
నగరంలో దారుణం జరిగింది. ఓ ప్రైవేటు లాడ్జిలో బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డారు.
సాక్షి, తిరుపతి: నగరంలో దారుణం జరిగింది. ఓ ప్రైవేటు లాడ్జిలో బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డారు. తిరుపతిలోని ఓ విద్యాలయంలో 9వ తరగతి చదువుతున్న బాలికపై ఓ యువకుడు లైంగిక దాడి చేశాడు.చెన్నై ఓ హోటల్లో పని చేస్తున్న ఓ యువకుడు ఆన్‌లైన్ స్నాప్ షాట్ ద్వారా బాలిక పరిచయమైంది.
బాలిక ప్రవర్తనను గమనించిన తల్లిదండ్రులు విషయం ఆరా తీయగా విషయం బయటపడింది. యువకుడిని పశ్చిమగోదావరి జిల్లా తాళ్లపూడి మండలం, మలకపల్లి గ్రామానికి చెందిన సతీష్ (22)గా గుర్తించారు. జరిగిన ఘటనపై బాలిక తల్లిదండ్రులు అలిపిరి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. నిందితుడిపై ఫోక్సోకేసు నమోదు చేసిన పోలీసులు రిమాండ్‌కు తరలించారు.