india-A
-
భారత్-సితో మ్యాచ్.. శాశ్వత్ రావత్ అజేయ సెంచరీ
సాక్షి, అనంతపురం: మిడిలార్డర్ ఆటగాడు శాశ్వత్ రావత్ (235 బంతుల్లో 122 బ్యాటింగ్; 15 ఫోర్లు) అజేయ సెంచరీతో చెలరేగడంతో భారత్ ‘సి’జట్టుతో జరుగుతున్న దులీప్ ట్రోఫీ మ్యాచ్‌లో భారత్ ‘ఎ’జట్టు 77 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 224 పరుగులు చేసింది. భారత్ ‘సి’జట్టు బౌలర్ల ధాటికి 36 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడ్డ భారత్ ‘ఎ’జట్టును శాశ్వత్ రావత్ ఒంటరి పోరాటంతో ఆదుకున్నాడు. ప్రథమ్ సింగ్ (6), కెప్టెన్ మయాంక్ అగర్వాల్ (6), హైదరాబాద్ ఆటగాడు తిలక్ వర్మ (5), రియాన్ పరాగ్ (2), కుమార్ కుషాగ్ర (0) విఫలమయ్యారు. ఈ దశలో షమ్స్ ములానీ (76 బంతుల్లో 44; 5 ఫోర్లు, ఒక సిక్సర్)తో కలిసి శాశ్వత్ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. దులీప్ ట్రోఫీలో అటు బౌలింగ్‌లో ఇటు బ్యాటింగ్‌లో ఆకట్టుకుంటున్న ఆల్‌రౌండర్ షమ్స్ ములానీ మరోసారి తన విలువ చాటుకున్నాడు. భారత్ ‘సి’జట్టు బౌలర్లలో అన్షుల్ కంబోజ్ 3, విజయ్ కుమార్ వైశాఖ్ రెండు వికెట్లు పడగొట్టారు. గత మ్యాచ్‌లో 8 వికెట్లతో సత్తాచాటిన అన్షుల్... ఆరంభంలోనే పదునైన పేస్‌తో ప్రత్యర్థి టాపార్డర్‌ను కుప్పకూల్చాడు. జట్టు స్కోరులో సింహభాగం పరుగులు చేసిన శాశ్వత్ అజేయంగా నిలవగా... అతడితో పాటు అవేశ్ ఖాన్ (16 బ్యాటింగ్; 2 ఫోర్లు, ఒక సిక్సర్) క్రీజులో ఉన్నాడు. స్కోరు వివరాలు భారత్ ‘ఎ’తొలి ఇన్నింగ్స్: ప్రథమ్ సింగ్ (సి) సాయి సుదర్శన్ (బి) అన్షుల్ కంబోజ్ 6; మయాంక్ అగర్వాల్ (సి) ఇషాన్ కిషన్ (బి) అన్షుల్ కంబోజ్ 6; తిలక్ వర్మ (రనౌట్) 5; రియాన్ పరాగ్ (సి) సాయి సుదర్శన్ (బి) విజయ్ కుమార్ వైశాఖ్ 2; శాశ్వత్ రావత్ (నాటౌట్) 122; కుమార్ కుషాగ్ర (సి) ఇషాన్ కిషన్ (బి) విజయ్ కుమార్ వైశాక్ 0; షమ్స్ ములానీ (సి) రజత్ పాటిదార్ (బి) గౌరవ్ యాదవ్ 44; తనుశ్ కొటియాన్ (సి) బాబా ఇంద్రజిత్ (బి) అన్షుల్ కంబోజ్ 10; అవేశ్ ఖాన్ (నాటౌట్) 16; ఎక్స్‌ట్రాలు: 13, మొత్తం: (77 ఓవర్లలో 7 వికెట్లకు) 224. వికెట్ల పతనం: 1–11; 2–14; 3–17; 4–35; 5–36; 6–123; 7–154, బౌలింగ్: అన్షుల్ కంబోజ్ 14–2–40–3; గౌరవ్ యాదవ్ 17–7–46–1; విజయ్‌కుమార్ వైశాఖ్ 15–1–33–2; పులి్కత్ నారంగ్ 21–0–58–0; మానవ్ సుతార్ 10–1–38–0. -
ఇండియా-ఏ జట్టులో ఓవరాక్షన్ ప్లేయర్.. అభిమానుల ట్రోల్స్
ఏసీసీ మెన్స్ ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్-2023కి భారత్ జట్టును ప్రకటించింది. వన్డే ఫార్మాట్లో నిర్వహించనున్న ఈ టోర్నీకి జూనియర్ క్రికెట్ కమిటీ 15 మంది సభ్యులతో కూడిన ఇండియా- ఏ జట్టును ఎంపిక చేసింది. మరో నలుగురికి స్టాండ్ బై ప్లేయర్లుగా అవకాశమిచ్చింది. కాగా ఈ టోర్నీకి రియాన్ పరాగ్ కూడా ఎంపికయ్యాడు. ఐపీఎల్లో రాజస్తాన్ రాయల్స్ తరపున ఆడుతున్న రియాన్ పరాగ్ తన చర్యలతో ఎన్నోసార్లు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాడు ''ఆడేది తక్కువ.. ఓవరాక్షన్ ఎక్కువ'' రియాన్ పరాగ్‌పై అభిమానుల ధోరణి ఇలానే ఉంటుంది. మనం కూడా ఇదివరకు చాలాసార్లు చూశాం. అందుకే అతనిపై ఓవరాక్షన్ ప్లేయర్ అనే ముద్ర ఉంది. ఇక ఐపీఎల్ 2023 ఏడు మ్యాచ్‌లాడి 78 పరుగులు సాధించాడు. ఈ నేపథ్యంలోనే రియాన్ పరాగ్‌పై అభిమానులు సోషల్ మీడియాలో ట్రోల్స్ వర్షం కురిపించారు. ఓవరాక్షన్ ప్లేయర్‌ను ఎందుకు ఎంపిక చేశారు అంటూ కామెంట్ చేశారు. జూలై 13 నుంచి 23 వరకు టోర్నీ.. జూలై 13 నుంచి జూలై 23 వరకు శ్రీలంకలోని కొలంబోలో ఎమర్జింగ్ ఆసియా కప్-2023 నిర్వహించేందుకు షెడ్యూల్ ఖరారైంది. ఇందులో గ్రూప్-బిలో భారత్‌తో పాటు.. నేపాల్, యూఏఈ, పాకిస్తాన్- ఏ జట్లు.. శ్రీలంక, బంగ్లాదేశ్, అఫ్గనిస్తాన్, ఒమన్- ఏ జట్లు గ్రూప్-ఏలో ఉన్నాయి. ఇరు గ్రూపులలో తొలి రెండు స్థానాల్లో నిలిచిన రెండు జట్లు సెమీ ఫైనల్‌కు అర్హత సాధిస్తాయి. ఇందులో గ్రూప్-ఏ టాపర్‌తో గ్రూప్-బిలో రెండో స్థానంలో నిలిచిన జట్టు తొలి సెమీ ఫైనల్లో.. గ్రూప్-బి టాపర్‌తో గ్రూప్-ఏలో రెండో స్థానంలో ఉన్న జట్టు రెండో సెమీ ఫైనల్లో తలపడతాయి. జూలై 23న ఈ టోర్నీ ఫైనల్ జరుగనుంది. ఎమర్జింగ్ ఏసియా కప్-2023 భారత- ఏ జట్టు సాయి సుదర్శన్, అభిషేక్ శర్మ(వైస్ కెప్టెన్), నికిన్ జోస్, ప్రదోష్ రంజన్ పాల్, యశ్ ధుల్(కెప్టెన్), రియాన్ పరాగ్, నిశాంత్ సంధు, ప్రభ్‌షిమ్రన్ సింగ్ (వికెట్ కీపర్), ధ్రువ్ జురెల్(వికెట్ కీపర్), మానవ్ సుతార్, యువరాజ్‌సిన్హ్ దోడియా, హర్షిత్ రానా, ఆకాశ్ సింగ్, నితీశ్ కుమార్‌రెడ్డి, రాజ్‌వర్దన్ హంగ్రేకర్. స్టాండ్ బై ప్లేయర్లు: హర్ష్ దూబే, నేహాల్ వధేరా, స్నెల్ పటేల్, మోహిత్ రేద్కార్. కోచింగ్ స్టాఫ్: సితాంశు కొటక్(హెడ్‌కోచ్), సాయిరాజ్ బహూతులే (బౌలింగ్ కోచ్), మునిష్ బాలి(ఫీల్డింగ్ కోచ్). Riyan Parag after selection be like 😅#RiyanParag pic.twitter.com/IxlHQIhG8r — Ashutosh Srivastava 🇮🇳 (@sri_ashutosh08) July 4, 2023 Riyan Parag scored a 33(45) in a tough wicket and is the 2nd highest scorer in the first Innings of the match between East zone and Central Zone #DuleepTrophy pic.twitter.com/a7SDXUNXFu — ' (@riyanparagfc_) June 29, 2023 Riyan Parag selected in India A squad Meanwhile me : pic.twitter.com/jiWU96Qnt3 — CHINMOY RAY (@ChinmoyRay07) July 4, 2023 చదవండి: Asia Cup- India A: ఆసియా కప్-2023 జట్టు ప్రకటన.. తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్‌రెడ్డికి చోటు #ZIMVsSCO: హతవిధి.. జింబాబ్వే కొంపముంచిన స్కాట్లాండ్ -
సంచలనం.. 34 పరుగులకే ఆలౌట్; భారత్ ఘన విజయం
ఏసీసీ వుమెన్స్ ఎమర్జింగ్ ఆసియా కప్‌లో సంచలనం చోటుచేసుకుంది. లీగ్‌లో భాగంగా మంగళవారం హాంగ్ కాంగ్ వుమెన్స్, ఇండియా వుమెన్స్-ఏ మధ్య మ్యాచ్ జరిగింది. కాగా మ్యాచ్‌లో ఇండియా వుమెన్స్ బౌలర్ల దాటికి హాంగ్‌కాంగ్ కేవలం 34 పరుగులకే ఆలౌట్ అయింది. శ్రేయాంకా పాటిల్ ఐదు వికెట్లతో చెలరేగగా.. పార్శవీ చోప్రా, మన్నత్ కశ్యప్‌లు తలా రెండు వికెట్లు పడగొట్టగా.. తిటాస్ సాదు ఒక వికెట్ తీశాడు. హాంగ్ కాంగ్ బ్యాటర్లలో మరికో హిల్ 14 పరుగులతో టాప్ స్కోరర్ కాగా.. మిగతా పది మంది సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. అందులో నాలుగు డకౌట్లు ఉన్నాయి. అనంతరం బ్యాటింగ్ చేసిన ఇండియా-ఏ వుమెన్స్ 5.2 ఓవర్లలో వికెట్ నష్టపోయి 38 పరుగులు చేసి టార్గెట్‌ను అందుకుంది. గొంగిడి త్రిష 19, ఉమా చెత్రీ 16 పరుగులు చేశారు. టోర్నీలో తొలి మ్యాచ్ ఆడిన ఇండియా-ఏ వుమెన్స్ భారీ విజయం అందుకొని టేబుల్ టాపర్స్‌గా ఉన్నారు. Patil’s 5-fer demolishes Hong Kong! Put into bat, the 🇭🇰 batters had no answers to the Indian spinners - ending with just 34 runs. The 🇮🇳 top order completed the chase with over 14 overs to spare! #WomensEmergingTeamsAsiaCup #ACC pic.twitter.com/8e11IyECs5 — AsianCricketCouncil (@ACCMedia1) June 13, 2023 Shreyanka Patil was terrific today! She picked up 5 wickets and conceded just 2 runs. Her splendid spell has put India ‘A’ in the drivers seat at the break! #WomensEmergingTeamsAsiaCup #ACC pic.twitter.com/UqF0HPd3Xs — AsianCricketCouncil (@ACCMedia1) June 13, 2023 చదవండి: ఔను.. ఇంగ్లండ్‌లోనే ఎందుకు జరగాలి? వేరే పిచ్ పెట్టాల్సిందే.. పెరుగుతున్న మద్ధతు -
178 పరుగులకే ఆలౌట్.. సిరీస్ క్లీన్‌స్వీప్; సంజూ కెప్టెన్సీ అదరహో
భారత పర్యటనకు వచ్చిన న్యూజిలాండ్-ఏ జట్టుకు భంగపాటే ఎదురైంది. న్యూజిలాండ్-ఏతో జరిగిన అనధికారిక మూడు వన్డేల సిరీస్‌ను సంజూ శాంసన్ కెప్టెన్సీలోని ఇండియా-ఏ జట్టు క్లీన్‌స్వీప్ చేసింది. మంగళవారం చెన్నై వేదికగా జరిగిన అనధికారిక మూడో వన్డేలో ఇండియా-ఏ 106 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 285 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్-ఏ 178 పరుగులకే ఆలౌట్ అయింది. ఓపెనర్ డానే క్లీవర్ ఒక్కడే 83 పరుగులతో ఒంటరి పోరాటం చేయగా.. మిగిలినవారిలో మైకెల్ రిప్పన్ 29, చాడ్ బోవ్స్ 20 పరుగులు చేశారు. ఇండియా-ఏ బౌలర్లలో రాజ్ బవా నాలుగు వికెట్లతో చెలరేగగా.. రాహుల్ చహర్, కుల్దీప్ యాదవ్‌లు చెరో రెండు వికెట్లు తీశారు. అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన ఇండియా-ఏ జట్టు 49.3 ఓవర్లలో 284 పరుగులకు ఆలౌట్ అయింది. కెప్టెన్ సంజూ శాంసన్(54), తిలక్ వర్మ(50), శార్దూల్ ఠాకూర్(51) అర్థ సెంచరీలతో చెలరేగారు.కివీస్ బౌలర్లలో జాకోబ్ డఫీకి రెండు, మాథ్యూ ఫిషర్‌కు రెండు, జో వాకర్‌కు ఒకటి, మైఖేల్ రిప్పన్‌కు రెండు, రచిన్ రవీంద్రకు ఒక వికెట్ దక్కాయి. ఇక అనధికారిక వన్డే సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసిన ఇండియా-ఏ టెస్టు సిరీస్‌ను మాత్రం డ్రాతోనే సరిపెట్టుకుంది. చదవండి: షమీకి పెరుగుతున్న మద్దతు.. అక్టోబర్ 9న డెడ్‌లైన్! -
IND-A vs SA-A: చెలరేగిన ఇషాన్ కిషన్, హనుమ విహారి
IND-A vs South Africa-A: దక్షిణాఫ్రికా ‘ఎ’తో బ్లోమ్ఫోంటీన్లో జరుగుతున్న మూడో అనధికారిక టెస్టులో భారత్ ‘ఎ’ ప్లేయర్లు హనుమ విహారి (63; 6 ఫోర్లు, 1 సిక్స్), ఇషాన్ కిషన్ (86 బ్యాటింగ్; 12 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. వీరిద్దరూ ఐదో వికెట్‌కు 115 పరుగులు జోడించారు. మంగళవారం ఆట ముగిసే సమయానికి భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 6 వికెట్లకు 229 పరుగులు చేసింది. దక్షిణాఫ్రికా ‘ఎ’ తొలి ఇన్నింగ్స్‌లో 268 పరుగులకు ఆలౌటైంది. చదవండి: Hardik Pandya: టెస్టు ఫార్మాట్‌కు గుడ్‌బై చెప్పనున్న హార్దిక్ పాండ్యా! -
ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్ ‘ఎ’
ముంబై: ఆస్ట్రేలియాతో ఇక్కడ బ్రాబోర్న్ స్టేడియంలో ఆరంభమైన మూడు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్‌లో భారత్ 'ఎ' టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. టాస్ గెలిచిన భారత్ 'ఎ' కెప్టెన్ హార్దిక్ పాండ్యా తొలుత ఆస్ట్రేలియాను బ్యాటింగ్ చేయాల్సిందిగా ఆహ్వానించాడు. దాంతో బ్యాటింగ్ కు దిగిన ఆస్ట్రేలియా బ్యాటింగ్ తో ప్రాక్టీస్ మ్యాచ్‌ను ఆరంభించింది. ఈనెల 23 నుంచి జరిగే తొలి టెస్టు కోసం ఈ ఏకైక సన్నాహక మ్యాచ్‌ను పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని ఇరు జట్లు భావిస్తున్నాయి. జట్టు కూర్పుతో పాటు భారత ఉపఖండంలోని బలమైన స్పిన్ బౌలింగ్‌లో తమ స్థాయిని పరీక్షించుకునేందుకు ఆసీస్ కు ఇది సరైన అవకాశం కాగా, మరోవైపు భారత జట్టు తమ రిజర్వ్ బెంచ్ సత్తా తెలుసుకునేందుకు ఎదురుచూస్తోంది. -
ధవన్, రాయుడు హాఫ్ సెంచరీలు
ముంబై:ఇంగ్లండ్‌తో జరుగుతున్న యాభై ఓవర్ల డే అండ్ నైట్ ప్రాక్టీస్ మ్యాచ్‌లో భారత-ఎ జట్టు ఆటగాళ్లు శిఖర్ ధవన్, అంబటి రాయుడులు హాఫ్ సెంచరీలు సాధించారు. ధవన్ 73 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్సర్ సాయంతో హాఫ్ సెంచరీ సాధించగా, రాయుడు 57 బంతుల్లో ఆరు ఫోర్ల సాయంతో అర్థ శతకం చేశాడు.ధోని సారథ్యంలోని భారత్ ఎ జట్టు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేపట్టింది. ఓపెనర్ మన్దీప్ సింగ్ (8)ఆదిలోనే నిష్క్రమించి నిరాశపరిచాడు. ఆ తరువాత ధవన్ కు జతకలిసిన రాయుడు స్కోరు బోర్డును చక్కదిద్దాడు. ఈ జోడి వంద పరుగులకు పైగా భాగస్వామ్యం సాధించడంతో భారత జట్టు 28.0 ఓవర్లు ముగిసే సరికి వికెట్ నష్టానికి 131 పరుగులు చేసింది. -
భారత కుర్రాళ్లు కుమ్మేశారు..
మకే(ఆస్ట్రేలియా): ఆస్ట్రేలియాలో జరిగిన క్వాడ్రాంగులర్ క్రికెట్ సిరీస్‌ను భారత -ఎ జట్టు కైవసం చేసుకుంది. ఆస్ట్రేలియాతో ఆదివారం జరిగిన ఫైనల్లో భారత్ 56 పరుగుల తేడాతో విజయం సాధించి సిరీస్‌ను సొంతం చేసుకుంది. ఆద్యంతం ఆస్ట్రేలియాపై పైచేయి సాధించిన భారత కుర్రాళ్లు అటు బ్యాటింగ్‌లోనూ, ఇటు బౌలింగ్‌లోనూ రాణించి సత్తా చాటారు. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు నిర్ణీత ఓవ్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 266 పరుగులు చేసింది. ఓపెనర్ కరుణ్ నాయర్(1) ఆదిలో పెవిలియన్ చేరినప్పటికీ, మరో ఓపెనర్ మన్ దీప్ సింగ్(95;108 బంతుల్లో 11 ఫోర్లు) రాణించాడు. అనంతరం ఐయ్యర్(41), మనీష్ పాండే(61) ఆకట్టుకున్నారు. ఈ జోడీ మూడో వికెట్ కు 87 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు నమోదు చేసింది. ఇక చివర్లో కేదర్ జాదవ్(25 నాటౌట్), అక్షర్ పటేల్(22నాటౌట్ ) బాధ్యతాయుతంగా ఆడటంతో భారత్ గౌరవప్రదమైన స్కోరు చేసింది. ఆపై బ్యాటింగ్ దిగిన ఆస్ట్రేలియా-ఎ జట్టు 44.5 ఓవర్లలో 209 పరుగులకే పరిమితమై ఓటమి పాలైంది.ఆసీస్ జట్టును భారత స్పిన్నర్ యుజ్వేందర్ చాహల్ చావు దెబ్బ తీశాడు. చాహల్ 8.5 ఓవర్లలో 34 పరుగుల ఇచ్చి నాలుగు కీలక వికెట్లను పడగొట్టాడు. అతనికి జతగా కులకర్ణి, నాయర్, అక్షర్‌లు తలో రెండు వికెట్లు సాధించడంతో భారత ఘన విజయం సొంతం చేసుకుంది. భారత ఆటగాడు మన్ దీప్ సింగ్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. -
భారత్-ఎ ఎదురీత
వెస్టిండీస్-ఎతో అనధికారిక తొలి టెస్టులో భారత్-ఎ కష్టాల్లో పడింది. ఓవర్‌నైట్ స్కోరు 124/3తో మ్యాచ్ మూడో రోజు శుక్రవారం తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన భారత్-ఎ 245 పరుగులకు ఆలౌటైంది. జునేజా (84) మినహా ఇతర బ్యాట్స్‌మెన్ విఫలమయ్యారు. భారత్ 121 పరుగులకే చివరి ఏడు వికెట్లు కోల్పోయింది. విండీస్ బౌలర్లు పెరుమాళ్ ఐదు, మిల్లర్ నాలుగు వికెట్లు పడగొట్టారు. అనంతరం రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన విండీస్ ఆట ముగిసే సమయానికి మూడు వికెట్ల నష్టానికి 130 పరుగులు చేసింది. కీరన్ పావెల్ (68) హాఫ్ సెంచరీ చేశాడు. పర్వేజ్ రసూల్ రెండు వికెట్లు తీశాడు. కాగా కరీబియన్లు ఓవరాల్‌గా 314 పరుగుల ఆధిక్యంలో ఉన్నారు. తొలి ఇన్నింగ్స్‌లో 429 పరుగులు సాధించారు. -
రాణించిన రసూల్, పోరాడుతున్న భారత్-ఎ
వెస్టిండీస్-ఎతో అనధికారిక తొలిటెస్టులో భారత్-ఎ పోరాడుతోంది. 264/5 ఓవర్‌నైట్ స్కోరుతో మ్యాచ్ రెండో రోజు గురువారం తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన విండీస్ 429 పరుగులకు ఆలౌటైంది. భారత యువ స్పిన్నర్ పర్వేజ్ రసూల్ (5/116) రాణించి టెయిలెండర్ల పనిపట్టాడు. కాగా ఫుడాడిన్ (86 నాటౌట్), మిల్లర్ (49) విండీస్ జట్టుకు భారీ స్కోరు అందించారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన భారత్-ఎ ఆట ముగిసే సమయానికి మూడు వికెట్ల నష్టానికి 124 పరుగులు చేసింది. రాహుల్ 46 పరుగులు చేయగా, జీవన్‌జ్యోత్ సింగ్ (16), పుజారా (3) నిరాశపరిచారు. జునేజా (47 బ్యాటింగ్)తో పాటు ఖడివాలె (5 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. భారత్-ఎ తొలిఇన్నింగ్స్‌లో ఇంకా 305 పరుగులు వెనకబడివుంది. -
ఆ ఒక్క'టీ' భారత్-ఎదే
వెస్టిండీస్-ఎతో వన్డే సిరీస్‌ను భారత్-ఎ ఓడిపోయినా ఏకైక అనధికారిక టి-20 మ్యాచ్‌లో ఘనవిజయం సాధించింది. యువరాజ్ సింగ్ (35 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 52; 2/24) ) ఆల్‌రౌండ్ షోతో పాటు రాహుల్ శర్మ (5/23) సూపర్ స్పెల్‌తో విజృంభించడంతో భారత్-ఎ 93 పరుగులతో విండీస్‌ను చిత్తుచేసింది. 215 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన విండీస్‌ను భారత బౌలర్లు 16.2 ఓవర్లలో 121 పరుగులకు కుప్పకూల్చారు. విండీస్ జట్టులో ఆండ్రీ ఫ్లెచర్ (32) టాప్ స్కోరర్. భారత యువ బౌలర్ రాహుల్ అద్భుతంగా బౌలింగ్ చేయగా, వినయ్ కుమార్, యువరాజ్ సింగ్ చెరో రెండు వికెట్లు తీశారు. అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్లకు 214 పరుగుల భారీ స్కోరు సాధించింది. యువీతో పాటు ఉన్ముక్త్ చంద్ (29 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 47), కేదార్ జాదవ్ (21 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 42), రాబిన్ ఊతప్ప (21 బంతుల్లో ఫోర్, 3 సిక్సర్లతో 35) దూకుడుగా ఆడారు. ఓపెనర్లు ఊతప్ప, చంద్ 40 బంతుల్లో 74 పరుగులు చేసి జట్టకు శుభారంభం అందించారు. ఈ జోడీ వెనుదిరిగాక యువీ, జాదవ్ అదే జోరు కొనసాగించారు. కాగా అపరాజిత్ (3), యూసుఫ్ (0), నమన్ ఓజా (0) నిరాశపరిచినా చివర్లో సుమీత్ నర్వాల్ (7 బంతుల్లో ఫోర్, సిక్సర్‌తో 18 నాటౌట్) బ్యాట్ ఝుళిపించడంతో స్కోరు 200 దాటింది. -
భారత్ ‘ఎ’కు తొలి గెలుపు
ప్రిటోరియా: ముక్కోణపు సిరీస్‌లో భారత్-ఎ జట్టు బోణి చేసింది. శుక్రవారం జరిగిన రెండో వన్డేలో 18 పరుగుల తేడా (డక్‌వర్త్ లూయిస్ ప్రకారం)తో దక్షిణాఫ్రికా-ఎ పై విజయం సాధించింది. దీంతో భారత్‌కు 4 పాయింట్లు లభించాయి. ఎల్సీ డివిలియర్స్ మైదానంలో జరిగిన ఈ మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించడంతో ఓవర్లు కుదించారు. ప్రొటీస్ జట్టు టాస్ గెలవగా... మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 38 ఓవర్లలో 5 వికెట్లకు 309 పరుగుల భారీ స్కోరు చేసింది. టాప్ ఆర్డర్లో ధావన్ (67 బంతుల్లో 85; 10 ఫోర్లు, 3 సిక్సర్లు), రోహిత్ (65 బంతుల్లో 65; 5 ఫోర్లు, 2 సిక్సర్లు), రైనా (34 బంతుల్లో 60; 7 ఫోర్లు, 2 సిక్సర్లు), రాయుడు (38 బంతుల్లో 57; 5 ఫోర్లు, 3 సిక్సర్లు) పరుగుల వరద పారించారు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా 34.4 ఓవర్లలో 5 వికెట్లకు 258 పరుగులు చేసింది. ఈ దశలో వర్షం రావడంతో మ్యాచ్ నిలిచిపోయింది. డక్‌వర్త్ ప్రకారం ప్రొటీస్ జట్టు గెలవాలంటే అప్పటికి 277 పరుగులు చేయాల్సి ఉంది. ఎల్గర్ (72 బంతుల్లో 84; 7 ఫోర్లు, 2 సిక్సర్లు) టాప్ స్కోరర్. జార్స్వీల్డ్ (61 బంతుల్లో 69; 5 ఫోర్లు, 3 సిక్సర్లు), రోసోవ్ (33 బంతుల్లో 47; 5 ఫోర్లు, 2 సిక్సర్లు), హెండ్రిక్స్ (31 బంతుల్లో 30; 4 ఫోర్లు) రాణించారు. రసూల్, నదీమ్ చెరో రెండు వికెట్లు తీశారు. ఉనాద్కట్ ఒక్క వికెట్ పడగొట్టాడు. -
పోరాడి ఓడిన భారత్ ‘ఎ’
ప్రిటోరియా: ముక్కోణపు వన్డే సిరీస్‌లో ఆస్ట్రేలియా-ఎ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో భారత్-ఎ జట్టు పోరాడి ఓడింది. మ్యాక్స్‌వెల్ (79 బంతుల్లో 145 నాటౌట్, 18 ఫోర్లు, 6 సిక్సర్లు) సంచలన ఇన్నింగ్స్‌తో ఆస్ట్రేలియా 7 పరుగుల తేడాతో గెలుపొందింది. టాస్ గెలిచిన భారత్ ఫీల్డింగ్ ఎంచుకోగా ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 298 పరుగుల భారీ స్కోరు చేసింది. నిక్ మెడిన్సన్ (56 బంతుల్లో 52, 4 ఫోర్లు, 3 సిక్స్‌లు) అర్ధసెంచరీ చేశాడు. భారత బౌలర్లు షమీ, నదీమ్, శిఖర్ ధావన్ తలా 2 వికెట్లు తీయడంతో ఆసీస్ 36.2 ఓవర్లలో 152 పరుగులకే ఎనిమిది వికెట్లు కోల్పోయింది. ఈ దశలో మ్యాక్స్‌వెల్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. బౌండరీలు, భారీ సిక్సర్లతో ఆసీస్ స్కోరును అమాంతం పెంచేశాడు. దీంతో చివరి 13.4 ఓవర్లలో ఆస్ట్రేలియా-ఎ జట్టు 146 పరుగులు చేసింది. తర్వాత భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన భారత్ 8 వికెట్లకు 291 పరుగులు చేయగలిగింది. ఏపీ క్రికెటర్ రాయుడు (56 బంతుల్లో 70, 5 ఫోర్లు, 2 సిక్స్‌లు), రైనా (79 బంతుల్లో 83, 7 ఫోర్లు, 1 సిక్స్), రోహిత్ (87 బంతుల్లో 66, 7 ఫోర్లు) అర్ధసెంచరీలతో రాణించినప్పటికీ భారత్‌కు విజయాన్ని అందించలేకపోయారు. విజయానికి 12 బంతుల్లో 16 పరుగులు చేయాల్సిన దశలో 49వ ఓవర్ వేసిన నైల్... రాయుడుతో పాటు, స్టువర్ట్ బిన్నీ (0)ని ఔట్ చేయడమే కాకుండా మెయిడిన్ ఓవర్ వేశాడు. దీంతో భారత్‌కు పరాజయం తప్పలేదు.