ఇంతవరకు అవయవ మార్పిడులకు సంబంధించి..గుండె, కళ్లు, చేతులు, కిడ్నీ వంటి ట్రాన్స్‌ప్లాంటేషన్‌లు గురించి విన్నాం. ఇటీవల జంతువుల అయవాలను మనుషులకు మార్పిడి చేస్తున్న ప్రయత్నాల గురించి కూడా చూశాం. అవి విజయవంతం కాకపోయినా..అవయవాల కొరతను నివారించే దృష్ట్యా వైద్యులు సాగిస్తున్న ప్రయాత్నాలే అవి. ఐతే తాజాగా ఓ మెడికల్ స్టార్టప్ కంపెనీ తొలిసారిగా తల మార్పిడి శస్త్ర చికిత్సను అభివృద్ధిపరిచే లక్ష్యాన్ని చేపట్టింది. ఇది సఫలం అయితే చికిత్సే లేని వ్యాధులతో పోరాడుతున్న రోగుల్లో కొత్త ఆశను అందించగలుగుతాం. ఇంతకీ ఏంటా వైద్య విధానం అంటే..
యూఎస్‌లోని బ్రెయిన్‌బ్రిడ్జ్, న్యూరోసైన్స్, బయో మెడికల్ ఇంజనీరింగ్ స్టార్టప్ ప్రపంచంలోనే తొలిసారిగా తల మార్పిడి వ్యవస్థను అభివృద్ధి చేసే లక్ష్యాన్ని చేపడుతున్నట్లు ప్రకటించింది. ఐతే ఈ కంపెనీ ఇంతవరకు రహస్యంగా ఈ ప్రయోగాలు చేస్తూ వచ్చింది. కానీ ఇప్పుడూ ప్రపంచం తాము చేస్తున్న ఈ సరికొత్త వైద్య గురించి మరింతగా తెలుసుకోవాలన్న ఉద్దేశ్యంతో బహిర్గతం చేసింది.
ముఖ్యంగా చికిత్స చేయలేని స్థితిలో.. స్టేజ్ 4లో ఉన్న కేన్సర్, పక్షవాతం, అల్జీమర్స్ , పార్కిన్సన్స్ వంటి న్యూరోడెజనరేటివ్ వ్యాధులతో బాధపడుతున్న రోగుల్లో కొత్త ఆశను అందించడమే లక్ష్యంగా ఈ ప్రయోగానికి నాంది పలికినట్లు బ్రెయిన్ బ్రిడ్జ్ స్టార్టప్ పేర్కొంది. చిత్త వైకల్యంతో బాధపడుతున్న రోగి తలను ఆరోగ్యకరమైన బ్రెయిన్‌డెడ్ డోనర్ బాడీతో మార్పిడి చేయడం వంటివి ఈ సరికొత్త వైద్య విధాన ప్రక్రియలో ఉంటుంది. అందుకు సంబందించిన ఓ వీడియో సోషల్ మీడియాలో సంచలనం రేకెత్తించింది.
ఈ వీడియోలో రెండు రోబోటిక్ బాడీలపై ఏకకాలంలో శస్త్ర చికిత్స చేస్తున్న రెండు స్వయం ప్రతిపత్త రోబోలు కనిపిస్తాయి. ఇక్కడ ఒకరి నుంచి తలను తీసి మరో రోబోటిక్ శరీరంలోకి మార్పిడి చేస్తారు. ఇది చూడటానికి హాలీవుడ్ రేంజ్ సన్నివేశంలా అనిపిస్తుంది. ఇలాంటి అత్యధునిక శస్త్రచికిత్సపైనే న్యూరబుల్, ఎమోటివ్, కెర్నల్ అండ్ నెక్ట్స్ మైండ్, బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్ ఫేస్ వంటి కంపెనీలు కూడా వర్క్ చేస్తున్నాయి.
ఈ క్రమంలో బ్రెయిన్‌బ్రిడ్జ్‌లోని ప్రాజెక్ట్ లీడ్ హషేమ్ అల్-ఘైలీ మాట్లాడుతూ..తాము మెదడు కణాల క్షీణతను నివారించేలా అతుకులు లేకుండా తల మార్పిడి చేసేందుకు హైస్పీడ్ రోబోటిక్ సిస్టమ్‌ను వినియోగించేలా ప్లాన్ చేస్తున్నట్లు తెలిపారు. ఇందులో ఉన్న అధునాతన ఏఐ అల్గారిథమ్‌లు శస్త్ర చికిత్సలో నరాలు, రక్తనాళాల తోపాటు వెన్నుపాముని కచ్చితంగా తిరిగి కనెక్ట్ చేయడంలో రోబోలకు మార్గనిర్దేశం చేస్తాయని అల్ ఘైలీ చెప్పారు. తాము ఈ కాన్సెప్ట్‌ని విస్తృతమైన శాస్త్రీయ పరిశోధనల ఆధారంగా రూపొందించమని తెలిపారు.ఇది వైద్య సరిహద్దులను చెరిపేసేలా.. ప్రాణాంతక పరిస్థితులతో పోరాడుతున్న వారికి ప్రాణాలను రక్షించేలా వినూత్న పరిష్కారాలను అందిచగలదని చెప్పారు.
🤖 BrainBridge, the first head transplant system, uses robotics and AI for head and face transplants, offering hope to those with severe conditions like stage-4 cancer and neurodegenerative diseases… pic.twitter.com/7qBYtdlVOo
— Tansu Yegen (@TansuYegen) May 21, 2024
(చదవండి: వడదెబ్బకు గురైన నటుడు షారూఖ్! దీని బారిన పడకూడదంటే..!)
Comments
Please login to add a commentAdd a comment