చల్లచల్లని బీర్.. కూల్‌గా గొంతు దిగుతుంటే ఆ కిక్కే వేరంటూ బీరు ప్రియులు లొట్టలేస్తుంటారు. ఒక్కో బ్రాండ్ బీర్.. ఒక్కో టేస్ట్.. అంటూ నాలుక చప్పరిస్తుంటారు. ఇక్కడిదాకా అందరూ ఒకటే.. కానీ సింగపూర్‌కు చెందిన ‘న్యూబ్రూ’ బీర్ గురించి చెప్తే మాత్రం ఎవరెవరు ఎలా స్పందిస్తారో ఊహించడం కష్టమే. ఎందుకంటే.. ఆ బీర్‌ను మూత్రంతో, డ్రైనేజీ వాటర్‌తో తయారు చేస్తారు మరి. నిజమే.. సాధారణంగా బీరు తయారీకి భారీగా నీళ్లు అవసరం.
అసలే నీటి కరువుతో ఉన్న సింగపూర్‌లో.. డ్రైనేజీ నీళ్లయినా, మరే నీళ్లయినా సరే పూర్తిగా శుద్ధిచేసి మళ్లీ వాడాల్సిందేనని ప్రభుత్వం ఆదేశించింది. ఈ క్రమంలోనే సింగపూర్ ప్రభుత్వ వాటర్ ఏజెన్సీ పీయూబీ, స్థానిక బీరు తయారీ సంస్థ బ్రూవర్క్‌జ్ కలిసి ‘న్యూబ్రూ’ను మార్కెట్లోకి తెచ్చాయి.
అధికారులు మూత్రాన్ని, డ్రైనేజీ నీళ్లను పూర్తిస్థాయిలో శుద్ధిచేసి ‘న్యూవాటర్’ పేరుతో సురక్షిత నీటిని సిద్ధం చేశారు. ఆ నీటిని ఉపయోగించి ‘న్యూబ్రూ’ బీరును తయారుచేసి మార్కెట్లోకి వదిలారు. మంచి మాల్ట్‌తో, తాగాక తేనె వంటి రుచిని ఇస్తుండటంతో ‘న్యూబ్రూ’ బీర్‌కు బాగా డిమాండ్ కనిపిస్తోందని సింగపూర్ అధికారులు చెప్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment