
సాక్షి,శ్రీకాకుళం: ఆంధ్రా-ఒడిశా బోర్డర్‌లో పెద్దపులి సంచారం కలకలం రేపుతోంది. పెద్దపులి కదలికలతో సరిహద్దు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అటవీ శాఖ అధికారులు హెచ్చరించారు. కాశీబుగ్గ రేంజ్ ఫారెస్ట్ అధికారి ఏ.మురళీకృష్ణ ఆదేశాల మేరకు ఇచ్ఛాపురం మండలంలోని పలు గ్రామాలలో పులి కోసం అటవీ సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు.
ఒంటరిగా రాత్రిపూట పొలాలకు వెళ్లొద్దని గ్రామస్తులకు అటవీ అధికారులు సూచించారు.ఇటీవలే ఒడిశాలోని గంజాం జిల్లా జయంతిపురంలో యువకుడిపై పెద్దపులి దాడిచేసి తీవ్రంగా గాయపరిచింది.

ఇదీ చదవండి: AP: ఆమెకు టెర్రర్
Comments
Please login to add a commentAdd a comment