
పిల్ల శునకం మృతదేహం వద్ద కూర్చొని బాధపడుతున్న తల్లి శునకం
ఒడిశా,కొరాపుట్: సృష్టిలో తల్లి ప్రేమను మించినది ఏదీ లేదు. మనుషులే కాదు జంతువులు కూడా తమ పిల్లలపై ప్రేమను చూపిస్తాయి. అందుకు ఈ చిత్రమే నిరద్శనం. స్థానిక పూజారిపుట్ రోడ్డులో బుధవారం ఉదయం బైక్ ఢీకొని ఒక కుక్కపిల్ల మృతి చెందింది. రక్తపు మడుగులో నిర్జీవంగా పడి ఉన్న శునకపు మృతదేహం వద్ద తల్లి శునకం కన్నీరు కారుస్తూ గంటల తరబడి కూర్చొంది. అది చూసిన వారంతా ఆ శునకం పడుతున్న ఆవేదనను, తల్లి ప్రేమను అర్థం చేసుకుని బాధాతప్తులయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment