Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

Amid Trump tariffs come into effect big Cabinet meet India today Updates1
ట్రంప్‌ టారిఫ్‌.. భారత ప్రతీకార సుంకాలు అనుమానమే!

న్యూఢిల్లీ, సాక్షి: భారత్‌పై అమెరికా విధించిన పరస్పర సుంకాలు 26 శాతం నేటి నుంచే అమల్లోకి వచ్చాయి. ఈ ప్రభావంతో.. అంతర్జాతీయంగా స్టాక్‌ మార్కెట్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. అదే సమయంలో కేంద్ర ప్రభుత్వం ఇవాళ్టి కేబినెట్ భేటీని కీలకంగా భావిస్తోంది. అలాగే తాజా పరిణామాల నేపథ్యంలో సమావేశంలో తీసుకునే నిర్ణయాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. కేంద్ర కేబినెట్ సమావేశంలో.. అమెరికా , భారతీయ ఉత్పత్తులపై విధించిన సుంకాల పై కీలక చర్చ జరిగే అవకాశం కనిపిస్తోంది. ఇటీవల అమెరికా ప్రభుత్వం కొన్ని భారతీయ ఉత్పత్తులపై సుంకాలను పెంచడం పట్ల కేంద్ర ప్రభుత్వం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. మరీ ముఖ్యంగా ఉక్కు, అల్యూమినియం, ఫార్మా ఉత్పత్తులు, ఆటోపార్ట్స్‌పై సుంకాల ప్రభావం పడనుంది. ఈ క్రమంలో.. ట్రంప్‌ టారిఫ్‌ల ప్రభావం తగ్గించడానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించనున్నట్లు సమాచారం. అలాగే.. అమెరికా చర్యలు అంతర్జాతీయ వాణిజ్య ఒప్పందాలకు విరుద్ధమని భావిస్తున్న కేంద్రం.. WTO వద్ద సమస్యను లేవనెత్తే దిశగా ఆలోచనపై చర్చించే అవకాశం ఉంది. అలాగే.. ప్రతిస్పందనగా భారత్ తరఫున కొంతమేర కౌంటర్ టారిఫ్‌లు విధించాల్సిన అవసరం ఉందా? అనే దానిపై విస్తృతంగా చర్చించనుందని సమాచారం. అయితే, అవి పరస్పర ప్రతీకారంగా ఉండకూడదని కేంద్రం భావిస్తోంది. అలాంటి ఒప్పందాల దిశగా సిద్ధమవుతోందని భోగట్టా. అలాగే.. అమెరికాతో ఉన్న ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందాలపై సమీక్ష జరిపేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసే అవకాశం ఉందని సమాచారం. ఇక అమెరికా సుంకాల వల్ల ప్రభావితమవుతున్న భారతీయ ఎగుమతిదారులకు మద్దతు కల్పించేలా ఆదాయ పరంగా వెసులుబాట్లు ఇవ్వాలనే ప్రతిపాదన కేబినెట్‌ ముందుకు రానుంది. ఉద్రిక్తతలను తగ్గించే క్రమంలో అమెరికా ప్రభుత్వంతో ఉన్న చర్చలను వేగవంతం చేసే అంశంపై చర్చ జరిగే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు.. తమ దేశంపై ట్రంప్‌ 104 శాతం సుంకాల విధింపును అన్యాయంగా పేర్కొంటున్న చైనా.. అగ్రరాజ్య ప్రాధాన్యతను తగ్గించేందుకు కలిసి పనిచేద్దామంటూ భారత్‌కు ప్రతిపాదన చేసింది. అయితే కేబినెట్‌ భేటీలో చైనా ప్రతిపాదన అంశం చర్చకు వచ్చే అవకాశాలు తక్కువగా కనిపిస్తున్నాయి. ట్రంప్ విధించిన టారిఫ్‌లలో ఇప్పటికే 10 శాతం అమల్లోకి రాగా.. తాజాగా మరో 16 శాతం నేటినుంచి అమలవుతోంది. తనకు భారత ప్రధాని మోదీ గొప్ప స్నేహితుడని, అయితే భారత్‌ అమెరికాతో సరైనవిధంగా వ్యవహరించడం లేదని టారిఫ్‌ల విధింపు సందర్భంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ పేర్కొన్న సంగతి తెలిసిందే. 52 శాతం సుంకాలను విధిస్తోందన్నారు. తాము అందులో సగమే విధిస్తున్నామని ఆయన చెప్పారు.

YSRCP MP Avinash Reddy Serious Warning To TDP Leaders2
ఎవర్నీ వదిలేది లేదు.. అన్ని గుర్తు పెట్టుకుంటాం: అవినాష్‌ రెడ్డి వార్నింగ్‌

సాక్షి, వైఎస్సార్‌: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రాక్షసానందం పొందుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు వైఎస్సార్‌సీపీ ఎంపీ వైఎస్‌ అవినాష్‌ రెడ్డి. ఏపీలో వైఎస్సార్‌సీపీ కేడర్‌ వినాశమే టార్గెట్‌గా అధికారులు పని చేస్తున్నారని ఆరోపించారు. అక్రమ కేసులు పెట్టి వైఎస్సార్‌సీపీ నాయకులను అరెస్ట్‌ చేస్తున్నారు. ఎవరినీ వదిలేది లేదు.. అన్ని గుర్తు పెట్టుకుంటాం అని హెచ్చరించారు.కడపలో మాజీ డిప్యూటీ సీఎం అంజాద్‌ భాషాను ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి పరామర్శించారు. ఇటీవల ఆయన సోదరుడు అహ్మద్ భాషా ను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అంజాద్‌ భాషాను పరామర్శించి, ధైర్యంగా ఉండాలని, పార్టీ తరపున అండగా ఉంటామని హామీ ఇచ్చారు. అనంతరం, అవినాష్‌ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ..‘రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రాక్షసానందం పొందుతోంది. అభివృద్ధిపై కాకుండా వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలపై కేసులే లక్ష్యంగా పెట్టుకున్నారు.మాజీ డిప్యూటీ సీఎం అంజద్ భాష సోదరుడు అహ్మద్‌ భాషాపై అక్రమ కేసు నమోదు చేశారు. తీవ్రవాది మాదిరి ముంబై వెళ్ళి అహ్మద్ భాషాను అక్రమ అరెస్టు చేసి అత్యుత్సాహంగా కడపకి తెచారు. ఆయన అరెస్ట్ తర్వాత అంజాద్‌ భాషా ఇంటి సమీపంలో టీడీపీ నాయకులు సంబరాలు చేయడం దారుణం. కడపలో టీడీపీ నాయకులు కవ్వింపు చర్యలకు పాల్పడటం దారుణం. ఎమ్మెల్యే మాధవి రెడ్డి, జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డి దగ్గర మెప్పు పొందడానికి అధికారులు ప్రయత్నం చేస్తున్నారు. అక్రమ కేసులు, వేధింపులకు గురిచేస్తున్న ఎవరినీ వదిలేది లేదు.. అన్ని గుర్తు పెట్టుకుంటాం’ అని హెచ్చరించారు.

Jr NTR Reacts on Pawan Kalyan Son Mark Shankar Fire Accident Incident3
ధైర్యంగా ఉండు లిటిల్‌ వారియర్‌..: జూనియర్‌ ఎన్టీఆర్‌

ఆంధ్రప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan) చిన్నకుమారుడు మార్క్‌ శంకర్‌ పవనోవిచ్‌ (Mark Shankar Pawanovich) అగ్నిప్రమాదంలో గాయపడ్డ ఘటనపై హీరో జూనియర్‌ ఎన్టీఆర్‌ (Jr NTR) స్పందించాడు. సింగపూర్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో మార్క్‌ శంకర్‌ చిక్కుకున్నాడని తెలిసి ఎంతో బాధపడ్డాను. అతడు త్వరగా కోలుకోవాలి. లిటిల్‌ వారియర్‌.. ధైర్యంగా ఉండు. పవన్‌ కల్యాణ్‌ కుటుంబ సభ్యులకు బలం చేకూరాలంటూ ఎక్స్‌ (ట్విటర్‌)లో ట్వీట్‌ చేశాడు.ఏం జరిగిందంటే? పవన్‌ కల్యాణ్‌ చిన్న కుమారుడు మార్క్‌ శంకర్‌ వేసవి శిక్షణ తరగతులకు సింగపూర్‌లోని రివర్‌ వ్యాలీ రోడ్‌ ఎడ్యుకేషన్‌ సెంటర్‌కు వెళ్లాడు. ఏప్రిల్‌ 8న ఈ ఎడ్యుకేషన్‌ సెంటర్‌లో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో మార్క్‌ శంకర్‌ చేతులకు, కాళ్లకు గాయాలయ్యాయి. ఊపిరితిత్తుల్లోకి పొగ వెళ్లింది. దీంతో వెంటనే స్కూల్‌ యాజమాన్యం అతడిని ఆస్పత్రిలో చేర్పించింది. ప్రస్తుతం శంకర్‌కు బ్రాంకోస్కోపీ చేస్తున్నట్లు పవన్‌ వెల్లడించారు. తన పెద్ద కుమారుడు అకీరా పుట్టినరోజే చిన్న కుమారుడికి ఇలా జరగడం బాధాకరం అని విచారం వ్యక్తం చేశారు.Saddened to hear about Mark Shankar being caught in a fire mishap in Singapore. Wishing him a speedy recovery. Stay strong ,little warrior ! Strength and prayers to Shri @PawanKalyan garu and family.— Jr NTR (@tarak9999) April 9, 2025 చదవండి: Saptagiri: విషాదం.. బాధలో కమెడియన్ సప్తగిరి

Thopudurthi Prakash Reddy Strong Counter to Ramagiri SI Sudhakar Yadav4
ఖాకీ చొక్కా టీడీపీకి తాకట్టు.. జగన్‌ను విమర్శించే స్థాయా నీది?

అనంతపురం, సాక్షి: రామగిరి ఎస్సై సుధాకర్‌ యాదవ్‌ వ్యవహార శైలి మొదటి నుంచి వివాదాస్పదంగానే ఉందని.. ఆయనే సరిగ్గా విధులు నిర్వహించి ఉంటే కురుబ లింగమయ్య హత్య జరిగి ఉండేదా? అని ప్రశ్నిస్తున్నారు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి(Thopudurthi Prakash Reddy). మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ను ఉద్దేశించి ఎస్సై సుధాకర్‌ చేసిన కామెంట్లకు ప్రకాశ్‌రెడ్డి బుధవారం స్ట్రాంగ్‌ కౌంటర్‌ ఇచ్చారు. ‘‘ముఖ్యమంత్రి చంద్రబాబు మెప్పు కోసమే రామగిరి ఎస్సై సుధాకర్ యాదవ్(SI Sudhakar Yadav) ఇప్పుడు మాట్లాడుతున్నారు. వైఎస్ జగన్ పై ఆయన చేసిన వ్యాఖ్యలు సరికాదు. జగన్‌ను విమర్శించే స్థాయి కూడా ఎస్సై సుధాకర్ యాదవ్‌కు లేదు. వ్యక్తిగత స్వార్థం కోసమే ఆయన పని చేస్తున్నారు. తన ఖాకీ చొక్కాను టీడీపీకి తాకట్టు పెట్టారాయన. ..సుధాకర్‌ వ్యవహార శైలి మొదటి నుంచి వివాదాస్పదంగానే ఉంది. రామగిరిలో వైఎస్సార్ సీపీ కార్యకర్త కురుబ లింగమయ్య హత్యకు ఎస్సై సుధాకరే కారణం. సుధాకర్ యాదవ్ ప్రోద్బలంతోనే టీడీపీ నేతలు బరితెగిస్తున్నారు. గతంలో దళితులను ఆయన కించపరచడం నిజం కాదా?. పరిటాల సునీతకు అనుగుణంగానే పని చేయడం వాస్తవం కాదా?. అసలు ఎస్సై సుధాకర్‌ సరిగగ్గా పని చేసుంటే లింగమయ్య హత్య జరిగి ఉండేదా?. నీ ధర్మ సందేశలు ఎక్కడికి పోయాయి? ఎవరిని నమ్ముకుని ఇలా చేస్తున్నావు?.టీడీపీ నేతలకు చుట్టంగా పనిచేసేందుకా నీకు ఖాకీ చొక్కా ఇచ్చింది?.. అంటూ సుధాకర్‌ను తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి నిలదీశారు... ఎస్సై సుధాకర్ యాదవ్ అక్రమాస్తులు అనేకం ఉన్నాయి. అందుకే రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నాడు. ఎమ్మెల్యే పరిటాల సునీత ద్వారా వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ పొందాలని భావిస్తున్నాడు. కానీ, పరిటాల సునీత(Paritala Sunitha) ఇంకొకరికి టిక్కెట్ ఇప్పించే స్థాయిలో లేరన్న విషయం సుధాకర్‌ గ్రహించాలి. చంద్రబాబును ఎమ్మెల్యే పరిటాల సునీత దూషించారు. అందుకే ఆ కుటుంబానికి చంద్రబాబు వద్ద ప్రాధాన్యత లేకుండా పోయింది. పోలీసులపై అచ్చెన్నాయుడు అనుచిత వ్యాఖ్యలు కనిపించవా?. పోలీసుల పై చంద్రబాబు దూషణలు వినిపించవా?. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాపిరెడ్డిపల్లి పర్యటన సందర్భంగా పోలీసుల ఆంక్షలు ఎందుకు?. చంద్రబాబు మెప్పు కోసం పనిచేసే పోలీసులను బట్టలూడదీస్తొనన్న వైఎస్ జగన్ వ్యాఖ్యల్లో తప్పేముంది?. కురుబ లింగమయ్య ను పరిటాల సునీత సమీప బంధువులు చంపితే... వారి అనుచరులనే కేసులో సాక్షులుగా పెట్టడం కరెక్టా?అని మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి వ్యాఖ్యానించారు.

Devon Conway Scripts History Becomes 3rd Fastest to 1000 IPL Runs5
చరిత్ర సృష్టించిన డెవాన్‌ కాన్వే

చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఓపెనర్‌ డెవాన్‌ కాన్వే (Devon Conway) అరుదైన మైలురాయిని చేరుకున్నాడు. ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (IPL)లో వెయ్యి పరుగులు పూర్తి చేసుకున్నాడు. ఐపీఎల్‌-2025 (IPL 2025)లో భాగంగా పంజాబ్‌ కింగ్స్‌తో మ్యాచ్‌ సందర్భంగా ఈ న్యూజిలాండ్‌ క్రికెటర్‌ ఈ ఘనత సాధించాడు.అంతా తలకిందులుకాగా ముల్లాన్‌పూర్‌ వేదికగా మంగళవారం జరిగిన మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన పంజాబ్‌ .. సీఎస్‌కేను బౌలింగ్‌కు ఆహ్వానించింది. ఈ క్రమంలో ఓపెనర్‌ ప్రభ్‌సిమ్రన్‌ సింగ్‌ (0)ను డకౌట్‌ చేసి ముకేశ్‌ చౌదరి చెన్నైకి శుభారంభం అందించాడు. ఆ తర్వాత కాసేపటికే కెప్టెన్‌, విధ్వంసకర బ్యాటర్‌ శ్రేయస్‌ అయ్యర్‌ (9)ను ఖలీల్‌ అహ్మద్‌ పెవిలియన్‌కు పంపాడు.ఇక స్టొయినిస్‌ (4) వికెట్‌ను కూడా ఖలీల్‌ తన ఖాతాలో వేసుకోగా.. నేహాల్‌ వధేరా (9), గ్లెన్‌ మాక్స్‌వెల్‌ (1)లను రవిచంద్రన్‌ అవుట్‌ చేశాడు. అయితే, వీళ్లందరినీ తక్కువ స్కోరుకే కట్టడి చేయగలిగిన చెన్నై బౌలర్లు ఓపెనర్‌ ప్రియాన్ష్‌ ఆర్య, లోయర్‌ఆర్డర్‌ బ్యాటర్లు శశాంక్‌ సింగ్‌, మార్కో యాన్సెన్లను మాత్రం అడ్డుకోలేకపోయారు.ప్రియాన్ష్‌ 42 బంతుల్లో 103 పరుగులతో చెలరేగగా.. శశాంక్‌ 36 బంతుల్లో 52, యాన్సెన్‌ 19 బంతుల్లో 34 రన్స్‌తో అజేయంగా నిలిచారు. ఫలితంగా పంజాబ్‌ నిర్ణీత 20 ఓవరల్లో ఆరు వికెట్లు నష్టపోయి 219 పరుగుల భారీ స్కోరు సాధించింది.కాన్వే నెమ్మదిగా..లక్ష్య ఛేదనలో సీఎస్‌కే ఓపెనర్లలో రచిన్‌ రవీంద్ర కాస్త వేగంగా (23 బంతుల్లో 36) ఆడగా.. డెవాన్‌ కాన్వే మాత్రం నెమ్మదిగా ఆడాడు. 49 బంతుల్లో ఆరు ఫోర్లు, రెండు సిక్సర్ల సాయంతో 69 పరుగులు పూర్తి చేసుకున్న తర్వాత.. అతడిని రిటైర్డ్‌ అవుట్‌గా నాయకత్వ బృందం వెనక్కి పిలిపించింది.Devon Conway with his maiden fifty this season ✅Shivam Dube flexing his arms ✅#CSK puts the foot on the accelerator 📈They need another 75 runs from 30 deliveries. Updates ▶ https://t.co/HzhV1VtSRq #TATAIPL | #PBKSvCSK | @ChennaiIPL pic.twitter.com/5JLVV9wc4u— IndianPremierLeague (@IPL) April 8, 202518 పరుగుల తేడాతో ఓటమిమిగతా వాళ్లలో కెప్టెన్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌ (1) విఫలం కాగా.. శివం దూబే (42), ధోని (27) పోరాడినా ఫలితం లేకుండా పోయింది. 20 ఓవర్లు పూర్తయ్యేసరికి చెన్నై ఐదు వికెట్ల నష్టానికి 201 పరుగుల వద్ద నిలిచి ఓటమిని ఆహ్వానించింది.ఇదిలా ఉంటే.. కాన్వే పంజాబ్‌తో మ్యాచ్‌ సందర్భంగా హాఫ్‌ సెంచరీ బాది.. ఐపీఎల్‌లో వెయ్యి పరుగులు పూర్తి చేసుకున్నాడు. తద్వారా క్యాష్‌ రిచ్‌ లీగ్‌లో అత్యంత వేగంగా ఈ మార్కును చేరుకున్న మూడో క్రికెటర్‌గా చరిత్రకెక్కాడు. కాన్వే 24 ఇన్నింగ్స్‌లోనే మైలురాయిని అందుకున్నాడు. ఈ జాబితాలో షాన్‌ మార్ష్‌, లెండిల్‌ సిమ్మన్స్‌ ఈ న్యూజిలాండ్‌ బ్యాటర్‌ కంటే ముందున్నారు.ఐపీఎల్‌లో తక్కువ ఇన్నింగ్స్‌లో (ఫాస్టెస్ట్‌) వెయ్యి పరుగుల మార్కు చేరుకున్న క్రికెటర్లు1. షాన్‌ మార్ష్‌- 21 ఇన్నింగ్స్‌లో2. లెండిల్‌ సిమ్మన్స్‌- 23 ఇన్నింగ్స్‌లో3. డెవాన్‌ కాన్వే- 24 ఇన్నింగ్స్‌లో4. మాథ్యూ హెడెన్‌- 25 ఇన్నింగ్స్‌లో5. సాయి సుదర్శన్‌- 25 ఇన్నింగ్స్‌లో6. జానీ బెయిర్‌స్టో- 26 ఇన్నింగ్స్‌లో7. క్రిస్‌ గేల్‌- 27 ఇన్నింగ్స్‌లో ఈ ఘనత సాధించారు.చదవండి: హై రిస్క్‌ బ్యాటింగ్‌.. అతడు అద్భుతం.. ఆ తప్పులే మా కొంప ముంచాయి: రుతురాజ్‌ Back to winning ways this season ✅First home win this season ✅@PunjabKingsIPL compile a comprehensive 1⃣8⃣-run victory over #CSK ❤️Scorecard ▶ https://t.co/HzhV1VtSRq #TATAIPL | #PBKSvCSK pic.twitter.com/HtcXw4UYAK— IndianPremierLeague (@IPL) April 8, 2025

Donald Trump announced forthcoming tariff on pharmaceutical imports6
త్వరలో ఫార్మా ఉత్పత్తులపై ట్రంప్‌ సుంకాలు

ఔషధాల దిగుమతులపై అమెరికా త్వరలోనే భారీ సుంకం విధించనుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. నేషనల్ రిపబ్లికన్ కాంగ్రెషనల్ కమిటీ ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో ట్రంప్ ఈమేరకు వివరాలు వెల్లడించారు. ఔషధ కంపెనీలు తమ కార్యకలాపాలను అమెరికాకు మార్చుకునేలా ప్రోత్సహించడమే లక్ష్యంగా ఈ చర్య తీసుకుంటున్నట్లు తెలిపారు. గతంలో ట్రంప్ ప్రభుత్వం ఫార్మాస్యూటికల్స్, సెమీకండక్టర్లను పరస్పర టారిఫ్ పాలసీ నుంచి మినహాయించింది. కానీ తాజాగా ప్రకటనతో తిరిగి ఈ విభాగాల్లో ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి.‘మేము త్వరలోనే ఫార్మాస్యూటికల్స్‌పై సుంకాన్ని ప్రకటించబోతున్నాం. వివిధ దేశాల్లో తయారీ కార్యకలాపాలు సాగిస్తున్న కంపెనీలు తిరిగి అమెరికా వచ్చేందుకు ఈ చర్యలు ఉపయోగపడుతాయి. ఈ విభాగంలో యూఎస్‌ అతిపెద్ద మార్కెట్’ అని ట్రంప్ అన్నారు. అమెరికా ఉత్పత్తులపై భారత్ అధిక దిగుమతి సుంకాలను ఉదహరిస్తూ అమెరికా ఇటీవల భారతీయ వస్తువులపై 26 శాతం ప్రతీకార సుంకాలను ప్రకటించింది.దేశంలో ఫార్మాస్యూటికల్ ఉత్పత్తి లేకపోవడంపై ట్రంప్ చాలా కాలంగా విచారం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల వివిధ దేశాలపై ప్రతీకార సుంకాలు ప్రకటించిన సమయంలో ఫార్మా రంగాన్ని అందులో నుంచి మినహాయించారు. భవిష్యత్తులో ఏదో ఒక సమయంలో ఫార్మాస్యూటికల్స్‌పై సుంకాలు ప్రకటిస్తామని ట్రంప్ మార్చి 24న చెప్పారు. యుద్ధాలు, మరేదైనా అనిశ్చితులు తలెత్తినప్పుడు ఉక్కు, ఫార్మాస్యూటికల్స్ అవసరం ఉందన్నారు. స్టీల్‌, అల్యూమినియం, ఆటోమొబైల్స్‌పై ఇప్పటికే 25 శాతం సెక్టోరల్ టారిఫ్‌లను వర్తింపజేసిన ట్రంప్ రాగిపై కూడా వీటిని అమలు చేసే ప్రక్రియను ప్రారంభించారు. ఫార్మాస్యూటికల్ ఔషధాలతో పాటు కలప, సెమీకండక్టర్ చిప్‌లతో సహా అదనపు సెక్టోరల్ లెవీలను ఆయన ప్రభుత్వం విడిగా పరిశీలించనుంది. అయితే వీటి అమలుకు ఎంత సమయం పడుతుందో మాత్రం స్పష్టతనివ్వలేదు.భారత్‌పై ‍ప్రభావంఫార్మా దిగుమతులపై ట్రంప్ కొత్త సుంకాలను ప్రకటిస్తే అమెరికాకు అత్యధికంగా ఔషధాలను సరఫరా చేసే దేశాల్లో ఒకటైన భారత్‌పై తీవ్ర ప్రభావం పడనుంది. 2024లో దేశం ఔషధ ఎగుమతుల విలువ 12.72 బిలియన్ డాలర్లు. ఇది దేశంలో అతిపెద్ద పారిశ్రామిక ఎగుమతి రంగంగా మారింది. అమెరికా ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలో భారత ఫార్మా కంపెనీలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. 2022లో కొన్ని సర్వేల ప్రకారం యూఎస్‌లోని వైద్యులు రాసే ప్రిస్క్రిప్షన్‌తో దాదాపు 40 శాతం మందులు ఇండియాకు చెందినవే కావడం గమనార్హం.ఇదీ చదవండి: మళ్లీ బంగారం ధరలు పైకి! తులం ఎంతంటే..ఇదిలావుండగా, తైవాన్ సెమీకండక్టర్ మాన్యుఫ్యాక్చరింగ్ కంపెనీ (టీఎస్‌ఎంసీ) అమెరికాలో ప్లాంట్లను నిర్మించకపోతే 100% వరకు పన్ను విధిస్తామని ట్రంప్ బెదిరించారు. మాజీ అధ్యక్షుడు జో బైడెన్ పరిపాలనను తప్పుబట్టిన ట్రంప్ అరిజోనాలోని ఫీనిక్స్‌లో ఉన్న సెమీకండక్టర్ ప్లాంట్ కోసం టీఎస్ఎంసీ యూఎస్‌ యూనిట్‌కు 6.6 బిలియన్ డాలర్ల గ్రాంట్ ఇవ్వడాన్ని ఖండించారు.

Tamilisai Soundararajan Father Kumari Ananthan Passes Away7
మాజీ గవర్నర్‌ తమిళిసై తండ్రి కన్నుమూత

చెన్నై: తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌ ఇంట విషాద ఘటన చోటుచేసుకుంది. తమిళిసై తండ్రి, తమిళనాడు కాంగ్రెస్‌లో సీనియర్ నాయకుడు కుమారి అనంతన్(93) తుదిశ్వాస విడిచారు. వృద్ధాప్య సమస్యల కారణంగా ఆరోగ్యం విషమించడంతో అనంతన్‌ మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు.వివరాల ప్రకారం.. మాజీ గవర్నర్‌ తమిళిసై తండ్రి కుమారి అనంతన్(93) అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు. ఈ క్రమంలో అనంతన్ మృతదేహాన్ని ప్రజల సందర్శనార్థం చెన్నైలోని సాలిగ్రామంలో ఉన్న ఆమె కుమార్తె తమిళిసై సౌందరరాజన్ నివాసంలో ఉంచారు. తన తండ్రి మృతి నేపథ్యంలో తమిళిసై కన్నీటిపర్యంతమవుతున్నారు. ఈ క్రమంలో తమిళిసైని వారు బంధువులు, పలువురు రాజకీయ నేతలు పరామర్శిస్తున్నారు.Late Shri. Kumari Ananthan known to be a true Gandhian and relentless leader of the people serving as President of TN @INCIndia leaves an inspirational legacy behind. Heartfelt condolences to his daughter @DrTamilisai4BJP mam and family. Om Shanti 🙏#RIPKumariAnanthan ayya pic.twitter.com/fSXpLBKwnM— Sanam Shetty (@ungalsanam) April 9, 2025కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడిగా.. ఇక, కుమారి అనంతన్ మార్చి 19, 1933న కన్యాకుమారి జిల్లా అగతీశ్వరంలో జన్మించారు. స్వాతంత్ర్య సమరయోధుడు హరికృష్ణన్, తంగమ్మాళ్ దంపతులకు జన్మించిన ఆయన అసలు పేరు అనంతకృష్ణన్. ఆయన తమిళంలో బ్యాచిలర్ మరియు మాస్టర్స్ డిగ్రీలను సంపాదించారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన ఆయన 1977 పార్లమెంటరీ ఎన్నికల్లో నాగర్‌కోయిల్ నియోజకవర్గం నుండి పోటీ చేసి గెలిచారు. ఐదుసార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా ఎన్నికయ్యారు. 2024లో తమిళనాడు ప్రభుత్వం అనంతన్‌కు థకైసల్ అవార్డును ప్రదానం చేసింది. రాజకీయాల్లో ఎన్నో ఎదురుదెబ్బలు ఎదుర్కొన్నప్పటికీ, పట్టు వదలకుండా ప్రజాసేవలో కొనసాగించారు. అనంతన్ మృతిపట్ల పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. VIDEO | Chennai: Former Tamil Nadu Congress president Kumari Ananthan, father of BJP leader Tamilisai Soundararajan, passes away at 93 in Chennai. Ananthan's mortal remains kept at Soundararajan's residence for people to pay homage.#ChennaiNews #TamilNaduNews(Full video… pic.twitter.com/FWlA1zXe8h— Press Trust of India (@PTI_News) April 9, 2025ఇక, తాజాగా తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌.. తమిళిసై నివాసానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా అనంతన్‌ పార్థీవదేహానికి నివాళులు అర్పించారు. #WATCH | Chennai, Tamil Nadu: CM MK Stalin arrives at the residence of BJP leader Tamilisai Soundararajan to pay tribute to her fatherSenior Congress leader Kumari Ananthan, father of BJP leader Tamilisai Soundararajan, passed away at 93 due to age-related illness pic.twitter.com/srYmxCEBye— ANI (@ANI) April 9, 2025

Karnataka Yadgir district Village Fears Mangalavaram Ratri Reason Is8
మంగళవారం రాత్రి.. ఆ ఊరంతా భయం గుప్పిట

బెంగళూరు: ఎప్పటిలాగే ఆ ఊరి ప్రజలు తమ పనులు ముగించుకుని ఇళ్లకు చేరుకున్నారు. మరికొన్ని గంటల్లో నిద్రలోకి జారుకుంటారనగా.. ఊహించని పరిణామం చోటు చేసుకుంది. ఏదో విలయం సంభవించినట్లు జనం హాహాకారాలు చేస్తూ ఇళ్ల నుంచి ఉరుకులు పరుగులు తీశారు. తమను రక్షించాలంటూ గట్టి గట్టిగా కేకలు వేశారు. మంగళవారం రాత్రి.. కర్ణాటకలోని యాదగిరి జిల్లా సూర్‌పూర్‌ తాలుకా జాలిబెంచి(Jalibenchi village) అనే మారుమూల గ్రామాన్ని భయం గుప్పిట ఉంచింది. విద్యుత్‌ సరఫరాలో షార్ట్‌ సర్క్యూట్‌తో చెలరేగిన మంటలే అందుకు కారణం.విద్యుత్‌ సరఫరాలో కలిగిన అంతరాయం.. ఏకంగా ఒక ఊరినే వణికించింది. మంగళవారం రాత్రి జాలిబెంచి పరిసర ప్రాంతాల్లో బలంగా ఈదురు గాలులు వీచాయి. ఈ ప్రభావంతో కరెంట్‌ వైర్లు ఒకదానికొకటి రాజుకుని.. షార్ట్‌ సర్క్యూట్‌ చోటు చేసుకుంది. అలా మంటలు రాజుకున్నాయి. చాలా ఇళ్లలో స్విచ్‌ బోర్డులు, టీవీలు, ఫ్రిడ్జిలు కాలిపోయాయి. సెల్‌ఫోన్లు పేలిపోయాయి. కరెంట్‌ స్తంభాల నుంచి వైర్లు ఇళ్ల పైకప్పుల మీద తెగి పడడంతో మంటలు అంటుకున్నాయి. ఈ పరిణామాలతో భీతిల్లిన ప్రజలు ప్రాణాలను అరచేత పట్టుకుని పరుగులు తీశారు. కొందరు ఆ గందరగోళంలోనూ తమ ఫోన్లకు పని చెప్పారు.సమాచారం అందుకున్న అత్యవసర సిబ్బంది గ్రామానికి చేరుకున్నారు. గ్రామానికి విద్యుత్‌ సరఫరా చేసే సబ్‌స్టేషన్‌లో విద్యుత్‌ నిలిపివేశారు. అప్పటికే అక్కడికి చేరుకున్న ఫైర్‌ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఎక్కడపడితే అక్కడ వేలాడుతున్న తీగలను పక్కకు జరిపారు. ఈ బీభత్సంలో ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయని.. అయితే వాళ్లకు వచ్చిన ప్రమాదమేమీ లేదని వైద్యులు తెలిపారు. ఈ ఘటనతో వణికిపోయిన ప్రజలు రాత్రంతా ఇళ్ల బయటే కంటి మీద కునుకు లేకుండా గడిపారు.సుమారు వంద ఇళ్లకు నష్టం వాటిల్లినట్లు అధికారులు ప్రకటించారు. సమాచారం అందుకున్న గులబర్గ ఎలక్ట్రిసిటీ సప్లై కంపెనీ సిబ్బంది గ్రామానిక చేరుకున్నారు. ఈ ఉదయం నుంచి లైన్లను పునరుద్ధరించే పనిని చేపట్టారు. తమ గ్రామానికి కరెంట్‌ సరఫరా కోసం వైర్లు దశాబ్దాల కిందటివని, ఆ కారణంగానే ఇంతటి ప్రమాదం జరిగిందని, ఇప్పటికైనా అధికారులు స్పందించి మార్పులు చేయాలని కోరుతున్నారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించి వీడియో వైరల్‌ అవుతోంది.Shocking, terrible video!!A tragic incident unfolded in Jalibenchi village of Surpur taluk on Tuesday around 6 PM, as powerful winds caused an electricity-related accident, plunging the area into chaos and fear.Cc @OfficialGescom pic.twitter.com/VCQXLqQymW— Nishkama_Karma (@Nishkama_Karma1) April 8, 2025

England Beauty Pageant Queens Judged On CPR Skills In Swimwear Round9
అందాల పోటీలో 'సీపీఆర్‌' స్కిల్‌ టెస్ట్‌..!

అందాల పోటీలు అనగానే ఏముంటాయి. వారి ఫిట్‌నెస్‌, విలక్షణమైన ఫ్యాషన్‌ వంటి పోటీలు నిర్వహిస్తారు. చివరగా వారిలో దాతృత్వం గుణాలు కొద్దిమొత్తంలోనైనా ఉన్నాయా..?. వారి దృష్టిలో అందం అంటే భౌతికమైనదే అనే తరహాలో ముఖాముఖి పరీక్షలు ఉంటాయి. కానీ అందానికి కూడా ఓ పర్పస్‌ ఉండాలంటూ వినూత్నంగా నిర్వహించేలా సరికొత్త పోటీకి తెరతీసింది ప్రపంచ సుందరీగా టైటిల్‌ని గెలుచుకున్నా మిల్లా మాగీ. ప్రతిసారిలా ఓ మూసధోరణిలో పోటీలు కాకుండా గొప్ప స్కిల్‌తో కూడిన పోటీ ఉండాలంటోంది. అందానికి కూడా ఓ అర్థం, పరమార్థం ఉండాలంటోంది. కేవలం కళ్లప్పగించి చూస్తుండిపోయేలా.. వావ్‌! అని ఆశ్యర్యచకితులని చేసేది అందం కానే కాదంటోదామె. ఇంతకీ ఇదంతా ఎక్కడంటే..మిస్‌వరల్డ్‌ ఇంగ్లాండ్‌ పోటీలో ఈ సరికొత్త రౌండ్‌ కాంపిటీషన్‌ని కండక్ట్‌ చేయనున్నట్లు సమాచారం. ఇది మిస్ వరల్డ్ ఇంగ్లాండ్ టైటిల్ హోల్డర్ మిల్లా మాగీ ఆలోచన నుంచి వచ్చిందట. పోటీలను అధునికరించేలా ప్రభావవంతమైన నైపుణ్యాలు కూడా ఉండాలన్న ఉద్దేశ్యంతో ఈ సీపీఆర్‌ స్కిల్‌ని ప్రవేశ పెట్టారు. అందాల పోటీల్లో సాధారణంగా ఉండే అన్ని రౌండ్ల పోటీలు ఉంటాయి. అయితే చివరి రౌండ్‌లో పోటీదారులకు మాత్రం సీపీఆర్‌ స్కిల్‌టెస్ట్‌ నిర్వహిస్తారు. అంతేగాదు మిస్‌ ఇంగ్లాండ్‌ పోటీలో సెమీ ఫైనల్‌కు చేరుకున్న పోటీదారులంతా ఇంగ్లాండ్ అంతటా నగరాల్లో సిపిఆర్ ఎలా చేయాలో పిల్లలకు బోంధించే కార్యక్రమాల్లో పాల్గొన్సాల్సి ఉంటుంది. ఫైనల్‌కి చేరుకున్న సుందరీమణులకు స్విమ్‌ రౌండ్‌లో ఈ సీపీఆర్‌ టెస్ట్‌ని నిర్వహించడం జరుగుతుంది. అలాగే మన భారత్‌లోని హైదరాబాద్‌లో జరగనున్న 72వ మిస్‌ వరల్డ్‌పోటీల్లో కూడా ఈ రౌండ్‌ ప్రాముఖ్యతపై అవగాహన కల్పించనున్నట్లు మిల్లా మాగీ ఇన్‌స్టాగ్రాంలో పేర్కొంది. మాగీ దీన్ని తన బ్యూటీ విత్‌ పర్పస్‌ అనే ప్రాజెక్ట్‌లో భాగంగా ఈ పోటీని నిర్వహిస్తున్నారు. ఈ పోటీ ఎందుకంటే..మిల్లా మాగీ తన తాతలు, తండ్రులను ఈ సీపీఆర్‌ స్కిల్‌ తెలియకే కాపాడుకోలేకపోయారట. తమ కుటుంబంలో ఎవ్వరికీ దీనిపై అంత అవగాహన గానీ నిర్వహించడం గానీ తెలియకపోవడంతో అంతటి విషాదాన్ని చవిచూడాల్సి రావడంతో ఇలా ప్రాజెక్టు చేపట్టి మరీ అవగాహన కల్పిస్తోందామె. ఒక రకంగా పోటీదారులంతా ఈ కాంపిటీషన్‌ కోసం అయినా..సీపీఆర్‌ స్కిల్‌ గురించి తెలుసుకుంటారు. ఎలా చేయాలో ఆన్‌లైన్‌ సెషన్‌లు లేదా వ్యక్తిగత వైద్య నిపుణులను సంప్రదించి నేర్చుకునే యత్నం చేస్తారంటోందిఈ బ్యూటీ క్వీన్‌.ఇక మాగీ ఇంగ్లాండ్‌లోని పాఠశాలల్లో సిపిఆర్ శిక్షణను తప్పనిసరి చేయాలంటూ పోరాటం చేస్తోంది. "గో విత్ సిపిఆర్" అనే నినాదంతో ప్రాణాపాయ స్థితిలోని వ్యక్తుల రక్షించడం ఎలా అనేదానిపై విద్యార్థులకు అవగామన కల్పిస్తోంది. ఈ నినాదం ఓ రేంజ్‌లో ఊపందుకుంది. ఎంతలా అంటే.. ప్రిన్స్ విలియం సైతం ఆమెకు మద్దతు తెలిపారు. తెలంగాణలో జరగనున్న 72వ మిస్ వరల్డ్ ఇన్ ఇండియా పోటీ డైరెక్టర్‌ ఎంజీ బిస్లీ కూడా ఆమెను ప్రోత్సహిస్తూ ఓ లేఖను కూడా పంపారు. పైగా ఆమె వల్లే తాను ఈ సీపీఆర్‌ చేయడం నేర్చుకున్నాని అన్నారు. ఆమె ప్రాజెక్టు వైవిధ్యాన్ని తెలంగాణలో జరుగుతున్న మిస్‌ వరల్డ్‌ పోటీదారులకు తెలియజేస్తానన్నారు. ప్రాణాలను రక్షించే ఈ నైపుణ్యం ఎంత గొప్పదో తెలియజేసే.. స్విమ్‌పోటీకి వారంతా ముందుకొచ్చేలా చేస్తానన్నారు. అంతేగాదు ఈ ఏడాది అందాల పోటీల్లో ఇదే హైలెట్‌గా ఉంటుందని అన్నారు బీస్లీ. చివరగా మాగీ మాట్లాడుతూ.. అందానికి ఒక ప్రయోజనం ఉండాలని చేపట్టిన ఈ ప్రాజెక్టు ఇంతలా అందర్నీ హత్తుకునేలా ఊపందుకోవడం మాటల్లో చెప్పలేనంత సంతోషంగా ఉందని అంటోందామె. View this post on Instagram A post shared by Milla Magee (@milla.magee__) (చదవండి: Coconut Fiber Matress: భలే భూవస్త్రం..! పర్యావరణ హితం కూడా..జస్ట్‌ ఐదేళ్లలో..)

home loan emi reducing due to rbi repo rate cut10
ఆర్‌బీఐ తాజా నిర్ణయం.. గృహ రుణంపై ఊరట

భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌(ఆర్‌బీఐ) రెపో రేటు 25 బేసిస్‌ పాయింట్లు తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. ఈ నిర్ణయంతో గృహ, వాహన, వ్యక్తిగత, కార్పొరేట్‌ రుణాలపై వడ్డీ రేట్లు దిగిరానున్నాయి. దీంతో ఈఎంఐల భారం తగ్గనుంది. గత ఐదేళ్లుగా ఆర్‌బీఐ రెపో రేటును స్థిరంగా ఉంచింది. 2025 ఫిబ్రవరిలో చాలాకాలం తర్వాత 25 పాయింట్లు తగ్గించింది. మరోసారి తాజాగా మరో 25 పాయింట్లు తగ్గుస్తున్నట్లు తెలిపింది. దాంతో ప్రధానంగా అధిక కాలం ఈఎంఐలు కొనసాగే గృహ రుణ గ్రహీతలకు ఇది బంపర్‌ అవకాశమనే చెప్పొచ్చు. అటు మందగమనంతో ఆశగా ఎదుచుచూస్తున్న రియల్‌ ఎస్టేట్‌ రంగానికి కూడా తాజా తగ్గింపు తగిన బూస్ట్‌ ఇస్తుందని పరిశ్రమ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.గృహ రుణంపై ఊరట ఎంతంటే..?ఒక వ్యక్తి తాజా రెపో రేటు కోతకు ముందు 8.75 శాతం వడ్డీ రేటుతో 20 ఏళ్ల కాలానికి రూ.25 లక్షల ఇంటి రుణం తీసుకున్నారనుకుందాం. అతనికి ప్రస్తుతం రూ.22,093 చొప్పున నెలవారీ వాయిదా (ఈఎంఐ) పడుతుంది. ఆర్‌బీఐ తాజా పావు శాతం రేటు కోత నేరుగా బ్యాంకులు వర్తింపజేస్తే.. గృహ రుణంపై వడ్డీ రేటు 8.5 శాతానికి తగ్గుతుంది. దీని ప్రకారం ఈఎంఐ రూ.21,696కు దిగొస్తుంది. అంటే నెలకు రూ.397 తగ్గినట్లు లెక్క. మిగతా రుణ వ్యవధిలో ఇతరత్రా ఎలాంటి మార్పులు జరగకుండా ఉంటే, దీర్ఘకాలంలో రుణ గ్రహీతకు రూ.95,280 వేలు మిగులుతాయి. ఒకవేళ అదే ఈఎంఐ మొత్తాన్ని కొనసాగిస్తే.. రుణ కాల వ్యవధి 10 నెలలు తగ్గుతుంది.ఇదీ చదవండి: ఆర్‌బీఐ మరోసారి వడ్డీరేట్లపై కీలక నిర్ణయంరెపో రేటు అంటే..రెపో రేటు అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) వాణిజ్య బ్యాంకులకు ఇచ్చే రుణాలపై వసూలు వేసే వడ్డీ రేటు. రెపో రేటు పూర్తి రూపం రీపర్చేజ్ అగ్రిమెంట్ లేదా రీపర్చేజింగ్ ఆప్షన్. బ్యాంకులు అర్హత కలిగిన సెక్యూరిటీలను అమ్మడం ద్వారా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) నుంచి రుణాలు పొందే అవకాశం ఉంటుంది. మార్కెట్‌లో డబ్బు ప్రవాహాన్ని నియంత్రించడానికి, పెంచడానికి కేంద్ర బ్యాంకు రెపో రేటును ఉపయోగిస్తుంది. ద్రవ్యోల్బణం మార్కెట్‌పై ప్రభావం చూపినప్పుడు ఆర్‌బీఐ రెపో రేటును పెంచుతుంది.

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement
Advertisement