ముంబై:ఇంగ్లండ్తో జరుగుతున్న యాభై ఓవర్ల డే అండ్ నైట్ ప్రాక్టీస్ మ్యాచ్లో భారత-ఎ జట్టు ఆటగాళ్లు శిఖర్ ధవన్, అంబటి రాయుడులు హాఫ్ సెంచరీలు సాధించారు. ధవన్ 73 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్సర్ సాయంతో హాఫ్ సెంచరీ సాధించగా, రాయుడు 57 బంతుల్లో ఆరు ఫోర్ల సాయంతో అర్థ శతకం చేశాడు.ధోని సారథ్యంలోని భారత్ ఎ జట్టు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేపట్టింది.
ఓపెనర్ మన్దీప్ సింగ్ (8)ఆదిలోనే నిష్క్రమించి నిరాశపరిచాడు. ఆ తరువాత ధవన్ కు జతకలిసిన రాయుడు స్కోరు బోర్డును చక్కదిద్దాడు. ఈ జోడి వంద పరుగులకు పైగా భాగస్వామ్యం సాధించడంతో భారత జట్టు 28.0 ఓవర్లు ముగిసే సరికి వికెట్ నష్టానికి 131 పరుగులు చేసింది.