ACC Women's Emerging Asia Cup: Hong Kong All-out 34 Runs Vs IND-A Women - Sakshi
Sakshi News home page

Women Emerging Asia Cup: సంచలనం.. 34 పరుగులకే ఆలౌట్‌; భారత్‌ ఘన విజయం

Published Tue, Jun 13 2023 1:13 PM | Last Updated on Tue, Jun 13 2023 2:15 PM

ACC Women Emerging Asia Cup: Hongkong All-out 34 Runs Vs IND-A Women - Sakshi

ఏసీసీ వుమెన్స్‌ ఎమర్జింగ్‌ ఆసియా కప్‌లో సంచలనం చోటుచేసుకుంది. లీగ్‌లో భాగంగా మంగళవారం హాంగ్‌ కాంగ్‌ వుమెన్స్‌, ఇండియా వుమెన్స్‌-ఏ మధ్య మ్యాచ్‌ జరిగింది. కాగా మ్యాచ్‌లో ఇండియా వుమెన్స్‌ బౌలర్ల దాటికి హాంగ్‌కాంగ్‌ కేవలం 34 పరుగులకే ఆలౌట్‌ అయింది. శ్రేయాంకా పాటిల్‌ ఐదు వికెట్లతో చెలరేగగా.. పార్శవీ చోప్రా, మన్నత్‌ కశ్యప్‌లు తలా రెండు వికెట్లు పడగొట్టగా.. తిటాస్‌ సాదు ఒక వికెట్‌ తీశాడు.

హాంగ్‌ కాంగ్‌ బ్యాటర్లలో మరికో హిల్‌ 14 పరుగులతో టాప్‌ స్కోరర్‌ కాగా.. మిగతా పది మంది సింగిల్‌ డిజిట్‌కే పరిమితమయ్యారు. అందులో నాలుగు డకౌట్‌లు ఉన్నాయి. అనంతరం బ్యాటింగ్‌ చేసిన ఇండియా-ఏ వుమెన్స్‌ 5.2 ఓవర్లలో వికెట్‌ నష్టపోయి 38 పరుగులు చేసి టార్గెట్‌ను అందుకుంది. గొంగిడి త్రిష 19, ఉమా చెత్రీ 16 పరుగులు చేశారు. టోర్నీలో తొలి మ్యాచ్‌ ఆడిన ఇండియా-ఏ వుమెన్స్‌ భారీ విజయం అందుకొని టేబుల్‌ టాపర్స్‌గా ఉన్నారు.

చదవండి: ఔను.. ఇంగ్లండ్‌లోనే ఎందుకు జరగాలి? వేరే పిచ్ పెట్టాల్సిందే.. పెరుగుతున్న మద్ధతు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement