పిల్లలతో కాలి
లండన్ : ఇంగ్లాండ్‌లో ఓ అరుదైన ఘటన చోటుచేసుకుంది. ఓ కుక్క 24 గంటల్లో 20 పిల్లలకు జన్మనిచ్చింది. ఈ సంఘటన ఇంగ్లాండ్‌లోని స్విన్‌డన్‌లో ఆలస్యంగా వెలుగుచూసింది. స్విన్‌డన్ విల్ట్‌షైర్‌కు చెందిన ఆంబర్ రీస్ అనే వ్యక్తి కాలి అనే బుల్‌డాగ్‌ను పెంచుకుంటున్నాడు. గర్భంతో ఉన్న కాలి మార్చి 11 రాత్రి 7.30 గంటల ప్రాంతంలో ఓ పిల్లకు జన్మనిచ్చింది. అలా రాత్రి 12.50గంటల వరకు వరుసగా 12 పిల్లలకు జన్మనిచ్చింది.
కాలి(ఎడమ)
గురువారం మధ్యాహ్నం సమయానికి మరో ఎనిమిదిటికి జన్మనిచ్చింది. ఆరు పిల్లలకు మాత్రమే జన్మనిస్తుందని భావించిన ఆంబర్ ఆశ్చర్యానికి గురయ్యాడు. ఇలా ఓ కుక్క 20 పిల్లలకు జన్మనివ్వటం అరుదైన సంఘటనా పేర్కొన్నాడు. అయితే దురదృష్టవశాత్తు వీటిలో తొమ్మిది పిల్లలు మృత్యువాత పడ్డాయని, మిగిలిన 11 క్షేమంగా ఉన్నాయని తెలిపాడు. కాలి ప్రస్తుతం ఆరోగ్యంగానే ఉందని వెల్లడించాడు.
Comments
Please login to add a commentAdd a comment