సాక్షి, భువనేశ్వర్ : మొత్తం విద్యార్థిలోకమే సిగ్గుతో తలదించుకునే పనిచేశారు ఒడిశాలోని కొందరు స్టూడెంట్స్. కాలేజ్ అయిన తరువాత ఇంటికి వెళుతున్న సహచర విద్యార్థిని 6 మంది మృగాళ్లు.. పట్టపగలు, పదిమంది చూస్తుండగా అత్యంత నీచంగా లైంగిక వేధింపులకు దిగారు. అక్కడే ఉన్న ఒక విద్యార్థి ఈ ఘటన మొత్తాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారిపోయింది.
ఒడిశాలోని బర్గడ్ జిల్లాలో ఈ దారుణం జరిగింది. కాలేజ్ అయిన తరువాత విద్యార్థులంతా గుంపులుగుంపులుగా ఇంటికి వెళుతున్నారు. ఈ సంయంలో ఆరుగురు మృగాళ్లు.. మొహానికి స్కార్ఫ్ అడ్డు కట్టుకుని యువతిపై లైంగిక వేధింపులకు దిగారు. మృగాళ్ల చేతినుంచి యువతి.. అత్యంత చాకచక్యంగా తప్పించుకుని పారిపోయింది.
అక్టోబర్ 4న ఈ ఘటన జరగ్గా.. చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియో సాక్ష్యంగా పోలీసులే సుమోటాగా కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. డిసెంబర్3న నలుగురు నిందుతులను అరెస్ట్ చేశారు. తాజాగా మరో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసినట్లు పోలీసులు ప్రకటించారు. ఈ ఘటనపై ఒడిశా డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ రాజేంద్ర ప్రసాద్ శర్మ మాట్లాడుతూ.. నిందితులపై ఐటీ నిరోధక, లైంగిక వేధింపులు కింద కేసు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు.
పట్టపగలు అత్యంత నీచంగా లైంగిక వేధింపులు
Comments
Please login to add a commentAdd a comment