జీఐటెక్ట్స్ 2023 (GITEX 2023) పేరుతో ప్రపంచంలో అతిపెద్ద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్ ఈవెంట్ దుబాయ్‌లో అంగరంగ వైభవంగా జరిగింది. దుబాయ్ వరల్డ్ ట్రేడ్ సెంటర్ వేదికగా అక్టోబర్ 16 నుంచి 20వ తేదీ వరకు జరిగిన ఈ ఈవెంట్‌కి 170 దేశాల నుండి 6,000 కంపెనీలు పాల్గొన్నాయి. ఈ సందర్భంగా ఆయా సంస్థలు తయారు చేసిన రోబోటిక్స్‌ను ప్రదర్శించాయి. ఆయా రోబోట్‌లు ఏయే రంగాల్లో నిష్ణాతులో తెలుపుతూ నిర్వాహకులు వివరించారు. వాటిల్లో
చైనాకు సంస్థ డీప్ రోబోటిక్స్ ఎక్స్20,ఎక్స్30 పేరుతో రోబోట్ డాగ్స్‌ని జీఐటీఈఎక్స్‌లో ప్రదర్శించింది. వీటితో మ్యానిఫ్యాక్చరింగ్ సంస్థల్లో కరెంట్(పవర్) పనిచేసే మనుషులు స్థానాన్ని వీటితో భర్తీ చేస్తాయి. దీంతో పాటు ఏదైనా అగ్ని ప్రమాదాలు, బిల్డింగ్‌లు కుప్పకూలిపోయినప్పుడు జరిగే ధన, ప్రాణ నష్టాన్ని పూర్తిగా తగ్గిస్తాయి. అంతేకాదు ప్రమాదాలు జరిగినప్పుడు బాధితుల్ని, లేదంటే ఇతర ఆస్తులు నష్టపోకుండా కాపాడుతుంది.
♦భూగర్భంలోని భారీ సొరంగాల్లా నిర్మించే కేబుల్స్ టన్నెల్స్‌లో తలెత్తి సాంకేతిక సమస్యల్ని గుర్తించి వెంటనే వాటిని పరిష్కరిస్తుంది.
♦మెటల్ మైనింగ్, భవన నిర్మాణాలు, ప్రాజెక్ట్ రిసెర్చ్ పరిశోధనల్లో కీలక పాత్ర పోషించేలా డిజైన్ చేసింది డీప్ రోబోటిక్స్.
స్విర్జర్లాండ్‌కు చెందిన స్విస్ మైల్ కంపెనీ 5ఏళ్ల పాటు రీసెర్చ్ చేసి స్విస్ మైల్ అనే రోబోట్‌ను తయారు చేసింది. ఆ రోబోట్ డెలివరీ సవాళ్లు, లాజిస్టిక్ కార్యకాలపాల్లో వేగం, రైలు ప్రమాదాలు జరిగిన సమయంలో ట్రాఫిక్ సమస్యల్ని సత్వర పరిష్కారం చూపిస్తుంది. ఇక రెండు కాళ్లు, రెండు చక్రాలతో ఉండే రోబోట్ ప్రయాణాని అసౌకర్యంగా ఉండే ప్రాంతాలకు సులభం చేరుకుంటుంది. కస్టమర్ల అవసరాల్ని తీరుస్తుంది. నావిగేషన్‌ను ఎనేబుల్ చేస్తూ శక్తి సామర్థ్యం ,వేగంతో ఫుడ్ డెలివరీ,వస్తువుల్ని డెలివరీ చేయడం దీని ప్రత్యేకత
♦ఇదే ఈవెంట్‌లో కమ్యూనికేషన్ కంపెనీ ఇ ఎంటర్‌ప్రైజ్ తయారు చేసిన అమీనా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అమీనా హ్యూమనాయిడ్ రోబో సందర్శకులను అలరించింది
♦ఎడ్డీ సలాడ్ గ్రూప్ ప్రోస్పెరిటీ 1 ఎయిర్ క్యాబ్‌ను ప్రదర్శించింది. ఇది కార్గో, ప్యాసింజర్ రవాణాకు ఉపయోగపడుతుంది. పూర్తి ఎలక్ట్రిక్ అటానమస్ వాహనం.
♦జీఐటీఈఎక్స్ 2023లో ప్రదర్శనలో అడ్వర్టైజింగ్ రోబోలు, నీటిలో సైతం నడిచే జేమ్స్ బాండ్ లాంటి తరహా కార్లు కూడా ఉన్నాయి.
♦ప్రొడక్టీవ్ ఏఐ ద్వారా తయారు చేసిన డిజిటల్ అవతార్‌లు హాస్పిటాలిటీ, టీవీ ప్రసారాలలో ఉపయోగించుకోవచ్చు.
♦అత్యంత వేగంగా నడిచే రోబోట్ ఆర్టిమస్. దీనితో సాకర్ ప్లేయర్‌ల స్థానాన్ని భర్తీ చేయొచ్చు.
♦ఆఫ్రికాలో అభివృద్ధి చేసిన ఓమి లైన్ హ్యూమనాయిడ్ రోబోలు ఎనిమిది భాషల్లో మాట్లాడుతుంది.
♦రోబోట్ బస్సుగా పరిగణించే అటానమస్ క్యాప్సూల్. ఇది భవిష్యత్‌లో రవాణా అవసరాల్ని తీర్చుతుంది. డ్రైవింగ్ చేయాలంటే మనుషుల అవసరం ఉండదు.
♦కేఫ్ ఎక్స్ అనే రోబోటిక్ కస్టమర్లకు కావాల్సిన ఫ్లేవర్స్‌లలో గంటకు 120 కప్పుల కాఫీని తయారు చేసి ఇస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment