పిల్లల కోసం తాచుతో పోరాటం, కానీ... | Cobra Attacking A Dog's Puppies Caught On Tape In Odisha Bhadrak | Sakshi
Sakshi News home page

పిల్లల కోసం తాచుతో పోరాటం, కానీ...

Published Thu, Sep 20 2018 11:51 AM | Last Updated on Thu, Oct 4 2018 6:03 PM

Cobra Attacking A Dog's Puppies Caught On Tape In Odisha Bhadrak - Sakshi

ఒడిశా : అప్పుడే పుట్టిన పప్పీలు(కుక్కపిల్లలు)... బుజ్జిబుజ్జిగా, ముద్దుముద్దుగా ఉన్న ఈ పప్పీలు... తల్లి చెంతన అటూ ఇటూ తిరుగుతూ ఆడుకుంటున్నాయి. ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు. నిజంగా ఆ పప్పీలకు యమపాశంలానే వచ్చింది ఓ పెద్ద తాచుపాము. ఎంత పెద్దగా ఉందంటే.. పప్పీలు దాన్ని చూస్తుండగానే వణికిపోయాయి. తన పప్పీలను రక్షించుకునేందుకు తల్లి, తాచుపాముతో భీకర పోరే చేసింది. తాచుపామును బయటపెట్టడానికి పెద్ద పెద్దగా అరవడం, తన పిల్లల్ని దగ్గరకు లాక్కోవడం చేసింది.

దీన్ని గమనించిన స్థానికులు వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారమిచ్చారు. కానీ అటవీ శాఖ అధికారులు రావడం ఆలస్యమైంది. దురదృష్టవశాత్తు అప్పటికే జరగరానిది జరిగిపోయింది. అప్పటి వరకు తలపడిన ఆ తల్లి, చివరికి తన పప్పీలను ఆ తాచుకు బలి ఇవ్వక తప్పలేదు. నాలుగు పప్పీలను ఆ తాచు పాము తన విషపు కొరలతో కాటేసింది. పాము కాట్లకు మూడు పప్పీలు, అక్కడికక్కడే ప్రాణాలను వదిలాయి. ఒక్క పప్పీ మాత్రమే తాచుపాము కాటును తట్టుకుని మరీ, తన ప్రాణాలను కాపాడుకుంది.  ఈ సంఘటన అంతా ఒడిశాలోని భద్రక్‌ లో చోటు చేసుకుంది. తాచు పాము, శునకం భీకర పోరు ఫోటోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

1
1/2

2
2/2

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement