
రేణిగుంట:ఎండలు మండుతున్నాయి. అయినా, జీవనపోరాటం ఆగదు. ఎండ నుంచి రక్షణకు చిట్కాలు ఎన్నో. పాదచారులే కాదు. వాహనదారులు కూడా పాటిస్తున్నారు. అందుకు అద్దంపట్టే చిత్రమిది. ఈయన పేరు కృష్ణశాస్త్రి. వేద పండితుడు. కడప పట్టణానికి చెందిన ఈయన తిరుపతి వైకుంఠపురంలో ఉంటున్నారు. వృత్తిరీత్యా పూజలు చేసేందుకు వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తుంటారు. ఈ క్రమంలో ఆయన రేణిగుంట సమీపంలో సాక్షి ప్రతినిధులకు తారసపడ్డారు. అర్చకత్వం కోసం పలు ప్రాంతాలకు తిరుగాడేందుకు ఇబ్బంది లేకుండా ద్విచక్ర వాహనానికి రూ.రెండు వేలు వెచ్చించి గొడుగు ఏర్పాటు చేసుకున్నట్లు చెప్పారు. ప్రయాణంలో కూడా రక్షణ కోసం కచ్చితంగా హెల్మెట్ వాడతానని స్పష్టం చేశారు. దారిలో ఎవరు పలుకరించినా ఆయుర్వేద వైద్యంపై అవగాహన కూడా కల్పిస్తుంటానని కొన్ని చిట్కాలు వివరించారు. వేదాల్లోనే కాదు. వైద్యంలోనూ ఆయన పండితుడే!
Comments
Please login to add a commentAdd a comment