umbrella
-
'ఇదో మంచి ఆలోచన': ఆనంద్ మహీంద్రా ట్వీట్
సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ.. ఆసక్తికరమైన విషయాలను షేర్ చేస్తూ ఉండే పారిశ్రామిక దిగ్గజం 'ఆనంద్ మహీంద్రా' (Anand Mahindra) తాజాగా ఓ ఆసక్తికరమైన వీడియో షేర్ చేస్తూ ఇదో మంచి ఆలోచన అంటూ ట్వీట్ చేశారు.దేశంలో అక్కడక్కడా వర్షాలు పడుతూనే ఉన్నాయి. పెద్ద నగరాల్లో వర్షం పడితే ప్రజలకు కొంత ఇబ్బందిగానే ఉంటుంది. మొత్తానికి ముంబైలో రుతుపవనాలు కొంత తగ్గుముఖం పట్టాయి, అంటూ ఆనంద్ మహీంద్రా వీడియో షేర్ చేశారు.ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన వీడియోలో ఓ వ్యక్తి గొడుగును.. బ్యాగ్ మాదిరిగా తగిలించుకుని వెళ్లడం చూడవచ్చు. గొడుగుకు రెండువైపులా ఇనుప తీగల వంటి పరికరాలను అమర్చుకున్నారు. దాన్ని ఒక బ్యాగ్ మాదిరిగా తగిలించుకున్నారు. ఇలా చేయడం వల్ల గొడుగును పట్టుకోవడానికి ప్రత్యేకంగా చేతులను ఉపయోగించాల్సిన అవసరం లేదు. వీడియోలో గొడుగును తగిలించుకుని చేతులతో వస్తువులను తీసుకెళ్లడం కూడా చూడవచ్చు.ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇప్పటికే వేలసంఖ్యలో వ్యూవ్స్ పొందిన ఈ వీడియోపై కొందరు నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు. ఇందులో ఒకరు మహీంద్రా గొడుగులు కావాలని కామెంట్ చేస్తే.. మరొకరు హ్యుయెన్ త్సాంగ్ 7వ శతాబ్దంలో ఇలాంటిది కలిగి ఉన్నారని అన్నారు.Finally, we’re seeing some consistent rain in Mumbai this monsoon. Not heavy enough for our liking, but it’s probably time to plan our ‘wardrobe for wetness.’ May be a good idea to think about a ‘wearable’ umbrellaClever…pic.twitter.com/7pjyFAMJ6O— anand mahindra (@anandmahindra) June 22, 2024 -
ఈ గొడుగు ఖరీదు వింటే.. వ్హా.. అంటూ నోరెల్లబెట్టాల్సిందే!!
ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన గొడుగు. పురుషుల ఫ్యాషన్ వస్తువులను తయారు చేసే ఇటాలియన్ కంపెనీ ‘బిలియనీర్ కూటూర్’ దీనిని ప్రత్యేకంగా మొసలి తోలుతో రూపొందించింది. దీనిని కొనుగోలు చేయాలంటే, ముందుగా ఆర్డర్ ఇవ్వాల్సి ఉంటుంది. ఆర్డర్ల ఒత్తిడి పెరిగితే, ఈ గొడుగు చేతికి అందడం కొంత ఆలస్యం కూడా కావచ్చు.‘బిలియనీర్ కూటూర్’ తయారు చేసే విలాసవంతమైన వస్తువుల కోసం పోటీపడే అపర కుబేరులు ఈ గొడుగు కోసం కూడా పోటీ పడుతున్నారు. దీని ధర 50 వేల డాలర్లు (రూ.41.54 లక్షలు). అత్యంత ఖరీదైన గొడుగుల్లో ఇప్పటి వరకు ఈ మొసలి తోలు గొడుగుదే రికార్డు. ఫార్ములా వన్ రేసింగ్ దిగ్గజం ఫ్లావియో బ్రియాటోర్ వంటి అతి కొద్దిమంది అపర కుబేరులు మాత్రమే ఇప్పటి వరకు ఈ మొసలితోలు గొడుగును కొనుగోలు చేశారు.ఇవి చదవండి: ఇదేంటో తెలుసా? దీనిని తాకితే.. ప్రాణాలకే? -
చల్లచల్లని కూల్ కూల్
ఈ వేసవిలో ఆకాశానికి ఏసీ బిగిస్తే? మనం నడుస్తూ ఉంటే గాలి గొడుగు పడితే? కూర్చున్న చోటు చల్లని మందిరంగా మారితే? అసలు వేసవి మొత్తం కూల్ కూల్‌గా అనిపిస్తే? నిజంగా ఎలాగూ జరగదు. ఘోరమైన ఎండల్లో మాడక తప్పదు. అందుకే ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌ను అడిగి ఇలాంటి ఊహలు చేసి ఆనందిస్తున్నారు జనం. మార్తాండుడి ముందు ఎవరైనా మోకరిల్లాల్సిందే ఎండాకాలంలో. వట్టివేర్లు కిటికీలకు కట్టుకునేవారు, కూల్ పెయింట్ చేయించుకునేవారు, గోతాం పట్టాలు కట్టుకుని నీళ్లు చల్లుకునేవారు, ఏసీలు కొనుక్కునేవారు, కూలర్లు రిపేర్లు చేయించుకునేవారు, కొబ్బరి మట్టలతో పందిరి వేసుకునేవారు... చల్లదనం కోసం ఎన్నో మార్గాలు. అయితే మన నెత్తి మీదే ఎప్పుడూ ఫ్యాన్ ఉండాలని, మనం ఎక్కడ కూచున్నా జిల్లుమనాలని అత్యాశ కూడా ఉండొచ్చు. ‘ఇలాంటి ఆశలు మాకున్నాయి. అవి తీరినట్టుగా ఫొటోలు చేసి చూపించు’ అని ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌ను అడిగితే అది తయారు చేసిన ఫొటోలు నెట్లో వైరల్ అయ్యాయి. నెత్తి మీద ఐసు గడ్డల హెల్మెట్ ఉన్న అవ్వ, ఐసు బల్ల మీద కూచుని టూరిస్ట్‌లు, ఐసు స్కూటర్ మీద రివ్వున దూసుకెళ్లే అమ్మాయి, ఒళ్లంతా ఫ్యాన్లు మొలిచిన గరీబు... ఇవన్నీ ఏ.ఐ చూపించి ఐసు వాటర్ తాగిన ఫీలింగ్ కలిగించింది. -
‘కూల్ ఎర్త్’ పేరుతో భూమికే గొడుగు పట్టనున్న శాస్త్రవేత్తలు!
ప్రపంచవ్యాప్తంగా భూతాపం ప్రభావం చూపుతోంది. కొన్నేళ్లుగా చాలాప్రాంతాల్లో వేసవులు మరింతగా నిప్పులు చెరుగుతున్నాయి. శీతకాలాలు నులివెచ్చగా మారుతున్నాయి. భూతాపం నియంత్రణ లేకుండా పెరుగుతూపోతే, భవిష్యత్తులో భూమ్మీద జీవరాశి మనుగడ ప్రశ్నార్థకమే అవుతుంది. పరిస్థితి ఆ స్థాయికి దిగజారిపోక ముందే భూతాపాన్ని అదుపులోకి తేవడానికి శాస్త్రవేత్తలు కొన్నేళ్లుగా నిర్విరామంగా ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా ఎండ ధాటిని తగ్గించడానికి ఏకంగా పుడమికే గొడుగు పట్టడానికి సన్నాహాలు ప్రారంభించారు. శాస్త్రవేత్తలు పుడమికి గొడుగు పట్టగలిగితే, దాని ఫలితంగా భూమ్మీద వేడి తీవ్రత చాలా వరకు తగ్గుముఖం పడుతుంది. వేసవి తీవ్రత భరించగలిగే స్థాయికి పరిమితమవుతుంది. పుడమికి గొడుగు పట్టడంతో పాటు భూతాపాన్ని తగ్గించడానికి శాస్త్రవేత్తలు మరికొన్ని ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. వారి ప్రయత్నాలు ఎంత త్వరగా ఫలిస్తే, రానున్న వేసవులు అంత త్వరగా చల్లబడే అవకాశాలు ఉంటాయని ఆశించవచ్చు. భూతాపం తగ్గించడానికి ప్రస్తుతం శాస్త్రవేత్తలు సాగిస్తున్న వినూత్న, విలక్షణ ప్రయోగాలపై ఒక విహంగవీక్షణం... భూతాపం పెరుగుదలకు గల కారణాలను శాస్త్రవేత్తలు ఇదివరకే గుర్తించారు. భూతాపం పెరుగుదలకు కారణమవుతున్న అంశాలను నియంత్రణలోకి తీసుకొస్తే భూతాపం అదుపులోకి వస్తుందని వారి అంచనా. అయితే, భూతాపం పెరుగుదలకు కారణమవుతున్న అంశాలను నియంత్రణలోకి తీసుకురావడమే పెను సవాలుగా నిలుస్తోంది. విచ్చలవిడిగా వాతావరణంలోకి చేరుతున్న కర్బన ఉద్గారాలు, అడవుల నరికివేత, వాహనాల వినియోగంలో పెరుగుదల, వనరుల అతి వినియోగం వంటివి భూతాపం పెరుగుదలకు దారి తీస్తున్నాయి. వీటిని నియంత్రించడానికి ఎంతగా ప్రయత్నిస్తున్నా, సాధ్యం కావడంలేదు సరికదా, ఇవన్నీ నానాటికీ పెరుగుతూనే ఉన్నాయి. అందుకే శాస్త్రవేత్తలు ఏకంగా పుడమికి గొడుగు పట్టాలనే నిర్ణయానికి వచ్చారు. మన తల మీద గొడుగు నీడ ఉంటే, ఎండ వేడి తీవ్రత నేరుగా నెత్తిమీద పడకుండా ఉన్నట్లే, అంతరిక్షం నుంచి భూమికి గొడుగు పడితే, దాని నీడ వల్ల భూమ్మీద వేడి తీవ్రత గణనీయంగా తగ్గి, మనుషులకు వేసవి కష్టాలు కొంతవరకైనా తీరగలవని అంచనా వేస్తున్నారు.గొడుగు నీడతో పుడమికి చల్లదనం సాధ్యమేనని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. భూమ్మీద ఒక చదరపు మైలు (2.589 చదరపు కిలోమీటర్లు) విస్తీర్ణంలో నీడ కల్పించగలిగితే, రెండేళ్ల వ్యవధిలోనే ఏకంగా 2.7 డిగ్రీల ఫారెన్‌హీట్ (–16.27 డిగ్రీల సెల్సియస్) మేరకు ఉష్ణోగ్రతను తగ్గించగలమని ఇజ్రాయెల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. పుడమికి గొడుగు పట్టే ప్రయత్నంలో తొలుత ప్రయోగాత్మకంగా వంద చదరపు అడుగుల నమూనాను అంతరిక్షంలోకి పంపాలని ఇజ్రాయెలీ శాస్త్రవేత్తలు అనుకుంటున్నారు. దీనికి 20 మిలియన్ డాలర్లు (రూ.166.17) కోట్లు ఖర్చు కాగలవని, 2027 నాటికి వంద చదరపు అడుగుల నమూనా గొడుగును అంతరిక్షంలోకి పంపగలమని వారు చెబుతున్నారు. ధరిత్రీ ఛత్రవిలాసం ఇజ్రాయెలీ శాస్త్రవేత్తలు ఈ గొడుగు వివరాలను మీడియాకు వెల్లడించారు. భూతాపాన్ని తగ్గించే దిశగా భూమికి శాశ్వతమైన నీడ కల్పించాలని వారు భావిస్తున్నారు. ‘కూల్ ఎర్త్’ ప్రాజెక్ట్ పేరుతో చేపడుతున్న ఈ ప్రయోగంలో భాగంగా తొలుత చేపట్టనున్న వంద చదరపు అడుగుల నమూనా గొడుగు ప్రయోగం విజయవంతమైతే, ఆ తర్వాత త్వరలోనే దాదాపు అర్జెంటీనా దేశం విస్తీర్ణంతో సమానమైన (దాదాపు 27.8 లక్షల చదరపు కిలోమీటర్లు) అతిపెద్ద గొడుగును అంతరిక్షంలోకి పంపి, అక్కడి నుంచి భూమికి శాశ్వతంగా నీడ కల్పించాలనుకుంటున్నారు. దీనికయ్యే ఖర్చు కొన్ని లక్షల కోట్ల డాలర్ల మేరకు ఉండవచ్చని వారి అంచనా. ‘అంతరిక్షంలో ఇలాంటి భారీ నిర్మాణాలను ఏర్పాటు చేయాలంటే, అందుకు ఖర్చు కూడా భారీగానే ఉంటుంది. ఇలాంటి ప్రయోగాల కోసం రక్షణ శాఖ బడ్జెట్ నుంచి, అంతర్జాతీయ సహకారం నుంచి నిధులు సమకూర్చుకోవాల్సి ఉంటుంది. ఈ ప్రయోగానికి మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ 3 మిలియన్ డాలర్లు (రూ.24.92 కోట్లు) ఇప్పటికే ఇచ్చారు. భూమిపై సూర్యకాంతి తక్కువగా పడేలా చేసే ప్రయోగాలకు బాసటగా ఉంటామని గత ఏడాది అమెరికా అధ్యక్షుడు కూడా ప్రకటించారు’ అని ఇజ్రాయెలీ శాస్త్రవేత్త అవీ లోయబ్ తెలిపారు. అంతరిక్షంలోకి ఎలా చేరవేస్తారంటే.. ఈ గొడుగును సౌరశక్తితో పనిచేసే వ్యోమనౌక ద్వారా అంతరిక్షంలోకి చేరవేస్తారు. తక్కువ బరువు కలిగిన ‘సోలార్ సెయిల్స్’తో రూపొందిన ఈ గొడుగును మొదటి ల్యాగ్రేంజ్ పాయింట్ (ఎల్1) వద్ద నిలిచేలా చేస్తారు. ఈ ప్రదేశంలో భూమి, సూర్యుడి ఆకర్షణ వికర్షణ శక్తులు గరిష్ఠ స్థాయిలో ప్రభావం చూపుతాయి. ఈ ప్రదేశంలో గొడుగును నిలిపి ఉంచడం ద్వారా భూమి ఉపరితలంపై ఎక్కువభాగంలో నీడ పడుతుంది. భూమి నుంచి ఈ ఎల్1 పాయింట్ 15 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక్కడి నుంచి భూమి ఉపరితలంపై ఎక్కువ ప్రదేశంలో నిరంతరాయంగా పలచని నీడ పడుతుండటం వల్ల భూతాపం గణనీయంగా తగ్గుతుంది. ఇజ్రాయెలీ శాస్త్రవేత్తలు ప్రస్తుత అంచనాల మేరకు ఈ గొడుగును సకాలంలో అంతరిక్షంలోకి పంపకుంటే మాత్రం ఈ ప్రాజెక్టు ఖర్చు ఊహాతీతంగా పెరిగే ప్రమాదం ఉందని కూడా కొందరు శాస్త్రవేత్తలు అభిప్రాయ పడుతున్నారు. ‘ఇప్పటికి అనుకుంటున్న సమయంలోగా ఈ భారీ గొడుగును అంతరిక్షంలోకి పంపకుంటే, ఈ ప్రాజెక్టు ఖర్చు చుక్కలను తాకే అవకాశం ఉంది. ఇది ఆర్థిక వ్యవస్థలకు పెనుభారంగా మారే అవకాశం కూడా ఉంది’ అని ఫ్రాన్స్‌లోని యూరోపియన్ సెంటర్ ఫర్ రీసెర్చ్ అండ్ అడ్వాన్స్డ్ ట్రెయినింగ్ ఇన్ సైంటిఫిక్ కంప్యూటింగ్‌కు చెందిన పరిశోధకురాలు సూజన్ బోయెర్ వ్యాఖ్యానించారు. ఈ భారీ ప్రయోగానికి జరిగే ఖర్చు గురించి మాత్రమే కాదు, ఈ అంశంలో శాస్త్రవేత్తలకు మరికొన్ని భయాలు కూడా ఉన్నాయి. ఈ గొడుగును అంతరిక్షంలో ఎల్1 పాయింట్ వద్ద సుదీర్ఘకాలం స్థిర కక్ష్యలో నిలిపి ఉంచడం ఎంతవరకు సాధ్యమనే అంశంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అంతరిక్షంలో అదుపు తప్పే గ్రహశకలాలు తాకినా, సౌర తుఫానులు చెలరేగినా ఈ గొడుగు దెబ్బతినే అవకాశాలు లేకపోలేదని, అప్పుడు లక్షల కోట్ల ఖర్చుతో చేపట్టిన ఈ ప్రయోగం వృథా అవుతుందని కొందరు శాస్త్రవేత్తలు అభిప్రాయ పడుతున్నారు. సముద్రాల్లో నాచు పెంపకం.. భూతాపం పెరుగుదల భూభాగానికి మాత్రమే పరిమితం కావడం లేదు. భూతాపం ప్రభావానికి సముద్రాలు కూడా వేడెక్కుతున్నాయి. సముద్రాలలో కార్బన్ డయాక్సైడ్ పరిమాణం పెరుగుదల కారణంగానే ఈ పరిస్థితి తలెత్తుతోందని గుర్తించిన శాస్త్రవేత్తలు సముద్రాలను చల్లబరచేందుకు కూడా ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఇందులో భాగంగానే సముద్రాల ఉపరితల వాతావరణంలోకి మితిమీరి చేరిన కార్బన్ డయాక్సైడ్ను తొలగించడానికి ‘ఓషన్ ఫర్టిలైజేషన్’ వంటి ప్రక్రియలను ప్రారంభించారు. ‘ఓషన్ ఫర్టిలైజేషన్’ భారీ స్థాయిలో చేపట్టే జియోఇంజినీరింగ్ ప్రక్రియ. ఇందులో సముద్రాల ఉపరితలంపై సూర్యరశ్మి నేరుగా సోకే పొరలలో సముద్రపు నాచు పెరిగేలా చేస్తారు. సముద్రపు నాచు తన పోషకాల కోసం జరిపే కిరణజన్య సంయోగక్రియ ఫలితంగా పరిసరాల్లోని వాతావరణంలో ఉన్న కార్బన్ డయాక్సైడ్ను పీల్చేసుకుంటుంది. సముద్ర ఉపరితల పరిసరాల్లోని వాతావరణంలో కార్బన్ డయాక్సైడ్ ఈ పద్ధతిలో గణనీయంగా తగ్గుతుంది. ఫలితంగా సముద్రాల ఉపరితలం చల్లబడి, సముద్రంలో బతికే చిన్నా పెద్దా జలచరాలు సురక్షితంగా మనుగడ సాగించగలుగుతాయి. సముద్రంలో నాచు త్వరగా పెరగడానికి నైట్రోజన్, ఐరన్ వంటి పోషకాలు అవసరమవుతాయి. ఈ పోషకాలను నేరుగా సముద్రం ఉపరితలంపై చల్లడం ద్వారా సముద్రపు నాచు త్వరగా, ఎక్కువగా పెరిగేలా చేస్తారు. ఇదంతా ఒకరకంగా మొక్కలకు ఎరువు వేసే ప్రక్రియలాంటిదే! కాబట్టి ఈ ప్రక్రియను ‘ఓషన్ ఫర్టిలైజేషన్’ అని, ‘ఓషన్ నరిష్మెంట్’ అని అంటున్నారు. సముద్రాల ఉపరితలంలో నాచు పెంచడం ద్వారా భూతాపాన్ని తగ్గించే ఈ ప్రయత్నంలో కొన్ని లాభాలు ఉన్నా, కొన్ని సమస్యలు తలెత్తే అవకాశాలు కూడా లేకపోలేదని కొందరు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. సముద్రాల ఉపరితలంపై నాచు పెంచడంలో ఎలాంటి రసాయనాల వినియోగం జరగదు. అందువల్ల ఇది చాలావరకు సురక్షితమైన పద్ధతి. ఈ ప్రక్రియ ద్వారా వాతావరణంలోకి లేదా సముద్రంలోకి కాలుష్యాలు విడుదలయ్యే సమస్య ఉండదు. దీని వల్ల సముద్రజలాల ఆమ్లీకరణ గాఢత కూడా గణనీయంగా తగ్గుతుంది. ఈ ప్రక్రియ నేరుగా వాతావరణంపై తక్షణ ప్రభావం చూపదు. కాకుంటే, భూతాపం పెరుగుదలలో ఉధృతిని నిదానంగా తగ్గిస్తుంది. అయితే, సముద్రాల ఉపరితలంపై నాచును మోతాదుకు మించి పెంచినట్లయితే, సముద్రంలో జీవించే జలచరాల సహజమైన ఆహారచక్రం గతి తప్పి, కొత్త సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుందని కొందరు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. సముద్రంలో నాచు మితిమీరి పెరిగితే, కొన్ని రకాల చేపలు తదితర జలచరాల జనాభా గణనీయంగా క్షీణించే ప్రమాదం కూడా ఉంటుందని వారు హెచ్చరిస్తున్నారు. ఏళ్లనాటి ఆలోచన ఆకాశం నుంచి భూమికి గొడుగు పట్టాలనే ఆలోచన ఈనాటిది కాదు. శాస్త్రవేత్తలు 1923 నుంచి ఈ దిశగా ఆలోచనలు చేస్తూ వస్తున్నారు. జర్మన్ భౌతిక శాస్త్రవేత్త హెర్మన్ ఓబెర్త్ ఈ దిశగా తన ప్రయోగాల్లో కొంత ముందంజ కూడా వేశారు. అంతరిక్ష కక్ష్యలోకి 100–300 కిలోమీటర్ల వ్యాసం పరిధిలో భారీ అద్దాలను పంపడం ద్వారా భూమ్మీద పడే సూర్యకాంతిని తిరిగి అంతరిక్షంలోకి పరావర్తనం చెందేలా చేయడం ద్వారా భూతాపాన్ని తగ్గించడం సాధ్యమవుతుందని ఓబెర్త్ ప్రతిపాదించాడు. సూర్యకాంతిని నిరోధించడం ద్వారా భూతాపాన్ని తగ్గించే దిశగా ఆయన 1923 నుంచి 1978 వరకు విస్తృతంగా పరిశోధనలు సాగించాడు. భూమికి సూర్యడికి మధ్యన ఒక డిస్క్లాంటిది అంతరిక్షంలో ఏర్పాటు చేయడం ద్వారా భూమ్మీద పడే సూర్యరశ్మి వేడిని తగ్గించగలమని 1989లో మరికొందరు శాస్త్రవేత్తలు ప్రతిపాదించారు. ఈ డిస్క్‌కు సౌర ఫలకాలను అమర్చినట్లయితే, వాటి నుంచి అపరిమితంగా సౌర విద్యుత్తును కూడా ఉత్పత్తి చేయవచ్చనే ఆలోచన చేశారు. అయితే, ఇవేవీ కార్యరూపం దాల్చలేదు. ఇవి జరిగిన చాలాకాలం తర్వాత రెండేళ్ల కిందట మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటీ) శాస్త్రవేత్తలు అలివీయా బోర్గ్, ఆండ్రూస్ హీన్లు ఈ దిశగా మరో కొత్త ప్రతిపాదన ముందుకు తెచ్చారు. స్పేస్ఎక్స్ షిప్ వంటి వ్యోమనౌక ద్వారా అంతరిక్షంలోకి అతిసన్నని పాలిమర్ నానో బుడగలతో కూడిన అతిపలుచని ఫిల్మ్‌ను పంపి, సూర్యడికి భూమికి మధ్య తెరలా ఏర్పాటు చేయడం ద్వారా భూతాపాన్ని తగ్గించడం సాధ్యమవుతుందని వారు చెప్పారు. ఇప్పటి వరకు ఈ ప్రతిపాదనకు కార్యాచరణ దిశగా అడుగులు ముందుకు పడలేదు. కార్బన్ క్యాప్చరింగ్.. భూతాపం పెరుగుదలకు అతిపెద్ద కారణం కర్బన ఉద్గారాల పెరుగుదల. కార్బన్ కణాలు వాతావరణంలోకి మోతాదుకు మించి చేరడం వల్ల భూతాపం గణనీయంగా పెరుగుతోంది. వాతావరణంలో కలిసే కర్బన కణాలను యంత్రాల ద్వారా పీల్చేసి, సేకరించే పద్ధతికి శాస్త్రవేత్తలు రూపకల్పన చేశారు. ఈ సాంకేతికతను ‘కార్బన్ క్యాప్చరింగ్ టెక్నాలజీ’ అంటున్నారు. పారిశ్రామిక కర్మాగారాలు ఎక్కువగా ఉండేచోట వాటి నుంచి విడుదలయ్యే కార్బన్ డయాక్సైడ్, మీథేన్ వంటి వాయువుల నుంచి కార్బన్ కణాలను పీల్చివేయడానికి భారీ యంత్రాలను ఏర్పాటు చేస్తారు. ఈ యంత్రాలు గాలిలోకి కార్బన్ కణాలు చేరకుండా నిరోధిస్తాయి. గాలి నుంచి పీల్చేసిన కార్బన్ కణాలను ఈ యంత్రాలు ఘనరూపంలో బంధించి ఉంచుతాయి. అమెరికా వంటి దేశాల్లో ఇప్పటికే కొన్ని చోట్ల ఇలాంటి యంత్రాలను నెలకొల్పారు. ఇవి గాలిలో కలిసే కార్బన్ కణాలను దాదాపు 90 శాతం వరకు పీల్చుకోగలవు. వీటిని ‘పైరోజెనిక్ కార్బన్ క్యాప్చర్ అండ్ స్టోరేజ్’ గా వ్యవహరిస్తున్నారు. యంత్రాల ద్వారా పీల్చి సేకరించిన కార్బన్‌ను పైపులైన్ల ద్వారా కార్బన్‌ను నేరుగా ఉపయోగించుకునే పరిశ్రమలకు సరఫరా చేస్తున్నారు. అంతర్జాతీయ గణాంకాల ప్రకారం 2020 నాటికి ప్రపంచంలోని వివిధ దేశాల్లో నెలకొల్పిన కార్బన్ క్యాప్చరింగ్ యంత్రాలు ఏడాది 5 కోట్ల టన్నుల కార్బన్‌ను గాలి నుంచి తొలగించగలుగుతున్నాయి. పగడపు దిబ్బల పరిరక్షణ.. సముద్రాలు సైతం వేడెక్కేస్థాయికి భూతాపం చేరడం వల్ల విలువైన పగడపుదిబ్బలు వేగంగా క్షీణించే పరిస్థితి ఏర్పడింది. పగడపుదిబ్బలు అంతరించిపోయే పరిస్థితిని నివారించడానికి శాస్త్రవేత్తలు 1998 నుంచి ముమ్మరంగా ప్రయత్నాలను ప్రారంభించారు. పగడపుదిబ్బల పరిరక్షణ కోసం ఒకవైపు శాస్త్రవేత్తలు ఎన్ని ప్రయత్నాలు సాగిస్తున్నా, గడచిన పదిహేనేళ్లలో ముప్పయి శాతం పగడపుదిబ్బలు పూర్తిగా కనుమరుగయ్యాయి. పరిస్థితులు ఇలాగే కొనసాగితే, రానున్న రెండేళ్లలో మరో ఆరు శాతం పగడపుదిబ్బలు అంతరించిపోతాయని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. సముద్రాల అడుగున ఉండే పగడపుదిబ్బలు గొప్ప జీవవైవిధ్యానికి నెలవులు. పగడపుదిబ్బలను ఆవాసంగా చేసుకుని, నాలుగువేలకు పైగా మత్స్యజాతులు, ఎనిమిదివందలకు పైగా పగడపుజీవులు, వాటితో పాటే ఎనబైలక్షలకు పైగా వృక్షజాతులు మనుగడ సాగిస్తున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రపంచవ్యాప్తంగా ప్రతిరోజూ సగటున మూడు కోట్ల టన్నుల కార్బన్ డయాక్సైడ్ సముద్రగర్భంలోకి చేరుతోంది. మితిమీరిన కార్బన్ డయాక్సైడ్ సముద్రగర్భంలోకి చేరడం వల్ల సముద్రజలాల ఆమ్లీకరణ జరిగి, పగడపుదిబ్బలు శరవేగంగా క్షీణించిపోతున్నాయి. సముద్రాల అడుగున ఉండే పగడపుదిబ్బలు నశిస్తే, మానవాళికి వాటిల్లే నష్టమేమిటనుకుంటే పొరపాటేనని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. పగడపుదిబ్బలు అంతరించడం వల్ల జీవవైవిధ్యానికి, పర్యావరణానికి జరిగే నష్టం ఫలితంగా 2030 నాటికి పదికోట్ల మంది మనుషులు అనవసరంగా ప్రాణాలు పోగొట్టుకునే పరిస్థితి వాటిల్లుతుందని వారు హెచ్చరిస్తున్నారు. మానవాళికి వాటిల్లబోయే ఈ ముప్పును అరికట్టడానికే శాస్త్రవేత్తలు పగడపుదిబ్బలను చల్లబరచడానికి ‘సీ వాటర్ ఎయిర్‌కండిషనింగ్’ వంటి పద్ధతుల్లో ప్రయత్నాలు సాగిస్తున్నారు. దీనికోసం భారీ యంత్రాలను ఉపయోగించి, వేడెక్కిన సముద్రజలాలను పైపుల ద్వారా పైకి తీసుకొచ్చి, ఆ నీటిని చల్లబరిచి తిరిగి సముద్రంలోకి పంపుతుండటం వల్ల కొంతవరకు పగడపుదిబ్బలను చల్లబరచగలుగుతున్నారు. పగడపుదిబ్బలను చల్లబరచిన ప్రదేశాల్లో అక్కడి పగడాల రంగులో గాఢత పెరగడం వంటి గుణాత్మకమైన మార్పులను సాధించగలుగుతున్నారు. అయితే, ఇలాంటి ప్రయత్నాలు మరింత ముమ్మరంగా సాగితేనే పగడపుదిబ్బలు పదికాలాల పాటు సురక్షితంగా ఉండగలవు. వాటితో పాటే మనుషులు కూడా పదిలంగా మనుగడ సాగించగలరు. (చదవండి: థింక్ ట్యూన్ అప్!) -
ఏం టెక్నాలజీ గురూ.. చేత్తో పట్టుకునే పనిలేదు.!
-
ఏం టెక్నాలజీ గురూ.. ఇకపై గొడుగుల్ని చేత్తో పట్టుకునే పనిలేదు!
ఎండ ధాటిని తట్టుకోవడానికైనా, వానలో తడవకుండా ఉండటానికైనా గొడుగు తప్పనిసరి అవసరం. చాలా దూరం నడవాల్సి వచ్చేటప్పుడు గొడుగును చేత్తో పట్టుకోవడం ఇబ్బందిగానే ఉంటుంది. ఒక్కోసారి గాలి జోరు పెరిగేటప్పుడు చేతిలోని గొడుగును నియంత్రించడం కాస్త కష్టంగా కూడా ఉంటుంది. ఇకపై అలాంటి ఇబ్బందులేవీ ఉండవు. ఇది ఎగిరే గొడుగు. దీన్ని చేత్తో పట్టుకోవాల్సిన పనిలేదు. ఎక్కడకు వెళ్లినా మనల్నే అనుసరిస్తూ తల మీద నీడపడుతుంది. తలకు ఎండధాటి తాకనివ్వదు, వానకు తడవనివ్వదు. ఇది ఆషామాషీ గొడుగు కాదు, ‘ఫ్లైయింగ్ అంబ్రెల్లా డ్రోన్’. త్రీడీ ప్రింటింగ్ ద్వారా ముద్రించిన కార్బన్ ఫైబర్ గొట్టాలు తదితర విడిభాగాలతో దీనిని రూపొందించారు. కాబట్టి ఇది చాలా తేలికగా ఉంటుంది. వాయిస్ కంట్రోల్ ద్వారా జీపీఎస్ టెక్నాలజీతో బయటకు వెళ్లినప్పుడల్లా ఇది నిరంతరం తలకు నీడ పడుతూ ఉంటుంది. యూరోపియన్ సాఫ్ట్వేర్ కాన్ఫరెన్స్ ‘ఐ బిల్డ్ స్టఫ్’కు చెందిన నిపుణులు ఈ ఎగిరే గొడుగును ప్రయోగాత్మకంగా రూపొందించారు. -
పాక్ ప్రధాని అనుచిత ప్రవర్తన.. మహిళ ఆఫీసర్ దగ్గర గొడుగు లాక్కుని.. వీడియో వైరల్..
ప్యారిస్ వేదికగా జరుగుతున్న గ్లోబల్ ఫైనాన్సింగ్ ప్యాక్ట్‌లో పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ అనుచితంగా ప్రవర్తించారు. సమావేశానికి హాజరవ్వడానికి వెళ్లిన క్రమంలో ఆహ్వనానికి వచ్చిన మహిళ అధికారి వద్ద గొడుగు లాక్కున్నారు. పాపం.. వర్షం కారణంగా గొడుగు పట్టడానికి వచ్చిన ఆ మహిళ ఉద్యోగిని తడుస్తూనే ప్రధాని వెంట నడిచింది. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కాగా నెటిజన్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. Prime Minister Muhammad Shehbaz Sharif arrived at Palais Brogniart to attend the Summit for a New Global Financial Pact in Paris, France. #PMatIntFinanceMoot pic.twitter.com/DyV8kvXXqr — Prime Minister's Office (@PakPMO) June 22, 2023 సమావేశ భవనాన్ని చేరడానికి ప్రధాని షెహబాజ్ షరీఫ్ కారు దిగారు. వర్షం కారణంగా ఆయనకు గొడుగు పట్టడానికి కారు డోర్ దగ్గరే ఓ మహిళ అధికారి రెడీగా ఉంది. ప్రధాని కారు దిగగానే తడవకుండా గొడుగు పట్టింది. అయితే.. ఆయన ఆ గొడుగును ఆమె నుంచి తీసుకునే ప్రయత్నం చేయగా.. అసౌకర్యం కలగకుండా తానే పడతానన్నట్లుగా గొడుగును ఎత్తే ప్రయత్నం చేసింది. కానీ షెహబాజ్ షరీఫ్ ఆమె నుంచి గొడుగును లాక్కున్నారు. తానే గొడుగు పట్టుకుని సమావేశ భవనానికి వెళ్లారు. ఏం చేయాలో తెలియక ఆ మహిళ ఉద్యోగిని అధ్యక్షుడి వెంటే వర్షంలో తడుస్తూ నడిచింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. Why did he leave the woman in the rain? Shehbaz sharif is such an embarrassment. Yaaar kis cartoon ko PM bana diya hai inho ne. 😂 pic.twitter.com/kPzOmXSvQG — Saith Abdullah (@SaithAbdullah99) June 22, 2023 ఈ వీడియోపై నెటిజన్లు రకరకాలుగా స్పందించారు. ప్రధాని అనుచిత ప్రవర్తనపై పాక్ సోషల్ మీడియా వినియోగదారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ మహిళను వర్షంలోనే ఎందుకు వదిలేశారని ప్రశ్నించారు. ప్రధాని ఎలా అయ్యారని నెట్టింట విమర్శల వర్షం కురిపించారు. What a disgraceful embarrassment this man is! #Titanic #ShehbazSharif pic.twitter.com/91hpulmBkL — bushra (@Bushra2k7) June 22, 2023 ఇదీ చదవండి: యుద్ధానికి సై అంటారు, మమ్మల్ని పట్టించుకోరు.. ఆదుకోండి ప్లీజ్!: పాక్ ప్రధాని -
అయ్యో! గొడుగు ఎంత పని చేసింది.. అమెరికా అధ్యక్షుడిని తెగ ఇబ్బంది పెట్టిందిగా!
టోక్యో: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తరచూ వార్తల్లో నిలుస్తుంటారన్న సంగతి తెలిసిందే. అయితే అది పరిపాలన పరంగా అనుకుంటే పొరపాటు. ఆయన చేసే పొరపాట్లు, తడబాట్ల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. దీనికి సంబంధించిన పలు వీడియోలో గతంలో వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. తాజాగా బైడెన్ మరో వీడియో నెట్టింట చక్కర్లు కొడుతూ నెటిజన్లు ఆశ్చర్యపరుస్తోంది. జీ 7 సమావేశాల్లో భాగంగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ జపాన్‌లో పర్యటిస్తున్నారు. అయితే, ఆయన జపాన్‌లో లాండయ్యే సమయానికే ఆ ప్రాంతంలో వర్షం పడుతోంది. బైడెన్ ఎయిర్ ఫోర్స్ వన్ నుంచి మెట్లు దిగుతూ చినుకులు పడుతున్న కారణంగా ఆయన చేతిలో ఉన్న గొడుగుని తెరిచేందుకు ప్రయత్నిస్తాడు గానీ అది ససేమిరా అన్నట్లు తెరుచుకోదు. చివరకు దాన్ని అలానే చేతిలో పట్టుకుని కిందకు దిగుతారు. ఈలోగా అక్కడ ఉన్న జపాన్ ప్రతినిధులకు అభివాదం చేయడం.. అనంతరం ప్రతినిధులు ఒక్కొక్కరిగా తమను తాము బైడెన్‌కు పరిచయం చేసుకుంటున్నారు. ఈ క్రమంలో ఆయన వానలో తడుస్తూనే వారితో మాట్లాడుతుంటారు. ఇది గమనించిన అమెరికా అధికారులు తమవద్ద ఉన్న గొడుగును పట్టే ప్రయత్నం చేస్తారు. అయితే బైడెన్ మరోసారి ప్రయత్నించడంతో చివరికి గొడుగు తెరుచుకుంది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది. ఇదిలా ఉండగా రెండొంతుల మంది అమెరికన్లు తనకు రెండవసారి అవకాశం ఇచ్చేందుకు విముఖత చూపుతున్నట్లు నమ్ముతున్నట్లు పోల్స్ చెబుతున్నప్పటికీ బైడెన్ మాత్రం 2024లో తిరిగి ఎన్నిక కావాలనే ప్రణాళికలు రచిస్తున్నాడు. It took Biden almost a minute to figure out how to open his umbrella after landing in Japan in a torrential downpour pic.twitter.com/n1s2KJH9pZ — RNC Research (@RNCResearch) May 18, 2023 చదవండి: సైడ్ హసల్.. వేణ్నీళ్లకు చన్నీళ్లు.. చదువు డబ్బు.. ఒక్క జాబ్ కాదు బ్రో! -
వర్షం సాక్షిగా వర్షంలో పెళ్లి
-
వడదెబ్బ నుంచి తప్పించుకోండి ఇలా..
ఎండలు మండుతున్నాయి. ఉదయం 9 గంటలకే ఎండల తీవ్రత ఎక్కువ అవుతోంది. సాయంత్రం 6 కానిదే తగ్గడం లేదు. దీనికితోడు ఉక్కపోత, వడగాడ్పులతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. వేసవి తాపానికి జనం బయటకు రాలేని పరిస్థితి. ఇంట్లో ఏసీలు, కూలర్లు 24 గంటల పాటు వినియోగించాల్సి వస్తోంది. అయితే అందరూ ఇంట్లో ఉంటే కుదరదు కదా? అలాగని ఎండ బారిన పడితే వచ్చే అనర్థాలను తట్టుకునే పరిస్థితి ఉండదు. అందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను రాష్ట్ర విపత్తుల నివారణ, వైద్య ఆరోగ్య శాఖలు తెలిపాయి. – డాబాగార్డెన్స్ (విశాఖ దక్షిణ) జాగ్రత్తలు.. ► ఆరుబయట పని చేసే వారు సూర్యరశ్మి నుంచి కాపాడుకునేందుకు జాగ్రత్తలు తీసుకోవాలి. ► తరచూ నీళ్లు తాగుతూ ఉండాలి. బయటకు వెళ్లే ముందు నుంచి నీళ్లు వెంట తీసుకెళ్లాలి. ► ఎక్కువగా నిమ్మరసం, కొబ్బరి నీళ్లు తాగుతూ ఉండాలి. ► అవసరాన్ని బట్టి ఓఆర్ఎస్ ద్రవణం తీసుకోవాలి. పండ్ల రసాలు, గంజి, మజ్జిగ, జావ వంటివి ఎక్కువగా తీసుకుంటే మేలు. ► తెలుపు లేత రంగుల్లో ఉన్న పలుచని కాటన్ దుస్తులు ధరించాలి. ► లకు ఎండ తగలకుండా టోపీ, రుమాలు చుట్టుకోవాలి. వడదెబ్బ ప్రమాదం ► ఎండలు, వడగాడ్పుల సమయంలో బయట తిరగడం వల్ల వడదెబ్బకు గురవుతారు. ► తక్కువగా నీరు తాగడం, ద్రవపదార్థాలు తీసుకోకపోవడం, చల్లదనం ఇవ్వని దుస్తులు ధరించడం, చెమటను పీల్చని దుస్తులు, మద్యం సేవించడం వల్ల వడదెబ్బ సోకుతుంది. ► వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉండే చిన్నపిల్లలు, వృద్ధులు దీని బారిన పడే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో వడదెబ్బకు గురికాకుండా తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలపై వైద్యు సూచనలు, సలహాలు ఇస్తున్నారు. ► శరీర ఉష్ణోగ్రత ఒక్కసారిగా 104.9 డిగ్రీల వరకు పెరిగిపోయి, దానిని నియంత్రించే శక్తి కోల్పోవడమే వడదెబ్బగా పరిగణిస్తారు. దీనిని చాలా మంచి జ్వరంగా భావించి నిర్లక్ష్యం చేస్తుంటారు. అలా చేస్తే ప్రాణాంతకంగా మారుతుంది. లక్షణాలు.. ► రక్తప్రసరణ తగ్గి బీపీ డౌన్ అవుతుంది ► శరీరంతో పాటు పెదాలు, గోర్ల రంగు మారుతుంది. ► ఉష్ణోగ్రతలు బాగా పెరుగుతాయి. ► కీళ్ల నొప్పులు అధికంగా ఉంటాయి. ► నరాల సమస్యలు ఉత్పన్నమవుతాయి. ► స్పృహ కోల్పోయే ప్రమాదం ఏర్పడుతుంది ► మాటల్లో స్పష్టత తగ్గుతుంది. ► ఇతరులు చెప్పే మాటలను కూడా వినలేకపోతారు ► కొంత మంది కోమాలోకి వెళ్లిపోయే ప్రమాదం ఉంది ► విపరీతమైన తలనొప్పి రావడం, హృదయ స్పందన బాగా పెరగడం, శ్వాస తీసుకోవడం కష్టమవడం, చర్మం బాగా కందిపోయి మంటగా ఉండటం, బుగ్గలు, మెడ, గొంతు, మోచేతులు, ఛాతి బాగాలు ఎరుపెక్కడం మొదలైనవి.. నివారణ చర్యలు.. ► తక్షణమే శరీర ఉష్ణోగ్రతను తగ్గించే చర్యలు చేపట్టకపోతే అవయవాలు శాశ్వతంగా పనికి రాకుండా పోయే ప్రమాదం ఉంది. ► వారిని వెంటనే చల్లని ప్రదేశానికి చేర్చాలి. శరీర ఉష్ణోగ్రత సాధారణ స్థితికి వచ్చే వరకు అలానే చేయాలి. ► చల్లని నీరు తాగడం వల్ల శరీర ఉష్ణాగ్రత తగ్గుముఖం పడుతుంది. బాత్‌టబ్‌లో ఐదు నుంచి పది నిమిషాలు గడపాలి. లేదా చల్లని దుప్పటిని శరీరమంతా కప్పాలి. ఆ తరువాత ఐస్ ముక్కలలతో శరీరమంతా అద్దాలి. ఇలా చేస్తే శరీరం వణుగు తుగ్గుతుంది. కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం కలుగుతుంది. ► తీవ్రతను బట్టి ఆలస్యం చేయకుండా వైద్యుని వద్దకు తీసుకెళ్లాలి. వెంటనే చికిత్స ప్రారంభం అయితే ప్రమాదం నుంచి గట్టెక్కవచ్చు. ఏం తినాలి.. వడదెబ్బ సోకిన వారు ఆహారం తీసుకోవడంలో జాగ్రత్తలు పాటించాలి. ఎక్కువగా తాజా పండ్లు, కూరగాయలు, అదనంగా ద్రవపదార్థాలు, పండ్ల రసాలు, శక్తినిచ్చే శీతలపానీయాలు, మజ్జిగ తాగాలి. అలాగే చిరుధానాయలు తీసుకోవాలి. షుగర్ లెవల్స్‌ను అదుపులో ఉంచుకోవాలి. తద్వారా వడదెబ్బ తీవ్రతను తగ్గిస్తాయి. -
నీ గొడుగు సల్లగుండ..ధర లక్షరూపాయలంట! ఏముంది ఇందులో!
ట్రెండ్‌కు తగ్గట్లు నేటి యువత ప్యాషన్‌గా ఉండేందుకు ఇష్టపడుతున్నారు. నుదుటున పెట్టుకొనే కుంకుమ బొట్టు దగ్గర నుంచి సమ్మర్ సీజన్లో ఎండ వేడిమిని తట్టుకునేందుకు వినియోగించే గొడుగు వరకు..ఇలా ప్రతిదీ ఫ్యాషన్‌గా ఉండాలని కోరుకుంటున్నారు. అందుకు తగ్గట్లు ఫ్యాషన్ బ్రాండెడ్ సంస్థలు ప్రొడక్ట్‌లను మార్కెట్లో విడుదల చేస్తున్నాయి. తాజాగా ఫ్యాషన్ లగ్జరీ బ్రాండ్ గుచీ, స్పోర్ట్స్ బ్రాండ్ సంస్థ అడిడాస్‌లు సంయుక్తంగా ఓ గొడుగును మార్కెట్లో విడుదల చేశాయి. ఇప్పుడీ గొడుగు నెట్టింట్లో వైరల్‌గా మారింది. ⚠️warning!🤣⛽️ ☔️Umbrellas are not waterproof!#adidasxGucci @adidasoriginals @gucci #VirtualWorld #REALITY #Blockchain #CryptocurrencyNews #Metaverse #NFTCommunity #NFTcollectibles #NFTartist #nftcollector pic.twitter.com/xmudzHHxrW — cubist👽🐼🧛♂️🧟♂️🧚♀️🤖 (@cubist_pg) May 13, 2022 అడిడాస్ ఎక్స్ గూచీ కలెక్షన్ పేరుతో స్పెషల్‌గా తయారు చేసిన ఈ గొడుగును ఆన్లైన్లో అమ్మకానికి పెట్టింది.1,644 డాలర్లు(భారత కరెన్సీలో రూ1,27,407.12) చైనా గూచీ వెబ్సైట్లో అందుబాటులో ఉన్న ఈ గొడుగు స్పెషాలిటీ ఏంటో తెలుసా? వర్షం కురుస్తున్నప్పుడు తడవకుండా ఉండేందుకు గొడుగును వినియోగిస్తాం.కానీ ఈ ఫ్యాషన్ సంస్థలు అమ్మకానికి పెట్టిన ఈ గొడుగును వర్షంలో వినియోగించడానికి కాదంట. "దయచేసి గమనించండి, ఈ గొడుగు వర్షంలో తడవకుండా ఉండేందుకు కాదు. సూర్యుడి నుంచి రక్షణ లేదంటే అలంకరణ కోసమే ఉపయోగించుకోవచ్చని తెలిపింది. గొడుగు అమ్మకం గురించి సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో నెటిజట్లు తమదైన స్టైల్లో కామెంట్లు పెడుతున్నారు. వర్షంలో వినియోగించేందుకు పనిచేయని గొడుగును ఇంత ధరకు అమ్మడం ఏంటని మండి పడుతున్నారు. చదవండి👉‘35 వేలా? ఏముంది ఇందులో.. రూ.150కే దొరుకుతుంది’ -
Best Gifts: మరీ టవల్‌ను కానుకగా ఇవ్వడం ఏంటని అనుకోకండి!
Best Gifts For Friends Different Seasons: పండగలు, వేడుకల సందర్భాలలో బంధుమిత్రుల ఇంటికి వెళ్లినప్పుడు ఒక మంచి జ్ఞాపకంగా మిగిలిపోయేలా కానుక ఏదైనా తీసుకెళ్లాలనుకుంటారు ఎవరైనా. అయితే, ఆ ఎంపికలో ఎక్కువ శాతం వాల్ ఫ్రేమ్స్ లేదా గడియారాలు, కొన్ని షో పీసులు ఉంటాయన్నది చాలా మంది ఒప్పుకోవాల్సిందే. కానీ, కొద్దిగా ఆలోచిస్తే మనం ఇచ్చే కానుక ఆ ఇంట్లో అన్ని విధాలా ఉపయోగపడే విధంగా ఎంపిక చేయచ్చు. చలికాలానికి రగ్గులు, వేసవి కాలానికి మగ్గులు, వర్షాకాలానికి గొడుగులు.. కానుకలుగా కాలానుగుణంగానూ ఎంపిక చేసుకోవచ్చు. లేదంటే, అన్ని వేళల్లోనూ ఉపయోగపడేవాటిని ఎంచుకోవచ్చు. ఆలోచనకు కొన్ని ఎంపికలు.. 1. బ్లాంకెట్ : చలిని తట్టుకునేలా వెచ్చని ఆశీర్వచనంగా ప్రతి వింటర్లో ఉపయోగపడేవిధంగా బ్లాంకెట్‌ను ఎంపిక చేయచ్చు. వీటిలో అత్యంత ఖరీదైనవీ, బడ్జెట్‌కు తగినవీ ఉంటాయి. మార్కెట్లో అరుదుగా లభించేవి, నాణ్యమైనవీ, రంగులూ, డిజైన్లూ.. ఇలా మన ఎంపికలో ఓ ప్రత్యేకత ఉండేలా జాగ్రత్తపడవచ్చు. కొన్ని చలికాలాల పాటు మీ ఆప్తులకు మీరిచ్చిన రగ్గు వెచ్చదనాన్ని పంచుతుంది. ఆత్మీయతను పదిలం చేస్తుంది. 2. టీ పాట్: ప్రతి ఇంట్లోనూ తేనీరూ ఓ తప్పనిసరి అవసరం. కాలాలకు అతీతంగా వాడే ఈ పానీయాన్ని అతిథులకు అందించడానికి చూడచక్కని టీ కెటిల్ మంచి ఎంపిక అవుతుంది. అలాగే తేనీటికి సంబంధించి కప్పులు, ట్రే, టీ కెటిల్.. ఇలాంటివి అవసరంగా ఉంటాయి. వీటిలో ఏదైనా మంచి అందమైన సెట్‌ను కానుకగా అందిస్తే ప్రతిరోజూ మీ అతిథులను పలకరించినట్టుగానే ఉంటుంది. 3. వాటర్ జగ్స్ /బాటిల్స్: నీటిని నింపి టేబుల్ మీద పెట్టుకునే వాటర్ జగ్ లేదా బాటిల్స్ ఎంపిక మీ అభిరుచిని తెలియజేస్తుంది. అవసరం అంతగాలేని కానుకల కోసం ఎక్కువ ఖర్చు పెట్టే బదులు ఇలాంటి నిత్యావసరంగా ఉండేవాటిని కానుకలుగా ఇవ్వడానికి ఎంపిక చేసుకోవచ్చు. 4. టవల్: ‘మరీ టవల్‌ను కానుకగా ఇవ్వడం ఏంటి?!’ అనే ఆలోచనే చేయనక్కర్లేదు. నాణ్యమైన టవల్‌ను లేదా టవల్స్ సెట్‌ను కానుకగా ఇస్తే ఆ ఇంటి వారికి ఎంతో ఉపయోగంగా ఉంటుంది. 5. టేబుల్ నాప్కిన్స్–హోల్డర్స్: అతిథి మర్యాదలు చేసే సమయంలో డైనింగ్ టేబుల్ వద్ద ఉంచే నాప్కిన్స్ మంచి డిజైన్‌తో ఉన్న ఎంపికల గురించి చాలా తక్కువే ఆలోచిస్తారు. ‘ఎప్పుడో గానీ ఉపయోగించం కదా! ఖరీదు ఎందుకు’ అనుకునేవారు ఉంటారు. మీ బంధుమిత్రుల ఆలోచన కొద్దిగానైనా మీకు తెలిసి ఉంటుంది కాబట్టి, అందమైన నాప్కిన్, వాటికి అలంకారంగా ఉండే హోల్డ్ర్స్ని గిఫ్ట్‌గా ఇవ్వచ్చు. ఇదే విధంగా గ్లాస్ హోల్డర్, స్పూన్లు, టేబుల్మ్యాట్స్.. ఇలా కానుకల ఎంపికలో చేర్చుకోవచ్చు. 6. ఫ్లోర్/కార్నర్ బాస్కెట్: పిల్లలు ఆడుకున్న బొమ్మలు లేదా ఇతరత్రా అవసరాలకు ఉపయోగించడానికి ప్లాస్టిక్ బుట్టలు లాంటివి వాడుతుంటారు. పర్యావరణ హితమైనవి, మంచి డిజైన్‌తో ఉన్న బుట్టలను కానుకగా ఇవ్వచ్చు. 7. గ్లాస్ సెట్: పానీయాలు సేవించడానికి ఉపయోగించే గ్లాస్ సెట్స్ ఎన్ని ఉన్నా భిన్నమైన ఆకృతిగల గ్లాసుల కోసం శోధిస్తూనే ఉంటారు. అందుకని, కానుకల విభాగంలో అందమైన గ్లాస్ సెట్ మంచి ఎంపిక అవుతుంది. 8. ఇండోర్ బోర్డ్ గేమ్స్: అతిథులు నలుగురు కలసిన వేళ కాలక్షేపానికి ఏం చేయాలో కొంత సమయం తర్వాత అర్థంకాదు. అలాంటప్పుడు ఇండోర్ బోర్డ్ గేమ్స్ బాగా ఉపయోగపడతాయి. ఆసక్తిగా అనిపించే పజిల్ గేమ్స్‌ను కానుకగా ఇవ్వచ్చు. 9. పండ్ల బుట్ట: పువ్వులు, పండ్లు పెట్టుకోవడానికి అందమైన డిజైన్లు గల రకరకాల బుట్టలు మార్కెట్లో లభిస్తున్నాయి. వెదురు నుంచి అన్ని రకరకాల లోహాల్లోనూ ఇవి లభిస్తుంటాయి. మన అభిరుచి అతిథులకు తెలిపేలా అందమైన పండ్ల బుట్టను కానుకగా ఇవ్వచ్చు. 10. పింగాణీ పాత్రలు/డిన్నర్‌సెట్: అతిథులకు భోజనాలు వడ్డించే సమయంలో ఉపయోగించే పింగాణీ పాత్రలు, ట్రే .. వంటివి తప్పనిసరి అవసరాలుగా ఉంటాయి. వీటినే కానుకగా అందిస్తే ఆతిథ్యం ఇచ్చేవారికి ఎంతో ఉపయుక్తంగా ఉంటాయి. కానుకల ఎంపికలో సరైన జాగ్రత్తలు తీసుకుంటే మార్కెట్లో అనవసర వస్తువుల కోసం ఖర్చు పెట్టే విధానం కూడా తగ్గుతుంది. కానుకను తీసుకునే బంధుమిత్రుల స్థోమతను కూడా అంచనా వేసుకొని, దానికి తగినట్టు మన ఎంపిక ఉండటం ముఖ్యం అని భావించాలి. చదవండి: Mallappa Gate Story: అసలు ఎవరీమె? మనిషా.. దయ్యమా?.. అవును నేనే! -
మంత్రుల ముందు ‘ఈటల’ గడియారాలు ధ్వంసం
సాక్షి, హుజురాబాద్: జహీరాబాద్ నియోజకవర్గంలోని జమ్మికుంట సభలో మంత్రులు హరీశ్ రావు, కొప్పుల ఈశ్వర్ ఎదుట కొందరు యువకులు గడియారాలు ధ్వంసం చేశారు. ఈటల రాజేందర్ ఇచ్చినవాటిగా పేర్కొంటున్న గడియారాలను ఆదివారం పగులగొట్టారు. జమ్మికుంటలో నిర్వహించిన ఓ బహిరంగ సభలో టీఆర్ఎస్ యువ నాయకులు వేదికపైకి వచ్చారు. ఈటల రాజేందర్ ప్రజలకు పంపిణీ చేస్తున్నారని గడియారాలు, గొడుగులు తీసుకువచ్చారు. గడియారాన్ని నేలకేసి కొట్టాడు. గొడుగులను చింపేశాడు. ఇవి ఆర్ధిక భరోసానిస్తాయా? అని ప్రశ్నించారు. దళిత వాడల్లో గడియారాలు, గొడుగులు పంచాలని ఈటల చెప్పాడని అయితే తాము నిరాకరించినట్లు యువకులు ఆరోపించారు. అతడి చర్యను చూస్తూ మంత్రులు హరీశ్‌రావు, కొప్పుల, టీఆర్ఎస్ నాయకుడు పాడి కౌశిక్ రెడ్డి పగలబడి నవ్వుకున్నారు. సమావేశంలో మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యే కొరుకంటి చందర్, అభ్యర్థి గెల్లు శ్రీనివాస్, కౌశిక్ రెడ్డి పాల్గొన్నారు. చదవండి: సారీ చెప్పు లేదంటే! జావేద్ అక్తర్‌కు బీజేపీ ఎమ్మెల్యే హెచ్చరిక చదవండి: రెచ్చిపోయిన ఉగ్రవాదులు: పోలీస్ శిబిరంపై బాంబు దాడి -
‘ఎంత ధైర్యం నీకు.. దేశ ప్రధానినే సతాయిస్తావా’
లండన్: మనం ఎంత శక్తివంతులమైనా.. బలవంతులం, గొప్పవారం, ధనవంతులమైనా సరే.. లేచిన వేళా విశేషం బాగాలేకపోతే.. ఏం చేయలేం. ఆ రోజు మన కోసం ఎదురు చూస్తున్న అన్ని సంఘటనలను ఎదుర్కొవాల్సిందే. అవి మంచివే కానీ చెడ్డవే కానీ తప్పదు. సామాన్యుల విషయంలో ఏం జరిగినా ప్రపంచం పెద్దగా పట్టించుకోదు.. అదే సెలబ్రిటీలకు సంబంధించిన చిన్న వార్త, సంఘటనను సైతం పెద్దగా ప్రచారం చేస్తుంది. వారికి ఎదురైన అనుభవాలను సోషల మీడియా వేదికగా బహిర్గతం చేస్తుంది. ఇప్పుడు ఇదంతా ఎందుకంటే.. తాజాగా బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ కాస్త ఇబ్బందికర సంఘటనను ఎదుర్కొన్నారు. అతడి ఇబ్బందికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైలరవుతోంది. ఆ వివరాలు.. కొన్ని రోజుల క్రితం బోరిస్ జాన్సన్ విధులు నిర్వహిస్తూ.. మరణించిన పోలీసు అధికారుల కోసం ఏర్పాటు చేసిన స్మారక సేవ కార్యక్రమానికి హాజరయ్యారు. వర్షం పడుతుండటంతో దానికి వచ్చినవారిలో కొందరు గొడుగులతో హాజరయ్యారు. బోరిస్ జాన్సన్ కూడా గొడుగుతో హాజరయ్యారు. అయితే ఆ గొడుగు జన్సాన్ని తెగ సతాయించింది. మొదటి అది తెరుచుకోలేదు. ఎలాగోలా ప్రయత్నించి.. దాన్ని తెరిస్తే.. ఆ తర్వాత అది గాలికి తట్టుకోలేక రివర్స్ అయ్యింది. ఈ కార్యక్రమానికి ప్రిన్స్ చార్లెస్ కూడా హాజరయ్యారు. గొడుగుతో కుస్తీ పడుతున్న జాన్సన్‌ని చూసి చార్లెస్‌తో సహా అక్కడున్న అధికారులంతా ముసి ముసి నవ్వులు నవ్వుతారు. తన పరిస్థితిని తలుచుకుని జాన్సన్ కూడా చిరు నవ్వులు చిందిస్తాడు. ఇందుకు సంబంధించిన వీడియోని స్కై న్యూస్ ట్విట్టర్లో షేర్ చేయడంతో ప్రస్తుతం ఇది తెగ వైరలవుతోంది. దీనిపై నెటిజనులు రకరకాలుగా స్పందిస్తున్నారు. ....up, up and nearly away ☂️ PM Boris Johnson struggles with his umbrella whilst seated next to Prince Charles at a memorial recognising the sacrifice of police officers who have died on duty. Read more here: https://t.co/ia9HUvj5LD pic.twitter.com/dCcMiVcwyn — Sky News (@SkyNews) July 28, 2021 ‘‘రెండు రోజులు గడిచిందేమో.. ఈ సారి గొడుగు విషయంలో చిక్కుకున్నారు. తనకు కొత్త గొడుగు కొనివ్వాల్సిందిగా ప్రభుత్వాన్ని అడుగుతాడేమో.. లేక మీడియా దీన్ని మరో నెలరోజుల పాటు వాల్‌పేపర్ స్టోరీగా ప్రచురిస్తుంది’’ అని కామెంట్ చేయగా.. మరికొందరు ‘‘నాకు ప్రతిసారి ఇదే అనుభవం ఎదురవుతుంది’’.. నీకు ఎంత ధైర్యం దేశ ప్రధానినే ఇలా ఇబ్బందిపెడుతూ సతాయిస్తావా.. హమ్మా’’ అంటూ కామెంట్ చేయసాగారు. -
విమానంలో వర్షం.. ఎప్పుడైనా చూశారా?
మాస్కో : విమానంలో వర్షం కురిసే సంఘటనల్ని మనం ఊహిస్తామా? విమానంలో వర్షం రావడమేంటి అనుకుంటున్నారా? రష్యా ఎయిర్ లైన్స్ కు చెందిన విమానంలో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. ఖబరోవ్స్క్ నుంచి నల్ల సముద్రానికి వెళ్లి హాలీడేస్ ఎంజాయ్ చేయాలనుకున్న పలువురు ఔత్సాహికులు విమానంలో బయలు దేరారు. విమానం గాల్లోకి ఎగిరిన కొద్దిసేపటికే వాన కురవడం మొదలైంది. విమానం క్యాబిన్ లోకి వర్షపు నీరు చేరిపోయింది. దీంతో పలువురు ప్రయాణికులు విమానంలో గొడుగులు పట్టుకొని కూర్చోవాల్సి వచ్చింది. దీనికి సంబంధించిన వీడియోను ఓ వ్యక్తి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్ అయ్యింది. దీనిపై స్పందించిన రోసియా ఎయిర్ లైన్స్ అధికారులు విచారణ జరపగా అది వర్షం నీరు కాదని పేర్కొన్నారు. ఎయిర్ కండిషనింగ్ వ్యవస్థ సరిగా పనిచేయకపోవడం వల్లే నీరు క్యాబిన్లోకి చేరిందని పేర్కొన్నారు. Volo interno russo #Chabarovsk-Sochi della Rossiya Airlines I passeggeri sono stati costretti ad usare ombrelli per ripararsi da goccioloni d'acqua, parrebbe per un guasto all'aria condizionata Ora sotto inchiesta Non vi lamentate dei treni italiani...pic.twitter.com/HKB1ab66rd — #POLiticamenteScorretto🎹FR© (@PolScorr) July 11, 2020 -
బస్సులోనూ వాన
తమిళనాడు, తిరుత్తణి :రాష్ట్ర రవాణా శాఖకు చెందినబస్సుల స్థితిగతులు ఎలా ఉన్నాయో ఈ ఫొటోనే సాక్ష్యం. డొక్కు బస్సులతో తరచూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్న నేపథ్యంలో గురువారం చెన్నై–తిరుపతి మార్గంలో నడుస్తున్న ఎక్స్‌ప్రెస్ బస్సు టాప్ దెబ్బతినడంతో బయట కురుస్తున్న వర్షం వల్లబస్సులో జనం అవస్థ పడ్డారు .దీంతో వేరే గత్యంతరం లేకదూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు బస్సులోనూ గొడుగు పట్టుకునిపయనించాల్సిన పరిస్థితి ఏర్పడింది. -
నాలుగు చినుకులు పడితే మనకూ వస్తుందీ ఐడియా!
అవసరాలు.. మనిషి చేత అద్భుతాలను సృష్టిస్తాయి. ఆ అద్భుతాలు.. అప్పుడప్పుడూ యావత్ ప్రపంచాన్ని ముచ్చటపడేలా చేస్తాయి. అందుకు ఉదాహరణే ఈ గొడుగు. ఒకప్పుడు గొడుగులంటే.. ఒక్కటే కలర్లో తాటాకంత పెద్దగా, వృద్ధుల చేతిలోని కర్రలా పొడవుగా ఉండేవి. కాలక్రమేణా సింపుల్‌గా, స్లిమ్‌గా బ్యాగ్‌లో సైతం పట్టేంత చిన్నగా మారి, రెయిన్బో కలర్స్‌ని సైతం మరిపించసాగాయి. ఇక వేసవి కాలంలో ఎండ తగలకుండా వేసుకునే గొడుగుకి.. ఫ్యాన్స్ అమర్చిన గొడుగులు మార్కెట్ లోకాన్ని బాగానే ఏలుతున్నాయి. అయితే జపాన్‌లో కనిపిస్తున్న ఈ సరికొత్త ‘ఫుల్ బాడీ అంబ్రిల్లా’లు మాత్రం చూపరుల చేత ‘వాట్ యాన్ ఐడియా సర్జీ’ అనిపిస్తున్నాయి. ఈ గొడుగు ప్రత్యేకత ఏంటంటే... కుండపోత వర్షం వస్తున్నా, తల నుంచి కాళ్ల దాకా తడవకుండా వెళ్లాల్సిన చోటికి వెళ్లిపోవచ్చు. గొడుగు మొత్తం ఓపెన్ చేసుకుని, పొడవాటి కవర్ని గొడుగుకి తొడుక్కుంటే చాలు చక్కగా అందులో ఉన్నవారిని తడవకుండా చేస్తుంది. ఈ గొడుగు మనిషిని మొత్తం కప్పేసినా, ఇందులోంచి చూస్తే చుట్టు పక్కలంతా స్పష్టంగా కనిపిస్తుంది. ఈ ఐడియా ఏదో బాగుంది కదూ!? ఆసక్తి ఉంటే ఇలాంటి గొడుగును స్వయంగా తయారు చేసుకోవచ్చు. కాకపోతే అంత పొడవు కవర్ దొరకడం కష్టం కాబట్టి అతుకులు, ప్లాస్టర్ అంటింపులు తప్పవు. సరదాగా ప్రయత్నించండి మరి. ఈ వర్షాకాలంలో తడుస్తూ పోతున్నవారిని అవాక్కు పరచండి. -
గాలిలో వెంట వచ్చే గొడుగు
-
పట్టుకోకుండానే గొడుగు మన వెంటే...
సాక్షి, న్యూఢిల్లీ : ఎండలో, వానలో కాలినడకన వెళ్లేవారికి ఎంతో తోడుగా ఉండేది గొడుగు. ఎండలో చెమట పడుతున్న చేతులతో, ఈదురు గాలులతో వర్షంలో గొడుగును పట్టుకోవడం ఇబ్బందే. అస్తమానం చేతిలో సెల్‌ఫోన్ పట్టుకొని తిరిగే నేటి రోజుల్లో ఓ చేతిలో సెల్, మరో చేతిలో గొడుగు పట్టుకోవడం కష్టం. ఈ కష్టాలన్నింటి దూరం చేస్తూ మనం ఎటు వెళితే అటు మన తలవెంట దానంతట అదే గాలిలో నడిచి వచ్చే గొడుగు పట్టే గొడుగును తయారు చేసిందీ ఓ జపాన్ కంపెనీ. ఇందులో తలను ఫొలో అయ్యేందుకు ఓ కెమెరాను, దానంతట అదే గాల్లో తేలియాడుతూ రావడానికి ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించినట్లు అసాయి పవర్ సర్వీసెస్ వెల్లడించింది. అటానమస్ డ్రోన్‌లో ఉపయోగించే సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించే ఓ ప్రోటోటైప్ గొడుగును తయారు చేశామని, దీని బరువు 11 పౌండ్లుకాగా, ఒకసారి బ్యాటరీ చార్జిచేస్తే పనిచేసే సమయం అరగంటని కంపెనీ యాజమాన్యం తెలిపింది. గొడుగును రెండు పొండ్లకు తగ్గించి బ్యాటరీ గంటసేపు వచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని, 2019లో 275 డాలర్లకు ఈ గొడుగును మార్కెట్లోకి విడుదల చేస్తామని వివరించింది. -
బద్రినాథ్ గుడిలో కొత్త బంగారు గొడుగు
గోపేశ్వర: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం బద్రినాథ్‌లోని విష్ణు భగవానుడి విగ్రహంపై కొత్త బంగారు గొడుగును ఏర్పాటుచేశారు. నాలుగు కేజీల బరువున్న ఈ గొడుగును లూధియానాకు చెందిన సూద్ కుటుంబం కానుకగా సమర్పించింది. ప్రత్యేకంగా అలంకరించిన పల్లకిలో దాన్ని దేవాలయానికి తీసుకొచ్చి ప్రత్యేక ప్రార్థనల నడుమ గర్భగుడిలో ప్రతిష్టించారు. సూద్ కుటుంబీకులు, దేవాలయ అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 600 ఏళ్ల కిత్రం గ్వాలియర్ రాచకుటుంబానికి చెందిన మహరాణి అహల్యా బాయ్ సోల్కర్ సమర్పించిన గొడుగు స్థానంలో కొత్త గొడుగును అమర్చారు. -
ఉపాయంతో ఉపశమనం..
భానుడు భగభగ మండిపోతున్నాడు.. పనుల నిమిత్తం ద్విచక్ర వాహనంపై బయటికి వెళ్లాలంటే హడలిపోవాల్సిందే. కూసుమంచి మండలానికి చెందిన బానోత్ రాందాసు అనే వ్యక్తికి ఓ ఆలోచన వచ్చింది. అనుకున్నదే తడవుగా ఇలా బండికి గొడుగు అమర్చుకున్నాడు. ఎండల నుంచి ఉపశమనం పొందుతున్నాడు. – ఖమ్మంఅర్బన్ -
హైటెక్ ఛత్రం..!
రేణిగుంట:ఎండలు మండుతున్నాయి. అయినా, జీవనపోరాటం ఆగదు. ఎండ నుంచి రక్షణకు చిట్కాలు ఎన్నో. పాదచారులే కాదు. వాహనదారులు కూడా పాటిస్తున్నారు. అందుకు అద్దంపట్టే చిత్రమిది. ఈయన పేరు కృష్ణశాస్త్రి. వేద పండితుడు. కడప పట్టణానికి చెందిన ఈయన తిరుపతి వైకుంఠపురంలో ఉంటున్నారు. వృత్తిరీత్యా పూజలు చేసేందుకు వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తుంటారు. ఈ క్రమంలో ఆయన రేణిగుంట సమీపంలో సాక్షి ప్రతినిధులకు తారసపడ్డారు. అర్చకత్వం కోసం పలు ప్రాంతాలకు తిరుగాడేందుకు ఇబ్బంది లేకుండా ద్విచక్ర వాహనానికి రూ.రెండు వేలు వెచ్చించి గొడుగు ఏర్పాటు చేసుకున్నట్లు చెప్పారు. ప్రయాణంలో కూడా రక్షణ కోసం కచ్చితంగా హెల్మెట్ వాడతానని స్పష్టం చేశారు. దారిలో ఎవరు పలుకరించినా ఆయుర్వేద వైద్యంపై అవగాహన కూడా కల్పిస్తుంటానని కొన్ని చిట్కాలు వివరించారు. వేదాల్లోనే కాదు. వైద్యంలోనూ ఆయన పండితుడే! -
వర్షం..రైలు..ఓ గొడుగు-వైరల్ వీడియో
జార్ఖండ్: ఒకవైపు బుల్లెట్ రైళ్లు,ఎలక్ట్రిక్ కార్లు అంటూ దేశం శరవేరంగా పరుగులుపెడుతున్న వైనం. మరోవైపు రైలు డ్రైవర్ వర్షంలో గొడుగు పట్టుకుని మరీ రైలు బండిని నడుపుత్ను షాకింగ్ సన్నివేశం. రైలు నడపడంలో కీలకమైన కంట్రోల్ ప్యానెల్ తడవకుండా గొడుగు పట్టుకుని, రైలును నడుపుతున్నఈ వీడియో ఒకటి ఇపుడు వైరల్‌గా మారింది. కొన్ని సంవత్సరాలుగా ఇదే దుర్భర పరిస్థితి కొనసాగుతోందంటూ ఈ వీడియోను రికార్డు చేసిన వ్యక్తి వాపోయారు. అంతేకాదు నేలమీద కూడా వర్షపు నీటిని రక్షించుకునేందుకు నేలమీద పరచిని న్యూస్ పేపర్లు.. ఇంకా మరిన్ని కష్టాలు ఈ వీడియోలు మనం చూడొచ్చు. కనీసం ఈ వీడియో చూసిన తరువాత అయినా పై అధికారుల్లో చలనం వస్తుందనీ, తద్వారా పరిస్థితిలో మార్పు వస్తుందని ఆయన ఆశించారు. మరి ఫలితం ఉండబోతోందో.. వేచి చూడాల్సిందే.. మరోవైపు ఈ వీడియో ట్విట్టర్ లో దుమారం రేపుతోంది. పలు విమర్శలు, వ్యంగ్యాస్త్రాలతో కూడిన కమెంట్లు వెల్లువెత్తాయి. రైల్వే భద్రతపై ఆందోళన వ్యక్తమవుతోంది. అలాగే కేంద్ర రైల్వేశాఖ మంత్రిత్వ శాఖ, మంత్రి సురేష్ ప్రభు ఈ అంశంపై సత్వరమే స్పందించాలని కోరారు Railway safety? @sureshpprabhu and @RailMinIndia need to take a serious look without victimising whistleblower pic.twitter.com/Ue7rv0LwTP — Sucheta Dalal (@suchetadalal) August 9, 2017 -
వింతైన షేప్.. కొంటే సేఫ్
ఒకప్పుడు ఒక అవసరం తీర్చే వస్తువు కనిపిస్తే ఆహా. మరిప్పుడో... ఒకే వస్తువు ఎన్ని ఎక్కువ అవసరాలు తీరిస్తే అంత ఆహా.. ఓహో. వర్షంలో తడవకుండా రక్షించే గొడుగులు ఇప్పుడు అనేక హంగులతో వస్తున్నాయి. వర్షంలో ఒక చేత్తో మొబైల్, మరో చేత్తో గొడుగు పట్టుకునే అవస్థ లేకుండా... ఫోన్‌ను గొడుగులో అమర్చి సంచలనం సృష్టించారు కేరళీయులు. ఇవి రేపో మాపో సిటీ మార్కెట్లోకి రానున్నాయి. అయినా ఇంతకీ మీరు ఏ గొడుగు వాడుతున్నారు? ఏ గొడుగంటే రంగు గురించి అనుకునేరు! వీటిలో చాలా రకాలున్నాయి. ఏ వర్షానికి ఏ గొడుగు అనేది తెలియాలంటే కాస్త అవగాహన అవసరమే. ఈ నేపథ్యంలో వెరైటీ గొడుగుల విశేషాలు... – ఓ మధు మరికొన్ని వెరైటీ గొడుగుల విశేషాలివి.... ► క్లాసిక్: చెక్క, మెటల్ ఫ్రేమ్, పాలిస్టర్‌తో చేసిన సింగిల్ ఫోల్డ్ గొడుగులు ఇవి. మన ఇళ్లలో కనిపించే పాత కాలం నాటి గొడుగులు చాలా వరకూ ఇవే. ► ఆటోమెటిక్ గొడుగులు: ఒక చేత్తో తెరిచేందుకు వీలుగా ఉండేవి. వీటిలో రెండు మడతలు చేసి బ్యాగుల్లో సర్దుకొని తీసుకెళ్లేంత చిన్నవి కూడా ఉన్నాయి. రేటు పెరిగే కొద్ది చిన్న పౌచ్, ప్లాస్టిక్ బాటిల్లో పట్టేవి కూడా లభిస్తున్నాయి. ► పాకెట్ గొడుగు: ఇవి తక్కువ బరువుతో పాకెట్లో పట్టేంత చిన్నగా ఉంటాయి. భారీ వర్షం నుంచి రక్షించలేవు. ► బబుల్: నీటి బుడగను తలపిస్తాయి. తల, భుజాలు కవర్ అయ్యేలా ఉండే బబుల్ గొడుగులు ట్రాన్స్పరెంట్ ప్లాస్టిక్‌తో చేసినవే ఎక్కువ. ► తుఫాన్ గొడుగులు: భారీ, ఈదురు గాలులతో కూడిన వర్షాలను తట్టుకునేలా తయారుచేసినవి. ఇవి చాలా దృఢంగా ఉంటాయి. ► ఫ్యాషన్: ఫ్యాషన్ డిజైనర్లు రకరకాల మెటీరియల్స్, కొత్త డిజైన్స్‌తో గొడుగులు తయారు చేస్తున్నారు. ఎండ కోసం ప్రత్యేకమైన గొడుగులు తయారవుతున్నాయి. ఎండతో పాటు అతినీలలోహిత కిరణాలు, టాన్ నుంచి తప్పించుకునేందుకు ఇవి ఉపకరిస్తాయి. బీచ్‌లలో బాగా ఎండ ఉన్న సమయాల్లో వాడతారు. ► గోల్ఫ్ గొడుగు: 70 ఇంచుల వ్యాసంతో గోల్ఫ్ బ్యాగుల్లో తీసుకెళ్లడానికి వీలుగా ఉంటాయి. ► గాడ్జెట్ గొడుగులు: లైట్, కత్తి, చేతి కర్ర తదితరాలతో పాటు ఆధునిక సాంకేతికత కూడా గొడుగులో దూరిపోతోంది. ఎంపీ3, రేడియో, యూఎస్బీ, ఎల్ఈడీ, అలారం, బ్లూటూత్‌తో కూడిన చైనా మేడ్ గొడుగులు అందుబాటులో ఉన్నాయి. సిటీలో బ్లూటూత్ గొడుగులు ఆదరణ పొందుతున్నాయి. -
బస్సులో కూడా గొడుగులతో ప్రయాణం
-
వాన రాక... ఈ గొడుగుకు ఎరుక!
వానాకాలంలో గొడుగు లేకుండా బయటకు వెళితే ఎన్ని ఇబ్బందులు పడాలో మనకు తెలియంది కాదు. గొడుగు మోసుకెళ్లడం.. వాన రాకపోతే చిరాకుపడటమూ మనకలవాటే. ఇంకొందరేమో మోసుకెళతారు... అక్కడ, ఇక్కడ పెట్టేసి మరచిపోతూంటారు. ఇలాంటి అన్ని సమస్యలకు సమాధానం ఫొటోలో కనిపిస్తున్న ‘ఊంబ్రెల్లా’. దీనికి వానెప్పుడు వస్తుందో తెలుసు. తనను తీసుకెళ్లడం మరిచిపోవద్దని యజమాని స్మార్ట్‌ఫోన్‌కు మెసేజ్ పెట్టగలదు. ఎక్కడ మరిచిపోయినా... వెంటనే ఫోన్ ద్వారా హెచ్చరిస్తుంది కూడా. ఈ హైటెక్ హంగులన్నింటి కోసం ఊంబ్రెల్లాలో ప్రత్యేక ఏర్పాట్లు ఉన్నాయి. దీని పిడిలో ఏర్పాటు చేసిన సెన్సర్లు పరిసరాల ఉష్ణోగ్రత, గాల్లో తేమశాతం, పీడనం, కాంతి వంటి అన్ని వాతావరణ సంబంధిత వివరాలను ఎప్పటికప్పుడు సేకరించి... వర్షం పడేందుకు ఉన్న అవకాశాలను అంచనా వేస్తుంది. అందుకు తగ్గట్టుగా యజమానికి సూచనలిస్తుంది. ఇంకోలా చెప్పాలంటే మీ వద్ద ఓ మినీ వాతావరణ కేంద్రం ఉంటుందన్నమాట. అంతేకాదు.. వర్షం పడే అవకాశం ఎక్కువగా ఉంటే మీతోపాటు పరిసరాల్లో ఊంబ్రెల్లా వాడే వారందరికీ ‘వీజూ’ అనే స్మార్ట్‌ఫోన్ అప్లికేషన్ ద్వారా హెచ్చరికలు పంపుతుంది. ఊంబ్రెల్లా రెండు మోడళ్లలో లభిస్తుంది. దాదాపు 3.1 అడుగుల పొడవైంది ఒకటైతే... మడిచేసి పెట్టుకోగల 0.8 అడుగుల సైజుండేది రెండోది. మీరు ఇప్పటికే వాడుతున్న గొడుగును ఊంబ్రెల్లాగా మార్చేందుకు ప్రత్యేకమైన ఏర్పాట్లు కూడా ఉన్నాయి. ఊంబ్రెల్లా మరో రెండు నెలల్లో అందుబాటులోకి రానుంది. -
ప్రభుత్వ సంస్థలన్నీ ఒకే గొడుగు కిందకు రావాలి
లోక్‌సత్తా తెలుగు రాష్ట్రాల కన్వీనర్ రామ్మోహనరావు పరకాల : ప్రభుత్వ సంస్థలన్నీ ఒకే గొడుగు కిందకు రావాలని లోక్‌సత్తా ఉద్యమ సంస్థ తెలుగు రాష్ట్రాల కన్వీనర్ బండారు రామ్మోహనరావు అన్నారు. వీఆర్వో వొల్లాల రమేష్‌బాబు ఉద్యోగ విరమణ సభ ఆదివారం రాత్రి పట్టణంలోని ఎంఎన్ఆర్ గార్డెన్లో తహసీల్దార్ పి. హరికృష్ణ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి విశిష్ట అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ద్వారా ప్రజలకు సేవలు అందించే అన్ని సంస్థలను ఒకచోటికి చేర్చాలన్నారు. రెవిన్యూ వ్యవస్థ అంటేనే ప్రభుత్వమని, ప్రభుత్వానికి ప్రతిరూపంగా కన్పించే రెవిన్యూ వ్యవస్థలో సమూల మార్పులు రావాలన్నారు. సాదాబైనామా సక్రమంగా చేయడం సబబేనన్నారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ పాడి కల్పనాదేవి, చైర్మన్ రాజభద్రయ్య, వైస్ చైర్మన్ దేవునూరి రమ్యకృష్ణమేఘనాథ్, కౌన్సిలర్లు ఆర్పీ జయంత్‌లాల్, మడికొండ సంపత్‌కుమార్, పాడి నవ్య, సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షులు గంట విజయసమ్మిరెడ్డి, వీఆర్వోలు ముసినిపల్లి రమేష్, జనుప మోహన్, ఎల్ఐసీ డీవో కోసరి రజనీకుమార్, కామిడి సతీష్‌రెడ్డి, కాటూరి శ్రీధరాచార్య, సుధాకర్ పాల్గొన్నారు. -
గొడుగు తిరగబడితే..
వానొస్తే.. గొడుగు చేత పట్టుకుంటాం. మరి ఇదే గొడుగును వాన నీటిని ఒడిసిపట్టేందుకు వాడితే? ఐడియా అదుర్స్ కదూ..! ముంబైలోని ప్రియా, సమిత్ చోక్సీ దంపతులు అదే పనిచేశారు. అంతేకాదు ఒక్క దెబ్బకు రెండు పిట్టలన్నట్టు గొడుగు లాంటి నిర్మాణంతో అటు వాన నీటిని ఒడిసి పట్టడంతో పాటు ఇటు విద్యుత్తునూ ఉత్పత్తి చేస్తున్నారు. ఫొటోలో చూశారు కదా తిరగేసిన గొడుగు మాదిరి ఉన్న ఈ నిర్మాణాన్ని ప్రియా, సమిత్ చోక్సీ దంపతులు రూపొందించారు. వర్షం వచ్చినపుడు ఇందులో నీరు నిలుస్తాయి. మూడడుగుల పైపు భాగంలో గొడుగు వంటి నిర్మాణం ఉంటుంది. ఈ పైపు అటూఇటూ కదలకుండా ఒక చదరపు అడుగు కాంక్రీట్ దిమ్మపై దీన్ని అమర్చారు. పైపు చుట్టూ కొన్ని తీగలు ఏర్పాటు చేశారు. గొడుగు లోపలివైపు ఏర్పాటు చేసిన పలుచటి ఫొటో వోల్టాయిక్ మాడ్యూల్స్ సౌరశక్తిని విద్యుత్తుగా మార్చి బ్యాటరీకి చేరవేస్తాయి. వానొస్తే గొడుగు లోపలి భాగంలోకి చేరే నీరు పైపు గుండా కిందకు వెళ్తాయి. ఎక్కడెక్కడ వాడుకోవచ్చు... ఉల్టా ఛత్రీలను ఇంకుడు గుంతలకు ప్రత్యామ్నాయంగా ఇంటికప్పులపై ఏర్పాటు చేసుకోవచ్చు. చతురస్రపు, వృత్తాకారపు ఆకారాల్లో లభిస్తున్న వీటి వైశాల్యం 16 చదరపు మీటర్ల నుంచి 36 చదరపు మీటర్ల వరకూ ఉంటుంది. సైజును, పడే వర్షం ఆధారంగా ఒక్కో ఉల్టా ఛతా నుంచి ఏడాదికి లక్ష లీటర్ల నీటిని సేకరించవచ్చు. ఒక్కోదాన్ని గంట సమయంలోనే ఏర్పాటు చేసుకోవచ్చు. పార్కింగ్ స్థలాలు, ఫ్యాక్టరీల్లో ఉల్టా ఛత్రీలను ఎక్కువ సంఖ్యలో ఏర్పాటు చేసుకోవడం ద్వారా విద్యుత్తు ఖర్చును తగ్గించుకోవడంతోపాటు శుభ్రమైన నీటిని కూడా పొందవచ్చని సమిత్ పేర్కొన్నారు. మరో రెండు నెలల్లో వినియోగదారులకు అందుబాటులోకి రానుంది. - సాక్షి, హైదరాబాద్ ఎన్నో ప్రత్యేకతలు... ‘ఉల్టా ఛత్రీ’ అని పిలుస్తున్న ఈ నిర్మాణంతో వాన నీటిని పట్టుకోవడమే కాదు ఆ నీటిని శుద్ధి చేస్తుంది కూడా. ఇందుకోసం గొడుగు పైభాగంలో వల లాంటి నిర్మాణం ఉంటుంది. పైపు పైభాగంలో 20 మైక్రాన్ల సైజున్న మలినాలనూ తొలగించేందుకు మరో ఫిల్టర్ ఏర్పాటు చేశారు. అవసరమైతే అతినీలలోహిత కిరణాలతో బ్యాక్టీరియా, వైరస్ వంటి సూక్ష్మజీవులను నాశనం చేసే వ్యవస్థను కూడా బిగించుకోవచ్చు. లోపలి భాగంలో దాదాపు 1.5 కిలోవాట్ల సామర్థ్యమున్న ఫొటో వోల్టాయిక్ మాడ్యూల్స్‌ను ఏర్పాటు చేసుకోవచ్చు. అయితే ప్రస్తుతం 100 వాట్ల మాడ్యూల్స్ మాత్రమే ఏర్పాటు చేస్తున్నామని సమిత్ చోక్సీ ‘సాక్షి’కి తెలిపా రు. ఈ విద్యుత్తుతో పదివాట్ల ఎల్ఈడీ బల్బులను రోజుకు 12 గంటల చొప్పున ఐదు రోజుల పాటు వెలిగించవచ్చన్నారు. -
ఈ గొడుగు చాలా స్మార్ట్ గురూ!
స్మార్ట్ గాడ్జెట్ వాన రాకడ ప్రాణం పోకడ ఎవరికీ తెలియదనేది కాలం చెల్లిన సామెత. ప్రాణం పోకడ సంగతలా ఉంచితే, ఇక్కడి ఫొటోలో కనిపిస్తున్న గొడుగు వాన రాకడను ఇంచక్కా గంట ముందే చెప్పేయగలదు. ‘వెజూ’ అనే ఫ్రెంచి కంపెనీ ఈ గొడుగును రూపొందించింది. దీనిని ‘ఊంబ్రెల్లా’ బ్రాండ్ పేరిట మార్కెట్లో అందుబాటులోకి తెచ్చింది. స్మార్ట్‌ఫోన్‌కు అనుసంధానమై పనిచేస్తుంది. వాతావరణంలో రాబోయే మార్పులను ఇది గంట ముందే చెప్పేస్తుంది. ఈ గొడుగు పైభాగంలో ఏర్పాటు చేసిన సెన్సర్లు వాతావరణంలోని మార్పులను ఎప్పటికప్పుడు రికార్డు చేస్తాయి. ఎండ తీవ్రత, వాతావరణంలోని తేమ, గాలి పీడనం వంటి ప్రతి అంశాన్నీ స్మార్ట్ ఫోన్‌కు చేరవేస్తాయి. రాబోయే గంట వ్యవధిలో వాతావరణంలో తలెత్తబోయే మార్పులను ముందుగానే అంచనా వేసి, స్మార్ట్‌ఫోన్‌కు హెచ్చరికలు జారీచేస్తాయి. మరో విశేషం ఏమిటంటే, దీనిని ఎక్కడైనా మర్చిపోయినా మరేమీ ఫర్వాలేదు. జీపీఎస్ ఆధారంగా ఇది ఎక్కడ ఉన్నదీ వెంటనే స్మార్ట్‌ఫోన్‌కు ఎస్ఎంఎస్ వచ్చేస్తుంది. అందువల్ల దీన్నెవరైనా కొట్టేస్తారేమోననే బెంగ కూడా అక్కర్లేదు. దీని రిటైల్ ధర 86 డాలర్లు (రూ.5,725) మాత్రమే. అంటే దాదాపు ఒక సగటు స్మార్ట్‌ఫోన్ ధరకు సమానం. ఎండ నుంచి, వాన నుంచి తలకు రక్షణ ఇచ్చే గొడుగుకు ఇది పెద్దమొత్తం అనిపించవచ్చు కానీ, ఇది మొబైల్ వాతావరణ కేంద్రంలా పనిచేస్తుంది మరి. -
భగ భగ
వేసవి ఆరంభంలోనే భానుడు తన ప్రతాపం చూపుతున్నాడు. రెండు మూడు రోజుల్లోనే వాతావరణంలో చాలా తేడా కనిపిస్తోంది. ఉదయం 10 గంటలు దాటితే బయటకు రావడానికి జనం జంకుతున్నారు. మధ్యాహ్నం సమయంలో రోడ్లు నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి. అత్యవసర పనులపై వెళ్లాల్సివస్తే గొడుగు పట్టుకుని బయటకు వస్తున్నారు. చాలా మంది ఉద్యోగులు మధ్యాహ్నం భోజనం కోసం గతంలో ఇంటికి వెళ్లే వారు. ఎండల తీవ్రత దృష్ట్యా ఉదయాన్నే లంచ్ బాక్స్ వెంట తీసుకెళ్తున్నారు. బుధవారం మధ్యాహ్నం జన సంచారం లేని కడప కోటిరెడ్డి సర్కిల్ దృశ్యమిది.. ఎండల్లో చల్లదనం కోసం... ఎండలు మండుతున్నాయి. మధ్యాహ్నం అయితే ప్రధాన రహదారులు సైతం జనం లేక బోసిపోతున్నాయి. ఇక ప్రజలు వేసవి తాపం తీర్చుకునేందుకు కొబ్బరినీరు, చెరుకు రసం, మజ్జిగ, లస్సీ తాగుతున్నారు. పండ్ల రసాలు, కర్బూజకు గిరాకీ పెరిగింది. కొందరు చెడిపోయిన ఫ్రిజ్‌లను తయారుచేయించుకంటుండగా.. మరి కొందరు కుండలను కొనుగోలు చేస్తున్నారు. -
ఈ బ్యాంకుకు వెళితే గొడుగు మస్ట్!
అది ఇంగ్లాండ్‌లోని ఇప్సివిచ్ నగరం. అక్కడి యూరోపార్క్ ప్రాంతంలో ఉన్న నాట్‌వెస్ట్ బ్యాంకుకు వెళితే... గొడుగు తప్పనసరి. బ్యాంకుకు వెళితే... నగదు, నగా తెచ్చుకుంటే సెక్యూరిటీ చూసుకోవాలి గాని ఈ గొడుగు గోల ఏమిటంటారా? అసలు విషయం ఏమిటంటే... ఈ బ్యాంకు భవనం పైకప్పు సీగుల్ పక్షలు గూళ్లు పెట్టుకున్నాయి. ఈ గూళ్ల నుంచి పిల్లలు జారి కిందపడుతూ ఉంటాయట. వాటి దగ్గరికి ఎవరినీ రానీయకుండా పైనుంచి తల్లి పక్షి కాపాలా కాస్తుంది. బ్యాంకు దిశగా ఎవరు వచ్చినా మిస్సైల్లా దూసుకొచ్చి నెత్తిన ముక్కుతో పొడుస్తాయట. దాంతో బ్యాంకు కస్టమర్ల క్షేమం కోసం మేనేజరు ఏకంగా ఒక గొడుగును ఏర్పాటు చేసి ఇలా సెండాఫ్ ఇస్తోంది. అన్నట్లు ‘సీగుల్లతో జాగ్రత్త’ అంటూ బ్యాంకు ముందు నోటీసు కూడా పెట్టింది. -
చెట్లకే గొడుగు!
టోక్యో: ఎండ, వాన నుంచి మనల్ని కాపాడే చెట్ల రక్షణకు మనం ఏం చేస్తున్నాం. ఇష్టం వచ్చినట్లుగా కొట్టేయడం తప్ప కాపాడడమా? కాని జపాన్‌లో జనం అలా కాదు. వారు చెట్లను కాపాడేందుకు ఇలా గొడుగులు తయారు చేస్తున్నారు. చలికాలంలో పడే మంచు గడ్డల బారి నుంచి చెట్ల కొమ్మలు విరిగిపడకుండా చూసేందుకు ఇలా ఏర్పాట్లు చేశారు. వెదురు కర్రను మధ్యలో అమర్చి చుట్టూ తాళ్లతో ఇలా గొడుగు మాదిరిగా తయారు చేసి చెట్లపై అమర్చుతారట. ఒక్క చెట్టుకు గొడుగు తయారు చేసేందుకు దాదాపు 800 తాళ్లు అవసరమవుతాయట. -
గొడుగుడుగుంజం
గొడుగు (ఛత్రి)... వాన జల్లు గిల్లకుండా కాపాడుతుంది. మండే ఎండల్లో మాడిపోకుండా రక్షణ కవచంగా నిలుస్తుంది. ఎండైనా, వానైనా అతివృష్టిలా ఉండే నగరంలో.. ఈ రెండు కాలాల్లో నగరవాసి ఆశ్రయించేది గొడుగునే. అందుకే.. నగరానిది గొడుగుది విడదీయ రాని బంధం. సిటీలో వర్షాకాలమే కాదు.. ఏ కాలమైనా ఎండకన్నెరగకుండా మగువలు అంబ్రెల్లానే వాడతారు. అందుకే ఈ గొడుగు ప్రాముఖ్యాన్ని ముందే ఊహించారో ఏమో మన పాలకులు... దానికి సముచిత గౌరవం కల్పిస్తూ ఓ ప్రాంతానికి ‘ఛత్రినాక’ అని పేరు కూడా పెట్టేశారు. ప్రేమికులను ఒక్కచోట చేర్చే సాధనం కూడా ఈ గొడుగే. ఎలా అంటారా? 1955లో రాజ్‌కపూర్, నర్గీస్ నటించిన ‘శ్రీ 420’ సినిమా గుర్తుండే ఉంటుంది. ‘ప్యార్ హువా ఇక్రార్ హువా’ అంటూ... హీరో హీరోయిన్ల ప్రేమ చిగురించింది కూడా ఈ గొడుగు కిందే. ఇక ఏ ఎండకాగొడుగు పట్టే వారు రోజూ మనకు తారసపడుతూనే ఉంటారు. ఈ గొడుగులకు పెద్ద చరిత్రే ఉంది. 11వ శతాబ్దం నుంచే చైనాలో గొడుగులను ఉపయోగించేవారు. ఈజిప్టు, బాబిలోనియాల్లో ఇవే గొడుగులను హోదాకు గుర్తుగా వాడేవారు. ఐరోపాలో ఎండకు రక్షణగా వాడితే.. వాననుంచి రక్షించుకోవడం కోసం ఉపయోగించారు రోమన్లు. 1680లో ఫ్రాన్స్, తర్వాత ఇంగ్లండ్‌లో ఈ గొడుగువాడకం మొదలైంది. 18వ శతాబ్దం నుంచి ఐరోపా అంతటికి గొడుగు విస్తరించింది. పాశ్చాత్య దేశాలు ఇప్పుడిప్పుడు ఉపయోగించిన ఈ గొడుగును మన భారతీయులు ముందే వాడేశారు.. కృత యుగంలో బలి చక్రవర్తిని మూడడుగుల నేల కోరిన వామనుడు ఛత్రంతోనే దర్శనమిచ్చాడు. ద్వాపరానికి వచ్చే సరికి శ్రీకృష్ణుడు గోవర్ధనగిరిని చిటికెన వేలుపై ఎత్తి గోవర్ధన గిరినే గొడుగుగా మార్చేశాడు. ఇంత గొడుగోపదేశం ఎందుకంటారా..? ఈ రోజు నేషనల్ అంబ్రెల్లా డే ! ..:: కట్టా కవిత -
దేవతా గొడుగు..
ఇది గొడుగు. అవును గొడుగే. చూస్తే.. టార్చ్లైట్లా కనిపిస్తోంది గానీ.. ఇది గొడుగే.. అయితే.. దేవతా వస్త్రాలు టైపు గొడుగన్నమాట. వర్షం పడినప్పుడు ఈ ఫొటోలో చూపినట్లు ఆ ప్లాస్టిక్ గొట్టాన్ని పట్టుకుంటే చాలు.. తడిచే ప్రసక్తే లేదు. చైనా నాన్జింగ్ వర్సిటీ పరిశోధకులు ఈ ఎయిర్ అంబ్రెల్లాను రూపొందించారు. ఈ గొడుగు పై భాగంలో రంధ్రాలుంటాయి. స్విచ్చు నొక్కితే.. వాటిల్లోంచి వేగంగా గాలి వస్తుంది. ఆ గాలే ఛత్రంలా పనిచేస్తుందన్నమాట. నీళ్లు మనమీద పడకుండా ఆ గాలి వాటిని పక్కకు తోసేస్తుంది. దీన్లోని బ్యాటరీని ఒక్కసారి చార్జ్ చేస్తే.. 30 నిమిషాలు పనిచేస్తుంది. ఈ ప్లాస్టిక్ గొట్టం పై భాగంలో మోటార్, మధ్య భాగంలో బ్యాటరీ, కింద భా గంలో స్విచ్చు ఉంటాయి. దీన్ని మరింత మెరుగుపరిచేం దుకు యత్నిస్తున్నారు. త్వరలో మార్కెట్లోకి రానున్న ఈ ఎయిర్ అంబ్రెల్లా ధర రూ.12,000 వరకూ ఉండొచ్చు. -
ఆవిష్కరణం: గొడుగు అమ్మాయిలదట!
అంబ్రెల్లా అనే పదం లాటిన్ నుంచి వచ్చింది. అంబ్రా అంటే నీడ అని, ఎల్లా అంటే చిన్న అని అర్థం. అంటే అంబ్రెల్లాకు ‘చిన్న నీడ’ అని అర్థమన్నమాట. గొడుగుకు చాలా చరిత్రే ఉంది. గొడుగు పుట్టింది ఎండ నుంచి రక్షణకు.. క్రీస్తుపూర్వమే వీటిని వాడినట్టు తెలుస్తోంది. రికార్డుల ప్రకారం చైనాలో తొలిసారి క్రీ.శ. 21లో గొడుగు వాడారు! అయితే వారు వాన కోసం వాడారు. తొలి వాటర్‌ప్రూఫ్ గొడుగు వాళ్లే తయారుచేశారు. చిత్రమేంటంటే.. గొడుగులు ఆడాళ్ల కోసం తయారుచేశారట. దానిని తొలిసారి వాడిన పురుషుడు ఇంగ్లండ్‌కు చెందిన జోనాస్ హాన్వే (1712-1786) అనే ఒక ట్రావెలర్, రచయిత. అప్పట్లో ఆయన రచయితగా కంటే గొడుగు వాడిన పురుషుడిగా ప్రపంచానికి ఎక్కువ ఫేమస్ అయ్యాడట. మొదటి గొడుగుల దుకాణం కూడా లండన్‌లోనే వెలిసింది. 1830 లో పుట్టిన ఈ దుకాణం ఇప్పటికీ ఉంది. (53, న్యూ ఆక్స్ఫర్డ్ వీధి, లండన్). 1852 వరకు గొడుగు హ్యాండ్ చెక్కదే. వీటిని ఆర్టిస్టిక్‌గా చేయడానికి ప్రత్యేకంగా ఉండేవారట. వారికి మంచి ఆదాయం కూడా ఉండేది. 1852లో శామ్యూల్ ఫాక్స్ తొలిసారి స్టీల్ రాడ్‌ను గొడుగులో వాడాడు. 1928లో హాన్స్ హాప్ట్ పాకెట్ గొడుగుల్ని తయారు చేశాడు. 1969లో అమెరికాకు చెందిన బ్రాడ్ఫోర్డ్ ఫిలిప్స్ గొడుగుల తయారీకి పేటెంట్ సంపాదించాడు. అక్కడి నుంచి మార్కెట్లో వివిధ రకాల గొడుగులు అందుబాటులోకి వచ్చాయి. మొదట్లో గొడుగులు పెద్దగా నలుపు రంగుల్లో ఉండేవి. తర్వాత వాటి సైజు తగ్గుతూ వచ్చింది. తర్వాత రకరకాల డిజైన్లలో ఆకర్షణీయంగా తయారయ్యాయి. కొసమెరుపు: అప్పటికీ ఇప్పటికీ గొడుగు రాచరికానికి చిహ్నమే. ఓ మనిషి చేత గొడుగు పట్టించుకోవడం అంటే ఆ ఠీవి వేరు! ఇప్పటికీ దర్శకులను సెట్స్‌లో గొడుగు లేకుండా ఎవరూహించుకుంటారు?