
ఎండ ధాటిని తట్టుకోవడానికైనా, వానలో తడవకుండా ఉండటానికైనా గొడుగు తప్పనిసరి అవసరం. చాలా దూరం నడవాల్సి వచ్చేటప్పుడు గొడుగును చేత్తో పట్టుకోవడం ఇబ్బందిగానే ఉంటుంది. ఒక్కోసారి గాలి జోరు పెరిగేటప్పుడు చేతిలోని గొడుగును నియంత్రించడం కాస్త కష్టంగా కూడా ఉంటుంది. ఇకపై అలాంటి ఇబ్బందులేవీ ఉండవు.
ఇది ఎగిరే గొడుగు. దీన్ని చేత్తో పట్టుకోవాల్సిన పనిలేదు. ఎక్కడకు వెళ్లినా మనల్నే అనుసరిస్తూ తల మీద నీడపడుతుంది. తలకు ఎండధాటి తాకనివ్వదు, వానకు తడవనివ్వదు. ఇది ఆషామాషీ గొడుగు కాదు, ‘ఫ్లైయింగ్ అంబ్రెల్లా డ్రోన్’. త్రీడీ ప్రింటింగ్ ద్వారా ముద్రించిన కార్బన్ ఫైబర్ గొట్టాలు తదితర విడిభాగాలతో దీనిని రూపొందించారు.
కాబట్టి ఇది చాలా తేలికగా ఉంటుంది. వాయిస్ కంట్రోల్ ద్వారా జీపీఎస్ టెక్నాలజీతో బయటకు వెళ్లినప్పుడల్లా ఇది నిరంతరం తలకు నీడ పడుతూ ఉంటుంది. యూరోపియన్ సాఫ్ట్‌వేర్ కాన్ఫరెన్స్ ‘ఐ బిల్డ్ స్టఫ్’కు చెందిన నిపుణులు ఈ ఎగిరే గొడుగును ప్రయోగాత్మకంగా రూపొందించారు.
Comments
Please login to add a commentAdd a comment