 మిల్లీగ్రాములు, పాస్పరస్– 25 మిల్లీగ్రాములు, పోలిక్‌యాసిడ్–14.7 మిల్లీగ్రాములు, విటమిన్ సీ–17 మిల్లీగ్రాములు, విటమిన్ బీ–0.2 మిల్లీగ్రాములు, విటమిన్ డీ–0.3 మిల్లీ గ్రాములు ఉంటాయి. పుచ్చకాయ పుచ్చకాయలో నీటితో పాటు పిండి పదార్థాలు అధికంగా ఉంటాయి. జ్యూస్ తాగినా, నేరుగా తిన్నా వేడి నుంచి ఉపశమనం పొందవచ్చు. విటమిన్ బీ6 ఎనర్జీ లభిస్తుంది. ఇవీ పోషకాలు నీరు–92శాతం, విటమిన్ బీ–6 మిల్లీ గ్రాములు, పిండి పదార్థం–7 శాతం, శక్తి–16 కిలో కేలరీలు ఉంటాయి. ద్రాక్ష దాక్ష పండు తిన్నా, రసం తాగినా శరీరానికి ఎంతో శక్తి వస్తుంది. అన్ని పండ్ల కన్నా ద్రాక్షలో కేలరీలు బాగా లభిస్తాయి. నీరు, ప్రొటీన్లు, కొవ్వు, పీచుపదార్థాలు, ఐరన్ మెండుగా ఉంటాయి. ఇవీ పోషకాలు నీరు–92.2 శాతం, ప్రొటీన్లు–0.4 గ్రాములు, కొవ్వు పదార్థాలు– 0.3 గ్రాములు, పీచు పదార్థాలు– 2.9 గ్రాములు, ఐరన్ శక్తి–0.52 మిల్లీ గ్రాములు, శక్తి– 71 కిలో కేలరీలు లభిస్తాయి. అరటి పండు అరటి పండు సులభంగా జీర్ణమై రక్తంలో కలుస్తుంది. మలబద్ధకాన్ని నివారిస్తుంది. కొలెస్ట్రాల్ తగ్గించి అధిక రక్తపోటును కంట్రోల్లో ఉంచుతుంది. మినరల్స్, పొటాషియం ఎక్కువగా లభిస్తాయి. ఈపండులో 70.1గ్రాముల నీరు ఉంటుంది. ప్రొటీన్లు 1.2 గ్రాములు, కొవ్వు 0.3 గ్రాములు, పిండిపదార్థాలు 27.2 గ్రాములు ఉంటాయి. మామిడి పండు మామిడి పండులో కార్బన్ కణాలను అరికట్టే గొప్ప గుణం ఉంది. ఇందులో ఉండే ఫాలీఫినోల్ ఇందుకు సహకరిస్తుంది. 15 శాతం చక్కెర, ఒక శాతం మాంసకృతులు, ఏ,బీ, సీ విటమిన్లు ఉంటాయి. పిండిపదార్థాలు 17.00 గ్రాములు, చక్కెర 14.8 గ్రాములు, పీచు పదార్థాలు 0.27, మాంసకృత్తులు 51 గ్రాములు, థయామిన్ 0.058, సియాసిస్ 0.0584 లు ఉంటాయి. -
సిటీ హీట్
సాక్షి, సిటీబ్యూరో: నగరంలో ఎండలు మండుతున్నాయి. తీవ్రస్థాయిలో వడగాడ్పులు వీస్తున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు అత్యధికంగా నమోదవుతున్నాయి. మరిన్ని రోజులు ఇదే పరిస్థితి కొనసాగుతుందని, నగరవాసులు జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ సూచించింది. నగరంలో శుక్రవారం 42డిగ్రీల సగటు ఉష్ణోగ్రత నమోదు కాగా.. అత్యధికంగా శివారులోని శామీర్‌పేట, కీసరలలో 43.9, ఘట్కేసర్లో 43.4, మేడ్చల్‌లో 43.3 డిగ్రీలు నమోదయ్యాయి. ఇక సిటీ పరిధిలో అత్యధికంగా బహదూర్‌పురాలో 42.8, సైదాబాద్‌లో 42.3, బండ్లగూడలో 42.2, ఖైరతాబాద్‌లో 42.1, ముషీరాబాద్‌లో 41.9, అమీర్‌పేట్‌లో 41.8, సరూర్‌నగర్‌లో 41.7, హిమాయత్‌నగర్‌లో 41.4, ఉప్పల్‌లో 41.4, శేరిలింగంపల్లిలో 41.3 డిగ్రీలు నమోదయ్యాయి. వాస్తవానికి ఈ సీజన్లో సగటు ఉష్ణోగ్రత 39 డిగ్రీలు నమోదు కావాల్సి ఉండగా... సాధారణం కంటే 3–4 డిగ్రీలు అధికంగా నమోదవుతుండడం ఆందోళన కలిగిస్తోంది. నగరంలో 2010 మే 12న 44.5 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదు కాగా... 2018 మే 2న 42.5, 2017 మే 25న 43.2, 2016 మే 1న 42.1 డిగ్రీలు నమోదైంది. ఈ ఏడాది ఇప్పటికే 42.8 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ఇదిలా ఉండగా నగరంలో శుక్రవారం రికార్డు స్థాయిలో 3,102 మెగావాట్ల విద్యుత్ వినియోగమైంది. డిస్కం చరిత్రలో ఇదే అత్యధికం. 2018 మే 30న 2,958 మెగావాట్ల విద్యుత్ వినియోగించారు. అధిక విద్యుత్ వినియోగంతో పలు ఫీడర్లు ట్రిప్ అవుతున్నా.. 5–10 నిమిషాల్లో సరఫరా పునరుద్ధరిస్తున్నామని డిస్కం అధికారులు తెలిపారు. -
ఫుల్ కిక్కు!
మహబూబ్‌నగర్ విద్యావిభాగం: వేసవి సెలవులు పూర్తయి విద్యాసంవత్సరం ప్రారంభం కాగానే ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు సకాలంలో పుస్తకాలు అందించేందుకు విద్యాశాఖ ముందస్తుగానే ఏర్పాట్లు చేసింది. ఇందుకోసం మహబూబ్‌నగర్, నారాయణపేట జిల్లాలకు కలిపి అధికారులు ప్రతిపాదనలు పంపగా మొదటి విడతలో సగానికి పైగానే పుస్తకాలు వచ్చేశాయి. వాటిని మండలాల వారీగా సర్దుకుని పంపిణీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. గతంలో మాదిరి కాకుండా ఈ సారి అన్ని పాఠశాలల్లో విద్యార్థులకు సరిపోయే పుస్తకాలను అందించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రభుత్వం పంపిణీ చేసిన పుస్తకాలు పక్కదారి పడుతున్నాయన్న ఆరోపణలను కొట్టిపారేస్తూ ఈ విద్యాసంవత్సరం నుంచి ప్రతి పుస్తకానికి కూడా ఒక ప్రత్యేకమైన కోడ్‌ను విధించారు. వీటిని విద్యార్థులకు పంపిణీ చేసేటప్పడు వారి ఆధార్‌కార్డుతో అనుసంధానం చేస్తారు. అయితే పూర్తి స్థాయిలో పుస్తకాలు గతంలో అందుబాటులో లేనప్పుడు ప్రతి పాఠశాలలో కూడా బుక్‌బ్యాంక్ పద్ధతిలో విద్యార్థులందరికీ మండుతున్న ఎండలకు తడారిపోతున్న గొంతులను తడిపేందుకు మందు ప్రియులు బీర్లను తెగతాగేస్తున్నారు. గతేడాదితో పోలిస్తే.. పది శాతానికి పైగా విక్రయాలు జరిగాయి. ఉక్కపోతలకు విస్కీ ప్రియులు సైతం బీర్ల వైపే ఆసక్తి చూపడంతో కేసుల కొద్ది బీర్లు ఖర్చవుతున్నాయి. సర్పంచ్, పార్లమెంట్ ఎన్నికలు, ప్రాదేశిక ఎన్నికలు కూడా కలిసి రావడంతో బీర్ల అమ్మకాల్లో జోరు కొనసాగింది. ఈ నాలుగు నెలల్లోనే రూ.171కోట్ల బీర్లు విక్రయించారు. మండుతుండటంతో గడిచిన నాలుగు నెలల్లో బార్లు, వైన్స్ షాపులలో బీర్లు అధికంగా అమ్ముడుపోయి ప్రభుత్వ ఖజానాలో భారీగా నగదు జమ అయింది. గతేడాది జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ మాసాల్లో కలిపి రూ.145.76కోట్ల వ్యాపారం జరగగా, ఈ ఏడాది రూ.171.34కోట్ల వ్యాపారం సాగింది. అంటే దాదాపు రూ.25కోట్ల వ్యాపారం ఎక్కువగా సాగింది. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా మహబూబ్‌నగర్ జిల్లాలో 66 వైన్స్‌లు, 13 బార్లు, 1 ఎలైట్ బార్, నాగర్‌కర్నూల్ జిల్లాలో 45 వైన్స్‌లు, 7 బార్లు, వనపర్తి జిల్లాలో 29 వైన్స్‌లు, 4బార్లు , 1ఎలైట్ బార్, జోగుళాంబ గద్వాలలో 24 వైన్స్‌లు, 4బార్లు ఉన్నాయి. రికార్డుస్థాయిలో బీర్ల అమ్మకాలు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా గడిచిన ఏడాది జనవరి నుంచి ఏప్రిల్‌వరకు జరిగిన బీర్ల విక్రయాల కంటే ప్రస్తుత సంవత్సరం జనవరి నుంచి ఏప్రిల్ వరకు ఎక్కువగా బీర్ల విక్రయాలు జరిగినట్లు గణాంకాలు చెపుతున్నాయి. గడిచిన ఏడాది జనవరిలో 2,89,903 కాటన్లు అమ్ముడు పోగా రూ.29.7కోట్లు, ఫిబ్రవరిలో 2,21,506 కాటన్ల విక్రయాలు జరగగా, రూ.22.82కోట్లు, మార్చిలో 4,23,235కాటన్లు అమ్ముడుపోగా, రూ.43.55 కోట్లు, ఏప్రిల్‌లో 4,45,653 కాటన్లు అమ్ముడు పోగా రూ.49.69కోట్ల ఆదాయం వచ్చింది. 2019 జనవరిలో 3,16,687 కాటన్ల బీర్లు అమ్ముడు పోగా రూ.34.93 కోట్లు, ఫిబ్రవరిలో 2,96119 కాటన్లకు రూ.32.91కోట్లు, మార్చిలో 4,46,545, కాటన్లకు రూ.49.44 కోట్లు, ఏప్రిల్‌లో 4,50,502 కాటన్లకు రూ. 54.06 కోట్ల ఆదాయం వచ్చింది. ఈ లెక్కన గతేడాదితో పోలిస్తే ఈ జనవరిలో రూ.5.23కోట్లు, ఫిబ్రవరిలో రూ.10.09కోట్లు, మార్చిలో రూ.6.11కోట్లు, ఏప్రిల్‌లో రూ.4.37కోట్ల ఆదాయం ఎక్కువగా వచ్చింది. అధిక ధరకు విక్రయాలు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా నిర్వహిస్తున్న బెల్టుషాపులలో మద్యాన్ని అధిక ధరలకు విక్రయిస్తున్నారు. అదే విధంగా ఆయా జిల్లా పరిధిలోని మద్యం దుకాణాలలో యజమానులు వయస్సుతో నిమిత్తం లేకుండా దుకాణాలకు వచ్చే ప్రతి ఒక్కరికీ మద్యాన్ని విక్రయిస్తున్నారు. అందులో మైనర్లు కూడా మద్యాన్ని విక్రయిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. -
ఉదయం ఐదుకే పోలింగ్ ఓకేనా?
న్యూఢిల్లీ: విపరీతమైన ఎండలు, రంజాన్ పర్వదినాల్లో ఉపవాసాల నేపథ్యంలో సార్వత్రిక ఎన్నికల తదుపరి దశల్లో పోలింగ్‌ను ఉదయం 5 గంటలకే ప్రారంభించాలంటూ దాఖలైన పిటిషన్‌పై తమ నిర్ణయం చెప్పాల్సిందిగా కేంద్ర ఎన్నికల సంఘాన్ని సుప్రీంకోర్టు గురువారం ఆదేశించింది. ఉదయం 5 గంటలకే పోలింగ్ నిర్వహించాలని తాము ఎన్నికల సంఘానికి వినతిపత్రం అందించామని, అయితే వారి నుంచి ఎటువంటి స్పందన లేకపోవడంతోనే ఈ పిటిషన్‌ను దాఖలు చేస్తున్నామని పిటిషన్ వేసిన లాయర్లు మహమ్మద్ నిజాముద్దీన్ పాషా, అసద్ హయత్లు సుప్రీంకోర్టుకు తెలిపారు. -
ఎవరి ఆశలకు గండి..?
సాక్షి, రంగారెడ్డి జిల్లా: చేవెళ్ల లోక్‌సభ స్థానం పరిధిలో తక్కువగా నమోదైన పోలింగ్ శాతం ఎవరి విజయావకాశాలకు గండికొడుతుందోనన్న బెంగ రాజకీయ పార్టీల్లో మొదలైంది. గత లోక్‌సభ ఎన్నికలు, ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలతో పోల్చితే ఈసారి పోలింగ్ శాతం తగ్గింది. తాజా లోక్‌సభ ఎన్నికల్లో 53.84 శాతం పోలింగ్‌కాగా.. 2014లో జరిగిన ఎన్నికల్లో 60.51 శాతం మంది ఓటేశారు. అంటే పోలింగ్ 6.67 శాతం తగ్గింది. ఈ లోక్‌సభ పరిధిలో మొత్తం ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లు ఉండగా.. మూడు నియోజకవర్గాల్లో కనీసం 50 శాతం కూడా పోలింగ్ నమోదు కాకపోవడం ఆందోళన కలిగించే అంశం. ముఖ్యంగా పట్టణ ప్రాంతాలైన శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్ నియోజకవర్గాల్లో చాలా మంది ఓటర్లు పోలింగ్‌కు దూరంగా ఉన్నారు. కొందరు సెటిటర్లు వారి స్వస్థలాలకు వెళ్లడంతో పాటు ఐటీ, సాఫ్ట్వేర్ కంపెనీలకు వరుస సెలవులు ఉండటంతో ఉద్యోగులు కుటుంబాలతో సహా పల్లెబాట పట్టారు. అలాగే ఎండల తీవ్రత కూడా పోలింగ్‌పై ప్రభావం చూపినట్లు తెలుస్తోంది. బయటకు వచ్చేందుకు సాహసించలేదని తెలుస్తోంది. ఈ కారణాల వల్లే పట్టణ ప్రాంతాల్లో పోలింగ్ తగ్గిందన్నది అందరి విశ్లేషణ. మరోపక్క వరుస ఎన్ని కలు రావడంతో చాలా మంది సొంత గ్రామాలకు వెళ్లి ఓటు వేయడానికి ఆసక్తి చూపడం లేదు. ఇటీవల కాలంలోనే అసెంబ్లీ ఎన్నికలు, ఆ తర్వాత గ్రామ పంచాయతీ ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. ఈ రెండు ఎన్నికల్లోనూ ఓటర్లు ఉత్సాహంగా పోలింగ్‌లో పాల్గొన్నారు. ఆ తర్వాతి కొద్ది కాలానికే లోక్‌సభ ఎన్నికలు రావడంతో.. సొంత ఊళ్లకు వెళ్లేందుకు మొగ్గుచూపలేదని తెలుస్తోంది.ఎండల తీవ్రత, వ్యయ ప్రయాసాలను చూసి వెనకడుగు వేసినట్లు తెలుస్తోంది. పైగా స్థానిక, అసెంబ్లీ ఎన్నికలతో పోల్చుకుంటే.. అభ్యర్థుల ప్రచారం పెద్దగా లేదు. ఇంటింటికీ వెళ్లి ఓటర్లను ప్రసన్నం చేసుకున్న సందర్భాలు చాలా తక్కువ. వీటన్నింటి నేపథ్యంలోనే పోలింగ్ శాతం తగ్గిందని తెలుస్తోంది. మరోపక్క పూర్తిగా గ్రామీణ ప్రాంతాలైన చేవెళ్ల, వికారాబాద్, పరిగి, తాండూరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఓటర్లలో చైతన్యం వెల్లివిరిసింది. ఇక్కడ గణనీయంగా పోలింగ్ శాతం నమోదైంది. -
అభ్యర్థుల్లో టెన్‘సన్’!
సాక్షి,నర్సంపేట: ఐదు రోజుల్లో లోక్‌సభ ఎన్నికల పోలింగ్.. ఈ సమయంలో అభ్యర్థులు ప్రచారంలో ఉధృతి పెంచితేనే ఓటర్లను తమ వైపునకు తిప్పుకునే అవకాశముంటుంది.. కానీ మండుతున్న ఎండలతో ప్రచారంపై పెనుప్రభావం పడుతోంది. ప్రస్తుతం ఉష్ణోగ్రత 40 డిగ్రీల సెల్సియస్ దాటుతున్న నేపథ్యంలో ప్రచారంలో కలిసొచ్చేందుకు కార్యకర్తలు, నాయకులు జంకుతున్నారు. రాష్ట్రస్థాయి నేతలు వస్తేనే బహిరంగ సభలు తప్ప ఎండల ప్రభావంతో నేతలు సైతం ఇంటింటి ప్రచారానికి, రోడ్ షోలకు సాయంత్రం పూట తరలుతున్నారు. ఎండే కారణం.. మహబూబాబాద్ లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో ఈ నెల 4న జరిగిన ముఖ్యమంత్రి కేసీఆర్ బహిరంగ సభ మినహా భారీ ప్రచార సభలు, కార్యక్రమాలేవీ జరగలేదు. దీనికి ప్రధాన కారణం ఎండలేనని చెబుతున్నారు. మార్చి నుంచే ఎండల తీవ్రత రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో అభ్యర్థులు, రాజకీయ నాయకులు నియోజకవర్గ వ్యాప్తంగా పూర్తి స్థాయిలో పర్యటించలేకపోతున్నారు. దీంతో గ్రామాల్లో ఎన్నికల ప్రచార సందడి స్తబ్దుగా కనిపిస్తోంది. ఉదయం 8 గంటల నుంచి 11 గంటల వరకు మాత్రమే ప్రచార రథాలు గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో కనిపిస్తున్నాయి. ఇక వాతావరణం చల్లబడ్డాక సాయంత్రం వేళల్లో మాత్రమే రాజకీయ పక్షాలు కాలనీలు, గ్రామాల పర్యటనలను తిరిగి చేపడుతున్నారు. దీంతో ఉదయం, సాయంత్రం వేళల్లో మాత్రమే ఎన్నికల కోలాహలం కనిపిస్తోంది. ఇందులో భాగంగానే శుక్రవారం సాయంత్రం నర్సంపేట నియోజకవర్గంలోని దుగ్గొండి మండలంలో మహబూబాబాద్ లోక్‌సభ కాంగ్రెస్ అభ్యర్ధి బలరాంనాయక్ రోడ్డు షోను నిర్వహించారు. వ్యవసాయ పనులు మరోవైపు.. ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులు, ముఖ్య నాయకుల పర్యటనలను మిశ్రమ స్పందన లభిస్తోంది. గ్రామాల్లో వరి మార్పిడి పనులు ముమ్మరంగా సాగుతుండగా, ఎండ తీవ్రత తట్టుకోలేక పెద్ద మొత్తంలో జనం కలిసి నడిచేందుకు వెనకాడుతున్నారు. ఇటీవల పూర్తయిన అసెంబ్లీ ఎన్నికలతో పోల్చుకుంటే పార్లమెంట్ ఎన్నిక ప్రచారాల్లో జన బలం అంతగా కనిపించడం లేదనే విషయాన్ని రాజకీయ వర్గాలే చెబుతున్నాయి. వ్యవసాయ పనులు, ఎండ తీవ్రత పెరగడమే ఈ పరిస్థితికి ప్రధాన కారణంగా భావిస్తున్నారు. 40 డిగ్రీలు దాటుతున్న ఉష్ణోగ్రత ఈనెల ప్రారంభ నుంచి ప్రతిరోజు ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు 40 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదవుతుండడంతో ప్రచారానికి వెళ్లే వారికి ఎండ దెబ్బ తప్పడం లేదు. ఎన్నికల ప్రచారం ముగింపు నాటికి మరింత ఉష్ణోగ్రతలు తీవ్రమయ్యే అవకాశం ఉండడంతో అభ్యర్థుల్లో టెన్‘సన్’మరింత పెరుగుతోంది. ఇప్పటివరకు నియోజకవర్గాన్ని పూర్తిగా పర్యటించలేని అభ్యర్థులు, నాయకులు ఉన్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.