మొదటిసారి మెషిన్స్‌ మధ్య యుద్ధం: వీడియో వైరల్ | Robot Dog Vs Drone Fight Using Fireworks In China Video | Sakshi
Sakshi News home page

మొదటిసారి మెషిన్స్‌ మధ్య యుద్ధం: వీడియో వైరల్

Published Thu, Jan 30 2025 4:39 PM | Last Updated on Thu, Jan 30 2025 5:33 PM

Robot Dog Vs Drone Fight Using Fireworks In China Video

ఏఐ రోబోట్స్ వచ్చిన తరువాత.. టెక్నాలజీలో కీలక మార్పులు సంభవించాయి. ప్రస్తుతం చాలా రంగాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) హవా సాగుతోంది. అదే సమయంలో డ్రోన్ల వినియోగం కూడా విరివిగానే ఉంది. వీటిని వ్యవసాయ, వాణిజ్య మొదలైన రంగాల్లో ఉపయోగిస్తున్నాయి. ఇటీవల ఈ రెండింటి (డ్రోన్, ఏఐ రోబోట్) మధ్య ఓ చిన్న యుద్ధం జరిగింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీని గురించి మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో గమనిస్తే.. ఒక రోబోట్ డాగ్ (Robotic Dog), ఎగురుతున్న డ్రోన్ (Drone) మీద దాడి చేయడం చూడవచ్చు. రోబోట్ డాగ్ మీద అమర్చిన బాణాసంచాతో దాడి చేస్తూనే ఉంది. ఆ సమయంలో డ్రోన్ కూడా రోబోటిక్ కుక్కను చుట్టుముట్టింది. కానీ అది మాత్రం డ్రోన్ ఎటువైపు వెళ్తే.. అటువైపు బాణ పరంపర కురిపించింది.

రోబోటిక్ కుక్కను, డ్రోన్‌ను ఎవరైనా ఆపరేట్ చేస్తున్నారా? లేదా అనే విషయం తెలియాల్సి ఉంది. ఇక్కడ కనిపించే డ్రోన్ డీజేఐ టీ-సిరీస్ అగ్రికల్చర్ మోడల్, రోబోటిక్ డాగ్ హాంగ్‌జౌకు చెందిన రోబో డెవలపర్ యూనిట్రీ రోబోటిక్స్ ఉత్పత్తి చేసిన గో సిరీస్‌ అని తెలుస్తోంది. మెషీన్స్ మధ్య మొదటిసారి జరిగిన యుద్ధం అంటూ ఒక ఎక్స్ యూజర్ వీడియో షేర్ చేశారు.

ఇదీ చదవండి: లవ్‌లో బ్రేకప్ అయినవాళ్లకే జాబ్.. ప్రముఖ కంపెనీ ఆఫర్

నెట్టింట్లో వైరల్ అవుతున్న ఈ వీడియోపై నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు. భవిష్యత్తులో యుద్దాలు ఇలాగే ఉంటాయని ఒకరు అన్నారు. ఇలాంటి సంఘటనలు భయాన్ని కలిగిస్తాయని మరొకరు, చాలా దేశాల్లో ఇలాంటి టెక్నాలజీలు వాడుకలో ఉన్నాయని ఇంకొకరు అన్నారు. అయితే వీడియోలో కనిపించే ఈ సంఘటన చైనాలో జరిగినట్లు సమాచారం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement