ఐవోటెక్ వరల్డ్, ఇఫ్కో భాగస్వామ్య ప్రయోజనం
న్యూఢిల్లీ: డ్రోన్ టెక్నాలజీ కంపెనీ ఐవోటెక్ వరల్డ్ ఏవిగేషన్, రైతుల కోపరేటివ్ సొసైటీ ఇఫ్కో మధ్య భాగస్వామ్యం.. సాగు ఉత్పాదకత పెంపునకు తోడ్పినట్టు ఈ సంస్థలు ప్రకటించాయి. 2023 డిసెంబర్‌లో ఈ సంస్థలు భాగస్వామ్యం కుదుర్చుకున్నాయి. ఇందులో భాగంగా 500 డ్రోన్లను రైతులకు సమకూర్చాయి. సాగులో అత్యాధునిక టెక్నాలజీతో కూడిన డ్రోన్ల సాయాన్ని అందించాయి. ఇది 11 రాష్ట్రాల పరిధిలో 500 రైతులపై సానుకూల ప్రభావం చూపించినట్టు ఈ సంస్థలు వెల్లడించాయి.
అగ్రిబోట్ డ్రోన్ కస్టమర్లకు ఈ సంస్థలు ఇటీవలే ప్రత్యేక పరిమిత కాల ఆఫర్‌ను కూడా ప్రకటించాయి. దీని కింద రైతులకు ఎలాంటి గరిష్ట విస్తీర్ణం పరిమితి లేకుండా ఇఫ్కో డ్రోన్లను అందిస్తుంది. పంటల నిర్వహణ, సామర్థ్యాలను పెంచడం దీని ఉద్దేశ్యమని ఇవి తెలిపాయి. ఒక డ్రోన్ ఆరు ఎకరాలకు ఒక గంటలో స్ప్రే చేసే సామర్థ్యంతో ఉంటుందని, ఒకటికి మించిన బ్యాటరీ సెట్‌తో ఒక రోజులో ఒక డ్రోన్‌తో 25 ఎకరాలకు స్ప్రే చేయొచ్చని తెలిపాయి.
Comments
Please login to add a commentAdd a comment