పప్పీల కోసం ప్రత్యేక చట్టం
ఆస్ట్రేలియాలో 6 రాష్ట్రాలు ఉంటాయి. అందులో ఒక రాష్ట్రం వెస్టర్న్ ఆస్ట్రేలియా. ఇప్పుడా వెస్టర్న్ ఆస్ట్రేలియా ఒక కొత్త చట్టం తేబోతోంది. అది కనుక అమలులోకి వస్తే ఇక ముందు ఎవరు పడితే వాళ్లు కుక్కపిల్లల్ని అమ్మడానికి లేదు. ప్రభుత్వం ఏర్పాటు చేసే కొన్ని దుకాణాలు ఉంటాయి. వాటిల్లో మాత్రమే అమ్మకాలు, కుక్కపిల్లల బ్రీడింగ్ జరుగుతాయి. వెస్ట్రర్న్ ఆస్ట్రేలియా ప్రీమియర్ (ప్రధానికి సమానమైన పదవి).. మార్క్ మెక్‌గోవన్ ఆలోచన ఇది. ‘‘కుక్కపిల్లల్ని కొంటున్న కుటుంబాలకు మనశ్శాంతిని ఇవ్వాలని సంకల్పించాం. దుకాణాలకు వెళ్లి కుక్కపిల్లల్ని కొనేటప్పుడు ఎన్నో శంకలు పీడిస్తుంటాయి. వాటి ఆరోగ్యం, వాటి పెంపకం సరిగానే ఉన్నాయా? టార్చర్ ఏమైనా పెట్టి ఉంటారా? పుష్టికరమైన ఆహారం అంది ఉంటుందా? ఇలా ఎన్నో! వాటన్నిటికీ దుకాణాలవాళ్లు చెప్పే సమాధానం ఒక్కటే. ‘ఎక్స్‌లెంట్’ అని! నమ్మేదెలా? అందుకే ప్రభుత్వం కుక్కపిల్లల అమ్మకాన్ని, ఉత్పత్తిని తన చేతులలోకి తీసుకోబోతోంది’’ అని ఒక ప్రకటన కూడా విడుదల చేశారు మార్క్.
Comments
Please login to add a commentAdd a comment