socil media roumors
-
ఛీ..ఛీ.. వీళ్లసలు విద్యార్థులేనా?!
సాక్షి, భువనేశ్వర్ : మొత్తం విద్యార్థిలోకమే సిగ్గుతో తలదించుకునే పనిచేశారు ఒడిశాలోని కొందరు స్టూడెంట్స్. కాలేజ్ అయిన తరువాత ఇంటికి వెళుతున్న సహచర విద్యార్థిని 6 మంది మృగాళ్లు.. పట్టపగలు, పదిమంది చూస్తుండగా అత్యంత నీచంగా లైంగిక వేధింపులకు దిగారు. అక్కడే ఉన్న ఒక విద్యార్థి ఈ ఘటన మొత్తాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారిపోయింది. ఒడిశాలోని బర్గడ్ జిల్లాలో ఈ దారుణం జరిగింది. కాలేజ్ అయిన తరువాత విద్యార్థులంతా గుంపులుగుంపులుగా ఇంటికి వెళుతున్నారు. ఈ సంయంలో ఆరుగురు మృగాళ్లు.. మొహానికి స్కార్ఫ్ అడ్డు కట్టుకుని యువతిపై లైంగిక వేధింపులకు దిగారు. మృగాళ్ల చేతినుంచి యువతి.. అత్యంత చాకచక్యంగా తప్పించుకుని పారిపోయింది. అక్టోబర్ 4న ఈ ఘటన జరగ్గా.. చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియో సాక్ష్యంగా పోలీసులే సుమోటాగా కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. డిసెంబర్3న నలుగురు నిందుతులను అరెస్ట్ చేశారు. తాజాగా మరో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసినట్లు పోలీసులు ప్రకటించారు. ఈ ఘటనపై ఒడిశా డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ రాజేంద్ర ప్రసాద్ శర్మ మాట్లాడుతూ.. నిందితులపై ఐటీ నిరోధక, లైంగిక వేధింపులు కింద కేసు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు. పట్టపగలు అత్యంత నీచంగా లైంగిక వేధింపులు -
ధోని కూతురు.. సోషల్ మీడియా సెలబ్రిటీ
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని గారాల పట్టి నెట్టింట్లో సందడి చేస్తోంది. మూడేళ్ల ధోని కుమార్తె... జివా ధోని ఇప్పటికే సోషల్ మీడియాలో తనకంటూ ప్రత్యేక స్టార్డమ్ తెచ్చుకుంది. జివాకు సంబంధించిన పలు వీడియోలు ఇప్పటికే సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. తాజాగా ఈ చిన్నారి.. ఒక మలమాళం పాటను పాడుతుండగా తీసిన వీడియో ట్విటర్, ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అవుతోంది. తాజాగా జివా ధోని ‘ఒకన్కుట్టం’ మలయాళ సూపర్ హిట్ చిత్రంలోని ‘కనికుణ్ నేరమ్ కమలంతెరంటే’ అనే పాటను జివా ధోని ముద్దుముద్దగా ఆలపిస్తోంది. సోషల్ మీడియాలో పోస్ట్ అయిన ఈ వీడియోను ఇప్పటివరకూ లక్ష 60 వేలమందికి పైగానే వీక్షించారు. చిన్నారి జివా ధోనిసింగ్ పేరుతో ధోని దంపతులు ఇన్‌స్టాగ్రామ్‌లో అకౌంట్ తెరిచారు. ఈ అకౌంట్నుంచే జివాకు సంబంధించిన వీడియోలు, ఫొటోలను ధోని దంపతులు అభిమానులతో పంచుకుంటున్నారు. #unwell n yet singing away #winterishere A post shared by ZIVA SINGH DHONI (@zivasinghdhoni006) on Dec 1, 2017 at 9:30am PST -
షాగౌస్ హోటల్లో తనిఖీలు
రాయదుర్గం: ఆహారాన్ని కల్తీ చేస్తున్నారంటూ సోషల్ మీడియాలో ఆరోపణలు రావడంతో జీహెచ్ఎంసీ అధికారులు మంగళవారం హోటళ్లలో తనిఖీలు నిర్వహించారు. రాయదుర్గం ఠాణాకు సమీపంలో ఉండే షాగౌస్ హోటల్ నుంచి శాంపిల్స్ సేకరించి పరీక్షల నిమిత్తం ల్యాబ్‌కు పంపారు. వివరాలు ఇలా ఉన్నా యి. సోషల్ మీడియాలో ఆరోపణల నేపథ్యంలో ఉన్నతాధికారులు తనిఖీలకు ఆదేశించారు. జీహెచ్ఎంసీ ఫుడ్ ఇన్స్పెక్టర్ మూర్తిరాజు, వెస్ట్‌జోన్ వెటర్నీ విభాగం అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ వకీల్, సర్కిల్–11 ఏఎం హెచ్ఓ డాక్టర్ రవికుమార్, డాక్టర్ రంజిత్ హోటల్‌కు చేరుకుని ఆహార పదార్థాలను పరిశీలించారు. శాంపిల్స్‌ను సేకరించి నాచారంలోని స్టేట్ ఫుడ్ లేబరేటరీకి పంపించారు. అనంతరం హోటల్ యజమానులకు నోటీసులు జారీ చేశారు. కాగా, తాము 25 ఏళ్లుగా హోటల్ బిజినెస్‌లో ఉన్నామని, 15 సార్లు ఉత్తమ హోటల్ అవార్డులను స్వీకరించామని హోటల్ యజమాని రబ్బానీ విలేకరులతో పేర్కొన్నారు. తమ ఎదుగుదలను చూసి ఓర్వలేనివారు సృష్టించిన ఈ వదంతులను నమ్మవద్దని కోరారు. తమ హోటల్‌పై తప్పుడు వార్తలు ప్రసారం చేసిన ప్రసార మాధ్యమాలపై సైబర్ క్రైం విభాగంలోనూ, రాయదుర్గం ఠాణాలోనూ ఫిర్యాదు చేశామన్నారు. నగరంలోని పలు హోటళ్ల యజమానులు విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు. కాగా, జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో నడిచే కబేళాల నుంచి మాత్రమే మాంసాన్ని కొనుగోలు చేయాలని షాగౌస్ హోటల్ నిర్వామకులను వెటర్నిటీ సెక్షన్ అధికారులు ఆదేశించారు. ఈ మేరకు మరో నోటీసు కూడా జారీ చేశారు. అంతేకాకుండా గ్రేటర్ పరిధిలోని అన్ని హోటళ్లకు ఇలాంటి నోటీసులే జారీ చేస్తామని తెలిపారు. మాంసం కొనుగోళ్లకు సంబంధించి జీహెచ్ ఎంసీ అధికారులు జారీ చేసిన నోటీసు ఇదే...