robotic
-
ప్రపంచంలోనే తొలి తల మార్పిడి..! ఏకంగా హాలీవుడ్ మూవీని తలపించేలా..!
ఇంతవరకు అవయవ మార్పిడులకు సంబంధించి..గుండె, కళ్లు, చేతులు, కిడ్నీ వంటి ట్రాన్స్ప్లాంటేషన్లు గురించి విన్నాం. ఇటీవల జంతువుల అయవాలను మనుషులకు మార్పిడి చేస్తున్న ప్రయత్నాల గురించి కూడా చూశాం. అవి విజయవంతం కాకపోయినా..అవయవాల కొరతను నివారించే దృష్ట్యా వైద్యులు సాగిస్తున్న ప్రయాత్నాలే అవి. ఐతే తాజాగా ఓ మెడికల్ స్టార్టప్ కంపెనీ తొలిసారిగా తల మార్పిడి శస్త్ర చికిత్సను అభివృద్ధిపరిచే లక్ష్యాన్ని చేపట్టింది. ఇది సఫలం అయితే చికిత్సే లేని వ్యాధులతో పోరాడుతున్న రోగుల్లో కొత్త ఆశను అందించగలుగుతాం. ఇంతకీ ఏంటా వైద్య విధానం అంటే..యూఎస్‌లోని బ్రెయిన్‌బ్రిడ్జ్, న్యూరోసైన్స్, బయో మెడికల్ ఇంజనీరింగ్ స్టార్టప్ ప్రపంచంలోనే తొలిసారిగా తల మార్పిడి వ్యవస్థను అభివృద్ధి చేసే లక్ష్యాన్ని చేపడుతున్నట్లు ప్రకటించింది. ఐతే ఈ కంపెనీ ఇంతవరకు రహస్యంగా ఈ ప్రయోగాలు చేస్తూ వచ్చింది. కానీ ఇప్పుడూ ప్రపంచం తాము చేస్తున్న ఈ సరికొత్త వైద్య గురించి మరింతగా తెలుసుకోవాలన్న ఉద్దేశ్యంతో బహిర్గతం చేసింది. ముఖ్యంగా చికిత్స చేయలేని స్థితిలో.. స్టేజ్ 4లో ఉన్న కేన్సర్, పక్షవాతం, అల్జీమర్స్ , పార్కిన్సన్స్ వంటి న్యూరోడెజనరేటివ్ వ్యాధులతో బాధపడుతున్న రోగుల్లో కొత్త ఆశను అందించడమే లక్ష్యంగా ఈ ప్రయోగానికి నాంది పలికినట్లు బ్రెయిన్ బ్రిడ్జ్ స్టార్టప్ పేర్కొంది. చిత్త వైకల్యంతో బాధపడుతున్న రోగి తలను ఆరోగ్యకరమైన బ్రెయిన్‌డెడ్ డోనర్ బాడీతో మార్పిడి చేయడం వంటివి ఈ సరికొత్త వైద్య విధాన ప్రక్రియలో ఉంటుంది. అందుకు సంబందించిన ఓ వీడియో సోషల్ మీడియాలో సంచలనం రేకెత్తించింది.ఈ వీడియోలో రెండు రోబోటిక్ బాడీలపై ఏకకాలంలో శస్త్ర చికిత్స చేస్తున్న రెండు స్వయం ప్రతిపత్త రోబోలు కనిపిస్తాయి. ఇక్కడ ఒకరి నుంచి తలను తీసి మరో రోబోటిక్ శరీరంలోకి మార్పిడి చేస్తారు. ఇది చూడటానికి హాలీవుడ్ రేంజ్ సన్నివేశంలా అనిపిస్తుంది. ఇలాంటి అత్యధునిక శస్త్రచికిత్సపైనే న్యూరబుల్, ఎమోటివ్, కెర్నల్ అండ్ నెక్ట్స్ మైండ్, బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్ ఫేస్ వంటి కంపెనీలు కూడా వర్క్ చేస్తున్నాయి. ఈ క్రమంలో బ్రెయిన్బ్రిడ్జ్లోని ప్రాజెక్ట్ లీడ్ హషేమ్ అల్-ఘైలీ మాట్లాడుతూ..తాము మెదడు కణాల క్షీణతను నివారించేలా అతుకులు లేకుండా తల మార్పిడి చేసేందుకు హైస్పీడ్ రోబోటిక్ సిస్టమ్‌ను వినియోగించేలా ప్లాన్ చేస్తున్నట్లు తెలిపారు. ఇందులో ఉన్న అధునాతన ఏఐ అల్గారిథమ్‌లు శస్త్ర చికిత్సలో నరాలు, రక్తనాళాల తోపాటు వెన్నుపాముని కచ్చితంగా తిరిగి కనెక్ట్ చేయడంలో రోబోలకు మార్గనిర్దేశం చేస్తాయని అల్ ఘైలీ చెప్పారు. తాము ఈ కాన్సెప్ట్‌ని విస్తృతమైన శాస్త్రీయ పరిశోధనల ఆధారంగా రూపొందించమని తెలిపారు.ఇది వైద్య సరిహద్దులను చెరిపేసేలా.. ప్రాణాంతక పరిస్థితులతో పోరాడుతున్న వారికి ప్రాణాలను రక్షించేలా వినూత్న పరిష్కారాలను అందిచగలదని చెప్పారు. 🤖 BrainBridge, the first head transplant system, uses robotics and AI for head and face transplants, offering hope to those with severe conditions like stage-4 cancer and neurodegenerative diseases… pic.twitter.com/7qBYtdlVOo— Tansu Yegen (@TansuYegen) May 21, 2024 (చదవండి: వడదెబ్బకు గురైన నటుడు షారూఖ్! దీని బారిన పడకూడదంటే..!) -
రోబోటిక్ ఎయిర్ కండీషనర్.. అదెలా పనిచేస్తుందంటే?
ఇళ్లల్లోను, ఆఫీసుల్లోను ఎయిర్ కండిషనర్లను అమర్చుకోవడం చాలా కష్టమైన పని. ఇవి భారీగా ఉండటం ఒక కారణమైతే, ఒకసారి ఒకచోట అమర్చుకున్న ఎయిర్ కండిషనర్ను మరో చోటుకు తరలించడం వీటిలో ఎదురయ్యే మరో సమస్య. సాధారణ ఎయిర్ కండిషనర్లతో ఎదురయ్యే సమస్యలకు పరిష్కారంగా ఇటాలియన్ డిజైనర్ మిరే ఓజ్లెమ్ ఈఆర్ ఇటీవల ఈ రోబో ఎయిర్ కండిషనర్కు రూపకల్పన చేసింది. గోళాకారంలో తయారు చేసిన ఈ రోబో ఏసీ చాలా తేలికగా ఉంటుంది. ఇందులోని థెర్మల్ కెమెరా గది వాతావరణంలోని ఉష్ణోగ్రతను గుర్తించి, ఆటోమేటిక్‌గా పనిచేస్తుంది. అలాగే ఇందులో కోరుకున్న రీతిలో ఉష్ణోగ్రతను మార్చుకోవడానికి కూడా వీలుంటుంది. దీని డిస్ప్లే స్క్రీన్ మీద ఉష్ణోగ్రత కనిపిస్తుంది. దీని అడుగున ఉన్న చక్రాల స్టాండ్ ఎత్తును కావలసిన రీతిలో పెంచుకోవచ్చు లేదా తగ్గించుకోవచ్చు. దీనిలో కోరుకున్న పరిమళాలను నింపుకుంటే, వాటిని నిదానంగా వెదజల్లే డిఫ్యూజర్ కూడా ఉండటం విశేషం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో రూపొందించిన ఈ రోబో ఏసీ గది అంతా కలియదిరుగుతూ క్షణాల్లోనే వాతావరణాన్ని చల్లబరుస్తుంది. ఇది ఇంకా మార్కెట్లోకి విడుదల కావాల్సి ఉంది. -
రోబొటిక్ పెట్ని ఆవిష్కరించిన 12 ఏళ్ల చిన్నారి!
ఆరవ తరగతి చదువుతున్న చిన్నారి ఒంటరితనాన్ని అధిగమించేందుకు పెంపుడు జంతువును దత్తత తీసుకోలేని వారికి ప్రత్యామ్నాయంగా రోబోటిక్ పెట్‌ను ఆవిష్కరించి అందర్నీ అబ్బురపరిచింది. ప్రతి ఏడాది 6 లక్షల పెంపుడు జంతువులను దేశ వ్యాప్తంగా దత్తత తీసుకుంటున్నారు. అయితే చాలా మందికి ఆర్థిక స్థోమత ఉంది. కానీ పెంపుడు జంతువును దత్తత తీసుకుని నిర్వహించడం చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. పైగా ఇది అందరికీ అది సాధ్యపడక పోవచ్చు. అలాంటి వారికి 12 ఏళ్ల చిన్నారి విద్యార్థి నేత్ర సింగ్ అభివృద్ధి చేసిన ఈ రోబోటిక్ పెట్ చక్కగా ఉపకరిస్తుంది. ఈ మేరకు బోవెన్పల్లిలోని సెయింట్ పీటర్స్ హైస్కూల్లో ఆరో తరగతి చదువుతున్న నేత్ర సింగ్ పెంపుడు జంతువులకు ప్రత్యామ్నాయంగా వినూత్న ఆలోచనతో ముందుకు వచ్చి మరీ ఈ రోబోటిక్ పెట్ని అభివృద్ధి చేసింది. ఈ ఆవిష్కరణని తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది, అతిథులు, సహచరులతో సహా వెయ్యి మందితో కూడిన టెడ్ సమావేశంలో ప్రదర్శించడమే దీని ఉపయోగాలు గురించి మాట్లాడింది నేత్ర. రోబోటిక్ పెంపుడు జంతువులు ఒంటరితనాన్ని నయం చేయడంలో సహాయపడటమేగాక మానసిక ఆనందాన్నిస్తాయని చెప్పింది. ఆ సమావేశంలో నేత్ర మాట్లాడుతూ..ముఖ్యంగా కోవిడ్ తర్వాత పెంపుడు జంతువుల దత్తత పెరిగింది. అదీగాక పెంపుడు జంతువుల నిర్వహణ ఖర్చు కూడా గణనీయంగా పెరిగింది. ఈ పెంపుడు జంతువులు డెలివరీ బాయ్‌లను భయపెట్టడంతో చనిపోయిన ఘటనలను కూడా చేశాం. ఇంకోవైపు వీధికుక్కలు పసిపిల్లలపై దాడి చేసి చంపిన ఘటనలను కూడా రోజుకి ఒకటి వార్తాపత్రికల్లో వస్తూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో, నేత్ర సింగ్ చెబుతున్న రోబోటిక్ పెట్ ఆలోచనను అందర్నీ ప్రేరేపించింది. తన పాఠశాల నిర్వహించిన బోవెన్పల్లిలోని దాని ప్రాంగణంలో 'స్టార్స్ ఆఫ్ ఇన్స్పిరేషన్--యాన్ ఈవినింగ్ అండర్ ది ఓపెన్ స్కై' అనే ప్రత్యేకమైన ప్రోగ్రామ్‌లో టెడ్(TED)లాంటి చర్చలో భాగంగా నేత్ర తన ఆలోచన పంచుకుంది. ఈ ఆలోచనకు గానూ ఆమెకు అందరి నుంచి ప్రశంసలు అందాయి. "నేను ఇప్పటికీ దానిపై పని చేస్తున్నాను. ప్రస్తుతానికి, ఇది నా ఆలోచన. నేను దీన్ని వాణిజ్య ఉత్పత్తిగా మార్చడానికి ప్రొఫెషనల్ మెంటరింగ్ని కోరుకుంటున్నానని ధీమాగా చెప్పుకొచ్చింది" విద్యార్థి నేత్ర. ఆమె పాఠశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె సువర్ణ నేత్ర ఆలోచనలు తోపాటు పాఠశాలలోని మరో 50 మంది విద్యార్థుల ఆలోచనల విన సంతోషం వ్యక్తం చేశారు. ప్రోడక్ట్ డెవలప్మెంట్ ఇంకా ప్రారంభ దశలోనే ఉన్నప్పటికీ, రోబోటిక్ పెట్ అనేది ఒక వినూత్న ఆలోచన అని డాక్టర్ కె. సువర్ణ చెప్పారు. ఈ చర్చలో 50కిపైగా విద్యార్థులు తమ కొత్త ఆలోచనలు, దృక్కోణాలను పంచుకున్నారు. విద్యార్థులు మెరుగైన పనితీరు రెండు నిమిషాల నిడివి గల సందేశాలు, రీల్స్, షార్ట్‌లు, వాట్సాప్ స్టేటస్ వీడియోల రూపంలో కనబర్చేలా టెడ్ (TED) లాంటి షార్ట్ టాక్లతో ముందుకు వచ్చింది సెయింట్ పీటర్స్ హైస్కూల్. పాఠశాలకు చెందిన వరేణ్య, ప్రీతమ్, శామ్యూల్‌లతో కూడిన ముగ్గురు సభ్యుల బృందాలు ఫైర్ అండ్ గ్యాస్ లీకేజ్ ఫిక్టర్ రోబోట్‌ను సమర్పించాయి. ఇది CBSE రీజనల్ సైన్స్ ఎగ్జిబిషన్లో ఎంపికైంది. జనవరి 2024లో న్యూఢిల్లీలో జరిగే జాతీయ ప్రదర్శనలో పాల్గొంటుంది. నమోదు చేసుకున్న 3169 విద్యార్థి జట్లలో ఎంపిక చేసిన 30 ప్రదర్శనలలో సెయింట్ పీటర్స్ జట్టు ఒకటి. టెడ్ (TED) లాంటి చర్చలు పంచుకోవడానికి విలువైన ఆలోచనల కోసం పాఠశాల స్థాయి వేదిక. ఇది కూడా కేవలం ఎలివేటర్ ప్రయాణ సమయంలో ఐడియాను పంచుకుని, ప్రభావితం చేయగలిగే విధంగా, ప్రజల దృష్టిని ఆకర్షించే ప్రయత్నం. 1979లో ప్రారంభమైన ఈ పాఠశాల 24 ఏళ్లు పూర్తి చేసుకోవడంతో లోగొను ఆవిష్కరించి సిల్వర్ జూబ్లీ సంవత్సరాన్ని జరుపుకోనుంది. (చదవండి: మురికి వాడ నుంచి రూ. 900 కోట్ల సామ్రాజ్యానికి యజమానిగా! రియల్ స్లమ్ డాగ్ మిలియనీర్!) -
‘రోబో గోడ’: బండరాళ్లను ఎత్తి, క్రమపద్ధతిలో పేరుస్తూ..
‘ఇల్లు కట్టి చూడు.. పెళ్లి చేసి చూడు’ అని అంటుంటారు. పూర్వకాలంలో ఈ రెండు పనులూ ఎంతో శ్రమ, ఖర్చుతో కూడినవి కావడంతో అలా అనేవారు. అయితే ఇప్పుడు ఈ రెండు పనులు రోబోలు అత్యంత సులభంగా చేసేస్తున్నాయి. పాశ్చాత్య దేశాల్లో కొందరు.. రోబోలను వివాహం చేసుకుంటున్నారనే వార్తలు వింటున్నాం. కొత్తగా ఇప్పుడు ఇళ్లను రోబోలే స్వయంగా కట్టేస్తున్నాయి. అది కూడా అత్యంత ధృఢంగా.. పురాతన పద్ధతిలో.. ఆధునికత మేళవిస్తూ.. మరి అదెలాగో ఇప్పుడు చూద్దాం.. సాధారణంగా ఇంటి నిర్మాణంలో బండరాళ్లను ఒక పద్ధతిలో పేర్చడం అనేది ఎంతో శ్రమతో కూడిన పని. ఇందుకోసం శారీరకంగానే కాదు..మానసికంగానూ కష్టపడి పనిచేయాల్సి వస్తుంది. అయితే ఇప్పుడు కొత్తగా వచ్చిన ఈ రోబో ఈ పనిని చిటికెలో చేసేస్తోంది. ఇంటికి అవసరమయ్యే గోడ నిర్మాణాలను చేపట్టే ఈ రోబోట్ పేరు ‘హీప్’(హెచీఈఏపీ) ఇదొక హైడ్రాలిక్ ఎక్స్కవేటర్. ఇది వాకింగ్ ఎక్స్కవేటర్ కూడా. దీనిని ఈటీహెచ్ జ్యూరిచ్ పరిశోధనా సంస్థ బృందం తయారుచేసింది. ఈ రోబోలో గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్, ఇనర్షియల్ మెజర్మెంట్ యూనిట్, కంట్రోల్ మాడ్యూల్, తవ్వకాల ఆర్మ్‌పై లిడార్ సెన్సార్లు ఉన్నాయి. ఈ రోబో తాను చేపడుతున్న తాజా ప్రాజెక్ట్ కోసం నిర్మాణ స్థలాన్ని స్కాన్ చేసి, దాని త్రీడీ మ్యాప్‌ను రూపొందించడం ద్వారా పనిని ప్రారంభించింది. తరువాత ఆ సైట్లో డంప్ చేసిన బండరాళ్లను గోడలో ఎక్కడ ఉంచాలనేది రికార్డ్ చేసింది. అనంతరం ‘హీప్’ ప్రతి బండరాయిని భూమి నుండి పైకి లేపింది. ఇందుకోసం దాని బరువు, గురుత్వాకర్షణ కేంద్రాన్ని అంచనా వేయడానికి, దాని ప్రత్యేక ఆకారాన్ని రికార్డ్ చేయడానికి సాంకేతికతను ఉపయోగించింది. ఒక అల్గారిథమ్ రూపకల్పన అనంతరం 20 అడుగుల ఎత్తు, 65 మీటర్ల పొడవైన రాతి గోడను నిర్మించడానికి ప్రతి బండరాయిని అది చక్కగా ఇమిడిపోయే ప్లేస్‌లో అమర్చింది. ఒక్కో బిల్డింగ్ సెషన్‌కు దాదాపు 20 నుండి 30 బండరాళ్లను వాటి స్థానాల్లో ఉంచింది. పరిశోధకుల అభిప్రాయం ప్రకారం ఈ నూతన రోబో వ్యవస్థ.. నిర్మాణ రంగాన్ని మరింత సులభతరం చేస్తుంది. బండరాళ్లను తీసుకురావడం మొదలుకొని, వాటితో సరైన గోడను నిర్మించేవరకూ ‘హీప్’ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ రోబో అధ్యయనానికి సంబంధించిన పత్రం ఇటీవల సైన్స్ రోబోటిక్స్ జర్నల్‌లో ప్రచురితమైంది. ఈటీహెచ్ జ్యూరిచ్ అందించిన ఈ వీడియోలో ‘హీప్’ గోడ నిర్మాణాన్ని చూడవచ్చు. ఇది కూడా చదవండి: కోపాన్ని పెంచేస్తున్న కాలుష్యం.. -
AI అద్భుతం.. గంటలో 120 కప్పుల కాఫీని చేస్తుంది!
జీఐటెక్ట్స్ 2023 (GITEX 2023) పేరుతో ప్రపంచంలో అతిపెద్ద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్ ఈవెంట్ దుబాయ్‌లో అంగరంగ వైభవంగా జరిగింది. దుబాయ్ వరల్డ్ ట్రేడ్ సెంటర్ వేదికగా అక్టోబర్ 16 నుంచి 20వ తేదీ వరకు జరిగిన ఈ ఈవెంట్‌కి 170 దేశాల నుండి 6,000 కంపెనీలు పాల్గొన్నాయి. ఈ సందర్భంగా ఆయా సంస్థలు తయారు చేసిన రోబోటిక్స్‌ను ప్రదర్శించాయి. ఆయా రోబోట్లు ఏయే రంగాల్లో నిష్ణాతులో తెలుపుతూ నిర్వాహకులు వివరించారు. వాటిల్లో చైనాకు సంస్థ డీప్ రోబోటిక్స్ ఎక్స్20,ఎక్స్30 పేరుతో రోబోట్ డాగ్స్‌ని జీఐటీఈఎక్స్లో ప్రదర్శించింది. వీటితో మ్యానిఫ్యాక్చరింగ్ సంస్థల్లో కరెంట్(పవర్) పనిచేసే మనుషులు స్థానాన్ని వీటితో భర్తీ చేస్తాయి. దీంతో పాటు ఏదైనా అగ్ని ప్రమాదాలు, బిల్డింగ్లు కుప్పకూలిపోయినప్పుడు జరిగే ధన, ప్రాణ నష్టాన్ని పూర్తిగా తగ్గిస్తాయి. అంతేకాదు ప్రమాదాలు జరిగినప్పుడు బాధితుల్ని, లేదంటే ఇతర ఆస్తులు నష్టపోకుండా కాపాడుతుంది. ♦భూగర్భంలోని భారీ సొరంగాల్లా నిర్మించే కేబుల్స్ టన్నెల్స్‌లో తలెత్తి సాంకేతిక సమస్యల్ని గుర్తించి వెంటనే వాటిని పరిష్కరిస్తుంది. ♦మెటల్ మైనింగ్, భవన నిర్మాణాలు, ప్రాజెక్ట్ రిసెర్చ్ పరిశోధనల్లో కీలక పాత్ర పోషించేలా డిజైన్ చేసింది డీప్ రోబోటిక్స్. స్విర్జర్లాండ్‌కు చెందిన స్విస్ మైల్ కంపెనీ 5ఏళ్ల పాటు రీసెర్చ్ చేసి స్విస్ మైల్ అనే రోబోట్‌ను తయారు చేసింది. ఆ రోబోట్ డెలివరీ సవాళ్లు, లాజిస్టిక్ కార్యకాలపాల్లో వేగం, రైలు ప్రమాదాలు జరిగిన సమయంలో ట్రాఫిక్ సమస్యల్ని సత్వర పరిష్కారం చూపిస్తుంది. ఇక రెండు కాళ్లు, రెండు చక్రాలతో ఉండే రోబోట్ ప్రయాణాని అసౌకర్యంగా ఉండే ప్రాంతాలకు సులభం చేరుకుంటుంది. కస్టమర్ల అవసరాల్ని తీరుస్తుంది. నావిగేషన్‌ను ఎనేబుల్ చేస్తూ శక్తి సామర్థ్యం ,వేగంతో ఫుడ్ డెలివరీ,వస్తువుల్ని డెలివరీ చేయడం దీని ప్రత్యేకత ♦ఇదే ఈవెంట్లో కమ్యూనికేషన్ కంపెనీ ఇ ఎంటర్ప్రైజ్ తయారు చేసిన అమీనా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అమీనా హ్యూమనాయిడ్ రోబో సందర్శకులను అలరించింది ♦ఎడ్డీ సలాడ్ గ్రూప్ ప్రోస్పెరిటీ 1 ఎయిర్ క్యాబ్‌ను ప్రదర్శించింది. ఇది కార్గో, ప్యాసింజర్ రవాణాకు ఉపయోగపడుతుంది. పూర్తి ఎలక్ట్రిక్ అటానమస్ వాహనం. ♦జీఐటీఈఎక్స్ 2023లో ప్రదర్శనలో అడ్వర్టైజింగ్ రోబోలు, నీటిలో సైతం నడిచే జేమ్స్ బాండ్ లాంటి తరహా కార్లు కూడా ఉన్నాయి. ♦ప్రొడక్టీవ్ ఏఐ ద్వారా తయారు చేసిన డిజిటల్ అవతార్లు హాస్పిటాలిటీ, టీవీ ప్రసారాలలో ఉపయోగించుకోవచ్చు. ♦అత్యంత వేగంగా నడిచే రోబోట్ ఆర్టిమస్. దీనితో సాకర్ ప్లేయర్ల స్థానాన్ని భర్తీ చేయొచ్చు. ♦ఆఫ్రికాలో అభివృద్ధి చేసిన ఓమి లైన్ హ్యూమనాయిడ్ రోబోలు ఎనిమిది భాషల్లో మాట్లాడుతుంది. ♦రోబోట్ బస్సుగా పరిగణించే అటానమస్ క్యాప్సూల్. ఇది భవిష్యత్‌లో రవాణా అవసరాల్ని తీర్చుతుంది. డ్రైవింగ్ చేయాలంటే మనుషుల అవసరం ఉండదు. ♦కేఫ్ ఎక్స్ అనే రోబోటిక్ కస్టమర్లకు కావాల్సిన ఫ్లేవర్స్‌లలో గంటకు 120 కప్పుల కాఫీని తయారు చేసి ఇస్తుంది. -
గైనిక్ సర్జరీల్లోనూ రోబోలు
సాక్షి, హైదరాబాద్: వైద్య రంగంలో అందుబాటులోకి వచ్చిన ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రొబోటిక్ సర్జరీలు హైదరాబాద్‌లోనూ విస్తృతంగా అందుబాటులోకి వచ్చాయి. పేరొందిన దాదాపు ప్రతి ఆసుపత్రీ ఈ శస్త్రచికిత్సా విధానాన్ని ఉపయోగిస్తోంది. చికిత్సా వ్యయం ఎక్కువైనప్పటికీ ఎక్కువ మంది రోగులకు నప్పే అనేక ప్రయోజనాల వల్ల రానురానూ రొబోటిక్ సర్జరీల ఎంపిక కూడా పెరుగుతోంది. విభిన్న రకాల శస్త్రచికిత్సల్లో దోహదపడుతున్న రొబోటిక్ సర్జరీ గైనకాలజీ విభాగంలోనూ ఇప్పుడిప్పుడే వేగం పుంజుకుంటోంది. ఈ నేపథ్యంలో గైనకాలజీ శస్త్రచికిత్సల్లో రోబోల వాడకం వల్ల కలిగే ప్రయోజనాల గురించి అపోలో ఆసుపత్రికి చెందిన కన్సెల్టెంట్ అబ్స్ట్రిటిషియన్ అండ్ గైనకాలజిస్ట్ డాక్టర్ అనురాధా పాండా మరిన్ని వివరాలు తెలియజేశారు. అవి ఏమిటంటే... మరింత కచ్చితత్వం... ‘‘గైనకాలజీలో రోబో అసిస్టెడ్ కీహోల్ సర్జరీని కొత్త ఆవిష్కరణగా చెప్పొచ్చు. సాధారణ లేపరోస్కోపిక్ సర్జరీలతో పోలిస్తే రోబో సాయంతో చేసే సర్జరీల్లో త్రీడీ విజన్ (త్రిమితీయ ఆకారం) ఎక్కువ కచ్చితత్వాన్ని అందిస్తుంది. శస్త్ర చికిత్సలకు ఉపయోగించే పరికరాలను 360 డిగ్రీల కోణంలో తిప్పడానికి వీలుండటం వల్ల శరీరంలో సంక్లిష్టమైన ప్రదేశాలను సైతం చేరుకోవచ్చు. ఈ శస్త్రచికిత్సా విధానంలో తక్కువ రక్త నష్టంతోపాటు నొప్పి, ఇన్ఫెక్షన్ ముప్పు కూడా తక్కువగా ఉంటుంది. తద్వారా రోగులు ఆసుపత్రిలో ఉండాల్సిన వ్యవధి కూడా తగ్గుతుంది. ఈ శస్త్రచికిత్సల్లో సర్జన్ ఒక కంప్యూటర్ కన్సోల్ నుంచి పనిచేస్తారు. తన చేతి కదలికలతో రొబోటిక్ చేతులను కదిలిస్తూ ఆపరేషన్ నిర్వహిస్తారు. ‘‘క్లిష్టమైన హిస్టెరెక్టమీ (గర్భాశయం తొలగింపు) ఆపరేషన్లకు రోబో సాయాన్ని ఉపయోగించవచ్చు. ప్రత్యేకించి ఊబకాయంతో ఉన్న రోగి పొత్తికడుపుపై పలు శస్త్రచికిత్సలు నిర్వహించాల్సి వచ్చినప్పుడు ఈ విధానాన్ని ఉపయోగిస్తారు. కచ్చితత్వం, తక్కువ నొప్పితోపాటు చిన్న కోతల ద్వారానే శస్త్రచికిత్స చేయడానికి ఈ విధానం వీలు కల్పిస్తుంది’’అని డాక్టర్ అనురాధా పాండా వివరించారు. గైనిక్ రొబోటిక్ సర్జరీలతో ప్రయోజనాలు... మయోమెక్టమీ అనేది గర్భాశయ కండరాల గోడ (ఫైబ్రాయిడ్) నుంచి నిరపాయకరమైన కణుతులను తొలగించడానికి ఉపయోగించే ఒక ప్రక్రియ. రొబోటిక్ సర్జరీ ఫైబ్రాయిడ్ కుట్టు తొలగింపునకు కూడా వీలు కల్పిస్తుంది. ఎండోమెట్రియోసిస్ అనేది గర్భాశయం వెలుపల గర్భాశయ లైనింగ్ వంటి కణజాలాలు పెరిగే పరిస్థితి. ఈ కణజాలాలు హార్మోన్లకు ప్రతిస్పందిస్తాయి. పీరియడ్స్ సమయంలో రక్తస్రావం, నొప్పి ఉంటుంది. ఎండోమెట్రియోసిస్ శస్త్రచికిత్స ఒక సవాలు వంటిది. దీనికోసం పెల్విస్, పెల్విక్ సైడ్ వాల్స్‌లో లోతుగా పనిచేయాల్సిన అవసరం ఉంటుంది. రోబో అసిస్టెడ్ ఎండోమెట్రియోసిస్ శస్త్రచికిత్స ద్వారా మరింత కచ్చితమైన రీతిలో అండాశయ తిత్తిని తొలగించడం సాధ్యపడుతుంది. పేగు, మూత్రాశయం, మూత్ర నాళానికి అతుక్కొని ఉండే డీప్ ఇన్ఫిల్ట్రేటింగ్ ఎండోమెట్రియోసిస్ వ్యాధి చికిత్సలోనూ రొబోటిక్ సర్జరీ తక్కువ సంక్లిష్టతతో కూడుకుంటున్నదని పలు అధ్యయనాలు తెలిపాయి. హిస్టెరెక్టమీ సర్జరీ తర్వాత కొందరిలో తలెత్తే వాల్ట్ ప్రోలాప్స్ అనే పరిస్థితిని సరిదిద్దడంలోనూ రొబోటిక్ సర్జరీ ఉపకరిస్తుంది. ఊబకాయ రోగుల్లో శస్త్రచికిత్సలకు లేపరోస్కోపీతో పోలిస్తే రోబోటిక్ సర్జరీ వారి అనారోగ్యాన్ని, ఆసుపత్రిలో ఉండే వ్యవధిని తగ్గిస్తుంది. లేపరోస్కోపీతో పోల్చినప్పుడు రొబోటిక్ శస్త్రచికిత్స ఎక్కువ ఖర్చుతో కూడుకున్నది. అయితే భవిష్యత్తులో ఈ చికిత్సా విధానం వాడకం మరింత విస్తృతమైతే ఈ సర్జరీల ధరలు తగ్గే అవకాశం ఉంది. -
ఒకే వ్యక్తిలో స్త్రీ, పురుష జననాంగాలు!
రాంగోపాల్‌పేట్ (హైదరాబాద్): మంచిర్యాలకు చెందిన ఓ వ్యక్తి వృషణాలు లేకుండా పుట్టాడు. 40 ఏళ్లుగా అలాగే ఉన్నాడు. పెళ్లి చేసుకున్నా.. ఎంతకు పిల్లలు పుట్టకపోవడం, పొత్తి కడుపు కింద నొప్పితో సికింద్రాబాద్ కిమ్స్ ఆస్పత్రికి వచ్చాడు. అల్ట్రాసౌండ్, స్కానింగ్, ఎంఆర్ఐ వంటి పరీక్షలు చేయగా.. ఆ వ్యక్తిలో స్త్రీ, పురుష జననాంగాలు రెండూ ఉన్నట్టు గుర్తించారు. జన్యు ఉత్పరివర్తనం (మ్యుటేషన్) కారణంగా ఈ పరిస్థితి తలెత్తినట్టు తేల్చారు.ఆస్పత్రిలో ఆయనకు ఆండ్రాలజిస్టు, రోబోటిక్ సర్జన్ వైఎం ప్రశాంత్ చికిత్స చేశారు. దీనికి సంబంధించి వైద్యుడు వెల్లడించిన వివరాల మేరకు.. సాధారణంగా పిండం ఏర్పడిన సమయంలోనే హార్మోన్ల ప్రభావంతో ఆడ, మగ అన్నది నిర్ణయమైపోతుంది. అయితే మంచిర్యాల వ్యక్తి కేసులో జన్యు మ్యుటేషన్ కారణంగా.. హార్మోన్ల అసమత్యుల్యత ఏర్పడి ఆడ, మగ రెండు రకాల జననాంగాలు ఏర్పడ్డాయి. అందులో గర్భ సంచి, ఫాలోపియన్ ట్యూబ్స్‌తోపాటు వృషణాలు ఉదర భాగంలోనే ఉండిపోయాయి. ఇలాంటి వారు అన్ని అంశాల్లో మామూలుగానే ఉంటారు. హార్మోన్లు, పురుషాంగం, మీసాలు, గడ్డాలు అన్ని సాధారణంగానే ఉంటాయి. అయితే వృషణాలు లోపలే ఉండి, వీర్య కణాలు ఉత్పత్తిగాక పిల్లలు పుట్టే అవకాశం ఉండదు. లాప్రో స్కోపిక్ శస్త్రచికిత్సతో.. ఈ వ్యక్తికి వైద్యులు చిన్నపాటి కోతతో కూడిన ల్యాప్రోస్కోపిక్ శస్త్రచికిత్స చేసి.. గర్భసంచి, ఫాలోపియన్ ట్యూబ్స్‌తోపాటు వృషణాలను కూడా తొలగించారు. సాధారణంగా 18 ఏళ్ల వయసు దాటిన తర్వాత కూడా వృషణాలు లోపలే ఉండిపోతే కేన్సర్‌గా మారే ప్రమాదం ఉంటుందని.. అందువల్ల వాటినీ తొలగించాల్సి వచ్చిందని డాక్టర్ ప్రశాంత్ తెలిపారు. ఇన్నేళ్లుగా ఆ వ్యక్తి పడుతున్న ఇబ్బందులు తొలగిపోయాయని.. కానీ పిల్లలు పుట్టే అవకాశం లేదని తెలిపారు. 18 ఏళ్ల వయసుకు ముందే ఈ సమస్యను గుర్తించి శస్త్రచికిత్స చేస్తే వృషణాలను సాధారణ స్థితికి తెచ్చే అవకాశం ఉండేదని.. కానీ పేదరికం, నిరక్షరాస్యత కారణంగా ఇన్నేళ్లుగా సమస్యను గుర్తించలేకపోయారని వివరించారు. ఇలాంటి కేసులు అరుదని, ప్రపంచంలో ఇప్పటివరకు 300 కేసులు, దేశంలో 20 కేసులు మాత్రమే బయటికి వచ్చాయని తెలిపారు. -
రోబోటిక్ వీడియో కెమెరా: ధర తెలిస్తే షాకవుతారు
సాక్షి, ముంబై: జపానీస్ ఎలక్ట్రానిక్ వస్తువుల తయారీ కంపెనీ ‘పానసోనిక్’ కొత్తగా రోబోటిక్ వీడియో కెమెరాను విడుదల చేసింది. ‘ఏడబ్ల్యూ–యూఈ 160 యూహెచ్డీ 4కే 1 ఎంఓఎస్ పీటీజ్’ పేరుతో విడుదల చేసిన ఈ కెమెరా ఎలాంటి పరిస్థితుల్లోనైనా అత్యంత స్పష్టమైన చిత్రాలను, వీడియోలను తీయగలదు. ఇందులో ఎంఓఎస్ సెన్సర్, లో పాస్ ఫిల్టర్, హైస్పీడ్ ఫ్రేమ్ రేట్స్ వంటి అధునాతన ఫీచర్స్ ఉన్నాయి. పరిసరాల్లోని వెలుగు నీడలకు అనుగుణంగా ఈ కెమెరా తనను తానే సర్దుకుని స్పష్టమైన వీడియోలను చిత్రించగలదు. జూమ్, టిల్ట్ వంటివి రిమోట్‌తో నియంత్రించవచ్చు. ఇది స్లోమోషన్ వీడియోలను కూడా పూర్తి స్పష్టతతో తీయగలదు. ఈ కెమెరాకు సంబంధించిన యాప్‌ను స్మార్ట్‌ఫోన్‌లో డౌన్లోడ్ చేసుకుంటే, దాని ద్వారా కెమెరా పనితీరును సులువుగా నియంత్రించుకోవచ్చు. దీని ధర 14,495 డాలర్లు (రూ.11.93 లక్షలు). -
రోబోటిక్ వీల్‌చైర్..శరీరాన్ని వంచితే చాలు..దానంతట అదే వెళ్తుంది!
నడవలేని స్థితి ఎదురైనప్పుడు ఎవరైనా వీల్‌చైర్‌ను ఆశ్రయించక తప్పదు. వీల్‌చైర్‌లో కూర్చుంటే, వెనుక నుంచి ఎవరో ఒకరు ముందుకు నెడితే తప్ప కదలడం సాధ్యం కాదు. వీల్చైర్ల తయారీలోనూ ఇటీవల అధునాతన మార్పులు వస్తున్నాయి. తాజాగా, జపాన్‌కు చెందిన బహుళజాతి వాహనాల తయారీ సంస్థ ‘హోండా’ ఈ రోబోటిక్ వీల్‌చైర్‌ను రూపొందించింది. మోటార్‌తో రూపొందించిన కొన్ని వీల్చైర్లను చేతులతో కోరుకున్న దిశకు నడపాల్సి ఉంటుంది. హోండా తయారుచేసిన ఈ వీల్‌చైర్ మాత్రం చేతులకు శ్రమపెట్టదు. ఇది పూర్తిగా రోబోటిక్ సాంకేతికతతో పనిచేస్తుంది. ఇందులో కూర్చున్న వ్యక్తి ఎటువైపుగా వెళ్లాలనుకుంటే, అటువైపుగా కాస్త శరీరాన్ని వంచితే చాలు. ఇది దానంతట అదే ఆ దిశగా ముందుకు సాగుతుంది. దీనిని స్టార్ట్ చేయాలన్నా, స్థిరంగా నిలపాలన్నా కావలసిన బటన్లు చేతికి అందుబాటులో ఉంటాయి. ‘యూని–వన్’ పేరిట రూపొందించిన ఈ రోబోటిక్ వీల్‌చైర్ ఇంకా మార్కెట్లోకి విడుదల కావాల్సి ఉంది. -
రోబో ఎలుక
ఇటీవలి సంవత్సరాల్లో శాస్త్రవేత్తలు రోబోటిక్ చేపల నుంచి రోబోటిక్ శునకాల దాకా అనేక జంతువులను అభివృద్ధి చేశారు. అయితే ఇటీవల శాస్తవేత్తలు రోబోటిక్ ఎలుకను రూపొందించారు. దాన్ని ఎక్కడ, ఎవరు తయారుచేశారు? అదేం పనులు చేస్తుందనే విశేషాలేంటో చూద్దాం. –సాక్షి, సెంట్రల్ డెస్క్ చైనాలోని బీజింగ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి చెందిన శాస్త్రవేత్తలు ఇటీవల ‘రోబో ర్యాట్’ను ఆవిష్కరించారు. ‘స్కురో (స్మాల్సైజ్ క్వాడ్రుపెడ్ రోబొటిక్ ర్యాట్)’అని పిలిచే ఈ నాలుగు కాళ్ల రోబో ఎలుక.. నిజమైన ఎలుక మాదిరే నడవగలదు, మోకాళ్లు వంచి వెళ్లగలదు, నెమ్మదిగా పాకుతున్నట్లు కూడా పోగలదు. దాని శరీర బరువులో 91 శాతం బరువును మోసుకెళ్లగలదు. ఇది తన శరీరాన్ని ముడుచుకుని చాలాచిన్నపాటి గ్యాప్‌లలో కూడా వేగంగా పరిగెత్తే సామర్థ్యం కలిగిఉంటుంది. కిందపడినా కూడా మళ్లీ నిలబడగలదు కూడా. విజయవంతంగా పరీక్షలు పరిశోధకులు ఈ రోబో ఎలుకను ఇటీవల క్షేత్రస్థాయిలో పలు రకాలుగా పరీక్షించారు. ‘చక్కగా లేకుండా ఎగుడుదిగుడుగా వంపులతో ఉన్న 3.5 అంగుళాల వెడల్పున్న చిన్న మార్గంలో ఇది విజయవంతంగా తన పనిని నిర్వర్తించింది. 1.1 అంగుళాల ఎత్తున్న అడ్డంకులను సులువుగా అధిగమించడంతోపాటు 15 డిగ్రీలు వాలుగా ఉన్న చోట కూడా ఇబ్బంది పడకుండా ముందుకువెళ్లింది. దాని శరీర బరువులో 91 శాతం బరువున్న పేలోడ్‌ను కూడా మోసుకుంటూ వెళ్లింది’అని దాని రూపకర్తలు చెప్పారు. ఈ రోబో ఎలుక దానికి అప్పగించిన అన్ని పనులను చురుగ్గా చేసిందంటూ వారు హర్షం వ్యక్తంచేశారు. 220 గ్రాముల బరువున్న ఈ ఎలుక దాదాపు 200 గ్రాముల బరువును మోసుకెళ్లిందన్నారు. మనుషులు వెళ్లలేని చోటికి... దీని సాంకేతికతను మరింత అభివృద్ధి చేసి విపత్తులు సంభవించిన చోట శిథిలాల్లో చిక్కుకున్న వారిని గుర్తించేందుకు, మనుషులు వెళ్లేందుకు క్లిష్టంగా ఉన్న ప్రాంతాల్లో గాలింపుచర్యలు చేపట్టడానికి దోహదపడుతుందని పరిశోధకులు చెబుతున్నారు. అలాగే పరిశోధనల కోసం కూ డా దీన్ని వాడొచ్చని అంటున్నారు. తొలుత చ క్రాలతో దీన్ని రూపొందించగా, తర్వాత మరిం త చురుగ్గా కదిలేందుకు కాళ్లు అమర్చారు. -
నాసా రోవర్.. సాఫ్ట్ వేర్ రాసింది మన మహిళే!
మొన్నటి ‘పెర్సీ’ రోవర్‌తో కలిపి నాసా ఇంతవరకు ఐదు రోవర్లను అంగారకుడి మీదకు పంపింది. వాటిల్లో స్పిరిట్, ఆపర్చునిటీ, క్యూరియాసిటీ అనే రోవర్లకు, తాజా పెర్సీ రోవర్‌కు లాండింగ్ సాఫ్ట్ వేర్ రాసింది మన భారతీయ మహిళే! పేరు వందన. పెర్సీ ప్రాజెక్టును విజయవంతం చేసిన స్వాతి టీమ్‌లోని సభ్యురాలు. 2007 నుంచి నాసాలో రోబోటిసిస్ట్గా పని చేస్తున్న వందన పంజాబీ మహిళ. నాసా ఆఫీస్‌లో అంతా వందనను ‘వండీ’ అని పిలుస్తారు. అందరితో ఆమె కలుపుగోలుగా ఉండటమే ఆ ఆప్యాయతకు కారణం. అంగారకుడి పైకి పంపే రోవర్ల నియంత్రణకు స్క్రీన్‌ప్లే వంటి సాఫ్ట్‌వేర్‌ను రూపొందించడంలో ఆమె నిపుణురాలు. ఇప్పటి వరకు నాసా పంపిన ఐదు రోవర్లలో ఒక్క సోజర్న్ రోవర్‌కు తప్ప మిగతా వాటన్నిటికీ ఆమే సాఫ్ట్వేర్ రాశారు. వ్యోమగామి కల్పనాచావ్లా జన్మస్థలమైన హర్యానా పక్క రాష్ట్రం పంజాబ్ నుంచే వందన కూడా నాసా వరకు వెళ్లారు. పంజాబ్‌లోని హల్వారా వందన జన్మస్థలం. ఆమె తండ్రి ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ లో పైలట్. ఉద్యోగ రీత్యా వందన చిన్నప్పుడే ఆయన భారతదేశంలోని ముఖ్య నగరాలన్నీ చుట్టేశారు. వాటిని చుట్టినట్లే ఆమెకు అంతరిక్షాన్నీ చుట్టి రావాలని ఉండేది. హల్వారాలోనే కేంద్రీయ విద్యాలయలో పాఠశాల చదువు పూర్తయింది. చండీగఢ్ పంజాబ్ ఇంజనీరింగ్ కాలేజ్ లో ఎలక్ట్రానిక్ ఇంజినీరింగ్‌లో డిగ్రీ అయింది. తర్వాత యూఎస్‌లోని కార్నెగీ మెలాన్ యూనివర్శిటీ (సి.ఎం.యు.) లో రోబోటిక్స్ తీసుకుని మాస్టర్స్ డిగ్రీ చేశారు. ఆ తర్వాత పీహెచ్‌డి. చదువుకుంటూనే ఆమె చేసిన పని విమానం నడపడంలో శిక్షణ తీసుకుని పైలట్ లైసెన్స్ సంపాదించడం. చదువుతున్నప్పుడే పార్ట్ టైమ్‌గా దక్షిణమెరికా అటకామా ఎడారిలో ఆస్ట్రోబయాలజీ ప్రయోగాల్లో పాల్పంచుకున్నారు. అటాకామాలో అంగారకుడి పోలిన స్నేహపూర్వకం కాని వాతావరణం ఉంటుంది. అక్కడ పరిశోధనలు చేశారు. ఇక సి.ఎం.యు.లోనైతే నిర్దేశించిన అవసరాలకు తగినవిధంగా రోబోను తయారు చేసి దానిని నియంత్రించే ప్రోగ్రామ్‌ను రాయడంలో వందనకే ఎప్పుడూ ఫస్ట్. అలా ఆమెకు అంగారకుడి మీద, అంగారకుడిపైకి పంపే రోవర్ల మీద పట్టు లభించింది. 2006లో నాసాలో అవకాశం వచ్చింది. అక్కడ ఆమె తొలి ప్రాజెక్టే ‘ప్లెక్సిల్’కు సాఫ్ట్వేర్ రాయడం. ఫ్లెక్సిల్ అంటే ప్లాన్ ఎగ్జిక్యూషన్ ఇంటర్‌ఛేంజ్ లాంగ్వేజ్. అదొక ఆటోమేషన్ టెక్నాలజీ భాష. ఆ ప్రాజెక్ట్‌ను విజయవంతంగా నిర్వహించారు. ఇప్పుడు పెర్సీని అంగారకుడి పైకి దింపింది కూడా నాటి ఫ్లెక్సిల్ సాఫ్ట్‌వేర్‌కు అభివృద్ధి రూపమే. వందన 2007లో నాసా వారి జెట్ ప్రొపల్షన్ లేబరీటరీలో జాయిన్ అయ్యారు. అక్కడ మరింత అధునాతనమైన, మెరుగైన రోబో టెక్నాలజీని కనిపెట్టవలసి ఉంటుంది. అక్కడ ఆమె ప్రతిభ ఆమెను ఆటానమస్ సిస్టమ్స్ ప్రాజెక్టుకు గ్రూప్ లీడర్‌ను చేసింది. ఆ ప్రతిభా నైపుణ్యాలే వందనకు నాసాలో విశిష్టమైన రోబోటిసిస్టుగా గుర్తింపు తెచ్చిపెట్టాయి. నాసా లేబరేటరీలో రోవర్ల మధ్య వందన -
గ్రహశకలంపై వాలిన ఒసిరిస్ రెక్స్
వాషింగ్టన్: నాలుగేళ్ల సుదీర్ఘ ప్రయాణం తరువాత అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ (నాసా) ప్రయోగించిన రోబోటిక్ అంతరిక్ష నౌక ఒసిరిస్ రెక్స్ విజయవంతంగా బెన్నూ గ్రహశకలంపై వాలింది. మంగళవారం ఉదయం 6.12 గంటలకు అమెరికాలోని కొలరాడోలోని డెన్వర్ ప్రాంతంలో ఉన్న లాక్‌హీడ్ మార్టిన్ స్పేస్ సెంటర్ నుంచి ఒసిరిస్ రెక్స్‌ను గ్రహశకలంపై దింపగలిగారు. ‘నేలపై వాలడం పూర్తయింది’అన్న ప్రకటన వినగానే కేంద్రంలోని శాస్త్రవేత్తలందరూ హర్షధ్వానాలు చేశారు. భూమికి సుమారు 33 కోట్ల కిలోమీటర్ల దూరంలోని రోబోటిక్ అంతరిక్ష నౌకను నియంత్రించడం, దానితో బెన్నూ గ్రహశకలం నమూనాలను సేకరించడం అంటే ఆషామాషీ వ్యవహారం ఏమీ కాదు!. నాసా సుమారు పన్నెండేళ్లుగా ఈ ప్రాజెక్టుపై పనిచేస్తూండగా బెన్నూ గ్రహశకలంపై వాలి కేవలం 16 సెకన్ల కాలంలో నమూనాలు సేకరించింది. ఓ మినీ వ్యాన్ అంత సైజుండే ఒసిరిస్ 11 అడుగుల పొడవైన రోబోటిక్ చేతితో బెన్నూ ఉత్తర ధ్రువ ప్రాంతంలోని రాళ్లను సేకరించి ఆ వెంటనే గ్రహశకలం నుంచి వేరుపడింది. ఈ నమూనాల ఫొటోలను ప్రసారం చేయడం మొదలుపెట్టింది. రానున్న ఏడు రోజుల్లో ఈ ఫోటోలు నాసాకు చేరనుండగా.. వాటి ఆధారంగా మరిన్ని నమూనాలను సేకరించాలా? వద్దా? అన్నది నిర్ణయిస్తారు. 60 గ్రాముల నుంచి 2 కిలోల వరకూ... బెన్నూ గ్రహశకలం నుంచి అరవై గ్రాముల నుంచి రెండు కిలోగ్రాముల వరకూ రాతి నమూనాలను సేకరించాలన్నది శాస్త్రవేత్తల లక్ష్యం. కర్బనం ఎక్కువగా ఉండే ఈ రాళ్ల ద్వారా మన సౌర కుటుంబం పుట్టుకకు సంబంధించిన రహస్యాలు తెలుసుకోవచ్చు. మంగళవారం నాటి ప్రయోగం అంతా అనుకున్నట్లుగానే సాగిందని, ఒసిరిస్ రెక్స్ చేయి పీడనంతో కూడిన వాయువును విడుదల చేయడం ద్వారా నమూనాలను సేకరించిందని ప్రాజెక్టు పర్యవేక్షకుడు డాంటే లారెట్టా తెలిపారు. -
వావ్.. టైట్రాన్ రోవ్
(బెంగళూరు నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి): నడక ఆరోగ్యానికి మంచిదంటారు కానీ.. నగరాల్లో చాలామంది వేతన జీవులకు నడక నరకప్రాయమే. ఎడతెగని దూరాలు, సమయానికి ఆఫీసుకు చేరుకోవాలనే టెన్షన్, తడిసిమోపెడయ్యే ప్రయాణ ఖర్చులు.. ఉద్యోగాల కోసం రోజూ ప్రయాణాలు చేసే వారి ఇబ్బందులివి. బస్సులు, మెట్రోలు, ఊబర్, ఓలాలు ఎన్ని అందుబాటులోకి వచ్చినా సొంతంగా ఓ వాహనం ఉండటం మేలన్న భావన వీరిలో బలపడేందుకు లాస్ట్ మైల్ కనెక్టివిటీ.. అంటే ఇంటికి అతి దగ్గరగా చేర్చే రవాణా మార్గమేదీ లేకపోవడం ఒక కారణం. ఈ సమస్యను అధిగమించేందుకు బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న ప్రైమ్రైల్ ఇన్ఫ్రా ల్యాబ్స్ సంస్థ ప్రయత్నిస్తోంది. మనుషులను చేరవేసే రోబో టైట్రాన్ రోవ్.. డ్రైవర్, డీజిల్ అవసరం లేని తెలివైన రోబోటిక్ వాహనమిది. ఒకచోటి నుంచి ఇంకోచోటికి మనుషులను చేరవేసేందుకు దీనిని ఉపయోగించవచ్చు. ఉదాహరణకు మెట్రో స్టేషన్ నుంచి రైల్వే, బస్స్టేషన్లకు, సువిశాలమైన విశ్వవిద్యాలయాలు, షాపింగ్‌మాల్స్, ఐటీ ఎస్ఈజెడ్లలో వేర్వేరు ప్రాంతాలను అనుసంధానించేందుకు ఉపయోగపడతాయివి. పూర్తిగా విద్యుత్తుతో నడుస్తాయి కాబట్టి కాలుష్యం బెడద ఉండదు. ఇవి.. తాము నడిచే దారిలో పైకప్పుపై ఏర్పాటుచేసే సోలార్ ప్యానెల్ల నుంచి ఉత్పత్తయ్యే విద్యుత్తునే వాడుకుంటాయి. చిన్న సైజులో ఉండటం వల్ల రహదారులపై ఎక్కువ స్థలం ఆక్రమించవు. అవసరాన్నిబట్టి టైట్రాన్ రోవ్ సైజును నిర్ణయించుకోవచ్చు. గంటకు మూడు వేల నుంచి 15 వేల మందిని ఒకచోటి నుంచి ఇంకోచోటికి తరలించవచ్చునని కంపెనీ చెబుతోంది. మహా నగరాల్లో మెట్రో ఫీడర్ షటిల్స్‌గా, రెండు, మూడో తరగతి పట్టణాల్లో మెట్రోలకు లేదంటే జీబీఆర్టీ (బస్సులకు ప్రత్యేకమైన స్థలం కేటాయించడం)కి ప్రత్యామ్నాయంగా వాడవచ్చు. వీటితోపాటు ఎయిర్పోర్ట్, విద్యాసంస్థలు, పర్యాటక ప్రాంతాల్లోనూ ప్రజలను వేగంగా అటుఇటు తిప్పేందుకు వాడుకోవచ్చు. బెంగళూరులో పరీక్షలు టైట్రాన్ రోవ్ టెక్నాలజీని పరీక్షించేందుకు బెంగళూరులోని వైట్‌ఫీల్డ్‌లో ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ ప్రాంతంలో సుమారు 430 మీటర్ల పొడవైన టెస్టింగ్ ట్రాక్‌ను ఏర్పాటు చేసి పూర్తిస్థాయిలో రోబోటిక్ వాహనాలను పరీక్షిస్తున్నారు. ఇద్దరు మా త్రమే కూర్చోగలిగిన రోవ్‌లతో జరుగుతున్న పరీక్షలు ఫలితాలిస్తున్నట్లు కంపెనీ చెబుతోంది. 2017 అక్టోబరులో తాము ఈ టెక్నాలజీపై పేటెంట్లు సంపాదించామని, ఏడాది తిరిగేలోపు టెస్టింగ్ ట్రాక్ నిర్మాణం పూర్తి చేశామని, గత సెప్టెంబరు నుంచి పరీక్షలు నిర్వహిస్తున్నామని కంపెనీ బిజినెస్ డెవలప్మెంట్ విభాగపు డైరెక్టర్ అరుణ్ ‘సాక్షి’కి తెలిపారు. ఈ ఏడాది మార్చిలో పూరిస్థాయి పరీక్షలు, ఐఎస్ఏ సర్టిఫికేషన్ సాధించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు. ఢిల్లీతోపాటు జైపూర్, కోచి మెట్రో రైల్ అధికారులతో టైట్రాన్ రోవ్‌ల వాడకంపై ఇప్పటికే చర్చిస్తున్నామన్నారు. అన్నీ సవ్యంగా సాగితే మరో ఏడాదిలోపు ఈ టెక్నాలజీ పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానుందన్నారు. పూరిస్థాయిలో టైట్రాన్ రోవ్‌ల వాడకానికి కిలోమీటర్‌కు రూ.25 కోట్ల నుంచి రూ.30 కోట్లు ఖర్చవుతాయని వివరించారు. అవసరాన్ని బట్టి నేలపై, లేదంటే స్తంభాలకు వేలాడుతూ కూడా టైట్రాన్లను ఏర్పాటు చేసుకోవచ్చునని ఆయన చెప్పారు. -
త్వరలో కుక్కలతో డెలివరీ!
గల్లీలో ఓ కారాగింది. ఆ కారుకు డ్రైవర్ లేడు! అందులోంచి నాలుగు కుక్కలు గబగబా దిగాయి. దిగి నాలుగూ నాలుగు దిక్కులకు వెళ్లాయి. వాటి వెన్నుపై బ్యాగులు కూడా ఉన్నాయి. కాసేపటికి అవి మళ్లీ తిరిగొచ్చి ఆ కారులోనే కూర్చున్నాయి. ఇంతకవేం చేశాయనేగా సందేహం? హోం డెలివరీ! కస్టమర్లు ఆర్డర్ చేసిన వస్తువుల్ని డోర్‌స్టెప్ వద్ద డెలివరీ చేసే డెలివరీ డాగ్స్ అవి! ఫ్యూచర్లో డెలివరీ బాయ్స్ స్థానంలో కుక్కలొస్తాయట! అయితే, అవి నిజమైన కుక్కలు కావండోయ్. ఈ ఫొటోలో కనిపించేవి రోబో డాగ్స్, వాటి పక్కనున్నదేమో రోబో టాక్సీ. ఇలాంటి సన్నివేశం ఊహిస్తేనే గమ్మత్తుగా ఉంది కదూ? తొందర్లోనే ఈ కల నిజమయ్యే అవకాశం ఉంది. ఈ రోబోట్‌ను స్విట్జర్లాండ్‌లోని ఈటీహెచ్ జురిచ్ వర్సిటీకి చెందిన రొబిటిక్స్ ల్యాబ్ శాస్త్రవేత్తలు వీటిని అభివృద్ధి చేశారు. ఇటీవలే విజయవంతంగా ట్రయిల్ కూడా నిర్వహించారు. ఆ ట్రయిల్ వీడియోలు నెట్టింట్లో వైరల్ కూడా అయ్యాయి. త్వరలోనే ఇవి డెలివరీ డాగ్స్‌గా ప్రపంచానికి పరిచయం కాబోతున్నట్లు వారు ప్రకటించారు. 30 కిలోలుండే ఈ రోబో డాగ్స్ పది కిలోల వరకు బరువు మోయగలవు. మామూలుగా ఐదో ఫ్లోర్లో ఉన్న ఇంటికి డెలివరీ చేయాలంటే డెలివరీ బాయ్ విసుక్కుంటాడు కదా? ఈ రోబో డాగ్స్ మాత్రం ఎన్ని మెట్లున్నా ఎక్కగలవు. కృత్రిమ డోర్ బెల్‌తో సిగ్నల్ ఇచ్చి కస్టమర్‌కు వస్తువునిచ్చి.. డ్యాన్స్ చేసి వారిని సంతోష పెడతాయట! -
రోబో జాబ్స్ జోరు.. మూడేళ్లలో 191 శాతం వృద్ధి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశంలో గత కొన్నేళ్లుగా రోబోటిక్స్ రంగంలో ఉద్యోగ అవకాశాల కోసం వెతుకులాట గణనీయంగా పెరిగింది. 2015 మే నుంచి 2018 మే మధ్య రోబోటిక్స్ ఉద్యోగ అవకాశాల సెర్చిలో 186 శాతం వృద్ధి నమోదయిందని ప్రముఖ జాబ్ సెర్చ్ పోర్టల్ ఇన్‌డీడ్ తెలియజేసింది. ఇదే కాలంలో జాబ్ పోస్టింగ్స్ 191 శాతం వృద్ధిని నమోదు చేశాయని ఒక నివేదికలో తెలియజేసింది. 2015 తర్వాతి నుంచి దేశంలోని ప్రముఖ కంపెనీలు రోబోటిక్స్ మినహా ఇతర విభాగంలో కొత్త ఉద్యోగ అవకాశాలను చాలా వరకు తగ్గించేశాయని ఇన్‌డీడ్ ఎండీ సతీష్ కుమార్ తెలిపారు. మేకిన్ ఇండియాలో భాగంగా కేంద్రం రోబోటిక్స్ రంగంలో 13 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టిందని, ఇదే రోబోటిక్స్ ఉద్యోగ డిమాండ్‌కు కారణమని తెలిపారు. కన్స్ట్రక్షన్స్, హెల్త్‌కేర్, తయారీ రంగాల్లో రోబోటిక్స్ హవా నడుస్తోందన్నారు. మూడో స్థానంలో తెలంగాణ.. రోబోటిక్స్ సెక్టార్లో అత్యధిక ఉద్యోగ అవకాశాలున్న రాష్ట్రంలో తొలి రెండు స్థానాల్లో మహారాష్ట్ర, కర్ణాటక నిలవగా.. తెలంగాణ మూడో స్థానంలో నిలిచింది. ఆ తర్వాత వరుసగా తమిళనాడు, హర్యానా, న్యూఢిల్లీ, వెస్ట్ బెంగాల్, గుజరాత్, ఉత్తర్‌ప్రదేశ్, కేరళ రాష్ట్రాలు నిలిచాయి. సర్జరీల్లోనే ఎక్కువ.. రోబోటిక్స్ ఉద్యోగ అవకాశాలు విభాగాల వారీగా చూసుకుంటే సర్జరీ, కన్స్ట్రక్షన్స్ రంగంలోనే ఎక్కువగా ఉన్నాయి. ప్రపంచ వ్యాప్తంగా చూసుకుంటే దేశీయ సర్జికల్ రోబోటిక్స్ మార్కెట్ వృద్ధి ఎక్కువగా ఉందని నివేదిక తెలిపింది. -
అక్కడ రజనీ.. ఇక్కడ నేను..
హెలో.. నా పేరు సోఫై.. నేనో చేపను.. చేపనేసరికి.. చేపా చేపా ఎందుకు ఎండలేదు లాంటి దిక్కుమాలిన ప్రశ్నలు వేయకండే.. దానికి సమాధానం నాకు తెలియదు.. తెలిసినా చెప్పను.. ఎందుకంటే.. నేను చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి.. ముఖ్యంగా మీ మనుషులకు నేనెంతో హెల్ప్ చేస్తున్నాను తెలుసా? ఎలాగంటారా.. రోబో సినిమా అందరూ చూశారుగా.. అందులో రజనీ మరమనిషి అయితే.. నేను మర చేపను.. కరెక్టుగా చెప్పాలంటే సిలికాన్ రబ్బర్ రోబోటిక్ ఫిష్ అన్నమాట. నన్ను మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ శాస్త్రవేత్తలు రూపొందించారు.. ఎందుకో తెలుసా? సముద్రపు లోతుల్లోని రహస్యాలను చేధించడానికి.. అక్కడ ఉండే చిన్నచిన్న జీవుల గురించి తెలుసుకోవడానికి.. ముఖ్యంగా చిన్నచిన్న చేపల వెంట.. వాటికి ఏమాత్రం అనుమానం రాకుండా తిరగగలను.. నేను కూడా ఆ చేపల్లాగే తోకను ఊపుతూ అటూఇటూ సయ్సయ్మని ఈదేస్తుండటంతో వాటికి డౌటనుమానం లాంటివి రావడమే లేదు.. మీ మనుషులకు ఇది సాధ్యం కాదు కదా.. పైగా నేను ఫిష్ కమ్ ఫొటోగ్రాఫర్‌ను.. నా ముందున్న కెమెరాతో హైరిజల్యూషన్ చిత్రాలను తీయగలను.. 50 అడుగుల లోతుకు వెళ్లి.. 40 నిమిషాలపాటు ఆగకుండా తిరగ్గలను.. మీరు వెళ్లలేని ప్రదేశాలకు వెళ్లి.. కూపీ లాగగలను.. అంతేనా నేను లైట్ వెయిట్ కూడా.. నేను తిరగడానికి పనికొచ్చే బ్యాటరీ కూడా మీ మొబైళ్లలో ఉండే లిథియం పాలిమర్ బ్యాటరీ టైపే.. ఈ మధ్యే నన్ను ఫిజీలో పరీక్షించి చూశారు..సూపర్ సక్సెస్.. శాస్త్రవేత్తలేమో తెగ హ్యాపీగా ఉన్నారు. ఎందుకంటే.. ఇంతకుముందు కెమెరాలు లాంటివి ఫిట్ చేసిన రోబోలను చాలా ప్రయోగించినా.. నాలాగ చిన్నచిన్న చేపల్లో కలిసిపోయి పనిచేసేది మాత్రం మరెక్కడా లేదట. అదిగో నన్ను తయారుచేసిన శాస్త్రవేత్తలు వస్తున్నారు.. నన్ను మరింత మెరుగుపరుస్తారట.. ఇంకా మార్పులు చేస్తారట. రోబో 2.0 లాగ అన్నమాట.. ఉండనా మరి.. సీయూ.. -
మెదడు ఆదేశాలతో రోబోటిక్ నియంత్రణ!
వాషింగ్టన్: అవయవం కోల్పోయిన వారు అమర్చుకునే రోబోటిక్ అవయవాన్ని మెదడుతో నియంత్రించే కొత్త సాంకేతికతను శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. మెదడులో ఎలక్ట్రోడ్లను అమర్చడంతో ఇది సాధ్యపడుతుందని అమెరికాలోని షికాగో వర్సిటీ∙పరిశోధకులు తెలిపారు. కోల్పోయిన అవయవ స్థానంలో అమర్చిన రోబోటిక్ అవయవాన్ని నియంత్రించేందుకు మెదడులోని సంబంధిత భాగాన్ని గుర్తించి, అక్కడ ఎలక్ట్రోడ్లను అమర్చనున్నట్లు ప్రొఫెసర్ హాట్సోపౌలస్ చెప్పారు. ‘ప్రమాదంలో చేతులు కోల్పోయిన కోతులకు రోబో చేతులను అమర్చాం. చేతులను నియంత్రించే మెదడులోని భాగాల్లో ఎలక్ట్రోడ్లను ప్రవేశపెట్టాం. సహజ చేతుల్లాగానే రోబో చేతులనూ మెదడు ద్వారా నియంత్రించాయి’అని చెప్పారు. -
వికలాంగుల కోసం మైండ్ కంట్రోల్ వీల్ ఛైర్
అమెరికా శాస్త్రవేత్తలు ఓ కొత్త రోబోటిక్ వీల్ ఛైర్ ను అభివృద్ధి చేశారు. ముందుగా వీల్ ఛైర్ పనిచేసే విధానాన్ని కనుగొనేందుకు కోతులపై ప్రయోగించారు. అవి దాన్ని నడిపే తీరును పరిశీలించారు. కోతుల మెదడులోని ఆలోచనలను బట్టి ఆ ఛైర్ కదలడాన్నిగమనించారు. భవిష్యత్తులో అలాంటి వీల్ ఛైర్లు కండరాల నియంత్రణ, చైతన్యం కోల్పోయిన వ్యక్తులకు అందుబాటులోకి తెచ్చేందుకు భారత సంతతికి చెందిన శాస్త్రవేత్త, ఆయన బృందం పరిశోధనలు చేస్తోంది. మెదడు సంకేతాలను డిజిటల్ మోటార్ కమాండ్స్‌గా మార్చే ఓ కంప్యూటర్ ప్రోగ్రామ్‌ను తయారుచేసిన సైంటిస్టులు.. అవి వీల్ ఛైర్ కదలికలను నియంత్రించేలా రూపొందించారు. కోతుల్లో కూడా అచ్చం మానవచేష్టలే ఉంటాయని ఇంతకుముందే ఎన్నోసార్లు నిర్ధారించారు. అందుకే ఈ వీల్ ఛైర్‌ను ముందుగా కోతులతో ప్రయోగించి చూశారు. వాటి మెదడులో కదలికలు, స్పర్శను తెలిపే న్యూరాల్ల పనితీరును ఇంటర్ ఫేస్ సంకేతాల ద్వారా రికార్డు చేశారు. ఆలోచనలను బట్టి కోతులు వాటి లక్ష్యం దిశగా కదలడాన్ని తెలుసుకునేందుకు ఓ ద్రాక్షపళ్ల గిన్నెను వాటి ముందుంచారు. వీల్ ఛైర్ కదిలే విధానం, వాటి మెదడు చర్యలు ఒకేలా ఉండటాన్ని కంప్యూటర్ ద్వారా పరిశీలించారు. కోతుల్లో మెదడు పనిచేస్తున్న తీరు, వీల్ ఛైర్ కదిలే విధానం ఒకేలా ఉందని తేలింది. దీంతో భవిష్యత్తులో పక్షవాతం, వెన్నుకు సంబంధించిన వైకల్యాలతో బాధపడేవారికి, కండరాల నియంత్రణ, చైతన్యం కోల్పోయినవారికి ఈ మనో నియంత్రిత వీల్ ఛైర్ సహకరిస్తుందని అమెరికా డ్యూక్ విశ్వవిద్యాలయం న్యూరో ఇంజనీరింగ్ సెంటర్‌కు చెందిన మిగ్యూల్ నికోలస్ తెలిపారు. అయితే కనీస కదలికలు కూడా లేనివారికి మాత్రం ఇది పెద్దగా పనికొచ్చే అవకాశం ఉండదన్నారు. -
రోబో మేస్త్రీ...
పెళ్లి చేసి చూడు... ఇల్లు కట్టి చూడు అని నానుడి. పెళ్లి మాటేమోగానీ ఇల్లు కట్టడమంటే మాత్రం ఈ రోజుల్లో కూడా అంత ఆషామాషీ వ్యవహారమేమీ కాదు. పునాదులతో మొదలుపెట్టి ఒక ఇల్లు పూర్తి చేయడంలో నెలలు ఖర్చయిపోతాయి. దీన్ని దృష్టిలో ఉంచుకునే కాబోలు... జ్యూరిచ్‌లోని ఆర్కిటెక్ట్‌లు, రోబో శాస్త్రవేత్తలు ఈ ‘ఇన్సిటూ ఫ్యాబ్రికేటర్’ను తయారు చేశారు. కావాల్సిన పదార్థాలు, డిజైన్ అందిస్తే చాలు.. ఈ రోబో ఎంచక్కా నిర్మాణాన్ని మొదలుపెట్టేస్తుంది. ఇటుకలను ఒకదానిపై ఒకటి అందంగా పేర్చడం మాత్రమే కాదు.. అత్యంత క్లిష్టమైన డిజైన్లను కూడా సులువుగా పూర్తి చేయగలదు. ఒక మొబైల్ బేస్, రోబోటిక్ చేయితో కూడిన ఈ ఇన్సిటూ ఫ్యాబ్రికేటర్లో బోలెడు సెన్సర్లు కూడా ఉంటాయి. ఈ సెన్సర్లు నిర్మాణ ప్రాంతాన్ని పరిశీలించి ఓ త్రీడీ మ్యాప్‌ను ఏర్పాటు చేసుకుంటాయి. ఫలితంగా నిర్మాణ ప్రాంతంలో ఏ మాత్రం ఇబ్బంది లేకుండా అటుఇటూ కదలడం వీలవుతుంది. అంతేకాకుండా అప్పటికే అందించిన మ్యాప్‌కు అవసరమైన మార్పులు చేసుకుని పని మొదలుపెడుతుందన్నమాట. గోడ నిర్మాణంలో ఇటుకల కూర్పు ఎలా ఉండాలో మనమే నిర్ణయించుకోవచ్చు. అంతేకాదు... ఈ రోబోతో రకరకాల ఆకారాల్లో నిర్మాణాలు చేపట్టడం చాలా వేగంగా, సులువుగా జరిగిపోతుంది. మరో ఐదేళ్లలో ఈ రోబో అందుబాటులోకి వచ్చే అవకాశముందని అంచనా. -
ట్రాఫిక్ రోబోటిక్!
హైదరాబాద్‌లో ట్రాఫిక్ కంట్రోల్ చేయాలంటే తలకుమించిన భారం. అయితే, ఆ పని తాను చేస్తానంటోంది రోబో. ఆదివారం డక్కన్ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు ట్రాఫిక్ కంట్రోల్ రోబోను బంజారాహిల్స్‌లోని లామకాన్‌లో ప్రదర్శించారు. ఆటోమేటిక్, సెమీ ఆటోమేటిక్ పద్దతుల్లో ఈ రోబో పని చేస్తుందని, ట్రాఫిక్ సిగ్నల్స్ పని చేయకపోయినా ఆండ్రాయిడ్ అప్లికేషన్ ద్వారా ట్రాఫిక్‌ను కంట్రోల్ చేయొచ్చని రోబోను రూపొందించిన ఫౌజిన్ సిద్దిఖీ, ముబాషిర్ అలీఖాన్ తెలిపారు. - న్యూస్‌లైన్, హైదరాబాద్