బొంగుతో డ్రోన్‌.. ఇదో కొత్తరకం | Bengaluru Based Mechanical Engineer Made Bamboo Drone With Just Rs 1000, See More Details | Sakshi
Sakshi News home page

Bamboo Drone In Bengaluru: బొంగుతో డ్రోన్‌.. ఇదో కొత్తరకం

Published Sun, Oct 20 2024 10:25 AM | Last Updated on Sun, Oct 20 2024 11:59 AM

Bamboo Drone in Bengaluru

బొంగులో చికెన్‌ గురించి తెలుసు గాని, ఈ బొంగుతో డ్రోన్‌ ఏంటనుకుంటున్నారా? ఈ ఫొటోలో కనిపిస్తున్నది బొంగుతో తయారైన డ్రోన్‌. సాధారణంగా యంత్రాల తయారీకి లోహాలను వాడతారు. బెంగళూరుకు చెందిన మెకానికల్‌ ఇంజినీర్, ప్రోడక్ట్‌ డిజైనర్‌ దీపక్‌ దధీచ్‌ అందరికంటే కొంచెం భిన్నంగా ఆలోచించే రకం.

సుస్థిరమైన పదార్థాలతో రోబోటిక్‌ యంత్రాలను తయారు చేయవచ్చనే ఆలోచనతో అతడు అచ్చంగా వెదురు బొంగులతో ఈ డ్రోన్‌ను రూపొందించాడు. స్క్రూలు, నట్లు వంటివి తప్ప ఈ డ్రోన్‌లోని మిగిలిన భాగాలన్నింటినీ చీల్చిన వెదురు బొంగులతో తయారు చేశాడు.

ఎలక్ట్రానిక్స్, రోబోటిక్స్‌ వస్తువుల తయారీకి ప్రపంచంలో ఇప్పటి వరకు ఎవరూ కలపను ప్రధాన పదార్థంగా వినియోగించలేదు. వెదురుబొంగులతో పూర్తిగా పనిచేసే డ్రోన్‌ను తయారు చేసిన ఘనత దీపక్‌ దధీచ్‌కే దక్కుతుంది. దీని తయారీకి అతడికి వెయ్యి రూపాయల లోపే ఖర్చు కావడం విశేషం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement