practice match
-
‘గులాబీ’ బంతితో సాధనకు సిద్ధం
కాన్బెర్రా: నాలుగేళ్ల క్రితం ఆ్రస్టేలియాపై టెస్టు సిరీస్ గెలిచినా... ‘పింక్ బాల్’తో జరిగిన తొలి టెస్టులో 36కు ఆలౌట్ కావడం భారత్‌ను ఎప్పటికీ వెంటాడుతుంది. అదే అడిలైడ్‌లో డిసెంబర్ 6 నుంచి ఆసీస్‌తో టీమిండియా రెండో టెస్టులో తలపడనుంది. దానికి ముందే గులాబీ బంతితో సాధన చేసేందుకు భారత్ సన్నద్ధమైంది. నేడు, రేపు మనుకా ఓవల్ మైదానంలో ప్రైమ్ మినిస్టర్ (పీఎం) ఎలెవన్‌తో జరిగే రెండు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్‌లో రోహిత్ శర్మ బృందం బరిలోకి దిగనుంది. రెండు రోజుల మ్యాచే కాబట్టి ప్రధానంగా బ్యాటింగ్‌పైనే జట్టు దృష్టి పెట్టింది. తొలి టెస్టు ముగిసిన తర్వాత పెర్త్‌లోనే గులాబీ బంతితో సాధన మొదలు పెట్టిన కెపె్టన్ రోహిత్ శనివారం మ్యాచ్ అవకాశాన్ని పూర్తిగా వాడుకోవాలని పట్టుదలగా ఉన్నాడు. తుది జట్టు సమస్య లేదు కాబట్టి దాదాపు అందరూ బ్యాటింగ్ చేసే అవకాశం ఉంటుంది. అయితే గత సిరీస్‌లో అడిలైడ్ టెస్టుకంటే ముందు ఉన్న పరిస్థితులతో పోలిస్తే ఇప్పుడు టీమిండియా అమితోత్సాహంతో ఉంది. పెర్త్ టెస్టులో ఘన విజయం తర్వాత ఆటగాళ్లలో ఆత్మవిశ్వాసం మరింత పెరిగింది. ఈ నేపథ్యంలో ‘పింక్ బంతి’ పెద్ద సమస్య కాకపోవచ్చు. మరోవైపు టెస్టు క్రికెటర్లు మాట్ రెన్షా, స్కాట్ బోలండ్ పీఎం ఎలెవన్ జట్టులో సభ్యులుగా ఉన్నారు. కెప్టెన్ జేక్ ఎడ్వర్డ్స్ మరో కీలక ఆటగాడు కాగా... అండర్–19 స్థాయి క్రికెటర్లు ఎక్కువ మంది టీమ్ తరఫున బరిలోకి దిగనున్నారు. అయితే ఈ మ్యాచ్‌కు వర్ష సూచన ఉంది. తొలి రోజు పూర్తిగా రద్దయ్యే ప్రమాదం కూడా లేకపోలేదు! నెట్స్‌లో జోరుగా... ప్రాక్టీస్ మ్యాచ్ జరగడంపై సందేహంతో కాబోలు... మ్యాచ్‌కు ముందే శుక్రవారం భారత జట్టు ఆటగాళ్లు పింక్ బాల్‌తో ప్రాక్టీస్‌పై దృష్టి పెట్టారు. నెట్స్‌లో సుదీర్ఘ సమయం క్రికెటర్లు శ్రమించారు. ముఖ్యంగా గాయం నుంచి కోలుకుంటున్న శుబ్‌మన్ గిల్ ఇబ్బంది లేకుండా స్వేచ్ఛగా బ్యాటింగ్ చేయడం సానుకూలాంశం. పలు చక్కటి షాట్లతో అతను ఆకట్టుకున్నాడు. పూర్తి ఫిట్‌గా మారితే గిల్ ప్రాక్టీస్ మ్యాచ్ ఆడతాడు.‘పింక్ బాల్ కాస్త భిన్నంగా స్పందిస్తుందనేది వాస్తవం. అయితే అది పెద్ద సమస్య కాదు. దానికి అనుగుణంగానే సాధన చేస్తున్నాం. రెండో టెస్టుకు ముందు ఎనిమిది రోజుల విరామం ఉండటం మాకు మేలు చేస్తుంది’ అని భారత అసిస్టెంట్ కోచ్ అభిషేక్ నాయర్ చెప్పాడు. విరాట్ కోహ్లి కూడా భారత బౌలర్లను ఎదుర్కొంటూ చాలా సమయం ప్రాక్టీస్ చేశాడు. భారత్ సాధన చూసేందుకు గ్రౌండ్‌కు వచ్చిన అభిమానులకు కోహ్లి మంచి వినోదం అందించాడు. పంత్, రాహుల్ బ్యాటింగ్‌కంటే ఫిట్నెస్ డ్రిల్స్పైనే ఎక్కువగా దృష్టి పెట్టగా... బ్యాటింగ్ సాధన తర్వాత యశస్వి జైస్వాల్ సరదాగా ‘పింక్ బాల్’తో మీడియం పేస్ బౌలింగ్ సాధన చేశాడు. -
భారత్‌తో మ్యాచ్.. జట్టును ప్రకటించిన క్రికెట్ ఆస్ట్రేలియా! కెప్టెన్ ఎవరంటే?
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని అద్బుతమైన విజయంతో ఆరంభించిన టీమిండియా.. ఇప్పుడు రెండో టెస్టుకు సన్నద్దమవుతోంది. డిసెంబర్ 6 నుంచి ఆడిలైడ్ వేదికగా జరగనున్న ఈ మ్యాచ్‌లో కూడా అదే జోరును కనబరిచి ఆసీస్‌ను చిత్తు చేయాలని భారత జట్టు పట్టుదలతో ఉంది.అయితే ఈ పింక్‌బాల్ టెస్టుకు ముందు కాన్బెర్రా వేదికగా భారత జట్టు ప్రైమ్ మినిస్టర్స్ ఎలెవన్‌తో ప్రాక్టీస్ మ్యాచ్ ఆడనుంది. రెండు రోజుల పాటు జరగనున్న ఈ వామాప్ మ్యాచ్ కోసం రోహిత్ శర్మ సారథ్యంలోని భారత జట్టు గురువారం కాన్బెర్రాలో అడుగుపెట్టింది.గురువారం విశ్రాంతి తీసుకుని శుక్రవారం ప్రాక్టీస్‌లో టీమిండియా పాల్గోనున్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత శనివారం(నవంబర్ 30) నుంచి భారత్-ప్రైమ్ మినిస్టర్స్ ఎలెవన్ మధ్య ప్రాక్టీస్ మ్యాచ్ జరగనుంది.ప్రైమ్ మినిస్టర్స్ XI జట్టు ప్రకటన..ఈ క్రమంలో 14 మంది సభ్యులతో కూడిన ప్రైమ్ మినిస్టర్స్ ఎలెవన్ జట్టును క్రికెట్ ఆస్ట్రేలియా ప్రకటించింది. ఈ జట్టుకు స్టార్ ఆల్‌రౌండర్ జాక్ ఎడ్వర్డ్స్ సారథ్యం వహించనున్నాడు. అదేవిధంగా ఈ జట్టులో శామ్ కాన్స్టాస్, మాట్ రెన్షాలకు చోటు దక్కింది.కాగా వీరిద్దరూ ఆసీస్ సీనియర్ జట్టులో ఓపెనింగ్ స్లాట్ కోసం పోటీపడుతున్నారు. మరోవైపు మహ్లీ బార్డ్‌మాన్, స్కాట్ బోలాండ్ ఇద్దరు ఫ్రంట్‌లైన్ సీమర్లుగా ఎంపికయ్యారు.బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి స్కాట్ బోలాండ్ ఎంపికైనప్పటికి తొలి టెస్టులో ఆడే అవకాశం రాలేదు. ప్రైమ్ మినిస్టర్స్ ఎలెవన్ జట్టు కేవలం ఒకే ఒక స్పిన్నర్‌తో ప్రాక్టీస్ మ్యాచ్ ఆడనుంది. ఈ జట్టులో లాయిడ్ పోప్ ఏకైక స్పిన్నర్‌గా ఉన్నాడు.ప్రైమ్ మినిస్టర్స్ XI జట్టు ఇదేసామ్ కాన్స్టాస్, మాట్ రెన్షా, జేడెన్ గుడ్విన్, ఒల్లీ డేవిస్, సామ్ హార్పర్ (వికెట్ కీపర్), జాక్ ఎడ్వర్డ్స్ (కెప్టెన్), జాక్ క్లేటన్, హన్నో జాకబ్స్, లాయిడ్ పోప్, మహ్లీ బార్డ్‌మాన్, స్కాట్ బోలాండ్ -
సన్నాహక సమయం
న్యూయార్క్: టి20 వరల్డ్ కప్‌లో అసలు సమరానికి ముందు ఏకైక సన్నాహక మ్యాచ్ కోసం భారత జట్టు సిద్ధమైంది. నేడు జరిగే ‘వామప్’ పోరులో బంగ్లాదేశ్‌తో టీమిండియా తలపడుతుంది. లీగ్ దశలో తమ తొలి మూడు మ్యాచ్‌లు ఆడే నాసా కౌంటీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలోనే రోహిత్ బృందం ఈ మ్యాచ్ ఆడనుంది. కొత్తగా నిర్మించిన ఈ స్టేడియం పిచ్‌తో పాటు అటు వాతావరణంపై కూడా ఒక అంచనాకు వచ్చేందుకు ఈ మ్యాచ్ ఉపయోగపడనుంది. స్థానిక కాలమానం ప్రకారం మ్యాచ్‌లు ఉదయం 10:30 గంటలకు ప్రారంభం అవుతాయి. అందువల్ల అలాంటి స్థితికి అలవాటు పడటం చాలా ముఖ్యం. ఈ నేపథ్యంలో ఏకైక వామప్ మ్యాచ్ కీలకం కానుంది. మ్యాచ్‌కు ముందు శుక్రవారం ఆటగాళ్లు చివరి నెట్ సెషన్లో పాల్గొన్నారు. అంతకుముందు రోహిత్ శర్మ ఈనెలలో జరిగే విఖ్యాత బాస్కెట్‌బాల్ లీగ్ ఎన్బీఏ ఫైనల్స్‌లో విన్నర్స్ జట్టుకు ఇచ్చే ట్రోఫీతో, టి20 వరల్డ్‌కప్‌తో ఫొటో సెషన్లో పాల్గొన్నాడు. అందరూ బరిలోకి... వామప్ మ్యాచ్ కావడంతో అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్‌లో ఆటగాళ్లందరినీ పరీక్షించేందుకు భారత్‌కు అవకాశం ఉంది. 15 మంది సభ్యుల టీమ్‌లో విరాట్ కోహ్లి మాత్రం శుక్రవారం ఆలస్యంగా చేరాడు. అయితే అతను ఈ మ్యాచ్‌లో ఆడేది సందేహంగానే ఉంది. దాంతో కోహ్లి మినహా ఇతర కూర్పుపై టీమ్ మేనేజ్మెంట్ దృష్టి పెట్టనుంది. ఐపీఎల్ కారణంగా అంతా మ్యాచ్ ప్రాక్టీస్‌లోనే ఉన్నారు. జట్టులోని సభ్యులంతా తమ టీమ్‌లలో రెగ్యులర్‌గా దాదాపు అన్ని మ్యాచ్‌లు ఆడారు. ప్రధాన టోర్నీలో యశస్వి జైస్వాల్‌ను తుది జట్టులోకి తీసుకోవడం, బుమ్రాకు తోడుగా రెండో పేసర్‌గా ఎవరికి అవకాశం కల్పించాలనేదానిపై మేనేజ్మెంట్ ప్రధానంగా దృష్టి పెడుతోంది. రెండో పేసర్‌గా సిరాజ్, అర్ష్ దీప్‌లలో ఒకరికే అవకాశం దక్కుతుంది. మరోవైపు బంగ్లాదేశ్ టీమ్ పరిస్థితి గొప్పగా లేదు. ఇటీవలే అనూహ్యంగా అమెరికా జట్టు చేతిలో 1–2తో బంగ్లాదేశ్ టి20 సిరీస్ కోల్పోయింది. పైగా ఈ టోర్నీలో బలమైన ‘డి’ గ్రూప్‌లో ఆ జట్టు ఉంది. ఈ నేపథ్యంలో ప్రాక్టీస్ మ్యాచ్‌తో కాస్త ఆత్మవిశ్వాసం ప్రోదిచేసుకోవడంపై బంగ్లాదేశ్ బృందం దృష్టి సారించింది. -
వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్‌కు ముందు బీసీసీఐ కీలక నిర్ణయం..
బ్ల్యూటీసీ ఫైనల్ ఓటమి నేపథ్యంలో వెస్టిండీస్‌తో జరగబోయే టెస్టు సిరీస్‌ను బీసీసీఐ సీరియస్‌గా తీసుకుంది. ఈ క్రమంలో జూలై 12న డొమినికా వేదికగా ప్రారంభమయ్యే తొలి టెస్టుకు ముందు రెండు ప్రాక్టీస్ మ్యాచ్‌ల్లో భారత జట్టును ఆడించాలని బీసీసీఐ భావిస్తోంది. ఈ రెండు మ్యాచ్‌లు కూడా బార్బడోస్ వేదికగా జరగనున్నట్లు సమాచారం. కాగా ఈ టెస్టు సిరీస్ కోసం టీమిండియా వేర్వేరు బ్యాచ్‌లగా కరీబియన్ దీవులకు చేరుకోనుంది. జూలై 2న బ్రిడ్జ్‌టౌన్‌లో భారత ఆటగాళ్లు సమావేశం కానున్నట్లు తెలుస్తోంది. కాగా విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ వంటి స్టార్ ఆటగాళ్లు ఇంకా లండన్‌లోనే గడుపుతున్నారు. వీరిద్దరూ నేరుగా లండన్ నుంచి కరీబియన్ గడ్డపై అడుగుపెట్టనున్నారు. అనంతరం ప్రాక్టీస్ మ్యాచ్‌ల్లో భాగం కానున్నారు. అయితే క్రిక్‌బజ్ నివేదిక ప్రకారం.. ఈ ప్రాక్టీస్ మ్యాచ్‌లు ఫస్ట్‌క్లాస్ క్రికెట్ హోదాలో జరగవు. కొంత మంది బార్బడోస్ స్ధానిక ఆటగాళ్లు భారత జట్టుతో కలవనున్నారు. అనంతరం రెండు జట్లగా విడిపోయి నాలుగు రోజుల ఇంట్రాస్వాడ్ మ్యాచ్‌లు భారత్ ఆడనుంది. ఇక వెస్టిండీస్ విషయానికి వస్తే.. కరీబియన్ జట్టు ఆంటిగ్వాలోని హై-పెర్ఫార్మెన్స్ సెంటర్లో తమ ప్రాక్టీస్ క్యాంప్‌ను ఏర్పరుస్తుంది. తొలి టెస్టుకు ముందు విండీస్ జట్టు డొమినికాకు వెళ్లనున్నారు. ఇక కొంత మంది టెస్టు స్పెషలిస్ట్‌లు ప్రపంచ కప్ 2023 క్వాలిఫైయర్స్ బీజీబీజీగా ఉన్నారు. విండీస్‌తో రెండు టెస్టులకు బీసీసీఐ ప్రకటించిన జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుబ్‌మన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, విరాట్ కోహ్లీ, యశస్వి జైస్వాల్, అజింక్య రహానే (వైస్ కెప్టెన్), కేఎస్ భరత్ (వికెట్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, అక్షర్ పటేల్ , మహ్మద్ సిరాజ్, ముకేష్ కుమార్, జయదేవ్ ఉనాద్కట్, నవదీప్ సైనీ. చదవండి: Suresh Raina: యూరప్‌లో భారత మాజీ క్రికెటర్ కొత్త బిజినెస్.. నోరూరించే రుచులతో.. -
రాహుల్ ఇన్నింగ్స్ వృథా: కుప్పకూలిన టీమిండియా మిడిలార్డర్.. ఘోర ఓటమి
T20 World Cup 2022- Ind Vs WA XI: వెస్ట్రన్ ఆస్ట్రేలియా ఎలెవన్‌తో జరిగిన రెండో ప్రాక్టీస్ మ్యాచ్‌లో టీమిండియా పరాజయం పాలైంది. టీ20 వరల్డ్‌కప్-2022 సన్నాహకాల్లో భాగంగా పెర్త్ వేదికగా గురువారం (అక్టోబరు 13) జరిగిన మ్యాచ్‌లో 36 పరుగుల తేడాతో ఓటమిని మూటగట్టుకుంది. ఆతిథ్య జట్టు బౌలర్ల ధాటికి భారత బ్యాటర్లు చేతులెత్తేశారు. ఇక ఈ మ్యాచ్‌లో కెప్టెన్‌గా వ్యవహరించిన కేఎల్ రాహుల్ అర్ధ శతకం వృథాగా పోయింది. కాగా తొలుత బ్యాటింగ్ చేసిన వెస్ట్రన్ ఆస్ట్రేలియా నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది. టీమిండియా స్పిన్నర్ అశ్విన్ మూడు(3/32), పేసర్లు హర్షల్ పటేల్ రెండు(2/27), అర్ష్‌దీప్ ఒక వికెట్ (1/25) దక్కించుకున్నారు. రాహుల్‌కు జోడీగా పంత్.. ఓపెనర్‌గా విఫలం ఓపెనర్లు కేఎల్ రాహుల్, రిషభ్ పంత్‌లను కట్టడి చేయడంలో సఫలమయ్యారు ప్రత్యర్థి జట్టు బౌలర్లు. దీంతో పవర్ ప్లే ముగిసే సరికి భారత్ ఒక వికెట్ నష్టపోయి 29 పరుగులు మాత్రమే చేసింది. ఈ క్రమంలో వన్‌డౌన్‌లో వచ్చిన దీపక్ హుడాతో కలిసి రాహుల్ ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. కుప్పకూలిన మిడిలార్డర్ కానీ వెస్ట్రన్ ఆస్ట్రేలియా బౌలర్ లాన్స్ మోరిస్ తన తొలి ఓవర్లోనే దీపక్‌ను పెవిలియన్‌కు చేర్చాడు. దీంతో 7 ఓవర్లలో కేవలం 33 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో కూరుకుపోయింది టీమిండియా. ఈ దశలో ఆచితూచి ఆడుతూ రాహుల్, హార్దిక్ పాండ్యా కలిసి స్కోరు బోర్డును ముందుకు నడిపించారు. కానీ పాండ్యా కూడా ఎక్కువ సేపు క్రీజులో నిలవలేకపోయాడు. 17 పరుగులకే నిష్క్రమించాడు. దీంతో భారం మొత్తం రాహుల్‌పైనే పడింది. పాండ్యా తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన అక్షర్ పటేల్, దినేశ్ కార్తిక్ పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. 55 బంతుల్లో 74 పరుగులతో ఉన్న రాహుల్‌ను ఆండ్రూ టై అవుట్ చేయడంతో 132 పరుగుల వద్ద టీమిండియా కథ ముగిసింది. బ్యాటింగ్ వైఫల్యం కారణంగా వెస్ట్రన్ ఆస్ట్రేలియా ఎలెవన్ చేతిలో టీమిండియా ఓటమి పాలైంది. కాగా మొదటి ప్రాక్టీస్ మ్యాచ్‌లో రోహిత్ సేన 13 పరుగుల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. ఇండియా వర్సెస్ వెస్ట్రన్ ఆస్ట్రేలియా ఎలెవన్ రెండో ప్రాక్టీస్ మ్యాచ్: వెస్ట్రన్ ఆస్ట్రేలియా స్కోరు:168/8 ఇండియా స్కోరు: 132/8 కుప్పకూలిన టీమిండియా మిడిలార్డర్ కేఎల్ రాహుల్- 74 రిషభ్ పంత్- 9 దీపక్ హుడా- 6 హార్దిక్ పాండ్యా- 17 అక్షర్ పటేల్- 2 దినేశ్ కార్తిక్- 10 ఈ మ్యాచ్‌లో భాగంగా తుదిజట్టులో ఉన్న రోహిత్ శర్మ బ్యాటింగ్‌కు రాలేదు. చదవండి: T20 WC- Semi Finalists Prediction: సెమీస్ చేరేది ఆ నాలుగు జట్లే: పాకిస్తాన్ దిగ్గజ బౌలర్ BCCI Next Boss Roger Binny: అధ్యక్షుడిగా రోజర్ బిన్నీనే ఎందుకు?.. ఆసక్తికర విషయాలు That's that from the practice match against Western Australia. They win by 36 runs. KL Rahul 74 (55) pic.twitter.com/5bunUUqZiH — BCCI (@BCCI) October 13, 2022 -
మెరిసిన అశ్విన్, హర్షల్.. టీమిండియా టార్గెట్ 169
టి20 ప్రపంచకప్‌కు సన్నాహకంగా గురువారం వెస్ట్రన్ ఆస్ట్రేలియాతో జరుగుతున్న ప్రాక్టీస్ మ్యాచ్‌లో టీమిండియా వెటరన్ బౌలర్ రవిచంద్రన్ అశ్విన్ మెరిశాడు. భారీ స్కోరు ఖాయమనుకున్న దశలో అశ్విన్ మూడు వికెట్లు, హర్షల్ పటేల్ రెండు వికెట్లతో చెలరేగి వెస్ట్రన్ ఆస్ట్రేలియాను కట్టడి చేశాడు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో వెస్ట్రన్ ఆస్ట్రేలియా 8 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది. నిక్ హాబ్సన్ 64 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. డీ ఆర్సీ షార్ట్ 52 పరుగులు చేశాడు. వీరిద్దరు కలిసి రెండో వికెట్‌కు 110 పరుగులు జోడించారు. ఈ జోడిని విడదీసేందుకు కెప్టెన్ కేఎల్ రాహుల్ చాలా ప్రయత్నాలు చేశాడు. చివరికి హర్షల్ పటేల్ బౌలింగ్‌లో నిక్ హాబ్సన్ అక్షర్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరగడంతో వెస్ట్రన్ ఆస్ట్రేలియా 125 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత కాసేపటికే డీఆర్సీ షార్ట్ రనౌట్‌గా వెనుదిరగడంతో మూడో వికెట్ నష్టపోయింది. ఇక అక్కడి నుంచి వెస్ట్రన్ ఆస్ట్రేలియా పరుగులు చేయడంలో నానా ఇబ్బందులు పడింది. ఆ తర్వాత బ్యాటర్స్ పెద్దగా రాణించలేకపోయారు. చివర్లో మాథ్యూ కెల్లీ 15 పరుగులు నాటౌట్‌గా నిలిచాడు. టీమిండియా బౌలర్లో అశ్విన్ మూడు, హర్షల్ పటేల్ 2, హర్ష్‌దీప్ సింగ్ ఒక వికెట్ తీశాడు. చదవండి: IND vs Western AUS: కేఎల్ రాహుల్ కెప్టెన్సీలో రోహిత్ శర్మ.. -
సూర్యకుమార్ ‘ప్రాక్టీస్’
పెర్త్: ఆస్ట్రేలియా గడ్డపై పరిస్థితులకు అలవాటు పడేందుకు అన్ని జట్లకంటే ముందుగా అక్కడికి చేరుకున్న భారత్ తమ సన్నాహాలను సంతృప్తిగా మొదలు పెట్టింది. మూడు రోజుల సాధన అనంతరం సోమవారం మ్యాచ్ బరిలోకి దిగిన టీమిండియా తొలి పోరులో విజయం సాధించింది. ఈ ప్రాక్టీస్ మ్యాచ్‌లో భారత్ 13 పరుగుల తేడాతో వెస్ట్రన్ ఆస్ట్రేలియాను ఓడించింది. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన భారత్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. ఫామ్‌లో ఉన్న సూర్యకుమార్ యాదవ్ (35 బంతుల్లో 52; 3 ఫోర్లు, 3 సిక్స్‌లు) అదే జోరును ఇక్కడా కొనసాగించాడు. ఇతర బ్యాటర్లలో హార్దిక్ పాండ్యా (27; 1 ఫోర్, 1 సిక్స్), దీపక్ హుడా (22; 2 ఫోర్లు, 1 సిక్స్) ఫర్వాలేదనిపించగా... రోహిత్ (3), ఓపెనర్‌గా ఆడిన పంత్ (9) విఫలమయ్యారు. అనంతరం వెస్ట్రన్ ఆస్ట్రేలియా 8 వికెట్లకు 145 పరుగులు చేసింది. భారత బౌలర్లలో అర్‡్షదీప్ 6 పరుగులే ఇచ్చి 3 వికెట్లు పడగొట్టగా... చహల్, భువనేశ్వర్ చెరో 2 వికెట్లు తీశారు. -
టాప్ స్కోరర్‌గా నిలిచి.. అంత గుడ్డిగా ఎలా ఔటయ్యాడు!
దక్షిణాఫ్రికా జట్టు ప్రస్తుతం ఇంగ్లండ్ పర్యటనలో ఉంది. ఇప్పటికే వన్డే, టి20 సిరీస్‌లు ముగియగా.. ఆగస్టు 17 నుంచి మూడు టెస్టు మ్యాచ్‌ల సిరీస్ ఆరంభం కానుంది. కాగా టెస్టు సిరీస్‌కు ముందు సౌతాఫ్రికా ఇంగ్లండ్ లయన్స్‌తో నాలుగు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్ ఆడుతున్న సంగతి తెలిసిందే. మ్యాచ్‌లో టాస్ గెలిచిన సౌతాఫ్రికా బ్యాటింగ్ ఎంచుకుంది. ఇక బ్యాటింగ్‌లో ప్రొటిస్‌కు మంచి ప్రాక్టీస్ లభించింది. సౌతాప్రికా తొలి ఇన్నింగ్స్‌లో 433 పరుగులకు ఆలౌటైంది. సౌతాఫ్రికా తరపున కాయా జోండో 86 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. వాండర్డుసెన్ 75, వెరిన్నె 62, మార్కో జాన్సెన్(54 నాటౌట్), సరెల్ ఎర్వీ 42 పరుగులు చేశారు. అయితే ప్రొటిస్ తరపున టాప్ స్కోరర్‌గా నిలిచిన కాయా జోండో ఔటైన విధానం మాత్రం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అంతసేపు నిలకడగా ఆడిన కాయా.. బంతి అంచనా వేయడంలో పొరబడి గుడ్డిగా ఔటవ్వడం ఆశ్చర్యపరిచింది. ఇంగ్లండ్ లయన్స్ పేసర్ సామ్ కుక్ ఆఫ్‌స్టంప్ ఔట్‌సైడ్ దిశగా బంతిని వేయగా.. జోండో బంతిని వదిలేద్దామనుకున్నాడు. కానీ బంతి అనూహ్యంగా ఆఫ్‌స్టంప్ లైన్ మీదుగా వెళ్లి వికెట్లను గిరాటేసింది. దీంతో కాయాకు కాసేపటి వరకు ఏం జరిగిందో అర్థం కాలేదు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక ఇంగ్లండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌ను సౌతాఫ్రికా 1-1తో సమం చేసింది. ఆ తర్వాత జరిగిన టి20 సిరీస్‌ను మాత్రం 2-1తో దక్షిణాఫ్రికా సొంతం చేసుకుంది. ఇక మూడు టెస్టుల సిరీస్ ఇంగ్లండ్‌కు కీలకం కానుంది. వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్‌లో ప్రస్తుతం సౌతాఫ్రికా టాప్‌లో కొనసాగుతుండగా.. ఇంగ్లండ్ మాత్రం ఏడో స్థానంలో ఉంది. Little Chef with the early breakthrough 💪 Lions live stream ➡️ https://t.co/nvDuR1FMzE pic.twitter.com/w0c8bxLYpH — England Cricket (@englandcricket) August 10, 2022 చదవండి: Rishabh Pant-Uravasi Rautela: బాలీవుడ్ హీరోయిన్‌కు పంత్ దిమ్మతిరిగే కౌంటర్ CWG 2022: కామన్వెల్త్ క్రీడల్లో పాల్గొన్న ఇద్దరు పాకిస్థానీ బాక్సర్ల అదృశ్యం -
ప్రాక్టీస్ మ్యాచ్ నాకు పూర్తి సంతృప్తినిచ్చింది: కోచ్ ద్రవిడ్
ఇంగ్లండ్‌తో జరిగే ఏకైక టెస్టుకు ముందు తమ ఆటగాళ్లకు లభించిన ప్రాక్టీస్ పట్ల భారత హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ సంతృప్తిగా ఉన్నాడు. ఆదివారం లీస్టర్‌షైర్‌తో ముగిసిన నాలుగు రోజుల మ్యాచ్‌లో టీమిండియా క్రికెటర్లందరూ ఆకట్టుకున్నారు. కోహ్లి, గిల్, పంత్, శ్రేయస్, జడేజా అర్ధసెంచరీలు చేశారు. ‘టెస్టు మ్యాచ్‌కు ముందు ఏమేం లక్ష్యంగా ప్రాక్టీస్ మ్యాచ్‌లో బరిలోకి దిగామో అవన్నీ సాధించి పూర్తి స్థాయిలో సన్నద్ధమయ్యాం. ఈ నాలుగు రోజుల మ్యాచ్ పూర్తి సంతృప్తినిచ్చింది’ అని ద్రవిడ్ వ్యాఖ్యానించాడు. చదవండి: India vs Ireland: సిరీస్‌పై కన్నేసిన భారత్.. వరుణుడు కరుణించేనా..? -
రాణించిన శుబ్‌మన్ గిల్.. 'డ్రా' గా ముగిసిన ప్రాక్టీస్ మ్యాచ్..!
లెస్టర్‌షైర్ జట్టుతో జరిగిన నాలుగు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్‌ను భారత జట్టు ‘డ్రా’ గా ముగించింది. ఓవర్‌నైట్ స్కోరు 364/7 వద్దే భారత్ రెండో ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసి లెస్టర్షైర్కు 367 పరుగుల విజయలక్ష్యాన్ని నిర్దేశించింది. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన లెస్టర్‌షైర్ 66 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 219 పరుగులు చేసింది. లెస్టర్ జట్టుకు ఆడిన భారత ఓపెనర్ శుబ్‌మన్ గిల్ (62; 8 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధ సెంచరీ చేశాడు. స్పిన్నర్ అశ్విన్ రెండు వికెట్లు పడగొట్టాడు. చదవండి: India vs Ireland 1st T20I: ఐర్లాండ్‌కు చుక్కలు చూపించిన భారత్.. 7 వికెట్ల తేడాతో ఘన విజయం -
ఫిఫ్టి కొట్టి బుమ్రా ఉచ్చులో చిక్కిన కోహ్లి
లీస్టర్‌షైర్‌తో జరుగుతున్న ప్రాక్టీస్ మ్యాచ్ రెండో ఇన్నింగ్స్‌లో విరాట్ కోహ్లి అర్ధసెంచరీ సాధించాడు. మూడో రోజు ఆటలో ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన కోహ్లి.. 98 బంతులను ఎదుర్కొని 5 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 67 పరుగులు చేశాడు. అనంతరం బుమ్రా బౌలింగ్‌లో అబ్దైన్ సఖండేకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఈ ఇన్నింగ్స్‌లో స్వేచ్ఛగా షాట్లు ఆడిన కోహ్లి సెంచరీ సాధిస్తాడని అంతా భావించారు. అయితే వారికి మరోసారి నిరాశే ఎదురైంది. 90/1 ఓవర్‌నైట్ స్కోర్ వద్ద మూడో రోజు ఆటను ప్రారంభించిన టీమిండియా.. మూడో రోజు మూడో సెషన్ సమయానికి 6 వికెట్ల నష్టానికి 304 పరుగులు చేసింది. శ్రీకర్ భరత్ (43), హనుమ విహారి (20), శార్దూల్ ఠాకూర్ (28), పుజారా (22) ఎక్కువ సేపు క్రీజ్‌లో నిలబడలేకపోయారు. శ్రేయస్ అయ్యర్ (46), రవీంద్ర జడేజా (19) క్రీజ్‌లో ఉన్నారు. అంతకుముందు టీమిండియా 246/8 స్కోర్ వద్ద తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేయగా.. లీస్టర్‌షైర్ 244 పరుగులకు ఆలౌటైంది. కాగా, జులై 1 నుంచి ఇంగ్లండ్‌తో టెస్ట్ మ్యాచ్ ప్రారంభంకానున్న విషయం తెలిసిందే. చదవండి: కోపం వస్తే మాములుగా ఉండదు.. మరోసారి నిరూపితం -
కోహ్లి వికెట్ తీశానని నా మనవళ్లతో గర్వంగా చెప్పుకుంటా..!
Roman Walker: ఇంగ్లండ్ పర్యటనలో భాగంగా టీమిండియా లీస్టర్‌షైర్‌తో 4 రోజుల ప్రాక్టీస్ మ్యాచ్ ఆడుతున్న విషయం తెలిసిందే. తొలి ఇన్నింగ్స్‌లో లీస్టర్‌షైర్ బౌలర్ రోమన్ వాకర్ 5 వికెట్ల ప్రదర్శనతో రెచ్చిపోవడంతో టీమిండియా నామమాత్రపు స్కోర్‌కే (246/8 డిక్లేర్) పరిమితం కాగా.. టీమిండియా బౌలర్ల ధాటికి లీస్టర్‌షైర్ సైతం తొలి ఇన్నింగ్స్‌లో 244 పరుగులకే ఆలౌటైంది. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్.. రెండో రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టానికి 90 పరుగులు చేసింది. శ్రీకర్ భరత్, విహారి క్రీజ్‌లో ఉన్నారు. ☝️ | Kohli (33) lbw Walker.@RomanWalker17 strikes again! This time he hits the pads of Kohli, and after a long wait the umpire's finger goes up. Out or not out? 🤔 🇮🇳 IND 138/6 𝐋𝐈𝐕𝐄 𝐒𝐓𝐑𝐄𝐀𝐌: https://t.co/adbXpwig48 👈 🦊 #IndiaTourMatch | #LEIvIND pic.twitter.com/iE9DNCUwLO — Leicestershire Foxes 🏏 (@leicsccc) June 23, 2022 ఇదిలా ఉంటే, తొలి రోజు ఆటలో కోహ్లి, రోహిత్ సహా మొత్తం ఐదు వికెట్లు (5/25) పడగట్టిన రోమన్ వాకర్ కోహ్లి వికెట్‌ను ఉద్దేశిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కెరీర్లో తొలి ఫస్ట్ క్లాస్ మ్యాచ్ ఆడుతున్న 21 ఏళ్ల వాకర్ కోహ్లి వికెట్ పడగొట్టడంపై స్పందిస్తూ.. తొలి ఇన్నింగ్స్‌లో నా పర్ఫామెన్స్ సంతృప్తినిచ్చింది.. ప్రపంచంలోనే మేటి బ్యాటర్ అయిన విరాట్ కోహ్లి వికెట్ నాకు జీవితకాలం గుర్తుండిపోతుంది.. కోహ్లి వికెట్ సాధించిన అనంతరం నా టీమ్ మేట్స్ కొందరు మెసేజ్ చేశారు.. కోహ్లి వికెట్ గురించి నీ మనవళ్లతో గర్వంగా చెప్పుకోవచ్చని అన్నారు.. అవును వరల్డ్ క్లాస్ బ్యాటర్ విరాట్ కోహ్లిని ఔట్ చేశానని నా మనవళ్లతో గర్వంగా చెప్పుకుంటానని అన్నాడు. కాగా, ఈ మ్యాచ్‌లో బౌలింగ్‌తో పాటు బ్యాటింగ్‌లోనూ రాణించిన వాకర్ 57 బంతుల్లో 7 ఫోర్లతో 34 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. చదవండి: సిక్సర్‌తో పంత్ అర్థశతకం.. ఫామ్‌లోకి వచ్చినట్టేనా! -
రాణించిన శ్రీకర్ భరత్.. టీమిండియా స్కోర్: 246/8
లీస్టర్: ఆంధ్ర బ్యాట్స్‌మన్ కోన శ్రీకర్ భరత్ (111 బంతుల్లో 70 బ్యాటింగ్; 8 ఫోర్లు, 1 సిక్స్) ప్రాక్టీస్ మ్యాచ్‌లో అదరగొట్టాడు. లీస్టర్‌షైర్ బౌలర్లకు స్టార్ బ్యాటర్లంతా తలొగ్గితే తను మాత్రం చక్కని పోరాటం చేశాడు. సన్నాహక మ్యాచ్‌లో మొదటి రోజు కౌంటీ జట్టు బౌలర్ల ప్రతాపమే పూర్తి పైచేయి కాకుండా భరత్ అడ్డుగా, అజేయంగా నిలిచాడు. దీంతో గురువారం తొలిరోజు ఆట ముగిసే సమయానికి భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 60.2 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 246 పరుగులు చేసింది. కెప్టెన్ రోహిత్ శర్మ (25; 3 ఫోర్లు), శుబ్‌మన్ గిల్ (21; 4 ఫోర్లు) పెద్ద స్కోర్లు చేయలేకపోయారు. టెస్టు స్పెషలిస్ట్ హనుమ విహారి (3), శ్రేయస్ అయ్యర్ (0) నిరాశ పరిచారు. విరాట్ కోహ్లి (69 బంతుల్లో 33; 4 ఫోర్లు, 1 సిక్స్) ఆడినంతసేపు తన శైలి షాట్లతో అలరించాడు. రవీంద్ర జడేజా (13) కూడా చేతులెత్తేయగా 81 పరుగులకే భారత్ 5 ప్రధాన వికెట్లను కోల్పోయింది. ఈ దశలో కోహ్లితో జతకట్టిన శ్రీకర్ ఇన్నింగ్స్‌ను కుదుట పరిచాడు. ఇద్దరు అడపాదడపా బౌండరీలతో చప్పగా సాగుతున్న స్కోరు బోర్డుకు ఊపుతెచ్చారు. ఆరో వికెట్‌కు 57 పరుగులు జోడించాక కోహ్లి నిష్క్రమించాడు. శార్దుల్ ఠాకూర్ (6) ఓ ఫోర్‌కొట్టి పెవిలియన్ బాట పట్టగా... టెయిలెండర్లలో ఉమేశ్ యాదవ్ (23; 4 ఫోర్లు) నిలబడటంతో శ్రీకర్ భరత్ జట్టు స్కోరును 200 పరుగులు దాటించగలిగాడు. తర్వాత షమీ (18 బ్యాటింగ్; 2 ఫోర్లు, 1 సిక్స్) కూడా ఓర్పుగా బ్యాటింగ్ చేయడంతో భరత్ అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. లీస్టర్‌షైర్ బౌలర్లలో రోమన్ వాకర్ 5 వికెట్లు పడగొట్టగా, విల్ డేవిస్‌కు 2 వికెట్లు దక్కాయి. భారత ఆటగాళ్లలో అందరికీ ప్రాక్టీస్ కల్పించాలన్న ఉద్దేశంతో నలుగురు ప్రధాన ఆటగాళ్లు బుమ్రా, రిషభ్ పంత్, చతేశ్వర్ పుజారా, ప్రసిధ్ కృష్ణలను లీస్టర్‌షైర్ తరఫున ఆడించారు. వర్షం పదేపదే అంతరాయం కలిగించడంతో తొలిరోజు 60.2 ఓవర్ల ఆటే సాధ్యమైంది. జట్టుతో చేరిన అశ్విన్ కరోనా నుంచి కోలుకున్న ఆఫ్‌స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ బుధవారం ఇంగ్లండ్‌లో అడుగుపెట్టాడు. బుధవారమే లీస్టర్ చేరుకున్న అశ్విన్ గురువారం ఉదయమే భారత జట్టు సహచరులతో టీమ్ డ్రెస్‌లో మైదానానికి వచ్చినా ప్రాక్టీస్ మ్యాచ్ బరిలోకి దిగలేదు. రెండు జట్లలోనూ అశ్విన్ పేరు కనిపించలేదు. అతని పూర్తి స్థాయిలో కోలుకోలేదు కాబట్టి విశ్రాంతి అవసరమని భారత జట్టు మేనేజ్మెంట్ భావించి ఉండవచ్చు. చదవండి:SL vs AUS: శ్రీలంకతో టెస్టు సిరీస్.. ఐదేళ్ల తర్వాత మాక్స్వెల్ రీ ఎంట్రీ..! -
చెలరేగిన డుప్లెసిస్.. ఆర్సీబీ కెప్టెన్‌గా తొలి మ్యాచ్‌లోనే..!
RCB Intra Squad Practice Match: ఐపీఎల్ 2022 సీజన్ ప్రారంభానికి ముందు జరిగిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) ఇంట్రా స్క్వాడ్ ప్రాక్టీస్ మ్యాచ్‌లో ఆటగాళ్లు దుమ్మురేపారు. డుప్లెసిస్ ఎలెవన్, హర్షల్ పటేల్ ఎలెవన్ జట్ల మధ్య జరిగిన ఈ మ్యాచ్‌లో ఇరు జట్ల బ్యాటర్లు చెలరేగి ఆడటంతో భారీ స్కోర్లు నమోదయ్యాయి. తొలుత బ్యాటింగ్ చేసిన డుప్లెసిస్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 215 పరుగులు చేయగా, ఛేదనలో హర్షల్ పటేల్ జట్టు నిర్ణీత ఓవర్లు ముగిసే సమయానికి 213 పరుగులు చేసి, 2 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఫలితంగా ఆర్సీబీ తరఫున డుప్లెసిస్ తొలి విజయాన్ని అందుకున్నాడు. 🔝 performances from our practice match: Faf & Anuj put up a brilliant 100+ run opening partnership. ✅ Sherfane played the role of the finisher perfectly. ✅ #PlayBold #WeAreChallengers #IPL2022 #Mission2022 pic.twitter.com/Ah2d4YdjVP — Royal Challengers Bangalore (@RCBTweets) March 24, 2022 ఈ సన్నాహక మ్యాచ్‌లో డుప్లెసిస్ (40 బంతుల్లో 76), షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్(59), సుయాశ్ ప్రభు దేశాయ్ (46 బంతుల్లో 87)లు అర్ధ సెంచరీలతో చెలరేగగా.. యువ ఆటగాడు అనూజ్ రావత్(46), సీనియర్ ప్లేయర్ దినేశ్ కార్తీక్(21 బంతుల్లో 49), డేవిడ్ విల్లే(17 బంతుల్లో 25)లు రాణించారు. ఇక బౌలింగ్‌లో ఆకాశ్ దీప్ 4 వికెట్లతో అదరగొట్టగా హర్షల్ పటేల్ 3, కర్ణ్ శర్మ 2 వికెట్లతో రాణించారు. ఈ ప్రాక్టీస్ మ్యాచ్‌కు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే, డుప్లెసిస్ సారధ్యంలోని ఆర్సీబీ.. ఆదివారం (మార్చి 27) జరుగబోయే తమ తొలి మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్‌తో తలపడనుంది. Suyash was in full flow scoring 50 plus at a strike rate of close to 200. ✅ Akash Deep was on target, bowling yorkers on demand at pace in the death overs. ✅ Video out soon! Watch this space. 📹#PlayBold #WeAreChallengers #IPL2022 #Mission2022 pic.twitter.com/370oDxlKvT — Royal Challengers Bangalore (@RCBTweets) March 24, 2022 A high-scoring, last over thriller in our first practice match, and we saw some scintillating performances from our boys. Watch @kreditbee presents Bold Diaries to find out more details.#PlayBold #WeAreChallengers #IPL2022 #Mission2022 pic.twitter.com/JQFa4H3afF — Royal Challengers Bangalore (@RCBTweets) March 25, 2022 చదవండి: ఐపీఎల్ 2022 ప్రారంభానికి ముందే సెంచరీ కొట్టిన సీఎస్కే -
బాబర్ అజమ్ బ్యాటింగ్.. రెప్పవాల్చని టీమిండియా ఆటగాళ్లు.. నీకు చెక్‌పెడతాం కదా!
T20 World Cup 2021 IND vs PAK.. టి20 ప్రపంచకప్‌లో భాగంగా టీమిండియా-పాకిస్తాన్ మధ్య అక్టోబర్ 24న జరగనున్న మ్యాచ్ కోసం అభిమానులు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. ఇరు జట్ల మధ్య చాలా రోజుల తర్వాత మ్యాచ్ జరగనుండడంతో హాట్‌టాపిక్‌గా మారిపోయింది. ఎక్కడ చూసిన అభిమానులు ఈ మ్యాచ్‌పై చర్చలు జరుపుతున్నారు. ఈసారి మ్యాచ్‌లో ఎవరు పైచేయి సాధించనున్నారనేది ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ సోమవారం వెస్టిండీస్‌తో వార్మప్ మ్యాచ్ ఆడింది. టీమిండియా కూడా ఇంగ్లండ్‌తో ప్రాక్టీస్ మ్యాచ్ ఆడిన సంగతి తెలిసిందే. చదవండి: T20 World Cup: ఇండియా- పాక్ మ్యాచ్ రద్దు చేసే వీలు లేదు.. ఆడాల్సిందే! అయితే టీమిండియా- ఇంగ్లండ్ మ్యాచ్‌కు ముందు పాకిస్తాన్- విండీస్ మ్యాచ్ జరగడంతో టీమిండియా కోచ్ రవిశాస్త్రి సహా భువనేశ్వర్ కుమార్, దీపక్ చహర్, శార్దూల్ ఠాకూర్లు పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ అజమ్ బ్యాటింగ్ చూస్తూ కనిపించడం వైరల్‌గా మారింది. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. విండీస్‌తో జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్‌లో బాబర్ అజమ్ క్లాస్ హాఫ్‌సెంచరీతో మెరిశాడు. అతని ఇన్నింగ్స్‌లో నాలుగు ఫోర్లు, ఒక సిక్స్ ఉన్నాయి. పైగా బాబర్ అజమ్ ప్రస్త్తుతం వన్డే ర్యాంకింగ్స్‌లో నెంబర్ వన్ బ్యాటర్‌గా ఉన్న సంగతి తెలిసిందే. గత కొన్ని నెలలుగా బాబర్ అజమ్ అత్యధ్బుతమైన ఫామ్‌లో ఉండడంతో టీమిండియాతో మ్యాచ్‌లో కీలకంగా మారాడు. అతని క్లాస్ బ్యాటింగ్‌ను రవిశాస్త్రి సహా మిగతా ఆటగాళ్లు రెప్పవాల్చకుండా చూశారు. అయితే అక్టోబర్ 24న టీమిండియా-పాకిస్తాన్ మధ్య ఫైట్‌లో భాగంగా బాబర్ అజమ్‌ను ఎలా కంట్రోల్ చేయాలనేదానిపై రవిశాస్త్రి భువీ, శార్దూల్, దీపక్ చహర్‌లకు వివరించినట్లు కొందరు అభిమానులు పేర్కొన్నారు. ఇక వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో పాకిస్తాన్ విజయం సాధించగా.. ఇటు ఇంగ్లండ్‌పై వార్మప్ మ్యాచ్‌లో ఇషాన్ కిషన్, కేఎల్ రాహుల్ అర్థ శతకాలతో మెరవడంతో టీమిండియా సునాయాస విజయాన్ని అందుకుంది. కాగా టీమిండియా రేపు(అక్టోబర్ 20న) ఆస్ట్రేలియాతో ప్రాక్టీస్ మ్యాచ్ ఆడనుంది. చదవండి: T20 World Cup: సంభాషణలు ఇలాగే ఉంటాయి మరి.. కోహ్లి, ధోని ఫొటో వైరల్! FANS FROM INDIA COMES TO WATCH BABAR AZAM'S BATTING 😅😅#BabarAzam #T20WorldCup #Pakistan #PAKvIND pic.twitter.com/OsQZ9Zl0ER — Aiman Fatima 🏏 (@Cric_crazy_girl) October 18, 2021 -
Shreyas Iyer: అయ్యర్ కళ్లు చెదిరే సిక్స్.. వీడియో వైరల్
దుబాయ్: టీమిండియా ఆటగాడు శ్రేయాస్ అయ్యర్ ఐపీఎల్ 2021 రెండో అంచె పోటీలకు సిద్ధమవుతున్నాడు. ప్రస్తుతం యూఏఈలో ఉన్న అయ్యర్ దుబాయ్‌లోని ఐసీసీ అకాడమీ మైదానంలో ప్రాక్టీస్‌లో మునిగిపోయాడు. ప్రాక్టీస్ సమయంలో అతను కొట్టిన సిక్సర్ మైదానం అవతల పడింది. దీనికి సంబంధించిన వీడియోను అయ్యర్ తన ఇన్‌స్టాలో షేర్ చేయగా.. సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న శ్రేయాస్ అయ్యర్ భుజం గాయంతో ఈ సీజన్‌కు అనూహ్యంగా దూరమయ్యాడు. అతని గైర్హాజరీలో రిషబ్ పంత్ నాయకత్వం వహించాడు. ఈ సీజన్లో దుమ్మురేపిన ఢిల్లీ క్యాపిటల్స్ 8 మ్యాచ్‌ల్లో 6 విజయాలు.. 2 ఓటములతో పాయింట్ల పట్టికలో తొలి స్థానంలో నిలిచింది. అయితే కరోనా నేపథ్యంలో ఐపీఎల్ 14వ సీజన్ వాయిదా పడిన సంగతి తెలిసిందే. కాగా లీగ్‌లో రెండో అంచె పోటీలు సెప్టెంబర్ 19 నుంచి మొదలుకానుంది. గాయం నుంచి కోలుకున్న అయ్యర్ ఢిల్లీ క్యాపిటల్స్‌కు మళ్లీ నాయకత్వం వహించనున్నాడు. -
మనోళ్ల ప్రాక్టీస్ ముగిసింది
చెస్టర్ లీ స్ట్రీట్: కౌంటీ సెలెక్ట్ ఎలెవన్‌తో జరిగిన మూడు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్‌ను భారత్ ‘డ్రా’గా ముగించింది. గురువారం ఆట ఆరంభించిన భారత్ తన రెండో ఇన్నింగ్స్‌ను 55 ఓవర్లలో మూడు వికెట్లకు 192 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. రవీంద్ర జడేజా (77 బంతుల్లో 51; 4 ఫోర్లు, 1 సిక్స్) మ్యాచ్‌లో రెండో అర్ధ సెంచరీని సాధించాడు. అనంతరం రిటైర్డ్ అవుట్‌గా వెనుదిరిగాడు. రెండో ఇన్నింగ్స్‌లో సారథి రోహిత్ శర్మ బ్యాటింగ్‌కు దిగలేదు. దాంతో భారత ఇన్నింగ్స్‌ను మయాంక్ అగర్వాల్ (81 బంతుల్లో 47; 7 ఫోర్లు), పుజారా (58 బంతుల్లో 38; 5 ఫోర్లు) ఆరంభించారు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 87 పరుగులు జోడించారు. మయాంక్, పుజారా అవుటయ్యాక క్రీజులోకి వచ్చిన హనుమ విహారి (105 బంతుల్లో 43 నాటౌట్; 3 ఫోర్లు), జడేజా నిలకడగా బ్యాటింగ్ చేశారు. జాక్ కార్సన్ రెండు వికెట్లు తీశాడు. భారత్ ప్రత్యర్థి ముందు 284 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. రెండో ఇన్నింగ్స్ మొదలు పెట్టిన కౌంటీ జట్టు 15.5 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 31 పరుగులు చేసిన దశలో ఫలితం తేలదనే ఉద్దేశంతో ఇరు జట్ల కెప్టెన్లు కూడా ‘డ్రా’కు అంగీకరించారు. దాంతో రోజు ఆటలో మరో 19 ఓవర్లు మిగిలి ఉండగానే మ్యాచ్ ముగిసింది. హసీబ్ అహ్మద్ (48 బంతుల్లో 13 నాటౌట్; 1 ఫోర్), జేక్ లిబీ (48 బంతుల్లో 17 నాటౌట్; 1 ఫోర్) అజేయంగా నిలిచారు. తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ చేసిన హసీబ్ అహ్మద్ ఇంగ్లండ్ జట్టులో చోటు దక్కించుకున్నాడు. భారత్‌తో జరిగే తొలి రెండు టెస్టు మ్యాచ్‌ల కోసం 17 మందితో కూడిన జట్టును ఇంగ్లండ్ గురువారం ప్రకటించింది. -
హడలెత్తించిన ఉమేశ్, సిరాజ్
చెస్టర్ లీ స్ట్రీట్: భారత బౌలర్ల ప్రాక్టీస్ అదిరింది. కౌంటీ సెలెక్ట్ ఎలెవన్‌తో జరుగుతున్న మూడు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్‌లో సమష్టిగా రాణించిన భారత బౌలర్లు ప్రత్యర్థిని తక్కువ పరుగులకే కట్టడి చేశారు. బుధవారం బ్యాటింగ్‌కు దిగిన కౌంటీ జట్టు 82.3 ఓవర్లలో 220 పరుగులకు ఆలౌటైంది. పేసర్లు ఉమేశ్ యాదవ్ (3/22), మొహమ్మద్ సిరాజ్ (2/32) పదునైన బంతులతో కౌంటీ బ్యాట్స్‌మెన్‌ను ఇబ్బంది పెట్టారు. ఓపెనర్ హసీబ్ హమీద్ (246 బంతుల్లో 112; 13 ఫోర్లు) శతకంతో జట్టును ఆదుకున్నాడు. అతడు మినహా మిగిలిన బ్యాట్స్‌మెన్ పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. కౌంటీ తరఫున బరిలోకి దిగిన భారత ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ (1) ప్రాక్టీస్‌ను సద్వినియోగం చేసుకోలేదు. భారత్ 91 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యాన్ని అందుకుంది. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 306/9తో రెండో రోజు ఆటను కొనసాగించిన భారత్... మరో ఐదు పరుగులు మాత్రమే జోడించి 93 ఓవర్లలో 311 పరుగులకు ఆలౌటైంది. క్రెయిగ్ మిల్స్ నాలుగు వికెట్లు తీశాడు. అవేశ్ ఖాన్ అవుట్ భారత యువ పేసర్ అవేశ్ ఖాన్ ఇంగ్లండ్ పర్యటన అర్ధాంతరంగా ముగిసిపోయింది. గాయంతో ఇంగ్లండ్‌తో జరిగే ఐదు మ్యాచ్‌ల సిరీస్‌కు దూరమయ్యాడు. భారత్‌తో జరుగుతున్న ప్రాక్టీస్ మ్యాచ్‌లో సెలెక్ట్ ఎలెవన్ తరఫున అవేశ్ ఖాన్ బరిలోకి దిగాడు. తొలి రోజు ఆటలో ఇన్నింగ్స్ 10వ ఓవర్‌ను అవేశ్ ఖాన్ బౌలింగ్ చేయగా.... విహారి కొట్టిన రిటర్న్ షాట్‌ను ఆపే ప్రయత్నంలో అతడి ఎడమ చేతి బొటన వేలుకు గాయమైంది. స్కానింగ్‌లో అవేశ్ వేలు విరిగినట్లు తేలింది. అతడు కోలుకోవడానికి కనీసం నెల రోజులకు పైగా సమయం పడుతుందని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు. -
కోహ్లీ సేనకు గుడ్ న్యూస్.. కరోనా నుంచి పూర్తిగా కోలుకున్న పంత్
డర్హమ్: కోహ్లీ సేనకు గుడ్ న్యూస్. ఇంగ్లండ్ పర్యటనలో కరోనా బారిన పడిన టీమిండియా వికెట్ కీపర్, డాషింగ్ బ్యాట్స్‌మన్ రిషబ్ పంత్ కోలుకున్నాడు. తాజాగా నిర్వహించిన పరీక్షల్లో అతనికి నెగటివ్ వచ్చినట్లు జట్టు వర్గాలు వెల్లడించాయి. దీంతో డర్హమ్‌లో ఏర్పాటు చేసిన టీమిండియా ప్రాక్టీస్ క్యాంప్‌లో అతను జూలై 21న చేరనున్నాడు. అయితే, రేపటి(జులై 20) నుంచి కౌంటీ ఎలెవన్‌తో ప్రారంభమయ్యే సన్నాహక మ్యాచ్‌కు మాత్రం అతను దూరం కానున్నాడు. కాగా, ఇంగ్లండ్‌లోని వివిధ కౌంటీ జట్ల నుంచి 15 మంది ఆటగాళ్లు కౌంటీ ఎలెవన్ తరఫున ఆడనున్నారు. వార్విక్షైర్ కెప్టెన్ విల్ రోడ్స్ ఈ జట్టుకు నాయకత్వం వహించనున్నాడు. ఈ మూడు రోజుల వార్మప్ మ్యాచ్ ఖాళీ స్టేడియంలో జరగనున్నట్లు డర్హమ్ కౌంటీ బోర్డు ప్రకటించింది. ఇదిలా ఉంటే, త్రోడౌన్ స్పెషలిస్ట్ దయానంద్ గరానీకి కూడా కరోనా పాజిటీవ్‌గా తేలడంతో అతనితో సన్నిహితంగా ఉన్న వృద్దిమాన్ సాహా ఐసోలేషన్‌లో ఉన్నాడు. దీంతో రేపటి ప్రాక్టీస్ మ్యాచ్‌లో కేఎల్ రాహుల్ వికెట్ కీపింగ్ చేయనున్నాడు. ఇంగ్లండ్‌లో ఇటీవల డెల్టా వేరియంట్ కరోనా వైరస్ వేగంగా వ్యాపి చెందుతోంది. రిషబ్ పంత్ కూడా ఈ వైరస్ బారిన పడినట్లు ప్రచారం జరిగింది. ఇటీవల యూరో ఛాంపియన్షిప్ మ్యాచ్‌ను చూసొచ్చిన పంత్.. తేలికపాటి జ్వరంతో బాధపడ్డాడు. ఆ సమయంలో చేయించుకున్న పరీక్షల్లో అతనికి పాజిటివ్ వచ్చినట్లు సమాచారం. మరోవైపు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ అనంతరం భారత ఆటగాళ్లకు బీసీసీఐ బ్రేక్ ఇచ్చింది. దాంతో బయో బబుల్ వీడిన ఆటగాళ్లు 20 రోజుల పాటు ఇంగ్లండ్ పర్యాటక ప్రదేశాలను సందర్శించారు. అనంతరం డర్హమ్‌లో ఏర్పాటు చేసిన క్వారంటైన్ పూర్తి చేసుకొని ప్రాక్టీస్ మ్యాచ్‌కు సిద్దమయ్యారు. -
నేనిక్కడే ఉన్నా, వచ్చేయమంటారా.. టీమిండియాకు డీకే బంపర్ ఆఫర్
లండన్: టీమిండియా వికెట్ కీపర్లు రిషబ్ పంత్, వృద్దిమాన్ సాహాలు కరోనా కారణంగా ఐసోలేషన్‌లో ఉన్న విషయం తెలిసిందే. దీంతో ఈనెల 20 నుంచి కౌంటీ ఛాంపియన్షిప్ జట్టుతో ప్రారంభం కాబోయే ప్రాక్టీస్ మ్యాచ్‌లో భారత వికెట్ కీపర్ ఎవరన్నది ప్రస్తుతం ప్రశ్నార్ధకంగా మారింది. ఈ నేపథ్యంలో తాను ఇంగ్లండ్‌లోనే ఉన్నాను, వచ్చేయమంటారా అంటూ టీమిండియా వెటరన్ వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్ టీమిండియాకు బంపర్ ఆఫర్ ఇచ్చాడు. డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్‌తో వ్యాఖ్యాతగా కొత్త అవతారమెత్తిన డీకే.. క్రికెట్‌కు వీడ్కోలు పలుకకుండానే కామెంటేటర్‌గా మారిపోయాడు. స్కైస్పోర్ట్స్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుని ప్రస్తుతం ఇంగ్లండ్‌లోనే ఉన్నాడు. 😋 #justsaying pic.twitter.com/zX3ValErDc — DK (@DineshKarthik) July 15, 2021 ఇదిలా ఉంటే, టీమిండియాలోని ఇద్దరు స్పెషలిస్ట్ వికెట్ కీపర్లు కరోనా కారణంగా ఐసోలేషన్‌కు పరిమితం కావడంతో జట్టులో వికెట్ కీపింగ్ అనుభవమున్న కేఎల్ రాహుల్‌వైపు అందరూ చూస్తున్నారు. అయితే రాహుల్‌కు గతంలో పరిమిత ఓవర్ల క్రికెట్లో మాత్రమే కీపింగ్ చేసిన అనుభవం ఉంది. అందులోనూ రెగ్యులర్ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ గాయం కారణంగా సిరీస్ మొత్తానికి దూరం కావడంతో ఓపెనింగ్ బాధ్యతలు రాహుల్‌పైనే పడే ఆస్కారం ఉంది. దీంతో టీమిండియా యాజమాన్యం అతనిపై అధిక భారం వేసేంత సాహసం చేయకపోవచ్చనే అభిప్రాయాలు వినపడుతున్నాయి. ఇలాంటి సమయంలో దినేశ్ కార్తీక్ చేసిన ట్వీట్ టీమిండియా పాలిట బంపర్ ఆఫర్‌గా మారింది. అయితే, డీకే.. క్రికెట్ కిట్‌తో పెట్టిన ట్వీట్లో 'జస్ట్ సేయింగ్' అన్న క్యాప్షన్ జోడించడం విశేషం. -
సిక్సర్లతో విరుచుకుపడిన హార్ధిక్, పృథ్వీ షా, సూర్యకుమార్..
కొలంబో: శ్రీలంకతో వన్డే సిరీస్ ఆరంభానికి ముందు జరిగిన రెండో ఇంట్రా స్క్వాడ్ ప్రాక్టీస్ మ్యాచ్‌లో టీమిండియా ఆటగాళ్లు అదరగొట్టారు. గురువారం మొదలైన ఈ మ్యాచ్‌లో తొలుత టీమిండియా స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్(3 వికెట్లు), యజ్వేంద్ర చహల్(2 వికెట్లు) సత్తా చాటగా, శుక్రవారం భారత బ్యాట్స్మెన్లు బౌండరీలు, సిక్సర్లతో చెలరేగిపోయారు. హార్దిక్ పాండ్యా, పృథ్వీ షా, సూర్యకుమార్ యాదవ్, నితీష్ రాణాలు ఆకాశమే హద్దుగా చెలరేగిపోయి బౌలర్లకు చుక్కలు చూపించారు. వారు రెగ్యులర్ మ్యాచ్ ఎలా ఆడతారో, అలా సీరియస్‌గా బ్యాటింగ్ చేస్తూ.. ఎంతో కాన్ఫిడెంట్‌గా కనిపించారు. దీనికి సంబంధించిన వీడియోను శ్రీలంక క్రికెట్ యూట్యూబ్ ఛానల్లో షేర్ చేసింది. కాగా, నిన్నటి సెషన్లో చహల్, కుల్దీప్తో పాటు నవదీప్ సైనీ, దీపక్ చహర్, చేతన్ సకారియాలు కూడా వికెట్లు పడగొట్టారు. నితీష్ రాణా, కృష్ణప్ప గౌతమ్‌ల వికెట్లను చహల్ తీయగా.. సైనీ, తన ఖాతాలో దేవదత్ పడిక్కల్, హార్దిక్ పాండ్యాల వికెట్లను వేసుకున్నాడు. జట్టు కెప్టెన్ శిఖర్ ధావన్ వికెట్‌ను చేతన్ సకారియా దక్కించుకున్నాడు. ఇదిలా ఉంటే భారత్, శ్రీలంక జట్ల మధ్య తొలి వన్డే జులై 13న, జులై 16న రెండో వన్డే, 18న మూడో వన్డే జరుగనున్నాయి. అనంతరం జులై 21న తొలి టీ20.. జులై 23, 25న మిగిలిన రెండు టీ20 మ్యాచ్‌లు జరుగనున్నాయి. భారత జట్టు: శిఖర్ ధవన్ (కెప్టెన్), భువనేశ్వర్ కుమార్ (వైస్ కెప్టెన్), పృథ్వీ షా, దేవదత్ పడిక్కల్, హార్దిక్ పాండ్యా, రుతురాజ్ గైక్వాడ్, సూర్యకుమార్ యాదవ్, మనీష్ పాండే, నితీష్ రాణా, ఇషాన్ కిషన్, సంజు శాంసన్, యుజ్వేంద్ర చహల్, రాహుల్ చాహర్, కృష్ణప్ప గౌతమ్, కృనాల్ పాండ్యా, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, దీపక్ చహర్, నవ్‌దీప్ సైనీ, చేతన్ సకారియా. -
ప్రాక్టీస్‌లో అదరగొట్టిన కుల్దీప్, చహల్.. వీడియో వైరల్
కొలంబొ: శ్రీలంకతో వన్డే సిరీస్ ఆరంభానికి ముందు ప్రాక్టీస్ మ్యాచ్‌లో టీమిండియా ఆటగాళ్లు మంచి ఫామ్ కనబరుస్తున్నారు. ముఖ్యంగా భారత స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్, యజ్వేంద్ర చహల్‌లు గురువారం ఇంట్రాస్క్వాడ్ మ్యాచ్ సందర్భంగా తమ బౌలింగ్‌తో మెరిశారు. నితీష్ రాణా, కృష్ణప్ప గౌతమ్‌ల వికెట్లను చహల్ తీయగా.. కుల్దీప్ యాదవ్ మూడు వికెట్లతో రాణించాడు. దీనికి సంబంధించిన వీడియోను శ్రీలంక క్రికెట్ యూట్యూబ్ చానెల్లో షేర్ చేసింది. కాగా చహల్, కుల్దీప్తో పాటు నవదీప్ సైనీ, దీపక్ చహర్, చేతన్ సకారియాలు కూడా వికెట్లతో మెరిశారు. సైనీ ఖాతాలో దేవదత్ పడిక్కల్, హార్దిక్ పాండ్యాలు వికెట్లు ఉండగా.. ప్రస్తుత కెప్టెన్ శిఖర్ ధావన్ వికెట్‌ను చేతన్ సకారియా దక్కించుకున్నాడు. కాగా ఇంగ్లండ్‌తో స్వదేశంలో జరిగిన వన్డే, టీ20 సిరీస్‌లలో కుల్దీప్ యాదవ్ ఘోరంగా విఫలమవడం విమర్శలకు దారి తీసింది. చహల్ కూడా అంతంత ప్రదర్శన మాత్రమే నమోదు చేయడంతో లంకతో సిరీస్ వీరిద్దరికి కీలకం కానుంది. ఇక కెప్టెన్ శిఖర్ ధావన్, వైస్ కెప్టెన్ భువనేశ్వర్ కుమార్ల సారధ్యంలో రెండు జట్లుగా విడిపోయిన టీమిండియా ఇంట్రాస్కా్వడ్ మ్యాచ్‌లను ముగించుకొని జూలై 13న లంకతో తొలి వన్డే ఆడేందుకు సిద్ధమైంది. -
మనీశ్ పాండే పోరాటం వృధా.. ప్రాక్టీస్ మ్యాచ్‌లో భువీ సేన విజయం
కొలంబో: పరిమిత ఓవర్ల సిరీస్ కోసం శ్రీలంక పర్యటనకు వెళ్లిన శిఖర్ ధవన్ నేతృత్వంలోని భారత జట్టు.. క్వారంటైన్ పూర్తి చేసుకొని, తాజాగా ఓ ఇంట్రా స్క్వాడ్ మ్యాచ్ ఆడింది. కెప్టెన్ ధవన్, వైస్ కెప్టెన్ భువనేశ్వర్ కుమార్ల నేతృత్వంలో రెండు జట్లుగా విడిపోయి ఈ సన్నాహక మ్యాచ్ ఆడుతున్నారు. ఇందులో తొలుత బ్యాటింగ్ చేసిన ధవన్ జట్టు.. అద్భుతంగా రాణించి, నిర్ణీత 20 ఓవర్లలో 154 పరుగులు చేసింది. High Energy ⚡️ Full🔛 Intensity 💪 A productive day in the field for #TeamIndia during their T20 intra squad game in Colombo 👌 👌#SLvIND pic.twitter.com/YLbUYyTAkf — BCCI (@BCCI) July 5, 2021 The recap with a twist 🔀 Paras Mhambrey takes the 9⃣0⃣-seconds match-rewind ⏪ challenge 😎 😎 Watch NOW ⌛️ 🎥#TeamIndia #SLvIND pic.twitter.com/UTpRH0V9ug — BCCI (@BCCI) July 5, 2021 మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ మనీశ్ పాండే(45 బంతుల్లో 63) అర్ధశతకంతో రాణించగా, రుతురాజ్ గైక్వాడ్, ధవన్ పర్వాలేదనిపించారు. ప్రత్యర్ధి కెప్టెన్ భువనేశ్వర్ కుమార్(2/23) బౌలింగ్‌లో రాణించాడు. అనంతరం ఛేదనలో సూర్యకుమార్ యాదవ్, పృథ్వీ షా, పడిక్కల్‌లు మెరుపు ఇన్నింగ్స్ ఆడటంతో భువీ సేన 17 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేరుకుని అద్భుత విజయం సాధించింది. ఇదిలా ఉంటే, రాహుల్ ద్రవిడ్ పర్యవేక్షణలో లంకకు బయల్దేరిన టీమిండియా.. ఆతిథ్య జట్టుతో మూడు వన్డేలు, మూడు టీ20ల సిరీస్‌లు ఆడనుంది. ఇందు కోసం 20 మంది సభ్యులతో కూడిన జట్టును ఎంపిక చేసిన భారత సెలెక్షన్ కమిటీ.. ఐదుగురిని నెట్ బౌలర్లుగా ఎంపిక చేసింది. కోహ్లీ నేతృత్వంలోని భారత రెగ్యులర్ జట్టు ఇంగ్లండ్ పర్యటనలో ఉండగానే భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) ప్రయోగాత్మకంగా శిఖర్ ధవన్ నేతృత్వంలోని యువ జట్టును శ్రీలంకకు పంపింది. ఐపీఎల్, భారత్ ఏ తరఫున సత్తా చాటిన ఆటగాళ్లను ఈ టూర్‌కు ఎంపిక చేసింది. ఇరు జట్ల మధ్య తొలి వన్డే ఈనెల 13న జరుగనుంది. భారత జట్టు: శిఖర్ ధవన్(కెప్టెన్), పృథ్వీ షా, దేవదత్ పడిక్కల్, రుత్‌రాజ్ గైక్వాడ్, సూర్యకుమార్ యాదవ్, మనీశ్ పాండే, హార్దిక్ పాండ్యా, నితీశ్ రాణా, ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), సంజూ శాంసన్(వికెట్ కీపర్), యజువేంద్ర చాహల్, రాహుల్ చహర్, కృష్ణప్ప గౌతం, కృనాల్ పాండ్యా, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, భువనేశ్వర్ కుమార్(వైస్ కెప్టెన్), దీపక్ చహర్, నవదీప్ సైనీ, చేతన్ సకారియా నెట్ బౌలర్లు: ఇషాన్ పోరెల్, సందీప్ వారియర్, అర్షదీప్ సింగ్, సాయి కిషోర్, సిమ్రన్ జీత్ సింగ్ -
కోహ్లీ సేనకు గుడ్ న్యూస్.. ప్రాక్టీస్ మ్యాచ్‌కు ఓకే చెప్పిన ఈసీబీ
లండన్: ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న కోహ్లీ సేనకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) శుభవార్త చెప్పింది. టెస్టు సిరీస్ ప్రారంభానికి ముందు ఓ ప్రాక్టీస్ మ్యాచ్ ఆడేందుకు ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డును (ఈసీబీ) ఒప్పించింది. ఎలాంటి ప్రాక్టీస్ మ్యాచ్ లేకుండా నేరుగా ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్ బరిలో దిగిన భారత్.. సౌతాంఫ్టన్ పరిస్థితులను అర్ధం చేసుకోలేక చేతులెత్తేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ తప్పు మరోసారి పునరావృతం కాకుండా బీసీసీఐ జాగ్రత్త పడింది. దీంతో జులై 20-22 మధ్య మూడు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్‌ను ఈసీబీ షెడ్యూల్ చేసిందని తెలుస్తోంది. అయితే భారత జట్టుతో తలపడే ప్రత్యర్థి ఎవరన్నది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం బయో బబుల్ నుంచి బయటకు వచ్చి.. కుటుంబంతో గడుపుతున్న కోహ్లీసేన తిరిగి రాగానే ఈ మ్యాచ్ జరుగనుంది. ఇదిలా ఉంటే, భారత్, ఇంగ్లండ్‌ల మధ్య ఆగష్టు 4 నుంచి తొలి టెస్ట్ ప్రారంభంకానుంది. -
శతక్కొట్టిన పంత్.. ఫిఫ్టీతో ఆకట్టుకున్న గిల్
సౌతాంప్టన్: ఇంగ్లండ్ పిచ్‌లకి టీమిండియా డాషింగ్ బ్యాట్స్‌మెన్ రిషబ్ పంత్ తొందరగానే అలవాటుపడినట్లు కనిపిస్తోంది. ఈ నెల 3న సౌతాంప్టన్‌కి చేరుకున్న భారత క్రికెటర్లు.. గత మూడు రోజులుగా ప్రాక్టీస్ సెషన్స్‌లో బిజీగా గడుపున్నారు. ఈ క్రమంలో నిన్న భారత బృందం రెండు జట్లుగా విడిపోయి ఓ ప్రాక్టీస్ మ్యాచ్ ఆడింది. ఇందులో రిషబ్ పంత్ అద్భుత శతకంతో (94 బంతుల్లోనే 121 పరుగులు) అజేయంగా నిలువగా, యువ ఓపెనర్ శుభమన్ గిల్ అర్ధశతకంతో (135 బంతుల్లో 85 పరుగులు) రాణించాడు. వీరిద్దరి ధాటికి సహచర బౌలర్లు ధారాళంగా పరుగులు సమర్పించుకోగా, ఇషాంత్ శర్మ(3/36) ఒక్కడే పొదుపుగా బౌలింగ్ చేయడంతో పాటు వికెట్లు దక్కించుకున్నాడు. ఈ స్కోర్‌కు సంబంధించిన వివరాలను బీసీసీఐ తమ అధికారిక ట్విటర్ ద్వారా వెల్లడించింది. అయితే, ఈ మ్యాచ్‌లో కెప్టెన్ కోహ్లీ, ఓపెనర్ రోహిత్ శర్మ, వైస్ కెప్టెన్ అజింక్య రహానే ఎంత స్కోరు చేశారన్న విషయాన్ని బీసీసీఐ ప్రకటించలేదు. ఇదిలా ఉంటే, 2018లో మొదటిసారి ఇంగ్లండ్‌లో పర్యటించిన రిషబ్ పంత్.. సూపర్ సెంచరీతో తనను తాను ప్రూవ్ చేసుకున్నాడు. తాజాగా ప్రాక్టీస్ మ్యాచ్‌లోనూ శతక్కొట్టడంతో ఇంగ్లండ్ పిచ్‌లపై అతని రికార్డు మరింత మెరుగుపడింది. భారత్, న్యూజిలాండ్ మధ్య సౌథాంప్టన్ వేదికగా జూన్ 18 నుంచి 22 వరకు జరుగనున్న ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ నేపథ్యంలో.. పంత్ ఫామ్‌లోకి రావడం భారత జట్టులో ఉత్సాహాన్ని నింపుతుంది. కాగా, డబ్యూటిసీ ఫైనల్ తర్వాత భారత్.. ఆగస్టు 4 నుంచి సెప్టెంబరు 14 మధ్యలో ఇంగ్లండ్‌తో ఐదు టెస్టుల సిరీస్‌లో తలపడనుంది. చదవండి: India vs Sri Lanka: రేపటి నుంచి ధవన్ సేన క్వారంటైన్ షురూ -
ప్రాక్టీస్ ప్రతిఫలం మనకే
కోహ్లి తప్ప అందరూ బరిలోకి దిగారు. ఒకరిద్దరు మినహా అంతా బాగా ఆడారు. డే–నైట్ టెస్టుకు ముందు కావాల్సినంత ప్రాక్టీస్ ఈ డే–నైట్ వార్మప్ మ్యాచ్‌తో వచ్చేసింది. అంతకుమించి భారత్‌కు క్లారిటీ ఇచ్చిన మ్యాచ్ కూడా ఇదే! ఓపెనింగ్ నుంచి సీమర్ల దాకా తుది జట్టులో ఎవరిని ఎంపిక చేయొచ్చో టీమ్ మేనేజ్మెంట్కు స్పష్టతనిచ్చింది. ఇక ఈ పర్యటనలో మిగిలున్న ‘టెస్టు’లకు భారత్ సై అంటోంది. సిడ్నీ: ఆఖరి ప్రాక్టీస్ మ్యాచ్‌లో ఆఖరి రోజు ఆస్ట్రేలియన్ బ్యాట్స్‌మెన్ శతక్కొట్టి ఉండవచ్చు... తుదకు మ్యాచ్ ‘డ్రా’ అయిండొచ్చు... కానీ ఓవరాల్‌గా బోలెడు లాభాలు ఒరిగింది మాత్రం కచ్చితంగా టీమిండియాకే. ఈ మ్యాచ్ జట్టు కూర్పునకు దోహదం చేసింది. లయతప్పిన పంత్‌ను ఫామ్‌లోకి తెచ్చింది. ఓపెనింగ్‌లో శుబ్‌మన్ గిల్ చక్కని ప్రత్యామ్నాయం అనిపించింది. విహారిని అక్కరకొచ్చే పార్ట్‌టైమ్ బౌలర్ (స్పిన్)గా, మిడిలార్డర్లో దీటైన బ్యాట్స్‌మన్‌గా నిలబెట్టింది. ఇక మ్యాచ్ పింక్‌బాల్ ప్రాక్టీస్ కూడా ‘డ్రా’ ఫలితాన్నే ఇచ్చింది. ఆఖరి రోజు సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ (ఎస్సీజీ) పూర్తిగా బ్యాటింగ్ వికెట్‌గా మారింది. దీంతో భారత బౌలర్ల శ్రమంతా నీరుగారింది. ఇదే సమయంలో ఆస్ట్రేలియా ‘ఎ’ జట్టులో బెన్ మెక్‌డెర్మట్ (107 నాటౌట్; 16 ఫోర్లు), జాక్ విల్డర్‌ముత్ (111 నాటౌట్; 12 ఫోర్లు, 3 సిక్సర్లు) అజేయ శతకాలతో నిలబడ్డారు. మ్యాచ్ ముగిసే సమయానికి ఆస్ట్రేలియా ‘ఎ’ రెండో ఇన్నింగ్స్‌లో 75 ఓవర్లలో 4 వికెట్లకు 307 పరుగులు చేసింది. ‘కంగారూ’ పెట్టిన ఆరంభం... భారత్ క్రితం రోజు స్కోరు వద్దే డిక్లేర్ చేసింది. దీంతో చివరి రోజు 473 పరుగుల లక్ష్యంతో ఆదివారం రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన ఆస్ట్రేలియా ‘ఎ’ను భారత్ పేసర్లు షమీ (2/58), సిరాజ్ (1/54) వణికించారు. ఓపెనర్లు హారిస్ (5), బర్న్స్ (1), వన్‌డౌన్‌లో మ్యాడిన్సన్ (14)లను భారత సీమ్ ద్వయం పడేసింది. అలా టాపార్డర్‌ను 25 పరుగులకే కోల్పోయింది. ఈ దశలో మెక్‌డెర్మట్, కెప్టెన్ అలెక్స్ క్యారీ (111 బంతుల్లో 58; 7 ఫోర్లు) ఇన్నింగ్స్‌ను కుదుట పరిచారు. పేసర్లను దీటుగా ఎదుర్కొన్నారు. దీంతోపాటే మ్యాచ్ సాగుతున్నకొద్దీ పిచ్ కూడా బ్యాట్స్‌మెన్‌కు స్వర్గధామమైంది. ఎస్సీజీ సహజంగానే బ్యాటింగ్ పిచ్ కావడంతో భారత బౌలర్ల వ్యూహాలు పనిచేయలేదు. మెక్‌డెర్మట్, క్యారీ అర్ధసెంచరీలను పూర్తి చేసుకున్నారు. నాలుగో వికెట్‌కు 117 పరుగులు జోడించాక క్యారీని హనుమ విహారి బోల్తా కొట్టించాడు. 142 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయిన ఆసీస్ ఆ తర్వాత మరో వికెట్‌నే చేజార్చుకోలేదు. విల్డర్‌ముత్ వన్డేను తలపించేలా బ్యాటింగ్ చేశాడు. పిచ్ సానుకూలతల్ని సద్వినియోగం చేసుకున్న అతను భారీ సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. ఇది సరే... కానీ! ఆస్ట్రేలియా ‘ఎ’ బ్యాట్స్‌మన్ ఆఖరి రోజు అదరగొట్టారు. అజేయ సెంచరీలు సాధించారు. అయితే ఈ ఉత్సాహమేది ఆతిథ్య జట్టును ఊరడించలేదు. ఎందుకంటే గాయాలతో సతమతమవుతున్న ఆస్ట్రేలియాకు ఇదేమాత్రం కలిసొచ్చే అంశం కాదు. ప్రధానంగా ఓపెనింగ్ సమస్య ఆసీస్‌కు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. వార్నర్ పూర్తిగా కోలుకోలేదు. యువ ఓపెనర్ పకోవ్‌స్కీ కన్కషన్ అయ్యాడు. ఇతని స్థానంలో ఆడిన హారిస్ విఫలమయ్యాడు. జో బర్న్స్ అయితే నిరాశపరిచాడు. దీంతో ఆస్ట్రేలియాకు ఇపుడు ఓపెనర్ల సమస్య కాదు... ఓపెనర్లే కరువైన సమస్య వచ్చిపడింది. స్కోరు వివరాలు భారత్ తొలి ఇన్నింగ్స్: 194 ఆస్ట్రేలియా ‘ఎ’ తొలి ఇన్నింగ్స్: 108 భారత్ రెండో ఇన్నింగ్స్: 386/4 డిక్లేర్డ్ ఆస్ట్రేలియా ‘ఎ’ రెండో ఇన్నింగ్స్: హారిస్ (సి) పృథ్వీ షా (బి) షమీ 5; బర్న్స్ (ఎల్బీడబ్ల్యూ) (బి) షమీ 1; మ్యాడిన్సన్ (సి)సైనీ (బి) సిరాజ్ 14; మెక్‌డెర్మట్ (నాటౌట్) 107; క్యారీ (సి) సబ్–కార్తీక్ త్యాగి (బి) విహారి 58; విల్డర్‌ముత్ (నాటౌట్) 111 ఎక్స్‌ట్రాలు 11; మొత్తం (75 ఓవర్లలో 4 వికెట్లకు) 307. వికెట్ల పతనం: 1–6, 2–11, 3–25, 4–142. బౌలింగ్: షమీ 13–3–58–2, బుమ్రా 13–7–35–0, సిరాజ్ 17–3–54–1, సైనీ 16–0–87–0, హనుమ విహారి 7–1–14–1, మయాంక్ అగర్వాల్ 6–0–30–0, పృథ్వీ షా 3–0–26–0. మెక్‌డెర్మట్, విల్డర్‌ముత్ -
అంపైర్ చీటింగ్.. అసలు అది ఔట్ కాదు
సిడ్నీ : ఆస్ట్రేలియా -ఎతో జరుగుతున్న మూడు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్‌లో టీమిండియా ఆటగాడు శుబ్‌మన్ గిల్ అవుటైన విధానం సోషల్ మీడియాలో కాంట్రవర్సీగా మారింది. అసలు అంపైర్ దేనిని పరిగణలోకి తీసుకొని గిల్ విషయంలో ఔట్ ఇచ్చాడో అర్థం కావడం లేదని నెటిజన్లు తలగోక్కున్నారు. అసలు విషయంలోకి వెళితే.. ఆసీస్ ఎతో మ్యాచ్‌లో రెండో ఇన్నింగ్స్‌లో 65 పరుగులతో మంచి టచ్‌లో ఉన్న శుబ్‌మన్ గిల్‌ను ఆసీస్ బౌలర్ మిచెల్ స్వేప్సన్ ఔట్ చేశాడు. అయితే స్వేప్సన్ వేసిన బంతి గిల్ ప్యాడ్లను తాగి స్లిప్‌లోకి వెళ్లింది.. స్లిప్‌లో ఉన్న సీన్ అబాట్ దాన్ని క్యాచ్‌గా అందుకున్నాడు. అప్పటికే స్వేప్సన్ అంపైర్‌కు అప్పీల్ చేయగా.. అంపైర్ ఔట్ అని ప్రకటించాడు. కాగా స్కోరుబోర్డులో గిల్ క్యాచ్ అవుట్ అయినట్లుగా చూపించారు. (చదవండి : 'క్రికెటర్ కాకపోయుంటే రైతు అయ్యేవాడు') అంపైర్ ఎల్బీ లేక క్యాచ్‌లో ఏది పరిగణలోకి తీసుకొని అవుట్‌గా ఇచ్చాడనే దానిపై స్పష్టత రాలేదు. దీంతో షాక్ తిన్న గిల్ అసలు ఔటా.. కాదా అన్న సందేహంతో కాసేపు అక్కడే నిలుచుండిపోయాడు. ప్రాక్టీస్ మ్యాచ్ కావడంతో డీఆర్ఎస్ అవకాశం లేకపోవడంతో గిల్ నిరాశగా వెళ్లిపోయాడు. వాస్తవానికి రీప్లేలో స్వేప్సన్ వేసిన బంతి గిల్ ప్యాడ్లను తాకి ఆఫ్‌స్టంట్ పై నుంచి వెళ్తున్నట్లు కనిపించింది.. దీంతో అతను ఎల్బీగా అవుట్ కాదు. ఇక బంతి బ్యాట్‌ను తాకకుండా కేవలం గిల్ ప్యాడ్లను మాత్రమే తాకి స్లిప్‌లో ఉన్న అబాట్ చేతుల్లో పడింది. అలా చూసినా గిల్ ఔట్ కాదని స్పష్టంగా తెలుస్తుంది. కాగా దీనికి సంబంధించిన వీడియో ట్విటర్లో షేర్ చేశారు. ఇది చీటింగ్ అసలు గిల్ ఔట్ కానే కాదు.. అది అంపైర్ తప్పుడు నిర్ణయం.. గిల్ నాటౌట్.. రాంగ్ అంపైరింగ్ అంటూ కామెంట్లు పెట్టారు. ఇదే విషయమై టీమిండియా మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రా స్పందించాడు. 'శుబ్‌మన్ ఎలా అవుటయ్యాడో అంపైర్ చెప్పాలి.. కచ్చితంగా ఎల్బీ మాత్రం కాదు.. క్యాచ్ అవుటా అంటే ఆ చాన్సే లేదు..' అంటూ చురకలంటించాడు. (చదవండి : రషీద్‌ను దంచేసిన ఆసీస్ బ్యాట్స్‌మన్) Gill given out caught, and what a catch it was too! What's your call? #AUSAvIND pic.twitter.com/fDFwB7IUBU — cricket.com.au (@cricketcomau) December 12, 2020 ఇక ఆసీస్-ఎ, టీమిండియాల మధ్య జరిగిన మూడు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్ డ్రాగా ముగిసింది. 472 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్-ఎ మూడో రోజు ఆట ముగిసే సమయానికి 4 వికెట్ల నష్టానికి 307 పరుగులు చేసింది. ఆసీస్ బ్యాట్స్మెన్లలో జాక్ వైల్డర్ మత్ సెంచరీతో మెరవగా.. కెప్టెన్ అలెక్స్ కేరీ 58 పరుగులతో రాణించాడు. మొదటి ఇన్నింగ్స్‌లో తక్కువ స్కోరుకే ఆలౌట్ చేసిన టీమిండియా బౌలర్లు రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం దానిని రిపీట్ చేయలేకపోయారు.అంతకముందు టీమిండియా రెండో ఇన్నింగ్స్‌లో రిషబ్ పంత్, హనుమ విహారిలు సెంచరీలతో కథం తొక్కిన సంగతి తెలిసిందే.(చదవండి : పేడ మొహాలు, చెత్త గేమ్‌ప్లే అంటూ..) -
ఆసీస్‌కు మరో దెబ్బ.. కీలక బౌలర్ ఔట్!
సిడ్నీ : బోర్డర్ గవాస్కర్ ట్రోపీ ఆరంభానికి ముందే ఆసీస్‌కు దెబ్బ మీద దెబ్బ తగులుతూనే ఉంది. ఇప్పటికే స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ దూరం కాగా.. త్యాగి బౌన్సర్ దెబ్బకు యువ ఓపెనర్ విన్ పుకోవిస్కి మొదటి టెస్టుకు దూరమయ్యాడు. తాజాగా ఆసీస్ ఫాస్ట్ బౌలర్ సీన్ అబాట్ దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎడమ కాలి చీలమండ గాయంతో అబాట్ బాధపడుతున్నట్లు సమాచారం. సిడ్నీ వేదికగా ఇండియాతో జరుగుతున్న ప్రాక్టీస్ మ్యాచ్‌లో రెండో రోజు ఆటలో భాగంగా మొదటి సెషన్లో బౌలింగ్‌కు వచ్చిన అబాట్ 7 ఓవర్లు వేశాడు. రెండో సెషన్ ప్రారంభమైన కాసేపటికే అబాట్‌కు కండరాలు పట్టేయడంతో బౌలింగ్ చేయలేదు. అయితే నొప్పి తీవ్రత ఎక్కువ కావడంతో ఫిజియో సూచన మేరకు పెవిలియన్‌కు చేరుకున్నాడు. ఇప్పుడైతే అబాట్ బౌలింగ్‌కు వచ్చే అవకాశాలు లేవని.. ఒకవేళ ఆసీస్ బ్యాటింగ్ సమయంలో అవసరం అనుకుంటేనే వస్తాడని క్రికెట్ ఆస్ట్రేలియా పేర్కొంది. (చదవండి : క్యాచ్ వదిలేశాడని బౌలర్ బూతు పురాణం) ఒకవేళ అబాట్ గాయం తీవ్రత ఎక్కువగా ఉంటే మాత్రం ఆసీస్‌కు పెద్ద దెబ్బే అని చెప్పవచ్చు. టెస్టు సిరీస్‌లో సీన్ అబాట్ ఆస్ట్రేలియాకు కీలక బౌలర్.. బౌన్సర్లు వేయడంలో దిట్ట అయిన అబాట్ ప్రత్యర్థి బ్యాట్స్మన్లను కట్టడి చేస్తాడు. భారత్‌తో జరుగుతున్న ప్రాక్టీస్ మ్యాచ్‌లోనూ అబాట్ మొదటి ఇన్నింగ్స్‌లో 12 ఓవర్లు వేసి మూడు వికెట్లు పడగొట్టాడు.ఇప్పటికే గాయంతో డేవిడ్ వార్నర్, త్యాగి బౌన్సర్‌తో విన్ పుకోవిస్కి మొదటి టెస్టుకు దూరమయ్యారు.. తాజగా అబాట్ కూడా గాయంతో బాధపడుతుండడం ఆసీస్‌కు ఇబ్బందిగా మారనుంది. అయితే శుక్రవారం ప్రాక్టీస్ మ్యాచ్‌లో భాగంగా టీమిండియా బ్యాటింగ్ సమయంలో బుమ్రా ఆడిన స్ట్రెయిట్ డ్రైవ్ బౌలర్ కామెరాన్ గ్రీన్ ముఖంపై బలంగా తగిలిన సంగతి తెలిసిందే. అయితే గ్రీన్ విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆస్ట్రేలియా పేర్కొంది. గ్రీన్ గాయం నుంచి కోలుకున్నాడని.. అతను ఆసీస్ ఎతో మ్యాచ్‌లో కొనసాగనున్నాడని తెలిపింది. కాగా ప్రాక్టీస్ మ్యాచ్‌లో భాగంగా రెండో రోజు టీమిండియా లంచ్ విరామం తర్వాత 70 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 249 పరుగులు చేసింది.(చదవండి : నెటిజన్ కామెంట్‌కు గబ్బర్ ధీటైన కౌంటర్) ఓపెనర్ పృథ్వీ షా మరోసారి విఫలం కాగా.. మరో ఓపెనర్ మయాంక్ అగర్వాల్ 61, శుబ్‌మన్ గిల్ 61 పరుగులతో ఆకట్టుకోగా.. కెప్టెన్ రహానే 38 పరుగులు చేశాడు. ప్రస్తుతం విహారి 63, రిషబ్ పంత్ 9 పరుగులతో క్రీజులో ఉన్నారు. అంతకముందు తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్ 108 పరుగులకు ఆలౌట్ కావడంతో భారత్‌కు ఆధిక్యం లభించింది. బుమ్రా హాఫ్ సెంచరీతో రాణించడంతో తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా 194 పరుగులకు ఆలౌట్ అయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం టీమిండియా మొదటి ఇన్నింగ్స్ కలుపుకొని 334 పరుగుల ఆధిక్యంలో ఉంది. -
బూమ్ బూమ్ బ్యాటింగ్
బుమ్రా అంటే భారత బౌలింగ్ తురుపుముక్క. పేస్ దళానికి ఏస్ బౌలర్. పదునైన బంతులతో నిప్పులు చెరగడం, యార్కర్లతో వికెట్లను కూల్చడం అతనికి బాగా తెలిసిన పని. మరి బ్యాటింగ్‌లో అర్ధ సెంచరీ చేయడం మనమెప్పుడు చూడలేదు కదా! ఇప్పుడు ఆ ముచ్చట కూడా చూపించేశాడు. పదో స్థానంలో బ్యాటింగ్‌కు దిగి కష్టాల్లో ఉన్న భారత్‌ను ఆదుకున్నాడు. తర్వాత తన బౌలింగ్ విన్యాసంతో ఆసీస్ ‘ఎ’ పతనంలో భాగమయ్యాడు. దీంతో తొలి రోజే ఇరు జట్లు ఆలౌట్ అయ్యాయి. సిడ్నీ: డే అండ్ నైట్ టెస్టుకు సన్నాహకంగా నిర్వహిస్తున్న పింక్ బాల్ ప్రాక్టీస్ మ్యాచ్‌లో జస్ప్రీత్ బుమ్రా (57 బంతుల్లో 55 నాటౌట్; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు; బౌలింగ్‌లో 2 వికెట్లు) అనూహ్యంగా ఆల్‌రౌండర్ అవతారం ఎత్తాడు. బ్యాటింగ్‌లో అజేయంగా రాణించిన అతను భారత ఇన్నింగ్స్‌లో టాప్‌స్కోరర్‌గా నిలిచాడు. తర్వాత బౌలింగ్‌లోనూ నిప్పులు చెరిగాడు. మ్యాచ్‌ను వర్షం ఆటంక పరచడంతో సుమార గంటపాటు మ్యాచ్ సాగలేదు. మొదట బ్యాటింగ్‌కు దిగిన భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 48.3 ఓవర్లలో 194 పరుగుల వద్ద ఆలౌటైంది. తర్వాత ఆస్ట్రేలియా ‘ఎ’ తొలి ఇన్నింగ్స్‌లో 32.2 ఓవర్లలో 108 పరుగులకే కుప్పకూలింది. క్యారీ (32; 6 ఫోర్లు) మెరుగ్గా ఆడాడు. షమీ, సైనీ చెరో 3 వికెట్లు పడగొట్టారు. బుమ్రా ఆల్‌రౌండ్ ప్రాక్టీస్ ఓపెనర్ మయాంక్ అగర్వాల్ (2) ఎక్కువసేపు నిలువలేకపోయినా... పృథ్వీ షా (40; 8 ఫోర్లు), శుబ్‌మన్ గిల్ (43; 6 ఫోర్లు, 1 సిక్స్) ఇన్నింగ్స్‌ను నడిపించారు. రెండో వికెట్‌కు 63 పరుగులు జోడించాక పృథ్వీ షా పెవిలియన్ చేరాడు. జట్టు స్కోరు 100 పరుగులు దాటాక ఇన్నింగ్స్ గతి తప్పింది. హనుమ విహారి (15), గిల్, కెప్టెన్ అజింక్య రహానే (4), పంత్ (5), సాహా (0), షమీ (0) టపటపా వికెట్లను పారేసుకున్నారు. దీంతో 14 పరుగుల వ్యవధిలోనే భారత్ 6 వికెట్లను కోల్పోయింది. అయితే పదో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన బుమ్రా, సిరాజ్ (22; 2 ఫోర్లు, 1 సిక్స్)తో కలిసి జట్టును ఆదుకున్నాడు. ముఖ్యంగా బుమ్రా ధాటిగా ఆడాడు. సదర్లాండ్ వేసిన బౌన్సర్‌ను హుక్ షాట్‌తో సిక్సర్‌గా తరలించిన అతను అర్ధ సెంచరీని పూర్తిచేసుకున్నాడు. ఆఖరి వికెట్‌కు 71 పరుగులు జోడించాక సిరాజ్ అవుటవ్వడంతో 200 పరుగులకు ముందే భారత్ ఇన్నింగ్స్ ముగిసింది. ఆసీస్ ‘ఎ’ విలవిల భారత్‌ను తక్కువ స్కోరుకే ఆలౌట్ చేశామన్న ఆనందం ఆసీస్ ‘ఎ’ జట్టులో ఎంతో సేపు నిలువలేదు. ఓపెనర్ బర్న్స్ (0)ను బుమ్రా... బెన్ మెక్‌డెర్మట్ (0)ను షమీ ఖాతానే తెరవనీయలేదు. మరో ఓపెనర్ హారిస్ (26; 4 ఫోర్లు) కాసేపు, కెప్టెన్ క్యారీ కాసేపు ఆడినా... వాళ్లిద్దరిని అవుట్ చేసేందుకు భారత సీమర్లకు ఎంతో సేపు పట్టలేదు. దీంతో 56 పరుగులకే ఐదు వికెట్లను... వందకంటే ముందే 9 వికెట్లను ఆతిథ్య జట్టు కోల్పోయింది. కోహ్లి దూరం 12 రోజుల వ్యవధిలో ఆరు పరిమిత ఓవర్ల మ్యాచ్‌లు ఆడిన భారత కెప్టెన్ విరాట్ కోహ్లి ఊహించిన విధంగానే ఈ మ్యాచ్ బరిలోకి దిగలేదు. మ్యాచ్ ఆడకపోయినా...సిడ్నీ ప్రధాన స్టేడియం బయట నెట్స్‌లో కోహ్లి సుదీర్ఘ సమయం పాటు ప్రాక్టీస్ చేశాడు. అనూహ్యంగా భారత్ నలుగురు పేసర్లతోనే ఆడింది. అయితే ఇందులో సీనియర్ ఉమేశ్ యాదవ్‌కు మాత్రం అవకాశం ఇవ్వకపోవడం ఆశ్చర్యం కలిగించింది. స్కోరు వివరాలు భారత్ తొలి ఇన్నింగ్స్: పృథ్వీ షా (బి) సదర్లాండ్ 40; మయాంక్ (సి) బర్న్స్ (బి) అబాట్ 2; శుబ్‌మన్ (సి) క్యారీ (బి) గ్రీన్ 43; విహారి (బి) విల్డర్మత్ 15; రహానే (సి) క్యారీ (బి) విల్డర్మత్ 4; పంత్ (ఎల్బీడబ్ల్యూ) (బి) విల్డర్మత్ 5; సాహా (సి)సదర్లాండ్ (బి) అబాట్ 0; సైనీ (సి) మ్యాడిన్సన్ (బి) కాన్వే 4; షమీ (సి) క్యారీ (బి) అబాట్ 0; బుమ్రా నాటౌట్ 55; సిరాజ్ (సి) హరిస్ (బి) స్వెప్సన్ 22; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (48.3 ఓవర్లలో ఆలౌట్) 194. వికెట్ల పతనం: 1–9, 2–72, 3–102, 4–102, 5–106, 6–111, 7–111, 8–116, 9–123, 10–194. బౌలింగ్: అబాట్ 12–6–46–3, కాన్వే 11–3–45–1, సదర్లాండ్ 9–0–54–1, గ్రీన్ 6.1–2–20–1, విల్డర్మత్ 8–4–13–3, స్వెప్సన్ 2.2–0–15–1. ఆస్ట్రేలియా ‘ఎ’ తొలి ఇన్నింగ్స్: హారిస్ (సి) శుబ్‌మన్ (బి) షమీ 26; బర్న్స్ (సి) పంత్ (బి) బుమ్రా 0; మ్యాడిన్సన్ (సి) సాహా (బి) సిరాజ్ 19; మెక్‌డెర్మట్ (ఎల్బీడబ్ల్యూ) (బి) షమీ 0; క్యారీ (సి) పంత్ (బి) సైనీ 32; అబాట్ (సి) పంత్ (బి) షమీ 0; విల్డర్మత్ (సి) పంత్ (బి) బుమ్రా 12; సదర్లాండ్ (సి) శుబ్‌మన్ (బి) సైనీ 0; ప్యాట్రిక్ నాటౌట్ 7; స్వెప్సన్ (సి) సాహా (బి) సైనీ 1; కాన్వే రనౌట్ 7; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (32.2 ఓవర్లలో ఆలౌట్) 108. వికెట్ల పతనం: 1–6, 2–46, 3–46, 4–52, 5–56, 6–83, 7–84, 8–97, 9–99, 10–108. బౌలింగ్: షమీ 11–4–29–3; బుమ్రా 9–0–33–2, సిరాజ్ 7–1–26–1, సైనీ 5.2–0–19–3. గ్రీన్ దిమ్మదిరిగింది టెస్టు సిరీస్‌కు ముందు అసలే గాయాలతో సతమతమవుతున్న ఆసీస్ జట్టుకు మరో ఎదురు దెబ్బ తగిలింది. దూకుడుగా బ్యాటింగ్ చేసిన బుమ్రా... ఆల్‌రౌండర్ కామెరాన్ గ్రీన్ బుర్ర బద్దలయ్యే షాట్ ఆడాడు. గ్రీన్ బౌలింగ్‌లో బుమ్రా కొట్టిన స్ట్రెయిట్ డ్రైవ్ బౌలర్ తలకు బలంగా తగిలింది. దీంతో గ్రీన్ ఒక్కసారిగా పిచ్‌పైనే కూలబడ్డాడు. నాన్ స్ట్రయిక్‌లో ఉన్న సిరాజ్ పరుగును, బ్యాట్‌ను పక్కన పడేసి గ్రీన్ వద్దకు పరుగెత్తాడు. ఆసీస్ జట్టు వైద్య సిబ్బంది అతన్ని మైదానం వెలుపలికి తీసుకెళ్లి పరీక్షించింది. అతని స్థానంలో ‘కన్కషన్ సబ్‌స్టిట్యూట్’గా బ్యాట్స్‌మన్ ప్యాట్రిక్ రోవ్‌ను బరిలోకి దిగాడు. -
బుమ్రా షాట్.. ఆసీస్ బౌలర్‌కు గాయం
సిడ్నీ : ఆస్ట్రేలియా-ఎ తో జరుగుతున్న మూడు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్‌లో బ్యాట్స్‌మెన్ విఫలమైన చోట జస్ప్రీత్ బుమ్రా అర్థసెంచరీతో ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. కాగా ఇదే ఇన్నింగ్స్‌లో బుమ్రా కామెరాన్ గ్రీన్ బౌలింగ్‌లో స్ట్రెయిట్ డ్రైవ్ ఆడాడు. అయితే ఆ షాట్ పొరపాటున గ్రీన్ తలకు బలంగా తాకింది. దీంతో నొప్పితో విలవిల్లాడిన గ్రీన్ పిచ్‌లోనే కూలబడ్డాడు. దీంతో నాన్‌స్ట్రైకింగ్ ఎండ్‌లో ఉన్న మహ్మద్ సిరాజ్ తన బ్యాట్‌ను పడేసి పరుగు పూర్తి చేయకుండా అతని వద్దకు పరిగెత్తాడు. అంపైర్ వెంటనే ఫిజియోను రప్పించడంతో మైదానంలో కాసేపు హైటెన్షన్ నెలకొంది. అయితే గ్రీన్ గాయం పరిస్థితి ఎలా ఉందనేది సమాచారం అందలేదు. ఒకవేళ గాయం తీవ్రత ఎక్కువగా ఉంటే గ్రీన్ తొలి టెస్టు ఆడడం అనుమానమే. ఇప్పటికే ఓపెనర్ డేవిడ్ వార్నర్ తొలి టెస్టుకు దూరం కావడం.. మరో ఆటగాడు విన్ పుకోవిస్కి త్యాగి బౌన్సర్‌కు గాయపడడం.. తాజాగా గ్రీన్‌కు దెబ్బ తగలడంతో ఆసీస్ మేనేజ్మెంట్ ఆందోళనలో ఉంది. (చదవండి : సిక్స్‌తో బుమ్రా హాఫ్ సెంచరీ.. వీడియో వైరల్) కాగా తొలి రోజు ఆటలో భాగంగా భారత్ టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. టీమిండియా బ్యాటింగ్‌ను పృథ్వీ షా, మయాంక్ అగర్వాల్ ఆరంభించారు. కాగా, మయాంక్ ఆదిలోనే వికెట్ కోల్పోగా, పృథ్వీ షౠ(40) రాణించాడు. అనంతరం శుబ్‌మన్ గిల్(43) కూడా మెరిశాడు. ఆపై వరుసగా ఆరుగురు ఆటగాళ్లు విఫలం కాగా, బుమ్రా మాత్రం ఆత్మ విశ్వాసంతో ఆడాడు. సిరాజ్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు.ఈ జోడి 71 పరుగులు జత చేసి టీమిండియా ఇన్నింగ్స్‌ను గాడిలో పెట్టారు. ఈ క్రమంలోనే బుమ్రా హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. సదర్లాండ్ బౌలింగ్ సిక్స్ కొట్టి హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఇది బుమ్రాకు తొలి ఫస్ట్‌క్లాస్ సెంచరీ కావడం విశేషం. బుమ్రా హాఫ్ సెంచరీ సాధించిన కాసేపటికి సిరాజ్(22) పదో వికెట్‌గా ఔట్ కావడంతో టీమిండియా ఇన్నింగ్స్ ముగిసింది. (చదవండి : బీకేర్ ఫుల్.. మరిన్ని బౌన్సర్లు దూసుకొస్తాయి) pic.twitter.com/vcKWypY4vv — Advitiya Srivastava (@Advitya08) December 11, 2020 -
‘పింక్’ పిలుపు...
డే అండ్ నైట్ టెస్టు మ్యాచ్‌లు మొదలయ్యాక భారత జట్టు గులాబీ బంతితో ఒకే ఒక మ్యాచ్ (2019లో కోల్‌కతాలో బంగ్లాదేశ్‌తో) ఆడింది. ఇప్పుడు ఆస్ట్రేలియాతో వచ్చే గురువారం నుంచి మరో ‘పింక్’ పోరులో తలపడాల్సి ఉంది. దానికి సిద్ధమయ్యేందుకు మూడు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్‌లో టీమిండియా బరిలోకి దిగుతోంది. తొలి టెస్టు వేదిక అయిన అడిలైడ్‌తో పోలిస్తే పిచ్‌లో తేడా ఉన్నా... ఫ్లడ్‌లైట్లలో, పింక్ బాల్‌తో ఆడటం అసలు సమరానికి ముందు సరైన సన్నాహకంగా భావించవచ్చు. సిడ్నీ: టెస్టు సిరీస్‌కు సన్నద్ధమయ్యే క్రమంలో తొలి ప్రాక్టీస్ మ్యాచ్‌ను ‘డ్రా’గా ముగించిన భారత జట్టు రెండో ప్రాక్టీస్ మ్యాచ్‌లో తమ వనరులను మరింతగా పరీక్షించుకునే ప్రయత్నంలో ఉంది. ఆస్ట్రేలియా ‘ఎ’తో నేటి నుంచి జరిగే ఈ మూడు రోజుల మ్యాచ్‌లో కెప్టెన్ విరాట్ కోహ్లి మినహా భారత టెస్టు జట్టులోని రెగ్యులర్ ఆటగాళ్లంతా ఆడే అవకాశం ఉంది. 12 రోజుల వ్యవధిలో వన్డే, టి20 సిరీస్‌లు ఆడటంతో అలసిపోయినట్లు భావిస్తున్న కెప్టెన్ తొలి టెస్టుకు ముందు తగినంత విశ్రాంతి కోరుకుంటున్నాడు. బరిలోకి విహారి... కోహ్లి జట్టులోకి రావడం మినహా ఈ ప్రాక్టీస్ మ్యాచ్‌లో ఆడే బృందమే తొలి టెస్టులోనూ బరిలోకి దిగే అవకాశం దాదాపు ఖాయమే. తొలి ప్రాక్టీస్ మ్యాచ్ ఆడని రెగ్యులర్ ఓపెనర్ మయాంక్ అగర్వాల్ ఇక్కడ తన బ్యాటింగ్ పదును పరీక్షించుకోవాల్సి ఉంది. రెండో ఓపెనర్‌గా యువ ఆటగాళ్లు పృథ్వీ షా, శుబ్‌మన్ గిల్‌లలో ఒకరికి అవకాశం లభిస్తుందా లేక పరిమిత ఓవర్ల క్రికెట్లో అద్భుత ఫామ్‌లో ఉన్న రాహుల్‌ను ప్రయత్నిస్తారా ఇక్కడ తేలిపోతుంది. పుజారా, రహానేలు మరింత ప్రాక్టీస్ ఆశిస్తుండగా ఆంధ్ర క్రికెటర్ హనుమ విహారిపై కూడా అందరి దృష్టి ఉంది. తొలి టెస్టులో భారత్ నలుగురు రెగ్యులర్ బౌలర్లతోనే ఆడాలని భావిస్తే ఆరో నంబర్ బ్యాట్స్‌మన్‌గా విహారికి అవకాశం దక్కుతుంది. అతనికి ఈ మ్యాచ్ సన్నాహకంగా ఉపయోగపడుతుంది. మరోవైపు ఇద్దరు స్పిన్నర్లను తీసుకుంటే కుల్దీప్ను ఆడించాల్సి ఉంటుంది. డే అండ్ నైట్ మ్యాచ్‌లో కుల్దీప్ వైవిధ్యమైన బౌలింగ్ అదనపు బలంగా మారుతుందనుకుంటే అతనికీ తగినంత ప్రాక్టీస్ అవసరం. ఇషాంత్ లేకపోవడంతో షమీ, బుమ్రాలపై మరింత బాధ్యత పెరిగింది. టి20లకు దూరంగా ఉండి వీరు విశ్రాంతి తీసుకున్నారు కాబట్టి పింక్ బంతితో ఆసీస్ పిచ్‌పై సాధ్యమైనంత ప్రాక్టీస్‌ను కోరుకుంటున్నారు. వికెట్ కీపర్‌గా సాహా తొలి మ్యాచ్‌లో సత్తా చాటగా... ఇప్పుడు అతడినే కొనసాగిస్తారా లేక రిషభ్ పంత్‌కు ఈ మ్యాచ్‌లో అవకాశం కల్పిస్తారా చూడాలి. సత్తా చాటేందుకు... ఆస్ట్రేలియా ‘ఎ’ జట్టు కూడా మరీ బలహీనంగా ఏమీ లేదు. టెస్టు ఓపెనర్‌గా ఖాయమైన జో బర్న్స్‌తో పాటు ప్రాక్టీస్ మ్యాచ్‌లో ప్రదర్శనతో టెస్టు తుది జట్టులో స్థానం ఆశిస్తున్న కామెరాన్ గ్రీన్, సీన్ అబాట్, మిషెల్ స్వెప్సన్ జట్టులో ఉన్నారు. ముఖ్యంగా గ్రీన్ ఇక్కడ చెలరేగితే టెస్టు క్రికెటర్‌గా ప్రమోషన్ దక్కవచ్చు. వికెట్ కీపర్ అలెక్స్ క్యారీ జట్టుకు నాయకత్వం వహిస్తున్నాడు. గతంలో టెస్టులు ఆడిన నిక్ మ్యాడిసన్, మార్కస్ హారిస్ కూడా సొంత మైదానంలో సత్తా చాటగలరు. గాయంతో మోజెస్ హెన్రిక్స్ ఈ మ్యాచ్‌కు దూరమయ్యాడు. ఫస్ట్ క్లాస్ హోదా ఉంటేనే... సరిగ్గా తొలి టెస్టు ఆడే జట్టుతోనే ప్రాక్టీస్ చేయాలని భారత్ భావిస్తే (కోహ్లి మినహా) ఈ మ్యాచ్‌కు ఫస్ట్ క్లాస్ హోదా ఇవ్వాలని ఆతిథ్య బోర్డును కోరవచ్చు. అప్పుడు మ్యాచ్‌లో తీవ్రత పెరుగుతుంది. పూర్తి స్థాయిలో 11 మంది తుది జట్టునే బరిలోకి దించాల్సి ఉంటుంది. లేదంటే మామూలు టూర్ మ్యాచ్‌లాగానే ఎవరైనా గరిష్టంగా 11 మంది బ్యాటింగ్, 11 మంది బౌలింగ్ చేస్తూ దాదాపు అందరు ఆటగాళ్లను పరీక్షించుకోవచ్చు. సాధారణంగా పర్యాటక జట్టు విజ్ఞప్తి చేస్తేనే ఆతిథ్య బోర్డు స్పందిస్తుంది. -
రాణించిన సాహా.. మ్యాచ్ డ్రా
సిడ్నీ : భారత్ ‘ఎ’, ఆ్రస్టేలియా ‘ఎ’ జట్ల మధ్య జరిగిన మూడు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్ ‘డ్రా’గా ముగిసింది. భారత బ్యాట్స్‌మన్ వృద్ధిమాన్ సాహా (100 బంతుల్లో 54 నాటౌట్; 7 ఫోర్లు) అజేయ అర్ధసెంచరీతో ప్రాక్టీస్ చేసుకున్నాడు. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 286/8తో మంగళవారం ఆఖరి రోజు ఆట కొనసాగించిన ఆసీస్ ‘ఎ’ తొలి ఇన్నింగ్స్‌ను 306/9 స్కోరు వద్ద డిక్లేర్ చేసింది. దీంతో ఆసీస్ ‘ఎ’ జట్టుకు 59 పరుగుల ఆధిక్యం లభించింది. తర్వాత రెండో ఇన్నింగ్స్ ఆడిన భారత్ ‘ఎ’ 61 ఓవర్లలో 9 వికెట్లకు 189 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. ఓపెనర్లు పృథీ్వషా (19), శుబ్‌మన్ గిల్ (29) కాసేపే క్రీజులో నిలిచారు. టెస్టు స్పెషలిస్ట్ చతేశ్వర్ పుజారా (0) డకౌటయ్యాడు. హనుమ విహారి (28), కెప్టెన్ రహానే (28) ప్రాక్టీస్‌లో అదరగొట్టలేకపోయారు. పేసర్ మార్క్ స్టెకెటీ (5/37) భారత బ్యాట్స్‌మెన్ నిలదొక్కుకోకుండా క్రమం తప్పకుండా వికెట్లు పడగొట్టాడు. తర్వాత 131 పరుగుల విజయలక్ష్యంతో రెండో ఇన్నింగ్స్‌లో బరిలోకి దిగిన ఆసీస్ ‘ఎ’ మ్యాచ్ ముగిసే సమయానికి వికెట్ నష్టానికి 52 పరుగులు చేసింది. హారిస్ (25 నాటౌట్) అజేయంగా నిలిచాడు. ఉమేశ్‌కు ఒక వికెట్ దక్కింది. ఈ నెల 11 నుంచి 13 వరకు పింక్‌బాల్‌తో జరిగే రెండో ప్రాక్టీస్ మ్యాచ్‌లో భారత ఆటగాళ్లంతా పాల్గొంటారు. సిడ్నీలోనే ఈ మ్యాచ్ జరుగుతుంది. -
పృథ్వీ షా, గిల్ డకౌట్లు.. రహానే శతకం
డ్రమ్మోయ్నీ ఓవల్(సిడ్నీ): ఆస్ట్రేలియా ‘ఎ’తో జరుగుతున్న మూడు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్‌లో భారత ‘ఎ’ జట్టు తొలి రోజు ఆట ముగిసే సమయానికి 90 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 237 పరుగులు చేసింది. టాస్ గెలిచిన భారత ‘ఎ’ జట్టు ముందుగా బ్యాటింగ్ తీసుకుంది. దీంతో రహానే నేతృత్వంలోని భారత బ్యాటింగ్‌ను పృథ్వీ షా, శుబ్‌మన్ గిల్లు ఆరంభించారు. వీరిద్దరూ డకౌట్లుగా వెనుదిరగడంతో భారత ’ఎ’ జట్టుకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఆ తరుణంలో చతేశ్వర పుజారా ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. పుజారా 140 బంతులు ఎదుర్కొని ఐదు ఫోర్ల సాయంతో 54 పరుగులు సాధించాడు. (చదవండి:ఫించ్ ఔట్.. కెప్టెన్‌గా వేడ్) అనంతరం అజింక్యా రహానే శతకం నమోదు చేశాడు. 228 బంతుల్లో 16 ఫోర్లు, 1 సిక్స్ సాయంతో అజేయంగా 108 పరుగులు చేశాడు. హనుమ విహారి(15), సాహా(0), అశ్విన్(5)లు నిరాశ పరచగా, టెయిలెండర్లు కుల్దీప్ యాదవ్(15), ఉమేశ్ యాదవ్(24) ఫర్వాలేదనిపించారు. తొలి రోజు ఆట ముగిసే సమయానికి రహానే, మహ్మద్ సిరాజ్(0 బ్యాటింగ్) క్రీజ్‌లో ఉన్నారు. ఆసీస్ ‘ఎ’ జట్టులో జేమ్స్ పాటిన్సన్ మూడు వికెట్లు సాధించగా, మైకేల్ నేసర్, ట్రావిస్ హెడ్లు తలో రెండు వికెట్లు తీశారు. జాక్సన్ బర్డ్‌కు వికెట్ దక్కింది. ఒకవైపు ఆసీస్-టీమిండియా జట్ల మధ్య టీ20 సిరీస్ జరగుతుండగానే, మరొకవైపు ఆసీస్-భారత్ ‘ఎ’ జట్ల మధ్య ప్రాక్టీస్ మ్యాచ్ జరుగుతుండటం విశేషం. -
అండర్సన్.. ఎంతైనా నీకు నువ్వే సాటి
-
అండర్సన్.. ఎంతైనా నీకు నువ్వే సాటి
లండన్ : ప్రపంచవ్యాప్తంగా కరోనా విజృంభిస్తోన్న సంగతి తెలిసిందే. క్రికెట్ సహా అన్ని రకాల ఆటలు స్తంభించిపోయాయి. ఇప్పుడిప్పుడే క్రీడలు ప్రారంభమైన ప్రేక్షకులు లేకుండానే మ్యాచ్‌లు జరిగే అవకాశం ఉంది. ఇందులో క్రికెట్‌కు కూడా మినహాయింపు లేదనే చెప్పొచ్చు. ఇంతకుముందులా బ్యాట్స్‌మన్ ఔట్ ఐతే ఆటగాళ్లంతా ఒకదగ్గర చేరి అభినందించుకునేది కూడా చూడకపోవచ్చు. తాజాగా అలాంటి సన్నివేశాలే ఇంగ్లండ్ ఆటగాళ్ల మధ్య చోటుచేసుకున్నాయి. ('ఆ ఆలోచన సచిన్‌దే.. చాపెల్‌ది కాదు') కరోనా విరామం తర్వాత జూలై 8 నుంచి ఇంగ్లండ్- విండీస్‌ల మధ్య మూడు టెస్టుల సిరీస్ జరగనుంది. సౌతాంప్టన్ వేదికగా జూలై 8న ఇరు జట్ల మొదటి టెస్టు ప్రారంభం కానుంది. ఇందులో భాగంగా ఇంగ్లండ్ ఆటగాళ్లు టీమ్ బట్లర్, టీమ్ స్టోక్స్‌గా విడిపోయి అగాస్ బౌల్ మైదానంలో మూడు రోజలు ప్రాక్టీస్ మ్యాచ్ ఆడుతున్నారు. డే 1 ఆటలో భాగంగా టీమ్ స్టోక్స్ తరపున ఇంగ్లండ్ స్టార్ పేసర్ జేమ్స్ అండర్సన్ హైలట్‌గా నిలిచాడు. మొదటిరోజు ఆటలో భాగంగా ఎక్కువ ఓవర్లు వేసిన అండర్సన్ ఓవర్‌కు 3 పరుగులు మాత్రమే ఇస్తూ రెండు కీలక వికెట్లు కూడా తీశాడు. అండర్సన్ మ్యాచ్ మధ్యలోనూ తన చర్యలతో ఆకట్టుకున్నాడు. అండర్సన్ తన బౌలింగ్‌లో వికెట్ పడినప్పుడు సహచర ఆటగాళ్ల వద్దకు వెళ్లి ఎలాంటి హగ్స్, చేతులు కలపడం వంటివి లేకుండా కేవలం భుజాలతోనే అభినందించుకున్నారు. అంతేగాక ఆటగాళ్లంతా భౌతిక దూరం పాటించడం విశేషం. మ్యాచ్ మధ్యలో అప్పుడప్పుడు మైదానం నలువైపులా ఏర్పాటు చేసిన సానిటైజర్స్‌ను ఉపయోగిస్తూ కనిపించాడు. ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు వీడియోతో పాటు ఫోటలోను రిలీజ్ చేయడంతో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కరోనా వైరస్ నేపథ్యంలో ఐసీసీ విధించిన గైడ్‌లైన్స్ పాటిస్తూనే ప్రాక్టీస్ మ్యాచ్‌ను కొనసాగించినట్లు ట్విటర్లో ఈసీబీ తెలిపింది. కాగా ప్రాక్టీస్ మ్యాచ్‌లో టీమ్ బట్లర్ జట్టు మొదటిరోజు ఆట ముగిసే సమయానికి 5 వికెట్లకు 287 పరుగులు చేసింది. కాగా విండీస్‌తో ఈ నెల 8న మొదలయ్యే మొదటి టెస్ట్‌కు రెగుల్యర్ కెప్టెన్ జో రూట్ అందుబాటులో ఉండటం లేదు. దీంతో ఇంగ్లండ్ బోర్డు స్టార్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్‌కు కెప్టెన్సీని అప్పగించింది. జోస్ బట్లర్‌ను వైస్ కెప్టెన్‌గా నియమించింది. రూట్ భార్య వచ్చే వారం తమ రెండో బిడ్డకు జన్మనివ్వనుంది. ప్రస్తుతం జట్టుతో కలిసున్న రూట్ నేడు నేడు ట్రైనింగ్ క్యాంప్ వదిలి వెళ్లనున్నాడు. దీంతో ఇంగ్లండ్ టీమ్ తమలో తాము ఆడే వామప్‌తో పాటు ఫస్ట్ టెస్ట్‌కు దూరం కానున్నాడు. సెకండ్ టెస్ట్‌కు తిరిగి జట్టుతో కలుస్తాడు. -
భారత్, పాక్ మహిళల టి20 మ్యాచ్ రద్దు
బ్రిస్బేన్: మహిళల టి20 ప్రపంచ కప్ సన్నాహాల్లో భాగంగా జరగాల్సిన భారత్, పాకిస్తాన్ టి20 ప్రాక్టీస్ మ్యాచ్ రద్దయింది. ఇక్కడి అలెన్ బోర్డర్ ఫీల్డ్ మైదానంలో ఆదివారం జరగాల్సిన ఈ మ్యాచ్ వర్షం కారణంతో ఒక్క బంతి కూడా పడకుండానే తుడిచిపెట్టుకుపోయింది. భారీ వర్షం ఎంతకీ తగ్గక పోవడంతో అంపైర్లు మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. దాంతో చిరకాల ప్రత్యర్థుల మ్యాచ్ చూడటానికి వచ్చిన అభిమానులు నిరాశగా వెనుదిరిగారు. భారత్ తన తదుపరి ప్రాక్టీస్ మ్యాచ్‌ను ఈనెల 18న వెస్టిండీస్‌తో ఆడుతుంది. భారత్–పాక్ మ్యాచ్‌తో పాటు ఆస్ట్రేలియా–వెస్టిండీస్, బంగ్లాదేశ్–థాయ్‌లాండ్ మ్యాచ్‌లు కూడా వర్షం కారణంగా జరగలేదు. అడిలైడ్ వేదికగా జరిగిన మరో మ్యాచ్‌లో ఇంగ్లండ్ 6 వికెట్ల తేడాతో న్యూజిలాండ్‌పై విజయం సాధించింది. ఈనెల 21న భారత్, డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియా మధ్య జరిగే మ్యాచ్‌తో పొట్టి ప్రపంచ కప్‌కు తెరలేవనుంది. -
'అందుకే బుమ్రాను తక్కువ అంచనా వేయద్దు'
హమిల్టన్ : టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా.. కివీస్‌తో జరిగిన మూడు వన్డేల సిరీస్‌లో ఒక్క వికెట్ తీయలేదు. తన కెరీర్లో ఇదే అత్యంత చెత్త రికార్డుగా భావించొచ్చు. ' గాయం తర్వాత రీ ఎంట్రీ ఇచ్చిన ఈ యార్కర్ల కింగ్ బౌలింగ్‌లో పదును తగ్గింది. మునుపటంతా పదును లేదని, అందుకే తరచూ విఫలమవుతున్నాడు. తన బౌలింగ్‌ను మార్చుకోవాలి.. అటాకింగ్ పెంచాలి. బుమ్రా వైఫల్యం వల్లనే భారత్ వన్డే సిరీస్ కోల్పోయింది' అంటూ అభిమానులు, మాజీ ఆటగాళ్లు, విశ్లేషకులు సైతం బుమ్రాపై ఇష్టం వచ్చినట్లు కామెంట్లు చేశారు.అయితే న్యూజిలాండ్ ఎలెవన్‌తో జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్‌లో బుమ్రా బౌలింగ్ చూసి ఈ మాట అంటే బాగుంటుందేమో. ఎందుకంటే ఆ మ్యాచ్‌లో ప్రత్యర్థి బ్యాట్స్‌మన్ ఫిన్ అలెన్‌ను ఔట్ చేసిన తీరు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.(బుమ్రా ఎప్పటికైనా ప్రమాదకారే : కివీస్ కెప్టెన్) న్యూజిలాండ్ ఎలెవన్ తొలి ఇన్నింగ్స్ 30వ ఓవర్ బుమ్రా బౌలింగ్‌కు దిగాడు. అప్పటికే 82 పరుగులకు మూడు వికెట్లు కోల్పోయిన న్యూజిలాండ్‌ను ఫిన్ అలెన్, హెన్రీకూపర్ ఆచితూచి ఆడుతూ గట్టెక్కించే ప్రయత్నం చేస్తున్నారు. బుమ్రా చక్కటి బంతితో ఫిన్ అలెన్(20)ను పెవిలియన్ చేర్చాడు. బంతి ఔట్‌సైడ్ ఆఫ్ స్టంప్‌గా వెళ్తుందని భావించిన అలెన్ బ్యాట్ పైకి ఎత్తి బంతిని వదిలేయాలనుకున్నాడు. కానీ అనూహ్యంగా బాల్ స్వింగ్ అయి వికెట్లను గిరాటేసింది. దీంతో షాక్‌కు గురైన అలెన్.. నిరాశగా పెవిలియన్ చేరాడు. ఈ వీడియో చూసిన నెటిజన్లు 'వారెవ్వా! బుమ్రా.. నువ్వు నిజంగా తోపు బౌలర్‌వి. అందుకే అంటారు బుమ్రాను ఎప్పుడు తక్కువ అంచనా వేయద్దని' అంటూ కామెంట్లు పెడుతున్నారు.(అరె! అచ్చం బుమ్రాను దింపేశాడుగా) Jasprit Bumrah looking in his element.. absolute ripper to dismiss Allen. #NZX1vIND pic.twitter.com/mcrLF56qUI — Subhayan Chakraborty (@CricSubhayan) February 15, 2020 -
సూపర్ షమీ... భళా బుమ్రా...
ప్రాక్టీస్ పోరులో మన బ్యాట్స్‌మెన్ విఫలమయ్యారని ఆందోళన చెందిన చోట మన పేస్ బౌలర్లు తమ స్థాయికి తగ్గ ప్రదర్శనతో సత్తా చాటారు. ఎర్ర బంతితో ఎప్పటిలాగే షమీ చెలరేగిపోగా, పరిమిత ఓవర్ల సిరీస్‌లో పదును చూపించలేకపోయిన బుమ్రా కూడా ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ను పడగొట్టాడు. టెస్టు తుది జట్టులో స్థానం కోసం పోటీ పడుతున్న ఉమేశ్, సైనీలకు కూడా వికెట్లు దక్కాయి. మొత్తంగా ప్రాక్టీస్ మ్యాచ్‌లో మన పేసర్లకు సరైన సాధన లభించింది. తొలి ఇన్నింగ్స్ వైఫల్యం నుంచి పాఠాలు నేర్చుకొన్న మన ఓపెనర్లు రెండో ఇన్నింగ్స్‌లో చక్కటి బ్యాటింగ్ చూపించడం కూడా ఊరటే. హామిల్టన్: ప్రాక్టీస్ మ్యాచ్‌లో తొలి రోజు బ్యాటింగ్‌లో విఫలమైన భారత జట్టు రెండో రోజు బౌలింగ్‌లో సత్తా చాటింది. ఫలితంగా న్యూజిలాండ్ ఎలెవన్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 74.2 ఓవర్లలో 235 పరుగులకే ఆలౌటైంది. భారత్‌కు 28 పరుగుల ఆధిక్యం లభించింది. కివీస్ తరఫున హెన్రీ కూపర్ (68 బంతుల్లో 40; 6 ఫోర్లు) టాప్ స్కోరర్ కాగా... రచిన్ రవీంద్ర (67 బంతుల్లో 34; 7 ఫోర్లు), డరైల్ మిషెల్ (65 బంతుల్లో 32; 5 ఫోర్లు), టామ్ బ్రూస్ (34 బంతుల్లో 31; 4 ఫోర్లు) ఫర్వాలేదనిపించారు. భారత బౌలర్లలో మొహమ్మద్ షమీ 17 పరుగులే ఇచ్చి 3 వికెట్లు పడగొట్టగా...బుమ్రా, ఉమేశ్, సైనీ తలా 2 వికెట్లు తీశారు. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 7 ఓవర్లలో 59 పరుగులు చేసింది. పృథ్వీ షా (25 బంతుల్లో 35 బ్యాటింగ్; 5 ఫోర్లు, 1 సిక్స్), మయాంక్ అగర్వాల్ (17 బంతుల్లో 23 బ్యాటింగ్; 4 ఫోర్లు, 1 సిక్స్) క్రీజ్‌లో ఉన్నారు. ఓవరాల్‌గా భారత్ ఆధిక్యం 87 పరుగులకు చేరింది. కూపర్ మినహా... న్యూజిలాండ్ ఎలెవన్ తరఫున ఒక్క అర్ధ సెంచరీ కూడా నమోదు కాలేదు. రెండో రోజు కూడా బౌన్స్, స్వింగ్‌కు అనుకూలించిన పిచ్‌ను భారత బౌలర్లు చక్కగా ఉపయోగించుకున్నారు. బుమ్రా తన రెండో ఓవర్లోనే యంగ్ (2)ను అవుట్ చేసి శుభారంభం అందించగా, సీఫెర్ట్ (9)ను షమీ వెనక్కి పంపించాడు. ఈ దశలో రవీంద్ర, అలెన్ కలిసి జట్టును ఆదుకునే ప్రయత్నం చేసినా అది ఎక్కువ సేపు సాగలేదు. మరో ఎండ్‌లో కూపర్ మాత్రం కొన్ని చక్కటి షాట్లు ఆడాడు. ఐదో వికెట్‌కు కూపర్, బ్రూస్ కలిసి 51 పరుగులు జోడించడమే కివీస్ జట్టులో పెద్ద భాగస్వామ్యం. వీరిద్దరు 20 పరుగుల వ్యవధిలో వెనుదిరగ్గా... సీనియర్ ఆటగాడు నీషమ్ (1)ను చక్కటి బంతితో షమీ బౌల్డ్ చేశాడు. ఆ తర్వాత లోయర్ ఆర్డర్ మొత్తం కలిసి 74 పరుగులు జోడించడంతో జట్టు స్కోరు 200 పరుగులు దాటింది. ఓపెనర్ల జోరు... తొలి ఇన్నింగ్స్‌లో విఫలమైన భారత ఓపెనర్లు ఈసారి ఎలాంటి తప్పూ చేయలేదు. దూకుడైన షాట్లతో పృథ్వీ షా, మయాంక్ వేగంగా పరుగులు రాబట్టారు. రెండో రోజు చివరకు వచ్చేసరికి పిచ్ కాస్త నెమ్మదించి బ్యాటింగ్‌కు అనుకూలంగా మారడం కూడా వీరికి కలిసొచ్చింది. ముఖ్యంగా తొలి ఇన్నింగ్స్‌లో తామిద్దరిని అవుట్ చేసిన కుగ్లీన్ బౌలింగ్‌లో విరుచుకుపడిన వీరిద్దరు 3 ఓవర్లలోనే 34 పరుగులు బాదారు. భారత్ ఇన్నింగ్స్ 8.42 రన్‌రేట్‌తో సాగడం విశేషం. తొలి ఇన్నింగ్స్‌లాగే మరో సారి ఓపెనర్లుగా పృథ్వీ, మయాంక్‌లనే పంపడం చూస్తే తొలి టెస్టులో వీరిద్దరినే ఆడించే ఆలోచనతో టీమ్ మేనేజ్మెంట్ ఉన్నట్లు కనిపిస్తోంది. అదే జరిగితే టెస్టు అరంగేట్రం కోసం శుబ్‌మన్ గిల్ మరికొంత కాలం వేచి చూడక తప్పదు. స్కోరు వివరాలు భారత్ తొలి ఇన్నింగ్స్: 263; న్యూజిలాండ్ ఎలెవన్ తొలి ఇన్నింగ్స్: యంగ్ (సి) పంత్ (బి) బుమ్రా 2; రవీంద్ర (సి) పంత్ (బి) ఉమేశ్ 34; సీఫెర్ట్ (సి) పంత్ (బి) షమీ 9; అలెన్ (బి) బుమ్రా 20; కూపర్ (సి) మయాంక్ (బి) షమీ 40; బ్రూస్ (బి) సైనీ 31; మిషెల్ (సి) పృథ్వీ షా (బి) ఉమేశ్ 32; నీషమ్ (బి) షమీ 1; క్లీవర్ (బి) సైనీ 13; కుగ్లీన్ (నాటౌట్) 11; సోధి (సి) పుజారా (బి) అశ్విన్ 14; ఎక్స్‌ట్రాలు 28; మొత్తం (74.2 ఓవర్లలో ఆలౌట్) 235. వికెట్ల పతనం: 1–11; 2–36; 3–70; 4–82; 5–133; 6–155; 7–161; 8–204; 9–213; 10–235. బౌలింగ్: బుమ్రా 11–3–18–2; ఉమేశ్ 13–1–49–2; షమీ 10–5–17–3; సైనీ 15–2–58–2; అశ్విన్ 15.2–2–46–1; జడేజా 10–4–25–0. భారత్ రెండో ఇన్నింగ్స్: పృథ్వీ షా (బ్యాటింగ్) 35; మయాంక్ అగర్వాల్ (బ్యాటింగ్) 23; ఎక్స్‌ట్రాలు 1; మొత్తం (7 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా) 59 బౌలింగ్: టిక్నెర్ 3–0–19–0; కుగ్లీన్ 3–0–34–0; జాన్స్టన్ 1–0–6–0. -
సెంచరీతో చెలరేగిన హనుమ విహారి
0, 1, 0... న్యూజిలాండ్‌తో తొలి టెస్టులో ఓపెనర్లుగా బరిలోకి దిగేందుకు అవకాశం ఉన్న ముగ్గురు బ్యాట్స్మెన్లు ప్రాక్టీస్ మ్యాచ్‌లో చేసిన స్కోర్లు ఇవి. నిజానికి కివీస్ ఎలెవన్‌తో ఈ మ్యాచ్‌ను ఓపెనర్ల సామర్థ్యానికి పరీక్షగా భావించగా... కాస్త పచ్చిక ఉన్న పిచ్‌పై ముగ్గురూ అందులో విఫలమయ్యారు. అసలు టీమిండియా తుది జట్టులో ఉంటాడా లేదా అనే సందేహమున్న మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ హనుమ విహారి మాత్రం సెంచరీతో సత్తా చాటాడు. విహారికి తోడుగా సీనియర్ పుజారా కూడా తన స్థాయికి తగ్గ ఆటను ప్రదర్శించడంతో తొలి ఇన్నింగ్స్‌లో భారత జట్టు మోస్తరు స్కోరు సాధించింది. కెప్టెన్ కోహ్లి మాత్రం బ్యాటింగ్‌కు దూరంగా ఉండిపోవడమే శుక్రవారం ఆటలో విశేషం. హామిల్టన్: పిచ్‌పై కాస్త బౌన్స్, మరికాస్త స్వింగ్ కలగలిస్తే భారత బ్యాట్స్‌మెన్ తడబడతారనేది గతంలో చాలా సార్లు రుజువైంది. అయితే కోహ్లి సారథ్యంలోని ప్రస్తుత జట్టు వాటికి అతీతమని, ఎక్కడైనా రాణించగలదని అంతా అనుకున్నారు. అయితే ఇప్పుడు న్యూజిలాండ్ గడ్డపై మాత్రం పెను సవాల్ ఎదురు కానుందని ప్రాక్టీస్ మ్యాచ్‌లోనే తేలిపోయింది. కివీస్ ద్వితీయ శ్రేణి బౌలర్లను కూడా సమర్థంగా మన బ్యాట్స్‌మెన్ ఎదుర్కోలేకపోయారు. ఫలితంగా న్యూజిలాండ్ ఎలెవన్‌తో శుక్రవారం ప్రారంభమైన ప్రాక్టీస్ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 78.5 ఓవర్లలో 263 పరుగులకే ఆలౌటైంది. ఆంధ్ర ఆటగాడు హనుమ విహారి (182 బంతుల్లో 101 రిటైర్డ్ అవుట్; 10 ఫోర్లు, 3 సిక్సర్లు) సెంచరీతో అజేయంగా నిలిచాడు. పుజారా (211 బంతుల్లో 93; 11 ఫోర్లు, 1 సిక్స్) మాత్రం త్రుటిలో ఆ అవకాశం చేజార్చుకోగా... ఇతర బ్యాట్స్‌మెన్‌లో ఎవరూ కనీసం 20 పరుగులు కూడా దాటలేకపోయారు. విహారి, పుజారా ఐదో వికెట్‌కు 195 పరుగులు జోడించారు. టపటపా... టాస్ గెలిచిన భారత్ బ్యాటింగ్ ఎంచుకుంది. కుగ్లీన్ వేసిన తొలి ఓవర్లోనే అనూహ్యంగా పైకి లేచిన బంతిని ఆడలేక పృథ్వీ షా (0) షార్ట్‌లెగ్‌లో దొరికిపోయాడు. ఆ తర్వాత కుగ్లీన్ బౌలింగ్‌లోనే ఆఫ్‌స్టంప్‌పై దూసుకొచ్చిన బంతిని ఆడి మయాంక్ (1) కీపర్‌కు క్యాచ్ ఇచ్చాడు. కివీస్ బౌలర్లు షార్ట్ పిచ్ బంతులతో ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తారని, వాటిని జాగ్రత్తగా ఆడాలంటూ వ్యాఖ్యానించిన శుబ్‌మన్ గిల్ (0) ఈ ఇన్నింగ్స్‌లో షార్ట్ పిచ్ బంతినే ఆడలేక గల్లీలో క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అనుభవజ్ఞుడైన రహానే (18) కూడా నీషమ్ వేసిన స్వింగ్ బంతికి స్లిప్‌లో క్యాచ్ ఇవ్వడం ఆశ్చర్యపరచింది. భారీ భాగస్వామ్యం... భారత్ స్కోరు 38/4గా నిలిచిన దశలో పుజారా, విహారి ఆదుకున్నారు. ప్రత్యర్థి బౌలర్లు షార్ట్ పిచ్ బంతులు వేసినా వాటిని సమర్థంగా ఎదుర్కొన్నారు. తాను ఆడిన తొలి 80 బంతుల్లో పుజారా ఒకే ఫోర్ కొట్టాడు. పిచ్ సాధారణంగా మారిపోయిన తర్వాత ఇద్దరూ చక్కటి షాట్లు ఆడారు. ముఖ్యంగా లెఫ్టార్మ్ స్పిన్నర్ రచిన్ రవీంద్ర బౌలింగ్‌లో విహారి కొట్టిన మూడు సిక్సర్లు హైలైట్‌గా నిలిచాయి. అర్ధసెంచరీ చేసేందుకు పుజారాకు 153 బంతులు, విహారికి 132 బంతులు పట్టాయి. అయితే ఆ తర్వాత సెంచరీ అందుకునేందుకు విహారి మరో 48 బంతులు మాత్రమే తీసుకోవడం విశేషం. మరో వైపు పుజారా మాత్రం సెంచరీకి చేరువలో కీపర్‌కు క్యాచ్ ఇచ్చి అవుట్ కాగా... శతకం పూర్తి కాగానే విహారి రిటైర్డ్ అవుట్‌గా తప్పుకున్నాడు. ఆ తర్వాత తొలి రోజు మిగిలిన సమయంలో వీలైనన్ని ఎక్కువ పరుగులు చేసే ప్రయత్నంలో భారత బ్యాట్స్‌మన్ వెంటవెంటనే అవుటయ్యారు. 18 పరుగుల వ్యవధిలో చివరి నలుగురు బ్యాట్స్‌మెన్ పెవిలియన్ చేరారు. స్కోరు వివరాలు భారత్ తొలి ఇన్నింగ్స్: పృథ్వీ షా (సి) రవీంద్ర (బి) కుగ్లీన్ 0; మయాంక్ (సి) క్లీవర్ (బి) కుగ్లీన్ 1; పుజారా (సి) క్లీవర్ (బి) గిబ్సన్ 93; గిల్ (సి) సీఫెర్ట్ (బి) కుగ్లీన్ 0; రహానే (సి) బ్రూస్ (బి) నీషమ్ 18; విహారి (రిటైర్డ్ అవుట్) 101; పంత్ (సి) కుగ్లీన్ (బి) సోధి 7; సాహా (సి) క్లీవర్ (బి) గిబ్సన్ 0; అశ్విన్ (ఎల్బీ) (బి) సోధి 0; ఉమేశ్ (నాటౌట్) 9; జడేజా (సి) అలెన్ (బి) సోధి 8; ఎక్స్‌ట్రాలు 26; మొత్తం (78.5 ఓవర్లలో ఆలౌట్) 263. వికెట్ల పతనం: 1–0; 2–5; 3–5; 4–38; 5–233; 6–245; 7–246; 8–246; 9–250; 10–263. బౌలింగ్: కుగ్లీన్ 14–2–40–3; టిక్నర్ 15–3–37–0; మిషెల్ 7–1–15–0; నీషమ్ 13–3–29–1; గిబ్సన్ 10–1–26–2; సోధి 14.5–0–72–3; రవీంద్ర 5–1–30–0. ఓపెనింగ్ చేసేందుకు సిద్ధం! హామిల్టన్: విహారి కెరీర్ 7 టెస్టు మ్యాచ్‌లే కావచ్చు. కానీ తనకు టీమ్ మేనేజ్మెంట్ ఎప్పుడు అవకాశం ఇచ్చినా దానిని వృథా చేయలేదు. ఎక్కడైనా, ఏ స్థానంలోనైనా ఆడగలనని ఈ ఆంధ్ర రంజీ జట్టు కెప్టెన్ నిరూపించాడు. ఏడాది క్రితం మెల్బోర్న్ టెస్టులో అనూహ్యంగా అతడిని ఓపెనర్‌గా పంపారు. 8, 13 పరుగులే చేసినా... తొలి ఇన్నింగ్స్‌లో దాదాపు 80 నిమిషాల పట్టుదలగా క్రీజ్‌లో నిలిచి బౌలర్లను సమర్థంగా ఎదుర్కోవడం జట్టుకు పనికొచ్చింది. అతని ఈ ప్రదర్శనను కెప్టెన్ కోహ్లి స్వయంగా ప్రశంసించాడు. ఇప్పుడు అలాంటిదే మరో అవకాశం అతని కోసం ఎదురు చూస్తోంది. ప్రాక్టీస్ మ్యాచ్‌లో ముగ్గురు ఓపెనర్లూ విఫలం కాగా, ఓపెనర్లకు ఉండే సమర్థవంతమైన టెక్నిక్‌తో విహారి సెంచరీ చేయడం అతనికి కొత్త అవకాశాన్ని సృష్టించింది. దీనిపై స్పందించిన విహారి ఏ స్థానంలోనైనా ఆడేందుకు తాను సిద్ధమని ప్రకటించాడు. ‘ఒక ఆటగాడిగా ఏ స్థానంలోనైనా ఆడేందుకు నేను సన్నద్ధమయ్యాను. టీమ్ మేనేజ్మెంట్ ఇప్పటి వరకు నాతో ఏమీ చెప్పలేదు. ఎవరూ మాట్లాడలేదు. అయితే గతంలో చెప్పినట్లు జట్టు అవసరాల దృష్ట్యా ఎక్కడైనా బ్యాటింగ్ చేసేందుకు నేను సిద్ధం. కొన్ని సార్లు జట్టు కూర్పు గురించి కూడా ఆలోచించాల్సి వస్తుంది. దాని వల్ల బాధ పడకూడదు. స్వదేశంలో ఆడినప్పుడు మన జట్టు ఐదుగురు బౌలర్లతో దిగుతుంది కాబట్టి ఒక బ్యాట్స్‌మన్‌ను తప్పించాల్సిందే. నాకు తుది జట్టులో చోటు దక్కకపోవడానికి అదే కారణమని భావిస్తున్నా’ అని శుక్రవారం మీడియా సమావేశంలో విహారి వ్యాఖ్యానించాడు. -
విజయనగరంలో క్రికెట్ సంబరం
-
ఆట లేదు వానే..!
సాక్షి ప్రతినిధి విజయనగరం: బోర్డు ప్రెసిడెంట్స్ ఎలెవెన్–దక్షిణాఫ్రికా జట్ల మూడు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్‌కు వరుణుడు అడ్డుతగిలాడు. గురువారం జల్లులతో ప్రారంభమైన వర్షం చాలాసేపు పడటంతో తొలి రోజు ఆటను నిర్వాహకులు పూర్తిగా రద్దు చేశారు. విజయనగరం సమీపంలోని డా. పీవీజీ రాజు ఏసీఏ స్పోర్ట్స్ కాంప్లెక్స్ మైదానం వేదికైన ఈ మ్యాచ్‌లో కనీసం టాస్ కూడా పడలేదు. వాతావరణ ప్రభావంతో మైదానాన్ని పూర్తిగా కవర్లతో కప్పి ఉంచారు. ఉదయం 8 గంటలకే చేరుకున్న ఇరు జట్ల క్రీడాకారులు చాలాసేపు వేచి చూశారు. చివరకు మధ్యాహ్నం ఒంటి గంట తర్వాత విశాఖపట్నం తిరుగు ప్రయాణమయ్యారు. అంతర్జాతీయ స్థాయి క్రికెటర్ల ఆటను దగ్గరగా చూసేందుకు వచ్చిన అభిమానులు నిరాశగా వెనుదిరిగారు. అంతకుముందు ఉదయం 9.30 సమయంలో వరుణుడు కాస్త తెరపినివ్వడంతో ఆట ప్రారంభించే యత్నాలు చేశారు. అంతలోనే మళ్లీ వాన మొదలైంది. శుక్రవారం సైతం వర్షం కురిసే అవకాశం ఉంది. -
రోహిత్‌పైనే చూపంతా!
పరిమిత ఓవర్ల క్రికెట్లో లెక్కకు మిక్కిలి రికార్డులు ఖాతాలో వేసుకున్న హిట్‌మ్యాన్ రోహిత్‌శర్మ ఇప్పుడు కెరీర్లో కీలక మలుపులో ఉన్నాడు. తనతో ఇంతకాలం దోబూచులాడుతున్న ‘టెస్టుల్లో చోటు’ను సుస్థిరం చేసుకునేందుకు పెద్ద పరీక్షకు సిద్ధమయ్యాడు. గురువారం నుంచి విజయనగరం శివారులోని డా.పీవీజీ రాజు క్రీడా మైదానంలో దక్షిణాఫ్రికాతో జరుగనున్న మూడు రోజుల సన్నాహక మ్యాచ్‌లో అటు ఓపెనర్‌గా, ఇటు కెపె్టన్‌గా బోర్డు ఎలెవెన్ జట్టును అతడు నడిపించనున్నాడు. వచ్చే నెలలో ప్రారంభం కానున్న మూడు టెస్టుల సిరీస్‌లో రోహిత్... టీమిండియా ఇన్నింగ్స్ ప్రారంభించే అవకాశాలు ఖాయమైన నేపథ్యంలో అందుకుతగ్గ ‘ప్రాక్టీస్’ను ఎలా సాగిస్తాడో... సాక్షి ప్రతినిధి, విజయనగరం ఒకరివెంట ఒకరు కుర్రాళ్లు దూసుకొస్తున్న తరుణంలో రోహిత్‌కు ఇప్పుడు లభించిన ‘టెస్టు’ అవకాశం బహుశా చివరిదనే భావించాలి. అందులోనూ ఓపెనర్‌గా రానుండటంతో అందరి కళ్లూ అతడిపైనే ఉన్నాయి. ఓ బ్యాట్స్‌మన్‌గా రోహిత్ సామర్థ్యంపై ఇంకే అనుమానాలు లేకున్నా... ఎర్ర బంతిని ఎదుర్కొనడంలో తడబాటు అతడిని సంప్రదాయ ఫార్మాట్లో సాధారణ ఆటగాడిగా మార్చేసింది. ప్రస్తుతం ఆ వైఫల్యాల జ్ఞాపకాలను చెరిపేసే మార్గం హిట్‌మ్యాన్ ముందు నిలిచింది. ప్రత్యర్ధి జట్టులోని మెరుగైన బౌలింగ్ వనరులకు ఎదురు నిలిచి రాణిస్తే టెస్టు సిరీస్‌కు ముందు అతడిలో ఆత్మవిశ్వాసం పెరగడం ఖాయం. మరోవైపు డు ప్లెసిస్ సారథ్యంలోని దక్షిణాఫ్రికా మెరుగ్గా సన్నద్ధమయ్యే పనిలో ఉంది. ఆ ఇద్దరే ఇక్కడా... రోహిత్ శర్మ, మయాంక్ అగర్వాల్ ప్రాక్టీస్ మ్యాచ్‌లో బోర్డు ఇన్నింగ్స్‌ను ప్రారంభిస్తారు. దక్షిణాఫ్రికాపై మూడు టెస్టుల సిరీస్‌లో టీమిండియా తరఫున వీరే ఓపెనర్లు. తొలిసారి జోడీగా దిగుతున్న వీరికి రబడ, ఫిలాండర్, ఇన్‌గిడి వంటి సఫారీ బౌలర్లను ముందే ఆడనుండటం సానుకూలాంశం. సమన్వయం రీత్యా కూడా మంచి సన్నాహకం దొరికినట్లే. స్వతహాగా ఓపెనర్లయినా... కూర్పు ప్రకారం ప్రియాంక్ పాం చల్, అభిమన్యు ఈశ్వరన్‌లలో ఒకరే బరిలో దిగే వీలుంటుంది. ఇటీవల నిలకడగా ఆడుతున్న కరుణ్ నాయర్, సిద్దేశ్ లాడ్, ఆంధ్ర వికెట్ కీపర్ కోన శ్రీకర్ భరత్‌లతో బోర్డు బ్యాటింగ్ ఆర్డర్ పటిష్టంగా కనిపిస్తోంది. గాయపడిన బుమ్రా స్థానంలో సఫారీ టెస్టు సిరీస్‌కు ఎంపికైన ఉమేశ్ యాదవ్ పేస్‌తో పాటు యువ ఇషాన్ పొరెల్, అవేష్ ఖాన్లు తమ పేస్ సత్తా చాటేందుకు ఈ మ్యాచ్ ఓ వేదిక. జలజ్ సక్సేనా, ధర్మేంద్ర జడేజా స్పిన్‌తో ప్రొటీస్ పని పట్టగలవారే. అందరూ బరిలోకి... డు ప్లెసిస్ వన్డే ప్రపంచ కప్ తర్వాత తొలిసారి మైదానంలోకి దిగుతున్నాడు. అతడికి టెస్టుల్లో స్థానం నిలవాలంటే రాబోయే మ్యాచ్‌లు కీలకం. ఓపెనర్ మార్క్రమ్ ‘ఎ’ జట్టు తరఫున భారీ సెంచరీ కొట్టి ఫామ్ చాటాడు. ఎల్గర్, బవుమా, వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ డికాక్ తదితరులతో బ్యాటింగ్ లైనప్ బలంగా ఉంది. చాలా కాలం తర్వాత అంతర్జాతీయ క్రికెట్ ఆడబోతున్న ఫిలాండర్ సఫారీల ప్రధాన పేసర్. టి20 సిరీస్‌లో విఫలమైన రబడ అసలు సమరం నాటికి పుంజుకోవాలని చూస్తున్నాడు. కేశవ్ మహరాజ్, ముత్తుస్వామిల స్పిన్ ఏమేరకు సవాల్ విసురుతుందో చూడాలి. వరుణుడు కరుణిస్తేనే... మొదటిసారి అంతర్జాతీయ సన్నాహక క్రికెట్ మ్యాచ్‌కు వేదికవుతున్న ఈ మైదానంలో మ్యాచ్‌కు వరుణుడు అడ్డు పడేలా ఉన్నాడు. అంతర్జాతీయ స్థాయి క్రికెటర్లు పాల్గొంటున్నందున అభిమానులు ఎదురుచూస్తున్నారు. కానీ, అల్పపీడనం ప్రభావంతో మంగళవారం రాత్రి నుంచి వర్షం కురుస్తోంది. బుధవారం రాత్రి సైతం వాన పడింది. నిర్వాహకులు మాత్రం వర్షం విరామం ఇస్తే గంటలోనే ఆటను ప్రారంభిస్తామని చెబుతున్నారు. ఇరు జట్ల వివరాలు బోర్డు ఎలెవెన్ : రోహిత్ (కెప్టెన్), మయాంక్ అగర్వాల్, ప్రియాంక్ పాంచల్, అభిమన్యు ఈశ్వరన్, కరుణ్ నాయర్, సిద్దేశ్ లాడ్, కేఎస్ భరత్, జలజ్ సక్సేనా, ధర్మేంద్ర సింగ్ జడేజా, అవేష్ ఖాన్, ఇషాన్ పొరెల్, శార్దుల్ ఠాకూర్, ఉమేశ్ యాదవ్. దక్షిణాఫ్రికా: డు ప్లెసిస్ (కెప్టెన్), బవుమా, డి బ్రుయెన్, డి కాక్, ఎల్గర్, హమ్జా, కేశవ్ మహరాజ్, మార్క్రమ్, సెనురాన్ ముతుస్వామి, ఇన్‌గిడి, నోర్టె, ఫిలాండర్, పీట్, రబడ, రూడీ సెకండ్. -
వైజాగ్‌లో రోహిత్ శర్మ
సాక్షి, విశాఖపట్నం: ఓపెనర్ రోహిత్ శర్మతో పాటు పలువురు టీమిండియా క్రికెటర్లు బుధవారం సాయంత్రం విశాఖపట్నం చేరుకున్నారు. బెంగళూరు నుండి ఇండిగో విమానంలో విశాఖ విమానాశ్రయం చేరుకున్న వీరు రోడ్డు మార్గాన నొవోటెల్ హోటల్‌కు వచ్చారు. ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విజయనగరం వేదికగా రేపటి నుంచి మూడు రోజులు పాటు జరగనున్న ప్రాక్టీస్ మ్యాచ్‌లో అతడు ఆడతాడు. పీవీజీ రాజు ఏసీఏ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో ఈ నెల 26 నుంచి 28వ తేదీ వరకు దక్షిణాఫ్రికా, ఇండియా బోర్డ్ ప్రెసిడెంట్స్ ఎలెవన్ జట్ల మధ్య సన్నాహక టెస్ట్ మ్యాచ్ నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఇండియా బోర్డ్ ప్రెసిడెంట్స్ ఎలెవన్ జట్టుకు కెప్టెన్‌గా రోహిత్ శర్మ వ్యవహరించనున్నాడు. మయాంక్ అగర్వాల్, కరుణ్నాయర్, శార్ధూల్ ఠాకూర్, ఉమేష్ యాదవ్ కూడా ఈ మ్యాచ్‌లో ఆడనున్నారు. అలాగే దక్షిణాఫ్రికా ప్రధాన జట్టులోని క్రీడాకారులంతా ఈ మ్యాచ్‌లో బరిలోకి దిగనున్నారు. పక్కా ఏర్పాట్లు చేశాం మూడు రోజులు పాటు నిర్వహించనున్న ప్రాక్టీస్ మ్యాచ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తిచేసినట్లు నార్త్‌జోన్ క్రికెట్ అకాడమీ కార్యదర్శి జీవీ సన్యాసిరాజు తెలిపారు. తొలిసారిగా అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో నిర్వహించే మ్యాచ్ కోసం పక్కా ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. ఈ మ్యాచ్‌ను వీక్షించేందుకు రోజుకు 1,500 మంది నుంచి 2,000 మంది వరకు ప్రేక్షకులు వస్తారన్న అంచనాతో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. మ్యాచ్‌ను చూసేందుకు ఎలాంటి రుసుం చెల్లించాల్సిన లేదన్నారు. గతంలో ఇదే స్టేడియంలో ఇండియా, శ్రీలంక మహిళా జట్ల మధ్య అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ నిర్వహించినట్లు గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో నార్త్‌జోన్ క్రికెట్ అకాడమీ హెడ్ కోచ్ సీడీ థామ్సన్, జిల్లా క్రికెట్ అసోసియేషన్ సభ్యులు సీతారామరాజు, అకాడమీ నిర్వాహకుడు సి. జగదీష్‌నాయుడు పాల్గొన్నారు. కాగా, అక్టోబర్ 2 నుంచి వైజాగ్‌లో భారత్-దక్షిణాఫ్రికా మొదటి టెస్ట్ జరగనుంది. మ్యాచ్‌కు పటిష్ట బందోబస్తు విజయనగరం జిల్లా డెంకాడ మండలం చింతలవలస గ్రామంలోని డాక్టర్ పీవీజీ రాజు ఏసీఎ స్పోర్ట్స్ కాంప్లెక్స్ మైదానంలో భద్రతా ఏర్పాట్లను జిల్లా ఎస్పీ బి.రాజకుమారి పర్యవేక్షించారు. బోర్డు ప్రెసిడెంట్ ఎలెవన్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య మూడు రోజుల పాటు ప్రాక్టీస్ మ్యాచ్ జరగనున్న నేపథ్యంలో ఎస్పీ స్టేడియాన్ని సందర్శించి పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని విజయనగరం డీఎస్పీ పి.వీరాంజనేయరెడ్డిని ఆదేశించారు. స్టేడియంలోకి ఆటగాళ్లు ప్రవేశించే మార్గాన్ని, బస చేసే గదులను, వీక్షించేందుకు వచ్చే అభిమానుల గ్యాలరీలను సందర్శించి, ఎక్కడెక్కడ ఏర్పాట్లు చేయాలో అధికారులకు పలు సూచనలు చేశారు. భద్రత, ఏర్పాట్ల విషయమై ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్, నార్త్ జోన్ క్రికెట్ అకాడమీ ప్రతినిధులతో ఎస్పీ చర్చించారు. ఈ మ్యాచ్‌కు భారత్, దక్షిణాఫ్రికా దేశాలకు చెందిన అంతర్జాతీయ క్రీడాకారులు పాల్గొననున్న దృష్ట్యా, ఆటగాళ్ల భద్రతకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా బందోబస్తు ఏర్పాటు చేయాలని పోలీసు అధికారులను ఎస్పీ ఆదేశించారు. ఆమె వెంట ఓఎస్డీ జె.రామ్మోహనరావు, వన్ టౌన్ సీఐ ఎర్రంనాయుడు, రూరల్ సీఐ రమేష్, స్పెషల్ బ్రాంచ్ సీఐ దుర్గాప్రసాదరావు, ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్, అకాడమీ ప్రతినిధులు, ఇతర పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
విహారి, రహానే అర్ధ సెంచరీలు
కూలిడ్జ్ (ఆంటిగ్వా): ప్రాక్టీస్ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో విఫలమైన భారత వైస్ కెప్టెన్ అజింక్య రహానే రెండో ఇన్నింగ్స్‌లో చక్కటి ఆటతో ఆత్మవిశ్వాసం పెంచుకున్నాడు. విండీస్ ‘ఎ’తో ‘డ్రా’గా ముగిసిన ఈ మూడు రోజుల మ్యాచ్‌లో రహానే (162 బంతుల్లో 54; 5 ఫోర్లు, 1 సిక్స్)కు తోడు మరో టెస్టు స్పెషలిస్ట్ హనుమ విహారి (125 బంతుల్లో 64; 9 ఫోర్లు, 1 సిక్స్) కూడా అర్ధ సెంచరీలు సాధించారు. ఫలితంగా భారత్ తమ ఇన్నింగ్స్‌ను 5 వికెట్ల నష్టానికి 188 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. రెండో ఇన్నింగ్స్‌లో మయాంక్ అగర్వాల్ (13)తో పాటు రహానే ఓపెనర్‌గా బరిలోకి దిగాడు. మయాంక్ ఔటైన తర్వాత వచ్చిన విహారితో కలిసి కీలక భాగస్వామ్యం నెలకొల్పాడు. వీరిద్దరు రెండో వికెట్‌కు 96 పరుగులు జోడించారు. అయితే ఆఫ్‌స్పిన్నర్ అకిమ్ ఫ్రేజర్ (2/43) బౌలింగ్‌కు భారత్ వెంటవెంటనే వికెట్లు కోల్పోయింది. ముందుగా విహారి ఔట్ కాగా... 15 పరుగుల వ్యవధిలో రిషభ్ పంత్ (19), రవీంద్ర జడేజా (9), రహానే ఔటయ్యారు. అనంతరం సాహా (14 నాటౌట్), అశ్విన్ (10) కొద్ది సేపు క్రీజ్‌లో నిలిచాక భారత్ తమ ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసి విండీస్ ‘ఎ’కు 305 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. రెండో ఇన్నింగ్స్‌లో విండీస్ ‘ఎ’ 3 వికెట్లు కోల్పోయి 47 పరుగులు చేసిన దశలో... ఫలితం వచ్చే అవకాశం లేకపోవడంతో ఇరు జట్ల కెప్టెన్లు మ్యాచ్‌ను ‘డ్రా’గా ముగించేందుకు అంగీకరించారు. -
టీమిండియాకు నిండైన ప్రాక్టీస్
కూలిడ్జ్ (అంటిగ్వా): కరీబియన్ పర్యటనలో టెస్టు సిరీస్‌కు ముందు టీమిండియాకు బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో సరైన ప్రాక్టీస్ లభించింది. వెస్టిండీస్ ‘ఎ’తో ఇక్కడ జరుగుతున్న మూడు రోజుల మ్యాచ్‌లో మన జట్టు పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. కీలక బ్యాట్స్‌మన్ పుజారా (187 బంతుల్లో 100 రిటైర్డ్ నాటౌట్; 8 ఫోర్లు, సిక్స్) సెంచరీ; తెలుగు ఆటగాడు హనుమ విహారి (101 బంతుల్లో 37 నాటౌట్; 2 ఫోర్లు); రిషభ్ పంత్ (53 బంతుల్లో 33; 4 ఫోర్లు, సిక్స్)రాణించడంతో భారత్ తొలి రోజు శనివారం 5 వికెట్ల నష్టానికి 297 పరుగులు చేసింది. ఇదే స్కోరు వద్ద డిక్లేర్ చేసింది. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభిం చిన విండీస్ ‘ఎ’ను పేసర్లు ఇషాంత్ శర్మ (3/21), ఉమేశ్ యాదవ్ (3/19); స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ (3/35) కుప్పకూల్చారు. దీంతో ప్రత్యర్థి టీ విరామానికి ముందు 56.1 ఓవర్లలో 181 పరుగులకు ఆలౌటైంది. ఆ జట్టులో ఓపెనర్ హడ్జ్ (51) అర్ధసెంచరీ సాధించాడు. భారత్‌కు 116 పరుగుల ఆధిక్యం లభించింది. -
రాణించిన పుజారా, రోహిత్
కూలిడ్జ్: కరీబియన్ పర్యటనలో టెస్టు సిరీస్ ముంగిట టీమిండియా కీలక బ్యాట్స్‌మన్ చతేశ్వర్ పుజారా (156 బంతుల్లో 89 బ్యాటింగ్; 7 ఫోర్లు, సిక్స్)కు చక్కటి సన్నాహకం లభించింది. పుజారాతో పాటు మరో బ్యాట్స్‌మన్ రోహిత్ శర్మ (115 బంతుల్లో 68; 8 ఫోర్లు, సిక్స్) అర్ధసెంచరీతో రాణించడంతో వెస్టిండీస్ ‘ఎ’తో శనివారం ఇక్కడ ప్రారంభమైన మూడు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్‌లో భారత్ మెరుగైన స్కోరు దిశగా సాగుతోంది. టీ విరామ సమయానికి జట్టు 62 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 219 పరుగులు చేసింది. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన భారత్... ఓపెనర్ మయాంక్ అగర్వాల్ (12) వికెట్‌ను త్వరగానే కోల్పోయింది. దూకుడు చూపిన మరో ఓపెనర్ కేఎల్ రాహుల్ (46 బంతుల్లో 36; 5 ఫోర్లు, సిక్స్) శుభారంభాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాడు. కెప్టెన్ అజింక్య రహానే (1) తీవ్రంగా నిరాశపర్చాడు. 6 బంతులు మాత్రమే ఆడిన అతడు కార్టర్ (2/24) బౌలింగ్‌లో కీపర్ హామిల్టన్‌కు క్యాచ్ ఇచ్చాడు. 53/3తో కష్టాల్లో పడిన ఈ స్థితిలో పుజారా, రోహిత్ ఆదుకున్నారు. నాలుగో వికెట్‌కు 132 పరుగులు జోడించారు. రోహిత్ సహజ శైలిలో ధాటిగా ఆడాడు. చాలాకాలం తర్వాత మైదానంలో దిగిన పుజారా తన ఫామ్‌ను చాటుకున్నాడు. అతడికి తోడుగా తెలుగు ఆటగాడు హనుమ విహారి (9 బ్యాటింగ్) క్రీజులో ఉన్నాడు. -
కోహ్లి లేకుండా ప్రాక్టీసుకు...
కూలిడ్జ్ (ఆంటిగ్వా): స్పెషలిస్ట్ ఆటగాళ్ల చేరికతో కరీబియన్ పర్యటనలో టీమిండియా టెస్టు సమరానికి సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా శనివారం నుంచి వెస్టిండీస్ క్రికెట్ బోర్డు ఎలెవెన్‌తో మూడు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్ ఆడనుంది. పరిమిత ఓవర్ల ఫార్మాట్లో భారత జట్టులో లేని బ్యాట్స్‌మెన్ చతేశ్వర్ పుజారా, అజింక్య రహానే, మయాంక్ అగర్వాల్, హనుమ విహారి, వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా, పేసర్లు ఉమేశ్ యాదవ్, ఇషాంత్ శర్మ, ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌లు సంప్రదాయ ఫార్మాట్‌కు సమాయత్తం అయ్యే ప్రయత్నం చేయనున్నారు. నెల రోజుల విశ్రాంతి అనంతరం ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా తాజాగా మైదానంలో దిగనున్నాడు. బుధవారం జరిగిన మూడో వన్డేలో కుడి చేతి బొటన వేలికి గాయం కావడంతో ప్రాక్టీస్ మ్యాచ్‌లో కెప్టెన్ విరాట్ కోహ్లి బరిలోకి దిగకపోవచ్చని తెలుస్తోంది. ఇది అధికారిక ఫస్ట్‌క్లాస్ మ్యాచ్ కాకపోవడంతో టీమిండియా తరఫున బ్యాట్స్‌మెన్, బౌలర్లు అందరూ మైదానంలో కాసేపు గడిపే వీలుంది. ఆస్ట్రేలియా గడ్డపై టెస్టు సిరీస్ విజయంలో ప్రధాన పాత్ర పోషించిన వన్‌డౌన్ బ్యాట్స్‌మన్ పుజారా ఎనిమిది నెలల తర్వాత అంతర్జాతీయ క్రికెట్ ఆడనున్నాడు. దేశవాళీ జట్టు సౌరాష్ట్ర తరఫున ఫిబ్రవరి మొదటివారంలో రంజీ ట్రోఫీ ఫైనల్ ఆడిన అనంతరం అతడు మార్చిలో ముస్తాక్ అలీ టి20 టోర్నీలో పాల్గొన్నాడు. టెస్టు జట్టు వైస్ కెప్టెన్ హోదాలో ఉన్నప్పటికీ కొంతకాలంగా తనదైన ఇన్నింగ్స్ ఆడలేకపోతున్న రహానేకు ఇప్పుడు అసలైన పరీక్షా కాలం నడుస్తోంది. ఇంగ్లిష్ కౌంటీల్లోనూ అతడు పెద్దగా రాణించలేకపోయాడు. ఏడు మ్యాచ్‌ల్లో 307 పరుగులే చేశాడు. ప్రాక్టీస్ మ్యాచ్‌కు రహానేనే సారథ్యం వహించనున్నాడు. సాహా అందుబాటులోకి వచ్చినందున తొలి టెస్టులో చోటు దక్కాలంటే పంత్ మెరుగైన కీపింగ్ లక్షణాలు కనబర్చాల్సి ఉంటుంది. హిట్‌మ్యాన్ రోహిత్‌శర్మ ఆటపైనా ఆసక్తి నెలకొంది. ప్రథమ ప్రాధాన్య ఓపెనర్లుగా మయాంక్ అగర్వాల్, కేఎల్ రాహుల్‌లకే అవకాశం ఉన్నా... విహారి నుంచి వీరిద్దరిలో ఒకరికి పోటీ ఉంది. పేస్‌తో ఉమేశ్, ఇషాంత్, స్పిన్‌తో అశ్విన్, జడేజా టీం మేనేజ్మెంట్ను మెప్పించేందుకు ప్రయత్నించవచ్చు. రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా భారత్–వెస్టిండీస్ మధ్య తొలి టెస్టు ఈ నెల 22 నుంచి ప్రారంభం కానుంది. -
టీమిండియా ప్రాక్టీస్‌కు వర్షం దెబ్బ
కీలకమైన ఆస్ట్రేలియాతో మ్యాచ్‌కు ముందు టీమిండియా ప్రాక్టీస్‌కు వరుణుడు అడ్డం పడ్డాడు. సౌతాంప్టన్‌లో దక్షిణాఫ్రికాతో మ్యాచ్ అనంతరం జట్టు గురువారం లండన్ చేరుకుంది. శుక్రవారం వర్షంతో ప్రాక్టీస్ సాగలేదు. దాంతో ఆసీస్‌తో మ్యాచ్ సన్నాహానికి టీమిండియాకు శనివారం ఒక్క రోజే అందుబాటులో ఉంది. మరోవైపు భారత జట్టును బ్రిటన్‌లో భారత హైకమిషనర్ రుచి ఘనశ్యామ్ శుక్రవారం విందుకు ఆహ్వానించారు. కెప్టెన్ కోహ్లి, హెడ్ కోచ్ రవిశాస్త్రి సహా జట్టు సభ్యులందరూ ఈ విందుకు హాజరయ్యారు. -
ఈ ఇద్దరు ఏం చేస్తారో?
పరిమిత ఓవర్ల క్రికెట్లో ప్రపంచ నంబర్ వన్ ఓపెనింగ్ జోడీ రోహిత్–ధావన్. కానీ, కొంతకాలంగా ఇద్దరి భాగస్వామ్యంలో పరుగులు రావడం లేదు. రెండు ప్రాక్టీస్ మ్యాచ్‌ల్లోనూ (శిఖర్ 2, 1, రోహిత్ 2, 19) విఫలమయ్యారు. వ్యక్తిగతంగా ధావన్ ఫర్వాలేకున్నా, ఐపీఎల్ సహా రోహిత్ ఫామ్ పేలవంగా ఉంది. కీలక మ్యాచ్‌ల్లో వీరి రాణింపుపైనే మన విజయం ఆధారపడి ఉంటుంది. ఐసీసీ టోర్నీల్లో ధావన్ నిలకడగా ఆడతాడు. రోహిత్ ఊపులోకి రావడానికి ఒక్క మ్యాచ్ చాలు. వీరిద్దరూ ఇక్కడే జరిగిన గత రెండు చాంపియన్స్ ట్రోఫీల్లో దుమ్మురేపిన నేపథ్యంలో తిరిగి లయ అందుకుంటారని ఆశించవచ్చు. -
విండీస్ 421
బ్రిస్టల్: న్యూజిలాండ్‌తో జరిగిన ప్రపంచకప్ ప్రాక్టీస్ మ్యాచ్‌లో వెస్టిండీస్ 91 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. క్రీజులో దిగిన ప్రతి బ్యాట్స్‌మన్ చెలరేగి ఆడటంతో తొలుత ఆ జట్టు 49.2 ఓవర్లలో 421 పరుగులకు ఆలౌటైంది. షై హోప్ (86 బంతుల్లో 101; 9 ఫోర్లు, 4 సిక్స్‌లు) సెంచరీ చేయగా, ఓపెనర్ ఎవిన్ లూయీస్ (54 బంతుల్లో 50; 6 ఫోర్లు, సిక్స్), ఆల్‌రౌండర్ ఆండ్రీ రసెల్ (25 బంతుల్లో 54; 7 ఫోర్లు, 3 సిక్స్‌లు) అర్ధ సెంచరీలు సాధించారు. క్రిస్ గేల్ (22 బంతుల్లో 36; 4 ఫోర్లు, 3 సిక్స్‌లు), కెప్టెన్ హోల్టర్ (32 బంతుల్లో 47; 3 ఫోర్లు, 3 సిక్స్‌లు) రాణించారు. బౌల్ట్‌కు (4/50) నాలుగు వికెట్లు దక్కాయి. ఛేదనలో వికెట్ కీపర్ బ్లండెల్ (89 బంతుల్లో 106; 8 ఫోర్లు, 5 సిక్స్‌లు) సెంచరీ, కెప్టెన్ విలియమ్సన్ (64 బంతుల్లో 85; 11 ఫోర్లు, 2 సిక్స్‌లు) మినహా మరెవరూ నిలవకపోవడంతో న్యూజిలాండ్ 47.2 ఓవర్లలో 330 పరుగులకు ఆలౌటైంది. -
ప్రాక్టీస్ కుదరలేదు
బ్రిస్టల్: ప్రాక్టీస్‌ను వానచినుకులు అడ్డుకున్నాయి. దీంతో ఆదివారం జరగాల్సిన రెండు ప్రపంచకప్ ప్రాక్టీస్ మ్యాచ్‌లు వర్షం వల్ల రద్దయ్యాయి. వెస్టిండీస్, దక్షిణాఫ్రికాల మధ్య వార్మప్ మ్యాచ్ 12.4 ఓవర్ల వరకు సాగింది. కానీ బంగ్లాదేశ్, పాకిస్తాన్ జట్ల మధ్య ప్రాక్టీస్ మ్యాచ్ ఒక్క బంతి కూడా పడకుండానే రద్దయింది. కనీసం టాస్ కూడా పడలేదు. దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో టాస్ నెగ్గిన వెస్టిండీస్ ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో ఆమ్లా, డికాక్ సఫారీ ఇన్నింగ్స్‌ను ప్రారంభించారు. ఇద్దరు ప్రత్యర్థి బౌలర్లకు వికెట్ చిక్కకుండా బ్యాటింగ్ చేశారు. ఆమ్లా (46 బంతుల్లో 51 నాటౌట్; 8 ఫోర్లు, 1 సిక్స్) అర్ధసెంచరీ పూర్తి చేసుకోగా, డికాక్ (30 బంతుల్లో 37 నాటౌట్; 7 ఫోర్లు) ధాటిగా ఆడాడు. 12.4 ఓవర్లలో దక్షిణాఫ్రికా వికెట్ కోల్పోకుండా 95 పరుగులు చేసింది. ఈ దశలో వర్షం మైదానాన్ని ముంచెత్తింది. ఔట్ ఫీల్డ్ అంతా చిత్తడిగా మారడంతో మళ్లీ ఆట కొనసాగలేదు. -
ఇంగ్లండ్ ఓడింది
సౌతాంప్టన్: కొన్నాళ్లుగా 400 పైగా పరుగులను అలవోకగా చేస్తూ... 350 పైగా లక్ష్యాలను సునాయాసంగా ఛేదిస్తున్న ఇంగ్లండ్... సొంతగడ్డపై ప్రపంచ కప్ సన్నాహక మ్యాచ్‌లో బోల్తా పడింది. శనివారం జరిగిన మ్యాచ్‌లో ఆ జట్టు ఆస్ట్రేలియా చేతిలో 12 పరుగుల తేడాతో ఓడింది. మొదట ఆసీస్ స్టీవ్ స్మిత్ (102 బంతుల్లో 116; 8 ఫోర్లు, 3 సిక్స్‌లు) చక్కటి సెంచరీకి తోడు ఓపెనర్ వార్నర్ (55 బంతుల్లో 43; 5 ఫోర్లు) రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 297 పరుగులు చేసింది. ఇంగ్లండ్ పేసర్ ప్లంకెట్ (4/69) రాణించాడు. ఛేదనలో ఇంగ్లండ్ 49.3 ఓవర్లలో 285 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్లు రాయ్ (32), బెయిర్‌స్టో (12) త్వరగానే ఔటయ్యారు. విన్స్ (64; 5 ఫోర్లు), బట్లర్ (31 బంతుల్లో 52; 5 ఫోర్లు, 3 సిక్స్‌లు) జోరుతో జట్టు లక్ష్యం దిశగా సాగింది. కానీ, పుంజుకొన్న ఆస్ట్రేలియా బౌలర్లు వీరిని వరుసగా పెవిలియన్ చేర్చారు. 18 బంతుల్లో 24 పరుగులు అవసరమైన స్థితిలో వోక్స్ (40; 3 ఫోర్లు), ప్లంకెట్ (19), ఆర్చర్ (1) ఔటయ్యారు. దీంతో ఇంగ్లండ్ ఓడిపోయింది. -
స్వింగ్ దెబ్బకు కుదేల్
ప్రాక్టీస్ మ్యాచే కావచ్చు... కానీ ప్రమాద ఘంటిక మోగించింది... పట్టించుకోవాల్సిన అవసరం లేదని భావించవచ్చు... కానీ పదునైన స్వింగ్ పని చేస్తే మన పరిస్థితి ఏమిటో చూపించింది... పచ్చికతో నిండిన పిచ్, మేఘావృత వాతావరణంలో పేసర్లు ట్రెంట్ బౌల్ట్, నీషమ్ చెలరేగిన వేళ భారత బ్యాటింగ్ కుప్పకూలింది. బౌల్ట్ దెబ్బకు 24 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన టీమిండియా మళ్లీ కోలుకోలేకపోయింది. ఫలితంగా తొలి వార్మప్ పోరులో న్యూజిలాండ్ చేతిలో 6 వికెట్లతో పరాజయం... కనీసం 300 పరుగులు నమోదవుతాయని భావించిన మైదానంలో చివరకు కోహ్లి సేన 179 పరుగులకే పరిమితం కావడం ఆశ్చర్యకరం. లండన్: ప్రపంచ కప్‌కు ముందు సన్నాహక సమరాన్ని భారత్ పరాజయంతో ప్రారంభించింది. శనివారం ఇక్కడి ఓవల్ మైదానంలో జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్‌లో న్యూజిలాండ్ 6 వికెట్ల తేడాతో భారత్‌పై ఘన విజయం సాధించింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్ 39.2 ఓవర్లలోనే 179 పరుగులకు ఆలౌటైంది. పది ఓవర్ల ముందే జట్టు ఇన్నింగ్స్ ముగియడం విశేషం. రవీంద్ర జడేజా (50 బంతుల్లో 54; 6 ఫోర్లు, 2 సిక్సర్లు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. హార్దిక్ పాండ్యా (37 బంతుల్లో 30; 6 ఫోర్లు) ఫర్వాలేదనిపించాడు. ట్రెంట్ బౌల్ట్ (4/33) ప్రత్యర్థిని కుప్పకూల్చగా, నీషమ్ (3/26) రాణించాడు. అనంతరం న్యూజిలాండ్ 37.1 ఓవర్లలో 4 వికెట్లకు 180 పరుగులు చేసి విజయాన్నందుకుంది. రాస్ టేలర్ (75 బంతుల్లో 71; 8 ఫోర్లు), విలియమ్సన్ (87 బంతుల్లో 67; 6 ఫోర్లు, 1 సిక్స్) మూడో వికెట్‌కు 114 పరు గులు జోడించి జట్టును గెలిపించారు. భారత బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా (4–2–2–1) అత్యంత పొదుపుగా బౌలింగ్ చేశాడు. ఓపెనర్లు విఫలం... బౌల్ట్ తన తొలి మూడు ఓవర్లలో ఒక్కో వికెట్ చొప్పున పడగొట్టి భారత్‌ను దెబ్బ తీశాడు. అతను వేసిన తొలి బంతిని ఆడలేకపోయిన రోహిత్ శర్మ (6 బంతుల్లో 2) రెండో బంతికే వికెట్ల ముందు దొరికిపోయాడు. అంపైర్ ఎల్బీ నిర్ణయంపై రోహిత్ రివ్యూ చేసినా లాభం లేకపోయింది. బౌల్ట్ తర్వాతి ఓవర్లో లోపలికి దూసుకొచ్చిన బంతిని ఆడలేక శిఖర్ ధావన్ (7 బంతుల్లో 2) కీపర్‌కు క్యాచ్ ఇచ్చాడు. విజయ్ శంకర్, కేదార్ జాదవ్ గాయాలతో బాధపడుతుండటంతో నాలుగో స్థానంలో సత్తా చాటేందుకు మంచి అవకాశం లభించిన కేఎల్ రాహుల్ (10 బంతుల్లో 6) దానిని వాడుకోలేకపోయాడు. బౌల్ట్ బంతిని థర్డ్‌మ్యాన్ దిశగా పంపబోయి రాహుల్ వికెట్లపైకి ఆడుకున్నాడు. బౌల్డ్ అయిన తర్వాత బంతిని తన కాలితో బలంగా తన్నడం అతనిలోని అసహనాన్ని చూపించింది! కొన్ని చక్కటి షాట్లు ఆడిన విరాట్ కోహ్లి (24 బంతుల్లో 18; 3 ఫోర్లు) గ్రాండ్‌హోమ్ వేసిన బంతికి క్లీన్‌బౌల్డ్‌గా వెనుదిరిగాడు. ఈ దశలో హార్దిక్ దూకుడుగా ఆడే ప్రయత్నం చేశాడు. అయితే అద్భుత బంతితో హార్దిక్‌ను ఔట్ చేసిన నీషమ్...అదే ఓవర్లో దినేశ్ కార్తీక్ (3 బంతుల్లో 4)ను పెవిలియన్ చేర్చాడు. క్రీజ్‌లో తీవ్రంగా ఇబ్బంది పడ్డ ఎమ్మెస్ ధోని (42 బంతుల్లో 17; 1 ఫోర్)ని సౌతీ దెబ్బ తీయగా... భువనేశ్వర్ (17 బంతుల్లో 1) నిలవలేదు. స్కోరు 115/8గా ఉన్న ఈ దశలో కుల్దీప్ యాదవ్ (36 బంతుల్లో 19; 2 ఫోర్లు) తొమ్మిదో వికెట్‌కు 62 పరుగులు జత చేశారు. ఛేదనలో కివీస్ 37 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది. బుమ్రా అద్భుత బంతితో మున్రో (3 బంతుల్లో 4)ను ఎల్బీగా ఔట్ చేయగా... మార్టిన్ గప్టిల్ (28 బంతుల్లో 22; 3 ఫోర్లు) వేగంగా ఆడబోయి వెనుదిరిగాడు. టేలర్, విలియమ్సన్ భాగస్వామ్యం న్యూజిలాండ్‌ను గెలిపించింది. 3, 41 పరుగుల వ్యక్తిగత స్కోర్ల వద్ద టేలర్ ఇచ్చిన క్యాచ్‌లను చహల్, కార్తీక్ వదిలేయగా... 55 పరుగుల వద్ద సునాయాస రనౌట్ అవకాశాన్ని పాండ్యా చేజార్చాడు. ముగ్గురు ప్రధాన పేసర్లతో పాటు పాండ్యాతో నాలుగే ఓవర్ల చొప్పున బౌలింగ్ చేయించి భారత్ సాధ్యమైనంత శ్రమ తగ్గించే ప్రయత్నం చేసింది. భారత్ తదుపరి ప్రాక్టీస్ మ్యాచ్‌లో మంగళవారం బంగ్లాదేశ్‌తో ఆడుతుంది. -
శుభ సన్నాహం...
సిడ్నీ: ఆస్ట్రేలియా గడ్డపై భారత బ్యాట్స్‌మెన్‌కు మంచి మ్యాచ్ ప్రాక్టీస్ లభించింది. క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) ఎలెవన్‌తో జరుగుతోన్న నాలుగు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్‌లో ఐదుగురు బ్యాట్స్‌మెన్ అర్ధ శతకాలతో మెరిశారు. ఫలితంగా భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 92 ఓవర్లలో 358 పరుగులకు ఆలౌటైంది. వర్షం కారణంగా తొలి రోజు ఆట పూర్తిగా తుడిచిపెట్టుకుపోగా... గురువారం రెండో రోజు టాస్ ఓడిన భారత్ తొలుత బ్యాటింగ్‌కు దిగింది. ఓపెనర్ లోకేశ్ రాహుల్ (3) మరోసారి నిరాశపరిచాడు. దీంతో టీమిండియా 16 పరుగులకే తొలి వికెట్ కోల్పోయింది. ఈ దశలో చతేశ్వర్ పుజారా (54; 6 ఫోర్లు)తో కలిసి యువ ఓపెనర్ పృథ్వీ షా (69 బంతుల్లో 66; 11 ఫోర్లు) చెలరేగాడు. పుజారాతో కలిసి రెండో వికెట్‌కు 80 పరుగులు జోడించాక ఔటయ్యాడు. అనంతరం ఇన్నింగ్స్ నడిపించే బాధ్యత కెప్టెన్ కోహ్లి (87 బంతుల్లో 64; 7 ఫోర్లు, సిక్స్) తీసుకున్నాడు. అతను పుజారాతో కలిసి మూడో వికెట్‌కు 73 పరుగులు జతచేశాడు. ఆంధ్ర ఆటగాడు హనుమ విహారి (88 బంతుల్లో 53; 5 ఫోర్లు), రహానే (123 బంతుల్లో 56 రిటైర్డ్ ఔట్; 1 ఫోర్) కూడా అర్ధ శతకాలు చేయడంతో భారత్ 347/5తో పటిష్ట స్థితిలో నిలిచింది. ఆ తర్వాత రోహిత్ శర్మ (40; 5 ఫోర్లు, సిక్స్), అశ్విన్ (0), షమీ (0), ఉమేశ్ (0) వెంటవెంటనే ఔటవడంతో... 11 పరుగుల వ్యవధిలో చివరి ఐదు వికెట్లు కోల్పోయింది. పంత్ (11 నాటౌట్) అజేయం గా నిలిచాడు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన సీఏ ఎలెవన్ ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 24 పరుగులు చేసింది. -
‘విన్’డీస్ సాధ్యమేనా?
ఇంగ్లండ్‌లో పరాభవాన్ని మర్చిపోకముందే... ఆసియా కప్ విజయాన్ని ఆస్వాదిస్తుండగానే.. టీమిండియా మరో సిరీస్‌కు సిద్ధమవుతోంది... ప్రత్యర్థి... పెద్దగా ప్రమాదకరం కాని వెస్టిండీస్! చడీచప్పుడు లేకుండానే అడుగుపెట్టేసిందా జట్టు! బోర్డు ప్రెసిడెంట్స్‌తో ప్రాక్టీస్ మ్యాచూ ఆడేసింది...! మరి టెస్టు సమరంలో కోహ్లి సేన ముందు నిలుస్తుందా? అసలు ఎంతవరకు పోటీనిస్తుందో? సాక్షి క్రీడా విభాగం మూడు దశాబ్దాల క్రితం అరివీర వెస్టిండీస్ విదేశీ పర్యటనకు వెళ్లిందంటే టెస్టు సిరీస్ విజయంతోనే తిరుగు పయనమయ్యేది. రెండు దశాబ్దాల క్రితం భీకర పేస్‌తో, బ్రియాన్ లారా బ్యాటింగ్ మెరుపులతో ఆ జట్టు గెలుపు అవకాశాలు సగంసగం అయినా ఉండేవి. ఈ దశాబ్దంలో మాత్రం అటు బ్యాటింగ్‌లో మొనగాళ్లు లేక, ఇటు పసలేని పేస్‌తో ఓడకుండా కనీసం ‘డ్రా’ చేసుకుంటే అదే పదివేలు అనే పరిస్థితి. జట్టులో ఎవరుంటారో తెలియని అనిశ్చితి, బోర్డుతో ఎప్పుడు ఏ గొడవ తలెత్తుతుందో ఊహించలేని వైచిత్రి మధ్య కరీబియన్ క్రికెట్ నామమాత్రంగా మారుతోంది. అయితే, నాణ్యమైన ఆటగాళ్ల కారణంగా పరిమిత ఓవర్ల మ్యాచ్‌ల్లో అంతోఇంతో పోటీ ఇస్తోంది. కానీ, సంప్రదాయ టెస్టుల్లో ఐదు రోజులూ నిలిచేంత సామర్థ్యం ప్రస్తుత జట్టుకు లేదనేది నిస్సందేహం. ఈ నేపథ్యంలో సొంతగడ్డపై విరుచుకుపడే టీమిండియాను నిలువరించడం జాసన్ హోల్డర్ నేతృత్వంలోని వెస్టిండీస్‌కు కఠిన పరీక్షే. నడిపిస్తున్నది ఆ నలుగురే... జట్టుగా 11 మంది ఉన్నా వెస్టిండీస్ ఎక్కువగా ఆధారపడుతున్నది క్రెయిగ్ బ్రాత్‌వైట్, కీరన్ పావెల్, జాసన్ హోల్డర్, రోస్టన్ ఛేజ్లపైనే. ఎక్కువ శాతం వీరి రాణింపుతోనే టెస్టుల్లో ఆ మాత్రమైనా నిలుస్తోంది. కొంతలో కొంత షై హోప్, వికెట్ కీపర్ షేన్ డౌరిచ్ ఆదుకుంటున్నారు. మిగతావారంతా దాదాపు కొత్తవారే. పేస్ విభాగంలో అయితే కీమర్ రోచ్ మినహా చెప్పుకోదగ్గ ఆటగాడే లేడు. మరోవైపు జట్టులో కెప్టెన్ హోల్డర్ సహా ఏ ఒక్కరికీ 50 టెస్టులు ఆడిన అనుభవం కూడా లేకపోవడం గమనార్హం. ఓపెనర్ బ్రాత్‌వైట్ అత్యధికంగా 49 టెస్టులు ఆడగా, 48 టెస్టుల్లో ప్రాతినిధ్యంతో రోచ్ తర్వాతి స్థానంలో ఉన్నాడు. రెండు మూడేళ్లుగా సారథిగా వ్యవహరిస్తున్న హోల్డర్ ఆడింది 34 టెస్టులే కావడం జట్టు పరిస్థితి ఏమిటనేది చెబుతోంది. బ్రాత్‌వైట్, హోప్, ఛేజ్‌లను మినహాయిస్తే బ్యాటింగ్‌లో నికరంగా నిలిచే ఆటగాడు మరొకరు లేరు. ఓ దశలో ఆటగాడిగానూ తుది జట్టులో చోటుకు హోల్డర్ అనర్హుడన్న వ్యాఖ్యలు వచ్చాయి. కానీ, బోర్డుతో వివాదాల కారణంగా కీలకమైన వారంతా దూరం కావడంతో ఏకంగా అతడు కెప్టెన్ అయ్యాడు. అయితే, ఇటీవల లోయర్ ఆర్డర్ బ్యాటింగ్‌తో పాటు మీడియం పేస్‌తో వికెట్లు పడగొడుతూ హోల్డర్ ఉనికిని చాటుకుంటున్నాడు. విమర్శలకు జవాబిస్తున్నాడు. కెప్టెన్‌గా మాత్రం అతడి వనరులు పరిమితం. స్పిన్‌కు సహకరించే భారత్ పిచ్‌లపై దేవేంద్ర బిషూ వంటి ద్వితీయ శ్రేణి, ఛేజ్ వంటి పార్ట్‌టైమ్ స్పిన్నర్లను నమ్ముకోవాల్సి రావడమే ఇందుకు ఉదాహరణ. పేస్ విభాగంలోనూ రోచ్ ఒక్కడే ఆధారపడదగినవాడు. షానన్ గాబ్రియేల్ కొంత అనుభవం ఉన్నా అతడి నుంచి మెరుపు ప్రదర్శనలు ఎక్కువగా ఆశించలేం. ఏమేరకు రాణిస్తుందో? 2000 సంవత్సరం నుంచి వెస్టిండీస్ టెస్టు రికార్డు దారుణంగా ఉంది. ఈ పద్దెనిమిదేళ్లలో భారత్‌తో ఇంటా బయటా ఏడు సిరీస్‌ల్లో తలపడింది. 2001–02లో మాత్రమే అదీ సొంతగడ్డపై 2–1తో నెగ్గింది. తర్వాతి ఆరు సిరీస్‌లను ఒక్క విజయం లేకుండానే కోల్పోయింది. చివరిసారిగా రెండేళ్ల క్రితం తమ దగ్గరే జరిగిన నాలుగు టెస్టుల సిరీస్‌లో 0–2తో ఓడింది. ఇందులో ఒకటి ఇన్నింగ్స్ ఓటమి కాగా మరోదాంట్లో ఏకంగా 237 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. ఒక్క టెస్టును మాత్రమే డ్రా చేసుకుంది. ఈసారి కూడా గొప్పగా రాణించే అవకాశాలు కనిపించడం లేదు. దీనిప్రకారం చూస్తే భారత్‌పై టెస్టు విజయానికి 17 ఏళ్లుగా సాగుతున్న వారి నిరీక్షణ మరికొంత కాలం కొనసాగడం ఖాయం. కొసమెరుపు: రెండు టెస్టులు, ఐదు వన్డేలు, మూడు టి20ల పూర్తి స్థాయి సిరీస్‌కు ఎంతోముందుగానే భారత్ వచ్చేందుకు విండీస్ సిద్ధమైంది. ఈ మేరకు సెప్టెంబరు 10నే భారత్ చేరుకోవాల్సి ఉంది. ఏ కారణంగానో అది రెండు వారాలపైగా ఆలస్యమైంది. గత బుధవారం జట్టు ఇక్కడకు వచ్చింది. అంతేకాక, సిరీస్ సన్నాహకంగా తాము దుబాయ్‌లోని ఐసీసీ గ్లోబల్ అకాడమీలో ప్రాక్టీస్ చేసుకుంటామని, సహకరించాలని బీసీసీఐని కోరింది. కానీ, మన బోర్డు వారి వినతిని అసలు పట్టించుకున్నట్లు లేదు. దేశవాళీ సీజన్‌తో బిజీగా ఉన్నామని, మీకు వసతులు కల్పించలేమంటూ నిర్మొహమాటంగా చెప్పేసింది. దీంతో విండీస్ చేసేదేమీ లేకపోయింది. బోర్డు ఎలెవెన్‌తో రెండు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్‌తోనే సరిపెట్టుకుంది. ఇందులో వారి ప్రధాన బ్యాట్స్‌మెన్ రాణించడం, కొత్త కుర్రాడు సునీల్ ఆంబ్రిస్ శతకం చేయడం కొంత ఊరట. -
దక్షిణాఫ్రికాలో భారత ప్రాక్టీస్ మ్యాచ్ రద్దు
న్యూఢిల్లీ: భారత జట్టు దక్షిణాఫ్రికా పర్యటనలోని ఏకైక సన్నాహక మ్యాచ్ రద్దయింది. పార్ల్‌లోని బొలాండ్ పార్క్‌లో నిర్వహించాల్సిన ఈ మ్యాచ్ రద్దుకు అధికారిక కారణాలేమీ వెల్లడి కాలేదు. ఈ నేపథ్యంలో రెండు రోజులను పూర్తిగా భారత జట్టు సాధనకు కేటాయించారు. దక్షిణాఫ్రికాలోని పేస్ పిచ్‌లను దృష్టిలో పెట్టుకొని... నెట్స్‌లో ఆటగాళ్లకు సాయపడేందుకు హైదరాబాద్ పేసర్ మొహమ్మద్ సిరాజ్‌తో పాటు, అవేశ్ ఖాన్ (మధ్యప్రదేశ్), నవదీప్ సైనీ (ఢిల్లీ), బాసిల్ థంపి (కేరళ)లు దక్షిణాఫ్రికా వెళ్లనున్నట్లు బీసీసీఐ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. తొలి టెస్టు జనవరి 5న కేప్‌టౌన్‌లో ప్రారంభం కానుంది. మరోవైపు వన్డే మ్యాచ్‌ల వేళలను అరగంట ముందుకు జరిపేందుకు నిర్ణయించారు. -
లంక ప్రాక్టీస్ అదిరింది
కోల్‌కతా: భారత పర్యటనను శ్రీలంక పరుగుల ప్రవాహంతో ప్రారంభించింది. బోర్డు బౌలర్లతో లంక బ్యాట్స్‌మెన్ ఓ ఆట ఆడుకున్నారు. దీంతో తొలిరోజే భారీ స్కోరు సాధ్యమైంది. బోర్డు ప్రెసిడెంట్స్ ఎలెవన్‌తో శనివారం మొదలైన రెండు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్‌లో తొలిరోజు ఆట ముగిసే సమయానికి శ్రీలంక 88 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 411 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. నలుగురు బ్యాట్స్‌మెన్ అర్ధసెంచరీలు చేశారు. అంతగా అనుభవంలేని దేశవాళీ బౌలర్లపై ఓపెనర్లు సమరవిక్రమ (77 బంతుల్లో 74; 13 ఫోర్లు), కరుణరత్నే (62 బంతుల్లో 50; 7 ఫోర్లు) సహా... మాథ్యూస్ (93 బంతుల్లో 54; 6 ఫోర్లు), డిక్వెలా (59 బంతుల్లో 73 నాటౌట్; 13 ఫోర్లు) అర్ధ శతకాలు సాధించారు. ప్రస్తుతం జరుగుతున్న రంజీ సీజన్లో ఐదో రౌండ్ మ్యాచ్‌ల్లేని ఆయా రాష్ట్ర జట్ల ఆటగాళ్లు ఇందులో బరిలోకి దిగారు. కేరళ పేసర్ సందీప్ వారియర్, హైదరాబాద్ స్పిన్నర్ ఆకాశ్ భండారీ చెరో 2 వికెట్లు పడగొట్టగా... అవేశ్ ఖాన్, జలజ్ సక్సేనా ఒక్కో వికెట్ తీశారు. ఓపెనర్ల శుభారంభం టాస్ నెగ్గిన బోర్డు ప్రెసిడెంట్స్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకోగా... ముందుగా లంక బ్యాటింగ్‌కు దిగింది. ఓపెనర్లు సమరవిక్రమ, కరుణరత్నే పర్యాటక జట్టుకు శుభారంభాన్నిచ్చారు. నంబర్‌వన్ జట్టుతో సమరానికి ముందు కావాల్సిన ప్రాక్టీస్ చేశారు. బోర్డు పేసర్లు, స్పిన్నర్లు ఎవరూ ఓపెనింగ్ జోడీపై ప్రభావాన్ని చూపలేకపోయారు. జట్టు స్కోరు 134 పరుగుల వద్ద అర్ధసెంచరీ పూర్తయిన వెంటనే కరుణరత్నే రిటైర్డ్ అవుట్‌గా నిష్క్రమించగా, మరుసటి ఓవర్లోనే సమరవిక్రమ... అవేశ్ ఖాన్ బౌలింగ్‌లో తన్మయ్ అగర్వాల్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. వన్‌డౌన్‌లో వచ్చిన తిరిమన్నే (17) ఎక్కువసేపు క్రీజులో నిలువలేకపోయాడు. అతను భండారీ బౌలింగ్‌లో జీవన్జ్యోత్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ బాట పట్టాడు. రాణించిన మాథ్యూస్ మాజీ కెప్టెన్ ఎంజెలో మాథ్యూస్ తన పునరాగమనానికి అర్ధసెంచరీతో స్వాగతం పలికాడు. తొడ కండరాల గాయంతో కొన్నాళ్లుగా జట్టుకు దూరమైన మాథ్యూస్ ఈ మ్యాచ్‌లో సాధికారికంగా ఆడాడు. కెప్టెన్ చండిమాల్‌తో కలిసి జట్టు స్కోరును 200 పరుగులు దాటించాడు. అప్పటికే 50 ఓవర్లు పూర్తవడంతో మిగతా బ్యాట్స్‌మెన్‌కు ప్రాక్టీస్ కల్పించాలనే ఉద్దేశంతో చండిమాల్ (29), అర్ధసెంచరీ తర్వాత మాథ్యూస్ రిటైర్ట్ అవుట్‌గా పెవిలియన్ చేరారు. ఈ దశలో కీపర్ నిరోషన్ డిక్వెలా, దిల్రువాన్ పెరీరా (44 బంతుల్లో 48; 6 ఫోర్లు, 2 సిక్సర్లు)తో కలిసి ధాటిగా ఆడాడు. దీంతో పరుగుల వేగం పుంజుకుంది. 66వ ఓవర్లోనే శ్రీలంక స్కోరు 300 పరుగులకు చేరింది. టెయిలెండర్లలో రోషన్ సిల్వా (53 బంతుల్లో 36; 5 ఫోర్లు) కుదురుగా ఆడగా... హెరాత్‌ను భండారీ ఎల్బీగా పెవిలియన్‌కు పంపాడు. జట్టు స్కోరు 400 పరుగులు దాటాక లంక కెప్టెన్ ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేశాడు. ఈ మ్యాచ్‌లో హైదరాబాదీ ఆటగాళ్లు రవికిరణ్, ఆకాశ్ భండారీ, తన్మయ్ అగర్వాల్‌లకు తుది జట్టులో అవకాశం దక్కింది. స్కోరు వివరాలు శ్రీలంక తొలి ఇన్నింగ్స్: సమరవిక్రమ (సి) తన్మయ్ అగర్వాల్ (బి) అవేశ్ ఖాన్ 74; కరుణరత్నే రిటైర్ట్‌హర్ట్ 50; తిరిమన్నే (సి) జీవన్‌జ్యోత్ (బి) ఆకాశ్ భండారీ 17; మాథ్యూస్ రిటైర్ట్‌హర్ట్ 54; చండిమాల్ రిటైర్ట్‌హర్ట్ 29; డిక్వెలా నాటౌట్ 73; షణక (సి) జీవన్‌జ్యోత్ (బి) సక్సేనా 2; పెరీరా (సి) అభిషేక్ (బి) సందీప్ 48; డిసిల్వా (సి) సబ్–అన్మోల్ప్రీత్ సింగ్ (బి) సందీప్ 10; రోషన్ సిల్వా నాటౌట్ 36; హెరాత్ (బి) ఆకాశ్ భండారీ 3; ఎక్స్‌ట్రాలు 15; మొత్తం (88 ఓవర్లలో 6 వికెట్లకు డిక్లేర్డ్) 411 వికెట్ల పతనం: 1–134, 2–168, 3–261, 4–342, 5–355, 6–375. బౌలింగ్: సందీప్ వారియర్ 15–3–60–2, రవికిరణ్ 12–0–60–0, అవేశ్‌ఖాన్ 16–0–68–1, జలజ్ సక్సేనా 22–0–100–1, ఆకాశ్ భండారీ 23–1–111–2. -
సన్నాహకానికి శ్రీలంక సిద్ధం
కోల్‌కతా: ఫామ్, ఫిట్నెస్ నిరూపించుకునేందుకు ప్రయత్నిస్తున్న ప్రధాన జట్టు సభ్యులు ఎవరూ లేరు... ఇటీవల విశేషంగా రాణిస్తున్న యువ ఆటగాళ్లతో కూడిన ‘ఎ’ టీమ్ కూడా కాదు... దేశవాళీలో అంతంత మాత్రమే గుర్తింపు ఉన్న తృతీయ శ్రేణి ఆటగాళ్లతో తయారు చేసిన జట్టు సిద్ధం! భారత గడ్డపై మెరుగైన ప్రదర్శన చేయాలని పట్టుదలగా ఉన్న శ్రీలంకకు రెండు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్‌లో ఇలాంటి బలహీనమైన బోర్డు ప్రెసిడెంట్స్ ఎలెవన్ జట్టు ఎదురవుతోంది. ఇక్కడి జాదవ్‌పూర్ యూనివర్సిటీ క్యాంపస్ గ్రౌండ్లో ఇరు జట్ల మధ్య రెండు రోజులపాటు ప్రాక్టీస్ మ్యాచ్ జరగనుంది. ఇక్కడి వాతావరణానికి అలవాటు పడేందుకు, తొలి టెస్టుకు ముందు తగిన రీతిలో సాధన చేసేందుకు లంక ఈ మ్యాచ్‌ను ఉపయోగించుకోవాలని భావిస్తుండగా... మెరుగైన ఆటతీరు కనబర్చి అందరి దృష్టిని ఆకర్షించేందుకు బోర్డు ప్రెసిడెంట్స్ ఎలెవన్ ఆటగాళ్లకు ఇది మంచి అవకాశం. రంజీ ట్రోఫీ కొనసాగుతున్న నేపథ్యంలో ఐదో రౌండ్ మ్యాచ్‌లలో బరిలోకి దిగని నాలుగు జట్లు హైదరాబాద్, కేరళ, మధ్యప్రదేశ్, పంజాబ్‌కు చెందిన ఆటగాళ్లతోనే బోర్డు జట్టును బీసీసీఐ ఎంపిక చేసింది. కేరళ ఆటగాడు సంజు శామ్సన్ ఈ టీమ్‌కు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. గాయం కారణంగా పాకిస్తాన్‌తో సిరీస్‌కు దూరంగా ఉండి పునరాగమనం చేస్తున్న శ్రీలంక మాజీ కెప్టెన్ ఏంజెలో మాథ్యూస్ ఫిట్నెస్ నిరూపించుకునేందుకు ఈ మ్యాచ్‌లో ఆడనున్నాడు. సీనియర్ స్పిన్నర్ హెరాత్ విశ్రాంతి తీసుకునే అవకాశం ఉండగా, భారత గడ్డపై తొలిసారి టెస్టు ఆడనున్న కెప్టెన్ చండిమాల్ ప్రాక్టీస్‌పై సీరియస్‌గా దృష్టి పెట్టాడు. మరోవైపు నలుగురు హైదరాబాద్ ఆటగాళ్లు సందీప్, తన్మయ్ అగర్వాల్, ఆకాశ్ భండారి, రవికిరణ్ తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. జట్ల వివరాలు శ్రీలంక: చండిమాల్ (కెప్టెన్), కరుణరత్నే, సమరవిక్రమ, తిరిమన్నె, డిక్వెలా, దిల్రువాన్ పెరీరా, హెరాత్, లక్మల్, గమగే, ధనంజయ డి సిల్వ, మాథ్యూస్, సందకన్, విశ్వ ఫెర్నాండో, షనక, రోషన్ సిల్వ. బోర్డు ప్రెసిడెంట్స్ ఎలెవన్: సంజు శామ్సన్ (కెప్టెన్), అభిషేక్ గుప్తా, ఆకాశ్ భండారి, అవేష్ ఖాన్, జలజ్ సక్సేనా, జీవన్‌జ్యోత్ సింగ్, రవికిరణ్, రోహన్ ప్రేమ్, బావనక సందీప్, తన్మయ్ అగర్వాల్, సందీప్ వారియర్, అన్మోల్ప్రీత్ సింగ్. హార్దిక్ పాండ్యాకు విశ్రాంతి ముంబై: శ్రీలంకతో టెస్టు సిరీస్ ప్రారంభానికి ముందు భారత సెలక్షన్ కమిటీ అనూహ్య నిర్ణయం తీసుకుంది. తొలి రెండు టెస్టుల కోసం జట్టులోకి ఎంపికైన ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాను ఇప్పుడు సిరీస్ నుంచి పక్కన పెడుతున్నట్లుగా ప్రకటించింది. అతనికి తగినంత విశ్రాంతి ఇచ్చేందుకు టీమ్ మేనేజ్మెంట్తో చర్చించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. ‘ఇటీవల పాండ్యాపై ‘పనిభారం’ చాలా ఎక్కువైంది. దీని వల్ల మున్ముందు అతను తీవ్ర గాయాలపాలు కాకుండా ముందు జాగ్రత్తగానే విశ్రాంతినిస్తున్నాం. కొన్నాళ్ల పాటు జాతీయ క్రికెట్ అకాడమీలో పాండ్యా స్ట్రెంత్ అండ్ కండిషనింగ్ క్యాంప్‌లో కొనసాగుతాడు’ అని బీసీసీఐ పేర్కొంది. జూన్‌లో జరిగిన చాంపియన్స్ ట్రోఫీ నుంచి మూడు ఫార్మాట్లలో కలిపి భారత్ 33 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడితే వాటిలో పాండ్యా 30 ఆడాడు. కెప్టెన్ కోహ్లి తర్వాత ఎక్కువ మ్యాచ్‌లలో బరిలోకి దిగింది అతనే. శ్రీలంక గడ్డపై జరిగిన టెస్టు సిరీస్‌లో మెరుగ్గా రాణించిన తర్వాత అతను భారత జట్టులో రెగ్యులర్ సభ్యుడిగా మారాడు. అయితే లంకతో టెస్టు సిరీస్‌లో ముగ్గురు రెగ్యులర్ స్పిన్నర్లతో భారత్ ఆడే అవకాశం ఉండటంతో ఆల్‌రౌండర్ అవసరం పెద్దగా ఉండకపోవచ్చు. అది కూడా పాండ్యాను తప్పించేందుకు ఒక కారణం అని వినిపిస్తోంది. పాండ్యా స్థానంలో సెలక్షన్ కమిటీ వేరే ఎవరినీ ఎంపిక చేయలేదు. శ్రీలంక దృష్టిలో ఇది ప్రాక్టీస్ మ్యాచ్ కావచ్చు. కానీ మాకు మాత్రం కాదు. రంజీ విరామం సమయంలో ఇది మాకు లభించిన చక్కటి అవకాశం. ఈ మ్యాచ్‌లో లంకను ఓడించేందుకు ప్రయత్నిస్తాం. మా జట్టు సభ్యులందరూ దేశవాళీలో బాగా ఆడుతూ వచ్చిన వారే. ఇక్కడ కూడా వారంతా సత్తా చాటాలని కోరుకుంటున్నా. లంక జట్టులో అనుభవజ్ఞులు చాలా మంది ఉన్నారు. అయితే మేం కూడా మంచి ప్రదర్శన ఇచ్చేందుకు సిద్ధం. – సంజు శామ్సన్, బోర్డు ప్రెసిడెంట్స్ ఎలెవన్ కెప్టెన్ -
ఛోటా బాద్'షా'
సరిగ్గా నాలుగేళ్ల క్రితం... 14 సంవత్సరాల పృథ్వీ షా అత్యద్భుత ప్రదర్శనతో క్రికెట్ ప్రపంచం దృష్టిని ఆకర్షించాడు. ముంబైలో హారిస్ షీల్డ్ టోర్నీలో భాగంగా రిజ్వీ స్కూల్ తరఫున బరిలోకి దిగిన పృథ్వీ ఏకంగా 546 పరుగులు బాది మైనర్ క్రికెట్లో అత్యధికపరుగులు చేసిన భారత ఆటగాడిగా నిలిచాడు. ఇందులో 85 ఫోర్లు, 5 సిక్సర్లు ఉన్నాయి. అయితే చిన్నతనంలో సంచలనాలు నమోదు చేసి ఆ తర్వాత కనుమరుగైపోయిన అనేక మంది ఆటగాళ్ల జాబితాలో మాత్రం అతను చేరలేదు. అప్పటి నుంచి మొదలు పెట్టి నేటి వరకు ఎక్కడ అడుగు పెడితే అక్కడ పరుగుల వరద పారించాడు. స్కూల్ క్రికెట్లో మాత్రమే కాదు సీనియర్ క్రికెట్లోనూ తన బ్యాటింగ్ పదునేమిటో అతను చూపించాడు. ఆడిన ఐదు ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లలోనే నాలుగు సెంచరీలు బాది భవిష్యత్ తారగా, మరో సచిన్‌గా పృథ్వీ షా ప్రశంసలు అందుకుంటున్నాడు. ఈ నెల 8తో 18 ఏళ్లు పూర్తి చేసుకోబోతున్న పృథ్వీ నిజంగానే ఆ స్థాయికి చేరుకోవాలని అంతా కోరుకుంటున్నారు. సాక్షి క్రీడా విభాగం: వరుసగా భారీ స్కోర్లు సాధించడం పృథ్వీ షాకు కొత్త కాదు. తనకు గుర్తింపు తెచ్చిన 546 ఇన్నింగ్స్‌కు రెండేళ్ల ముందునుంచే షా గురించి ముంబై క్రికెట్ వర్గాల్లో మంచి అభిప్రాయం ఉంది. స్కూల్ క్రికెట్లో వరుసగా జరిగిన ఆరు టోర్నీలలో 13 సెంచరీలు, 5 అర్ధసెంచరీలతో 2000కు పైగా పరుగులు నమోదు చేయడమే దానికి కారణం. ఇందులో గైల్స్ షీల్డ్ టోర్నీలో చేసిన ఐదు వరుస శతకాలు కూడా ఉన్నాయి. ఆ సమయంలో స్వయంగా సచిన్ టెండూల్కర్ కూడా ప్రత్యేకంగా పృథ్వీ ప్రాక్టీస్ సెషన్‌కు హాజరై అభినందనలతో ముంచెత్తాడు. ‘ఆ సమయంలో నా ఎత్తుకు తగినట్లుగా ప్రత్యేకంగా తయారు చేయించిన ఎస్జీ ప్రొఫెషనల్ బ్యాట్‌ను సచిన్ నాకు బహుమతిగా ఇవ్వడం ఎప్పటికీ మరచిపోలేను. అది నాకు మరింత స్ఫూర్తినిచ్చింది’ అని పృథ్వీ గుర్తు చేసుకుంటాడు. ప్రఖ్యాత ‘కంగా’ లీగ్ ‘ఎ’ డివిజన్ పోటీల్లో కూడా అతి పిన్న వయసులో సెంచరీ సాధించిన ఆటగాడిగా గుర్తింపు పొందిన షా, ఆపై వెనుదిరిగి చూడలేదు. ఆ తర్వాత తన సీనియర్లు సర్ఫరాజ్ ఖాన్, అర్మాన్ జాఫర్ సభ్యులుగా ఉన్న ముంబై అండర్–16కు షా కెప్టెన్‌గా ఎంపిక కావడం, మరింత వేగంగా దూసుకుపోవడం చకచకా జరిగిపోయాయి. సీనియర్ స్థాయిలో చెలరేగుతూ... చిన్న వయసే అయినా పృథ్వీ షాను ఇక ఆపడం సాధ్యం కాలేదు. ఇక ఒక్కో ఘనత అతని ఖాతాలో చేరుతూ పోయింది. ఈ ఏడాది జనవరిలో రంజీ ట్రోఫీ సెమీస్ మ్యాచ్‌తో ముంబై తరఫున అతని ఫస్ట్ క్లాస్ అరంగేట్రం జరిగింది. తమిళనాడుతో జరిగిన ఈ మ్యాచ్‌లో రెండో ఇన్నింగ్స్ సెంచరీతో జట్టును గెలిపించి షా మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలవడం విశేషం. 1993 తర్వాత ముంబై క్రికెటర్ ఒకరు తొలి రంజీ మ్యాచ్‌లోనే సెంచరీ చేయడం ఇదే తొలిసారి. అదే జోరును తాజా సీజన్లో కూడా కొనసాగిస్తూ షా, మూడు సెంచరీలు బాదాడు. దులీప్ ట్రోఫీ ఫైనల్లో సెంచరీ చేసిన అతని పిన్న వయస్కుడిగా కూడా నిలిచాడు. గత పది ఇన్నింగ్స్‌లలో పృథ్వీ వరుసగా 4, 120, 71, 44, 154, 31, 123, 5, 105, 46 స్కోరు చేశాడు. ఇటీవల బోర్డు ప్రెసిడెంట్స్ ఎలెవన్ తరఫున ట్రెంట్ బౌల్ట్ ఆశ్చర్యపోయేలా అతడిని ఎదుర్కొన్న తీరు షా అంతర్జాతీయ ఆటకు కూడా సిద్ధంగా ఉన్నాడని చెబుతోంది. తాజాగా ఒడిషాతో జరుగుతోన్న మ్యాచ్‌లో సీనియర్ రహానేతో కలిసి పృథ్వీ 136 పరుగుల భాగస్వామ్యం నమోదు చేస్తే అందులో షా 99 పరుగులు చేయగా, రహానే వాటా 34 పరుగులే! సొంతగడ్డపై శ్రీలంకతో టెస్టు సిరీస్‌లో అతడిని ఎంపిక చేయాలని ఇప్పుడు అన్ని వైపుల నుంచి డిమాండ్ వస్తుండటం విశేషం. అతని షాట్లలో, ఆటలో ఎంతో ఆత్మవిశ్వాసం కనిపిస్తోంది. ప్రస్తుతం తన వయసు వారిలో అతనే అత్యుత్తమం అనడంలో సందేహం లేదు. ముఖ్యంగా ఓపెనర్ కావాల్సిన అన్ని అర్హతలు అతనిలో ఉన్నాయి. వరుసగా భారీ స్కోర్లు చేయడం అతడిని మరింత నైపుణ్యం గల ఆటగాడిగా మారుస్తుంది. పృథ్వీకి తన ఆటపై చాలా నమ్మ కం ఉంది. ముంబై సెలక్టర్లు అతనిపై నమ్మకముంచారు. అవకాశం ఇస్తే అంతర్జాతీయ స్థాయిలోనూ బాగా ఆడగల సత్తా ఈ కుర్రాడిలో ఉంది. – ప్రవీణ్ ఆమ్రే, ముంబై మాజీ కెప్టెన్, కోచ్ తండ్రి ప్రోత్సాహంతో... ముంబైకి దాదాపు 70 కిలోమీటర్ల దూరంలో ఉండే శివారు ప్రాంతం విరార్ పృథ్వీ స్వస్థలం. తండ్రి పంకజ్ షా చిరు వ్యాపారి కాగా షా నాలుగేళ్ల వయసులోనే తల్లి చనిపోయింది. ఎనిమిదేళ్ల చిన్న వయసులోనే రోజూ గంటన్నరకు పైగా ప్రయాణం చేసి ముంబై నగరంలో బాంద్రా కుర్లా కాంప్లెక్స్‌లో పృథ్వీ సాధన చేసేవాడు. కొడుకును ఎలాగైనా క్రికెటర్‌ను చేయాలన్న తండ్రి పట్టుదల, అందుకు తగినట్లుగా ఎప్పుడూ శ్రమకు వెనుకాడని పృథ్వీ తత్వం కలగలిసి కఠోర కోచింగ్ కొనసాగింది. చివరకు ఇతని ప్రతిభను గుర్తించిన స్థానిక ఎమ్మెల్యే ఒకరు మైదానం దగ్గర్లో ఉండేందుకు ఒక ఫ్లాట్‌ను ఏర్పాటు చేశారు. ఆ తర్వాత రిజ్వీ స్ప్రింగ్ఫీల్డ్ తమ క్రికెట్ జట్టులో చేర్చుకొని ఉచిత విద్య అందించడంతో పాటు అదనంగా స్కాలర్షిప్ కూడా ఇవ్వడంతో పృథ్వీకి ఇతర విషయాల గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేకపోయింది. ఆ తర్వాత అవకాశం దొరికిన ప్రతీసారి అతను దానిని సమర్థంగా ఉపయోగించుకున్నాడు. ముంబై అండర్–19 తరఫున చెలరేగిన తర్వాత భారత అండర్–19 జట్టులోకి ఎంపికైన షా, ఇంగ్లండ్‌తో జరిగిన సిరీస్‌లో భారత టాప్‌స్కోరర్‌గా నిలిచాడు. -
తొలి వన్డే కోసం ప్రాక్టీస్ చేస్తున్న ప్లేయర్లు
-
వార్మప్‌లోనే వణికారు...
భారత్‌తో వన్డే సిరీస్ ఆరంభానికి ముందే న్యూజిలాండ్ జట్టుకు షాక్ తగిలింది. అంతగా అంతర్జాతీయ అనుభవం లేని బోర్డు ప్రెసిడెంట్స్ ఎలెవన్ బౌలర్ల ఉచ్చులో పడి కివీస్ బ్యాటింగ్ ఆర్డర్ కుప్పకూలింది. అటు పేస్.. ఇటు స్పిన్‌ను ఎదుర్కొనేందుకు తంటాలు పడడంతో మున్ముందు కోహ్లి సేనతో పోరు ఎలా ఉండబోతోందో తెలిసొచ్చింది. అంతకుముందు టీనేజి సెన్సేషన్ పృథ్వీ షా తన అద్భుత బ్యాటింగ్ నైపుణ్యాన్ని చాటుకోగా.. రాహుల్, కరుణ్ అర్ధ సెంచరీలతో చెలరేగి జట్టుకు భారీ స్కోరును అందించారు.. ముంబై: మూడు వన్డేల సిరీస్ కోసం జరిగిన తొలి ప్రాక్టీస్ మ్యాచ్‌లో న్యూజిలాండ్ జట్టు 30 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. మంగళవారం బ్రబౌర్న్ మైదానంలో జరిగిన ఈ మ్యాచ్‌లో బోర్డు ప్రెసిడెంట్స్ ఎలెవన్ జట్టు అన్ని విభాగాల్లో చెలరేగి కివీస్‌ను వణికించింది. టీమిండియా భవిష్యత్ తారగా చెప్పుకుంటున్న 17 ఏళ్ల పృథ్వీ షా (80 బంతుల్లో 66; 9 ఫోర్లు, 1 సిక్స్) అంతర్జాతీయ స్థాయి బౌలర్లను ఎదుర్కొని ఆడిన తీరు ఆకట్టుకుంది. అతడికి తోడు కేఎల్ రాహుల్ (75 బంతుల్లో 68; 9 ఫోర్లు, 1 సిక్స్), కరుణ్ నాయర్ (64 బంతుల్లో 78; 12 ఫోర్లు) అర్ధ సెంచరీలు చేయడంతో ముందుగా బ్యాటింగ్‌కు దిగిన బోర్డు ఎలెవన్ 50 ఓవర్లలో 9 వికెట్లకు 295 పరుగుల భారీ స్కోరు సాధించింది. బౌల్ట్‌కు ఐదు వికెట్లు దక్కాయి. రెండో ప్రాక్టీస్ మ్యాచ్ ఇదే మైదానంలో గురువారం జరుగుతుంది. సూపర్ పృథ్వీ... ఓపెనర్‌గా బరిలోకి దిగిన ‘లోకల్ బాయ్’ పృథ్వీ తొలిసారిగా ఓ సీనియర్ అంతర్జాతీయ జట్టును ఎదుర్కొన్నా ఎలాంటి తడబాటు లేకుండా ఆడాడు. ప్రారంభంలో రాహుల్ కాస్త వేగంగా ఆడినా ఆ తర్వాత షా దూకుడు కనిపించింది. పేసర్ ఆడమ్ మిల్నే బౌలింగ్‌లో కవర్ మీదుగా తను అద్భుత సిక్సర్ బాదాడు. అటు 41 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద రాహుల్ అవుటైనా అది నోబాల్‌గా తేలింది. వీరిద్దరూ 62 బంతుల్లోనే తమ అర్ధ సెంచరీలు పూర్తి చేశారు. తొలి వికెట్‌కు 147 పరుగుల భాగస్వామ్యం జత చేసిన అనంతరం ఈ జోడి వరుస ఓవర్లలో పెవిలియన్‌కు చేరింది. ఆ తర్వాత కరుణ్ నాయర్ తన లాఫ్టెడ్ డ్రైవ్‌లతో కివీస్ బౌలర్లపై దాదాపు చివరి వరకు ఆధిపత్యం ప్రదర్శించాడు. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన కివీస్ 47.4 ఓవర్లలో 265 పరుగులకు ఆలౌట్ అయ్యింది. లాథమ్ (63 బంతుల్లో 59; 7 ఫోర్లు) అర్ధ సెంచరీ చేయగా విలియమ్సన్ (49 బంతుల్లో 47; 7 ఫోర్లు) ఫర్వాలేదనిపించాడు. మూడు బంతుల వ్యవధిలో ఎడమచేతి స్పిన్నర్ షాబాజ్ నదీమ్ రెండు వికెట్లు తీయడంతో ఓ దశలో కివీస్ 204 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయింది. చివర్లో గ్రాండ్‌హోమ్ (22 బంతుల్లో 33; 3 ఫోర్లు, 1 సిక్స్) వేగంగా ఆడినా ఫలితం లేకపోయింది. లెఫ్టార్మ్ మీడియం పేసర్ జయదేవ్ ఉనాద్కట్, నదీమ్‌లకు మూడేసి వికెట్లు దక్కాయి. -
కివీస్ సన్నాహాలకు వేళాయె...
ముంబై: భారత్‌తో మూడు వన్డేల సిరీస్ కోసం న్యూజిలాండ్ జట్టు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో బోర్డు ప్రెసిడెంట్స్ ఎలెవన్‌తో నేడు తొలి వార్మప్ మ్యాచ్ ఆడనుంది. కేన్ విలియమ్సన్ నేతృత్వంలోని కివీస్ ఇక్కడి పిచ్ పరిస్థితులకు అలవాటు పడేందుకు ఈ మ్యాచ్‌ను చక్కగా వినియోగించుకోవాలని భావిస్తోంది. సీనియర్ ఆటగాళ్లు రాస్ టేలర్, మార్టిన్ గప్టిల్ కూడా సిరీస్‌కు ముందు బ్యాటింగ్ ప్రాక్టీస్ లభించాలని చూస్తున్నారు. మరోవైపు శ్రేయస్ అయ్యర్ నేతృత్వంలోని బోర్డు ఎలెవన్‌లో కరుణ్ నాయర్, రిషభ్ పంత్, పృథ్వీ షా తమ సత్తా చూపించి సెలక్టర్ల దృష్టిలో పడే ఆలోచనలో ఉన్నారు. బౌలింగ్ విభాగం కూడా కివీస్ బ్యాటింగ్ ఆర్డర్‌పై పైచేయి సాధించాలని చూస్తోంది. ఇటీవలి కాలంలో ప్రత్యర్థి జట్లను బెంబేలెత్తిస్తున్న భారత బౌలింగ్‌ను దీటుగా ఎదుర్కోవాలంటే తమ ఓపెనర్లు లాథమ్, గప్టిల్ శుభారంభం అందించాలనే అభిప్రాయంతో కివీస్ కోచ్ మైక్ హెన్సన్ ఉన్నారు. బ్యాటింగ్‌కు అనుకూలించే ఈ పిచ్‌పై వీరు పరుగుల వరద పారిస్తే జట్టుకు మంచిదే. అయితే సీనియర్ బౌలర్లు లేని బోర్డు జట్టులో కివీస్ బ్యాట్స్‌మెన్... అంతగా అనుభవం లేని బౌలర్లు ధావల్ కులకర్ణి, ఉనాద్కట్‌లను ఎదుర్కోవాల్సి ఉంది. భారత వన్డే జట్టు లో చోటు దక్కని∙లోకేశ్ రాహుల్‌ను ఈ రెండు ప్రాక్టీస్ మ్యాచ్‌ల కోసం సోమవారం ఎంపిక చేశారు. జట్లు: బోర్డు ప్రెసిడెంట్స్ ఎలెవన్: శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), పృథ్వీ షా, శివమ్ చౌదరి, కరుణ్ నాయర్, గుర్కీరత్ మన్, మిలింద్ కుమార్, రిషభ్ పంత్, షాబాజ్ నదీమ్, కరణ్ శర్మ, ధావల్ కులకర్ణి, ఉనాద్కట్, అవేశ్ ఖాన్. న్యూజిలాండ్: విలియమ్సన్ (కెప్టెన్), టాడ్ ఆస్టల్, బౌల్ట్, గ్రాండ్‌హోమ్, గప్టిల్, హెన్రీ, లాథమ్, నికోల్స్, మిల్నే, ఫిలిప్స్, సాన్‌ట్నర్, సౌతీ, టేలర్, మున్రో, వర్కర్. -
ఆసీస్ జట్టు సన్నాహాలు షురూ
చెన్నై: వరుస విజయాలతో ఫుల్ జోష్‌లో ఉన్న భారత క్రికెట్ జట్టును సొంతగడ్డపై ఎదుర్కొనేందుకు ఆస్ట్రేలియా జట్టు తమ సన్నాహాలను ప్రారంభించనుంది. ఇక్కడికి రాకముందు బంగ్లాదేశ్‌తో రెండు టెస్టులు ఆడి వచ్చిన ఆసీస్.. వన్డే ఫార్మాట్‌కు అలవాటు పడేందుకు నేడు బోర్డు ప్రెసిడెంట్స్ ఎలెవన్ జట్టుతో ప్రాక్టీస్ మ్యాచ్ ఆడనుంది. భారత్‌తో జరగబోయే ఐదు వన్డేల సిరీస్‌కు ముందు స్పిన్‌లో తగిన ప్రాక్టీస్‌కు ఈ మ్యాచ్‌ను ఉపయోగించుకోనుంది. స్మిత్, వార్నర్, మ్యాక్స్‌వెల్ ఆసీస్ జట్టులో కీలకం కానున్నారు. ఇక బోర్డు ఎలెవన్‌లో ఆసీస్‌ను ఎదుర్కొన్న అనుభవం ఒక్క కెప్టెన్ గుర్కీరత్ సింగ్ మాన్కు మాత్రమే ఉంది. చాలామంది ఆటగాళ్లు దులీప్ ట్రోఫీలో ఆడుతుండటంతో ఎక్కువగా తృతీయ కేటగిరీ క్రికెటర్లను ఎంపిక చేశారు. ఐపీఎల్లో మెరిసిన రాహుల్ త్రిపాఠి, నితిష్ రాణా, వాషింగ్టన్ సుందర్ పటిష్ట జట్టుపై తమ సత్తా చూపించేందుకు ఎదురుచూస్తున్నారు. -
మెహదీ హసన్ 8/98
విదర్భతో ప్రాక్టీస్ మ్యాచ్ డ్రా సాక్షి, హైదరాబాద్: విద ర్భ, హైదరాబాద్ జట్ల మధ్య మూడు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్ డ్రాగా ముగి సింది. రంజీ సీజన్ కు సన్నాహకంగా విదర్భతో జరిగిన ఈ మ్యాచ్‌లో హైదరాబాద్ స్పిన్నర్ మెహదీ హసన్ (8/98) తిప్పేశాడు. దీంతో 116/3 ఓవర్‌నైట్ స్కోరుతో మంగళవారం ఆటకొనసాగించిన విదర్భ 107.3 ఓవర్లలో 324 పరుగుల వద్ద ఆలౌటైంది. శ్రీవాస్తవ్ (79), రవి (64), సిద్ధేశ్ (59) అర్ధసెంచరీలతో రాణించారు. రెండో రోజు ఆటలో హైదరాబాద్ 380/9 స్కోరు వద్ద ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసిన సంగతి తెలిసిందే. -
బంగ్లాదేశ్ తడబాటు
ముగ్గురు ప్రధాన బ్యాట్స్‌మెన్ విఫలం తొలి ఇన్నింగ్స్‌లో 224/8 డిక్లేర్డ్ భారత్ ‘ఎ’తో ప్రాక్టీస్ మ్యాచ్ హైదరాబాద్: భారత్‌తో ఏకైక టెస్టు మ్యాచ్‌కు ముందు బంగ్లాదేశ్ జట్టు సన్నాహకం గొప్పగా సాగలేదు. భారత్ ‘ఎ’తో జింఖానా మైదానంలో ఆదివారం మొదలైన ప్రాక్టీస్ మ్యాచ్‌లో ఆ జట్టు ప్రధాన బ్యాట్స్‌మెన్ తడబడ్డారు. మ్యాచ్ తొలి రోజు తమ మొదటి ఇన్నింగ్స్‌లో బంగ్లాదేశ్ 8 వికెట్ల నష్టానికి 224 పరుగులు చేసి డిక్లేర్ చేసింది. కెప్టెన్ ముష్ఫికర్ రహీమ్ (106 బంతుల్లో 58; 8 ఫోర్లు, 1 సిక్స్), సౌమ్య సర్కార్ (73 బంతుల్లో 52; 9 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీలు సాధించారు. 67 ఓవర్లు మాత్రమే ఎదుర్కొన్న బంగ్లా, మొదటి రోజును పూర్తిగా బ్యాటింగ్ కోసం ఉపయోగించుకునేందుకు ఆసక్తి చూపించలేదు. అనంతరం బంగ్లాదేశ్ బౌలర్లను అలవోకగా ఎదుర్కొన్న భారత్ ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్‌లో 21 ఓవర్లలో ఒక వికెట్ నష్టపోయి 91 పరుగులు చేసింది. ప్రియాంక్ పాంచల్ (62 బంతుల్లో 40 బ్యాటింగ్; 6 ఫోర్లు), శ్రేయస్ అయ్యర్ (35 బంతుల్లో 29 బ్యాటింగ్; 4 ఫోర్లు, 1 సిక్స్) క్రీజ్‌లో ఉన్నారు. ప్రస్తుతం భారత్ ‘ఎ’ మరో 133 పరుగులు వెనుకబడి ఉంది. మొత్తంగా బంగ్లా ఆశించిన విధంగా మ్యాచ్ ప్రాక్టీస్ మాత్రం ఆ జట్టుకు దక్కలేదు. ఏ దశలోనూ జట్టు జోరు కనబర్చలేదు. నంబర్‌వన్ ఆటగాడు షకీబ్ ఈ మ్యాచ్ ఆడకుండా విశ్రాంతి తీసుకున్నాడు. ఆకట్టుకున్న పేసర్లు... టాస్ గెలిచిన బంగ్లాదేశ్ బ్యాటింగ్ ఎంచుకుంది. చక్కటి బౌన్స్ ఉన్న పిచ్‌పై భారత్ ‘ఎ’ లెఫ్టార్మ్ పేస్ బౌలర్లు అనికేత్, సీవీ మిలింద్ మంచి ప్రభావం చూపించారు. వీరిని ఎదుర్కోవడంలో బంగ్లా ఓపెనర్లు ఇబ్బంది పడ్డారు. తన మూడో ఓవర్లో ఇమ్రుల్ కైస్ (4)ను అవుట్ చేసి హైదరాబాద్ బౌలర్ మిలింద్ భారత్‌కు శుభారంభం అందించాడు. ఆ తర్వాత అనికేత్ చక్కటి బంతికి తమీమ్ (13) బౌల్డయ్యాడు. మరో ప్రధాన బ్యాట్స్‌మన్ మోమినుల్ (5) కూడా విఫలం కావడంతో బంగ్లా ఇబ్బందుల్లో పడింది. మరో ఎండ్‌లో మాత్రం సౌమ్య సర్కార్ ధాటిగా ఆడాడు. కవర్స్, మిడాన్ దిశగా కొన్ని చూడచక్కటి బౌండరీలు కొట్టిన సర్కార్ 55 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. కొద్దిసేపటికే నదీమ్ బౌలింగ్‌లో అతను అవుట్ కాగా, మహ్ముదుల్లా (23) ఫర్వాలేదనిపించాడు. కివీస్‌తో జరిగిన గత టెస్టులో గాయపడి కోలుకున్న తర్వాత తొలిసారి మైదానంలోకి దిగిన కెప్టెన్ ముష్ఫికర్ కూడా నిలకడ ప్రదర్శించాడు. షబ్బీర్ (33)తో కలిసి అతను ఆరో వికెట్‌కు 71 పరుగులు జోడించాడు. జయంత్ బౌలిం గ్లో భారీ సిక్సర్ బాదిన ముష్ఫికర్ 91 బంతుల్లో హాఫ్ సెంచరీని చేరుకున్నాడు. ఇన్నింగ్స్ 61వ ఓవర్లోనే బంతి ఆకారం దెబ్బ తింది. దాంతో అంపైర్లు బంతిని మార్చారు. వెంటనే వరుస బంతుల్లో ముష్ఫి కర్, హసన్ (0)లను అనికేత్ అవుట్ చేశాడు. మరో 6 ఓవర్ల తర్వాత బంగ్లా ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. రాణించిన పాంచల్... ఇన్నింగ్స్ తొలి బంతికే అవుటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్న అభినవ్ ముకుంద్ (16) ఎక్కువ సేపు నిలవలేకపోయాడు. అయితే రంజీ ట్రోఫీ ఫామ్‌ను కొనసాగిస్తూ పాంచల్ చక్కటి షాట్లు ఆడాడు. మరో ఎండ్‌లో శ్రేయస్ అయ్యర్ కూడా ధాటిని ప్రదర్శించాడు. బంగ్లా బౌలింగ్‌లో కూడా పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. -
కెప్టెన్‌గా ధోనీ చివరి మ్యాచ్‌లో.. ప్చ్..!
ముంబై: మహేంద్రసింగ్ ధోనీ సారథిగా వ్యవహరించిన చివరి మ్యాచ్‌లో సీనియర్ జట్టు పోరాడి ఓడింది. ఇంగ్లండ్ ఎలెవన్‌తో జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన ధోనీసేన నిర్ణీత 50 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి.. 304 పరుగులు చేసింది. కెప్టెన్‌గా చివరి మ్యాచ్ ఆడిన ధోనీ మునుపటి ఆటతీరును గుర్తుకు తెస్తూ బ్యాట్‌తో రెచ్చిపోగా.. కొంతకాలంగా భారత జట్టులో పునరాగమనం కోసం ఎదురుచూస్తున్న అంబటి రాయుడు శతకం బాది సత్తా చాటుకున్నాడు. అలాగే మూడేళ్ల తర్వాత వన్డే జట్టులోకి వచ్చిన యువరాజ్ సింగ్ హాఫ్ సెంచరీతో రాణించాడు. దీంతో భారత్ ఏ జట్టు 304 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లండ్ ఎలెవన్‌కు విసిరింది. కెప్టెన్ జేజే రాయ్ నేతృత్వంలో బరిలోకి దిగిన ఇంగ్లండ్ ఎలెవన్ కూడా ధాటిగా ఆడింది. ఇంగ్లండ్ బ్యాట్స్ మన్లలో బిల్లింగ్ అద్భుతంగా రాణించి 93 పరుగులు చేయగా, జేజే రాయ్ 62 పరుగులు సాధించాడు. ఓపెనర్ హేల్స్ 40 పరుగులు, బట్లర్ 46 పరుగులు, డాసన్ 41 పరుగులతో రాణించారు. దీంతో ఇంగ్లండ్ 48.5 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 307 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. అంతకుముందు రాయుడు 97 బంతుల్లో11 ఫోర్లు, సిక్సర్ సాయంతో సెంచరీ నమోదు చేశాడు. ఆ తర్వాత రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగాడు. ఐదో నెంబర్లో బ్యాటింగ్‌కు దిగిన మహీ తనదైన శైలిలో ఆడి 40 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సర్లతో అజేయంగా 68 పరుగులు చేశాడు. శిఖర్ ధవన్ (63), యువరాజ్ (48 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 56) హాఫ్ సెంచరీలు చేశారు. రాయుడు నిలకడగా రాణించగా.. ధోనీ, యువీ దూకుడుగా ఆడి అభిమానుల్ని అలరించారు. బెస్ట్ మ్యాచ్ ఫినిషర్‌గా పేరున్న ధోనీ.. కెప్టెన్సీ నుంచి వైదొలిగిన తర్వాత సత్తాచాటాడు. ఇంగ్లండ్ బౌలర్లు జాక్ బాల్, డేవిడ్ విల్లీ రెండేసి వికెట్లు తీశారు. ఇంగ్లండ్‌తో టి-20, వన్డే సిరీస్‌లకు టీమిండియా కెప్టెన్‌గా విరాట్ కోహ్లీని నియమించిన సంగతి తెలిసిందే. కాగా ఈ మ్యాచ్‌కు మాత్రం ధోనీకి సారథ్య బాధ్యతలు అప్పగించారు. -
ఓపెనర్లను అవుట్ చేసిన కుల్దీప్
ముంబై: భారత్ ఏతో ప్రాక్టీస్ మ్యాచ్‌లో ఇంగ్లండ్ లెవెన్ ఓపెనర్లు జేసన్ రాయ్ (62), అలెక్స్ హేల్స్ (40) జట్టుకు శుభారంభం అందించారు. ముంబైలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో వీరిద్దరూ తొలి వికెట్‌కు 95 పరుగులు జోడించారు. ప్రమాదకరంగా మారిన ఈ జోడీని భారత బౌలర్ కుల్దీప్ యాదవ్ వరుస ఓవర్లలో అవుట్ చేశాడు. కుల్దీప్ బౌలింగ్‌లో హేల్స్, రాయ్ ఇద్దరూ క్యాచవుటయ్యారు. కాసేపటికే చహల్ బౌలింగ్‌లో ఇయాన్ మోర్గాన్ అవుటయ్యాడు. 305 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన ఇంగ్లండ్ టీమ్ 22 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 129 పరుగులు చేసింది. అంతకుముందు బ్యాటింగ్‌కు దిగిన భారత్ ఏ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 304 పరుగులు చేసింది. రాయుడు 97 బంతుల్లో11 ఫోర్లు, సిక్సర్ సాయంతో సెంచరీ నమోదు చేశాడు. ఆ తర్వాత రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగాడు. ఐదో నెంబర్లో బ్యాటింగ్‌కు దిగిన మహీ తనదైన శైలిలో ఆడి 40 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సర్లతో అజేయంగా 68 పరుగులు చేశాడు. శిఖర్ ధవన్ (63), యువరాజ్ (48 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 56) హాఫ్ సెంచరీలు చేశారు. -
మునుపటిలా రెచ్చిపోయిన ధోనీ
సెంచరీ చేసిన అంబటి రాయుడు యువీ, ధవన్ హాఫ్ సెంచరీలు ఇంగ్లండ్ లెవెన్‌తో భారత్ ఏ ప్రాక్టీస్ మ్యాచ్ ముంబై: ఇటీవల స్థాయికి తగ్గట్టుగా బ్యాటింగ్‌లో రాణించలేకపోతున్న టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఇరగదీశాడు. ఇంగ్లండ్ లెవెన్‌తో ప్రాక్టీస్ మ్యాచ్‌లో మునుపటి ధోనీని గుర్తుకు తెస్తూ బ్యాట్‌తో రెచ్చిపోగా.. కొంతకాలంగా భారత జట్టులో పునరాగమనం కోసం ఎదురుచూస్తున్న అంబటి రాయుడు శతకం బాది సత్తా చాటుకున్నాడు. అలాగే మూడేళ్ల తర్వాత వన్డే జట్టులోకి వచ్చిన యువరాజ్ సింగ్ హాఫ్ సెంచరీతో రాణించాడు. దీంతో భారత్ ఏ జట్టు భారీ స్కోరు సాధించింది. ముంబైలో మంగళవారం జరుగుతున్న ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత్ ఏ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 304 పరుగులు చేసింది. రాయుడు 97 బంతుల్లో11 ఫోర్లు, సిక్సర్ సాయంతో సెంచరీ నమోదు చేశాడు. ఆ తర్వాత రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగాడు. ఐదో నెంబర్లో బ్యాటింగ్‌కు దిగిన మహీ తనదైన శైలిలో ఆడి 40 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సర్లతో అజేయంగా 68 పరుగులు చేశాడు. శిఖర్ ధవన్ (63), యువరాజ్ (48 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 56) హాఫ్ సెంచరీలు చేశారు. రాయుడు నిలకడగా రాణించగా.. ధోనీ, యువీ దూకుడుగా ఆడి అభిమానుల్ని అలరించారు. బెస్ట్ మ్యాచ్ ఫినిషర్‌గా పేరున్న ధోనీ.. కెప్టెన్సీ నుంచి వైదొలిగిన తర్వాత సత్తాచాటాడు. ఇంగ్లండ్ బౌలర్లు జాక్ బాల్, డేవిడ్ విల్లీ రెండేసి వికెట్లు తీశారు. ఇంగ్లండ్‌తో టి-20, వన్డే సిరీస్‌లకు టీమిండియా కెప్టెన్‌గా విరాట్ కోహ్లీని నియమించిన సంగతి తెలిసిందే. కాగా ఈ మ్యాచ్‌కు మాత్రం ధోనీకి సారథ్య బాధ్యతలు అప్పగించారు. -
ధవన్, రాయుడు హాఫ్ సెంచరీలు
ముంబై:ఇంగ్లండ్‌తో జరుగుతున్న యాభై ఓవర్ల డే అండ్ నైట్ ప్రాక్టీస్ మ్యాచ్‌లో భారత-ఎ జట్టు ఆటగాళ్లు శిఖర్ ధవన్, అంబటి రాయుడులు హాఫ్ సెంచరీలు సాధించారు. ధవన్ 73 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్సర్ సాయంతో హాఫ్ సెంచరీ సాధించగా, రాయుడు 57 బంతుల్లో ఆరు ఫోర్ల సాయంతో అర్థ శతకం చేశాడు.ధోని సారథ్యంలోని భారత్ ఎ జట్టు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేపట్టింది. ఓపెనర్ మన్దీప్ సింగ్ (8)ఆదిలోనే నిష్క్రమించి నిరాశపరిచాడు. ఆ తరువాత ధవన్ కు జతకలిసిన రాయుడు స్కోరు బోర్డును చక్కదిద్దాడు. ఈ జోడి వంద పరుగులకు పైగా భాగస్వామ్యం సాధించడంతో భారత జట్టు 28.0 ఓవర్లు ముగిసే సరికి వికెట్ నష్టానికి 131 పరుగులు చేసింది. -
‘డ్రా’తోనే ముగింపు
భారత్, విండీస్ ఎలెవన్ ప్రాక్టీస్ మ్యాచ్ సెయింట్ కిట్స్: వెస్టిండీస్ పర్యటనలో రెండో ప్రాక్టీస్ మ్యాచ్‌ను కూడా భారత జట్టు ‘డ్రా’గా ముగించింది. వెస్టిండీస్ బోర్డు ప్రెసిడెంట్స్ ఎలెవన్‌తో శనివారం ముగిసిన ఈ మూడు రోజుల మ్యాచ్‌లో ఫలితం తేలలేదు. చివరి రోజు ఆట ముగిసే సమయానికి విండీస్ ఎలెవన్ తమ రెండో ఇన్నింగ్స్‌లో 86 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 223 పరుగులు చేసింది. బ్లాక్‌వుడ్ (51) టాప్‌స్కోరర్‌గా నిలవగా, హాడ్జ్ (39 నాటౌట్), విశాల్ సింగ్ (39) ఫర్వాలేదనిపించారు. భారత బౌలర్లలో అశ్విన్ 3 వికెట్లతో ఆకట్టుకున్నాడు. షమీ, జడేజా ఒక్కో వికెట్ తీశారు. నాలుగు టెస్టుల సిరీస్‌లో భాగంగా భారత్, వెస్టిండీస్ మధ్య తొలి టెస్టు మ్యాచ్ గురువారం నుంచి ఆంటిగ్వాలో జరుగుతుంది. -
ఆ ఫొటోలు ఏమిటి?
భారత క్రికెటర్లపై బోర్డు ఆగ్రహం ముంబై: వెస్టిండీస్ పర్యటనలో భారత క్రికెటర్ల వేషాలు కాస్త శృతి మించడంతో బీసీసీఐ వెంటనే స్పందించింది. ప్రాక్టీస్ మ్యాచ్‌ల మధ్య విరామంలో భారత క్రికెటర్లు బీచ్‌లలో తిరుగుతూ సందడి చేస్తున్న అనేక ఫొటోలు నెట్లో దర్శనమిచ్చాయి. అయితే క్రికెటర్లు బీర్ బాటిల్స్ పట్టుకుని ఫొటోలు దిగి ట్విట్టర్లో ఉంచడంతో బోర్డు హెచ్చరికలు పంపింది. రెండు రోజుల క్రితం ప్రఖ్యాత సెయింట్ నెవిస్ బీచ్‌లో దిగిన ఫొటోలో కేఎల్ రాహుల్ చేతిలో బీరు బాటిల్ ఉండగా పక్కన బిన్నీ, ఉమేశ్ యాదవ్ ఉన్నారు. ఈ విషయంపై వెంటనే టీమ్ మేనేజర్ రియాజ్ బగ్వాన్తో బోర్డు అధికారులు మాట్లాడారు. ‘సోషల్ మీడియాలో అలాంటి ఫొటోలు రావడంపై బోర్డులోని కొంత మంది అధికారులు సంతృప్తిగా లేరు. ఆన్లైన్లో పోస్టు చేసేటప్పుడు బాధ్యతగా మెలగాలి. దేశంలోని యువత గుడ్డిగా స్టార్ క్రికెటర్లను అనుసరిస్తారు. అభిమానులను దృష్టిలో ఉంచుకుని విజ్ఞతతో మెలగడంతో పాటు వారికి ఆదర్శంగా ఉండాలి’ అని బోర్డు అధికారి ఒకరు తెలిపారు. బోర్డు హెచ్చరికతో ఆటగాళ్లు వెంటనే తమ ట్విట్టర్ నుంచి ఆ ఫొటోను తొలగించారు. -
ఆరంభం అదిరింది
ప్రాక్టీస్ మ్యాచ్‌లో భారత్ 108/0 బసెటెర్రె (సెయింట్ కిట్స్): వెస్టిండీస్ పర్యటనలో భారత జట్టుకు మంచి ఆరంభం లభించింది. వెస్టిండీస్ బోర్డు ప్రెసిడెంట్స్ ఎలెవన్‌తో జరుగుతున్న రెండు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్‌లో తొలి రోజు కడపటి వార్తలు అందే సమయానికి భారత్ వికెట్ నష్టపోకుండా 108 పరుగులు చేసింది. శిఖర్ ధావన్ (51; 7 ఫోర్లు), లోకేశ్ రాహుల్ (50; 5 ఫోర్లు, 1 సిక్సర్) అర్ధసెంచరీలు చేసి రిటైరయ్యారు. కోహ్లి, పుజారా క్రీజులో ఉన్నారు. ఈ ప్రాక్టీస్ మ్యాచ్‌లో తొలి రోజు భారత్, రెండో రోజు బోర్డు ప్రెసిడెంట్స్ ఎలెవన్ బ్యాటింగ్ చేస్తాయి. -
బంతి తగిలి సిల్వకు గాయం
కొలంబో: శ్రీలంక టెస్టు క్రికెటర్ కౌశల్ సిల్వ మైదానంలో ఫీల్డింగ్ చేస్తూ తీవ్రంగా గాయపడ్డాడు. ఇంగ్లండ్‌తో సిరీస్‌కు సన్నాహాల్లో భాగంగా పల్లెకెలెలో జరుగుతున్న రెండు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్ సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకుంది. కౌశల్ షార్ట్‌లెగ్‌లో ఫీల్డింగ్ చేస్తుండగా, చండీమల్ కొట్టిన షాట్ బలంగా అతని మెడ కింది భాగంలో తగిలింది. ఆ సమయంలో సిల్వ హెల్మెట్ పెట్టుకొనే ఉన్నాడు. కొద్దిసేపు అతను స్పృహ కోల్పోయినట్లు కనిపించాడు. దాంతో హుటాహుటిన సమీపంలో కాండీ ఆస్పత్రికి తీసుకెళ్లి సీటీ స్కాన్ జరిపారు. అనంతరం వెంటనే విమానంలో కొలంబోకు తరలించారు. ప్రస్తుతం అతను ప్రాణాపాయం నుంచి బయట పడ్డాడని, పరిస్థితి నిలకడగా ఉందని లంక బోర్డు ప్రకటించింది. లంక తరఫున కౌశల్ 24 టెస్టులు ఆడాడు. -
ఆఖర్లో పంచ్
► రెండోప్రాక్టీస్ మ్యాచ్‌లో ఓడిన భారత్ 4 పరుగులతో దక్షిణాఫ్రికా గెలుపు ► చెలరేగిన డుమిని, డికాక్ ధావన్, రైనా, ధోనిల శ్రమ వృథా ముంబై: పొట్టి ఫార్మాట్లో తిరుగులేని విజయాలతో దూసుకుపోతున్న భారత్‌కు టి20 ప్రపంచకప్‌కు ముందు పంచ్ పడింది. శనివారం జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్‌లో ధోనిసేన 4 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికా చేతిలో ఓడింది. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా 20 ఓవర్లలో 9 వికెట్లకు 196 పరుగులు చేసింది. డుమిని (44 బంతుల్లో 67; 6 ఫోర్లు, 3 సిక్సర్లు), డికాక్ (33 బంతుల్లో 56; 7 ఫోర్లు, 2 సిక్సర్లు) చెలరేగిపోయారు. ఈ ఇద్దరు మూడో వికెట్‌కు 77 పరుగులు జోడించారు. మిల్లర్ (18) ఓ మాదిరిగా ఆడినా మిగతా వారు విఫలమయ్యారు. పాండ్యా 3, షమీ, బుమ్రా చెరో రెండు వికెట్లు తీశారు. తర్వాత భారత్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 193 పరుగులు మాత్రమే చేసింది. ధావన్ (53 బంతుల్లో 73; 10 ఫోర్లు), రైనా (26 బంతుల్లో 41; 3 ఫోర్లు, 2 సిక్సర్లు), ధోని (16 బంతుల్లో 30 నాటౌట్; 4 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. 48 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన టీమిండియాను ధావన్, రైనా నాలుగో వికెట్‌కు 94 పరుగులు జోడించి ఆదుకున్నారు. అయితే 24 బంతుల్లో 55 పరుగులు చేయాల్సిన దశలో ధావన్, రైనా రిటైర్డ్ అవుట్‌గా వెనుదిరిగారు. ఈ దశలో వచ్చిన యువరాజ్ (16 నాటౌట్), ధోని వీరవిహారం చేశారు. 18 బంతుల్లో 41 పరుగులు చేశారు. ఇక ఆఖరి ఓవర్లో 14 పరుగులు చేయాల్సిన దశలో 9 పరుగులు మాత్రమే రాబట్టడంతో ఓటమి తప్పలేదు. స్కోరు వివరాలు దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్: ఆమ్లా (సి) ధోని (బి) బుమ్రా 5; డికాక్ రిటైర్డ్ అవుట్ 56; డు ప్లెసిస్ (సి) జడేజా (బి) షమీ 12; డుమిని (సి) జడేజా (బి) షమీ 67; మిల్లర్ (సి) ధోని (బి) పాండ్యా 18; రోసోవ్ (సి) జడేజా (బి) పాండ్యా 11; వీస్ (సి) ధోని (బి) పాండ్యా 0; మోరిస్ (బి) బుమ్రా 14; బెహర్డిన్ రనౌట్ 5; అబాట్ నాటౌట్ 0; ఫాంగిసో నాటౌట్ 0; ఎక్స్‌ట్రాలు: 8; మొత్తం: (20 ఓవర్లలో 9 వికెట్లకు) 196. వికెట్ల పతనం: 1-15; 2-33; 3-110; 4-148; 5-170; 6-171; 7-186; 8-194; 9-195. బౌలింగ్: హర్భజన్ 4-0-27-0; షమీ 4-0-37-2; బుమ్రా 4-0-51-2; పాండ్యా 4-0-36-3; నేగి 1-0-12-0; జడేజా 2-0-18-0; రైనా 1-0-13-0. భారత్ ఇన్నింగ్స్: రోహిత్ ఎల్బీడబ్ల్యు (బి) అబాట్ 10; ధావన్ రిటైర్డ్ అవుట్ 73; కోహ్లి (సి) డికాక్ (బి) స్టెయిన్ 1; రహానే రనౌట్ 11; రైనా రిటైర్డ్ అవుట్ 41; యువరాజ్ నాటౌట్ 16; ధోని నాటౌట్ 30; ఎక్స్‌ట్రాలు: 10; మొత్తం: (20 ఓవర్లలో 5 వికెట్లకు) 192. వికెట్ల పతనం: 1-11; 2-16; 3-48; 4-142; 5-142. బౌలింగ్: స్టెయిన్ 4-0-36-1; అబాట్ 4-0-32-1; మోరిస్ 4-0-43-0; వీస్ 2-0-26-0; తాహిర్ 3-0-25-1; డుమిని 2-0-16-0; ఫాంగిసో 1-0-13-0. -
మెరిసిన సర్ఫరాజ్
పాక్‌పై భారత్ విజయం అండర్-19 ప్రపంచకప్ ప్రాక్టీస్ మ్యాచ్ ఢాకా: అండర్-19 ప్రపంచకప్ కోసం భారత యువ ఆటగాళ్ల సన్నాహాలు జోరుగా సాగుతున్నాయి. సోమవారం పాకిస్తాన్‌తో జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్‌లో సర్ఫరాజ్ ఖాన్ (68 బంతుల్లో 81; 12 ఫోర్లు; 1 సిక్స్) మెరుపులు మెరిపించడంతో భారత్ ఐదు వికెట్ల తేడాతో గెలిచింది. ముందుగా పాక్ 44.1 ఓవర్లలో 197 పరుగులు చేసింది. భారత పేసర్ ఖలీల్ అహ్మద్ (5/30) హడలెత్తించాడు. అనంతరం భారత్ 34 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. కెనడాతో జరిగిన తొలి ప్రాక్టీస్ మ్యాచ్‌లో భారత్ 372 పరుగుల ఆధిక్యంతో గెలిచింది. -
‘ప్రాక్టీస్’లో బాదేశారు
► ఆసీస్ పర్యటనలో భారత్ శుభారంభం ► వెస్టర్న్ ఆస్ట్రేలియాపై టీమిండియా ఘన విజయం ► చెలరేగిన కోహ్లి, ధావన్ నేడు ప్రాక్టీస్ వన్డే మ్యాచ్ పెర్త్: ఆస్ట్రేలియా పర్యటనను ధోని సేన భారీ గెలుపుతో మొదలు పెట్టింది. వన్డే సిరీస్‌కు ముందు సన్నాహకంగా జరిగిన టి20 ప్రాక్టీస్ మ్యాచ్‌లో భారత్ 74 పరుగుల తేడాతో వెస్టర్న్ ఆస్ట్రేలియా ఎలెవన్‌ను చిత్తు చేసింది. శుక్రవారం ఇక్కడి ‘వాకా’ మైదానంలో జరిగిన ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 192 పరుగుల భారీ స్కోరు సాధించింది. విరాట్ కోహ్లి (44 బంతుల్లో 74; 7 ఫోర్లు, 3 సిక్సర్లు), శిఖర్ ధావన్ (46 బంతుల్లో 74; 8 ఫోర్లు, 3 సిక్సర్లు) భారీ షాట్లతో దూకుడు ప్రదర్శించారు. వీరిద్దరు రెండో వికెట్‌కు 14.1 ఓవర్లలోనే 149 పరుగులు జోడించడం విశేషం. అనంతరం వెస్టర్న్ జట్టు 20 ఓవర్లలో 6 వికెట్లకు 118 పరుగులు మాత్రమే చేయగలిగింది. ట్రెవిస్ బర్త్ (60 బంతుల్లో 74 నాటౌట్; 11 ఫోర్లు) ఒంటరి పోరాటం చేయగా, మిగతా వారంతా విఫలమయ్యారు. భారత బౌలర్లలో స్పిన్నర్లు రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్... పేసర్ బరీందర్ శరణ్ తలా 2 వికెట్లు తీశారు. శనివారం జరిగే ప్రాక్టీస్ వన్డే మ్యాచ్‌లో భారత్... ఇదే జట్టుతో తలపడుతుంది. భారీ భాగస్వామ్యం... టాస్ గెలిచిన భారత్ బ్యాటింగ్ ఎంచుకుంది. మూడో ఓవర్లో అనవసరపు సింగిల్‌కు ప్రయత్నించి రోహిత్ శర్మ (6) రనౌట్ కావడంతో భారత్ తొలి వికెట్ కోల్పోయింది. అయితే ఆ తర్వాత ధావన్, కోహ్లి కలిసి తమదైన శైలిలో ఆడారు. ఇద్దరు బ్యాట్స్‌మెన్ తమ టి20 నైపుణ్యం, అనుభవాన్ని ప్రదర్శించారు. ఈ క్రమంలో ముందుగా ధావన్ 31 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అనంతరం మూడీ వేసిన 15వ ఓవర్లో వరుస బంతుల్లో 4, 4, 6 బాదిన కోహ్లి 35 బంతుల్లో హాఫ్ సెంచరీని చేరుకున్నాడు. ధావన్ మరో ఫోర్ కొట్టడంతో ఈ ఓవర్లో 24 పరుగులు వచ్చాయి. ఆ తర్వాత 17వ ఓవర్లో కూడా 22 పరుగులు రాబట్టిన భారత్... అదే ఓవర్లో కోహ్లి వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత తక్కువ వ్యవధిలో ధావన్, అజింక్య రహానే (2) అవుటైనా, చివర్లో ధోని (14 బంతుల్లో 22 నాటౌట్; 1 ఫోర్, 2 సిక్సర్లు) దూకుడుగా ఆడాడు. ఆకట్టుకున్న శరణ్ భారీ లక్ష్య ఛేదన కోసం బరిలోకి దిగిన వెస్టర్న్ ఆస్ట్రేలియా (డబ్ల్యూఏ) జట్టును ఆరంభంలోనే బరీందర్ శరణ్ కట్టి పడేశాడు. తన రెండో ఓవర్లో షార్ట్ (5)ను అవుట్ చేసిన అతను, మూడో ఓవర్లో బొసిస్టో (1)ను వెనక్కి పంపాడు. ఒకవైపు బర్త్ చక్కటి షాట్లతో దూసుకుపోయి 43 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నా... మరో ఎండ్‌లో అతనికి సహకారం లభించలేదు. స్పిన్నర్లు రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్ పూర్తిగా కట్టడి చేయడంతో డబ్ల్యూఏ బ్యాట్స్‌మెన్ పరుగులు చేయడంలో తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. ఇంగ్లిస్ (11) ఒక్కడే రెండంకెల స్కోరు చేయగలిగాడు. జడేజా తన వరుస ఓవర్లలో 2 వికెట్లు తీయగా, అక్షర్ కూడా అదే తరహాలో 2 వికెట్లు పడగొట్టాడు. ఉమేశ్ యాదవ్ వేసిన ఓవర్లో మూడు ఫోర్లు కొట్టిన బర్త్ చివరకు అజేయంగా నిలిచాడు. స్కోరు వివరాలు భారత్ ఇన్నింగ్స్: రోహిత్ శర్మ (రనౌట్) 6; శిఖర్ ధావన్ (సి) షార్ట్ (బి) కెల్లీ 74; విరాట్ కోహ్లి (సి) ఇంగ్లిస్ (బి) నికోలస్ 74; ధోని (నాటౌట్) 22; అజింక్య రహానే (సి) ఇంగ్లిస్ (బి) డఫీల్డ్ 2; గుర్కీరత్ (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 14; మొత్తం (20 ఓవర్లలో 4 వికెట్లకు) 192. వికెట్ల పతనం: 1-12; 2-161; 3-173; 4-185. బౌలింగ్: డఫీల్డ్ 4-0-21-1; నికోలస్ 4-0-44-1; కెల్లీ 4-0-31-1; మూడీ 3-0-40-0; కానర్ 3-0-34-0; ముర్హెడ్ 2-0-17-0. వెస్టర్న్ ఆస్ట్రేలియా ఎలెవన్ ఇన్నింగ్స్: బర్త్ (నాటౌట్) 74; షార్ట్ (సి) అశ్విన్ (బి) శరణ్ 5; బొసిస్టో (సి) అశ్విన్ (బి) శరణ్ 1; ఇంగ్లిస్ (సి) శరణ్ (బి) జడేజా 11; హాబ్సన్ (స్టంప్డ్) ధోని (బి) జడేజా 5; మోర్గాన్ (సి) రహానే (బి) అక్షర్ 3; కెల్లీ (స్టంప్డ్) ధోని (బి) అక్షర్ 2; నికోలస్ (నాటౌట్) 4; ఎక్స్‌ట్రాలు 13; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 118. వికెట్ల పతనం: 1-20; 2-26; 3-61; 4-73; 5-83; 6-92. బౌలింగ్: శరణ్ 4-0-24-2; ఉమేశ్ 3-0-23-0; రిషి ధావన్ 3-0-22-0; జడేజా 3-0-13-2; అశ్విన్ 4-0-20-0; అక్షర్ 3-0-13-2. -
డ్రా ముగిసిన ప్రాక్టీస్ మ్యాచ్
ముంబై: దక్షిణాఫ్రికా-బోర్డు ప్రెసిడెంట్స్ ఎలెవన్ జట్ల మధ్య ఇక్కడ బ్రబౌర్న్ స్టేడియంలో జరిగిన రెండు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్ డ్రా ముగిసింది. ఇరు జట్లు ప్రాక్టీస్ లో ఆకట్టుకున్నా రెండు రోజులే కావడంతో ఫలితం తేలలేదు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బోర్డు ప్రెసిడెంట్ ఎలెవన్ జట్టు తొలి ఇన్నింగ్స్ లో 296 పరుగులకు ఆలౌట్ కాగా, దక్షిణాఫ్రికా 302 పరుగులు చేసింది. దక్షిణాఫ్రికా 46/2 ఓవర్ నైట్ స్కోరుతో రెండో రోజు తొలి ఇన్నింగ్స్ ను కొనసాగించింది. 57 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న జట్టును డివిలియర్స్(112) శతకం సాధించి ఆదుకున్నాడు. డివిలియర్స్ కు తోడుగా వికెట్ కీపర్ డేన్ విలాస్ (54) రాణించడంతో దక్షిణాఫ్రికా గౌరవప్రదమైన స్కోరును సాధించింది. బోర్డు ప్రెసిడెంట్ ఆటగాళ్లలో శార్దూల్ థాకూర్ నాలుగు వికెట్లు సాధించగా, కులదీప్ యాదవ్, జయంత్ యాదవ్ లకు తలో రెండు వికెట్లు దక్కాయి. అనంతరం బ్యాటింగ్ చేపట్టిన బోర్డు ప్రెసిడెంట్ జట్టు మ్యాచ్ ముగిసే సమయానికి 30 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 90 పరుగులు చేసింది. దీంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది. తొలి ఇన్నింగ్స్ లో హాఫ్ సెంచరీ చేసిన కేఎల్ రాహుల్.. మరోసారి ఆకట్టుకున్నాడు. 90 బంతుల్లో రెండు ఫోర్లు, రెండు సిక్సర్ల సాయంతో 43 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. అతనికి జతగా చటేశ్వర పూజారా(49 నాటౌట్) ఆకట్టుకున్నాడు. -
రాహుల్.. అదుర్స్
ఆకట్టుకున్న ఓజా, పాండ్యా * బోర్డు ప్రెసిడెంట్ తొలి ఇన్నింగ్స్‌లో 296 ఆలౌట్ * దక్షిణాఫ్రికాతో ప్రాక్టీస్ మ్యాచ్ ముంబై: దక్షిణాఫ్రికాతో తొలి టెస్టుకు లోకేశ్ రాహుల్ (132 బంతుల్లో 72; 13 ఫోర్లు) భారత తుది జట్టులోకి వచ్చే అవకాశాలను మరింతగా మెరుగుపర్చుకున్నాడు. నాణ్యమైన సఫారీ పేసర్ల అటాకింగ్‌ను అద్భుతంగా ఎదుర్కొని ప్రాక్టీస్ మ్యాచ్‌లో అర్ధసెంచరీతో అదరగొట్టాడు. నమన్ ఓజా (80 బంతుల్లో 52; 7 ఫోర్లు, 1 సిక్స్) కూడా సమయోచితంగా ఆడటంతో శుక్రవారం ప్రారంభమైన వార్మప్ మ్యాచ్‌లో బోర్డు ప్రెసిడెంట్ ఎలెవన్ తొలి ఇన్నింగ్స్‌లో 78.5 ఓవర్లలో 296 పరుగులకు ఆలౌటైంది. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్‌లో 8.2 ఓవర్లలో 2 వికెట్లకు 46 పరుగులు చేసింది. ఎల్గర్ (18 బ్యాటింగ్) క్రీజులో ఉన్నాడు. వాన్‌జెల్ (18), హర్మర్ (4) నిరాశపర్చారు. శార్దూల్ రెండు వికెట్లు తీశాడు. బ్రబౌర్న్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో... బోర్డు ప్రెసిడెంట్ టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగింది. ఉన్ముక్త్ చంద్ (4), పుజారా (5), శ్రేయస్ (9) విఫలంకావడంతో బోర్డు జట్టు 27 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. అయితే రాహుల్, కరుణ్ నాయర్ (70 బంతుల్లో 44; 9 ఫోర్లు) అద్భుతమైన స్ట్రోక్స్‌తో ప్రొటీస్ పేసర్లపై ఆధిపత్యం చూపెట్టారు. ఆరంభంలో నిప్పులు చెరిగిన స్టెయిన్, ఫిలాండర్ ఓవర్లలో చూడచక్కని కవర్‌డ్రైవ్‌లు కొడుతూ నాలుగో వికెట్‌కు 105 పరుగులు జోడించారు. లంచ్ తర్వాత స్వల్ప విరామాల్లో ఈ ఇద్దరూ వెనుదిరిగినా... ఓజా, జాక్సన్ (15)లు మంచి సమన్వయంతో ఆడారు. దీంతో మరో వికెట్ పడకుండా 208/5 స్కోరుతో బోర్డు జట్టు టీకి వెళ్లింది. టీ తర్వాత హార్దిక్ పాండ్యా (55 బంతుల్లో 47; 6 ఫోర్లు, 3 సిక్సర్లు) జయంత్ యాదవ్ (22)లు వేగంగా ఆడటంతో గౌరవప్రదమైన స్కోరు లభించింది. స్టెయిన్, హర్మర్ చెరో మూడు వికెట్లు తీశారు. -
సఫారీలను ఓడించడం పెద్ద సవాల్
భారత ఓపెనర్ రోహిత్ శర్మ వ్యాఖ్య ధర్మశాల: వార్మప్ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా అనూహ్య ఓటమిని అతిగా చూడొద్దని భారత బ్యాట్స్‌మన్ రోహిత్ శర్మ అన్నాడు. టి20ల్లో చాలా నిలకడగా ఆడుతున్న ప్రొటీస్ జట్టును ఓడించడం పెద్ద సవాలేనని చెప్పాడు. బుధవారం జరిగిన మీడియా సమావేశంలో రోహిత్ శర్మ మాట్లాడిన అంశాలు అతని మాటల్లోనే.. ప్రత్యర్థి బలంగా ఉంది: అన్ని జట్లు నాణ్యమైన టీమ్‌ను బరిలోకి దించడంతో పాటు రిజర్వ్ సత్తాను పరీక్షించుకోవడానికి ప్రాక్టీస్ మ్యాచ్‌లను ఉపయోగించుకుంటాయి. కాబట్టి వార్మప్ ఓటమిని అతిగా చూడొద్దు. ఎందుకంటే ప్రతి జట్టు ప్రాక్టీస్ మ్యాచ్‌లో ఏదో ఒకటి తెలుసుకోవాలని ప్రయత్నిస్తుంది. ఏదేమైనా సఫారీ జట్టు చాలా బలంగా ఉంది. టి20లు తక్కువే: భారత్ ఎక్కువగా టి20లు ఆడలేదు. దీన్ని అంగీకరించాల్సిందే. అయితే చాలా మందికి ఐపీఎల్లో ఆడిన అనుభవం ఉంది. కాబట్టి అందరూ ఆ అనుభవాన్ని ఉపయోగించుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ ఫార్మాట్లో రాణించడం మాకు కూడా సవాలే. ఇంకో ఐదు నెలల్లో రానున్న ఐసీసీ టి20 వరల్డ్ కప్‌పై కూడా మేం దృష్టిపెట్టాం. ఇప్పట్నించి ఎక్కువ టి20లు ఆడేందుకు ప్రయత్నిస్తాం. పేస్, స్పిన్‌పై దృష్టిపెట్టాం: దక్షిణాఫ్రికా పేస్, స్పిన్ అటాకింగ్‌ను ఎదుర్కోవడానికి మేం సిద్ధంగా ఉన్నాం. ఈ రెండు విభాగాల్లో వాళ్లు పటిష్టంగా ఉన్నారు. క్రమం తప్పకుండా విదేశీ పర్యటనలకు వెళ్తే పేస్‌ను ఎదుర్కోవడం సులువవుతుంది. గత రెండేళ్లుగా మేం ఎక్కువగా విదేశీ టూర్లకు వెళ్లాం. కాబట్టి మేం పూర్తి ఆత్మవిశ్వాసంతో ఉన్నాం. బాగా సిద్ధమయ్యాం: దక్షిణాఫ్రికాతో పోలిస్తే మేం రాబోయే మ్యాచ్ కోసం బాగా సిద్ధమయ్యాం. వాతావరణ పరిస్థితులను కూడా మాకు అనుకూలంగా మల్చుకుంటాం. చాలా తొందరగా మేం ఇక్కడికి వచ్చాం. గత కొన్ని రోజులుగా అన్ని అంశాల్లో చాలా కఠినంగా ప్రాక్టీస్ చేస్తున్నాం. ఇక్కడి మైదానం అద్భుతంగా ఉంది. భారత్ వెలుపలా ఇలాంటి దాన్ని నేను చూడలేదు. విమర్శలను పట్టించుకోను: బయటి నుంచి వచ్చే విమర్శలను పట్టించుకోను. జట్టు అవసరాల మేరకు నేను ఆడతా. టీమ్‌కు ఏం కావాలో దాన్ని ఇచ్చేందుకు ప్రయత్నిస్తా. బౌలింగ్‌లో కూడా ఓ చెయ్యేస్తే కెప్టెన్‌కు మరో అవకాశం ఇచ్చినట్లు ఉంటుంది. శ్రీలంకలో చాలా పిచ్‌లు సీమ్ బౌలింగ్‌కు అనుకూలంగా కనిపించాయి. దీంతో మూడు నాలుగు ఓవర్లు వేస్తే ప్రధాన బౌలర్‌కు కాస్త ఉపయోగపడినట్లు అవుతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని బౌలింగ్‌ను ప్రాక్టీస్ చేయడం మొదలుపెట్టా. ఇద్దరూ ఇద్దరే: స్వభావాన్ని బట్టి కెప్టెన్లు ధోని, కోహ్లిలు ఇద్దరూ భిన్నం. మా అందరికీ ఈ విషయం తెలుసు. కాబట్టి వాళ్లకు సరిపోయే విధంగా మారిపోవడం పెద్ద సమస్య కాదు. మహీ మూడు ఫార్మాట్లలో కెప్టెన్‌గా ఉన్నప్పుడు చాలా విజయాలు సాధించాం. దక్షిణాఫ్రికాకు మూడు ఫార్మాట్లలో ముగ్గురు కెప్టెన్లు ఉన్నారు. ఇదో భిన్నమైన ఆలోచన. భారత్, దక్షిణాఫ్రికా క్రికెట్ సిరీస్ షెడ్యూల్ అక్టోబరు 2: తొలి టి20, ధర్మశాల (రాత్రి గం. 7.00 నుంచి) అక్టోబరు 5: రెండో టి20, కటక్ (రాత్రి గం. 7.00 నుంచి) అక్టోబరు 8: మూడో టి20, కోల్‌కతా (రాత్రి గం. 7.00 నుంచి) అక్టోబరు 11: తొలి వన్డే, కాన్పూర్ (మ.గం. 1.30 నుంచి) అక్టోబరు 14: రెండో వన్డే, ఇండోర్ (మ.గం. 1.30 నుంచి) అక్టోబరు 18: మూడో వన్డే, రాజ్‌కోట్ (మ.గం. 1.30 నుంచి) అక్టోబరు 22: నాలుగో వన్డే, చెన్నై (మ.గం. 1.30 నుంచి) అక్టోబరు 25: ఐదో వన్డే, ముంబై (మ.గం. 1.30 నుంచి) నవంబరు 5-9: తొలి టెస్టు, మొహాలీ (ఉ.గం. 9.30 నుంచి) నవంబరు 14-18: రెండో టెస్టు, బెంగళూరు (ఉ.గం. 9.30 నుంచి) నవంబరు 25-29: మూడో టెస్టు, నాగ్‌పూర్ (ఉ.గం. 9.30 నుంచి) డిసెంబరు 3-7: నాలుగో టెస్టు, ఢిల్లీ (ఉ.గం. 9.30 నుంచి) నోట్: మ్యాచ్‌లన్నీ స్టార్ స్పోర్ట్స్-1లో ప్రత్యక్ష ప్రసారం -
‘టాప్’ లేపిన ఇషాంత్
- తొలి ఇన్నింగ్స్‌లో లంక బోర్డు ప్రెసిడెంట్ 121 ఆలౌట్ - రెండో ఇన్నింగ్స్‌లో కోహ్లిసేన 112/3 - భారత్‌కు మొత్తం ఆధిక్యం 342 పరుగులు కొలంబో: శ్రీలంక బోర్డు ప్రెసిడెంట్ ఎలెవన్‌తో జరుగుతున్న మూడు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్‌లో భారత బౌలర్లు విజృంభించారు. పేసర్ ఇషాంత్ శర్మ (5/23) సంచలన స్పెల్‌కు తోడు ఆరోన్ (2/42), అశ్విన్ (2/8)లు సమయోచితంగా స్పందించడంతో శుక్రవారం రెండో రోజు లంక తొలి ఇన్నింగ్స్‌లో 31 ఓవర్లలో 121 పరుగులకే కుప్పకూలింది. డిక్వెల్లా (41), సిరివందన (32), గుణతిలక (28) మాత్రమే రెండంకెల స్కోరు సాధించారు. తర్వాత బ్యాటింగ్ ప్రారంభించిన భారత్ ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్‌లో 40 ఓవర్లలో 3 వికెట్లకు 112 పరుగులు చేసింది. పుజారా (31 బ్యాటింగ్), లోకేశ్ రాహుల్ (47 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. రోహిత్ (8), కోహ్లి (18), సాహా (1) మరోసారి విఫలమయ్యారు. ఓవరాల్‌గా భారత్ 342 పరుగుల ఆధిక్యంలో ఉంది. తొలి సెషన్లోనే ఇన్నింగ్స్ ప్రారంభించిన లంక బోర్డు ప్రెసిడెంట్ బ్యాట్స్‌మెన్ ఇషాంత్ దెబ్బకు వణికిపోయారు. అద్భుతమైన స్వింగ్‌తో చెలరేగిన ఈ ఢిల్లీ బౌలర్ తన వరుస నాలుగు ఓవర్లలో లంక ‘టాప్’ను కూల్చేశాడు. రెండుసార్లు హ్యాట్రిక్ మిస్ చేసుకున్న ఇషాంత్ కేవలం 5 పరుగులిచ్చి 5 వికెట్లు తీశాడు. దీంతో లంక 10 పరుగులకే సగం జట్టు పెవిలియన్‌కు చేరుకుంది. లంచ్ తర్వాత ఆరోన్, అశ్విన్‌లు చెలరేగిపోయారు. ఓవరాల్‌గా 18వ ఓవర్లో 50 పరుగులకు చేరుకున్న లంక ఆ వెంటనే సిరివందన వికెట్‌ను కోల్పోయింది. ఈ దశలో డిక్వెల్లా, గుణతిలక ఎనిమిదో వికెట్‌కు 63 పరుగులు జోడించారు. అయితే ఏడు పరుగుల తేడాతో చివరి మూడు వికెట్లు పడటంతో ఆతిథ్య జట్టు ఓ మోస్తరు స్కోరుకే పరిమితమైంది. దీంతో భారత్‌కు 230 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం దక్కింది. అంతకుముందు 314/6 ఓవర్‌నైట్ స్కోరుతో రెండో రోజు ఆట కొనసాగించిన భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 88.1 ఓవర్లలో 351 పరుగులకు ఆలౌటైంది. రహానే (109; 11 ఫోర్లు, 1 సిక్స్) ఓవర్‌నైట్ స్కోరు వద్దే రిటైర్డ్ అవుట్ కాగా... మిగతా వారు విఫలమయ్యారు. భారత్ ఓవర్‌నైట్ స్కోరుకు మరో 37 పరుగులు జోడించింది. జట్టుతో చేరనున్న రవిశాస్త్రి: భారత జట్టు డెరైక్టర్ రవిశాస్త్రి శనివారం ఉదయం జట్టుతో చేరనున్నారు. యాషెస్ సిరీస్‌లో టీవీ విశ్లేషకుడిగా పని చేసేందుకు ఇంగ్లండ్ వెళ్లిన ఆయన... జింబాబ్వేలో భారత పర్యటనకు కూడా అందుబాటులో లేరు. అయితే మరో యాషెస్ టెస్టు మిగిలుండగానే శ్రీలంక వచ్చి జట్టుతో చేరుతున్నారు. స్కోరు వివరాలు భారత్ తొలి ఇన్నింగ్స్: 88.1 ఓవర్లలో 351 ఆలౌట్. శ్రీలంక బోర్డు ప్రెసిడెంట్ ఎలెవన్ తొలి ఇన్నింగ్స్: డిసిల్వా (బి) ఇషాంత్ 0; జేకే సిల్వా ఎల్బీడబ్ల్యు (బి) ఇషాంత్ 0; తిరిమన్నే (సి) రాహుల్ (బి) ఇషాంత్ 5; తరంగ ఎల్బీడబ్ల్యు (బి) ఇషాంత్ 0; సిరివందన (సి) సాహా (బి) ఆరోన్ 32; కుశాల్ పెరీరా (బి) ఇషాంత్ 0; జయసూరియా (సి) సా హా (బి) ఆరోన్ 7; డిక్వెల్లా (బి) అశ్విన్ 41; గుణతిలక (సి) ఉమేశ్ (బి) అశ్విన్ 28; గమాగే ఎల్బీడబ్ల్యు (బి) హర్భజన్ 2; కాసన్ నాటౌట్ 0; ఎక్స్‌ట్రాలు: 6; మొత్తం: (31 ఓవర్లలో ఆలౌట్) 121. వికెట్ల పతనం: 1-0; 2-1; 3-1; 4-10; 5-10; 6-38; 7-51; 8-114; 9-117; 10-121. బౌలింగ్: భువనేశ్వర్ 7-3-17-0; ఇషాంత్ 7-1-23-5; ఉమేశ్ 6-1-24-0; ఆరోన్ 6-0-42-2; అశ్విన్ 3-1-8-2; హర్భజన్ 2-0-7-1. భారత్ రెండో ఇన్నింగ్స్: రోహిత్ ఎల్బీడబ్ల్యు (బి) ఫెర్నాండో 8; కోహ్లి (సి) పతిరన (బి) కాసన్ రజిత 18; సాహా ఎల్బీడబ్ల్యు (బి) ఫెర్నాండో 1; పుజారా బ్యాటింగ్ 31; రాహుల్ బ్యాటింగ్ 47; ఎక్స్‌ట్రాలు: 7; మొత్తం: (40 ఓవర్లలో 3 వికెట్లకు) 112. వికెట్ల పతనం: 1-22; 2-27; 3-28. బౌలింగ్: ఫెర్నాండో 5-0-17-2; లాహిర్ గమాగే 7-0-15-0; కాసన్ రజిత 7-2-16-1; గమాగే 3-2-7-0; పతిరన 10-1-31-0; జయసూరియా 8-0-25-0.