![Alcohol Sales Increased In Mahabubnagar - Sakshi](/styles/webp/s3/article_images/2019/05/9/ALCAHAL.jpg.webp?itok=s_zSRK-a)
మహబూబ్‌నగర్ విద్యావిభాగం: వేసవి సెలవులు పూర్తయి విద్యాసంవత్సరం ప్రారంభం కాగానే ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు సకాలంలో పుస్తకాలు అందించేందుకు విద్యాశాఖ ముందస్తుగానే ఏర్పాట్లు చేసింది. ఇందుకోసం మహబూబ్‌నగర్, నారాయణపేట జిల్లాలకు కలిపి అధికారులు ప్రతిపాదనలు పంపగా మొదటి విడతలో సగానికి పైగానే పుస్తకాలు వచ్చేశాయి. వాటిని మండలాల వారీగా సర్దుకుని పంపిణీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. గతంలో మాదిరి కాకుండా ఈ సారి అన్ని పాఠశాలల్లో విద్యార్థులకు సరిపోయే పుస్తకాలను అందించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రభుత్వం పంపిణీ చేసిన పుస్తకాలు పక్కదారి పడుతున్నాయన్న ఆరోపణలను కొట్టిపారేస్తూ ఈ విద్యాసంవత్సరం నుంచి ప్రతి పుస్తకానికి కూడా ఒక ప్రత్యేకమైన కోడ్‌ను విధించారు. వీటిని విద్యార్థులకు పంపిణీ చేసేటప్పడు వారి ఆధార్‌కార్డుతో అనుసంధానం చేస్తారు.
అయితే పూర్తి స్థాయిలో పుస్తకాలు గతంలో అందుబాటులో లేనప్పుడు ప్రతి పాఠశాలలో కూడా బుక్‌బ్యాంక్ పద్ధతిలో విద్యార్థులందరికీ మండుతున్న ఎండలకు తడారిపోతున్న గొంతులను తడిపేందుకు మందు ప్రియులు బీర్లను తెగతాగేస్తున్నారు. గతేడాదితో పోలిస్తే.. పది శాతానికి పైగా విక్రయాలు జరిగాయి. ఉక్కపోతలకు విస్కీ ప్రియులు సైతం బీర్ల వైపే ఆసక్తి చూపడంతో కేసుల కొద్ది బీర్లు ఖర్చవుతున్నాయి. సర్పంచ్, పార్లమెంట్ ఎన్నికలు, ప్రాదేశిక ఎన్నికలు కూడా కలిసి రావడంతో బీర్ల అమ్మకాల్లో జోరు కొనసాగింది.
ఈ నాలుగు నెలల్లోనే రూ.171కోట్ల బీర్లు విక్రయించారు. మండుతుండటంతో గడిచిన నాలుగు నెలల్లో బార్లు, వైన్స్ షాపులలో బీర్లు అధికంగా అమ్ముడుపోయి ప్రభుత్వ ఖజానాలో భారీగా నగదు జమ అయింది. గతేడాది జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ మాసాల్లో కలిపి రూ.145.76కోట్ల వ్యాపారం జరగగా, ఈ ఏడాది రూ.171.34కోట్ల వ్యాపారం సాగింది. అంటే దాదాపు రూ.25కోట్ల వ్యాపారం ఎక్కువగా సాగింది. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా మహబూబ్‌నగర్ జిల్లాలో 66 వైన్స్‌లు, 13 బార్లు, 1 ఎలైట్ బార్, నాగర్‌కర్నూల్ జిల్లాలో 45 వైన్స్‌లు, 7 బార్లు, వనపర్తి జిల్లాలో 29 వైన్స్‌లు, 4బార్లు , 1ఎలైట్ బార్, జోగుళాంబ గద్వాలలో 24 వైన్స్‌లు, 4బార్లు ఉన్నాయి.
రికార్డుస్థాయిలో బీర్ల అమ్మకాలు
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా గడిచిన ఏడాది జనవరి నుంచి ఏప్రిల్‌వరకు జరిగిన బీర్ల విక్రయాల కంటే ప్రస్తుత సంవత్సరం జనవరి నుంచి ఏప్రిల్ వరకు ఎక్కువగా బీర్ల విక్రయాలు జరిగినట్లు గణాంకాలు చెపుతున్నాయి. గడిచిన ఏడాది జనవరిలో 2,89,903 కాటన్లు అమ్ముడు పోగా రూ.29.7కోట్లు, ఫిబ్రవరిలో 2,21,506 కాటన్ల విక్రయాలు జరగగా, రూ.22.82కోట్లు, మార్చిలో 4,23,235కాటన్లు అమ్ముడుపోగా, రూ.43.55 కోట్లు, ఏప్రిల్‌లో 4,45,653 కాటన్లు అమ్ముడు పోగా రూ.49.69కోట్ల ఆదాయం వచ్చింది. 2019 జనవరిలో 3,16,687 కాటన్ల బీర్లు అమ్ముడు పోగా రూ.34.93 కోట్లు, ఫిబ్రవరిలో 2,96119 కాటన్లకు రూ.32.91కోట్లు, మార్చిలో 4,46,545, కాటన్లకు రూ.49.44 కోట్లు, ఏప్రిల్‌లో 4,50,502 కాటన్లకు రూ. 54.06 కోట్ల ఆదాయం వచ్చింది. ఈ లెక్కన గతేడాదితో పోలిస్తే ఈ జనవరిలో రూ.5.23కోట్లు, ఫిబ్రవరిలో రూ.10.09కోట్లు, మార్చిలో రూ.6.11కోట్లు, ఏప్రిల్‌లో రూ.4.37కోట్ల ఆదాయం ఎక్కువగా వచ్చింది.
అధిక ధరకు విక్రయాలు
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా నిర్వహిస్తున్న బెల్టుషాపులలో మద్యాన్ని అధిక ధరలకు విక్రయిస్తున్నారు. అదే విధంగా ఆయా జిల్లా పరిధిలోని మద్యం దుకాణాలలో యజమానులు వయస్సుతో నిమిత్తం లేకుండా దుకాణాలకు వచ్చే ప్రతి ఒక్కరికీ మద్యాన్ని విక్రయిస్తున్నారు. అందులో మైనర్లు కూడా మద్యాన్ని విక్రయిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment