
వాషింగ్టన్: అవయవం కోల్పోయిన వారు అమర్చుకునే రోబోటిక్ అవయవాన్ని మెదడుతో నియంత్రించే కొత్త సాంకేతికతను శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. మెదడులో ఎలక్ట్రోడ్లను అమర్చడంతో ఇది సాధ్యపడుతుందని అమెరికాలోని షికాగో వర్సిటీ∙పరిశోధకులు తెలిపారు.
కోల్పోయిన అవయవ స్థానంలో అమర్చిన రోబోటిక్ అవయవాన్ని నియంత్రించేందుకు మెదడులోని సంబంధిత భాగాన్ని గుర్తించి, అక్కడ ఎలక్ట్రోడ్లను అమర్చనున్నట్లు ప్రొఫెసర్ హాట్సోపౌలస్ చెప్పారు. ‘ప్రమాదంలో చేతులు కోల్పోయిన కోతులకు రోబో చేతులను అమర్చాం. చేతులను నియంత్రించే మెదడులోని భాగాల్లో ఎలక్ట్రోడ్లను ప్రవేశపెట్టాం. సహజ చేతుల్లాగానే రోబో చేతులనూ మెదడు ద్వారా నియంత్రించాయి’అని చెప్పారు.