Western Australia
-
ఒక్క పరుగు.. 8 వికెట్లు.. కుప్పకూలిన డిఫెండింగ్ చాంపియన్
ఆస్ట్రేలియా దేశీ టోర్నీ వన్డే కప్‌లో వెస్టర్న్ ఆస్ట్రేలియాకు ఊహించని పరాభవం ఎదురైంది. టాస్మానియాతో మ్యాచ్‌లో 52 పరుగుల వద్ద కేవలం రెండు వికెట్లు కోల్పోయిన ఈ జట్టు.. ఈ స్కోరుకు కేవలం ఒక్క పరుగు జతచేసి మిగిలిన ఎనిమిది వికెట్లు నష్టపోయింది. ఆ ఒక్క రన్ కూడా వైడ్ రూపంలో విశేషం. మరి డిఫెండింగ్ చాంపియన్ వెస్టర్న్ ఆస్ట్రేలియాకు ఇంత భారీ షాకిచ్చిన ఆ బౌలర్లు ఎవరంటే?!లిస్ట్-ఏ మ్యాచ్‌లో భాగంగా టాస్ గెలిచిన టాస్మానియా కెప్టెన్ జోర్డాన్ సిల్క్.. వెస్టర్న్ ఆస్ట్రేలియాను తొలుత బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. ఈ క్రమంలో ఓపెనర్ ఆరోన్ హార్డీ(7)ని పేసర్ టామ్ రోజర్స్ అవుట్ చేయగా.. మరో ఓపెనర్ ఆర్సీ షార్ట్(22) వికెట్‌ను బ్యూ వెబ్‌స్టర్ పడగొట్టాడు. వన్‌డౌన్ బ్యాటర్ బాన్‌క్రాఫ్ట్(14) వికెట్ కూడా తన ఖాతాలో వేసుకన్నాడు. ఈ క్రమంలో వెస్టర్న్ ఆస్ట్రేలియా 15 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 49 పరుగులు చేసింది. అయితే, ఆ తర్వాతి ఓవర్ నుంచే టాస్మానియా స్పిన్నర్ బ్యూ వెబ్‌స్టర్ తన మ్యాజిక్ మొదలుపెట్టాడు. 16వ ఓవర్లో రెండు వికెట్లు తీయగా.. వెస్టర్న్ ఆస్ట్రేలియా స్కోరు 52-4గా మారింది. ఇక ఆ తర్వాత వెబ్‌స్టర్ వెనుదిరిగి చూడలేదు. పేసర్ బిల్లీ స్టాన్‌లేక్‌తో కలిసి.. కట్టుదిట్టమైన బౌలింగ్‌తో ప్రత్యర్థి జట్టు బ్యాటర్లకు దిమ్మతిరిగేలా షాకిస్తూ వరుసగా పెలివియన్‌కు పంపాడు.వెస్టర్న్ ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ 17వ ఓవర్లో బిల్లీ స్టాన్లేక్ రెండు వికెట్లు కూల్చగా.. 18వ ఓవర్ ఆఖరి బంతికి వెబ్‌స్టర్ తనఖాతాలో మరో వికెట్ జమచేసుకున్నాడు. అదే విధంగా.. 20వ ఓవర్లో మరో రెండు వికెట్లు తీసిన ఈ రైటార్మ్ ఆఫ్ బ్రేక్ స్పిన్నర్.. ఆ మరుసటి ఓవర్లో పదో వికెట్‌ను కూల్చాడు. దీంతో వెస్టర్న్ ఆస్ట్రేలియా 20.1 ఓవర్లలో 53 పరుగులకే ఆలౌట్ అయింది.ఈ క్రమంలో 28 బంతుల వ్యవధిలో వైడ్ రూపంలో ఒక్క పరుగు పొంది.. వెస్టర్న్ ఆస్ట్రేలియా ఏకంగా ఎనిమిది వికెట్లు కోల్పోవడం గమనార్హం. ఇక 53 పరుగులకే చాప చుట్టేసిన వెస్టర్న్ ఆస్ట్రేలియా వన్డే కప్ చరిత్రలో రెండో అత్యల్ప స్కోరు నమోదు చేసింది.మరోవైపు.. స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన టాస్మానియా కేవలం 8.3 ఓవర్లలో మూడు వికెట్లు నష్టపోయి 55 పరుగులు చేసింది. వెస్టర్న్ ఆస్ట్రేలియాపై ఏడు వికెట్ల తేడాతో జయభేరి మోగించింది. ఆరు వికెట్లతో చెలరేగిన బ్యూ వెబ్‌స్టర్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. ఇక వెస్టర్న్ ఆస్ట్రేలియా బ్యాటర్లలో ఓపెనర్ ఆర్సీ షార్ట్ 22 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. చదవండి: IND vs NZ 2nd Test: చెత్త షాట్ ఆడి క్లీన్ బౌల్డ్ అయిన కోహ్లి -
శతక్కొట్టిన టర్నర్.. వెస్ట్రన్ ఆస్ట్రేలియా ఖాతాలో 17వ షెఫీల్డ్ షీల్డ్ టైటిల్
వెస్ట్రన్ ఆస్ట్రేలియా.. షెఫీల్డ్ షీల్డ్ 2022-23 టైటిల్‌ను 17వ సారి సొంతం చేసుకుంది. విక్టోరియాతో జరిగిన ఫైనల్లో వెస్ట్రన్ ఆస్ట్రేలియా 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఆట నాలుగో రోజైన ఇవాళ (మార్చి 26) విక్టోరియా నిర్ధేశించిన 91 పరుగుల లక్ష్యాన్ని వెస్ట్రన్ ఆస్ట్రేలియా వికెట్ కోల్పోయి ఛేదించింది. కెమారూన్ బాన్‌క్రాఫ్ట్ (39), టీగ్ వైల్లీ (43) వెస్ట్రన్ ఆస్ట్రేలియాను విజయతీరాలకు చేర్చారు. Western Australia clinched their 17th #SheffieldShield title with a thumping nine-wicket win over Victoria! Full recap from @ARamseyCricket at the WACA + full highlights 👇https://t.co/uAEk4nL5CL — cricket.com.au (@cricketcomau) March 26, 2023 ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన విక్టోరియా తొలి ఇన్నింగ్స్‌లో 195 పరుగులకు ఆలౌట్ కాగా.. వెస్ట్రన్ ఆస్ట్రేలియా తమ తొలి ఇన్నింగ్స్‌లో 315 పరుగులు సాధించి 120 పరుగుల తొలి ఇన్నింగ్స్ లీడ్‌ను దక్కించుకుంది. విక్టోరియా తొలి ఇన్నింగ్స్‌లో ఆష్లే చంద్రసింఘే (46) టాప్ స్కోరర్‌గా నిలువగా.. వెస్ట్రన్ ఆస్ట్రేలియా ఇన్నింగ్స్‌లో ఆస్టన్ టర్నర్ (128) సెంచరీతో కదం తొక్కాడు. What a way to go back-to-back!! Western Australia are the 2022-23 #SheffieldShield champions! #PlayOfTheDay | @MarshGlobal pic.twitter.com/gdsFuNWgqb — cricket.com.au (@cricketcomau) March 26, 2023 అనంతరం విక్టోరియా రెండో ఇన్నింగ్స్‌లోనూ విఫలమై 210 పరుగులకే చాపచుట్టేసి, వెస్ట్రన్ ఆస్ట్రేలియా ముందు 91 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఉంచింది. దీన్ని వెస్ట్రన్ ఆస్ట్రేలియా ఆటగాళ్లు వికెట్ మాత్రమే కోల్పోయి ఆడుతూ పాడుతూ ఛేదించారు. ఈ మ్యాచ్‌లో వెస్ట్రన్ ఆస్ట్రేలియా వికెట్‌కీపర్ జోష్ ఫిలిప్స్ తొలి ఇన్నింగ్స్‌లో ఆరుగురిని, రెండో ఇన్నింగ్స్‌లో ఇద్దరిని ఔట్ చేయడంలో భాగం కావడం విశేషం. -
T20 World Cup: ఓటమితో ముగిసిన ‘సాధన’
పెర్త్: టి20 ప్రపంచకప్ అధికారిక వామప్ మ్యాచ్‌లకు ముందు రెండు ప్రాక్టీస్ మ్యాచ్‌లు ఆడిన భారత జట్టు మిశ్రమ ఫలితాలు సాధించింది. సోమవారం వెస్ట్రన్ ఆస్ట్రేలియాపై తొలి మ్యాచ్‌లో గెలిచిన భారత జట్టు గురువారం అదే జట్టుతో జరిగిన రెండో మ్యాచ్‌లో ఓటమిపాలైంది. బౌన్సీ పిచ్ ఉండే ‘వాకా’ మైదానంలో పెర్త్ పేస్ బౌలర్లు టీమిండియా బ్యాటర్లను ఇబ్బంది పెట్టడంలో సఫలమయ్యారు. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన వెస్ట్రన్ ఆస్ట్రేలియా 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది. నిక్ హాబ్సన్ (41 బంతుల్లో 64; 5 ఫోర్లు, 4 సిక్స్‌లు), డార్సీ షార్ట్ (38 బంతుల్లో 52; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధసెంచరీలు చేశారు. భారత బౌలర్లలో అశ్విన్ 3 వికెట్లు పడగొట్టగా, హర్షల్‌కు 2 వికెట్లు దక్కాయి. అనంతరం భారత్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 132 పరుగులే చేయగలిగింది. కెప్టెన్‌గా బరిలోకి దిగిన కేఎల్ రాహుల్ (55 బంతుల్లో 74; 9 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధ సెంచరీ చేయగా, మిగతా బ్యాటర్లంతా పూర్తిగా విఫలమయ్యారు. హార్దిక్ పాండ్యా (17), దినేశ్ కార్తీక్ (10) మాత్రమే రెండంకెల స్కోరు సాధించారు. అయితే టీమిండియా టాప్ బ్యాటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్ ఈ ప్రాక్టీస్ మ్యాచ్‌లో బ్యాటింగ్ చేయలేదు. రోహిత్, సూర్య గత మ్యాచ్‌లో ఆడగా, కోహ్లి రెండు మ్యాచ్‌లలోనూ బ్యాటింగ్‌కు దూరంగా ఉండటం స్థానిక అభిమానులను నిరాశపర్చింది. అయితే మ్యాచ్‌లో కోహ్లి, రోహిత్ ఫీల్డింగ్‌లో మాత్రం మైదానమంతటా చురుగ్గా వ్యవహరించారు. పెర్త్నుంచి బ్రిస్బేన్ చేరుకునే భారత జట్టు ఈ నెల 17న ఆస్ట్రేలియాతో, 19న న్యూజిలాండ్‌తో వామప్ మ్యాచ్‌లలో తలపడుతుంది. 23న తమ తొలి పోరు లో పాకిస్తాన్‌ను టీమిండియా ఎదుర్కొంటుంది. -
రాహుల్ ఇన్నింగ్స్ వృథా: కుప్పకూలిన టీమిండియా మిడిలార్డర్.. ఘోర ఓటమి
T20 World Cup 2022- Ind Vs WA XI: వెస్ట్రన్ ఆస్ట్రేలియా ఎలెవన్‌తో జరిగిన రెండో ప్రాక్టీస్ మ్యాచ్‌లో టీమిండియా పరాజయం పాలైంది. టీ20 వరల్డ్‌కప్-2022 సన్నాహకాల్లో భాగంగా పెర్త్ వేదికగా గురువారం (అక్టోబరు 13) జరిగిన మ్యాచ్‌లో 36 పరుగుల తేడాతో ఓటమిని మూటగట్టుకుంది. ఆతిథ్య జట్టు బౌలర్ల ధాటికి భారత బ్యాటర్లు చేతులెత్తేశారు. ఇక ఈ మ్యాచ్‌లో కెప్టెన్‌గా వ్యవహరించిన కేఎల్ రాహుల్ అర్ధ శతకం వృథాగా పోయింది. కాగా తొలుత బ్యాటింగ్ చేసిన వెస్ట్రన్ ఆస్ట్రేలియా నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది. టీమిండియా స్పిన్నర్ అశ్విన్ మూడు(3/32), పేసర్లు హర్షల్ పటేల్ రెండు(2/27), అర్ష్‌దీప్ ఒక వికెట్ (1/25) దక్కించుకున్నారు. రాహుల్‌కు జోడీగా పంత్.. ఓపెనర్‌గా విఫలం ఓపెనర్లు కేఎల్ రాహుల్, రిషభ్ పంత్‌లను కట్టడి చేయడంలో సఫలమయ్యారు ప్రత్యర్థి జట్టు బౌలర్లు. దీంతో పవర్ ప్లే ముగిసే సరికి భారత్ ఒక వికెట్ నష్టపోయి 29 పరుగులు మాత్రమే చేసింది. ఈ క్రమంలో వన్‌డౌన్‌లో వచ్చిన దీపక్ హుడాతో కలిసి రాహుల్ ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. కుప్పకూలిన మిడిలార్డర్ కానీ వెస్ట్రన్ ఆస్ట్రేలియా బౌలర్ లాన్స్ మోరిస్ తన తొలి ఓవర్లోనే దీపక్‌ను పెవిలియన్‌కు చేర్చాడు. దీంతో 7 ఓవర్లలో కేవలం 33 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో కూరుకుపోయింది టీమిండియా. ఈ దశలో ఆచితూచి ఆడుతూ రాహుల్, హార్దిక్ పాండ్యా కలిసి స్కోరు బోర్డును ముందుకు నడిపించారు. కానీ పాండ్యా కూడా ఎక్కువ సేపు క్రీజులో నిలవలేకపోయాడు. 17 పరుగులకే నిష్క్రమించాడు. దీంతో భారం మొత్తం రాహుల్‌పైనే పడింది. పాండ్యా తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన అక్షర్ పటేల్, దినేశ్ కార్తిక్ పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. 55 బంతుల్లో 74 పరుగులతో ఉన్న రాహుల్‌ను ఆండ్రూ టై అవుట్ చేయడంతో 132 పరుగుల వద్ద టీమిండియా కథ ముగిసింది. బ్యాటింగ్ వైఫల్యం కారణంగా వెస్ట్రన్ ఆస్ట్రేలియా ఎలెవన్ చేతిలో టీమిండియా ఓటమి పాలైంది. కాగా మొదటి ప్రాక్టీస్ మ్యాచ్‌లో రోహిత్ సేన 13 పరుగుల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. ఇండియా వర్సెస్ వెస్ట్రన్ ఆస్ట్రేలియా ఎలెవన్ రెండో ప్రాక్టీస్ మ్యాచ్: వెస్ట్రన్ ఆస్ట్రేలియా స్కోరు:168/8 ఇండియా స్కోరు: 132/8 కుప్పకూలిన టీమిండియా మిడిలార్డర్ కేఎల్ రాహుల్- 74 రిషభ్ పంత్- 9 దీపక్ హుడా- 6 హార్దిక్ పాండ్యా- 17 అక్షర్ పటేల్- 2 దినేశ్ కార్తిక్- 10 ఈ మ్యాచ్‌లో భాగంగా తుదిజట్టులో ఉన్న రోహిత్ శర్మ బ్యాటింగ్‌కు రాలేదు. చదవండి: T20 WC- Semi Finalists Prediction: సెమీస్ చేరేది ఆ నాలుగు జట్లే: పాకిస్తాన్ దిగ్గజ బౌలర్ BCCI Next Boss Roger Binny: అధ్యక్షుడిగా రోజర్ బిన్నీనే ఎందుకు?.. ఆసక్తికర విషయాలు That's that from the practice match against Western Australia. They win by 36 runs. KL Rahul 74 (55) pic.twitter.com/5bunUUqZiH — BCCI (@BCCI) October 13, 2022 -
మెరిసిన అశ్విన్, హర్షల్.. టీమిండియా టార్గెట్ 169
టి20 ప్రపంచకప్‌కు సన్నాహకంగా గురువారం వెస్ట్రన్ ఆస్ట్రేలియాతో జరుగుతున్న ప్రాక్టీస్ మ్యాచ్‌లో టీమిండియా వెటరన్ బౌలర్ రవిచంద్రన్ అశ్విన్ మెరిశాడు. భారీ స్కోరు ఖాయమనుకున్న దశలో అశ్విన్ మూడు వికెట్లు, హర్షల్ పటేల్ రెండు వికెట్లతో చెలరేగి వెస్ట్రన్ ఆస్ట్రేలియాను కట్టడి చేశాడు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో వెస్ట్రన్ ఆస్ట్రేలియా 8 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది. నిక్ హాబ్సన్ 64 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. డీ ఆర్సీ షార్ట్ 52 పరుగులు చేశాడు. వీరిద్దరు కలిసి రెండో వికెట్‌కు 110 పరుగులు జోడించారు. ఈ జోడిని విడదీసేందుకు కెప్టెన్ కేఎల్ రాహుల్ చాలా ప్రయత్నాలు చేశాడు. చివరికి హర్షల్ పటేల్ బౌలింగ్‌లో నిక్ హాబ్సన్ అక్షర్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరగడంతో వెస్ట్రన్ ఆస్ట్రేలియా 125 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత కాసేపటికే డీఆర్సీ షార్ట్ రనౌట్‌గా వెనుదిరగడంతో మూడో వికెట్ నష్టపోయింది. ఇక అక్కడి నుంచి వెస్ట్రన్ ఆస్ట్రేలియా పరుగులు చేయడంలో నానా ఇబ్బందులు పడింది. ఆ తర్వాత బ్యాటర్స్ పెద్దగా రాణించలేకపోయారు. చివర్లో మాథ్యూ కెల్లీ 15 పరుగులు నాటౌట్‌గా నిలిచాడు. టీమిండియా బౌలర్లో అశ్విన్ మూడు, హర్షల్ పటేల్ 2, హర్ష్‌దీప్ సింగ్ ఒక వికెట్ తీశాడు. చదవండి: IND vs Western AUS: కేఎల్ రాహుల్ కెప్టెన్సీలో రోహిత్ శర్మ.. -
IND vs Western AUS: కేఎల్ రాహుల్ కెప్టెన్సీలో రోహిత్ శర్మ..
టి20 ప్రపంచకప్ 2022కు ముందు వెస్ట్రన్ ఆస్ట్రేలియాతో టీమిండియా ప్రాక్టీస్ మ్యాచ్‌లు ఆడుతున్న సంగతి తెలిసిందే. తొలి ప్రాక్టీస్ మ్యాచ్‌లో 13 పరుగుల తేడాతో విజయం సాధించిన టీమిండియా ఇవాళ(గురువారం) వెస్ట్రన్ ఆస్ట్రేలియాతో రెండో ప్రాక్టీస్ మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్‌లో టీమిండియా తొలుత బౌలింగ్ చేయనుంది. తొలి మ్యాచ్‌లో హాఫ్ సెంచరీతో జట్టు విజయంలో కీలకపాత్ర పోషించిన సూర్యకుమార్ యాదవ్‌కు ఈ మ్యాచ్‌కు విశ్రాంతి కల్పించారు. అయితే తొలి మ్యాచ్‌కు దూరంగా ఉన్న కోహ్లి రెండో మ్యాచ్‌కు కూడా దూరంగానే ఉన్నాడు. కేఎల్ రాహుల్ మాత్రం రెండో ప్రాక్టీస్ మ్యాచ్‌లో ఆడనున్నాడు. ఇక రాహుల్ రాకతో తొలి మ్యాచ్‌లో ఓపెనర్‌గా వచ్చిన పంత్ ఈ మ్యాచ్‌లో నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చే అవకాశం ఉంది. ఇక ఈ మ్యాచ్‌కు కేఎల్ రాహుల్ కెప్టెన్‌గా వ్యవహరించడం విశేషం. ఇక తొలి మ్యాచ్‌లో విఫలమైన రోహిత్ ఈసారి బ్యాట్‌కు పదును చెప్పాలని భావిస్తున్నాడు. దీపక్ హుడా, హార్దిక్ పాండ్యాలు, దినేశ్ కార్తిక్‌లు మిడిలార్డర్లో ఆడనున్నారు. ఇక బౌలర్లుగా అక్షర్ పటేల్, హర్షల్ పటేల్, భువనేశ్వర్, అర్షదీప్ సింగ్, అశ్విన్‌లు తుదిజట్టులో ఉన్నారు. మరోవైపు వెస్ట్రన్ ఆస్ట్రేలియా మాత్రం ఎలాంటి మార్పులేకుండానే బరిలోకి దిగుతుంది. ఇండియా ఎలెవన్: రోహిత్, రాహుల్ (కెప్టెన్), హుడా, పంత్, హార్దిక్, కార్తీక్, అక్షర్ పటేల్, హర్షల్ పటేల్, అశ్విన్, భువనేశ్వర్ కుమార్, అర్ష్‌దీప్ సింగ్ వెస్ట్రన్ ఆస్ట్రేలియా: ఏజే టై, జె.ఫిలిప్, హెచ్. మెకెంజీ, ఎస్టీ ఫానింగ్, కామెరాన్ బాన్‌క్రాఫ్ట్, ఆస్టన్ టర్నర్, డీఆర్సీ షార్ట్, ఎన్ హాబ్సన్, ఎమ్ కెల్లీ, జాసన్ బెహ్రెన్‌డార్ఫ్, డీ మూడీ, ఎల్ఆర్ మోరిస్ #TeamIndia will bowl first. A look at our Playing XI for the second practice match against Western Australia. pic.twitter.com/5Wutj8rFYI — BCCI (@BCCI) October 13, 2022 చదవండి: అధ్యక్షుడిగా రోజర్ బిన్నీనే ఎందుకు?.. ఆసక్తికర విషయాలు -
నిరాశ పరిచిన రోహిత్.. మరోసారి చెలరేగిన సూర్య కుమార్
IND vs WA-XI: టీ20 ప్రపంచకప్-2022 సన్నాహాకాల్లో భాగంగా టీమిండియా పెర్త్ వేదికగా వెస్ట్రన్ ఆస్ట్రేలియా ఎలెవన్‌తో ప్రాక్టీస్ మ్యాచ్‌లో తలపడుతోంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 158 పరుగులు చేసింది. కాగా భారత ఇన్నింగ్స్‌లో స్టార్ బ్యాటర్ సూర్య కుమార్ యాదవ్ మరో సారి విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 35 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లతో 52 పరుగులు సాధించిన సూర్య.. జట్టు 158 పరుగుల సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. అతడితో పాటు హార్దిక్ పాండ్యా (20 బంతుల్లో 29), దినేష్ కార్తీక్(19 నాటౌట్) రాణించారు. ఇక టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ నిరాశపరిచాడు. కేవలం 3 పరుగులు మాత్రమే చేసి రోహిత్ పెవిలియన్‌కు చేరాడు. ఇక ఓపెనర్ వచ్చిన పంత్ కూడా కేవలం 17 పరుగులు మాత్రమే చేశాడు. ఇక వెస్ట్రన్ ఆస్ట్రేలియా బౌలర్లలో జాసన్ బెహ్రెండోర్ఫ్, మథ్యూ కెల్లీ చెరో రెండు వికెట్లు, టై ఒక్క వికెట్ సాధించారు. కాగా ఈ మ్యాచ్‌కు స్టార్ బ్యాటర్లు విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్‌కు విశ్రాంతి ఇచ్చారు. Innings Break!#TeamIndia post a total of 158/6 Suryakumar Yadav 52 off 35 (3x4, 3x6) Hardik Pandya 29 off 20 pic.twitter.com/ghN3R0coqr — BCCI (@BCCI) October 10, 2022 #T20WC2022 King kohli decided to meet his fans instead of playing warm up match against Western Australia. Simplicity level👑 pic.twitter.com/Hd9pRViGaD — GOPAL JIVANI (@Haa_Haa_Medico) October 10, 2022 చదవండి: T20 WC Warm up Matches 2022: హాఫ్ సెంచరీతో చెలరేగిన కింగ్.. యూఏఈపై విండీస్ విజయం -
ఆస్ట్రేలియా మాజీ సెలక్షన్ కమిటీ చైర్మన్ కన్నుమూత..!
క్రికెట్ ఆస్ట్రేలియా మాజీ సెలక్షన్ కమిటీ చైర్మన్, వెస్ట్రన్ ఆస్ట్రేలియా ఓపెనింగ్ బ్యాటర్ లారీ సాల్(96) మంగళవారం కన్నుమూశారు. తీవ్ర అనారోగ్యంతో పెర్త్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో సాల్ మరణించినట్లు వెస్ట్రన్ ఆస్ట్రేలియన్ క్రికెట్ అసోసియేషన్ తెలిపింది. 1982 నుంచి 1995 వరకు ఆస్ట్రేలియా జట్టుకు జాతీయ సెలెక్టర్‌గా పనిచేశారు. అతని పని చేసిన కాలంలోనే స్టీవ్ వా,మార్క్ వా, మార్క్ టేలర్, ఇయాన్ హీలీ, గ్లెన్ మెక్‌గ్రాత్, షేన్ వార్న్, డామియన్ మార్టిన్, జస్టిన్ లాంగర్, మాథ్యూ హేడెన్ వంటి ఆసీసీ దిగ్గజ ఆటగాళ్లు అంతర్జాతీయ అరంగేట్రం చేశారు. ఇక వెస్ట్రన్ ఆస్ట్రేలియా తరపున 35 ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌లు ఆడిన సాల్ 1701 పరుగులు చేశాడు. అతని కెరీర్లో ఒక ఫస్ట్ క్లాస్ సెంచరీ ఉంది. ఇక రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో 7వ ఆస్ట్రేలియన్ ఇన్ఫాంట్రీ బెటాలియన్‌లో పనిచేసినందున లారీ సాల్‌కు 'కల్నల్' అనే మారుపేరు కూడా ఉంది. చదవండి: TNPL: మురళీ విజయ్‌కు చేదు అనుభవం.. డీకే..డీకే అంటూ ఫాన్స్ కేకలు.. అతనేం చేశాడంటే..! -
పాపం.. చేతికి చిక్కినట్లే చిక్కి జారిపోయింది
సిడ్నీ: షెఫీల్డ్ షీల్డ్ 2020-21 సిరీస్‌లో భాగంగా సౌత్ ఆస్ట్రేలియా, వెస్ట్రన్ ఆస్ట్రేలియా మధ్య జరిగిన మ్యాచ్‌లో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. కచ్చితంగా మ్యాచ్ గెలుస్తామని భావించిన జట్టు ఎవరు ఊహించని విధంగా డ్రాతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. సౌత్ ఆస్ట్రేలియా విధించిన 332 పరుగుల లక్ష్యాన్ని చేధించే క్రమంలో మూడోరోజు ఆటగ ముగిసే సమయానికి వెస్ట్రన్ ఆస్ట్రేలియా 88 పరుగులకు 4 వికెట్లు కోల్పోయింది. ఆట చివరిరోజైన నాలుగో రోజు మూడు సెషన్ల పాటు ఓపికగా ఆడినా వెస్ట్రన్ ఆస్ట్రేలియా వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయింది. అలా ఆట ఐదు ఓవర్లలో ముగుస్తుందనగా 143 పరుగుల వద్ద 9వ వికెట్ కోల్పోయింది. సౌత్ ఆస్ట్రేలియాకు విజయానికి ఒక వికెట్ అవసరం.. క్రీజులో టెయిలెండర్లు మాత్రమే ఉన్నారు. దీంతో సర్కిల్లోనే దాదాపు 9 మంది ఉన్నారు. ఏకంగా స్లిప్‌లో 6గురు ఫీల్డర్లు ఉన్నారు. 4వ ఓవర్ల పాటు ఓపికగా ఆడిన వెస్ట్రన్ ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్ 5 పరుగులు జత చేశారు. ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్‌ను చాడ్ సేయర్స్ వేశాడు. క్రీజులో లియామ్ ఓ కోనర్, లియామ్ గుత్రేయి ఉన్నారు. ఆఖరి బంతిని కోనర్ ఫ్లిక్ చేయగా.. బ్యాట్ ఎడ్జ్ తాకి గాల్లోకి లేచి స్లిప్‌లో పడింది. అప్పటికే ఆరుగురు ఫీల్డర్లు ఉండడంతో క్యాచ్ అని భావించారు. అయితే అనూహ్యంగా ఫీల్డర్ చేతిని తప్పించుకొని బంతి కింద పడింది. అలా మ్యాచ్ డ్రాగా ముగిసింది. దీంతో విజయం చేతికి చిక్కినట్లే చిక్కి చేజారిపోయిందనుకుంటూ సౌత్ ఆస్ట్రేలియా ఆటగాళ్లు నిరాశలో మునిగిపోయారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సౌత్ ఆస్ట్రేలియా బ్యాటింగ్ మొదటి ఇన్నింగ్స్: 510/8 డిక్లెర్డ్ రెండో ఇన్నింగ్స్: 230/9 డిక్లెర్డ్ వెస్ట్రన్ ఆస్ట్రేలియా బ్యాటింగ్ మొదటి ఇన్నింగ్స్: 409/5 డిక్లెర్డ్ రెండో ఇన్నింగ్స్: 148/9 చదవండి: 169 నాటౌట్.. అయినా గెలిపించలేకపోయాడు రెండు రన్స్‌తో డబుల్ సెంచరీ మిస్.. కేకేఆర్‌లో జోష్ One ball remaining. One wicket needed. No.11 on strike Gotta love #SheffieldShield cricket 😊 pic.twitter.com/8HgC2xYPf4 — cricket.com.au (@cricketcomau) February 28, 2021 -
అమ్మడం నేరం.. పప్పీల కోసం ప్రత్యేక చట్టం
ఆస్ట్రేలియాలో 6 రాష్ట్రాలు ఉంటాయి. అందులో ఒక రాష్ట్రం వెస్టర్న్ ఆస్ట్రేలియా. ఇప్పుడా వెస్టర్న్ ఆస్ట్రేలియా ఒక కొత్త చట్టం తేబోతోంది. అది కనుక అమలులోకి వస్తే ఇక ముందు ఎవరు పడితే వాళ్లు కుక్కపిల్లల్ని అమ్మడానికి లేదు. ప్రభుత్వం ఏర్పాటు చేసే కొన్ని దుకాణాలు ఉంటాయి. వాటిల్లో మాత్రమే అమ్మకాలు, కుక్కపిల్లల బ్రీడింగ్ జరుగుతాయి. వెస్ట్రర్న్ ఆస్ట్రేలియా ప్రీమియర్ (ప్రధానికి సమానమైన పదవి).. మార్క్ మెక్‌గోవన్ ఆలోచన ఇది. ‘‘కుక్కపిల్లల్ని కొంటున్న కుటుంబాలకు మనశ్శాంతిని ఇవ్వాలని సంకల్పించాం. దుకాణాలకు వెళ్లి కుక్కపిల్లల్ని కొనేటప్పుడు ఎన్నో శంకలు పీడిస్తుంటాయి. వాటి ఆరోగ్యం, వాటి పెంపకం సరిగానే ఉన్నాయా? టార్చర్ ఏమైనా పెట్టి ఉంటారా? పుష్టికరమైన ఆహారం అంది ఉంటుందా? ఇలా ఎన్నో! వాటన్నిటికీ దుకాణాలవాళ్లు చెప్పే సమాధానం ఒక్కటే. ‘ఎక్స్లెంట్’ అని! నమ్మేదెలా? అందుకే ప్రభుత్వం కుక్కపిల్లల అమ్మకాన్ని, ఉత్పత్తిని తన చేతులలోకి తీసుకోబోతోంది’’ అని ఒక ప్రకటన కూడా విడుదల చేశారు మార్క్. -
టాస్ వేయమంటే.. బౌలింగ్ చేశావేంట్రా నాయన!
బ్రిస్బేన్: ఆస్ట్రేలియా దేశవాళీలో భాగమైన మార్ష్ కప్ వన్డే టోర్నీలో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. ఈ టోర్నీలో వెస్ట్రన్ ఆస్ట్రేలియా-క్వీన్స్లాండ్ జట్ల మధ్య టైటిల్ పోరు జరిగింది. ఈ పోరులో ఆస్ట్రన్ టర్నర్ నేతృత్వంలోని వెస్ట్రన్ ఆస్ట్రేలియా గెలిచి టైటిల్ కైవసం చేసుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన ఉస్మాన్ ఖవాజా సారథ్యంలో క్వీన్స్లాండ్ 49.3 ఓవర్లలో 205 పరుగులకు ఆలౌట్ కాగా, వెస్ట్రన్ ఆస్ట్రేలియా 48 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. షాన్ మార్ష్(101; 132 బంతుల్లో 13 ఫోర్లు వెస్ట్రన్ ఆస్ట్రేలియా విజయంలో కీలక పాత్ర పోషించాడు. అయితే మ్యాచ్ ఆరంభానికి ముందు టాస్ వేసే క్రమంలో ఇరు జట్ల కెప్టెన్లు అయిన ఉస్మాన్ ఖవాజా-టర్నర్లు మైదానంలోకి వచ్చారు. అయితే కాయిన్‌ను ఖవాజా అందుకుని టాస్ వేయడానికి సిద్ధమైన క్రమంలో నవ్వులు పూయించాడు. టాస్‌ను ఒక ఎండ్‌లో వేస్తే అది దాదాపు మరొక ఎండ్‌లో పడింది. టాస్ కాయిన్ అందుకున్న ఖవాజా.. టాస్ వేయమని మ్యాచ్ రిఫరీ ఓకే చెప్పగానే కాస్త ముందుకు దూకుతూ వెళ్లాడు. ఆ కాయిన్‌ను పైకి గట్టిగా విసరగా అది చాలా దూరంగా పడింది. దాదాపు 10 మీటర్ల దూరంగా వెళ్లింది. రిఫరీ నవ్వుకుంటూ కాయిన్ పడిన చోటకు వెళ్లి వెస్ట్రన్ ఆస్ట్రేలియా టాస్ గెలిచిందని చెప్పాడు.(ఇక్కడ చదవండి: ‘వార్న్.. నా రికార్డులు చూసి మాట్లాడు’) ఇక్కడ ఖవాజా ట్రిక్‌ను ప్రదర్శించినా టాస్ గెలవలేకపోయాడు. సాధారణంగా టాస్ వేస్తే కాయిన్ ఇంచుమించు కెప్టెన్లు నిలబడి ఉన్న చోటనే పడుతుంది. ఖవాజా టాస్ వేసిన తీరును వెస్ట్రన్ ఆస్ట్రేలియా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. దాంతో ఖవాజాపై సెటైర్లు పేలుతున్నాయి. టాస్ వేయమంటే.. బౌలింగ్ చేసేవేంట్రా నాయన అంటూ నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. అది కాయిన్ అనే సంగతి మరచిపోయి ఆఫ్ స్పిన్ బౌలింగ్ వేయాలనుకున్నావా అని కామెంట్లు పెడుతున్నారు. గత కొంతకాలంగా ఫామ్ కోల్పోవడంతో ఆసీస్ జట్టులో ఖవాజా చోటు కోల్పోయాడు. ఆ క్రమంలోనే పాకిస్తాన్‌తో టెస్టు సిరీస్‌కు ఖవాజాను ఎంపిక చేయలేదు. దాంతో దేశవాళీ మ్యాచ్‌లు ఆడుతూ ఫామ్‌లోకి రావడానికి యత్నిస్తున్నాడు. మార్ష్ కప్ ఫైనల్ మ్యాచ్‌లో ఖవాజా 26 పరుగులే చేశాడు. -
తమ్ముడు కొట్టిన షాట్.. అన్నకు తీవ్ర గాయం
కారెన్ రోల్టన్ ఓవల్: ఆస్ట్రేలియా ఎడమచేతి స్పిన్నర్ ఆస్టన్ అగర్ తీవ్రంగా గాయపడ్డాడు. మార్ష్ వన్డే కప్‌లో భాగంగా వెస్ట్రన్ ఆస్ట్రేలియా జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్న ఆస్టన్ అగర్.. తమ్ముడు వెస్ అగర్ షాట్‌ను క్యాచ్ రూపంలో అందుకునే క్రమంలో గాయపడ్డాడు. సౌత్ ఆస్ట్రేలియా తరఫున ఆడుతున్న వెస్ ఆగర్ బ్యాటింగ్ చేస్తున్న క్రమంలో 41 ఓవర్‌ను మార్కస్ స్టోయినిస్ వేశాడు. ఆ ఓవర్లో వెస్ అగర్ మిడ్ వికెట్ మీదుగా షాట్ కొట్టగా అక్కడ ఫీల్డింగ్ చేస్తున్న ఆస్టన్ దాన్ని అందుకోవడానికి యత్నించాడు. ఆ బంతి కాస్త జారడంతో కనుబొమ్మల మధ్య నుదిటి భాగంలో తగిలి తీవ్ర రక్తస్రావం జరిగింది. దాంతో ఫీల్డ్‌ను విడిచి వెళ్లిపోయాడు ఆస్టన్. రక్తంతో తడిచిన ముఖంతోనే మైదానాన్ని వీడగా ఆగర్ తిరిగి బరిలోకి దిగలేదు. ఈ టోర్నీకి ఆస్టన్ అగర్ దూరమయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. అయితే ప్రమాదం ఏమీ లేదని చెప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. కాగా, గాయమైన చోట కుట్లు వేయాలని డాక్టర్లు సూచించగా అందుకు అగర్ నిరాకరించాడు. ప్లాస్టిక్ సర్జన్ ఆశ్రయిస్తానని పేర్కొన్నాడు. త్వరలో పెళ్లి చేసుకోబోతున్న కారణంగానే కుట్లుకు ఆస్టన్ నిరాకరించాడు. ఈ ఘటనపై తమ్ముడు వెస్ అగర్ తీవ్ర విచారం వ్యక్తం చేశాడు. ఇలా జరగడం బాధాకరమన్నాడు. గాయపడ్డ మరుక్షణం అతని ఆరోగ్యం గురించి కలత చెందానన్నాడు. దాంతోనే క్రీజ్‌ను వదిలి హుటాహుటీనా అన్న ఆస్టన్ దగ్గరకు వెళ్లానన్నాడు. ఈ గాయంతో పెద్ద ప్రమాదం ఏమీ లేదని డాక్టర్లు తెలపడంతో ఉపశమనం పొందానన్నాడు. ఈ మ్యాచ్‌లో వెస్ట్రన్ ఆస్ట్రేలియా ఆరు పరుగుల తేడాతో గెలిచింది. GRAPHIC CONTENT: Not for the faint-hearted, here is the footage of Agar's knock. Ouch! #MarshCup pic.twitter.com/h6Jj3drPsO — cricket.com.au (@cricketcomau) November 17, 2019 -
మళ్లీ ధోని సేనదే విజయం
పెర్త్: ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా ఇక్కడ జరిగిన రెండో వార్మప్ మ్యాచ్ లోనూ మహేంద్ర సింగ్ ధోని నేతృత్వంలోని టీమిండియా ఘనవిజయం సాధించింది. శనివారం వెస్ట్రన్ ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే మ్యాచ్ లో టీమిండియా 64 పరుగుల తేడాతో గెలిచింది. టీమిండియా విసిరిన 250 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో వెస్ట్రన్ ఆస్ట్రేలియా తడబడింది. కార్డర్(45),జోరాన్ మోర్గాన్(50) మినహా మిగతా ఎవరూ రాణించకపోవడంతో యువ ఆసీస్ జట్టు 49.2 ఓవర్లలో 185 పరుగులకే చాపచుట్టేసింది. టీమిండియా బౌలర్లలో రవీంద్ర జడేజా, రిషి ధవన్, అశ్విన్, అక్షర్ పటేల్‌లకు తలో రెండు వికెట్లు లభించగా, ఉమేష్ యాదవ్, గుర్ కీరత్ సింగ్‌లకు చెరో వికెట్ దక్కింది. అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా 49.1ఓవర్లలో 249 పరుగులకు పరిమితమైంది. ఆదిలోనే ఓపెనర్ శిఖర్ ధవన్(4), విరాట్ కోహ్లి(7) వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడినా.. రోహిత్ శర్మ-అజింక్యా రహానేల జోడీ ఇన్నింగ్స్ మరమ్మత్తులు చేపట్టింది. కాగా, రహానే(41) మూడో వికెట్ రూపంలో పెవిలియన్ కు చేరడంతో టీమిండియా మరోసారి తడబడినట్లు కనిపించింది. అయితే రోహిత్ శర్మ (67; 82 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లు) , మనీష్ పాండే(58; 59 బంతుల్లో 3 ఫోర్లు) ఆకట్టుకోవడంతో టీమిండియా గౌరవప్రదమైన స్కోరు చేయకల్గింది. టీమిండియా మిగతా ఆటగాళ్లలో రవీంద్ర జడేజా(26) ఫర్వాలేదనిపించినా, ధోని(15), గుర్కీరత్ సింగ్ (6), అశ్విన్(4) లు నిరాశపరిచారు. శుక్రవారం ఇదే స్టేడియంలో జరిగిన ట్వంటీ 20 వార్మప్ మ్యాచ్ లో టీమిండియా 74 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. దీంతో ఆసీస్ తో వన్డే సిరీస్ కు ముందు ధోని సేన మరింత ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగనుంది. ఐదు వన్డేల సిరీస్ లో తొలి వన్డే మంగళవారం జరుగనుంది.