తప్పిపోయిన పెంపుడు శునకం కొకొ
కుషాయిగూడ: ప్రేమతో పెంచుకుంటున్న పెంపుడు శునకం అదృశ్యమైందని, దాని ఆచూకీ కనుగొనాలని బుధవారం కుషాయిగూడ పోలీసులకు ఫిర్యాదు అందింది. వివరాలు... ఏఎస్‌రావునగర్‌లోని త్యాగరాయనగర్ కాలనీకి చెందిన కల్యాణ్ వ్యాపారం చేస్తుంటారు. మూడేళ్లుగా ‘కొకొ’ అనే పెంపుడు శునకాన్ని పెంచుకుంటున్నారు. ఈ నెల 24న ఇంటి గేటు తెరిచి మళ్లీ వేయకపోవడంతో పెంపుడు కుక్క కొకొ బయటకు వెళ్లింది. దీంతో ఇంట్లోని సీసీ కెమెరాలను పరిశీలించగా ఓ వ్యక్తి కొకొను చేతుల్లోకి తీసుకుంటున్నట్లు గుర్తించారు.
ఇంట్లో దిగాలుగా కొకొ పప్పీలు
కాగా.. సీసీ పుటేజీ స్పష్టంగా లేదని యజమాని తెలిపారు. శునకానికి నెల రోజుల వయసు ఉన్న రెండు పప్పీలు ఉన్నాయి. వీటికి ఫీడింగ్ లేకుండాపోయింది. రెండు రోజులుగా కొకొ ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్నా ఫలితం లేక పోవడంతో పోలీసులను ఆశ్రయించారు. కొకొ ఆచూకీ తెలిస్తే 99667 77888, 80083 33777లలో సమాచారం ఇచ్చినవారికి తగిన పారితోషికం అందజేస్తామని యజమాని కల్యాణ్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment