
సాక్షి, మల్కన్‌గిరి(ఒడిశా): ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్న ఒక అధికారి అమాయకురాలిని మోసం చేశాడు. కాగా, లైంగికదాడి కేసులో ఫారెస్టర్ మురళీధర్‌ని పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. ఈ ఏడాది ఏప్రిల్ నెలలో తన క్వార్టర్స్‌లోకి ఓ గిరిజన యువతిని పిలిచాడు. క్రమంగా ఆమెతో పరిచయం పెంచుకున్నాడు. నువ్వంటే ఇష్టమని పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. అతని మాయమాటకు ఆమె నమ్మింది. దీన్ని అదనుగా తీసుకొని ఆ యువతిపై పలుమార్లు లైంగికదాడికి పాల్పడ్డాడు.
అయితే, కొన్ని రోజుల తర్వాత పెళ్లి చేసుకోమనగానే అధికార ముఖం చాటేశాడు. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే, పోలీసులు గతంలోనే కేసు నమోదు చేయగా, ఇప్పుడు అతడిని పోలీసులు అదుపులోకి తీసుకుని, అరెస్ట్ చేయడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment