Dog Babies
-
రాహుల్ గాంధీ ఇంటికి కొత్త అతిథులు.. గోవా వెళ్లి మరీ తీసుకొచ్చారు
న్యూఢిల్లీ: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఇంటికి కొత్త అతిథులు వచ్చి చేరాయి. గోవా పర్యటనకు వెళ్లిన ఆయన.. అక్కడ నుంచి వచ్చేటప్పుడు రెండు కుక్క పిల్లలను ఢిల్లీలోని తన నివాసానికి తీసుకొచ్చారు. జాక్ రస్సెల్ టెర్రియర్ జాతికి చెందిన మూడు నెలల వయసు రెండు కుక్క పిల్లలను పెంచుకునేందుకు తీసుకున్నారు. కాగా బుధవారం సాయంత్రం గోవా వెళ్లిన రాహుల్ గాంధీ గురువారం ఉదయం మళ్లీ ఢిల్లీ చేరుకున్నారు. తన పర్యటనలో గోవాలోని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అమిత్ పట్కర్‌తో ఓ హోటల్లో భేటీ అయ్యారు. వచ్చే ఏడాది జరగనున్న లోక్‌సభ ఎన్నికలకు పార్టీ సన్నద్ధతపై వారితో చర్చించారు. పర్యటన ముగించుకొని మోపాలోని మనోహర్ అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్లే ముందు షేడ్స్ కెన్నెల్ అనే పెంపుడు జంతువుల విక్రయ సంస్థను సందర్మించారు. శివాని పిత్రే అనే మహిళ తన భర్తతో కలిసి నార్త్ గోవాలోని మపుస ప్రాంతంలో దీనిని నడుపుతోంది. అక్కడ జాక్ రస్సెల్ టెర్రియర్ జాతికి చెందిన ఒక మగ, ఒక ఆడ కుక్కను కొనుగోలు చేశారు. అయితే విమానయాన నిబంధనల కారణంగా ఒక కుక్కను మాత్రమే తనతో దిల్లీ తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. రాహుల్ గాంధీ విమానాశ్రయానికి బయలుదేరే ముందు కొద్దిసేపు కెన్నెల్‌లో కుక్క పిల్లలతో గడిపారని పిత్రే పేర్కొన్నారు. చదవండి: అరుదైన దృశ్యం.. విపక్షాల హామీతో సభలోకి స్పీకర్ అడుగు ఆయన అత్యంత నిరాడంబరుడని, తమతో ఓ స్నేహితుడిలా మాట్లాడారని తెలిపారు. కెన్నెల్‌లో కుక్కపిల్లలతో కలిసి రాహుల్ గాంధీ ఆడుకున్నారని చెప్పారు. రాహుల్ గాంధీ రెండు కుక్క పిల్లలను కొనుగోలు చేశారని, వీటిలో ఒక పప్పీని ఆయన ఇంటికి తీసుకెళ్లారని మరో దానిని తరువాత పంపిస్తామని శివాని తెలిపారు. ముందుగా రాహుల్ గాంధీ సిబ్బంది ఒకరు వచ్చి పప్పీల గురించి తెలుసుకున్నారని, అయితే వాటిని కొనుగోలు చేసే ముందు ఆయనే స్వయంగా వాటిని చూసేందుకు ఇక్కడికి వచ్చారని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా అజీమ్ ప్రేమ్ జీ, కరీనా కపూర్ వంటి పలువురు ప్రముఖులు ఈ జాతి కుక్కలను కొనుగోలు చేశారు. జాక్ రస్సెల్ టెర్రియర్ జాతి శునకాలకు బ్రిటన్‌లో విపరీతమైన జనాదరణ ఉంది. వీటి ఆహార్యం చిన్నగా కన్పించినా.. అవి చాలా తెలివిగా వ్యవహరిస్తాయి. 4 నుంచి 7 కిలోల బరువుండే ఈ కుక్కలు 25 సెంటీమీటర్ల దాకా ఎత్తు పెరుగుతాయి. వీటి జీవిత కాలం కూడా ఎక్కువే. రష్యాకు చెందిన మందుపాతరలు, బాంబులను పసిగట్టినందుకు ఇదే జాతికి చెందిన పీట్రన్ అనే శునకానికి ఇటీవల ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ పతకాన్ని బహూకరించారు. చదవండి: అరుదైన దృశ్యం.. విపక్షాల హామీతో సభలోకి స్పీకర్ అడుగు -
తల్లి ప్రేమకు ప్రతీక
ఒడిశా,కొరాపుట్: సృష్టిలో తల్లి ప్రేమను మించినది ఏదీ లేదు. మనుషులే కాదు జంతువులు కూడా తమ పిల్లలపై ప్రేమను చూపిస్తాయి. అందుకు ఈ చిత్రమే నిరద్శనం. స్థానిక పూజారిపుట్ రోడ్డులో బుధవారం ఉదయం బైక్ ఢీకొని ఒక కుక్కపిల్ల మృతి చెందింది. రక్తపు మడుగులో నిర్జీవంగా పడి ఉన్న శునకపు మృతదేహం వద్ద తల్లి శునకం కన్నీరు కారుస్తూ గంటల తరబడి కూర్చొంది. అది చూసిన వారంతా ఆ శునకం పడుతున్న ఆవేదనను, తల్లి ప్రేమను అర్థం చేసుకుని బాధాతప్తులయ్యారు. -
శునకాలకు వింతరోగాలు
పెద్దపల్లి, ముత్తారం(మంథని): ఒక ప్రక్క రాష్ట్రంలో కరోనా వైరస్‌తో ఇంటి నుంచి బయటకు రావడానికి ప్రజలు భయంతో వణికిపోతున్నారు. రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతుండడంతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బ్రతుకున్న తరుణంలో మండలంలో వీధుల వెంట తిరిగే కుక్కలు(శునకాలు) సైతం వింత వ్యాధులతో మృతి చెందడంతో ప్రజలు మరింత భయబ్రాంతులకు గురవుతున్నారు. మండలంలోని ఓడేడ్ గ్రామంలో వీధి కుక్కలు ఎక్కడిక్కడే కుప్పకూలుతున్నాయి. రెండు రోజులుగా గ్రామంలో సుమారుగా 12 కుక్కల వరకు రోడ్లపై కుప్పకూలి చనిపోయాయని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సోషల్‌మీడియాలో అమెరికాలోని బ్లాంక్‌జూలో పులికి కరోనా వ్యాధి వచ్చిందని వార్తలు రావడంతో కుక్కలకు కూడా ఏదైన రోగం వచ్చిందా? ఆందోళన చెందుతున్నారు. . ఈవిషయంపై పశు వైధ్యాధికారి హన్నన్‌ను వివరణ కోరగా గ్రామంలో కుక్కలు మృతిచెందాయని తమ దృష్టికి వచ్చిందని మూడు రోజుల క్రితం సోడియం హైపో క్లోరైడ్ ద్రావణంను పిచికారి చేయడంతో గ్రామంలోని గడ్డిని తిని ఇలా చనిపోయి ఉంటాయని అన్నారు. మళ్లీ కుక్కలు చనిపోతే పోస్ట్‌మార్టం చేస్తామని తెలిపారు. అ లాగే గ్రామాల్లో కుక్కలకు సరైన ఆహారం దొరకకకూడా చనిపోయి ఉంటాయని, గ్రామస్తులు భయ బ్రాంతులకు గురికావాల్సిన అవసరం లేదని అన్నారు. -
24 గంటల్లో 20 పిల్లలకు జన్మ..
లండన్ : ఇంగ్లాండ్‌లో ఓ అరుదైన ఘటన చోటుచేసుకుంది. ఓ కుక్క 24 గంటల్లో 20 పిల్లలకు జన్మనిచ్చింది. ఈ సంఘటన ఇంగ్లాండ్‌లోని స్విన్డన్లో ఆలస్యంగా వెలుగుచూసింది. స్విన్డన్ విల్ట్‌షైర్‌కు చెందిన ఆంబర్ రీస్ అనే వ్యక్తి కాలి అనే బుల్‌డాగ్‌ను పెంచుకుంటున్నాడు. గర్భంతో ఉన్న కాలి మార్చి 11 రాత్రి 7.30 గంటల ప్రాంతంలో ఓ పిల్లకు జన్మనిచ్చింది. అలా రాత్రి 12.50గంటల వరకు వరుసగా 12 పిల్లలకు జన్మనిచ్చింది. కాలి(ఎడమ) గురువారం మధ్యాహ్నం సమయానికి మరో ఎనిమిదిటికి జన్మనిచ్చింది. ఆరు పిల్లలకు మాత్రమే జన్మనిస్తుందని భావించిన ఆంబర్ ఆశ్చర్యానికి గురయ్యాడు. ఇలా ఓ కుక్క 20 పిల్లలకు జన్మనివ్వటం అరుదైన సంఘటనా పేర్కొన్నాడు. అయితే దురదృష్టవశాత్తు వీటిలో తొమ్మిది పిల్లలు మృత్యువాత పడ్డాయని, మిగిలిన 11 క్షేమంగా ఉన్నాయని తెలిపాడు. కాలి ప్రస్తుతం ఆరోగ్యంగానే ఉందని వెల్లడించాడు. -
పెంపుడు కుక్క పిల్లకూ కోవిడ్ వైరస్
న్యూఢిల్లీ : హాంకాంగ్‌లో నివసిస్తున్న యువన్నె చెవ్ హౌ యీ అనే వృద్ధురాలితోపాటు ఆమె పెంచుకుంటున్న పొమరేనియన్ జాతికి చెందిన కుక్క పిల్లకు కూడా కోవిడ్-19 (కరోనా వైరస్) సోకిందని తేలింది. హాంకాంగ్‌లో జుహాయ్ మకావో వంతెనకు సమీపంలో నివసిస్తున్న యువన్నె చెవ్కు మంగళవారం వైద్య పరీక్షలు నిర్వహించగా, ఆమెకు కోవిడ్-19 సోకినట్లు నిర్ధారణ అయింది. ఆమెను అదే రోజు సమీపంలోని నిర్భంద వైద్య శిబిరానికి తరలించారు. ఆ మరుసటి రోజు బుధవారం నాడు వైద్య అధికారులు వచ్చి ఆమె ఇంట్లో పెంచుకుంటున్న కుక్క పిల్లను తీసుకొని పోయి పరీక్షలు నిర్వహించారు. దానికి వైరస్ సోకినట్లు నిర్ధారణ అవడంతో కుక్క పిల్లను కూడా 14 రోజులపాటు నిర్భంద వైద్య శిబిరానికి తరలించారు. ఈ వార్త తెల్సిన వెంటనే హాంకాంగ్‌లో పలువురు తమ కుక్క పిల్లలకు కూడా ముందు జాగ్రత్తగా ముక్కుకు, నోటికి మాస్కులు తగిలిస్తున్నారు. కోవిడ్ సోకిన కుక్క పిల్లల నుంచి తిరిగి మనుషులకు వైరస్ సోకుతుందనడానికి తమ వద్ద ప్రస్తుతానికి ఎలాంటి ఆధారాలు లేవని వైద్యాధికారులు తెలియజేశారు. అయితే ఎందుకైనా మంచిదని వైరస్ సోకిన కుక్క పిల్లల యజమానులను కూడా పిలిపించి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నామని వారు తెలిపారు. (చదవండి: అన్ని వైరస్ల కన్నా ప్రాణాంతకం ఇదే..) చైనాలోని వుహాన్ మార్కెట్లో బయట పడిన అత్యంత ప్రమాదకర కోవిడ్-19 ఇంత వరకు కుక్కలకు, పిల్లులకు సోకినట్లు వార్తలు రాలేదు. పెంపుడు కుక్కల నుంచి యజమానులకుగానీ, యజమానుల నుంచి పెంపెడు కుక్కలకుగానీ ఈ వైరస్ సోకదని ‘యూసీ డేవిస్ స్కూల్ ఆఫ్ వెటర్నరీ మెడిసిన్’ ప్రొఫెసర్, పెంపుడు కుక్కలు, పిల్లులకు సోకే వ్యాధుల నిపుణుడైన డాక్టర్ నీల్స్ పెడర్సన్ ‘యూసీ డెవిస్ వెబ్సైట్’లో తెలియజేశారు. ఈ విషయమై హాంకాంగ్ వైద్యాధికారుల నుంచి వివరణ లేదు. (కోవిడ్ 19: ‘ఆ మాంసం తిని ఎవరూ చనిపోలేదు’) -
మా ‘కొకొ’.. పోయిందెటో!
కుషాయిగూడ: ప్రేమతో పెంచుకుంటున్న పెంపుడు శునకం అదృశ్యమైందని, దాని ఆచూకీ కనుగొనాలని బుధవారం కుషాయిగూడ పోలీసులకు ఫిర్యాదు అందింది. వివరాలు... ఏఎస్‌రావునగర్‌లోని త్యాగరాయనగర్ కాలనీకి చెందిన కల్యాణ్ వ్యాపారం చేస్తుంటారు. మూడేళ్లుగా ‘కొకొ’ అనే పెంపుడు శునకాన్ని పెంచుకుంటున్నారు. ఈ నెల 24న ఇంటి గేటు తెరిచి మళ్లీ వేయకపోవడంతో పెంపుడు కుక్క కొకొ బయటకు వెళ్లింది. దీంతో ఇంట్లోని సీసీ కెమెరాలను పరిశీలించగా ఓ వ్యక్తి కొకొను చేతుల్లోకి తీసుకుంటున్నట్లు గుర్తించారు. ఇంట్లో దిగాలుగా కొకొ పప్పీలు కాగా.. సీసీ పుటేజీ స్పష్టంగా లేదని యజమాని తెలిపారు. శునకానికి నెల రోజుల వయసు ఉన్న రెండు పప్పీలు ఉన్నాయి. వీటికి ఫీడింగ్ లేకుండాపోయింది. రెండు రోజులుగా కొకొ ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్నా ఫలితం లేక పోవడంతో పోలీసులను ఆశ్రయించారు. కొకొ ఆచూకీ తెలిస్తే 99667 77888, 80083 33777లలో సమాచారం ఇచ్చినవారికి తగిన పారితోషికం అందజేస్తామని యజమాని కల్యాణ్ తెలిపారు. -
అమ్మడం నేరం.. పప్పీల కోసం ప్రత్యేక చట్టం
ఆస్ట్రేలియాలో 6 రాష్ట్రాలు ఉంటాయి. అందులో ఒక రాష్ట్రం వెస్టర్న్ ఆస్ట్రేలియా. ఇప్పుడా వెస్టర్న్ ఆస్ట్రేలియా ఒక కొత్త చట్టం తేబోతోంది. అది కనుక అమలులోకి వస్తే ఇక ముందు ఎవరు పడితే వాళ్లు కుక్కపిల్లల్ని అమ్మడానికి లేదు. ప్రభుత్వం ఏర్పాటు చేసే కొన్ని దుకాణాలు ఉంటాయి. వాటిల్లో మాత్రమే అమ్మకాలు, కుక్కపిల్లల బ్రీడింగ్ జరుగుతాయి. వెస్ట్రర్న్ ఆస్ట్రేలియా ప్రీమియర్ (ప్రధానికి సమానమైన పదవి).. మార్క్ మెక్‌గోవన్ ఆలోచన ఇది. ‘‘కుక్కపిల్లల్ని కొంటున్న కుటుంబాలకు మనశ్శాంతిని ఇవ్వాలని సంకల్పించాం. దుకాణాలకు వెళ్లి కుక్కపిల్లల్ని కొనేటప్పుడు ఎన్నో శంకలు పీడిస్తుంటాయి. వాటి ఆరోగ్యం, వాటి పెంపకం సరిగానే ఉన్నాయా? టార్చర్ ఏమైనా పెట్టి ఉంటారా? పుష్టికరమైన ఆహారం అంది ఉంటుందా? ఇలా ఎన్నో! వాటన్నిటికీ దుకాణాలవాళ్లు చెప్పే సమాధానం ఒక్కటే. ‘ఎక్స్లెంట్’ అని! నమ్మేదెలా? అందుకే ప్రభుత్వం కుక్కపిల్లల అమ్మకాన్ని, ఉత్పత్తిని తన చేతులలోకి తీసుకోబోతోంది’’ అని ఒక ప్రకటన కూడా విడుదల చేశారు మార్క్. -
లెమన్ ఎల్లో కుక్కపిల్లను చూశారా!
ఉత్తర కరోలీనాలో వింత సంఘటన చోటు చేసుకుంది. ఓ పెంపుడు కుక్క లెమన్ ఎల్లో రంగు కుక్కపిల్లకు జన్మినిచ్చింది. నార్త్ కరోలినాకు చెందిన షానా స్టామీ అనే మహిళా తెల్లటి జర్మన్ షెపర్డ్ కుక్కను పెంచుకుంటున్నారు. దాని పేరు జిప్సీ. ఈ క్రమంలో జిప్సీ గత శుక్రవారం ఉదయం 8 కుక్క పిల్లలకు జన్మినిచ్చింది. ఈ విషయాన్ని ఆ మహిళ బుధవారం ఫేస్బుక్లో షేర్చేశారు. ‘మా జర్మన్ వైట్ షెపర్డ్ బ్రైట్ గ్రీన్ కలర్ కుక్కపిల్లకు జన్మనిచ్చింది. పేరు హల్క్.. ప్రస్తుతం దీని వయసు 5 రోజుల’ అనే క్యాప్షన్‌తో షేర్ చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ‘ దీంతో హల్కి ఫొటోలను చూసి నెటిజన్లంతా అశ్యర్యపోతూ ‘ఇట్స్ టైమ్ టూ మిస్టర్ లైమ్’, ‘వావ్ ఎంత ముద్దుగా ఉంది హల్క్. ఐ లవ్ హల్క్ కలర్’ అంటూ కామెంట్లు పెడుతున్నారు దీనిపై యాజమాని మాట్లాడుతూ.. జిప్సి శుక్రవారం ఎనిమిది కుక్కపిల్లలకు జన్మనిచ్చింది. ఇందులో నాలుగవది నియాన్ గ్రీన్ కలర్లో జన్మించడంతో నేను ఆశ్చర్యానికి లోనయ్యాను. హల్క్ నియాన్ రంగులో ఉన్నప్పటికీ మిగతా కుక్కపిల్లలాగే ఇది సంపూర్ణ ఆరోగ్యంతో ఉంది’ అని చెప్పారు. ఇక హల్క్ రంగుపై వైద్య నిపుణులు మాట్లాడుతూ.. తల్లి కుక్క గర్బంతో ఉన్నప్పుడు గామా కిరణాలు పడకపోవడం వల్ల ఇలాంటి అరుదైన సంఘటనలు జరుగుతాయని తెలిపారు. గామా కిరణాలు తగలకపోతే గర్బధారణ సమయంలో కొన్ని ద్రవాలు విడుదల అవుతాయని, ఆ ద్రవాలు వివిధ రంగుల్లో ఉండటం వల్లే పుట్టే కుక్కిపల్లలు సాధారణ రంగులో కాకుండా భిన్నమైన రంగుల్లో జన్మిస్తాయన్నారు. అందువల్లే ‘హల్క్’ నియాన్ గ్రీన్‌లో జన్మించి ఉంటుందని నిపుణులు వివరణ ఇచ్చారు. Story tonight about a German Shepherd puppy born green just days ago in Canton. Animal experts say it happens from time to time, staining from birth fluids and not harmful, fades away. This pup's human family named him "Hulk. " More at 6. @WLOS_13 #LiveOnWLOS pic.twitter.com/7ex4i2wbOI — Rex Hodge (@RexHodge_WLOS) 15 January 2020 -
కుక్కలపై ఉన్న శ్రద్ధ పిల్లలపై ఏదీ?
సాక్షి, హైదరాబాద్: ధనవంతుల కుక్క తప్పిపోతే పోలీసులు సర్వశక్తులనూ ఒడ్డి ఆ కుక్కను పట్టుకున్నారని, అదే పేద వాళ్ల పిల్లలు అదృశ్యమైతే వాళ్ల ఆచూకీ తెలుసుకునేందుకు ఆసక్తి చూపడం లేదంటూ హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం దాఖలైంది. గతేడాది జూబ్లీహిల్స్‌లో ఓ ధనవంతుడి కుక్క తప్పిపోతే పోలీసులు దర్యాప్తు చేసి పట్టుకుని యజమానికి అప్పగించారని, అయితే రాష్ట్రం లో పిల్లలు అదృశ్యమైన కేసుల్ని పోలీసులు మూసేస్తున్నారని పిల్లో పేర్కొన్నారు. పిల్లల అదృశ్యం కేసుల్ని పూర్తిస్థాయిలో విచారించేలా ప్రతివాదులకు ఆదేశాలివ్వాలని, మూసేసిన కేసుల్ని తెరిచి విచారణ చేపట్టేలా ఉత్తర్వులివ్వాలంటూ న్యా యవాది రాపోలు భాస్కర్ పిల్ దాఖలు చేశారు. దేశంలో ఆడ పిల్లల ఆక్రమ రవాణా జరుగుతోందని, 8,057 వేల పైచిలుకు కేసులు నమోదైతే.. అందులో తెలంగాణలో 229 కేసులు నమోదయ్యాయని తెలిపారు. ఇందులో 49 కేసుల్లోనే చార్జిషీటు దాఖలు చేశారన్నారు. తెలంగాణలో 2015 నుంచి 2018 మధ్య కాలంలో 2,122 మంది పిల్లలు అదృశ్యమైతే, అందులో 1,350 మంది బాలికలు ఉన్నారన్నారు. ఇంతవరకు వీరి ఆ చూకీ తెలియలేదన్నారు. పిల్లల ఆచూకీ తెలియక మనోవేదన తో కొంతమంది ఆత్మహత్యలకు పాల్పడుతు న్న ఘటనలూ ఉన్నాయన్నా రు. 2015లో 407 మంది పిల్లలు, ఆ తర్వాత మూడేళ్లలో వరసగా 474, 681, 560 మంది చొప్పున పిల్లల అదృశ్యం కేసులు నమోదైతే, వారిలో అత్యధికంగా బాలికలే 1,350 మంది ఉన్నా రని తెలిపారు. పిల్లో ప్రతివాదులుగా హోం శాఖ ముఖ్య కార్యదర్శి, డీజీపీలను చేర్చారు. క్రిమినల్ కేసుల పరిష్కారం: పెండింగ్ కేసుల పరిష్కారంలో భాగంగా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ గండికోట శ్రీదేవి 24 క్రిమినల్ పిటిషన్లు, 43 మధ్యంతర దరఖాస్తులను పరిష్కరించారని హైకోర్టు రిజిస్ట్రార్ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. -
వరాహం కుక్కపిల్లలకు పాలిచ్చి వెళుతోంది..
శింగనమల/పుట్లూరు: సహజంగా పందులు కనిపిస్తే కుక్కలు వెంటబడి తరుముతుంటాయి. అదేస్థాయిలో అసహాయ స్థితిలో ఉన్న కుక్కపిల్లలను తీవ్రంగా గాయపరిచి పందులు చంపేస్తుంటాయి. అలాంటిది జాతి వైరాన్ని మరిచి శునకం పిల్లలకు తమ స్తన్యాన్ని అందిస్తున్నాయి సుకరాలు! వివరాల్లోకి వెళితే.. శింగనమలలో వారం రోజుల క్రితం ఐదు పిల్లలకు ఓ కుక్క జన్మనిచ్చింది. ఆ తర్వాత ప్రమాదవశాత్తు తల్లి కుక్క వాహనాల కిందపడి చనిపోయింది. ఆకలి తట్టుకోలేక విలవిల్లాడుతున్న కుక్కపిల్లలను గమనించిన ఓ వరాహం.. వాటిని కరవకుండా పాలిస్తూ వస్తోంది. ఇలాంటిదే పుట్లూరు జెడ్పీ ఉన్నత పాఠశాల సమీపంలోనూ చోటు చేసుకుంది. పదిరోజులుగా ఓ వరాహం క్రమం తప్పకుండా నాలుగు కుక్కపిల్లలకు పాలిస్తోంది. అనారోగ్యం కారణంగా పిల్లలకు తల్లి కుక్క పాలు ఇవ్వడం లేదు. దీంతో ఉదయం 9 గంటలకు ఓ వరాహం అక్కడకు చేరుకుని గంట పాటు కుక్కపిల్లలకు పాలిచ్చి వెళుతోంది. -
ప్రేమ..పగ.. రెండు జీవాలు.. రెండు కుటుంబాలు
రెండు కుటుంబాలు.. అల్లారు ముద్దుగా పెరిగే రెండు శునకాలు..వారికి అవంటే ప్రాణం.. వాటిని కుటుంబ సభ్యుల్లా చూసుకుంటున్నారు.ఎక్కడికి వెళ్లినా అవి వారి వెంట ఉండాల్సిందే.. అయితే ఆ రెండు కుక్కలు కన్నుమూశాయి. విచిత్రమేమంటే ఓ కుటుంబంలోని కుక్క అనారోగ్యంతో మృతి చెందితే మరోకుటంబంలోని శునకం దాని యజమాని సోదరుడి చేతిలోదారుణహత్యకు గురైంది. తనపై దాడిచేసేందుకు యత్నించిందని ఓ కుక్కను కక్ష పెంచుకొని ఓ వ్యక్తి చంపేస్తే.. మరో కుటుంబం మాత్రం జ్ఞాపకాలను మరచిపోయేందుకు ఇంటిని కూడా మార్చేశారు. మరిచిపోలేక ఇల్లు ఖాళీ చేశారు బంజారాహిల్స్: అల్లారుముద్దుగా పెంచుకుంటున్న పెంపుడుకుక్క చనిపోవడంతో ఓ కుటుంబం ఆ జ్ఞాపకాలను మరిచిపోవడానికి ఇంటినే ఖాళీ చేసి మరో చోటికి షిఫ్ట్ అయ్యారు. శ్రీనగర్‌కాలనీలోని క్రియేటివ్ సదన్ అపార్ట్‌మెంట్స్‌లో నివసించే కామిరెడ్డి సంతోష్ అనే యువకుడు ఫిలిం ఎడిటర్‌గా పనిచేస్తున్నాడు. ఆయనతోపాటు ఆయన తల్లి లక్ష్మీపద్మావతి, తండ్రి కన్నా, సోదరి ప్రియాంక పదేళ్లుగా ఓ శునకాన్ని (లక్కీ) పెంచుకుంటున్నారు. కుటుంబసభ్యులందరికీ లక్కీ అంటే మమకారమెక్కువ. ఈ నెల 6న కుక్క అనారోగ్యానికి గురైంది. చికిత్స చేయించినా కోలుకోలేకపోగా కన్నుమూసింది. దీంతో ఆ కుటుంబం తట్టుకోలేకపోయింది. కుక్కకు పంజాగుట్టలో ఖననం చేశారు. తాజాగా దశదిన ఖర్మ కూడా నిర్వహించి వివిధప్రాంతాల్లో వందకు పైగా కుక్కలకు ఆహారం అందించారు. కుక్క భారీ ఫోటోను ఏర్పాటు చేసి నివాళి కూడా అర్పించారు. అదే ఇంట్లో ఉంటే జ్ఞాపకాలను మరిచిపోలేకపోతున్నామని భావించిన సంతోష్ రెండు రోజుల క్రితం శ్రీనగర్‌కాలనీలో ఇల్లు ఖాళీ చేసి మధురానగర్‌కి షిఫ్ట్ అయ్యారు. లక్కీని తన తల్లి వీధికుక్కల్లో చూసుకుంటున్నదని, ప్రతిరోజూ తమ వీధిలోనే తిరిగే నాలుగైదు కుక్కలకు భోజనం పెడుతుందని ఆయన తెలిపారు. కిరాతకంగా చంపేశాడు తార్నాక: తనపై కుక్క దాడి చేసేందుకు యత్నించిందని కక్షపెంచుకున్న ఓ వ్యక్తి దానిని అతి కిరాతకంగా చంపేశాడు. విచిత్రమేమంటే దానిని పెంచుకుంటోంది నిందితుడి సోదరే. ఓయూ పోలీసుస్టేషన్ పరిధిలోని లాలాపేటలో ఈ ఘటన జరిగింది. ఎస్ఐ నర్సింగరావు తెలిపిన మేరకు.. ఎన్జీఆర్ఐ ఉద్యోగి రమాదేవి తన తల్లి యాదమ్మతో కలిసి లాలాపేట వినోభానగర్‌లో నివాసముంటోంది. అదే ఇంట్లో కింద పోర్షన్లో ఆమె అన్న నాగరాజు(40)తన భార్యస్వప్న నివాసముంటున్నారు. నాలుగేళ్ల క్రితం యాదమ్మ లాలాపేటలో ఉన్న 75 చదరపు గజాల విస్తీర్ణం కలిగిన తన ఇంటిని కూతురు రమాదేవి పేరున రిజిస్ట్రేషన్ చేసింది. అప్పటినుంచి అన్నాచెల్లెళ్ల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈనెల 12న చిత్తుగా మద్యం తాగిన నాగరాజు ఇంటికివచ్చి తన చెల్లెలు, తల్లితో గొడవకు దిగాడు. వారిపై దాడికి యత్నించగా రమాదేవి పెంచుకున్న పెమేరియన్‌జాతి కుక్క అతనిపై దూకే ప్రయత్నంచేసింది. దీంతో కక్షపెంచుకున్న నాగరాజు ఈనెల 18న ఇంటిముందు కట్టేసిన కుక్క మెడపై కాలుపెట్టి నలిపి అతికిరాతంగా చంపాడు. కుక్కఅరుపులు విన్న రమాదేవి పై నుంచి వచ్చిచూడగా, నాగరాజు కుక్కను చంపిదానిపై కూర్చున్నాడు. దీంతో ఆమె కంపాసినేట్ సొసైటీ సభ్యులతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కుక్క శవాన్ని స్వాధీనంచేసుకుని పోస్టుమార్గంనిమిత్తం నారాయణగూడలోని పశువైద్యశాలకు పంపించారు. రమాదేవి ఫిర్యాదుమేరకు నాగరాజును అరెస్టు చేసి కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ నర్సింగరావు తెలిపారు. -
అరే దోస్త్.. ప్లీజ్ లేవరా !
కర్ణాటక, దొడ్డబళ్లాపురం: ఎక్కడైనా రోడ్డు ప్రమాదంలో మనిషి గాయపడ్డా, మృతి చెందినా సాటి మనిషిగా మనుషులు సాయపడకపోగా మొబైల్లో వీడియోలు తీయడం మనం చూస్తుంటాం... అలాంటి దృశ్యాలు చూసినప్పుడు మానవత్వం మంటగలిసిందని బాధపడతాం.. అయితే అలా చేయడం మనుషులకేనని తమ కుక్క జాతికి లేదని ఒకకుక్క చాటి చెప్పింది. రామనగర శివారులో అర్చకరహళ్లి వద్ద రహదారిపై అపరిచిత వాహనం ఢీకొని ఒక కుక్క మృతి చెందింది. కుక్క కళేబరం ముందు మరో కుక్క చాలాసేపు రోదిస్తూ మృతి చెందిన కుక్కను లేపడానికి శతవిధాలా ప్రయత్నించింది. దరిదాపులకు ఎవ్వరినీ రానివ్వలేదు. ఈ దృశ్యాలు స్థానికులకు కన్నీళ్లు తెప్పించాయి. -
ఓ మై డాగ్!
ఇదేదో పిల్లల వేడుకలా కాకుండా పెద్దవాళ్లు సైతం పెద్ద సంఖ్యలోనే పాల్గొంటున్నారు. అతిథులు కూడా తమ ఫ్యామిలీ ఫ్రెండ్ కోసం కానుకలు సైతం బహుకరిస్తున్నారు. బంధు మిత్రులు సపరివార సమేతంగా, తమ పెట్స్‌తో సహా అటెండ్ అవుతున్నారు. కొన్ని సందర్భాల్లో వేడుకల్లో భాగంగా పెట్స్ ర్యాంప్‌వాక్ వంటివి కూడా జోడిస్తున్నారు. సాక్షి, సిటీబ్యూరో: మన హృదయపు సింహాసశనమున శునకము తిష్ట వేసుకుని కూర్చుంది. ఒకప్పుడు కాపలా కాసే విశ్వసనీయ జంతువుగానే ఉన్నా తర్వాత నేస్తంగా మారి.. ఇప్పుడు సమస్తమైపోయింది. అందుకే దాని పుట్టిన రోజు మనకి పండుగ రోజులా చేస్తున్నారు. అందుతగ్గట్టే సిటీలో పెట్ బర్త్‌డే ఈవెంట్స్ సందడిగా జరుగుతున్నాయి. పెట్ ఫుడ్ తయారీకి పేరొందిన ‘లిలీస్ కిచెన్’ వెల్లడించిన సర్వేలో పెట్ డాగ్స్ బర్త్‌డేల పట్ల పెట్ ఓనర్స్‌లో ఆసక్తి బాగా పెరిగిందని తేలింది. దేశవ్యాప్తంగా తాజాగా నిర్వహించిన ఈ సర్వేలో 75 శాతం మంది పెట్స్ యజమానులు వాటి పుట్టినరోజు తప్పనిసరిగా జరుపుతున్నారని తేలింది. ఇందులో 58 శాతం మంది ‘హ్యాపీ బర్త్‌డే’ పాట కూడా పాడుతున్నామంటున్నారు. తమ కుటుంబంలో పెట్ కూడా ఒక భాగమని 41 శాతం మంది చెప్పగా, 14 శాతం మంద్రి మరింత ముందుకు వెళ్లి కన్నబిడ్డలతో సమానమని చెప్పారు. అంతా ఎంతో ప్రత్యేకం కేక్స్ నుంచి డ్రింక్స్ దాకా నగరంలో సిటీజనుల బర్త్‌డే వేడుకలు విలాసవంతంగా జరుగుతాయి. అయితే, తాము పెంచుకుంటున్న పెట్స్ కోసం కూడా భారీ స్థాయిలో ఖర్చు పెడుతుండడం విశేషం. అచ్చం తమ చిన్నారుల కోసం చేసినట్టే కేక్ కటింగ్, బెలూన్ డెకరేషన్, ప్రత్యేక థీమ్స్ వంటివి ఏర్పాటు చేస్తున్నారు. అంతేకాదు.. ప్రత్యేకంగా రెస్టారెంట్స్, కాఫీషాప్స్ వంటి పార్టీ ప్లేస్‌లను ఈ ఈవెంట్స్ కోసం ఎంచుకుంటున్నారు. తమ పెట్‌కి ఆ రోజు డిఫరెంట్‌గా, వెరైటీగా వస్త్రధారణ చేస్తున్నారు. మొత్తమ్మీద ఒక పూర్తి ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్ ఈవెంట్స్‌గా పెట్స్ బర్త్‌డే పార్టీస్ మారాయంటున్నారు గచ్చిబౌలిలో పెట్స్ కేఫ్ నిర్వహిస్తున్న రుచిర. కేక్స్ స్పెషల్ కూడా.. గతంలో పెట్‌కు పుట్టిన రోజు వేడుక చేయడం చాలా అరుదుగా ఉండేది. ఇప్పుడు బాగా పెరిగాయి. మా కేఫ్‌లోనే వారాని ఒకటైనా ఆ తరహా పార్టీ జరుగుతుంది. వీటిని పెట్స్ కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నాయి. ఆర్టిఫిషియల్ ఫ్లేవర్ లేకుండా పూర్తిగా ఆర్గానిక్ శైలిలో తయారయ్యే కేక్స్ వీటికి స్పెషల్. ఇక అతిథులుగా వచ్చే పెట్స్ కోసం చికెన్, మటన్, ఫిష్ వంటి ప్రత్యేక మెనూ ఉంటుంది. అలాగే డ్యాన్స్ ఫ్లోర్ కూడా రెడీ.– రుచిర, కేఫ్ డె లొకొ, పెట్స్ కేఫ్ -
రూ.10 వేల కోసం కుక్క కిడ్నాప్
కదిరి: రూ.10 వేల కోసం కుక్కను కిడ్నాప్ చేశాడో వ్యక్తి.. అనంతపురం కదిరి మండలంలో జరిగిన ఈ ఘటన స్థానికంగా ఆసక్తి కలిగించింది. సోమేష్‌నగర్‌కు చెందిన చంద్రమౌళిరెడ్డి ఓ గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకుడు. ఏడాది కిందట ఓ కుక్క పిల్లను తెచ్చి గోడౌన్ వద్ద వదిలిపెట్టాడు. అక్కడ కాపలాగా ఉన్న వెంకటేశ్ భార్య భారతి దాని బాగోగులు చూసేది. గోడౌన్‌లోని గ్యాస్ సిలిండర్లకు ఆ కుక్క కాపలాగా ఉండేది. అయితే సోమవారం ఓ వ్యక్తి బైక్‌పై వేగంగా దూసుకొచ్చి కుక్కను పట్టుకెళ్లాడు. కుక్క కిడ్నాప్‌పై గోడౌన్ యజమాని కదిరి రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. గాండ్లపెంట మండలానికి చెందిన మల్లి అనే వ్యక్తి కుక్కను తీసుకెళ్లినట్లు పోలీసుల విచారణలో తేలడంతో అతడిని అదుపులోకి తీసుకున్నారు. విచారిస్తే.. పట్టణానికి చెందిన ఓ వ్యక్తి తన ఇంటి కాపలాకు ఓ కుక్కను తెచ్చిస్తే రూ.10 వేలు ఇస్తానన్నాడని, దీంతో దానిని పట్టుకెళ్లినట్టు మల్లి చెప్పాడు. పోలీసులు అతనికి కౌన్సెలింగ్ ఇచ్చి వదిలిపెట్టారు. కుక్కను భారతికి అప్పగించారు. -
కుక్కకు పేరు పెడతావా..?
మీరు కుక్కపిల్లను పెంచుకుంటున్నారా..? ముద్దుముద్దుగా ఉందని.. ముద్దుగా పిలుచుకునేందుకు ఏదైనా పేరు పెట్టారా..? అవును అందులో కొత్తేముంది. టామీ, పప్పీ, రాకీ, రాజు, ఇలా చాలా పేర్లే పెట్టుకుంటుంటారు. అయితే చైనాలో ఓ వ్యక్తి తన పెంపుడు కుక్కకు పేరు పెట్టినందుకు కటకటాలపాలయ్యాడు. కుక్కకు పేరు పెట్టడం కూడా చైనాలో నేరమా అనుకుంటున్నారా..? అసలు కథేంటో మీరే చదివి తెలుసుకోండి. 30 ఏళ్ల బాన్ అనే వ్యక్తి తన రెండు పెంపుడు కుక్కలకు పేర్లు పెట్టాడు. అక్కడితో ఆగకుండా.. వీచాట్ సోషల్ మీడియాలో వాటి ఫొటోలతో పాటు పేర్లు కూడా పోస్ట్ చేశాడు. ఒక కుక్క పేరేమో చెన్‌గువాన్, మరో కుక్క పేరేమో షీగువాన్. ట్రాఫిక్ పోలీసులను అక్కడ షీగువాన్ అంటారట. ఆ పేర్లు కుక్కలకు పెట్టడం నిషేధం ఉందట. దీంతో పోలీసులకు తిక్కరేగి అతడిని అరెస్ట్ చేశారు. తనకు వాటికి పేర్లు పెట్టడం చట్టవ్యతిరేకమని తెలియదని, ఏదో జోక్ చేద్దామని అలా పెట్టానని పోలీసులకు చెప్పాడు. అయితే అందులో పోలీసులకు జోక్ కనిపించలేదట. అందుకే విచారణ జరిపి అతడిని అరెస్ట్ చేసి పది రోజుల పాటు కటకటాల వెనక్కి పంపారు. అందుకే ఏదైనా పని చేసేటప్పుడు ఒకటికి పది సార్లు ఆలోచించాలి.. లేదంటే ఇదిగో ఇలాగే అవుతుంది. -
బుజ్జి కుక్కకు బోలెడు కష్టం
రాష్ట్ర రాజధానిలో పెంపుడు శునకాలకు ప్రత్యేకించి పప్పీలకు ఆపదొచ్చింది. ఇంటిల్లిపాదీ అల్లారుముద్దుగా పెంచుకునే శునకాలపై మాయదారి కెనైన్ డిస్టెంపర్ వైరస్ పంజా విసురుతోంది. దీని బారినపడి పక్షం రోజులుగా హైదరాబాద్‌లో 30కిపైగా పెంపుడు కుక్కలు మరణించాయి. ఈ పరిణామం శునకాల యజమానులను ఆందోళనకు గురిచేస్తోంది. ఈ వైరస్ వేగంగా ఇతర పెంపుడు జంతువులకు వ్యాపిస్తుండటంతో వెటర్నరీ వైద్యులు హైఅలర్ట్ ప్రకటించారు. – హైదరాబాద్ ఎలా వ్యాపిస్తుంది? ఈ వైరస్ లాలాజలం, రక్తం లేదా మూత్రం ద్వారా ఒక శునకం నుంచి మరో శునకానికి వ్యాపిస్తుంది. అలాగే దగ్గు, జలుబుతోపాటు ఆహారం, మంచినీరును ఒకే గిన్నెలో పంచుకోవడం ద్వారా వైరస్ ఇతర శునకాలకు విస్తరిస్తుంది. లక్షణాలు ఏమిటి? పెంపుడు శునకాల శ్వాశకోస, జీర్ణకోశ, కేంద్ర నాడీ వ్యవస్థలను కెనైన్ డిస్టెంపర్ వైరస్ దెబ్బతీస్తుంది. జ్వరం, విరేచనాలు, వాంతులు, ఆకలి మందగించడం, దగ్గు, తుమ్ములతోపాటు కళ్లు పుసులు కట్టడం, ముక్కు నుంచి పసుపుపచ్చ ద్రవం కారడం ఈ వ్యాధి లక్షణాలు. రోగ నిరోధక శక్తి లేకే... రోగనిరోధక శక్తి తక్కువగా ఉండే పెంపుడు కుక్కల్లో కెనైన్ డిస్టెంపర్ వైరస్ ఎక్కువగా వ్యాపిస్తుంటుందని వైద్యులు చెబుతున్నారు. శునకాలకు టీకాలను సకాలంలో వేయని కారణంగా ఈ వైరస్ వచ్చే ప్రమాదం ఉందని, పెంపుడు కుక్కలకు వైరస్ రాకుండా ఉండాలంటే టీకాలు వేయించాలని సూచిస్తున్నారు. వైరస్‌ను గుర్తించాలిలా ఈ వైరస్‌కు గురైన శునకాలను గుర్తించేందుకు యజమానులు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. కొన్ని శునకాలకు పొట్టపై పొక్కుల వంటివి వస్తే వాటికి తప్పకుండా ‘కెనైన్ డిస్టెంపర్’ వైరస్ వచ్చినట్లేనని చెబుతున్నారు. ప్రధానంగా కేంద్ర నాడీ వ్యవస్థ దెబ్బతినే శునకాలు బతకడం కష్టం అంటున్నారు. ఇలాంటి శునకాలకు దవడలు, కాళ్లు పదేపదే కొట్టుకోవడం, తలపై ఫ్లూయిడ్ బంప్స్ అవ్వడం, వైబ్రేషన్‌కు గురవుతాయంటున్నారు. వైరస్ గుర్తింపునకు ప్రత్యేక కిట్.. పెంపుడు శునకాలు కెనైన్ డిస్టెంపర్ వైరస్ బారిన పడ్డాయా లేదా అని నిర్ధారించేందుకు వైద్యులు ‘డయాగ్నోస్టిక్ కిట్’తో చెకప్ చేస్తారు. ఈ టెస్ట్‌లో పాజిటివ్ వస్తే ట్రీట్మెంట్ను అదే రోజు నుంచి ప్రారంభిస్తారు. మొదటి వ్యాక్సినేషన్ ఆరు వారాల వయసు నుంచి పెంపుడు కుక్కకు ఇప్పించాలి. ఆరు వారాల అనంతరం ప్రతి నెల రెండు పర్యాయాలు, ఆ తరువాత నుంచి ప్రతి సంవత్సరం ఈ వ్యాక్సినేషన్‌ను వేయాల్సి ఉంటుంది. ఈ వ్యాక్సినేషన్‌ను ‘సెవెన్ ఇన్ వన్ లేదా నైన్ ఇన్ వన్’ అని పిలుస్తారు. ఒకటి నుంచి 20కి పెరిగిన కేసులు.. రాంనగర్‌కు చెందిన ఓ శునకం ఈ వైరస్‌బారిన పడటంతో యజమాని దాన్ని నారాయణగూడ సూపర్ స్పెషాలిటీ వెటర్నరీ హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. పెట్ని పరీక్షించిన డాక్టర్ స్వాతిరెడ్డి ఈ పెట్ కెనైన్ డిస్టెంపర్ వైరస్‌కు గురైనట్లు ధ్రువీకరించారు. కొద్దిరోజుల వ్యవధిలోనే ఈ పెట్ నుంచి మరో 19 పెట్స్‌కు వైరస్సోకింది. ఇలా ఒక్క రాంనగర్ నుంచే ఈ వైరస్‌కు గురైన పెట్స్ కేసులు 20 నమోదయ్యాయి. ఒక్క నారాయణగూడ హాస్పిటల్లోనే ఫలక్‌నుమా నుంచి 6, రామాంతపూర్ నుంచి 2 కేసుల చొప్పున మూడు నెలల వ్యవధిలో నమోదయ్యాయి. నగరవ్యాప్తంగా నెలకు 20–30 కేసులు నమోదవుతున్నట్లు వైద్యులు చెబుతున్నారు. కొన్ని రోజులకే చచ్చిపోయింది... మా ‘గోల్డెన్ రిట్రీవర్’ శునకం 4 నెలల వయసులో అనారోగ్యానికి గురవడంతో నారాయణగూడ హాస్పిటల్‌కు తీసుకెళ్లాం. పరీక్షించిన వైద్యులు కెనైన్ డిస్టెంపర్ వైరస్ సోకినట్లు చెప్పారు. కేవలం 20 రోజుల్లోనే మా పప్పీ చచ్చిపోయింది. –విక్కీ, రాంనగర్ ఇప్పటివరకు 30 కేసులను గుర్తించా... పలు సమస్యలతో బాధపడుతున్న పెట్స్‌ని హాస్పిటల్‌కు తీసుకురాగా చెక్ చేశాను. అవి కెనైన్ డిస్టెంపర్ వైరస్‌కు గురైనట్లు నిర్ధారించా. వాటికి ప్రత్యేకంగా ట్రీట్మెంట్ను అందించాల్సిన అవసరం ఉంది. వైరస్ వచ్చిన పెట్ని వేరే పెట్స్ మధ్యలో పెట్టడం కారణంగా మరో 19 పెట్స్‌కి కూడా ఈ వైరస్ సోకింది. వ్యాక్సినేషన్ సక్రమంగా ఇవ్వగలిగితే కొద్దిరోజులైనా పెట్ బతికే అవకాశం ఉంటుంది. – డాక్టర్ స్వాతిరెడ్డి, సూపర్ స్పెషాలిటీ వెటర్నరీ హాస్పిటల్, నారాయణగూడ అవగాహన అవసరం కెనైన్ డిస్టెంపర్ వైరస్ గురించి పెట్స్ యజమానుల్లో సరైన అవగాహన లేదు. కరపత్రాల ద్వారా అవగాహన కల్పించాలనుకుంటున్నాం. స్వచ్ఛంద సంస్థలు మందుకొచ్చి కొన్ని నిధులు సమకూరిస్తే అవగాహన కల్పించే పెట్స్ వైరస్‌కు గురి కాకుండా ఉండేందుకు సహకరించవొచ్చు. – డాక్టర్ ఎ. పరమేశ్వర్‌రెడ్డి, డిస్ట్రిక్ట్ వెటర్నరీ అండ్ హస్బెండరీ ఆఫీసర్ -
శునకాల యజమానులూ.. జాగ్రత్త!
ఇంట్లో కుక్క ఉన్నది జాగ్రత్త.. ఇది సాధారణంగా చాలా ఇళ్ల ముందు మనకు కనిపించే బోర్డు.. ఇరాన్ రాజధాని టెహ్రాన్ నగరంలోని వారికి మాత్రం ఇది వర్తించదు. అక్కడి వాళ్లకు ‘కుక్కలు ఉన్నాయా అయితే యజమానులు జాగ్రత్త’ అనే నినాదం బాగా సరిపోతుంది. ఎందుకంటే అక్కడి ప్రభుత్వం శునకాల యజమానులపై తీసుకునే చర్యలు వారికి ముచ్చెమటలు పట్టిస్తున్నాయి. బహిరంగ స్థలాల్లో శునకాల ప్రవేశాన్ని నిషేధిస్తూ ఇటీవల ఆ దేశ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అక్కడ ఎవరైనా కుక్కలను వీధులు, పార్కుల్లోకి తీసుకొస్తే వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతోంది. కుక్కల వల్ల తాము ప్రశాంతంగా రోడ్ల మీద తిరగలేకపోతున్నామని, భయాందోళనలకు గురవుతున్నామని ఫిర్యాదులు హోరెత్తడంతో ఈ నిర్ణయం తీసుకున్నామని స్థానిక పోలీసులు చెబుతున్నారు. దీనికి సంబంధించి పైఅధికారుల నుంచి ఆర్డర్లు కూడా వచ్చాయని.. ఇకపై ఎవరైనా రోడ్లపై కుక్కలతో కనపడితే వారికి జరిమానా విధించనున్నట్లు ప్రకటించారు. అలాగే కుక్కలను కార్లలో తీసుకువెళ్లడం పైనకూడా నిషేధం విధించినట్లు చెప్పారు. శునకాలను కార్లలో తీసుకెళ్లే కారు యజమానులపై కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఇరాన్ ప్రభుత్వ నిర్ణయంపై యజమానులు మండిపడుతున్నారు. ఎంత జరిమానా విధించినా పర్లేదని.. అవసరమైతే జైలుకు వెళ్లేందుకు కూడా వెనుకాడబోమని అంటున్నారు. ఇస్లామిక్ దేశమైన ఇరాన్లో కుక్కలను అపరిశుభ్రమైనవిగా పరిగణిస్తున్నారు. కుక్కలను పెంపుడు జంతువులుగా పరిగణించవద్దని 2010లో ఓ ఇస్లామిక్ నేత ఫత్వా జారీ చేశాడంటే శునకాలపై ఉన్న అయిష్టత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. -
త్వరలో కుక్కలతో డెలివరీ!
గల్లీలో ఓ కారాగింది. ఆ కారుకు డ్రైవర్ లేడు! అందులోంచి నాలుగు కుక్కలు గబగబా దిగాయి. దిగి నాలుగూ నాలుగు దిక్కులకు వెళ్లాయి. వాటి వెన్నుపై బ్యాగులు కూడా ఉన్నాయి. కాసేపటికి అవి మళ్లీ తిరిగొచ్చి ఆ కారులోనే కూర్చున్నాయి. ఇంతకవేం చేశాయనేగా సందేహం? హోం డెలివరీ! కస్టమర్లు ఆర్డర్ చేసిన వస్తువుల్ని డోర్‌స్టెప్ వద్ద డెలివరీ చేసే డెలివరీ డాగ్స్ అవి! ఫ్యూచర్లో డెలివరీ బాయ్స్ స్థానంలో కుక్కలొస్తాయట! అయితే, అవి నిజమైన కుక్కలు కావండోయ్. ఈ ఫొటోలో కనిపించేవి రోబో డాగ్స్, వాటి పక్కనున్నదేమో రోబో టాక్సీ. ఇలాంటి సన్నివేశం ఊహిస్తేనే గమ్మత్తుగా ఉంది కదూ? తొందర్లోనే ఈ కల నిజమయ్యే అవకాశం ఉంది. ఈ రోబోట్‌ను స్విట్జర్లాండ్‌లోని ఈటీహెచ్ జురిచ్ వర్సిటీకి చెందిన రొబిటిక్స్ ల్యాబ్ శాస్త్రవేత్తలు వీటిని అభివృద్ధి చేశారు. ఇటీవలే విజయవంతంగా ట్రయిల్ కూడా నిర్వహించారు. ఆ ట్రయిల్ వీడియోలు నెట్టింట్లో వైరల్ కూడా అయ్యాయి. త్వరలోనే ఇవి డెలివరీ డాగ్స్‌గా ప్రపంచానికి పరిచయం కాబోతున్నట్లు వారు ప్రకటించారు. 30 కిలోలుండే ఈ రోబో డాగ్స్ పది కిలోల వరకు బరువు మోయగలవు. మామూలుగా ఐదో ఫ్లోర్లో ఉన్న ఇంటికి డెలివరీ చేయాలంటే డెలివరీ బాయ్ విసుక్కుంటాడు కదా? ఈ రోబో డాగ్స్ మాత్రం ఎన్ని మెట్లున్నా ఎక్కగలవు. కృత్రిమ డోర్ బెల్‌తో సిగ్నల్ ఇచ్చి కస్టమర్‌కు వస్తువునిచ్చి.. డ్యాన్స్ చేసి వారిని సంతోష పెడతాయట! -
నూకలు ఉన్నాయి కాబట్టే !
కర్ణాటక ,యశవంతపుర : అదృష్టం ఇంటే ఇదే మరి, ఓ చిన్న కుక్కపిల్ల గురువారం రైలు పట్టాలపై నిలబడింది. ఇంతలోనే వాయు వేగంతో భారీ శబ్ధంతో ఓ రైలు వేగంగా వచ్చింది. అయినా కూడా కుక్క పిల్ల కదలకుండా రైలు పట్టాల మధ్య అలాగే ఒదిగిపోయింది. కొన్ని సెకెన్ల తరువాత మెల్లగా లేచి కుంటుకుంటు వెళ్లిపోయింది. ఈ సంఘటనను అక్కడే ఉన్న కొందరు యువకులు వీడియో తీశారు. చనిపోతుందనుకున్న శునకం అనూహ్యంగా ప్రాణాలతో బయటపడటంతో భూమి మీద ఇంకా నూకలు ఉన్నాయి అంటూ చమత్కరించారు. ఈ వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. -
పిల్లల కోసం తాచుతో పోరాటం..చివరికి!
-
పిల్లల కోసం తాచుతో పోరాటం, కానీ...
ఒడిశా : అప్పుడే పుట్టిన పప్పీలు(కుక్కపిల్లలు)... బుజ్జిబుజ్జిగా, ముద్దుముద్దుగా ఉన్న ఈ పప్పీలు... తల్లి చెంతన అటూ ఇటూ తిరుగుతూ ఆడుకుంటున్నాయి. ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు. నిజంగా ఆ పప్పీలకు యమపాశంలానే వచ్చింది ఓ పెద్ద తాచుపాము. ఎంత పెద్దగా ఉందంటే.. పప్పీలు దాన్ని చూస్తుండగానే వణికిపోయాయి. తన పప్పీలను రక్షించుకునేందుకు తల్లి, తాచుపాముతో భీకర పోరే చేసింది. తాచుపామును బయటపెట్టడానికి పెద్ద పెద్దగా అరవడం, తన పిల్లల్ని దగ్గరకు లాక్కోవడం చేసింది. దీన్ని గమనించిన స్థానికులు వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారమిచ్చారు. కానీ అటవీ శాఖ అధికారులు రావడం ఆలస్యమైంది. దురదృష్టవశాత్తు అప్పటికే జరగరానిది జరిగిపోయింది. అప్పటి వరకు తలపడిన ఆ తల్లి, చివరికి తన పప్పీలను ఆ తాచుకు బలి ఇవ్వక తప్పలేదు. నాలుగు పప్పీలను ఆ తాచు పాము తన విషపు కొరలతో కాటేసింది. పాము కాట్లకు మూడు పప్పీలు, అక్కడికక్కడే ప్రాణాలను వదిలాయి. ఒక్క పప్పీ మాత్రమే తాచుపాము కాటును తట్టుకుని మరీ, తన ప్రాణాలను కాపాడుకుంది. ఈ సంఘటన అంతా ఒడిశాలోని భద్రక్ లో చోటు చేసుకుంది. తాచు పాము, శునకం భీకర పోరు ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. -
సెలబ్రిటీలకే సెలబ్రిటీలు!
ఫొటో స్టోరీ ‘వాటితో కొంతసేపు గడిపితే మన నేచర్ మారిపోతుంది. కొంత పెడితే సంతోషిస్తాయవి. మనుషులకే ఎంత పెట్టినా చాలదు...’ పెట్స్ గురించి, అంతర్లీనంగా మనుషుల గురించి దర్శకుడు పూరి జగన్నాథ్ ఫిలాసఫీ ఇది. మనుషుల గురించి అందరికీ తెలుసు. పెట్స్ గురించి మాత్రం వాటితో గడిపినప్పుడే తెలుస్తుంది. అలా గడిపేవారికే పూరి ఫిలాసఫీలోని గాఢత అర్థం అవుతుంది. సెలబ్రిటీల జీవితంలో ఖరీదైన దుస్తులు, కార్లు, వాచీలు ఎలాగో... ఈ ఖరీదైన కుక్కపిల్లలు కూడా అలాగే! ఇంకా చెప్పాలంటే ఇవి ఆ సెలబ్రిటీలకే సెలబ్రిటీలు. ఇక్కడ ఈ సినిమా వాళ్ల గురించే కాదు... పెట్స్ గురించి కూడా చెప్పాలి. ఏ జాతివి అయితేనేం, ఏ దేశం నుంచి దిగుమతి చేసుకొన్నవైతేనేం... సృష్టిలో కెల్లా విశ్వాసం గలవి అనే జాతికి చెందినవి. తమను పెంచిపోషిస్తున్న వారిపై అపారమైన ప్రేమను కురిపిస్తాయి. పూరి జగన్నాథ్, మంచు లక్ష్మి, జయప్రద, మంచు మనోజ్‌కుమార్... తమ తమ పెట్స్‌తో మురిపెంగా ప్రేమాభిమానాలను పంచుకొంటున్నప్పుడు క్లిక్మనిపించినవి ఈ ఫోటోలు. ఇవి చాలు మూగజీవులతో అనుబంధం ఎంత ఆనందాన్నిస్తుందో చెప్పడానికి!