మైసూరు: మైసూరు జిల్లాలోని నంజనగూడులో ఉన్న యునైటెడ్ బ్రువరీస్ కర్మాగారంలో తయారవుతున్న బీరు నాణ్యత ప్రశ్నార్థకమైంది. జిల్లా అబ్కారీ అధికారులు సుమారు రూ. 25 కోట్ల విలుచ చేసే 78,678 బాక్స్‌ల బీర్లను సీజ్ చేశారు. ఈ కంపెనీ తయారుచేసే ప్రముఖ బీర్ల సీసాల్లో అవక్షేపం పేరుకుపోయిందని, ఇటువంటి బీర్లను తాగరాదని తెలిపారు. జూలై 15వ తేదీన ఈ సీసాలు నింపారని తెలిపారు.
కొన్ని సీసాల్లో గసి పేరుకుపోయినట్లు మందుబాబుల ద్వారా తెలుసుకున్న అధికారులు బీర్ల శాంపిళ్లను తీసుకుని ల్యాబ్‌కు పంపించారు. దీనిపై ఆగస్టు 2వ తేదీన నివేదిక రాగా, ఈ బీర్లు తాగడానికి పనికిరావని అందులో హెచ్చరించారు. దాంతో ఆ బ్యాచ్‌లో సిద్ధమైన 78,678 పెట్టెల బీర్లను సీజ్ చేశారు. ఇవి అప్పటికే మద్యం షాపులకు వెళ్లిపో గా మళ్లీ వెనక్కి తెప్పించినట్లు తెలిపారు. సీసాల్లోకి నింపేముందు బీర్‌ను సక్రమంగా ఫిల్టర్ చేయకపోతే అవక్షేపం చేరుకుంటుందని చెప్పారు.
చదవండి ఫోన్ ఛార్జింగ్‌పై బాస్ ఆగ్రహం.. టాయిలెట్ ఫ్లష్ చేయద్దంటున్న నెటిజన్లు!
Comments
Please login to add a commentAdd a comment