త్వరలో కుక్కలతో డెలివరీ! | Home delivery with dogs soon | Sakshi
Sakshi News home page

త్వరలో కుక్కలతో డెలివరీ!

Jan 13 2019 3:16 AM | Updated on Jan 13 2019 4:39 AM

Home delivery with dogs soon - Sakshi

గల్లీలో ఓ కారాగింది. ఆ కారుకు డ్రైవర్‌ లేడు! అందులోంచి నాలుగు కుక్కలు గబగబా దిగాయి. దిగి నాలుగూ నాలుగు దిక్కులకు వెళ్లాయి. వాటి వెన్నుపై బ్యాగులు కూడా ఉన్నాయి. కాసేపటికి అవి మళ్లీ తిరిగొచ్చి ఆ కారులోనే కూర్చున్నాయి. ఇంతకవేం చేశాయనేగా సందేహం? హోం డెలివరీ! కస్టమర్లు ఆర్డర్‌ చేసిన వస్తువుల్ని డోర్‌స్టెప్‌ వద్ద డెలివరీ చేసే డెలివరీ డాగ్స్‌ అవి! ఫ్యూచర్‌లో డెలివరీ బాయ్స్‌ స్థానంలో కుక్కలొస్తాయట! అయితే, అవి నిజమైన కుక్కలు కావండోయ్‌. ఈ ఫొటోలో కనిపించేవి రోబో డాగ్స్, వాటి పక్కనున్నదేమో రోబో టాక్సీ. ఇలాంటి సన్నివేశం ఊహిస్తేనే గమ్మత్తుగా ఉంది కదూ? తొందర్లోనే ఈ కల నిజమయ్యే అవకాశం ఉంది.

ఈ రోబోట్‌ను స్విట్జర్లాండ్‌లోని ఈటీహెచ్‌ జురిచ్‌ వర్సిటీకి చెందిన రొబిటిక్స్‌ ల్యాబ్‌ శాస్త్రవేత్తలు వీటిని అభివృద్ధి చేశారు. ఇటీవలే విజయవంతంగా ట్రయిల్‌ కూడా నిర్వహించారు. ఆ ట్రయిల్‌ వీడియోలు నెట్టింట్లో వైరల్‌ కూడా అయ్యాయి. త్వరలోనే ఇవి డెలివరీ డాగ్స్‌గా ప్రపంచానికి పరిచయం కాబోతున్నట్లు వారు ప్రకటించారు. 30 కిలోలుండే ఈ రోబో డాగ్స్‌ పది కిలోల వరకు బరువు మోయగలవు. మామూలుగా ఐదో ఫ్లోర్‌లో ఉన్న ఇంటికి డెలివరీ చేయాలంటే డెలివరీ బాయ్‌ విసుక్కుంటాడు కదా? ఈ రోబో డాగ్స్‌ మాత్రం  ఎన్ని మెట్లున్నా ఎక్కగలవు. కృత్రిమ డోర్‌ బెల్‌తో సిగ్నల్‌ ఇచ్చి కస్టమర్‌కు వస్తువునిచ్చి.. డ్యాన్స్‌ చేసి వారిని సంతోష పెడతాయట!  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement