టి20 ప్రపంచకప్‌కు సన్నాహకంగా గురువారం వెస్ట్రన్ ఆస్ట్రేలియాతో జరుగుతున్న ప్రాక్టీస్ మ్యాచ్‌లో టీమిండియా వెటరన్ బౌలర్ రవిచంద్రన్ అశ్విన్ మెరిశాడు. భారీ స్కోరు ఖాయమనుకున్న దశలో అశ్విన్ మూడు వికెట్లు, హర్షల్ పటేల్ రెండు వికెట్లతో చెలరేగి వెస్ట్రన్ ఆస్ట్రేలియాను కట్టడి చేశాడు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో వెస్ట్రన్ ఆస్ట్రేలియా 8 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది.
నిక్ హాబ్సన్ 64 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. డీ ఆర్సీ షార్ట్ 52 పరుగులు చేశాడు. వీరిద్దరు కలిసి రెండో వికెట్‌కు 110 పరుగులు జోడించారు. ఈ జోడిని విడదీసేందుకు కెప్టెన్ కేఎల్ రాహుల్ చాలా ప్రయత్నాలు చేశాడు. చివరికి హర్షల్ పటేల్ బౌలింగ్‌లో నిక్ హాబ్సన్ అక్షర్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరగడంతో వెస్ట్రన్ ఆస్ట్రేలియా 125 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది.
ఆ తర్వాత కాసేపటికే డీఆర్సీ షార్ట్ రనౌట్‌గా వెనుదిరగడంతో మూడో వికెట్ నష్టపోయింది. ఇక అక్కడి నుంచి వెస్ట్రన్ ఆస్ట్రేలియా పరుగులు చేయడంలో నానా ఇబ్బందులు పడింది. ఆ తర్వాత బ్యాటర్స్ పెద్దగా రాణించలేకపోయారు. చివర్లో మాథ్యూ కెల్లీ 15 పరుగులు నాటౌట్‌గా నిలిచాడు. టీమిండియా బౌలర్లో అశ్విన్ మూడు, హర్షల్ పటేల్ 2, హర్ష్‌దీప్ సింగ్ ఒక వికెట్ తీశాడు.
చదవండి: IND vs Western AUS: కేఎల్ రాహుల్ కెప్టెన్సీలో రోహిత్ శర్మ..
Comments
Please login to add a commentAdd a comment